యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ
కొరాపుట్: భువనేశ్వర్ జైలులో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరామర్శించారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్టడి నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో మనోధైర్యం పెంచడానికి ముఖ్య నాయకులు జైలును సందర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అజయ్‌కుమార్ లలూ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. అంతకుముందు లలూకు భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో సీఎల్‌పీ నాయకుడు రాం చంద్ర ఖడం, జయదేవ్ జెన్నాలు స్వాగతం పలికారు.
జయపూర్ యువతికి సివిల్స్‌లో 48వ ర్యాంక్
కొరాపుట్: సివిల్స్ ఫలితాలలో జయపూర్‌కు చెందిన రిథిక రథ్‌కు 48వ ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కొరాపుట్ కలెక్టర్‌కు అభినందన
కొరాపుట్: కొరాపుట్ కలెక్టర్‌ను సీఎం మోహన్ చరణ్ మఝి, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా అభినందించారు. బుధవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో సీఎం, డిప్యూటి సీఎంలను కలెక్టర్ వి.కీర్తివాసన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కొరాపుట్ జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డుని పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్న విషయం విధితమే. ఈ అవార్డుతో కలెక్టర్ వచ్చారు. దీంతో కలెక్టర్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు.
పెహల్గామ్ మృతులకు నివాళులు
రాయగడ: జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వారికి స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య, నాగరిక మంచ్ తదితర సేవా సంస్థలు నివాళులు అర్పించాయి. ఈ మేరకు గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కళింగ వైశ్యసంఘానికి చెందిన సభ్యులు క్యాండిల్ వెలిగించి నీరాజనాలు పలికారు. ఉగ్రమూకల ఉన్మాదాన్ని ప్రముఖులు ఖండించారు.
విషం తాగి మహిళ మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి మారివాఢ పంచాయతీ ఎంవీపీ 18 గ్రామానికి చెందిన సంజయ్ బిశ్వాస్ భర్య అపరజితా బిశ్వాస్ (32) మంగళవారం రాత్రి విషం తాగి మృతి చెందారు. సోమవారం సంజయ్‌కు అపరాజితకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె మంగళవారం విషం తాగేశారు. భర్త స్థానికుల సాయంతో ఆమెను కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మల్కన్‌గిరి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. అయితే అపరాజిత తండ్రీ విద్యాన్ మండల్ మాత్రం భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసి హిమాంశు శేఖర్ బారిక్ కేసు నమోద్ చేసి దర్యాపతు చేస్తున్నారు. పోస్టుమార్టం అయ్యాక వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.
యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ
యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ
యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ


