
ముగిసిన జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు
భువనేశ్వర్ : జట్నీ మునిసిపాలిటీ కుదియారి గ్రామ దేవత జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా మహిషాసుర మర్ధిని అలంకరణలో జాగులై మాతని గ్రామస్తులు కనులారా దర్శించుకుని తరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానికులతో పరిసర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సామూహిక ప్రసాద సేవలో పాల్గొన్నారని ఉత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రాధా మోహన్ పట్నాయక్, కార్యదర్శి లక్ష్మి ధర మహంతి తెలిపారు.
విదేశీ మద్యం స్వాధీనం
–ఒకరి అరెస్టు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ఒక ఇంటిపై అబ్కారీ శాఖ అధికారులు సొమవారం దాడులను నిర్వహించి 20 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత కుమార్ సాహు అనే యువకుడిని అరెస్టు చేశారు. విదేశీ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అబ్కారీ శాఖ అధికారి ఛబిరాజ్ అధికారి నేతృత్వంలో ఎస్‌ఐ రంజాన్ ఖాన్, కానిస్టేబుల్ సుశాంత గౌడ తదితరులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. అరెస్టయిన యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
‘వర్ణబోధ’ పుస్తకాలు పంపిణీ
పర్లాకిమిడి: ఒడియా భాషా పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం సంస్కృతి విభాగం ఽఆధ్వర్యంలో ప్రాథమిక విద్యార్థులకు మధుసూదన్‌రావు రచించిన ‘వర్ణబోధ’ (పెద్దబాలశిక్ష) పుస్తకాలను కలెక్టర్ బిజయ కుమార్ దాస్ సోమవారం పంపిణీ చేశారు. స్థానిక గాంధీ మెమోరియల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వర్ణబోధ పుస్తకాలను అందజేశార. పునఃముద్రణ జరిగిన వర్ణబోధలో ఒడియా భాష ఉచ్ఛారణ, పేర్లు, బొమ్మల రూపంలో ఉంటాయి. కార్యక్రమంలో జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.తిరుపతి రావు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ పాల్గొన్నారు.

ముగిసిన జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు