
మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు
కొరాపుట్: ఓ గర్భిణి మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు జరిగాయి. మంగళవారం రాత్రి కొరాపుట్ జిల్లా దఽశమంత్‌పూర్ సమితి లుల్లా గ్రామ పంచాయతీ నెర్కాగుడ గ్రామానికి చెందిన మహేశ్వర్ పరజ భార్య ధనుమతి ముదలి (27) అంత్యక్రియలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన 5నెలల గర్భిణి అయిన ధనుమతి పై భర్త మహేశ్వర్ తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ధనుమతి పరిస్థితి విషమించింది. దాంతో భయపడి ఆమెని దశమంత్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ కోలుకోకపోవడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించాడు. ఈ నెల 20వ తేదీన ధనుమతి మృతి చెందింది. 21న మృతదేహాన్ని గ్రామానికి తెచ్చిన మహేశ్వర్ గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో గ్రామ సరిహద్దులో మృతదేహం వదలి పారిపోయాడు. గ్రామస్తులు మృతదేహంతో గ్రామంలో ఆందోళనకి దిగాడు. చివరకు పోలీసులు చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో మంగళవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి.