
ఘనంగా చెన్నపొడ దినోత్సవం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శుక్రవారం చెన్నాపొడ దినోత్సవం ఘనంగా జరిగింది. ఉత్కళ ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన మిఠాయి చెన్నా పొడ.
నిత్యావసర సరుకులు పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవ జీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపణీ చేశారు. బియ్యం, నూనె, బంగాళ దుంపలు, ఉప్పు, కందిపప్పు వంటి పది రకాల వస్తువులను ట్రస్టు ద్వారా పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ప్రతీ నెల ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
మల్కన్‌గిరి: ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అన్ని వార్డుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ నాయక్ సూచించారు. బలిమెల మున్సిపల్ కార్యాలయంలో వార్డు సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వార్డుల్లో సమస్యలపై చర్చించారు.
పిడుగు పడి మహిళ మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి కంసారిపుట్ గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంటిపై పిడుగుపడి మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో గురువారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో అజయ్ కుమార్ నాయక్ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి అజయ్ భార్య ఛబి నాయక్(39), వారి కుమారుడు చందన్ నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఛబి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.
21 కేజీల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గంజాయితో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బలిమెల – చిత్రకొండ రహదారిపై ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో ఉండడం గమనించారు. వారిని ప్రశ్నించడంతో పాటు బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. దీంతో వీరిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చిత్రకొండలో గంజాయి కొన్నట్లు పేర్కొన్నారు. అరైస్టెనవారిలో అరవింద్, తుఫాన్‌గిరి అనే వ్యక్తులు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 21 కేజీలు ఉంది. దీని విలువ రూ.2 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు.

ఘనంగా చెన్నపొడ దినోత్సవం

ఘనంగా చెన్నపొడ దినోత్సవం

ఘనంగా చెన్నపొడ దినోత్సవం

ఘనంగా చెన్నపొడ దినోత్సవం