
చేనేత వస్త్రాలను ధరించండి
పర్లాకిమిడి: ఒడిశా మినీస్టిరీయల్ ఉద్యోగులు గురువారం కలెక్టరేట్‌లో ఒడిశా సంప్రదాయ చేనేత వస్త్రాలతో ‘అమొ పోసోకో..అమొ పరిచయ్’ అనే కార్యక్రమాన్ని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. డీఆర్‌డీఏ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర్ కెరకటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీఆర్‌డీఏ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు సంబల్‌పురి చేనేత వస్త్రాలు ధరించి ఒడిశా పక్షోత్సవాలను నిర్వహించారు. ఒడిశా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఏడీఎం రాజేంద్ర మింజ్ తెలియజేశారు. సమృద్ధి ఒడిశాను ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం ఒడిశా చేనేత వస్త్రాలు తయారుచేసే నేత పనివారిని ప్రోత్సాహించేందుకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.
సాంప్రదాయ దుస్తుల సంబరం ప్రారంభం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రభుత్వం తరుపున సాంప్రదాయ దుస్తుల సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. నబరంగ్‌పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో చేనేత దుస్తులు ధరించారు. రానున్న రెండు వారాలు ప్రభుత్వ ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక చేనేత చీర ధరించి సిబ్బందికి సందేశం ఇచ్చారు. మరోవైపు కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ సాంప్రదాయ దుస్తులతో కలెక్టరేట్ సిబ్బందితో సందడి చేశారు.

చేనేత వస్త్రాలను ధరించండి