పర్యాటకుల బస్సు బోల్తా రాజధాని శివారులో పర్యాటకుల బస్సు
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ వీధి, కోమటివీధి రామాలయంలో ఎ.రాజగోపాలచారి, ఎ.ఉగ్రనర్సింహాచారి ఆధ్వర్యంలో భక్తులు అర్చనలు చేశారు. అలాగే సింకివీధిలో ఉదయం నుంచి భక్తులు శ్రీరాముని దర్శనార్థం బారులు తీరారు. గుమ్మాబ్లాక్ జీబ పంచాయతీ జోగిపాడు గ్రామంలో శ్రీరామమందిరంలో శ్రీసీతారాముల కల్యాంణం జరిపించారు. కోమటివీధి రామాలయం వద్ద భక్తులకు మజ్జికను కోడూరు జీవన్ పంపిణీ చేశారు.
కోర్సండలో..
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కోర్సండ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణం ఘనంగా జరిపించారు. వరుసగా 25 ఏళ్లుగా కోర్సండ గ్రామంలో జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టు పక్కల గ్రామాలతో పాటు, పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు పారశెల్లి రామరాజు పాల్గొని సేవ చేశారు.


