
భర్త రూపానికి ప్రాణ ప్రతిష్ట
రాయగడ: రెండేళ్ల కిందట అస్వస్థతకు గురై చనిపోయిన భర్త రూపానికి ఆమె మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేశారు. సిలికాన్‌తో ఆయన ప్రతిమను రూపొందించి ప్రతిష్టించారు. జిల్లాలోని మునిగుడలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తుండే సమీర్ రాయ్ కొన్నాళ్ల కిందట మునిగుడలొ కుటుంబంతో సహా స్థిరపడ్డారు.రాయ్ 2023లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అతని భార్య సిలికాన్‌తో రాయ్ ప్రతిమను తయారు చేయించారు. తన బంగారు ఆభరణాలు అమ్మి మరీ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మంగళవారం నాడు శుభ ముహూర్తాన పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేశారు.

భర్త రూపానికి ప్రాణ ప్రతిష్ట

భర్త రూపానికి ప్రాణ ప్రతిష్ట