ఆకట్టుకున్న కళా ప్రదర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి అగరఖండి పంచాయతీ బోడోగావ్ కళాకారుల పుట్టినిల్లు. అగరఖండి గ్రామంలో కళాకారులు గురువారం లోకకళా ప్రదర్శన ఇచ్చారు. ఒడియా భాషా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, గౌరవ అతిథిగా ఎ.డి.ఎం.రాజేంద్రమింజ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, బీడీవో గౌరచంద్ర పట్నాయక్, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ అధికారి అర్చనా మంగరాజ్ పర్యవేక్షించగా, డీపీఆర్వో ప్రదిప్త గురుమయి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆకట్టుకున్న కళా ప్రదర్శన


