
ఒడిశా వాసి మృతి
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పెహల్గామ్‌లో..
భువనేశ్వర్: కాశ్మీర్‌లో సంభవించిన ఉగ్రవాదుల ఊచకోతలో రాష్ట్రానికి చెందిన శత్పతి (41) మృతి చెందారు. బైసరన్ గడ్డి మైదానంలో తన భార్య, తొమ్మిదేళ్ల కొడుకు కళ్ల ఎదురుగా ఉగ్రవాదులు ఆయనని కాల్చి చంపడంతో విషాదం నుంచి కోలుకోలేని పరిస్థితిలో కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. బాలాసోర్ జిల్లాలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ శత్పతి ఎల్టీసీపై తన భార్య, కొడుకుతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ప్రశాంత్ బాలసోర్ జిలా రెముణ మండలం ఇషానీ గ్రామస్తుడు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. బైసారన్‌లోని రోప్‌వే నుంచి కుటుంబీకులతో కలిసి దిగుతుండగా ప్రశాంత్ శత్పతి తలకు గురి పెట్టి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గంట తర్వాత సైన్యం వచ్చింది అని అతని భార్య ప్రియ దర్శిని ఆచార్య తెలిపారు.
ఊచకోతకు ఏబీవీపీ ఖండన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రశాంత శత్పతి మృతిపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. స్థానిక ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ఆవరణలో గుమిగూడి ఉగ్రవాద చర్యల పరిస్థితిని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం త్వరగా, సమర్థంగా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. న్యాయం జరిగేలా భారత ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
న్యూస్‌రీల్

ఒడిశా వాసి మృతి

ఒడిశా వాసి మృతి