
పురుగు మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
మెళియాపుట్టి : మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యారావు(80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యారావుకు ఐదుగురు కుమారులు. చాలా సంవత్సరాల క్రితమే భార్య చనిపోవడంతో నెలకొక కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. ప్రస్తుతం కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. ఏం జరిగిందో గానీ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం గ్రామానికి కొంతదూరంలో ఉన్న పంటపొలాల్లో వాంతులు చేసుకుంటూ పడిపోయాడు. స్థానికులు గమనించి సమాచారం అందించగా మరో కుమారుడు అప్పారావు 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పురుగుల మందును నీటిలో కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. కుమారుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ బాబు తెలిపారు.