
చరిత్ర తిరగరాద్దాం!
పుస్తకం తిరగేద్దాం..
శ్రీకాకుళం కల్చరల్: నేటి సాంకేతిక యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడంతో పుస్తకాలు చదివేవారు బాగా తగ్గిపోయింది. మనలో ఒంటరితనాన్ని పోగొట్టి మరో ప్రపంచంలోకి విహరింపజేసే పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలని విద్యావేత్తలు చెబుతున్నారు. రోజులో కొంత సమయమైనా పుస్తక పఠనానికి కేటాయించాలని కోరుతున్నారు. నేటి తరంవారికి పుస్తకాలు చదవడం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం అనే అభిప్రాయం ఉంది. అందుకే సాధారణ పుస్తకాల చదవడం మానేశారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గుడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
జ్ఞాపిక శక్తి, భాషా పరిరక్షణకు పుస్తకాలే కీలకం
పుస్తక పఠనం పెరగాలంటున్న విద్యావేత్తలు
నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
ఏకాగ్రత కోసం..
ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అవలవాటు చేసుకోవాలి. పుస్తకాలు మన ఆలొచనా దృక్పథాన్ని పెంచుతాయి. నేటి తరం యువత కూడా సాహిత్యం చదవడంపై శ్రద్ధ పెంచాలి.
– ముట్నూరు ఉపేంద్రశర్మ,
ప్రభుత్వ అధ్యాపకుడు, శ్రీకాకుళం
ఏకై క నేస్తం..
మన వ్యక్తిత్వానికి, వికాసానికి అద్దం పట్టేది పుస్తకం. పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు. అత్యంత ఉత్తమ సమాచార, ప్రచార, ప్రసాద సాధనం, మాధ్యమం పుస్తకమే.
– జంధ్యాల శరత్‌బాబు, రచయిత

చరిత్ర తిరగరాద్దాం!

చరిత్ర తిరగరాద్దాం!

చరిత్ర తిరగరాద్దాం!