
ముగిసిన మజ్జిగౌరమ్మ చైత్రోత్సవాలు
రాయగడ: ఐదు రోజులుగా కొనసాగుతున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన పూజారి నిప్పులపై నడక, ముళ్ల కంపలపై కూర్చుని ఊయలూగడం వంటి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయ ప్రధాన పూజారి చంద్ర శేఖర్ బెరుకొ మందిర ప్రాంగణంలో ఖాళీ స్థలంలొ అగ్నిగుండాన్ని వెలిగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసుకొచ్చారు. నిత్యం అమ్మవారి సన్నిధిలో పూజలందుకునే కత్తి (ఖడ్గం)ని పూజారి చేతపట్టుకుని మండుతున్న నిప్పులపై నడిచారు. అనంతరం చండీహోమంతో పూర్ణాహుతి కార్యక్రమాలు ముగిశాయి. ఆదివారం ఉదయం అమ్మవారి సన్నిధిలో ఉంచిన పాదాలను యథాస్థానానికి (పాదాల గుడి) తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.

ముగిసిన మజ్జిగౌరమ్మ చైత్రోత్సవాలు

ముగిసిన మజ్జిగౌరమ్మ చైత్రోత్సవాలు