9 మందికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

9 మందికి రిమాండ్‌

Published Mon, Apr 14 2025 1:07 AM | Last Updated on Mon, Apr 14 2025 1:07 AM

9 మందికి రిమాండ్‌

9 మందికి రిమాండ్‌

సోంపేట: సోంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో నవోదయం 2.0 లో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి 12వ తేదీ వరకు 5 నాటు సారా కేసులు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్‌ సీఐ బేబి తెలిపారు. పై కేసుల్లో 68 లీటర్ల నాటు సారా సీజ్‌ చేసి, 1800 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు.

ఏరియా ఆస్పత్రికి

కొత్త ఎక్స్‌రే మిషన్‌

నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి కొత్త ఎక్స్‌రే యూనిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ పాత ఎక్స్‌రే యూనిట్‌ నే వినియోగిస్తూ వచ్చారు. రూ. 7 లక్షల విలువ కలిగిన ఎక్స్‌రే యూనిట్‌ ఆస్పత్రికి మంజూరు కావడం యూనిట్‌ రావడంతో దాన్ని వెంటనే వినియోగం లోనికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల ఎక్స్‌రేలు ఈ కొత్త మిషన్‌లో తీయవచ్చని యూనిట్‌ ఇన్‌చార్జి కృష్ణమూర్తి తెలిపారు. రోగులు వినియోగించుకోవాలని కోరారు.

ప్రజల కష్టాలపై కవులు

స్పందించాలి

శ్రీకాకుళం కల్చరల్‌: దేశంలో అరాచక ఫాసిస్టు మూకలు రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని, ఈ దశలో అంబేడ్కర్‌ ఆశయాలను తలకెత్తుకుని ప్రజానీకం అంతా ఐక్యంగా ముందుకు సాగాలని కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం ఇలిసిపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో సాహితీ స్రవంతి శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో సమతాభారత్‌ కవితా గోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలపై కవులు స్పందించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్‌ కె.ఉదయ్‌కిరణ్‌ త్రిభాషా సూత్రం మాతృభాష అనే అంశంపై ప్రసంగించారు. 2020 నూతన విద్యావిధానం ద్వారా హిందీబాషను రుద్దాలని చూస్తున్నారని, మాతృభాషలో విద్యాబోధన విద్యార్థి ప్రాథమిక హక్కు అని అన్నారు. ఇతర భాషలు నేర్చుకొవడం ఐచ్ఛికమన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కన్వీనర్‌ కేతవరపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలు, స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నీరు గారకుండా గళం ఎత్తి కలాలకు పదును పెట్టాలని పిలుపు నిచ్చారు.

‘సిలబస్‌ భారం తగ్గాల్సిందే’

శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్య, ఉన్నత తరగతుల్లో సాంఘిక శాస్త్ర సిలబస్‌ భారం తగ్గించాలని లేకుంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్‌ జిల్లా శాఖ ప్రతినిధులు మక్కా శ్రీనివాసరావు, బాడాన రాజు, ఎల్‌.గుణశేఖర్‌, సీ.హెచ్‌.సుబ్బలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యాశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల్లో సాంఘిక శాస్త్రంలో సిలబస్‌ భారం, విషయ భారం అధికంగా ఉండడం విద్యార్థులకు పెను భారంగా ఉందని అన్నారు. ఒక సగటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పదిహేను పాఠ్యపుస్తకాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను పునఃపరిశీలించి అసంబద్ధ విషయాంశాలు తొలగించి సిలబస్‌ భారం లేకుండా కుదించాలని విన్నవించారు. ఆ అవకాశం లేనిపక్షంలో భూగోళ, అర్ధశాస్త్రాల బోధనకు ఒక ఉపాధ్యాయుడు, చరిత్ర, పౌరశాస్త్రాల బోధనకు మరొక ఉపాధ్యాయుడు చొప్పున ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

నరసన్నపేట: జాతీయ రహదారిపై తామరాపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం పాత జడూరుకు చెందిన డి.హేమలరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ద్విచక్ర వాహనంపై నరసన్నపేట వైపు నుంచి స్వగ్రామం పాత జడూరుకు వెళ్తుండగా ఎదురుగా మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీ కట్లు ఊడి పోతుండటంతో ప్రమాదం జరుగుతుందని గమనించి లారీ డ్రైవర్‌కు చెప్పడానికి ఓవర్‌ టేక్‌ చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని 108 లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement