Politics

‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘బాబూ.. సూపర్ సిక్స్‌కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు.

బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనని అరెస్ట్ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025
Sports

LSG Vs MI: ముంబై వర్సెస్ లక్నో లైవ్ అప్డేట్స్
LSG vs MI Live Updates:బదోని ఔట్..అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.లక్నో నాలుగో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్..లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.ముంబై ఐదో వికెట్ డౌన్157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5ముంబై నాలుగో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్.. దిగ్వేష్ రతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మలక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్

IPL 2025: ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు లక్నో టీమ్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ సోషల్‌మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025మయాంక్ రాకతో ఎల్ఎస్జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్‌లతో స్ట్రాంగ్‌గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్‌కు బదులుగా వచ్చిన సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు.

IPL 2025: సీఎస్కేపై గెలుపు.. సేద తీరడానికి మాల్దీవ్స్‌కు వెళ్లిన సన్‌రైజర్స్ టీమ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇకపై వారు ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరతారన్న గ్యారెంటీ లేదు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2న (గుజరాత్‌తో) ఆడనుంది. ఆతర్వాత మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌తో, మే 13న ఆర్సీబీతో, మే 18న లక్నోతో తలపడనుంది.Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లను రీ ఫ్రెష్మెంట్ కోసం మల్దీవ్స్‌కు పంపింది. మాల్దీవ్స్‌లో ఆరెంజ్ ఆర్మీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. తమ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో సేద తీరుతున్న దృశ్యాలను సన్‌రైజర్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏం పొడిచారని లీగ్ మధ్యలో సేద తీరడానికి వెళ్లారని కొందరంటుంటే.. సన్‌రైజర్స్ అభిమానులేమో కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు ఈ మినీ వేకేషన్ అవసరమేనని సమర్దిస్తున్నారు.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.

IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
National

సరిహద్దుల్లో టెన్షన్.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.వివరాల ప్రకారం.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్-ఎస్ఏఎం)తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు.#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025

భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్‌లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025

కర్రెగుట్టలో మావోయిస్టుల గుహ.. 1000 మంది ఉండేలా నీటి సౌకర్యం..
సాక్షి, చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య ఆపరేషన్ కర్రె గుట్టల్లో భాగంగా భద్రతా బలగాలు కీలక ముందడుగు వేశాయి. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో తాజాగా మావోయిస్టుల కీలక స్థావరమైన బంకర్‌ను బలగాలు గుర్తించాయి. ఈ గుహ గురించి కీలక విషయాలను వెల్లడించాయి.వివరాల ప్రకారం.. కర్రెగుట్టలో మావోయిస్టుల బంకర్(గుహ)ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక, ఆ గుహలో దాదాపు 1000 మంది సురక్షితంగా ఉండేలా ప్రదేశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు.. అక్కడి నుంచి మకాం మార్చినట్టు సమాచారం. మరోవైపు.. కర్రె గుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదరవుతున్నాయి. తాజాగా బంకర్(గుహ)కు సంబంధించి వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి.ఇదిలా ఉండగా.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
International
NRI

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Sakshi Originals

కిన్నెరసాని.. చూసొద్దాం రండి..
పాల్వంచ రూరల్: వేసవి సెలవులు వచ్చాయి. చిన్నారులు, పెద్దలు, మహిళలు వెళ్లేందుకు కిన్నెరసాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనాన్ని పంచే అడవులు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులు, గలగలా పారే సెలయేర్లు.. పక్షుల కిలకిలారావాలకు కిన్నెరసాని డీర్‌పార్కు చిరునామాగా నిలుస్తోంది. అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే జీవ వైవిధ్యం గల అటవీ అందాలతో మినీ ఊటీగా మారుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చని పొదరిళ్లు, ఎత్తయిన కొండలు, గుట్టలు, జలాశయం, చూడచక్కని ద్వీపాలు కనిపిస్తాయి. పర్యాటకుల ఊహకు ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడి ప్రకృతి సోయగాలు ప్రతీ ఒక్కరిని అలరిస్తాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు..భద్రాద్రి కొత్తగూడెం జిలê్ల పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆయా నిధులతో కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణం చేపడుతున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు డీర్‌పార్క్‌లోని చుక్కల జింకలు, జలాశయం అందాలను చూసి.. మరోసారి రావడానికి ఉత్సాహం చూపుతుంటారు.అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యంకిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో ఒకప్పుడు అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. 1978లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అద్దాలమేడతో పాటు పలు కాటేజీలు నిర్మించారు. అయితే ఆ తర్వాత అద్దాలమేడను మావోయిస్టులు ధ్వంసం చేయడంతో కళావిహీనంగా తయారైంది. కాగా, కిన్నెరసానిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అద్దాలమేడ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ,10.77 కోట్లు ఖర్చు చేశారు. శిథిలావస్థకు చేరిన అద్దాలమేడతో పాటు కాటేజీలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ ఎత్తయిన గుట్టపై రెండంతస్తుల్లో 9 కాటేజీలు, అద్దాల మేడ, ఫుడ్ కోర్టు నిర్మించారు. కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే..ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా పాల్వంచకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పట్టణానికి చేరుకున్నాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంటాయి. కిన్నెరసానికి సమీపంలోని మందెరకలపాడు సమీప అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉంది. కాగా, కిన్నెరసాని చేరడానికి బస్ సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సిందే. వేసవి సెలవుల్లోనైనా బస్సు సౌకర్యం కల్పిస్తే కిన్నెరసానికి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇక వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లుగా కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మించి, ప్రత్యేక హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చు.

నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది? సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. 2019లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్‌తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్‌కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. యూపీలోని సచిన్‌ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్‌ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్‌కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్‌ను కాదని, సీమా మీనానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్‌లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్‌ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్‌కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్‌పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్

రమణీయం..చారిత్రక దృశ్యకావ్యం
విజయపురిసౌత్: విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్‌ను కుటుంబ సమేతంగా వేసవి సెలవుల్లో చూడాల్సిందే. సాగర్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన ప్రాంతమే కాకుండా సాంకేతిక పరంగా సాగర్ ప్రాజెక్టు సందర్శన ఎంతో విజ్ఞానదాయకంగా నిలుస్తోంది. కృష్ణా జలాశయంలో లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం. లాంచీలో ప్రయాణించి జలాశయం మధ్యన ఎనలేని ప్రశస్తి ఉన్న నాగార్జునకొండ మ్యూజియం సందర్శించాల్సిందే. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్ మ్యూజియంలలో నాగార్జునకొండ రెండవది. ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్షా్వకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్‌లో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి, నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. హారతీ దేవాలయం విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. హారతీ దేవాలయంలో ప్రవేశానికి ముందు ఈ సరస్సులో స్నానమాచరించేవారు. నాగార్జున కొండకు ఇలా చేరుకోవాలి.. నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి 14కి.మీ. దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, 6 నుంచి 12 సంవత్సరాల చిన్నారులకు లాంచీకు రూ.150, మ్యూజియం సందర్శనకు 14 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీటిక్కెట్పై 20 శాతం రాయితీని పర్యాటకశాఖ ఇస్తుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు. మహా చైత్యం ఇది బుద్ధ దాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈసూ్థపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారనాథ్‌లో ఉంచి, పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మంచి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలతో కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు.ప్రాచీన విశ్వవిద్యాలయంఈ విశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కృష్ణానది తీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమై, ప్రపంచఖ్యాతి గాంచింది. ఎత్తిపోతల సోయగంసాగర్కు 15 కి.మీ. దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చంద్రవంక నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది 70 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం. పర్యాటకుల మనస్సును ఇట్టే ఆకర్షిస్తుంది. పూర్వకాలంలో యతులు తపస్సు చేసుకునే ప్రాంతం కావటంతో ఎత్తిపోతల అనే పేరు వచ్చింది. పెద్దలకు రూ.30 పిల్లలకు రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. సాగర్‌నుంచి ముగ్గురు నలుగురు కలిసి ఆటో మాట్లాడుకోని వెళ్లాలి.
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. శ్రీలీలతో ఉన్న పాప ఎవరు?
సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి పట్టుదల పెరుగుతుంది.. అనుకున్నది సాధిస్తారు
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
బంగారం భారీగా పడిపోతుంది!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
...కన్నబిడ్డలా పోషించి ఎంతో పెద్ద చేశాం!
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
ఇంట్లో పాముల కలకలం
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
'నా హైట్‌తో సమస్య.. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు'.. మీనాక్షి చౌదరి
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ఇండియా, దట్ ఈజ్ భారత్!
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ప్రాణాలు కాపాడిన ఉప్పు
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీ!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
మళ్లీ ఉగ్ర కాండ!
పాతికేళ్లుగా కేసీఆర్ వెంటే ఉన్నా..
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
హైదరాబాద్‌లో హై అలర్ట్
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
విశాఖలో దంపతుల దారుణహత్య
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
ఒకే ఇల్లు.. ఒకే వంట
త్రుటిలో తప్పించుకున్నారు..
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
‘ప్రైవేట్’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
సరిహద్దుల్లో టెన్షన్.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
కర్రెగుట్టలో మావోయిస్టుల గుహ.. 1000 మంది ఉండేలా నీటి సౌకర్యం..
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
క్రైమ్

ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.

కొడుకులారా.. కొరివైనా పెట్టరా?
మానకొండూర్(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపారు.

బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
బంజారాహిల్స్(హైదరాబాద్): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన లివియో జోసఫ్ అల్మిడా అలియాస్ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్ (48) అనే వ్యక్తి షెల్టర్ ఇవ్వడమే కాకుండా బైక్ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆయనను కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్ హైదరాబాద్‌లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్ సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్ బుక్ చేయిస్తుంటాడని తేలింది.

భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని వివాదాస్పద స్థలంలోని గుడిసెల్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగి సుమారు 300 పైగా గుడిసెలు అగ్ని ఆహుతయ్యాయి. మంటలు ఎగిసి పడుతూ విస్తరిస్తుండడంతో బాధితులు గుడిసెల నుంచి బయటికి పరుగులు తీశారు. ఐదు అగ్ని మాపక వాహనాలతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలా జరిగిందంటే. ? కుంట్లూరు సర్వేనెంబర్ 214 నుంచి 224 వరకు ఉన్న సుమారు 100 ఎకరాలు భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి తమకు చెందుతుందని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తుండగా ఇది భూదాన భూమి అని సీపీఐ నాయకులు వాదిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగా సీపీఐ ఆధ్వర్యంలో రెండేళ్ళ క్రితం వేలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కోర్టు వివాదం ఉన్న భూమిలోని గుడిసెలలో అగ్రి ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా... ప్రమాద వశాత్తు జరిగిందా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్, ట్రాఫిక్ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు.ఈ ప్రమాదంపై అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు తగులబడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.