కదంతొక్కిన గిరిజనులు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగపల్లి పంచాయతీ ప్రజలు తమ హక్కుల కోసం కదం తొక్కారు. ఈ మేరకు సమితి కార్యాలయం వరకు బాణాలు చేతబట్టి శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీడీవో ప్రదీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంవీ 72 గ్రామంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ బిల్లులపై నియంత్రణ అవసరమన్నారు. అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని, తాగునీటి సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు.
కదంతొక్కిన గిరిజనులు


