కాలువలో పడి వృద్ధుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీస్‌స్టేషన్ పరిధిలో జాముగుఢా గ్రామానికి చెందిన సన్యా బొడనాయక్ (75) అనే వృద్ధుడు గురువారం ఉదయం కాలువలో పడి మృతి చెందాడు. సన్య బొడనాయక్ బుధవారం సిందిగూడ గ్రామం మీదుగా రాస్‌బెడ వెళ్లడానికి హరి అనే వ్యక్తితో కలిసి బయల్దేరారు. దారిలో వీరిద్దరూ సిందిగూడలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ లోగా హరి తాను ఇంటికి వెళ్లి తమ వారిని పట్టుకుని వస్తానని, అంతవరకు అక్కడే ఉండాలని సన్యాకు సూచించాడు. అతను వెళ్లాక సన్యా పక్కనే ఉన్న కాలువలో దిగి కాలుజారి పడిపోయాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు చుట్టూ వెతికారు. కాలువ వైపు చూడగా.. సన్యా తేలి ఉండడం గమనించి బయటకు తీసి చూడగా.. ఆయన చనిపోయారు. దీంతో వెంటనే బలిమెల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.


