
20న ఘంటసాల ఆరాధనోత్సవాలు
పర్లాకిమిడి : చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో ఈ నెల 20న ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ డాక్టర్ సయ్యద్ రహీంతుల్లా తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘంటసాల అష్టావధానం, మెలోడీ, పాటలు, స్కిట్స్ విశాఖపట్నం, పర్లాకిమిడి కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ఉదయం 8 గంటలకు మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని, హృద్రోగులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు బీపీ రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేపడతారని తెలిపారు. సాయంత్రం జరిగే ఘంటసాల ఆరాధనోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు తదితరులు విచ్చేస్తారని వివరించారు. సమావేశంలో మహిళా చైతన్య అధ్యక్షురాలు కోట్ని శోభారాణి, చైతన్య కార్యదర్శి బి.జనార్దనరావు, సెంచూరియన్ వర్శిటీ జి.నెం. ఫల్గుణరావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు.