
ఘనంగా స్వర్ణక్షేత్ర ఉత్సవం
కొరాపుట్: ఉత్కళ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణక్షేత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమ్డ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒడియా సాహిత్యంపై పద్య పోటీలు నిర్వహించారు. ఉత్కళ కవితా రంగంపై అద్భుత ప్రభావం చూపుతున్న తులసి మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మా భాష మాది అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భాషా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ భాషా కవులు కై లాష్ చంద్ర నాయక్, ప్రపుల్ల కుమార్ రౌత్, పవిత్ర కుమార్ హల్ధార్, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ బెహరా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వర్ణక్షేత్ర ఉత్సవం