
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి బాలుడు బలి
కొరాపుట్:
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలైపోయాడు. శుక్రవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కనేజువా గ్రామ సరిహద్దులో జీడి తోటలో విద్యుత్ వైరు తగిలి కై లాష్ గదవ (10) అనే బాలుడు మృతి చెందాడు. ఈ ప్రాంతంలో విద్యుత్ వైరు తెగినప్పటికీ కరెంట్ ప్రవహిస్తుందని గిరిజనులు విద్యుత్ శాఖకి ఫిర్యాదు చేశారు. కానీ మూడు రోజులుగా పట్టించుకోలేదు. జీడి తోటలో పిక్కలు ఏరుకోవడానికి బాలుడు వెళ్లగా విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి బాలుడు బలి