
మహనీయుల జీవితం ఆదర్శం
పర్లాకిమిడి: ఒడిశా భాషా పక్షోత్సవాలు సందర్భంగా ఒడిశా సాహిత్య అకాడమీ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో ప్రముఖుల జీవిత చరిత్రపై పలువురు వక్తలు చర్చించారు. పట్టణంలోని 50 మందికి పైగా వయోవృద్ధులు, ఒడిశా భాష, సాహిత్యం, సంస్కృతిని వివరించారు. పండిత గోపబంధుదాస్, గోదావరి దాస్, పండిత మధుసూదన్ దాస్, సత్యనారాయణ రాజగురు, అప్పన్న పోరిచ్చా, అప్పన్న పాణిగ్రాహి, భక్తకవి జయదేవ్ వంటి మహామహుల జీవిత చరిత్రపై ఉత్కళ హితేషినీ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నా, ఒడిషా సాహిత్య అకాడమీ, మాజీ సభ్యులు బిచిత్రానంద బెబర్తా తదితరులు వేదికపై మాట్లాడారు. డీఆర్‌డీఏ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీఆర్‌డీఏ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ డాక్టర్ భారతీ పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు.