
వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలి
● జెడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం వైద్యసేవలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, బిసంకటక్ ఎమ్మెల్యే నీల మాధవ హికక, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరస్వతీ మాఝిలు ఈ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కాసీపూర్‌లోని గోర ఖ్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొర త వేధిస్తోందన్నారు. దీనిపై జిల్లా ముఖ్య వైద్యాధి కారి డాక్టర్ లాల్‌మోహన్ రౌత్రాయ్ మాట్లాడుతూ మునిగుడ సమితి రఘుబారి గ్రామానికి సరైన రహ దారి లేకపొవడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు పొందలేకపోతున్నారని చెప్పారు.
312 వైద్యుల పోస్టులు ఖాళీ..
జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని వైద్య కేంద్రాల్లో డాక్టర్ల కొరత ఉన్నట్లు జిల్లా ముఖ్యవైద్యాధికారి రౌత్రాయ్ వివరించారు. 461మంది వైద్యులు అవసరం కాగా, ప్రస్తుతం 149 మంది వైద్యులు మాత్రమే ఉన్నారని చెప్పారు. దీంతో సకాలంలో వైద్య సౌకర్యాలను ప్రజలు పొందలేకపొతున్నారని వివరించారు.
జిల్లాలో 14 వంతెనల నిర్మాణం..
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలను సుగ మం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రాయగడ, గుణుపూర్ సబ్ డివిజన్లలో బిజు సేతు పథకంలో భాగంగా 3579 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వంతెనల నిర్మాణ పనులు పూర్తయ్యాయ ని చెప్పారు. మరో 14 చోట్ల వంతెన పనులు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి సడక్ యోజనలో భాగంగా 18 రహదారుల పనులకు శ్రీకారం చుట్టగా ఇందు లొ 10 పూర్తయ్యాయని, మిగతా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పెండింగ్ పనులు వేగవంతం..
జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వా రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల కు రహదారి, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు అందించే విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు.