
తాగునీటి కష్టాలను పట్టించుకోరా?
రాయగడ :
ఓ వైపు భానుడి ప్రతాపం..మరోవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు విలవిల్లాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు లేఖ పంపించారు. కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మండుతున్న ఎండల నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారని, అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మిరావలి గ్రామంలోని ఆదివాసీ, గౌడ వీధుల్లో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. గొట్టపు బావులు పాడై నెలలు గడిచినా పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

తాగునీటి కష్టాలను పట్టించుకోరా?