Funday
-
ట్రంప్ సుంకాలకు..బ్రష్ దెబ్బ..!
అమెరికా–చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు టాయిలెట్‌కి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖంతో తయారు చేసిన పసుపు కుచ్చు టాయిలెట్ బ్రష్ చైనాలో వైరల్‌గా మారింది. ఈ బ్రష్ కుచ్చు అచ్చం ట్రంప్ జుట్టు మాదిరిగానే ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా చైనీయులు ‘యివు కౌంటర్టాక్’ అంటూ ఇలా టాయిలెట్ బ్రష్‌లతో వ్యంగ్యంగా బదులిస్తున్నారు. వీటిని మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. ట్రంప్ మీద చైనా ప్రజల కోపతాపాలు పెరిగినట్లుగానే, ప్రస్తుతం వీటికి గిరాకీ భారీగా పెరిగింది. చాలా స్టోర్స్‌లలో వీటికి ‘ఔటాఫ్ స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ‘బ్రష్ ట్రంప్’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరెంతోమంది ఈ ట్రంప్ బ్రష్‌లను ఉపయోగించి, వివిధ ఫన్నీ మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఏదీ ఏమైనా, మొత్తానికి చిన్నదైనా ఈ టాయిలెట్ బ్రష్ విసిరిన పొలిటికల్ పంచ్ భారీగానే ఉంది కదూ!(చదవండి: Canadian vlogger: ‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
డిస్పోజబుల్ ప్లాస్టిక్‌తో ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా..!
యూజ్ అండ్ త్రో లేదా డిస్పోజబుల్ బాటిల్స్ మాత్రమే కాదు ఆహార పదార్థాల డబ్బాలు కూడా మన ఇంట్లో చేరుతుంటాయి. వాటిలోని పదార్థాలు తిన్న తర్వాత, అవి చెత్తలో పడేస్తుంటాం. ఈ రోజుల్లో మన దినచర్యలోకి వచ్చిన ఈ డిస్పోజబుల్ ప్లాస్టిక్ అంతా పర్యావరణాన్ని దెబ్బతీసేదే! డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదనే ఆలోచనతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వీటి వాడకం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు వాటిని చెత్తగా మార్చకుండా, అలంకార వస్తువులుగా వాడుకోవడం కొంత నయం.స్వీట్ కప్స్‌తో..వాడిన ప్లాస్టిక్ బాక్సులను శుభ్రం చేసి, వాటికి పెయింట్స్ వేసి, అద్దాలను అతికించి వాల్ హ్యాంగింగ్స్ తయారుచేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను విభిన్న రంగులతో తీర్చి, దానికి జనప దారాలను ఉపయోగించి మినీ ప్లాంటేషన్ వాల్‌ను క్రియేట్ చేయవచ్చు. బొమ్మల తయారీశుభ్రం చేసిన ప్లాస్టిక్ బాక్స్‌లు, కొన్ని పూసలు, గ్లూ సాయంతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలను డిజైన్ చేయవచ్చు. పిల్లల చేత వాటిని తయారుచేయించి, వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. క్రియేటివ్ షెల్ఫ్డిస్పోజబుల్లోనూ ఎకో–ఫ్రెండ్లీ ఐటమ్స్ వస్తున్నాయి. వాటిని పెన్నులు, పెన్సిళ్లు వంటి వస్తువులు వేసుకోవడానికి హోల్డర్స్ ఈ రీయూజ్ బాక్స్‌లతో డిజైన్ చేసుకోవచ్చు. (చదవండి: అక్కడ నేటికి విసుర్రాళ్లతోనే..) -
అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్..! ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్..
ప్రపంచంలోని ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో లుక్లా విమానాశ్రయం ఒకటి. నేపాల్‌లో ఉన్న దీనిని టెన్జింగ్–హిల్లరీ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2,860 మీటర్ల (9,383 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్నాయి. లుక్లా విమానాశ్రయం రన్‌వే కేవలం 527 మీటర్ల (1,729 అడుగులు) పొడవు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అనేవి పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. వాతావరణ పరిస్థితులు కూడా తరచుగా మారుతూ ఉంటాయి. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు విమానాల రాకపోకలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం. సాహసికులు, పర్వతారోహకులకు లుక్లా విమానాశ్రయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. లేదంటే అనేక రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. చిన్న విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడ ల్యాండ్ కాగలవు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
ట్రావెల్ మేకప్ బ్యాగ్..! ఎక్కడైన ఈజీగా వేసుకోవచ్చు..
సాధారణంగా మేకప్ ప్రియులకు ప్రయాణాలనగానే దిగులు మొదలైపోతుంది. వెళ్లిన చోట మేకప్ వేసుకోవడానికి వీలుంటుందా? సరైన లైటింగ్ ఉంటుందా? కాస్మెటిక్స్ అన్నీ ఎందులో పెట్టుకోవాలి? ఎలా తీసుకెళ్లాలి? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ ట్రావెల్ మేకప్ బ్యాగ్.చిత్రంలోని ఈ స్టైలిష్ బ్యాగ్‌లో ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్ మిర్రర్ ఉంటుంది. దీనిలో మూడు రకాల లైటింగ్ సెట్టింగ్స్ ఉండటంతో మీరు ఎక్కడ ఉన్నా, నచ్చిన వెలుతురులో మేకప్ వేసుకోవచ్చు. ఇకపై ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునేటప్పుడు సరిగా కనబడటం లేదని చింతించాల్సిన పని లేదు. అన్ని రకాల సౌందర్య సాధనాలను చక్కగా అమర్చుకోవడానికి ఈ బ్యాగ్‌లో తగినంత స్థలం ఉంటుంది. బ్రష్‌లు, లిప్‌స్టిక్‌లు, ఫౌండేషన్లు, క్రీములు ఇలా అన్నింటినీ వేర్వేరుగా పెట్టుకోవచ్చు. ఇది రీచార్జబుల్ డివైస్ కాబట్టి, బ్యాటరీ అయిపోతుందనే భయం కూడా అవసరం లేదు. ఇది వెంట ఉంటే, ఎప్పుడంటే అప్పుడు మేకప్ వేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్‌లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. నిత్యం టూర్స్కో, ఫంక్షన్స్‌కి వెళ్లే మహిళలకు, దీన్ని బహుమతిగా కూడా ఇవ్వచ్చు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..!
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్‌మన్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు. న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్’ పిజ్జా సెంటర్‌కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్ మోడలింగ్‌కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్‌లో అవకాశం ఇచ్చాడు. విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌వాక్ చేసి, ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్డ్’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?) -
ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. వర్క్‌లో బిజీగా ఉండి ఏ జాగ్రత్తా సరిగ్గా తీసుకోలేదు. నార్మల్ డెలివరీ కావాలని ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – నిర్మల, నల్గొండనార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెంచుకోవటానికి ప్రెగ్నెన్సీ అంతా కూడా పోషకాహారాలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అని అవుతున్నాయి. అవి హాజరైతే మంచిది. మొదటి ప్రెగ్నెన్సీలో ఈ సలహాలు పాటిస్తే సులభంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ మీరు బిజీగా ఉండి క్లాసెస్ హాజరు కాలేకపోయినా, తొమ్మిదవ నెలలో అయినా పోషకాహార నిపుణుడిని కలసి సమత్యులమైన ఆహారం ఏమి తీసుకోవాలో తెలుసుకోండి. పండ్లు, కూరగాయలు, ఫైబర్, పానీయాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రినేటల్ విటమిన్ టాబ్లెట్స్ రోజూ తీసుకోవాలి. ఇప్పుడైనా రెగ్యులర్‌గా వాకింగ్, స్విమ్మింగ్ లేదా ప్రీనేటల్ యోగా చెయ్యండి. దీనితో సత్తువ పెరుగుతుంది. కెగల్ వ్యాయామాలు అని పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతెనింగ్ అయేవి మీకు ఆన్లైన్లో కూడా వీడియోస్‌లో నేర్పిస్తారు. అవి తొమ్మిదవ నెల నుంచి డెలివరీ తరువాత కూడా పాటించండి. పెరినియల్ మసాజ్ కూడా కొంతమందికి సూచిస్తాం. మీ గైనకాలజిస్ట్‌ని కలిసినప్పుడు దీని గురించి కనుక్కోండి. సరైనంత నిద్ర కూడా అవసరం. బేబీ కదలికలని జాగ్రత్తగా ట్రాక్ చేసుకోండి. స్క్వాట్స్, బర్తింగ్ బాల్ వ్యాయామాలతో బేబీ తల కిందకి వచ్చే అవకాశాలు, సులభ కాన్పు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇవి అన్నీ పాటించవచ్చా లేదా అని స్కాన్ రిపోర్ట్ చూసి మీ డాక్టర్ నిర్ణయిస్తారు.నాకు మొదటి ప్రెగ్నెన్సీలో అసలు వాంతులు లేవు. సులభంగా నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీలో చాలా వాంతులు అవుతున్నాయి. ఏమీ తినటం లేదు మందులు సేఫ్ కాదని వేసుకోవాలను కోవటం లేదు. బేబీ గ్రోత్ ఏమయినా ఎఫెక్ట్ అవుతుందా మళ్లీ నార్మల్ డెలివరీ అవుతుందా?– భ్రమర, గుంటూరు. ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు అనేవి చాలా సాధారణం. ప్రెగ్నెంట్ హార్మోన్స్ వలన ఈ మార్పులు అవుతాయి. ఐదవనెలకి హార్మోన్స్ తగ్గడంతో వాంతులు తగ్గుతాయి. వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు దానిని హైపెరెమెసిస్ అంటారు. దీని వలన మీకు డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సరైన ఆహారం లేనందు వలన పోషాకాహార లోపం ఉంటుంది. కానీ, బేబీ శరీరంలోని స్టోర్స్ నుంచి బేబీకి పోషకాలు అందుతాయి. కాబట్టి, బిడ్డ ఎదుగుదలకు ప్రభావం ఉండదు. మీ డెలివరీ ప్రాసెస్ కూడా దీని వలన ఎఫెక్ట్ అవదు. మళ్లీ నార్మల్ డెలివరీకి ఈ వాంతుల వలన ఏమీ సమస్య ఉండదు. మీరు మందులు వాడొద్దు అనుకుంటే డైట్లో ఈ మార్పులు చేసుకోవాలి. డ్రై టోస్ట్ లేదా ప్లేన్ బిస్కెట్స్ ఉదయం తీసుకోవాలి. తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆహారం భోజనంలో తీసుకోవాలి. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రెడ్, రైస్ తీసుకోవచ్చు. పానీయాలు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఎండబెట్టిన అల్లం లేదా ఎండబెట్టిన ఆమ్లా నములుతున్నా వాంతులు తగ్గుతాయి. విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి. మీకు వాంతి వచ్చే ఆహారం, వాసనలకు దూరం ఉండండి. ఇవన్నీ ప్రయత్నించినా తగ్గకపోతే, మందులు తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!
‘వేసవి వచ్చిందంటే మా ఇంట్లో రోజుకో యుద్ధం జరుగుతోంది సార్!’ అని చెప్పారో తండ్రి. ‘మొబైల్ తీసేస్తే మా పాప ఏడుస్తుంది సర్. గట్టిగా అరిచి చెప్పినా పట్టించుకోవడం లేదు. చివరకు కోపంతో ఒక దెబ్బ వేస్తేనే దారికొస్తుంది’ అని చెప్పారో తల్లి. ‘మా అబ్బాయి టెన్త్ క్లాస్‌కు వెళ్తున్నాడు సర్. చదవమంటే మొహం చిట్లిస్తున్నాడు. సమ్మర్ హాలిడేస్‌లో కూడా చదవాలా?’ అని గొడవపడుతున్నాడు’ అని మరో తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలున్న ప్రతి ఇంటిలోనూ ఇలాంటి పోరాటమే జరుగుతుంటుంది. పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలపట్టుకుంటారు. అలాంటివారి కోసమే ఈ ఆర్టికల్. ఈ వేసవిని అవకాశాల మార్గంగా, ఒక టర్నింగ్ పాయింట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఇదేమీ పనిష్మెంట్ సీజన్ కాదు...స్కూల్, కాలేజీ ఉన్నన్ని రోజులూ రోజూ ఉదయం ఆరు గంటలకే లేచి, సిద్ధమై, బస్సు పట్టుకుని వెళ్లి, పాఠాలు, పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టే పిల్లలకు వేసవి సెలవులు ఒక ఆటవిడుపులా కనిపిస్తాయి. తమకు నచ్చిన టైంలో నిద్ర లేవచ్చని, నచ్చిన ఆటలు ఆడుకోవచ్చని భావిస్తారు. పుస్తకాలు, పరీక్షల గొడవ ఉండదని ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు తల్లిదండ్రులు ఈ వేసవిలో పిల్లలకు ఏదైనా నేర్పించాలని ప్లాన్ చేస్తుంటారు. లేదా నెక్స్ట్ క్లాస్‌కు రెడీ చేయాలని భావిస్తుంటారు. అందుకు మొబైల్ ఫోన్ అడ్డుగా ఉందని, దాన్ని తీసేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది. ఒక సెలవు రోజు మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటే మీరెలా ఫీలవుతారో గుర్తుచేసుకోండి. మీ పిల్లలు కూడా అలాగే ఫీలవుతుంటారు. ‘ఇవాళ్టి నుండి మొబైల్ తీసేస్తా’, ‘చదవకపోతే తినొద్దు’– ఇలాంటి మాటల వల్ల పిల్లల మెదడులో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. తల్లిదండ్రులపై కోపం, భయం, దూరం పెరుగుతాయి. తల్లిదండ్రులను సంతోషపెట్టేందుకే తాము బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా వయసు పెరిగినప్పటికీ వారు సెల్ప్ డౌట్లో కొట్టుకుంటుంటారు. నిజానికి పిల్లలు మొబైల్‌కు అతుక్కుపోయేది మెదడులో విడుదలయ్యే ‘డోపమైన్’ అనే హ్యాపీ కెమికల్ కోసమే. అది మొబైల్ ద్వారా కాకుండా సహజమార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించండి. వేసవిని విలువైన కాలంగా మార్చండి... ఒక వారం రోజులపాటు ఏ శిక్ష లేకుండా మీ బిడ్డ ప్రవర్తనను గమనించండి. పొద్దున్నే లేచే సమయం, స్క్రీన్ టైం, భోజన సమయం, బోర్ అవుతున్న సమయాలు గమనించి నోట్ చేసుకోండి. మొబైల్ తీసేయమంటే వాళ్లు ఎలా ఫీలవుతున్నారో అడిగి తెలుసుకోండి. ‘మొబైల్ కాకుండా నీకు ఆనందం కలిగించే విషయం ఏమిటి?’ అని అడిగి తెలుసుకోండి. వారి ఆసక్తిని ప్యాషన్‌గా మార్చుకునే మార్గం చూపించండి. ఈ వేసవిని మూడు జోన్లలో డిజైన్ చేయండిలెర్నింగ్ జోన్: ఓ వారం రోజులు మొబైల్ ఫోన్ కాస్త పక్కన పెట్టి,జీవితానికి అవసరమైన వంట, ఫస్ట్ ఎయిడ్, డబ్బు వినియోగం గురించి బేసిక్స్ నేర్చుకునేలా ప్రోత్సహించండి. తమకు నచ్చిన పుస్తకాలు తెప్పించి, చదువుకునే అవకాశం కల్పించండి. మైండ్ గేమ్స్ తెప్పించి ఇవ్వండి. ఆటోమేటిగ్గా మొబైల్‌కు దూరం అవుతారు. క్రియేటివ్ జోన్: ఈ వేసవిని వారికి నచ్చింది నేర్చుకునే అవకాశంగా మార్చండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్, కోడింగ్, బ్లాగింగ్ లాంటిది ఏదైనా కావచ్చు. అలాగే గార్డెనింగ్, సైన్స్ ప్రయోగాలు, బాటిల్ ఆర్ట్ లాంటివి చేయడానికి ప్రోత్సహించండి. యూట్యూబ్‌లో వీడియోలు చూసి సైన్స్ ప్రయోగాలు చేయమనండి. తాము నేర్చుకున్న దాన్ని మీకు నేర్పమని చాలెంజ్ ఇవ్వండి. కనెక్షన్ జోన్: మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగుల్లో ఉంటారు. ఈ వేసవిని వారితో బంధాన్ని బలపరచుకునేందుకు ఉపయోగించండి. మీ చిన్ననాటి సంగతులు పంచుకోండి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, బాబాయి, అత్తలతో మీ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి. అలాగే వారి అనుభవాలను ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా వినండి. ‘వాట్ ఐ లవ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ’ స్క్రాప్‌బుక్ తయారు చేయమని చెప్పండి. (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
Nagaland: నిజాయితీకి చిరునామా!
నాగాలాండ్ రాజధాని ‘కోహిమా’ కదా... నాగాలాండ్‌లోనే, ఇండియా–మయన్మార్ సరిహద్దుల్లో కోహిమాకు పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ‘ఖొనోమా’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత... గ్రామంలో ఎవరూ అబద్ధాలు ఆడకపోవటం! ఎవరూ దొంగతనం చేయకపోవటం! ఎవరూ ఇళ్లకు తాళాలు వేయకపోవటం! దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండకపోవటం! ఇలాంటివన్నీ కలిపి ఖొనోమా గ్రామంలో మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కెన్యూ’ నిబంధనలు అంటారు వాటిని. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా... ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థుల నమ్మకం. ఖొనోమా గ్రామం దేశంలోనే ‘నిజాయితీ గల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.ఖొనోమా గ్రామంలో ఉండేదంతా ‘అంగామీ’ తెగవారు. నాగాలాండ్‌కు చెందిన ఒక ప్రధాన సమూహం ఆ తెగ. ‘అంగామీ నాగా’లు అంటారు వారిని. ‘గోల్హో’ వారి ప్రధాన ఆహారం. బియ్యం, హిమాలయాల్లో విస్తృతంగా ఉండే చిమటి కూర కలిపి గోల్హోను తయారు చేస్తారు. అలాగే కూరగాయలు, పందిమాసం, గొడ్డు మాంసం తింటారు. వారిలో దాదాపుగా అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభా సుమారుగా 2 వేలు. పురుష జనాభా కంటే, స్త్రీ జనాభా పిసరంత ఎక్కువ. గ్రామం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ప్రకృతి తన కోసం కట్టుకున్న ఇంటిలా ఆ పచ్చని గ్రామంపై మంచు పరుచుకుని ఉంటుంది. మోసం అనే మాటే ఉండదు!నాగాలాండ్‌లో చాలావరకు గ్రామాలన్నీ ఖొనోమాలా ఉన్నప్పటికీ, ఖొనోమా ప్రజలు ‘కెన్యూ’ నియమాలకు లోబడి జీవించటం మూలాన దేశంలోనే ఈ గ్రామం నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖొనోమాకు ‘వారియర్ విలేజ్’ అనే పేరు కూడా ఉంది. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన చరిత్ర వీరిది. ఖొనోమా ప్రజల్లో నిజాయితీ అనేది కేవలం నైతిక ధర్మం మాత్రమే కాదు, అది వారి సామాజిక సంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. దొంగతనం అనేది దేవుడి విషయంలో మనిషి చేసే నేరం అని వారు బలంగా విశ్వసిస్తారు. ఖొనోమాలోని దుకాణాల్లో వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారు. ఆ డబ్బుల్ని తీసుకోటానికి, లెక్క చూసుకోటానికి దుకాణంలో పనిగట్టుకుని ఎవరూ ఉండరు. అంత నమ్మకం రాజ్యమేలుతూ ఉంటుంది ఖొనోమా గ్రామంలో! అంతేనా, ఎవరైనా వ్యవసాయదారులు పంటను ఇంటికి మోసుకెళుతున్నప్పుడు అలసిపోతే, వారు ఆ పంటను రోడ్డు పక్కన వదిలి, మరుసటి రోజు వచ్చి తీసుకెళతారు. అప్పటి వరకు ఆ పంట భద్రంగా రహదారి పక్కనే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయమే ఉండదు. ‘అనిమిజం’... ఈ గ్రామ మార్గంనిజాయితీ అన్నది వాళ్ల మత విశ్వాసాల్లోనే మిళితమై ఉంది. 19వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఇటువైపు వ్యాప్తి చెందటానికి ముందు నుండే ఖొనోమాలోని ఈ అంగామీలు ‘అనిమిజం’ అనే భావనను విశ్వసిస్తూ వస్తున్నారు. నేటికీ ఆ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. అనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశం ప్రత్యేక ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటుందన్న నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. రోజువారీ జీవితంలో అంతర్భాగం అయిన ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి హితమైన జీవన విధానం అనిమిజానికి ఆయువు పట్టు. వీటిలోంచి అంగామీల పూర్వీకులు ఏర్పరచిన 154 నిబంధనలే కెన్యూలు. కెన్యూ అనే మాటకు నిషిద్ధం అని అర్థం. వికలాంగులను ఆదరించకపోవటం కెన్యూ. పెద్దల్ని గౌరవించకపోవటం కెన్యూ. మోసం చేయటం, అబద్ధాలాడటం, సాటి మనిషిని తృణీకరించటం వంటివన్నీ కెన్యూలే. ఖొనోమా ప్రజల భావోద్వేగాల రక్తకణాల వంటివి ఈ కెన్యూలు. అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం!దొంగిలించిన పిల్లి మాంసం తినడం కూడా ఒక కెన్యూ. అలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని ఖొనోమా గ్రామస్థులు నమ్ముతారు. పెంపుడు పిల్లలను ఆహారం కోసం చంపటం వంటి సంఘటనల నుంచి ఈ కెన్యూ ఆవిర్భవించింది. లంచాలు తీసుకోవటం, మన కోసం పని చేసినవారికి సగం జీతాన్నే చెల్లించటం, అత్తమామల్ని కించపరచటం, గుమ్మడి కాయను వేలితో చూపించటం ఇవన్నీ కూడా కెన్యూలే. వీటిలో ఒక్కో రకం తప్పుకు ఒక్కో రకం ప్రతికూల ఫలితం ఉంటుందని ఖొనోమా వాసులు నమ్ముతారు. గుమ్మడి కాయను వేలితో చూపిస్తే అది కుళ్లిపోతుందని, అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం వస్తుందని, మన కోసం పని చేసినవారికి సగం జీతమే ఇస్తే, దేవుడు మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు వారివి అవుతాయని ఖొనోమా గ్రామంలోని అంగామీలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ, సత్యసంధత వారిలో లోతుగా పాతుకుపోయాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే, 2005లో ఖొనోమాను ‘దేశంలోనే మొట్టమొదటి హరిత గ్రామం’గా ప్రకటించింది. అన్నట్లు, గ్రామంలో సమృద్ధిగా పెరిగే ఖ్వునో అనే చిన్న మొక్క పేరు మీద ఈ గ్రామానికి ఖొనోమా అనే పేరు వచ్చిందంటే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకృతికి కట్టుబడి ఉండటం అంటే ఇదే కదా!– సాక్షి, స్పెషల్ డెస్క్ -
మయూరధ్వజుడు
ధర్మరాజు అశ్వమేధయాగం చేపట్టి, యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే, వారు చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! మయూరధ్వజుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుడి రాజధానికి వెళ్లారు. యాగాశ్వాన్ని విడిచిపెట్టడమో, యుద్ధానికి సిద్ధం కావడమో తేల్చుకోమన్నారు. మయూరధ్వజుడు యుద్ధానికే సిద్ధపడ్డాడు.యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు ‘అర్జునా! మయూరధ్వజుడు నా భక్తాగ్రేసరుడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు. యుద్ధం మొదలైంది. మయూరధ్వజుడి ధాటికి అర్జునుడు నిలవలేకపోయాడు. కృష్ణుడి సాయం కోరాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. తన ఆరాధ్యదైవంతో యుద్ధం చేయడం మయూరధ్వజుడికి ఇష్టంలేదు. అలాగని రణరంగం నుంచి వెనుదిరగడం క్షాత్రధర్మం కాదు. మయూరధ్వజుడు మనసులో కృష్ణనామ జపం కొనసాగిస్తూనే, శరపరంపర కురిపించసాగాడు. అతడి బాణాల దెబ్బకు కృష్ణుడు కూడా చలించాడు. అది గమనించిన అర్జునుడు, ‘బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రాయుధంతో వాడి తల నరుకు’ అన్నాడు.‘అర్జునా! నీ గాండీవమైనా, నా సుదర్శనమైనా ఆ మహాభక్తుడి మీద పనిచేయవు’ అని పలికాడు కృష్ణుడు.‘అంతటి మహాభక్తుడా!’ ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణభక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడిలో ఉంది. మయూరధ్వజుడి గురించి స్వయంగా కృష్ణుడే అంతలా చెబుతుండటంతో అతడు ఆశ్చర్యపోయాడు. పొద్దువాలడంతో ఆనాటికి యుద్ధం చాలించారు.మయూరధ్వజుడి భక్తి ఎంతటిదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు కృష్ణుడు. మరునాటి వేకువజామునే కృష్ణార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, మయూరధ్వజుడి రాజప్రాసాదానికి చేరుకున్నారు.మయూరధ్వజుడు వారికి ఎదురేగి, ఆహ్వానం పలికాడు. ‘విప్రులారా! నా ఆతిథ్యం స్వీకరించి, నన్ను ఆశీర్వదించండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకు పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరేంత వరకు మేము మరొక విషయాన్ని గురించి ఆలోచించలేము’ అని చెప్పారు వారు.‘స్వామీ! మీకు వచ్చిన విపత్తేమిటి? అవసరమైతే నా ప్రాణమైనా ధారపోసి మీ విపత్తను తొలగిస్తాను’ అన్నాడు మయూరధ్వజుడు.‘రాజా! మేము అడవి దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత, ‘మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే, నీ బిడ్డ బతుకుతాడు’ అని అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను’ అన్నాడు విప్రవేషంలోని శ్రీకృష్ణుడు.‘ఆహా! నా జన్మ చరితార్థమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడటానికి నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే నాకేం కావాలి! సంకోచించకుండా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి’ అని పలికి, తన శరీరాన్ని రెండు సమభాగాలుగా కోయమని తన భార్యాబిడ్డలను ఆదేశించాడు.వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంపంతో నిలువునా తరగడం మొదలుపెట్టారు. విప్రవేషాల్లో ఉన్న కృష్ణార్జునులు నిశ్చేష్టులై, ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అలా చూస్తుండగా, ఒక వింత కనిపించింది. మయూరధ్వజుడి ఎడమకంటి నుంచి కన్నీరు కారసాగింది.అప్పుడు కృష్ణుడు ‘రాజా! ఏదైనా మనస్పూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వలా బాధపడుతూ, కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టంలేని పని చేయవద్దులే!’ అని తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో పలికాడు కృష్ణుడు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరగబోయాడు.మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడి చేతులు పట్టుకుని, ‘అయ్యా! నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకు ఎలాంటి బాధలేదు. నాకు నిజంగా బాధ ఉంటే, నా రెండుకళ్లూ కన్నీరు కార్చాలి కదా! నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తోంది. నా శరీరంలోని కుడిభాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకుండానే ఖిలమైపోతానని ఎడమభాగం బాధపడుతుండటమే అందుకు కారణం. మీరు నిశ్చింతగా నా శరీరంలోని అర్ధభాగాన్ని తీసుకువెళ్లవచ్చు’ అని పలికాడు.కృష్ణుడు సాభిప్రాయంగా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. తనకు గర్వభంగం కలిగించడానికే జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణ పరమాత్ముడు ఈ లీలావినోదాన్ని కల్పించాడని గ్రహించి, సిగ్గుపడ్డాడు.వెంటనే, కృష్ణార్జునులు నిజరూపాలతో మయూరధ్వజుడికి దర్శనమిచ్చారు.మయూరధ్వజుడి శరీరానికి తిరిగి పూర్వస్థితి కలిగించాడు కృష్ణుడు.ఆరాధ్యదైవం కళ్లెదుట కనిపించడంతో మయూరధ్వజుడు పారవశ్యంతో సాష్టాంగపడ్డాడు. యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు.∙సాంఖ్యాయన -
Funday Crime Story: కాఫీ+చాయ్= కొచ్చిన్!
నల్లగొండకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ సలార్ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)లో చేరి, ఆ సంస్థ అధినేత స్థాయికి ఎదిగాడు. పదేళ్లకు పైగా పరారీలో ఉన్న సలార్, 2011 జూన్‌లో పోలీసులకు చిక్కాడు. దుబాయ్‌లో తలదాచుకున్న అతడు, కేరళ మీదుగా హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో ఉండగా, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. ‘కాఫీ.. చాయ్.. కొచ్చిన్’ అనే కోడ్ వర్డ్ సలార్‌ను పట్టించింది.సలావుద్దీన్ సలార్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లి, అక్కడి ‘సిమి’ క్యాడర్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తర్న్ రీజన్ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ‘సిమి’ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ‘సిమి’కి ఆలిండియా చీఫ్‌గా మారి దాదాపు రెండేళ్ల పాటు దాని వ్యవహారాలను పర్యవేక్షించాడు. సలార్ నార్తర్న్ రీజన్ కమాండర్‌గా ఉండగా మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాల్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడనే ఆరోపణలతో అతడిపై ఆ కేసు నమోదైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం 2001లో ‘సిమి’ని నిషేధించింది. దీంతో సలార్ తన మకాంను దుబాయ్‌కు మార్చాడు. పదేళ్లకు పైగా దుబాయ్‌లో ఉంటూ సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సలార్‌ను 2009లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో విచారణ పూర్తి చేసి, రెండేళ్ల శిక్ష విధించారు. ఈ శిక్షాకాలం 2011లో పూర్తికావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడి నిబంధనల ప్రకారం యూఏఈ ప్రభుత్వం సలావుద్దీన్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి నిర్ణీత సమయంలోపు ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అప్రమత్తమైంది. సలార్ భారత్‌లో అడుగు పెట్టగానే, అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం అనేక మార్గాలు అన్వేషించిన అధికారులు చివరకు ఇండోర్‌కు చెందిన ఓ ఫోన్‌పై నిఘా ఉంచారు. ఆ వ్యక్తి గతంలో సలార్‌కు అనుచరుడిగా ఉండటంతో కచ్చితంగా అతడిని సంప్రదిస్తాడనే ఉద్దేశంతో మానిటరింగ్‌లో పెట్టింది. దేశంలోని ఏ విమానాశ్రయంతో అతడు ల్యాండ్ అవుతున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని మొదలు పెట్టారు. సుదీర్ఘకాలం క్రమం తప్పకుండా గంటల తరబడి చేసిన ఈ మానిటరింగ్‌లో ఓ చిన్న పదం నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఐబీ అనుమానించినట్లే 2011 జూన్‌లో ఇండోర్‌కు చెందిన వ్యక్తిని సలార్ సంప్రదించాడు. తన మాజీ అనుచరుడైన ఆ వ్యక్తితో అనేక విషయాలు చర్చించాడు. చివరగా పదే పదే అతడు చెప్పిన మాట ‘కాఫీ, చాయ్ సే తయ్యార్ రహో’ (కాఫీ, టీతో సిద్ధంగా ఉండు) అధికారులను అలెర్ట్ చేసింది. సలావుద్దీన్ లాంటి వ్యక్తి టీ, కాఫీల కోసం కాల్ చేయడని, అందులో ఏదో మర్మం ఉందని భావించి, నిపుణులతో విశ్లేషించారు. కాఫీ, చాయ్‌లను ఆంగ్ల అక్షరాల్లో రాసుకుని దేశంలోని కొన్ని నగరాలు, పట్టణాల పేర్లతో సహా అనేక పదాలు సృష్టించారు. సలావుద్దీన్ వస్తున్నది దుబాయ్ నుంచి కావడంతో ఆ నగరాలు, పట్టణాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న వాటిని వేరు చేయాలని నిర్ణయించడంతో ఐబీ ప్రయత్నం ఫలించింది. కేరళలోని కొచ్చిన్ పేరు కూడా వాటిలో ఉండటంతో అదే ల్యాండింగ్ స్పాట్‌గా గుర్తించింది. కాఫీ, చాయ్ పదాల ఉచ్చారణతో ఏర్పడే, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం అదేనని తేల్చి, మధ్యప్రదేశ్ ఏటీఎస్‌ను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల పాటు దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలపై అధికారులు కన్నేసి ఉంచారు. చివరకు 2011 జూన్ 26న సలావుద్దీన్ సలార్ దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 530లో తన దూరపు బంధువులు ఇద్దరితో కలిసి విమానం దిగి, కేరళ–మధ్యప్రదేశ్ పోలీసుల సంయుక్త బృందానికి చిక్కాడు. సలావుద్దీన్ సలార్ హైదరాబాద్‌లోనూ వ్యవహారాలు సాగించాడని విచారణలో తేలింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ వెళ్లిన ప్రత్యేక బృందం సలార్‌ను విచారించి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లష్కరేతొయిబా (ఎల్ఈటీ ) మాడ్యుల్‌తో ఇతడికి సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2002 నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలో పేలిన స్కూటర్ బాంబు ఇద్దరిని బలిగొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆజం, అజీజ్ అప్పట్లో ఎన్కౌంటర్ కాగా, మరో 8 మందిపై పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. అబ్దుల్ బారి అలియాస్ అబు హమ్జా సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ఘాతుకంలో సలార్ ప్రమేయం ఉందని తేలడంతో రాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నుంచి అతడిపై ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ పొందారు. దీని సహాయంతో ఉజ్జయిన్ వెళ్లి, 2011 జూలై 18న సిటీకి తీసుకువచ్చి ఈ కేసులో జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ పొందిన సలార్ నగరంలోని బాబానగర్‌లో స్థిరపడ్డాడు. 2014 అక్టోబర్ 18న నల్లగొండకు కారులో వెళ్తున్న అతడు చిట్యాల సమీపంలోని పెదకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
యువ కథ: అసుర బంధనం
‘పాపా సుధా! పాపా సుధా!’ అంటూ నిద్రకళ్లతోనే పెన్నూ పుస్తకం పట్టుకుని, వంటగదిలోకొచ్చాడు చింటూ. తన తండ్రి పిలిచే పిలుపే తనకీ అలవాటు. చపాతీలు కాలుస్తున్న సుధ.. కొడుకు చింటూని చూసి.. ‘అప్పుడే లేచావా? పో బ్రష్ చేసిరా టిఫిన్స్ పెడతా’ అంది నవ్వుతూ. ‘పాపా! మరేమో మాకు రేపు శ్లోకాలు, పద్యాల పోటీ ఉంది, ఏదైనా ఒకటి రాసిస్తావా? ప్రాక్టీస్ చేస్తా!’ అన్నాడు చింటూ.చటుక్కున స్టవ్ ఆఫ్ చేసి.. ‘అవునా? ఇటురా, నాకు బాగా ఇష్టమైన ఓ శ్లోకముంది, రాసిస్తా’ అంటూ పక్కనే ఉన్న చిన్న పీట లాక్కుని కూర్చుంది సు«ధ. దగ్గరకొచ్చి తల్లిముందు మోకాళ్లపై కూర్చుని పెన్నూ పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు చింటూ.దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ‘‘అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‘అంటూ పైకి చదువుతూనే, చింటూ పుస్తకంలో రాస్తోంది సుధ. ‘దీని అర్థం ఏంటమ్మా?’ అన్నాడు చింటూ క్యూట్‌గా. ‘ఓ అర్జునా! డాంబికం, గర్వం, మితిమీరిన అహం, కోపం, మొరటుతనం, అజ్ఞానంతో వాస్తవాన్ని గ్రహించకపోవడం.. ఇవన్నీ అసుర (రాక్షస) స్వభావంతో పుట్టినవారి లక్షణాలు’ అంది సుధ రాస్తూనే. ఈలోపు చింటూ నాయనమ్మ దుర్గమ్మ బయట నుంచి వంటగదివైపు చూస్తూ ‘రేయ్ చింటూ, మీ పెదనాన్న లేచాడా? చూడు’ అని అరిచింది. వెంటనే చింటూ, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి రుద్రాక్ష గదిలోకి మెల్లగా తొంగి చూశాడు. గుర్గుర్మనే శబ్దాన్ని విని ‘ఇంకా లేవలే’ అన్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు.చింటూకి ఇద్దరు అక్కలు. చింటూ తండ్రి అంజి.. రుద్రాక్ష కంటే చాలా చిన్నవాడు. పదేళ్ల క్రితం, హైదరాబాద్‌లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకుని, డిప్రెషన్‌తో ఇంటికే పరిమితమైపోయాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సుధ ఇంటి బాధ్యతంతా తనే తీసుకుంది. అయితే విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నా తమ్ముడ్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీకు నీ మొగుడు కావాలంటే ఊరికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో.. నేను మాత్రం మా తమ్ముడ్ని, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతా’ అని సుధపై రంకెలేశాడు. ఆ రోజు నుంచి చింటూ ఫ్యామిలీ ఊరిలో రుద్రాక్ష ఇంట్లోనే ఉంటోంది. సుధ అప్పట్లోనే జాబ్ చేస్తూ తెలుగు మీద ఇష్టంతో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసింది. కనీసం ఊళ్లోని కాన్వెంట్‌కి వెళ్లి తెలుగు టీచర్‌గా చేసుకుంటానన్నా, ఆమె మాట చెల్లలేదు.పదయ్యేసరికి చింటూ చక్కగా తినేసి, శ్లోకం బట్టీపట్టే పనిలో పడ్డాడు. ఇంతలో దుర్గమ్మ మెల్లగా.. రుద్రాక్ష గదికి వెళ్లి ‘రేయ్ రుద్రా లే, పది దాటింది. చెరువుల కాడికి పోవాలేమోగా?’ అంది చిన్నగా. ‘ఊ..’ అన్నాడు రుద్రా గంభీరంగా. ఆదివారం కదా, రుద్రాక్ష బయటికి వెళ్లిపోతే, అతడికి తెలియకుండా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్లాలనేది ఆమె తాపత్రయం. రుద్రాక్ష శివభక్తుడు. అతడికి చెప్పకుండా కొన్నేళ్ల క్రితమే బాప్టిజం తీసుకుని మేరీగా మారింది దుర్గమ్మ. ఇంటికి సమీపంలో ఆమె పేరునున్న కొంత స్థలాన్ని చర్చి కట్టడానికి దానం చేసిన విషయం బయటపడిన రోజే.. తల్లి మతం మారిన విషయం తెలుసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తల్లితో మాట్లాడటం మానేశాడు.రుద్రాక్ష లేచి స్నానం చేసి వచ్చేలోపు.. అతడి భార్య శ్రీలేఖ పూజకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ చేసి వచ్చేలోపు సుధ టిఫిన్స్ అందించింది. ఇక ఎప్పటిలానే ఆ ఆదివారం ఇంటి బయట రుద్రాక్ష బుల్లెట్ స్టార్ట్ చేయగానే, ఇంటి వెనుక నుంచి మేరీ 11 గంటల ఆరాధన కోసం అడ్డదారిలో చర్చికి పరుగుతీసింది. రుద్రాక్ష తన స్నేహితుడు రవీంద్ర ఇంటి ముందు బండి స్లోచేసి, హార¯Œ కొట్టాడు. అక్కడ మరో బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. అది సేమ్ కలర్, సేమ్ మోడల్. రుద్రాక్ష ప్రతి పనిలోనూ రవీంద్రనే ఫాలో అవుతాడు. ప్రతిపనిలోనూ రవీంద్ర వెంటే నడుస్తాడు. ఇద్దరికీ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. చేపల చెరువులు వేసి ఇంకా ఇంకా గడిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లైనా, ఇంటి బయట పని వాళ్లైనా వాళ్లు చెప్పిన మాట వినాలి. ఇక వాళ్లు కన్నవాళ్లు, వాళ్లను కన్నవాళ్లు అంతా తమ గీత మీదే నడవాలి. వాళ్లు బయటకి వెళ్తున్నప్పుడు ఇంటి ఆడవాళ్లెవరూ బయట కనిపించకూడదు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి పెద్దపెద్దగా మాటలేవీ వినిపించకూడదు. ఈ శాసనాలన్నీ రవీంద్ర చేసినవే. చాలావరకు రుద్రాక్ష ఇంట్లోనూ అమలవుతుంటాయి. కాలం మారుతుందని గుర్తించలేని ఆ పల్లెటూరిలో ఈ హిట్లర్ పాలన మొదలై పాతికేళ్లు దాటింది.పాతికేళ్ల క్రితం రుద్రాక్ష, రవీంద్రలతో పాటు వంశీధర్ అనే మరో స్నేహితుడు వీళ్లతో కలిసి తిరిగేవాడు. వంశీధర్‌కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పెంచింది. అతడి పెళ్లి తర్వాత ఆమె కూడా చనిపోయింది. రుద్రాక్ష, వంశీధర్‌లకు పెళ్లి అయిన మూడేళ్లకు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆడవాళ్లపై చిన్నచూపున్న రవీంద్ర పెళ్లి తర్వాత భార్యను కట్టుబానిసలా చూసేవాడు. గొడవైన ప్రతిసారీ రుద్రాక్ష, వంశీధర్ల కాపురాలను చూసి నేర్చుకోమని తిట్టేది రవీంద్ర భార్య. దాంతో వీలు చిక్కిన ప్రతిసారీ స్నేహితులకు మందు, విందు ఏర్పాటు చేసి, ‘ఆడదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. వాళ్లని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. లేదంటే, అదే చేతకాని తనమవుతుంది. ఎవరిముందైనా మనదే పైచేయి కావాలి’ అంటూ ఇంట్లో తాను చలాయించే నియంతృత్వ ప్రతాపాన్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకునేవాడు. కుటుంబానికి కట్టుబడి బతికే ప్రతి వాడ్ని బకరాగా ఉదహరించేవాడు. మెల్లగా స్నేహితులిద్దరూ రవీంద్ర బాటలో నడవడం మొదలుపెట్టారు. కొన్ని నెలలకు వంశీధర్ ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. ఆరాతీస్తే పిల్లలకు బాలేదని, అత్తింటికి వెళ్లాడని అస్పష్టమైన సమాచారమందింది. కొంతకాలానికి ఊరు తిరిగొచ్చిన వంశీధర్– స్నేహితుల్ని మాత్రం కలవలేదు. ఆస్తులమ్మేసుకుని టౌన్ వెళ్లిపోతున్నాడనే వార్త విన్న రుద్రాక్ష, దారికాచి వంశీధర్ని నిలదీశాడు. ‘కొన్నిసార్లు ఎదుటివారి మూర్ఖత్వం కూడా మనలోని మంచితనాన్ని చంపేస్తుంది, అలా చచ్చి బతుకుతున్నవాణ్ణి. కారణాలడగొద్దురా. వాదించి శత్రువుని కావాలనుకోవడంలేదు’ అనేసి వెళ్లిపోయాడు వంశీధర్. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు.ఇంకొన్నాళ్లకు రవీంద్ర భార్య గొడవ పడటం మానేసి, అణిగిమణిగి బతకడం నేర్చుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డ కావాల్సిందేనని, డాక్టర్ ప్రమాదమని చెప్పినా మరో కాన్పుకి ఉంచాడు రవీంద్ర. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ భార్య పురిటిలోనే చనిపోవడంతో, ఏడాదిలోపు ఆమె చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొడుకు మాత్రం పుట్టలేదు. రుద్రాక్షది ప్రేమ వివాహం. ఒక కొడుకు, ఒక కూతురు. రవీంద్ర ప్రభావంలో రుద్రాక్ష భార్యను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టాక.. ఆత్మాభిమానంతో శ్రీలేఖ చాలా ఏళ్లు పోరాడింది. చివరికి రుద్రాక్షలో మార్పు లేకపోవడంతో పనులన్నీ చేసిపెడుతూనే, మాట్లాడటం మానేసింది. రవీంద్ర మొదటి భార్య చనిపోయినప్పుడు.. రుద్రాక్ష చెల్లెలు ప్రియను అతడికిచ్చి చెయ్యాలని తెగ ఉబలాటపడ్డాడు రుద్రాక్ష. అప్పటికి ప్రియ చదువుకుంటోంది. సడ¯Œ గా పెళ్లి అనేసరికి, ‘నేను మా సీనియర్ని ప్రేమిస్తున్నా, అతడ్నే చేసుకుంటా’ అని తెగేసి చెప్పింది. అయినా రుద్రాక్ష వినకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. దాంతో ప్రియను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు. రుద్రాక్షకు తెలియని విషయమేంటంటే, రవీంద్రతో పెళ్లి చేస్తే ప్రియ జీవితం నాశనమయిపోతుందని భావించిన శ్రీలేఖే రహస్యంగా ఆ పెళ్లి చేసింది.‘ఆడపిల్లలకు పదోతరగతే ఎక్కువ’ అనే రవీంద్ర నలుగురు కూతుళ్ల్లకు పెళ్లి చేసి పంపేశాడు. ఆ ఇంట్లో జరిగే ప్రతి పెళ్లికి, రుద్రాక్ష ఇంట్లో రచ్చ జరిగేది. కూతురు స్వప్నను చదువు మానిపించి, పెళ్లి చెయ్యాలని రుద్రాక్ష తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతడ్ని ఆపలేక, శ్రీలేఖ విదేశాల్లో ఉండే స్నేహితుల సాయంతో దొంగపెళ్లికొడుకుల్ని ఏర్పాటు చేసి, చివరిక్షణంలో సంబంధాలను చెడగొట్టే పనిలో ఉండేది. ఇక కొడుకు కౌటిల్య కెనడాలో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి పిల్లనే ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నేను చూసిన అమ్మాయిని చేసుకుంటేనే ఆస్తి ఇస్తా. ఇంటికి రానిస్తా’ అని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో అక్కడే సహజీవనంతో కాలం గడిపేస్తున్నాడు కౌటిల్య.పాతికేళ్లుగా ఈ స్నేహితులు అహంకారంతో విర్రవీగుతుంటే, విధి మరో రాత రాసింది. ఆ ఆదివారం కాంతమ్మ కల్లుదుకాణంలో మందుకొట్టి ఇంటికి వెళ్లిన రవీంద్ర మరుసటిరోజు నుంచి బాగా నీరసించాడు. ఎప్పుడూ వచ్చే పొడి దగ్గు కాస్త ఎక్కువైంది. దాంతో రుద్రాక్ష దగ్గర్లో సిటీకి తీసుకుని వెళ్లి టెస్ట్‌లు చేయిస్తే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, మూడు నెలలు కంటే ఎక్కువ బతకడని, హైదరాబాద్ తీసుకెళ్తే ఫలితం ఉండొచ్చని చెప్పారు. దాంతో హైదరాబాద్‌లో కాపురం ఉంటున్న పెద్దకూతురు ఇంటికి తీసుకెళ్లారు.వారానికి ఒకసారి రుద్రాక్ష బుల్లెట్ మీదే హైదరాబాద్ వెళ్లి, రవీంద్రని చూసి, ఆ రాత్రికి ఉండొచ్చేవాడు. చావుభయంతో రవీంద్ర బలం, పొగరు అన్నీ తగ్గుతూ వచ్చాయి. మధ్యమధ్యలో వెళ్లొస్తున్న రుద్రాక్షకి రవీంద్ర కూతురు, అల్లుళ్లల్లో కొత్త యాంగిల్ కనిపించసాగింది. ‘లక్షలకు లక్షలు ఆయనకే పెడితే, తర్వాతేం పంచుకోవాలి?’ అనే మాటలు కూడా రుద్రాక్ష చెవిన పడ్డాయి. రవీంద్రకు నెలలు గడవకముందే జబ్బు ముదిరింది. రోజులు దగ్గరపడ్డాయని అతడికీ అర్థమైంది. అందుకే కాబోలు రుద్రాక్ష ఇంటికి బయలుదేరుతుంటే, ‘రేయ్ రుద్రా! మళ్లీ నువ్వు వచ్చేటప్పటికి ఉంటానో లేదో ఓ రెండురోజులుండి పోరా’ అన్నాడు దీనంగా. అన్నట్లుగానే రెండు రోజులు గడవకముందే ప్రాణం పోయింది. వెంటనే రవీంద్ర నలుగురు అల్లుళ్లు ఫోన్లలో మాట్లాడుకుని, అన్ని కార్యక్రమాలు హైదరాబాద్‌లోనే జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి బెంగళూరూ, నోయిడా, చెన్నైల్లో ఉంటున్న మిగిలిన అల్లుళ్లు, కూతుర్లు, వాళ్ల పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. బాడీని ఊరికి తీసుకెళ్దామని రుద్రాక్ష అడిగితే ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే తమ ప్రయాణం ఈజీగా ఉంటుందని, ఊళ్లో అయితే వర్క్, నెట్వర్క్ కష్టమని కారణాలు చెప్పుకొచ్చారు.మరునాడు మధ్యాహ్నానికి రవీంద్ర అంతిమయాత్ర వాహనం ముందు వెళ్తుంటే, రుద్రాక్ష దాన్ని ఫాలో అవుతూ శ్మశానవాటికకు బుల్లెట్‌పై బయలుదేరాడు. అంతపెద్ద శ్మశానవాటికను చూడటం రుద్రాక్షకు అదే మొదటిసారి. కొన్ని నిమిషాల తేడాలోనే అంతా అక్కడికి చేరారు. తలకొరివి కార్యక్రమం పూర్తికాగానే, కాటికాపరి ‘మీరు వెళ్లొచ్చు. రేపు వస్తే, అస్థికలిస్తా’ అన్నాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. చివరికి రుద్రాక్ష మాత్రమే మిగిలాడు. కాసేపటికి అతడూ లేచి తన బండి దగ్గరకు వెళ్లబోతూ, కాలుతున్న చితివైపు తిరిగి చూశాడు. ఆ క్షణంలో రుద్రాక్షలో ఏదో తెలియని వైరాగ్యం తొణికిసలాడింది. ‘ఏరోజుకైనా నేనూ చితిలో కాలిపోతానని తెలుసు. అయినా ఎందుకో ఏడుపొస్తోంది’ అనుకుంటూనే, ‘రేయ్ రుద్రా! మగాడు ఏడవడం ఏంట్రా?’ అన్న రవీంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లను కళ్లల్లోనే ఆపేసుకున్నాడు. ఇంతలో రుద్రాక్షను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి పరుగున వచ్చి, ‘పాడె కట్టాలా సార్?’ అన్నాడు. ‘నేనింకా బతికే ఉన్నానయ్యా’ అన్నాడు రుద్రాక్ష అప్రయత్నంగా. ‘అయ్యో అదేంటి సార్! మీరు తిరిగి చూసేసరికి మాకోసం వెతుకుతున్నారనుకున్నా సార్’ అన్నాడా వ్యక్తి. ఓ వెర్రినవ్వు నవ్విన రుద్రాక్ష, ‘ఇక్కడ నువ్వేం చేస్తావ్?’ అన్నాడు. ‘నాది కర్రల దుకాణం సార్. అందుకే మీరు కస్టమరేమో అనుకున్నా’ అంటూ అవతలవైపు గుట్టలుగా పేర్చిన కర్రలను చూపించించాడు. ‘నిజమే కదా! శవం కూడా ఓ కస్టమరే’ అనిపించింది రుద్రాక్షకు. ఆ కర్రలన్నీ చూడగానే మనసులో ఎన్నో ఆలోచనలు స్ఫురించాయి. ‘ఇన్ని కర్రలున్నాయేంటీ? రోజుకి ఎన్ని శవాలొస్తాయి ఇక్కడికి?’ అన్నాడు రుద్రాక్ష. ‘ఓ నాలుగైదొస్తాయి సార్’ అన్నాడు ఆ వ్యక్తి. ‘ఈ కర్రలు ఎంతమందికి వస్తాయి?’ అన్నాడు వెంటనే రుద్రాక్ష. ‘ఓ 40 శవాలకు వస్తాయి సార్. ఇది ఇంచుమించు ఓ పదిరోజుల స్టాక్, అంతే!’ అన్నాడు ఆ వ్యక్తి, మరో కస్టమర్ రాగానే అటుగా పరుగుతీస్తూ.‘చావుకంటే ముందే కట్టె ఎదురుచూస్తుందా? రాబోయే పదిరోజుల్లో చనిపోయేవారి కట్టెలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయా? ఈ క్షణం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ జీవులు?’ అని పలికింది రుద్రాక్ష మనసు. ‘అంటే! ఈ పదిరోజుల తర్వాత చనిపోబోయే నలభై మంది కట్టెలు లారీలో ఇక్కడికి వస్తుంటాయి. ఆ తర్వాత పదిరోజుల కట్టెలు ఈపాటికే ఎండలో ఎండుతుంటాయి. ఆ తర్వాత కట్టెలు చెట్ల రూపంలో ఉండి ఉంటాయి. ఇదే కదా విధిరాతంటే! శవంపై పెట్టి కాల్చే ఈ కర్ర, ఏదో ఒకరోజు నీ కోసం కూడా సిద్ధమవుతోంది రుద్రాక్షా! విత్తురూపంలో ఉందో, చెట్టు రూపంలో ఉందో, ఎండుతూ ఉందో, లేదంటే లారీలో వస్తుందో? ఇలాంటి శ్మశానవాటికలు ఎన్నో కదా!’ అనే మాటలు రుద్రాక్ష చెవుల్లో ఎవరో అంటున్నట్లే మార్మోగాయి. అప్రయత్నంగా అడుగులో అడుగు వేసుకుంటూ, బుల్లెట్వైపు నడిచాడు.చీకటిపడేసరికి డైరెక్ట్‌గా వంశీధర్ ఇంటి ముందు ఆగింది రుద్రాక్ష బుల్లెట్. ఆ దారి వెంట రవీంద్రతో పాటు ఎన్నోసార్లు వెళ్లినా, ఏ రోజూ అక్కడ ఆగలేదు. ‘మనల్ని వదిలేసిన వాడితో మనకు మాటలేంట్రా?’ అనేవాడు రవీంద్ర. ఆ మాట గుర్తురాగానే మళ్లీ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రుద్రాక్ష. అప్పటికే ‘ఎవరొచ్చారా?’ అని గుమ్మంలోకొచ్చి పరకాయించిన వంశీధర్, ‘రేయ్ రుద్రా’ అని పెద్దగా అరిచి, ఆపి, లోపలికి తీసుకెళ్లాడు. ఏళ్లనాటి దూరాన్ని మౌనం ఆక్రమిస్తుంటే, రవీంద్ర మరణవార్తను వంశీధర్ చెవిన వేశాడు రుద్రాక్ష. ‘వాడు ఎంత బతుకు బతికాడు! అంతా కలిసి ఆ చావుకు విలువ లేనట్లే చేశారు. ఒకరి కళ్లల్లో కూడా నిజమైన కన్నీళ్లు చూడలేకపోయాను’ అంటూ మనసులోదంతా వెళ్లగక్కాడు రుద్రాక్ష దుఃఖంతో. అప్పుడే అనుకోకుండా రుద్రాక్ష కళ్లు గోడమీదున్న ఓ ఫొటో మీద పడ్డాయి. ఫొటోకి దండ వేలాడుతుంటే, అయోమయంగా పైకి లేచి ‘వ..వాసవీ, పిల్లలూ?’ అని ఆగి వంశీధర్ వైపు చూశాడు. ‘ఎప్పుడో చనిపోయార్రా’ అన్నాడు వంశీధర్ దిగులుగా పైకి లేచి ఫొటోని చూస్తూ. ‘ఎలా?’ అడిగాడు రుద్రాక్ష బొంగురు గొంతుతో. ‘తను పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందిరా’ అన్నాడు వంశీధర్. ‘ఏమంటున్నావ్రా?’ నిర్ఘాంతపోయినట్లు చూశాడు రుద్రాక్ష. ‘అవునురా! నా ప్రవర్తనే కారణం. అప్పట్లో రవీంద్ర చెప్పినట్లే ఇంట్లో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాక మా మధ్య గొడవలు పెరిగాయి. ఒకరోజు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వాళ్ల అమ్మానాన్న తిరిగి నా దగ్గరకు వెళ్లమని బలవంతం చేసేసరికి పిల్లలతో సహా మేడ మీద నుంచి దూకేసిందటరా. పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వాసవి ఐదేళ్లపాటు మంచం మీదే ఉంది. ఊరిలో అంతా అమ్ముకుని ఇక్కడికి వచ్చింది తనని బతికించుకోవడానికే. తాను కోలుకుంటుందని ఆశపడ్డా. కానీ పిల్లల్ని చేతులారా చంపుకున్నానన్న పశ్చాత్తాపం తనని బతకనివ్వలేదు. నా కుటుంబాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అంటూ రవీంద్ర కాలర్ పట్టుకోవాలన్నంత కోపం వచ్చింది. కానీ ఒక్కటే ఆలోచనొచ్చింది. ఆరోజు నా వాసవి నేను చూపించే పైత్యాన్ని భరించి ఉండి ఉంటే ఈ రోజు వరకూ నేను అదే అహంతో అదే ఆధిపత్యంతో కాలర్ ఎగరేసుకుని, అదే ఊరిలో తిరిగేవాణ్ణి కదా మీలానే?’ అన్నాడు వంశీధర్. తలదించుకుని, మౌనంగా వింటూనే ఉన్నాడు రుద్రాక్ష. ‘ఈ ఒంటరితనం నాకు నేను విధించుకున్న శిక్ష. మనం చాలాసార్లు కొందరి సావాసంతో వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. నిజానికి మనిషి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడూ బలహీనుణ్ణే ఎన్నుకుంటాడు. ఈ ఎంపికలో ఎక్కువగా బలయ్యేది కుటుంబసభ్యులే. ఈ లోకంలో ప్రేమ, ఇష్టం, అభిమానం లోపించిన భయభక్తులన్నీ అబద్దాలే, నాటకాలే! ఎవ్వరైనా సరే, నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆపేక్షగా చూసుకుంటే, ఏపని చేసినా చెప్పి చేస్తారు. లేదంటే చెప్పకుండా, రహస్యంగా చేస్తారు. అంతేకాని ఆగిపోరు. ఆగారనుకునే భ్రమలో, ఆపాననుకున్న పొగరుతో మనం ఆగిపోతామంతే! నువ్వు అన్నావ్‌గా ఇందాక రవీంద్ర చనిపోతే ఎవరి కళ్లల్లోనూ నిజమైన బాధను చూడలేదని, ఎలా చూడగలవు? వాడు ఏ రోజైనా భార్యబిడ్డల అభీష్టానికి బతికాడా? అతడి చావు ఆ కుటుంబానికి ఓ విమోచనం. పంజరం వీడిన రామచిలుకల్లా వారి నవ్వులే నీకు చాలా సమాధానాలు చెబుతాయి చూస్తూ ఉండు’ అన్నాడు వంశీధర్.ఆ ఊరంతా రుద్రాక్ష నోటి నుంచి గంభీరమైన స్వరం విని చాలా నెలలు గడిచాయి. రవీంద్ర మరణం తర్వాత అతడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఒకరోజు రవీంద్ర ఇంటి అరుగుపైన అతడి భార్య, పిల్లలు ఫక్కున నవ్వే సన్నివేశం రుద్రాక్ష కంటపడింది. ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.. కానీ నీలోని ఈ గాంభీర్యం సావాసంతో వచ్చిందని నాకు తెలుసు’ అన్న వంశీధర్ మాటలు గుర్తొచ్చాయి.‘లేఖా! లేఖా’ ఆ పిలుపు రుద్రాక్ష నోట వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. పరుగున వచ్చింది శ్రీలేఖ. ‘మన కౌటిల్య పెళ్లి వాడిష్టపడిన అమ్మాయితోనే జరిపిద్దాం, రమ్మను, పెళ్లికి మా చెల్లి ప్రియ ఫ్యామిలీని పిలుద్దాం. అలాగే సుధని టౌన్లో ఏదో స్కూల్లో తెలుగు టీచర్‌గా ప్రయత్నించమను’ అన్నాడు. శ్రీలేఖ షాక్‌లో ఉండగానే, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ లీనమైపోయిన చింటూని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడి, బుల్లెట్ ముందు కూర్చోబెట్టుకుని టౌన్‌కి బయలుదేరాడు రుద్రాక్ష. అక్కడో జీసస్ ఫొటో దుర్గమ్మ కోసం ప్యాక్ చేయించి, చింటూ చేతికిచ్చి, బండి స్టార్ట్ చేశాడు. అప్పటికే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చింటూ ధైర్యం చేసి చిన్న స్వరంతో, ‘పె..పెదనాన్నా మ..మరేమో, నువ్వంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను కొట్టవు కదా?’ అన్నాడు. నవ్వొచ్చింది రుద్రాక్షకి. ‘ఆ భయం పోవాలంటే నేనేం చెయ్యాలి?’ అన్నాడు రుద్రాక్ష. ‘హూ! భయంపోవాలంటేనా? హా, ఇందాక పెట్టావే ముద్దు.. అలాంటి ముద్దు రోజూ పెట్టాలి, పెడతావా? అప్పుడు బోలెడంత ప్రేమొస్తుంది’ అన్నాడు చింటూ ఎదురుగా వచ్చే గాలికి కళ్లను చిట్లిస్తూ. బండి నడుపుతూనే చింటూ తల మీద ముద్దాడాడు రుద్రాక్ష మురిసిపోతున్న చింటూని బుల్లెట్ బండి అద్దంలో చూస్తూ. -
ఈ వారం కథ: మలిసంధ్యలో..!
డల్లాస్ నగరం. రాత్రి ఏడున్నర. అప్పుడే ల్యాప్‌టాప్‌ను మూసి, కళ్ళు మూసి సేద తీరుతున్నట్లుగా వెనక్కి వాలాడు కిరణ్. ‘టిఫిన్ రెడీ’ వంటింట్లోంది సుధ కేక వినిపించింది. ‘తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ ఇవ్వు. తర్వాత టిఫిన్ తింటాను’ ఫోన్ రింగ్ అవుతుండటంతో అటువైపు చూశాడు. రామం బాబాయ్ నుంచి కాల్.‘ఈ ముసలాడికి వేరే పనేం లేదు. అందరిళ్లలో జరిగేవన్నీ కావాలి’ స్వగతంలో చిరాగ్గా అనుకున్నాడు. కాఫీ తెస్తున్న సుధకి ఆ మాటలు వినబడ్డాయి.‘ఎవరు.. ఆయనేనా?’ కాఫీ టీపాయ్ మీద పెడుతూ అడిగింది.‘తనే! ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశాడు. నాతో మాట్లాడటానికి నిద్రను కూడా త్యాగం చేసుకుంటున్నాడు’‘మాట్లాడొచ్చు కదా. అర్జెంట్ విషయం ఉందేమో!’‘మీ అమ్మ పద్ధతి బాగోలేదు. మూర్తిగారు రోజూ మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు... వాళ్లిద్దరి గురించి ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు... ఇలా నా బుర్ర తినడానికే ఈ వరుస ఫోన్లు’ నిరాసక్తంగా కాల్ ఆన్సర్ చేశాడు.‘అబ్బాయ్ ఎలా ఉన్నావ్. కోడలు పిల్ల ఎలా ఉంది. బిజీగా ఉన్నావా?’ అటువైపు నుంచి రామం ప్రశ్నలు సంధిస్తున్నాడు. ‘అమెరికా వాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బందే అనుకో. మనకీ అక్కడకీ, రాత్రీ పగలూ అంత తేడా ఉంది.’‘విషయమేంటి బాబాయ్’ అసహనంగా అడిగాడు.‘ఏమీ లేదురా. మీ అమ్మ పద్ధతి అస్సలు బాగాలేదు. నువ్వు ఒకసారి వచ్చి, ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టు’‘ఏమైంది బాబాయ్?’ ఆ గొంతు కసిరినట్లుగానే ఉంది. కిరణ్ కోపం ముసలాయనకి అర్థమైంది. అయినా తన మాటలు కొనసాగించాడు.‘నీకు కొత్తగా చెప్పేదేముందిరా. వదినగారిని ఆ మూర్తి బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరిపోయింది. పరిచయమై మూణ్ణాళ్లు కూడా కాకుండానే, ఇద్దరూ కలిసి రోడ్లమీద తిరుగుతున్నారు. ఈ మధ్య సినిమాలకూ వెళ్తున్నారు. మొన్న రాత్రి అతను మీ ఇంటిలోనే పడుకున్నాడు కూడా.’‘గట్టిగా అడిగితే స్నేహం అంటూ సాకులు చెబుతున్నారు. అతనికి లేకపోతే, మీ అమ్మకైనా ఉండొద్దూ్ద బుద్ధి. ఊరూ, వాడా నవ్వుతున్నారు. నిన్ననే మూర్తిగారి పిల్లలు మీ ఇంటికి వచ్చారు. ఆ టయానికి ఆ పెద్దమనిషి అక్కడే ఉన్నారు. పెద్ద ఆర్గ్యుమెంట్లు, అరుపులు, కేకలు.. సర్ది చెప్పలేక చచ్చాననుకో. ఊర్లో పరువు పోతోంది.’‘నువ్వు సాధ్యమైనంత తొందరగా వచ్చి, మీ అమ్మను తీసుకుని వెళ్లిపో. ఇంటి గురించి ఆలోచించకు. ఓ పదో పరకో ఇచ్చి నేనే తీసుకుంటాను. నువ్వు మాత్రం వెంటనే బయల్దేరు. ఉంటాను మరి’ గబగబా నాలుగు మాటలూ చెప్పేసి, రామం ఫోన్ పెట్టేశాడు.‘అత్తయ్యగారిని అమెరికాకు తెచ్చి, ఇల్లు తనకు ఇచ్చేయమంటున్నారా?’ సుధ నవ్వుతూ అడిగింది. ‘ఆ గోల ఎప్పుడూ ఉండేదే. కానీ అమ్మ సంగతే అర్థం కావడం లేదు. మూర్తిగారి విషయం అడిగితే తన స్నేహితుడు అంటుంది. ఆయన పొద్దస్తమానం మనింట్లోనే ఉంటున్నారు. మొన్న రాత్రి మనింట్లోనే నిద్రపోయారట. వాళ్ళ కుటుంబం గొడవ చేసిందట! మా బాబాయే వాళ్లని రెచ్చగొట్టి ఉంటాడు. వర్క్ టెన్షన్లో కొత్తగా ఇదో తలనొప్పి. ఇక భరించలేను. ఇండియాకి వెళ్లి అమీతుమీ తేల్చుకోవాల్సిందే’ సోఫాలోంచి లేస్తూ అన్నాడు. ∙∙ గేటు తీసిన అలికిడి విని శాంత వీధి వైపు తొంగి చూసింది. కొడుకును చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ, ఎదురెళ్లి చేతిలో బ్యాగ్‌ని అందుకుంది. ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు, ‘బాగున్నావా బాబూ’ అంటూ హాల్లో కూర్చున్న మూర్తి పలకరించాడు. చిరునవ్వుతో తల పంకిస్తూ ‘మీరెలా ఉన్నారం’టూ అడిగాడు, సూట్‌కేసు కింద పెడుతూ. ‘బాగానే ఉన్నాను బాబూ, పెద్ద వయసు కదా. ఆరోగ్య సమస్యలు తప్పవు. వస్తాను శాంతగారు’ అంటూ ఆయన కుర్చీలోంచి లేచాడు.‘మూర్తిగారు సాయంత్రం ఒకసారి రండి’ఆ మాట విని, ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి ‘అలాగే’ అంటూ బయటకు నడిచాడు.‘ఏంటమ్మా విశేషాలు’ భోజనానికి కూర్చుంటూ తల్లి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. ‘ఏం లేవురా,’ ఆమె కిరణ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతోంది.చెప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడంటే, ఏదో విషయం ఉందన్నమాట.‘బావున్నావా కిరణూ’ రామం హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు.‘ఉదయం నుంచి నీ కోసమే చూస్తున్నాను. ఫ్లైట్ లేటయ్యిందా’శాంతకి విషయం అర్థమైంది. ఈ పెద్దమనిషి నారద పాత్రను పోషించాడన్నమాట.రామం ఆమెకు సొంత మరిది కాదు. పెద్దమామగారి కొడుకు. వ్యసనపరుడై ఆస్తులను కరిగించాడు. తన ఇంటి మీద అతని కన్ను ఉందని కూడా ఆమెకు తెలుసు. అందుకే అతనితో అంటీ ముట్టనట్లు ఉంటుంది. ‘ఎన్నాళ్లుంటావ్?’‘నాకు సెలవుల్లేవు బాబాయ్. ఎల్లుండే తిరుగు ప్రయాణం’‘ఒక రోజులోనే ఇక్కడి వ్యవహారాలన్నీ తేలిపోతాయా?’ వ్యవహారం అనే పదాన్ని నొక్కిపెడుతూ అడిగాడు రామం.కిరణ్ ఓ నవ్వు విసిరేసి ఊరుకున్నాడు. ఆ నవ్వు భావం రామానికి అర్థం కాలేదు. ‘అమ్మని నీతో తీసుకుని వెళ్లిపోతున్నట్లే కదా! ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు రెడీగా లేవు. ఎంతో కొంత ఇస్తాను. ముందు ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను.’ ఏదోలా ఇల్లు దక్కించుకుంటే చాలు. మిగిలిన డబ్బులు ఎలాగూ ఎగ్గొట్టేయొచ్చు. అదీ అతని ఆలోచన. ఇలాంటి విషయాల్లో రామానికి మా చెడ్డ అనుభవం ఉంది.‘బాబాయ్, సాయంత్రం మూర్తిగారి కుటుంబాన్ని రమ్మని చెప్పగలవా?’ అన్నాడు. శాంత ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. ఏదో చెప్పబోయింది.‘అమ్మా, నాకు అన్నీ తెలుసు. నువ్వేమీ మాట్లాడకు’ చేత్తో వారించాడు.‘అయితే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయమంటావా?’ ‘కంగారెందుకు బాబాయ్. అన్ని విషయాలూ తేల్చే వెళ్తాను కదా’ అంటూ చేయి కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.సాయంత్రం ఆరు గంటలకి మూర్తి, ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, రామం వచ్చారు. కొడుకు, అల్లుడు బాగానే స్థిరపడ్డారు. కొడుకు దగ్గరే మూర్తి ఉంటున్నాడు. కూతురు సమీపంలో ఉన్న ఓ టౌన్లో ఉంటోంది. అందరూ హాల్లో కూర్చున్నారు. శాంత మాత్రం గదిలోనే ఉండిపోయింది.‘చెప్పండయ్యా, మీ బాధ చెప్పండి. ఇరుగు పొరుగుల సూటిపోటి మాటలు, మీకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కిరణ్‌కు చెప్పండి.’ రామం మొదలు పెట్టాడు.‘బాబాయ్ మీరు కాసేపు ఏమీ మాట్లాడకండి’ ఆ మాటలో గాంభీర్యాన్ని చూసి రామం కంగుతిన్నాడు.‘అది కాదబ్బాయ్’కిరణ్ సీరియస్‌గా చూశాడు.ఇక మాట్లాడితే తన మర్యాద దక్కదని ఆయనకి అర్థమైంది.మూర్తి కొడుకు గొంతు సవరించుకున్నాడు.‘సార్, మీ అమ్మగారు, మా నాన్న చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. ఆయన ఎక్కువసేపు మీ ఇంట్లోనే గడుపుతున్నారు. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం. మనమే గట్టిగా చెప్పాలి’ అంటూ ఆగాడు.‘ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడారా?’‘ఆయన్ని అడిగాం. తన లైఫ్ తన ఇష్టం అంటున్నారు సార్’ పక్కన కూర్చున్న మూర్తి మౌనంగా వింటున్నాడు.‘అంతే కదా! ఆయన లైఫ్ ఆయన ఇష్టం. మనమెందుకు తలదూర్చడం?’కిరణ్ మాటలు అక్కడున్న వాళ్లకి ఒక్క క్షణం అర్థం కాలేదు.‘ఏమంటున్నారు మీరు?’ అన్నాడు మూర్తి కొడుకు సందిగ్ధంగా. ‘మీ నాన్న, మా అమ్మా వాళ్లకి నచ్చినట్లు ఉంటే మీకూ, నాకూ ఏంటి ప్రాబ్లమ్?’ కిరణ్ గొంతు చాలా కూల్‌గా ఉంది.‘ఇలా బరి తెగించి తిరిగితే, మన పరువు, ప్రతిష్ఠ ఏమైపోతాయ్’ రామం ఉండబట్టలేక అడిగాడు. ‘వ్యసనాల పాలై ఆస్తులన్నీ అమ్ముకున్నప్పుడు, కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు మన పరువు, ప్రతిష్ఠలేమైపోయాయ్.’ ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రామం ముఖం మాడిపోయింది. ‘పద్దెనిమిదేళ్లు దాటిన వారిని ఈ దేశంలో మేజర్ అంటారు. వారికి నచ్చినట్లు బతికే హక్కు వాళ్లకి ఉంది. అరవయ్యేళ్లు దాటి, జీవితం ఎత్తుపల్లాలన్నీ చవి చూసిన వాళ్లకు ఆంక్షలు అవసరమా?’ మూర్తిగారి పిల్లలవైపు చూస్తూ అడిగాడు. ‘మా నాన్న పెన్షనర్ కదా. అందుకే మీ అమ్మగారికి ఆయన అవసరం ఉందేమో’ కూతురు అక్కసు వెళ్లగక్కింది.‘నేను పదేళ్ల నుంచి అమెరికాలో ఉన్నాను. మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటి మీద వచ్చే వడ్డీతో ఆమె పదిమందిని పోషించగలదు.’ ‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు.‘అమెరికా అయినా, ఇండియా అయినా మానసిక, శారీరక అవసరాలు ఒక్కటే. ఆకలేస్తే అక్కడా తింటారు. బాధ వేస్తే ఏడుస్తారు. తోడు కోసం తపిస్తారు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి మా అమ్మ చాలా కష్టపడింది. నా కడుపు నింపడానికి తను పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మీ నాన్నగారి గురించి కూడా విన్నాను. చిన్న ఉద్యోగంతో ఆయన జీవితం ప్రారంభమైంది. మీకు మంచి భవిష్యత్తు అందించడంలోనే ఆయన శక్తి హరించుకుపోయింది. పదేళ్ల కిందట మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన మరింత ఒంటరితనంతో బాధ పడుతున్నారు. రిటైరైనా కనీసం ఆయన ఓ సొంతిల్లు కూడా సంపాదించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ తమ బతుకుల్లో నాలుగింట మూడొంతులు మన కోసమే బతికారు. ఇకనైనా వాళ్ల కోసం వాళ్లను బతకనీయండి’‘బతకడంలో తప్పులేదు. కాని, ఇలానా? గట్టిగా అడిగితే స్నేహం అంటున్నారు. రాత్రుళ్లు కూడా మీ ఇంట్లోనే ఉండేంత స్నేహమేంటో’ మూర్తి కోడలు పుల్లవిరుపుగా ఉంది. ‘ఆ స్నేహాన్ని నిర్వచించడం, దాని అర్థ, తాత్పర్యాలు చెప్పడం నా పని కాదు. తమది స్నేహం కాదని, అంతకుమించి అని చెబితే అంగీకరించే గొప్పతనం మీకుందా? ఆ సాన్నిహిత్యం మానసికమా, శారీరకమా అనేది కూడా అనవసరం. వాళ్లకు నచ్చినట్లు వాళ్లుంటారు. వాళ్ల జీవితాల మీద పెత్తనం చలాయించే హక్కు ఎవరికీ లేదు.’ ఇదంతా వింటున్న మూర్తి ముఖంలో ఓ రకమైన ఊరట కనిపిస్తోంది. అపరాధ భావంతో కుంగిపోయిన శాంతకి తన కొడుకు మాటలు సాంత్వననిచ్చాయి. ధైర్యంగా గదిలోంచి వెలుపలికి వచ్చి, కిరణ్ పక్కనే కూర్చుంది. ‘బాబాయ్, అమ్మ కావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికా రావచ్చు. అంతవరకూ ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది ఆవిడ ఆస్తి. నేను కూడా ఈ ఊళ్లోనే సెటిల్ అవుతాను. ఈ ఇంట్లోనే ఉంటాను’తన పప్పులు ఉడకవని రామానికి అర్థమైపోయింది. ముఖం కందగడ్డలా మారిపోయింది.మూర్తిగారి పిల్లలకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘మీరంతా చదువుకున్నవాళ్లు. పెద్దవాళ్లు. వ్యక్తి స్వేచ్ఛను మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తమకు నచ్చినట్లుగా బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సమాజమే మనుషుల జీవితాలను నిర్దేశిస్తూ ఉంటే స్వాతంత్య్రం అనే మాటకు అర్థం ఉండదు. మీ కోసం, నా కోసం మన పెద్దవాళ్లు తమ సాన్నిహిత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.’‘రోజూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మేం అతన్ని భరించలేం’ మూర్తి గారి కొడుకు తేల్చి చెప్పాడు.‘అది పెద్ద సమస్య కాదు. మూర్తి గారు.. మీ సామాన్లు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి, మీకెలాంటి అభ్యంతరం లేకపోతేనే..’ అంటూ ఆయన వైపు చూస్తూ అన్నాడు.ఈ మాటకి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. మూర్తి, శాంత కూడా ఈ మాటలను ఊహించలేదు. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది, మాట్లాడటానికి ఏమీ లేనట్లుగా అందరూ కుర్చీల్లోంచి లేచారు.‘ఒక్క నిమిషం. మీరు చుట్టపు చూపుగా ఈ ఇంటికి వచ్చి పోతే పర్లేదు. కానీ ఇంటి మీద పడి ఎవరైనా గొడవ చేసినా, మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోను. బాబాయ్ నువ్వు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇకపై నాకు ఫోన్ చేయక్కర్లేదు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అవసరమైతే వాళ్లే నాతో మాట్లాడతారు’కిరణ్ మాటల్లో దృఢత్వాన్ని చూసిన తర్వాత, ఇక మాట్లాడటానికి ఏమీ లేదని అందరికీ అర్థమైంది. అక్కణ్ణుంచి మౌనంగా నిష్క్రమించారు.‘వస్తాను బాబూ’ అంటూ మూర్తి కూడా లేచారు.‘అంకుల్, ఇక్కడ మీకు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాయిగా ఉండొచ్చు’ భరోసా ఇస్తూ అన్నాడు.మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.నీళ్లు నిండిన కళ్లతో కొడుకును చూస్తూ, శాంత ఆప్యాయంగా కిరణ్ నుదుటన చుంబించింది.ఇద్దరికీ గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది. గదిలోకి వెళ్లి విషయం భార్యకు చెప్పడానికి ఫోన్ తీశాడు.నాలుగు రోజుల కిందట తనకు, సుధకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.‘ఇండియా వెళ్తున్నారా?’‘అవును. రెండ్రోజుల్లో బయల్దేరుతాను.’‘అక్కడకు వెళ్లి ఏం తేలుస్తారు?’‘అమ్మ అతని సాహచర్యాన్ని ఇష్టపడుతోంది. ఆమె ఎడారిలాంటి జీవితంలో దొరికిన ఒయాసిస్సు మూర్తిగారు. ఆయన గురించి నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి, ఈ వయసులో ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటారు. నువ్వేమంటావ్?’ సుధ వైపు చూస్తూ అన్నాడు. ‘మీరేమంటే నేనూ అదే అంటాను’ తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఆమె ముఖంలో చిరునవ్వు.తన భార్య గురించి కిరణ్‌కి తెలుసు. ‘అమ్మా వెళ్లొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ బ్యాగ్ అందుకున్నాడు.‘జాగ్రత్త నాయనా. వేసవి సెలవులకు రండి’ సాగనంపుతూ వెంట వస్తోంది. కారు దగ్గరకు వెళ్లి డోర్ తెరిచాడు. ఎదురుగా వస్తున్న ఆటో తన ఇంటి ముందు ఆగడాన్ని చూసి ఓ క్షణం వెయిట్ చేశాడు.ఆటోలోంచి మూర్తి రెండు బ్యాగులతో దిగాడు. ‘వెళ్లొస్తానండీ’ కిరణ్ చిరునవ్వుతో చేయి ఊపాడు. ‘హ్యాపీ జర్నీ బాబూ’ మూర్తి నవ్వుతూ చెప్పాడు.‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు. -
కుబేర వారసులు
ఒకప్పుడు తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దిన వారంతా, ఇప్పుడు వ్యాపార చదరంగంలో ఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారరంగంలో ఇప్పటికే ఆరితేరిన తండ్రులు తమ వ్యాపార అనుభవాలను పాఠాలుగా చెబుతుంటే, వాటన్నింటినీ శ్రద్ధగా వింటూ కొత్త తరం కోటీశ్వరులుగా ఎదుగుతున్నారు. తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూనే, తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. పాతతరం ఢక్కామొక్కీలు తిని కోటీశ్వరులుగా మారితే, ఇప్పుడు వారి పిల్లలు కేవలం వారసత్వం అనే ఏకైక అర్హతతోనే వ్యాపార సామ్రాజ్యాలకు నవనాయకులుగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంబానీ మొదలుకొని దేశంలోని చాలామంది వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు తమ వారసులకే పట్టం కడుతున్నారు. అందుకే, ప్రస్తుతం ఉన్న యువ కోటీశ్వరుల్లో ఎక్కువమంది వ్యాపార కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. అయితే, వీరిలో కూడా కొంతమంది ఒట్టి వారసులుగానే మిగిలిపోకుండా, తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వేలాదికోట్ల ఆస్తిపాస్తులను, వ్యాపారాలను నిలబెట్టుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వారిలో కొందరే.. వీరు..రి‘లయన్స్’ఆసియాలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలు కూడా వారి కుటుంబ వ్యాపారాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈశా అంబానీ పిరామల్ముకేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరామల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈశా గత ఏడాది ‘మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్–2024’ అవార్డు పొందింది. టైమ్ మ్యాగజైన్ ‘టైమ్ 100 నెక్ట్స్ రైజింగ్ స్టార్స్’ జాబితాలో పేరు సంపాదించింది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ. 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ.800 కోట్లని అంచనా.ఆకాశ్ అంబానీముకేశ్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఆకాశ్ అంబానీ తన చదువు పూర్తి చేసిన వెంటనే, 2014లో రిలయన్స్ జియోలో చేరాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఓనర్స్‌లో ఒకరిగా కూడా ఉన్నాడు. అలాగే, రిలయన్స్ లిమిటెడ్ ఉత్పత్తులు, డిజిటల్ సేవల అప్లికేష¯Œ ల అభివృద్ధి, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆకాశ్ వార్షిక వేతనం రూ. 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,32,815 కోట్లు) నెట్‌వర్త్.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ. 2022లో రిలయన్స్ బోర్డులో చేరాడు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. జంతుప్రేమికుడిగా ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం ‘వంతారా’అనే సంస్థను స్థాపించాడు. ఈ మధ్యనే ఈ సంస్థకు ప్రతిష్ఠాత్మక ‘ప్రాణిమిత్ర’ జాతీయ అవార్డు లభించింది. అనంత్ వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,32,482 కోట్లు).నోయల్ టాటా ఉప్పు నుంచి విమానయానం వరకు దాదాపు అన్ని రంగాల్లోనూ టాటా గ్రూప్ వ్యాపార స్రామాజ్యం విస్తరించి ఉంది. అయితే, ఆ సామ్రాజ్యం దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణానంతరం కూడా సజావుగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సవతి తల్లి కొడుకు నోయల్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులవడం. ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరు కూటా టాటా ట్రస్ట్‌లో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.లేహ్ టాటానోయల్ పెద్ద కుమార్తె లేహ్ టాటా ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. తాజ్ హోటల్స్ రిసార్ట్స్– ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె– నేడు ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను నిర్వహిస్తోంది. వీటితో పాటు, గేట్‌వే హోటల్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయా టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లలో మొదలై, నేడు టాటా డిజిటల్ రంగంలో ముఖ్యమైన పదవిలో ఉన్నారు. టాటా న్యూ యాప్ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జెఆర్‌డీ, టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా పనిచేస్తోంది.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం నుంచి టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. ‘స్టార్ బజార్’, ‘జూడియో’ సంస్థలకు అధిపతి. వీటితో పాటు టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ, టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ, టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.గోద్రేజ్ప్రఖ్యాత కుటుంబ వ్యాపారాల్లో గోద్రేజ్ ఒకటి. సబ్బులు, గృహాపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ సంస్థ గోద్రేజ్. దీనిని 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అర్దేశిర్ గోద్రేజ్ ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపును గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్‌గా రెండు విభాలుగా విభజించారు. వీటిల్లో గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌ను వారి మూడోతరం ఆది, నాదిర్ చూసుకుంటుంటే, మరోదాన్ని జంషీద్, స్మితా గోద్రేజ్ కృష్ణా నిర్వహిస్తున్నారు. వీరితో పాటు, వారి నాలుగోతరం వారసులైన తన్యా దుబాష్.. గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైర్టెర్గానూ, నిసబా గోద్రేజ్.. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇలా గోద్రేజ్ కుటుంబంలో చీలిక ఏర్పడినప్పటికీ వారి వ్యాపారాన్ని వారసులు విజయవంతంగా కొన సాగిస్తున్నారు. బజాజ్ బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తర్వాత, బజాజ్ సంస్థను ఆయన కుమారులు రాజీవ్, సంజీవ్, అతని బంధువులు శేఖర్, నీరజ్, నీరవ్‌తో కూడిన కుటుంబ కౌన్సిల్ ద్వారా ఏకాభిప్రాయంతో పనిచేస్తోంది. ఇటీవలే మరణించిన మధుర్ బజాజ్ కూడా ఈ ఆరుగురు సభ్యుల కౌన్సిల్లో ఉండేవారు. బజాజ్ ఆటో సంస్థను రాజీవ్ బజాజ్ కుమారుడు రిషభ్నయన్ బజాజ్ చూసుకుంటున్నాడు. గత ఏడాదే, బజాజ్ గ్రూప్ ఆరోగ్య రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. నీరవ్ బజాజ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాడు. వీరి వారసులు కూడా కంపెనీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ విజయం సాధిస్తున్నారు.అనన్యా బిర్లా.. దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా పెద్ద కుమార్తె అనన్యా బిర్లా వ్యాపార ప్రపపంచంలో విజయవంతమైన మహిళగా రాణిస్తోంది. ఈమె తన çపదిహేడవ ఏటనే సొంత మైక్రోఫిన్ సంస్థను స్థాపించింది. ఇది దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మైక్రోఫైనాస్స్ సంస్థల్లో ఇదీ ఒకటి. అలాగే, ఆదిత్యా బిర్లా అనుబంధ హిందాల్కో ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతోంది. ప్రణవ్ అదానీభారతీయ కుబేరుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తర్వాతి తరం కూడా వేర్వేరు వ్యాపారాల్లో కొనసాగుతూ, ఆయన పేరును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ కుమారుడు ప్రణవ్ అదానీ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయిన వెంటనే, అదానీ కమ్యూనికేషన్స్‌లో ఎంటరై, తన చురుకుతనం చూపించాడు. తర్వాత అదానీ విల్మార్, అదానీ రియాలిటీలకు అధిపతిగా ఉన్నాడు. అలాగే, ఆసియాలో అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌కు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు. కరణ్ అదానీ.. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ అంచెలంచెలుగా ఎదిగి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఆయన హయాంలో, కంపెనీ నాలుగు నుంచి ప్రస్తుతం పన్నెండు పోర్టులకు విస్తరించింది. అంతేకాదు, దాని కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాడు. అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాన్ని పెంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.జీత్ అదానీ...గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్ వంటి విభాగాల బాధ్యతలు చూసుకోవడంతో తన కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.సాగర్ అదానీ..అదానీ సోదరుడి కుమారుడు సాగర్ అదానీ. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందిన తర్వాత 2015లో అదానీ గ్రూప్‌లో చేరాడు. ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులు తెప్పించడంలో సాగర్ కీలక పాత్ర పోషించాడు.ఆర్యమాన్ విక్రమ్ బిర్లాబిర్లా తనయుడు ఆర్యమాన్ బిర్లా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. అయినప్పటికే, తండ్రి పేరును నిలబెట్టే ప్రయత్నంతో చిన్న వయసులోనే బిర్లా రియల్ ఎస్టేట్, పెయింట్స్, ఫ్యాషన్ అండ్ రిటైల్ వ్యాపారాల్లో తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. 2023లో గ్రూప్‌లోని ఫ్లాగ్షిప్ కంపెనీలైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డులో చేరారు. వీటితోపాటు, బిర్లా హాస్పిటాలిటీ, బిర్లా వెంచర్స్‌ను చూసు కుంటున్నాడు.దేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో అంబానీ కుటుంబ వ్యాపారం మొత్తం విలువ రూ.25.75 లక్షల కోట్లు. ఇది భారత జీడీపీలో 10 శాతంతో సమానమని ‘బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా–2024’ నివేదిక పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అయితే, వారసత్వ వ్యాపారం ఇలాగే కొనసాగితే, రాజకీయాల్లోను, సినిమాల్లోను మాదిరిగానే వ్యాపారరంగంలోనూ వారసత్వాలు పెరిగి, కొత్త వ్యాపారులకు చోటు లేకుండా పోతుందనేది నిపుణుల మాట. ఇలా కాకుండా, ఎక్కడైనా సరే, వారసత్వ అర్హతతో పనిలేకుండా, ప్రతిభతో అవకాశాలు దక్కడం, దక్కించుకోవడమే అందరికీ మేలు.వ్యాపార కుటుంబాల్లో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో ఇప్పటికే చాలా మార్పు జరుగుతోంది. కొత్త తరానికి నియంత్రణ అప్పగిస్తూ, వారసులను వ్యాపార బరిలోకి దింపుతున్నారు. వీరి రాకతో వారి కుటుంబాల వ్యాపారాల విలువలు కూడా పెరుగుతున్నట్లు తాజాగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా 2024 ఇచ్చిన నివేదిక వెల్లడించింది. వీటితో పాటు, అత్యధిక విలువ కలిగిన కుటుంబ వ్యాపారాల నివేదికను రూపొందించింది. అదే ఇది..నివేదిక ప్రకారం.. కుటుంబాల వ్యాపారాల విలువలు దీపిక కొండి -
క్షణాల్లో మేకప్ వేసుకోవచ్చు..!
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్‌లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్‌తో మేకప్ లిక్విడ్స్‌ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.ఈ మెషిన్‌తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్‌తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్‌ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్‌బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెప్పల సోయగంఅందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్‌ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి. ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్‌గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్‌గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్‌ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!) -
నక్షత్రాలు చూడటానికి బెస్ట్ ప్లేస్ ..!
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు. ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు. (చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్‌గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్‌ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్‌స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..) -
పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..
వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్‌ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్‌హౌస్ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్‌ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకర్ ఈ సీజన్‌కి సరైన ఎంపిక అవుతుంది.కిచెన్ డెకర్గిన్నెల్లో, వంటగది కౌంటర్‌టాప్ లేదా డైనింగ్ టేబుల్‌పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్ టేబుల్‌పైన సెంటర్ పీస్‌ను క్రియేట్ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. ఫామ్‌హౌస్ శైలిపట్టణవాసులు ఇటీవల ఫామ్ హౌస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్‌హౌస్ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. హెర్బల్ గార్డెన్కృత్రిమ మూలికలతో ఇండోర్ హెర్బల్ గార్డెన్‌ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు. ఎన్.ఆర్(చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
ఆల్‌ఫ్రీ ఊరు
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లి ఉంటామంటే చాలు. మీకు కావాల్సిన ఇంటిని, కావాల్సిన రీతిలో ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. అది కూడా ఉచితంగా.. అర్జెంటుగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ఇస్తుంది. అది కూడా అంతా ఇంతా కాదు, దాదాపు రూ. 94 లక్షలు. నిజం, ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి లక్ష యూరోలు (సుమారు రూ. 94 లక్షలు) ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎందుకంటే, అక్కడి గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో, ప్రస్తుతం అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప, జనాలెవరూ లేరు. దీంతో, ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలా దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందుకే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరానా ఇస్తోంది. అయితే ఈ డబ్బును వారు కేవలం, అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అయితే, 45 ఏళ్ల లోపు ఉన్న ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే దీనికి అర్హులు. -
ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్‌కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్‌ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్‌ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్‌పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్‌ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్‌కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్‌లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్‌క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్‌తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్‌కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్‌లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్‌ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్‌ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు! -
పద్మ–పిప్పలాదుల చరిత్ర
పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు. వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.∙సాంఖ్యాయన -
తీరంలో తూటా.. సీటీలో బాంబు
కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2009లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్‌ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్‌కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్‌లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్ అఫాఖీకి అప్పగించాడు.అఫాఖీ 2005లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్ భత్కల్ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్‌ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.రియాజ్ భత్కల్ నుంచి కోడ్‌వర్డ్స్ రూపంలో ఈ–మెయిల్ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న మదీనా కాలనీలో దారుల్ ఖాయర్ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. అమోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్పైరీ డేట్ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. ‘మీన్ తూటా’లు పేలింది ఇక్కడే... 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2010 ఏప్రిల్ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు. 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్‌ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు. 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. -
యువ కథ: నాన్నతో ఒక రోజు..
‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్ అని పిలవచ్చు కదా!’’ సుందర్ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్.‘‘వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్‌గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్ హైదరాబాద్ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్‌కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. ‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్‌కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్‌మన్‌గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అన్నీ వచ్చేశాయి. ఈ–మెయిల్ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ లెటర్స్ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్‌పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్‌మన్ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్ ఉన్న వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. ‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్.‘‘అసలు ఇప్పుడు పోస్ట్‌మన్ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్.వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్‌తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్నిమరచిపోతున్నారు. కాని, సుందర్‌కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్‌ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్‌లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్‌లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్‌ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
నా అందానికి కారణం ఆ అలవాటే : రుహానీ శర్మ బ్యూటీ సీక్రెట్
అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఫ్యాషన్‌లో తను చూపే చూజీనెస్ మిగతా వారికంటే తనని భిన్నంగా చూపిస్తోంది. అలా తను ఎంచుకున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి. రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు నా సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం మర్చిపోను. ఇప్పుడు ఆ అలవాటే నన్ను ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తోంది.– రుహానీ శర్మచేతి గాజులు ఘల్లుమన్నవే..ఒకప్పటిలాగా నిత్యం చేతికి గాజులు వేసుకోకపోవచ్చు. కాని, స్పెషల్ అకేషన్ ఏదైనా మట్టిగాజులపైనా మనసు పారేసుకుంటున్నారు నేటి మగువలందరూ చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. పైగా గాజుల్ని శుభసూచకంగా, సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తారు. వీటిని ధరించడం వలన అందంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుందనే నమ్మకమూ ఉంది. బంగారు గాజులు ఎన్ని వేసినా వాటి మధ్యలో ఓ నాలుగు మట్టిగాజులు చేరితేనే అందం. కిందటి రోజుల్లో మట్టిగాజులు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో సాదాగా దొరికేవి. కాని, ఇప్పుడు పేస్టల్ కలర్స్‌తో పాటు దాదాపు అన్నీ రంగుల్లోనూ, వివిధ రకాల డిజైన్స్‌లోనూ లభిస్తున్నాయి. వీటిని అటు అరడజను, ఇటు అరడజనులా కాకుండా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు, కేవలం ఒక్క చేతికే నిండుగా ధరించి కూడా స్టయిలింగ్ చేసుకోవచ్చు నటి రుహానీ శర్మలా. -దీపిక కొండి -
వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
గాడిద పాల వైద్యం
అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్ఠంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్లి దానిపై దాడి చేయబోయింది. కాని, అది గమనించిన గాడిద తన వెనుక కాళ్లు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్లతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క ‘కుయ్యో.. మొర్రో’ అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకు గాడిదపై ఫిర్యాదు చేసింది. ‘ప్రభూ! పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటోంది’ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క.మృగరాజు అప్పటి వరకు గ్రామాల్లో ఉండే గాడిద గురించి వినటమే గాని, చూడనేలేదు. మృగరాజు వెంటనే తన ఆంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గుహకు తీసుకు రమ్మని చెప్పాడు. ఏనుగు పరుగునవెళ్లి గాడిదను తీసుకువచ్చింది, గాడిద భయం భయంగా గుహ బయట నిలుచుంది. గుహ లోపల మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం విన్నది గాడిద. మృగరాజు సింహం గుహలోంచి బయటికి వచ్చాడు.గాడిద తన ముందు రెండు కాళ్ళను గాలిలోకి లేపి నమస్కరించింది. ‘ఎవరు నువ్వు!’ ప్రశ్నించాడు మృగరాజు. ‘ప్రభూ! నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ, అతనికి సహాయం చేసే దాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కలను తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపకశక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయేవాడు.అతను ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. గత వారం అతను పట్నం వెళ్లి, ప్రమాదవశాత్తూ మరణించాడు. యజమాని మరణించాక నేను గ్రామంలో ఉన్నంతసేపు నాకు నా యజమానే గుర్తుకు వచ్చేవాడు. అందుకే నేను అక్కడ ఉండలేక అడవి బాట పట్టాను!’ చెప్పింది గాడిద. మృగరాజుకు గాడిద మనసు అర్థమైంది. అంతే కాదు శాకాహారి అయిన గాడిద తన ఆత్మరక్షణ కోసమే నక్కను గాయపరచిందని తెలుసుకుంది. నక్క గుణం తెలిసిన మృగరాజు దాన్ని మందలించాడు.ఇంతలో గుహ నుంచి మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతూ బయటకువచ్చింది.‘మిత్రమా! ఎన్ని పసరు మందులు వాడినా దగ్గు, ఆయాసం, జలుబు గత నెల రోజులుగా నా బిడ్డను వదలటమే లేదు’ విచారంగా అన్నాడు మృగరాజు.గాడిద చిట్టికూనను పరిశీలనగా చూసి, మృగరాజుతో, ‘ప్రభూ! ఎలాంటి దగ్గు, జలుబు, ఆయాసాన్నయినా పూర్తిగా నయం చేసే ఔషధ గుణం మా పాలలో ఉంది. మా పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మీరు అనుమతి ఇస్తే నేను మీ బిడ్డకు వైద్యం చేస్తాను’ అంది గాడిద. మృగరాజు సంతోషంగా అంగీకరించాడు. చిట్టికూనకు గాడిద తన పాలు తాగించింది.పాలు తాగిన చిట్టి కూన నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. మృగరాజు గాడిదను తనతోనే ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. తన యజమాని చూపిన ప్రేమను, గౌరవాన్ని మృగరాజు దగ్గర తిరిగి పొందింది గాడిద. మనం కీడు తలపెట్టినా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుసుకుంది నక్క. -
ఈ వారం కథ: చిద్విలాసుడు
అతను చాలాకాలం తర్వాత బస్‌స్టాండ్ లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడ నుంచి చూశాడో నన్ను, పరుగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ‘‘ఎంతకాలం అయ్యిందో శ్రీను! నిన్ను చూసి’’ అంటుంటే మొహంలో ఆనందం. ‘‘సంయుక్త బాగుందా? పిల్లాడు ఎలా ఉన్నాడు?’’ అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ! తప్పదురా దేవుడా! అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుముకుని, ‘‘మీరు ఎలా వున్నారు?’’.. అడిగాను.ఎప్పటిలాగానే జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ, ‘‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ అన్నాడు. పదిహేను ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేష తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పులేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్ళు తప్ప. ‘‘మీ పిల్లలు ఎలా ఉన్నారు’’.. అని అడిగే లోపున, ‘‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి శ్రీను’’ అంటూ మొబైల్లో టిక్ టిక్‌మని అనిపించి దాన్ని జేబులో పడేసుకుని, ‘‘నేను ఎక్కవలసిన బస్ వచ్చేసింది, ఫోన్ చేస్తాను’’ అంటూ హడావుడిగా, కదులుతున్న బస్ ఎక్కి, వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి! పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, ‘‘మా అమ్మకి చాలాకాలంగా పిల్లలు పుట్టలేదుట. ఒక రోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నాడుట. అతణ్ణి చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందిట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది. ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్లిపోయాడట. తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది’’ అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనస్సులో ముద్ర వేశాడు. పదిహేనేళ్ల క్రితం మొదలైన మా పరిచయం, ట్రాన్స్ఫర్ మీద ఈ వూరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్దమనిషి నన్ను గతంలోకి లాక్కెళ్లాడు.ఆ రోజు శనివారం ఆఫీసు హాఫ్ డే సెలవు. నేను వచ్చేసరికి, సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి, కారుణ్యను ఎదురుగాకూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికి వస్తూ, ‘‘కాఫీ తాగారా’’ అని అడిగింది. తల ఊపాను.‘‘పక్క ఇంటికి కొత్తగా వచ్చారండి. ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారుట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది, ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచామెలా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్ద అమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి, చదువుకుంటోందట. పార్వతిగారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు’’.. సంయుక్త కళ్ళల్లో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్దపెద్ద అరుపులు, తిట్లు వినబడ్డాయి.ఇద్దరం బయటకు పరుగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాము. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ పది పన్నెండేళ్లు ఉండొచ్చు. పక్కింటావిడ వాళ్ళను విడదీయలేక, ‘‘ఒసేయ్ కమలా! ఒరేయ్ రాము ఆగండ్రా! కొట్టుకోకండి! ఏవయ్యో! వీళ్ళను ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా’’ అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకు దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక, అలిసిపోయి, ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుము మీద వేలాడుతున్న లుంగీతో, పై భాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా, నోటిలో కాలుతున్న సిగరెట్టుతో, నలభైఐదు, ఏభై ఏళ్ల మధ్యవయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ‘‘ఏరానాన్నా! ఏమ్మా అమ్ములూ! దెబ్బలు తగిలాయా! ఎందుకు నాన్నా అల్లరి’’ అంటూ వాళ్లను ప్రేమగా మందలించి లేవదీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.‘‘ఛీ ఛీ ఎలా కొట్టుకున్నారో అనాగరికంగా? ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్’’ అన్నాను సంయుక్తతో.నా మాట పట్టించుకోకుండా, ‘‘ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం. పెంకులు మార్చి పదేళ్లు అవుతోంది. వానాకాలంలో ఎలాగో వీళ్ళకు?’’ అంటూ జాలి పడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా.. నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా, వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవక పోతే ముందు ముందు ఎంత కష్టపడివలసి వస్తోందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను.‘‘ఎందుకండీ వాడిని మాటి మాటికి అలా భయపెడతారు?’’ అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది.‘‘నువ్వు మాటాడకు. నీకు తెలియదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో?’’ అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని, సరిగ్గా సెటిల్ అవ్వకపోతే, పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగా స్థిరపడక పోవడం వలన, పెద్దలు మనఃశాంతి కోల్పోవడం చూశాను. అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతుంటాను. అందుకే, జీవితంలో చాలా క్రమబద్ధంగా, జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటు వచ్చింది. వాళ్ళను కనీసం తిట్టకుండా, గారంగా మాట్లాడి, ఆ ఇంటిపెద్ద తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి. లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది.మర్నాడు స్కూటర్ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, ‘‘శ్రీనివాస్ గారూ! ఆగండడాగండి! అంటూ చేతికి గుడ్డసంచి తగిలించుకుని, జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని, దాని మీద చెయ్యి నొక్కిపెట్టుకుని పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సన్యాసి. వంటిమీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. ‘‘శ్రీనివాస్ గారు! మేము మీ పక్క ఇంట్లో కొత్తగా దిగాం. మా ఆవిడా, మీ మిస్సెస్గారు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు’’ అంటూ అవసరం లేకపోయినా గట్టిగా నవ్వుతూ, చేతులు పైకీ క్రిందకూ ఊపుతూ, వీధిలో అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడుతూ.. తన పేరు, ఉద్యోగం, కుటుంబ విషయాలు ఏకరువు పెడుతున్నాడు. ఆఫీసుకు టైము అవుతోందని రెండుసార్లు వాచీ చూసుకున్నాను. అయినా ఆ జీవి, గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగుమీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది.‘‘అయ్యో! ఆయనకి ఆఫీసుకు టైము అవుతున్నట్టుందండీ’’ అని మొగుడుకి హింట్ ఇచ్చింది. అప్పుడు ఆయనగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ‘‘అయ్యో మీకు టైము అవుతుందనుకుంటా, మీ ఆఫీసు కూడా మా ఆఫీసు దగ్గరే! వెడుతూ మాట్లాడుకుందాం’’ అంటూ మొహమాటం లేకుండా, నా స్కూటర్ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో? అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని, ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతునే వున్నాడు. నేను వూ కొడుతూనే ఉన్నాను. అలా మొదలయింది నా మొదటి పరిచయం సన్యాసితో... తర్వాత.. మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా, నేను అతణ్ణి వదిలించుకోలేక పోయాను అనే చెప్పాలి. ఆసక్తి లేకపోయినా, అతని వ్యవహారశైలి గమనించడం మొదలుపెట్టాను. దరిమిలా సన్యాసికి జీవితం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని అర్థం అయ్యింది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని, సిగరెట్టు కాలుస్తూ, నాలుగైదు సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్నవాళ్లను పలకరిస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు. ఇంటిల్లిపాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు.సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ, అతనికి పట్టవా అనిపించేది.ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ,. ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను, క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం.పార్వతి మాటలని బట్టి, అతనికి జీతం డబ్బులు తప్ప, వేరే ఏం ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బులు కోసం ఏనాడూ ఇబ్బంది పడుతున్నట్టు కనబడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాడిని. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు.ఎప్పుడూ సంతోషంగా ఉండే అతణ్ణి చూస్తూ ఉంటే, నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని, నాలో నేను అనుకుంటూనే, ‘‘మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసిగారు’’ అని అడిగాను.అంతలా అల్లరి చేస్తూ, క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే, మరో ప్రశ్న సంధించాను. ‘‘ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! ఈ రోజుల్లో నలుగురు పిల్లలంటే మాటలా? ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం. మీరు నలుగురిని ఎలా పోషిస్తున్నారా అని?’’ సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఒక నవ్వు నవ్వి, జేబులోంచి చార్మినార్ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్ మని గీత గీసి చాలా స్టైల్‌గా సిగరెట్టు ముట్టించి, గుప్పున ఒక దమ్ము లాగి, ‘‘చూడు శ్రీను!’’ అంటూ, ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపులోనే, ‘‘నువ్వు నా కన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే ఏమీ అనుకోకు’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే, మా అమ్మ మగపిల్లాడు కావాలని గోల పెట్టింది. రెండవ వాడు సూరిగాడు పుట్టాడు..’’‘‘మరింకేం!’’ అన్నాను. ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో.‘‘ఆపరేషన్ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేనూ దెబ్బలాడుకున్నాం.ఈలోగా ఒక శుభ ముహూర్తాన కవలలు పుట్టేశారు. ఏం చేస్తాం అంతా ఆ పరమాత్ముడి లీల’’ అని భళ్ళున నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి.నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ వూళ్ళో ఉండగానే, పెద్ద కూతురుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు, పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ ఆమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది.. నవ్వుకునే వాడిని. ‘‘కనీసం ఒక పూట భోజనం కూడా సరిగా పెట్టలేని వాళ్ళు, అల్లుడు వస్తే ఎలా చూస్తారో కదా’’ అని సంయుక్తతో అంటే. ‘‘వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. ఏ సాయం చేయకపోగా, అలా వెటకారంగా మాట్లాడడం తప్పండీ పాపం’’ అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటీ ఫౌండేష¯Œ కి కోచింగ్ ఇప్పించాలని, ఈ వూరికి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను.వెంటనే వచ్చింది. మేము వూరు విడిచి వెళ్లిపోతున్న రోజున చాలా బాధ పడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, ‘‘శ్రీను! నువ్వు వెళ్లిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా’’ అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బావుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే, ఊరు వదిలి వచ్చింది. ఇక్కడకు వచ్చాక, నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను. సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తి అయ్యాయి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి, రెండేళ్లకి వస్తూ ఉంటాడు.సన్యాసి కనిపించాడు అని సంయుక్తకు చెప్పలేదు. ‘‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’’ అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. నలుగురు పిల్లలను కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో, వాళ్ళను కని, చాలీ చాలని జీతం డబ్బులతో, అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో, గడుపుకు వస్తున్న సన్యాసి ఈ రోజుకీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? ‘మర్చిపోయాను’ అనుకున్న సన్యాసి, హఠాత్తుగా కనబడి, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను.‘‘బాబయ్యగారు కనిపించారా? నాకు చెప్పనేలేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట?’’ రుసరుసలాడింది.‘‘నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయి గారు, పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ ‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’ అని మాట్లాడుతున్నాడు. ఆదేమైనా గొప్పకు మాట్లాడతాడా? లేదా పిచ్చా ?’’ అన్నాను తనతో. నాకేసి చూసి ఒక నవ్వు నవ్వి, ‘‘వాళ్ళకేం బ్రహ్మాండంగానే ఉన్నారండీ’’ అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆ రోజుల్లో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా, వాళ్ళను ఏమీ అనకుండా, దగ్గరకు తీసుకుని, మంచి మాటలు చెప్పేవారుట బాబయ్యగారు. వాళ్ళు ఏమి అడిగినా, అప్పోసొప్పో చేసి, కొనిపెట్టేవారుట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని, ప్రవర్తించడం మొదలు పెట్టారుట.పార్వతి పిన్నిగారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వలనే, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని, ముందుకు వచ్చి, పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారుట’’ చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళను చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిల గిలలాడాను. ‘‘పెద్ద కొడుకు సూరి , కిరాణా హోల్‌సేల్ బిజెనెస్ పెట్టి, బాగా సంపాదిస్తున్నాడుట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరు ఎప్పుడూ ఎందుకు పనికిరాడు అని తిట్టి, ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా! ఆ చిన్న కొడుకు రాముని,.. మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు! నువ్వైనా డిఫెన్సులో చేరి, దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారుట బాబాయిగారు. మనం ఏం తిన్నామో, ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలివాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే, దేహీ అని అందర్నీ ఆడగాలనిపించి, దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి’’ అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారుట. ఆయన అలా నవ్వుతూ కనబడే మనిషే కానీ, లోతైన మనిషి అండీ’’ అంది తాపీగా.‘‘నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిశాయి?’’ సందేహం ఆపుకోలేకపోయాను. ‘‘మొన్నామధ్య సోషల్ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్నిగారి నంబర్ తీసుకున్నాను, మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! అందుకే చెప్పలేదు’’ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు. ∙చాగంటి ప్రసాద్ -
యువ కథ: ముసుగు మనుషులు
మెలకువ వచ్చింది. వెంటనే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. నా చేయి ఫోన్ కోసం వెతకడం మొదలెట్టింది. రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టు గుర్తు. నా ప్రతిరోజూ ప్రారంభమయ్యేది, ముగిసేది ఫోన్‌తోనే! వెతుకుతున్న చేతికి ఫోన్ తగలగానే, ఏదో స్విచ్ వేసినట్టు నా కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి.చూస్తే టైమ్ ఉదయం తొమ్మిది కావస్తోంది. ఆలస్యం అయిపోయింది. దానికి కారణం రాత్రంతా నిద్రలేదు. ఒకటే కలలు, ఏవేవో ఆలోచనలు. కాని ఒకటి మాత్రం బాగా గుర్తుంది. దేవుడు కనిపించాడు. ‘లోకంలో ఆడా మగ, పేదా ధనిక, కుల మత వర్ణ అసమానతలన్నీ తుడిచేయి దేవుడా. సమసమాజాన్ని సృష్టించు భగవాన్’ అని నేనడిగితే, ‘తథాస్తు’ అన్నాడు. అంత వరకే గుర్తుంది. అలా ఎందుకు అడిగానో తెలీదు.ఆడవాళ్ళు అవ్వడం వల్ల ఇంట్లో నా భార్య, ఆఫీసులో నా జూనియర్ శ్రీలేఖ, డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల నా కొలీగ్స్, పెద్ద కులంలో పుట్టడం వల్ల నా స్నేహితుడు రాజు నా కన్నా ఎక్కువ సుఖపడుతున్నారని ఈ మధ్య తెగ ఆలోచిస్తున్నాను. ఈ అసమానతలన్నింటినీ సృష్టించింది ఆ దేవుడేనని, ఆయన మీద కోపాన్ని పెంచుకున్నాను. మనస్సులో అప్పుడప్పుడు దైవ దూషణ కూడా చేశాను. ఈ కల దాని వల్లేనేమో అనిపించింది.నిద్రమత్తుని అతికష్టం మీద వదిలించుకుని, మంచం దిగి వాష్రూమ్లోకెళ్ళి, ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి ముప్పావు గంట పట్టింది. ఎప్పటిలా నేను వాష్ రూమ్‌లో ఉండగా నా భార్య ‘లేచావా’ అంటూ తలుపు కొట్టలేదు. వంట గది నుంచి ఎలాంటి కుక్కర్ శబ్దాలూ రావట్లేదు. టీవీలో భక్తి స్తోత్రాలు వినిపించట్లేదు. పూజగదిలోనూ కనిపించలేదు తను. అప్పుడే జురాసిక్ పార్క్‌లో ఉండే జంతువులన్నీ కడుపులో పరుగెత్తడం మొదలెట్టాయి. వంటగదిలోకెళ్ళాను. ఓ గిన్నెలో పోహా కనిపించింది. నాకు భలే ఇష్టం. తనకు ఇష్టం లేకున్నా, నా కోసం చేసిపెడుతుంది నా భార్య. మొత్తం లాగించేశాక, మళ్ళీ నా భార్య గుర్తొచ్చింది.‘ఎక్కడికెళ్ళింది అసలు’ అనుకుంటూనే, తన ఫోన్‌కి డయల్ చేశాను. రింగ్ అయ్యింది కాని, లిఫ్ట్ చేయలేదు. ఆ చిరాకుతోనే బైక్ తాళాలు తీసుకుని ఆఫీసుకి బయల్దేరాను.‘బ్రేక్‌ఫాస్ట్ అయ్యిందా సార్’ అన్న గొంతు వినబడింది. బైక్ స్టార్ట్ చేస్తూనే ‘హా అయింది’ అంటూ ముభావంగానే తలెత్తాను. ఎదురుగా ఓ వ్యక్తి. అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్లు తప్ప ఏమీ కనిపించట్లేదు. షాక్ కొట్టినట్టయింది. కాని ఎలాంటి భయమూ కలగలేదు. నాకే ఆశ్చర్యమేసింది.తేరుకున్న నేను, రెండు విషయాల ద్వారా నేను చూస్తున్నది మా ఇంటి ఓనర్ని అని గుర్తుపట్టగలిగాను. మొదటిది ఆయన గొంతు. రెండవది తను చూపే మర్యాద. నేను చూíసీ చూడనట్టు ఉన్నా, దగ్గరకొచ్చి మరీ పలకరిస్తాడు. నా ఆశ్చర్యాన్ని పసిగట్టిన అతను ‘అరే! మీరూ నాలాగే అయిపోయారు’ అన్నాడు.‘మీలాగా’ అంటూ నా మొహాన్ని, చేతులనూ తడుముకున్నాను. ఏమీ ఉన్నట్టు అనిపించలేదు.బైక్ మిర్రర్లో చూసుకున్నాను. ఏదో చీకటి ఒళ్ళంతా కప్పేసినట్టు నా కళ్లు, నోరు, చేతులు, కాళ్లుతప్ప ఏమీ కనిపించట్లేదు. భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.నా ఆలోచనలకు సమాధానంగా, మళ్ళీ తనే ‘ఈ రోజు ఉదయం నుంచి అందరి కళ్లు, నోరు, చేతులు, కాళ్లు తప్ప మిగతావేవీ కనిపించట్లేదు. మనం ఇంట్లో, హాస్పిటల్లో ఉంటే మాత్రమే ఇంతకు ముందులా ఒకరికొకరం కనిపిస్తున్నాం. బయటకొచ్చామా, అంతే సంగతులు! ముసుగు మనుషుల్లా అయిపోయాం అందరం. అందరూ దేవుడు ఏదో శపించాడని అనుకుంటున్నారు’ అంటూ పిచ్చివాడిలా తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.ఎక్కువ ఆలోచించే టైం లేకపోయింది. బైక్ తీసి వెంటనే ఆఫీసుకి బయల్దేరాను. మధ్యలో బైక్ మీద వస్తున్న ఓ మనిషి ఎదురయ్యాడు. బైక్‌కి వేలాడుతున్న పాల డబ్బాలను చూస్తే పక్కింట్లో పాలు పోసేవాడని అర్థమైంది. పక్కింటి నుంచి ఓ నల్లని శరీరం బయటకొచ్చింది. తను పక్కింటి గీత ఆంటీ అని కళ్ళను బట్టి గుర్తుపట్టగలిగాను. పట్టుకుంటే వదలదు. అందుకే తను నన్ను గుర్తుపట్టి పలకరించేలోపే బైక్‌ని పరుగెత్తించాను.ఎక్కడ చూసినా మనుషుల శరీరాలు కనిపించట్లేదు. అంతా మాయగా అనిపించింది. ఓసారి బైక్ ఆపి నన్ను నేను గిల్లుకున్నాను. నొప్పేసింది. అయినా జరుగుతున్నదంతా నమ్మబుద్ధి కాలేదు. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు రాజుకి ఫోన్ చేశాను. వాడూ లిఫ్ట్ చేయలేదు. ఇక చేసేదేం లేక బైక్‌ని ముందుకు పోనిచ్చాను.కలెక్టర్ చౌరస్తా వచ్చింది. జనాలు ఓ మూలన గుమిగూడి ఉన్నారు. ఏమై ఉంటుందా అని దగ్గరికెళ్ళాను. ఎవరో రక్తపు మడుగులో పడున్నారు. కాళ్ళకు మెట్టెలు కనిపించాయి. ఓ మహిళ అని అర్థమయింది. ఎవరూ సెల్ఫీలు తీసుకోవట్లేదు, వీడియో రికార్డింగు చేయట్లేదు. పాపం అని కొందరు బాధపడుతున్నారు. అంబులెన్స్‌కి ఫోన్ చేయండి అని ఇంకొందరు కేకలేస్తున్నారు. మొహాలు కనిపించుంటే మాత్రం జనాలు చనిపోతున్నా పట్టించుకోకుండా, ఒక్కొక్కరు పదులకొద్ది సెల్ఫీలు తీసుకునేవారు. అనాథలా రక్తపు మడుగులో పడున్నావిడ వీడియోలు రక రకాల కోణాలలో చిత్రించేవాళ్ళు. అంతేగాని రక్షించే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ హఠాత్ మార్పుకు కారణం అర్థంకాలేదు. అక్కడున్న ఒక్కాయన్ని అడిగితే ‘అక్కడ రక్తపు మడుగులో పడున్నది ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరి అక్క, అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ ఎవరైనా అయ్యుండచ్చు. గుర్తుపడదామంటే శరీరం కనిపించట్లేదు. విడిచిపెట్టి పోతే అదో రిస్కు. అందుకే వాళ్ళందరూ తాపత్రయ పడేది’ అన్నాడు.దేవుడు భలే చేశాడనిపించింది. ఎప్పుడూ ‘మన వాళ్ళు.. నా వాళ్ళు’ అంటూ ఉండే మనుషుల జీవితాల్లోంచి స్వార్థాన్ని తీసేశాడు.ఇంతకుముందు నేనెవరినైనా అలా చూస్తే, చలించిపోయే వాణ్ణి. ఇప్పుడు ఇంతమంది మానవత్వం చూపిస్తుండడంతో నా అవసరం లేదనిపించి ముందుకు కదిలాను.ఆఫీసుకెళ్ళి కూర్చున్నాను. నన్ను మా బాస్ రమ్మంటున్నాడని అటెండర్ కబురంపాడు. దాంతో వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను.‘అసలు ఇలా ఎలా అయింది? మనుషుల పాపాలు ఎక్కువైపోయాయి’ అని సొల్లు మొదలెట్టాడు.ఇంతకుముందు పని చెప్పడానికే నన్ను పిలిచేవాడు. మాటలతో టైమ్‌పాస్ చేయడానికైతే నా జూనియర్ శ్రీలేఖని పిలిచేవాడు. ఈ వయసులో ఏం చేద్దామని తహతహో అర్థంకాదు. ఇప్పుడు ఆమె కోతి మొహం కనిపించట్లేదు. అందుకే నేను గుర్తొచ్చానేమో అనిపించింది. సమాజంలో స్త్రీ పురుష భేదాలు కూడా తొలగిపోయాయని అర్థమైంది. దేవుడి మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. ఇంతలో నా ఫోన్ మోగింది. ఏదో కొత్త నంబరు. లిఫ్ట్ చేసి మాట్లాడగానే, అవతలివైపు వ్యక్తి చెప్పిన వార్త విని, అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు నిండాయి, కాళ్ళు వణకడం మొదలెట్టాయి. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది.హాస్పిటల్ బెడ్ మీద నా భార్య. ఒళ్ళంతా కట్లు కట్టినట్టున్నారు. ఆమె మొహం తప్ప మరేమీ కనిపించట్లేదు. తనలో కదలిక లేదు. కళ్ళు మూసే ఉన్నాయి. పక్కకు చూశాను. మా అత్తా అమ్మా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నేనూ ఏడవాలా? తెలీలేదు. నా బుర్ర పనిచేయట్లేదు. ‘ఏడిస్తే తను తిరిగొస్తుందా?’ అన్న ప్రశ్న అడుగుతోంది నా బుర్ర. ఆ ప్రశ్న కరక్టే కదా!ఏమో ఏం తెలియట్లేదు. సోఫాలో కూలబడిపోయాను. తెలీకుండానే కళ్ళు మూతలుపడ్డాయి.ఏదో శరీరం నన్ను తాకుతున్నట్టు అనిపించింది. ‘ఊ..ఊ’ అన్న గొంతు వినబడడం మొదలెట్టింది.బరువుగా కళ్ళు తెరిచాను. ఎదురుగా నా సంవత్సరం వయసున్న కొడుకు. నా చెల్లి చేతుల్లోంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి చేతిలోకి తీసుకుని కౌగిలించుకున్నాను. ధైర్యంగా అనిపించింది. నాకంటూ మిగిలింది వాడొక్కడే ఇప్పుడు. నా కౌగిలిని విడిపించుకుని, వాడి అమ్మ వైపు ఒక్క వేలితో చూపిస్తూ ‘ఊ ..ఊ’ అంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ఈసారి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ధారలుగా నా చెంపలను తడిపేశాయి. అది చూసి వాడు నా కన్నీటికి ఒక వేలిని తాకించి, తడి తాకగానే, ‘ఊయ్’ అన్నాడు, ‘ఏమైంది నాన్నా’ అన్నట్టు. వాడికేం చెప్పాలి? చెప్పినా ఏం అర్థమవుతుంది?.అప్పుడే వచ్చిన నా స్నేహితుడు రాజు, పక్కన కూర్చొని, ‘మనుషులు మారలేదురా. మారరు కూడా. రోడ్డు మీద శరీరం కనిపించక పోయేసరికి, వాళ్ళ వాళ్ళయ్యుంటారేమో అని హాస్పిటల్‌కి జాగ్రత్తగా తీసుకొచ్చారు.హాస్పిటల్ లోనికి రాగానే శరీరం మొత్తం కనిపించింది. దాంతో వాళ్ళ కులం కాదని ఒకడు, మతం కాదని ఒకడు, ఆడ అని ఇంకొకడు, నా వాళ్ళు కాదని మిగతా వాళ్ళు వదిలేసిపోయారు. డాక్టరు కూడా తెలిసిన వాళ్ళు కాదని, ప్రాణం పోతుందని తెలిసినా, డబ్బు కడితేనే ట్రీట్మెంట్ అన్నాడట! చివరికి అందరూ ఉన్నా మన దీపూ అనాథలా ప్రాణాలు విడిచింది. లేదు సమాజం చంపేసింది’ ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాజు. ఇంతకు ముందు ఎప్పుడూ వాణ్ణి అలా చూడలేదు.మళ్ళీ వాడే ‘ఇంతకూ ప్రమాదం జరిగింది ఎక్కడో తెలుసా? కలెక్టర్ చౌరస్తా దగ్గర. నువ్వు అటు నుంచే పోయుంటావు. నువ్వు చూసుంటే, నువ్వే తీసుకొచ్చేవాడివి. దురదృష్టం. ఇంతకీ తను ఎక్కడికెళ్తుందో తెలుసా? ఉద్యోగానికి. కుటుంబ భారమంతా నువ్వొక్కడివే మోస్తూ బాధపడుతున్నావని, తను నీకు చెప్పకుండా ఏదో ఇంటర్వ్యూకి బయల్దేరింది. ఇంతలోనే ఇదంతా అయింది’ అన్నాడు.నా ఆలోచనలు ఆగిపోయాయి. చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యను నేనే వదిలేశానా అన్న బాధ నా గుండెను కకావికలం చేసింది. కళ్ళు మూతలు పడ్డాయి. ఎదురుగా ఓ వెలుగు కనిపించింది. ‘మానవా!’ అంది ఆ వెలుగు. నేను స్వర్గంలో ఉన్నానో, నరకంలో ఉన్నానో అర్థం కాలేదు.అప్రయత్నంగా చేతులెత్తి, ‘స్వామీ’ అన్నాను.‘చూశావుగా! నీ కోరిక ప్రకారం అన్ని వివక్షలూ పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కాని, ఫలితం లేదు. మీలాగే పశు పక్ష్యాదులను కూడా పుట్టిస్తున్నాను. వాటిలో ఈ వివక్షలు లేవే! కేవలం మీలో మాత్రమే ఇవి ఉన్నాయి. అందుకే మారాల్సింది మీరూ మీ ఆలోచనలూ. నేనెన్ని చేసినా ఫలితం ఉండదు. ఇకనైనా దైవదూషణ మానేయి నాయనా! కులం, మతం, పేద, ధనిక, ఆడ, మగలాంటి అడ్డుగోడలు మీరు నిర్మించుకున్నవే! వాటికి దేవుడ్ని నిందించడమేల?’ అంటూ ఆ వెలుగు మాయమైపోయింది.ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. ఎదురుగా నా కొడుకుని ఎత్తుకుని నిలుచుంది నా భార్య.నా కొడుకు ‘ఉయ్’ అన్నాడు. ‘నాన్న అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు’ అన్నట్టు. ‘మళ్ళీ పీడకలా?’ అంది నా భార్య.అవునన్నట్టు తలదించుకున్నాన్నేను.‘చూడు విజయ్! నేనేమీ సుఖ పడట్లేదు. నీకు ఆఫీసు పని ఎలాగో, నాకు ఇంటి పని అలాగ. చెప్పాలంటే నీకన్నా ఎక్కువే కష్టపడుతున్నాను. ఇక సమాజంలో ఉన్న వివక్షల గురించి అంటావా? మనుషులందరూ రకరకాల ముసుగులేసుకుని బతుకుతున్నారు. అవి పోయే దాకా ఈ వివక్షలు ఇలానే ఉంటాయి. అది మన చేతుల్లో లేదు. మనం మంచి పాటిస్తే అదే మిగతా వారికి ఆదర్శప్రాయం అవ్వచ్చు. అలా కొందరైనా మనల్ని చూసి మారొచ్చు. అది మాత్రమే మనం చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? పిల్లాడిలా ప్రవరిస్తున్నావ్’ అంది నా భార్య. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.ఆ క్షణంలో నా భార్య, నాకు జ్ఞానోదయం కలిగించడానికి ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది. -
పోఖరా టు మోతిహారీ
హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్లలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబుపేలుళ్ల కేసులో దోషులైన ఆరుగురిలో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016 డిసెంబర్19న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పునిచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో పాటు ఆరు నగరాల్లో జరిగిన విధ్వంసాలకు సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ భత్కల్. అతడి సోదరుడు యాసీన్ భత్కల్ ఇందులో ప్రధాన పాత్రధారి. రియాజ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. యాసీన్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు 2013 ఆగస్టులో పట్టుకున్నారు.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ మగ్దూం కాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహమ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. ఇంజినీరింగ్ చేయడానికి పుణే వెళ్లిన ఇతడు అక్కడే యునానీ వైద్యుడిగా ఉన్న తన సోదరుడు ఇక్బాల్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రారంభించి, ఇండియన్ ముజాహిదీన్‌లో కీలకంగా మారాడు. ఉగ్రవాదంలో 2007 నుంచి క్రియాశీలంగా ఉంటూ, 2008 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లకు కుటుంబంతో కూడా పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు.ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడిగా యాసీన్ భత్కల్ అనేక విధ్వంసాలకు పథకరచన చేశాడు. టిఫిన్‌బాక్స్, ప్రెషర్ కుక్కర్ బాంబుల తయారీ పద్ధతిని తన అనుచరులకు నేర్పాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా, 2010 ఫిబ్రవరి 13న పుణేలోని జర్మన్ బేకరీ పేలుడుతో ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలోకి చేరాడు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబై తదితర నగరాల్లో 2008–13 మధ్య జరిగిన విధ్వంసాలలో ఇతడి ప్రమేయం ఉండటంతో భద్రతా సంస్థలు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.సాంకేతిక నిఘాకు చిక్కకుండా తప్పించుకుంటున్న యాసీన్‌ను పట్టుకోవడానికి అతడి ఫొటో కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న కొన్నేళ్ల కిందటి ఫొటోతో కొన్నాళ్ల పాటు, 2010లో పాస్‌పోర్ట్ కోసం రాంచీ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆ ఫొటోతో ఇంకొన్నాళ్లు గాలించారు. ఇతగాడు 2008–2011 మధ్య చిక్‌మగళూరు, మంగుళూరు, కోల్‌కతా, చెన్నైలలో ఐదుసార్లు తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. యాసీన్ భత్కల్ను పట్టుకోవడానికి ఢిల్లీ స్పెషల్‌సెల్ అధికారులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. తమ మనిషికి ఉగ్రవాదిగా మార్చి, అతడిని యాసీన్‌కు దగ్గర చేయడం ద్వారా పట్టుకోవడానికి నఖీ అహ్మద్‌ను రంగంలోకి దింపారు. 2012 జనవరిలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నఖీ ఉగ్రవాది అనే ఆరోపణలపై అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యాసీన్‌ను పట్టుకునే మరో దారినీ కోల్పోయారు. ఈ ఉదంతం పెను దుమారం రేపడంతో కేంద్ర హోమ్‌శాఖ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇంతలో చీకట్లో చిరుదీపంలా మాస్టర్జీ చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీకి చెందిన బషర్ హసన్ అలియాస్ తల్హా అలియాస్ మాస్టర్జీని ఢిల్లీ పోలీసులు 2013లో పట్టుకున్నారు. 2007లో రియాజ్, ఇక్బాల్, యాసీన్లతో సన్నిహితంగా మెలిగిన మాస్టర్జీని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆ ముగ్గురూ కొరియర్‌గా వాడుకుంటున్నారని బయటపడింది. రియాజ్, ఇక్బాల్ పాకిస్తాన్‌కు మకాం మార్చాక యాసీన్ మాత్రమే ఇతడితో టచ్‌లో ఉన్నాడు. తనపై నిఘా పెరిగిపోవడంతో సెల్‌ఫోన్ సహా సాంకేతిక అంశాలకు దూరంగా ఉంటున్న యాసీన్ అనేక సందర్భాల్లో మాస్టర్జీని కొరియర్‌గా వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో మాస్టర్జీ చెప్పిన మాటే నేపాల్‌లోని పోఖరా. అత్యవసర పరిస్థితుల్లో తనను కలుసుకోవాలంటే అక్కడకు రమ్మని యాసీన్ చెప్పినట్లు మాస్టర్జీ బయటపెట్టాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు బిహార్ సరిహద్దులోని పోఖరాపై దృష్టి పెట్టాయి. 2013 జూలై 7న బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో భత్కల్, అతడి అనుచరులు ఈ విధ్వంసానికి పాల్పడి, సరిహద్దులు దాటి ఉంటారని అంచనా వేసిన ఐబీ ఇద్దరు బిహార్ అధికారులను రహస్యంగా పోఖరా పంపింది. అక్కడ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు నిఘా అధికారులూ ముఖ్యంగా యునానీ వైద్యులు, అత్తరు వ్యాపారులపై దృష్టి పెట్టారు. కేవలం ఓ వర్గానికి చెందిన వారే ఉన్నా ఎవరూ అనుమానించనివి ఈ రెండు వృత్తులే కావడమే దానికి కారణం. ఓ యునానీ వైద్యశాలలో ఉన్న వైద్యుడు వీరి దృష్టిని ఆకర్షించడంతో అతడిపై నిఘా ఉంచారు. కొన్ని రోజులకు మరో వ్యక్తి వచ్చి యునానీ వైద్యుడితో కలిసి ఉండటంతో అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న పాత ఫొటోల ఆధారంగా నిశితంగా పరిశీలించి, సదరు యునానీ వైద్యుడే తమకు కావాల్సిన యాసీన్ భత్కల్ అని, పక్కనున్నది అసదుల్లా అక్తర్ అని గుర్తించారు. ఇద్దరూ కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వారిని పట్టుకోవడానికి నేపాల్ పోలీసుల సహకారం కోరారు. వారు స్పందించలేదు.చివరకు నేపాల్ పోలీసులకు రూ.50 వేలు లంచం ఇచ్చి, వారి సహకారంతో యాసీన్, అసదుల్లాల్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత తాను యునానీ వైద్యుడినే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించిన యాసీన్ ఎట్టకేలకు నిజం బయటపెట్టాడు. దీంతో ఆపరేషన్ యాసీన్ ముగిసిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు అధికారులు నేపాల్, బిహార్ పోలీసుల సాయంతో వారిని సరిహద్దులు దాటించి 2013 ఆగస్టు 29న జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ)కు అప్పగించగా, బిహార్‌లోని మోతిహారీ కోర్టులో హాజరుపరచారు. ఆ తర్వాత హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు తరలించి విచారించారు. -
తారకాసుర జననం
కశ్యపుడి పెద్ద భార్య దితి కొడుకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు సంహరించాడు. కొడుకుల మరణంతో దితి దుఃఖితురాలై, భర్త శరణు పొందింది. ఆమె అనుగ్రహంతో దితి మళ్లీ గర్భం దాల్చింది. దితికి పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ముప్పు వాటిల్లగలదని తలచాడు ఇంద్రుడు. దితి వల్ల జరిగిన అనాచార దోషాన్ని కనిపెట్టిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి, తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు. అయితే, దితి వ్రత మహిమ కారణంగా ఆ పిండం నశించలేదు. నలభైతొమ్మిది ముక్కలైన ఆ పిండం ద్వారా దితికి నలభైతొమ్మిది మంది కొడుకులు పుట్టారు. వారు మరుత్తులు అనే దేవతలై, ఇంద్రుడి స్నేహాన్ని పొందారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి, మళ్లీ భర్తను సేవించి, గర్భం దాల్చింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు. పేరుకు తగినట్లే అతడు వజ్రసదృశ శరీరుడు. అమిత బలవంతుడు. వజ్రాంగుడు అమిత శివభక్తుడు. నిత్య శివారాధన నియమం తప్పక చేసేవాడు. పెరిగి పెద్దయ్యాక అతడు ఇంద్రుడి మీదకు దండెత్తాడు. ఇంద్రుడిని, అతడి దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఇంద్రుడిని, కొందరు దేవతలను చెరపట్టి, తల్లికి సంతోషం కలిగించాడు. వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవించారు. ఇంద్రుడు సహా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవడంతో స్వర్గం కళ తప్పింది. దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలంటూ బృందారకులు బ్రహ్మదేవుడిని కోరారు. వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్లాడు. సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి, ఇంద్రాది దేవతలందరినీ అతడి చెర నుంచి విడిపించాడు.వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ! ‘ఓ బ్రహ్మదేవా! నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన నాకు అసలే లేదు. నాకు చరమమైన, నిత్యసుఖదాయకమైన ఆత్మజ్ఞానాన్ని బోధించు’ అన్నాడు.అతడి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషభరితుడయ్యాడు. ‘వజ్రాంగా! ఒక్క మాటలో చెబుతున్నాను, విను. జ్ఞాన వైరాగ్యాది సాత్త్విక భావనలే తత్త్వసారం’ అని బోధించాడు. అప్పటికప్పుడు వరాంగి అనే కన్యను సృష్టించి, వజ్రాంగుడికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు.వజ్రాంగుడు పరమ సాత్త్వికుడై వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు. వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్త్విక భావాలు లేనిదై, అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది. ఆమె సేవలకు సంతుష్టుడైన వజ్రాంగుడు, ‘నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. ఏం కావాలో కోరుకో’ అని అడిగాడు.దానికామె, ‘ముల్లోకాలనూ జయించగలిగేవాడు, ఇంద్రుడిని సైతం క్షోభపెట్టగలిగేవాడు అయిన మహా పరాక్రమవంతుడైన కొడుకు కావాలి’ అని అడిగింది.వరాంగి కోరికకు వజ్రాంగుడు విచలితుడయ్యాడు. తన భార్య అసమంజసమైన కోరిక కోరిందే అని కలత చెందాడు. అయినా మాట ఇచ్చాను కదా, ఏం చేయాలనే ఆలోచనతో మీమాంసలో పడ్డాడు. ఆడిన మాట తప్పరాదనే ధర్మానికి కట్టుబడి, తనకు ఇష్టం లేకపోయినా, చివరకు భార్య కోరికను నెరవేర్చాలనే నిశ్చయించుకున్నాడు. ముల్లోకాలను జయించగలవాడు బ్రహ్మ వాక్కుతో తప్ప జన్మించడం సాధ్యం కాదని తలచి, వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ద్వారా వరం పొంది ఇంటికి తిరిగి వచ్చాడు.కొన్నాళ్లకు వరాంగి గర్భం దాల్చింది. నెలలు నిండగానే, మహాకాయుడు అయిన బాలుడు పుట్టాడు. అతడు పుట్టగానే చేసిన రోదనకు ముల్లోకాలలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. దుశ్శకునాలు ఎదురయ్యాయి. భూమిపై ఉల్కలు వర్షించాయి. చెవులు చిల్లులు పడేంత మోతతో పిడుగులు పడ్డాయి. అడవుల్లోని జంతువులు ఆందోళన చెంది, దిక్కుతోచక పరుగులు తీశాయి. నక్కలు ఊళలు పెట్టాయి. కుక్కలు నేలను తవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ, కర్ణకఠోరంగా రోదించాయి. భూమి కంపించింది. సముద్రాలు ఉద్ధృతంగా ఉప్పొంగాయి. ప్రళయ ప్రభంజనంలా పెనుగాలులు వీచాయి. పెనుగాలుల తాకిడికి మహావృక్షాలు నేలకొరిగాయి. మేఘాలు చీము నెత్తురులను వర్షించాయి. పక్షులు గూళ్లు విడిచి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో చాలా పక్షులు చచ్చి నేల రాలాయి. స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం తూలింది. అది చూసి దేవతలంతా భయకంపితులయ్యారు. ఈ ఉత్పాతాలు సమసిపోవడానికి కొన్ని నెలలు పట్టింది.వజ్రాంగుడికి, వరాంగికి పుట్టిన బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడైన తారకుడు తాను బ్రహ్మ గురించి తపస్సు చేస్తానని, తపస్సుకు అనుమతించమని తల్లిని కోరాడు. ఆమె అనుమతించడంతో మధువనానికి చేరుకుని, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొన్ని వందల సంవత్సరాలు అతడు కఠోరమైన తపస్సు సాగించాడు. తపస్సు చేస్తుండగా, అతడి తల నుంచి వెలువడిన తేజస్సు ముల్లోకాలలో మహోపద్రవాన్ని కలిగించింది. దేవతలు భయభ్రాంతులై, ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కించాలంటూ బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నారు.చివరకు బ్రహ్మదేవుడు తారకుడికి ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! నీ తపస్సుకు ముల్లోకాలూ కల్లోలంగా మారాయి. నీ మనోభీష్టమేదో కోరుకో, తప్పక వరమిస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు.‘బ్రహ్మదేవా! ముల్లోకాలలోనూ నన్ను మించిన బలవంతుడు ఎవరూ ఉండకూడదు. శివునికి పుట్టిన కొడుకు ఏనాడు సేనాధిపత్యం వహించి, నాపై ఆయుధ ప్రయోగం చేస్తాడో ఆనాడు మాత్రమే నేను మరణించేలా అనుగ్రహించు’ అని కోరాడు.బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.∙సాంఖ్యాయన -
దేవుని రాజ్యం కన్నీళ్లు లేని రాజ్యం
నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తిపారవశ్యంతో జరుపుకొంటున్నారు. సమాధిని గెలిచిన క్రీస్తు ప్రభుని అపార శక్తిని తలచుకొంటూ ఆయన దివ్యనామాన్ని కీర్తిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేమీ లేదు అంటూ ఆనందిస్తున్నారు. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమున్ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవవరములియ్య వసుధపైని’ అంటూ పునరుత్థానుడైన క్రీస్తును కీర్తించే పాటలను పాడుతూ తరిస్తున్నారు.‘యాత్రికుని ప్రయాణము’ జాన్ బన్యన్ రచించిన ప్రసిద్ధ క్రైస్తవ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తరువాత అనేక భాషల్లోనికి అనువదితమైన పుస్తకం ఇది. ఇంగ్లండులోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో జాన్ బన్యన్ నివసించేవాడు. ఆ కాలంలోని అధికారులు, మతపెద్దలు జాన్ బన్యన్ను సుమారుగా పన్నెండేళ్లు కారాగారంలో ఉంచారు. ఆ ప్రతికూల వాతావరణంలో దేవుడు అనుగ్రహించిన దర్శనం నుంచి పుట్టిన గొప్ప రచన ‘యాత్రికుని ప్రయాణము’. ఈ రచనలో ఒక వ్యక్తి తన పాపభారం నుంచి విముక్తి పొందడానికి పరమపురి వైపు చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరించారు. నాశనపురం నుంచి పారిపోతున్న క్రైస్తవుణ్ణి ఒప్పించి వెనుకకు తేవడానికి పాషాణం, నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు. వారు చెప్పిన దానికి ఒప్పుకోవడం పోయి క్రైస్తవుడు వారినే తనతో వచ్చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. పాపభారం నుంచి విడుదల వెతుక్కుంటూ ఉన్న ఊరును కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం సాధించాలని వెళ్ళిపోతున్నావని పాషాణం ప్రశ్నిస్తాడు. దానికి క్రైస్తవుడు ఇచ్చిన సమాధానం ఇది. ‘నేను అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం సంపాదించుకొనేందుకు వెళ్తున్నాను. శ్రద్ధతో వెదికేవారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది.’ప్రపంచంలో కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా మానవులు వెతుకుతున్నవి రెండు: ఈ భూమ్మీద జీవించినంత కాలం మనశ్శాంతి, చనిపోయిన తరువాత మోక్షం. ఈ విచిత్రమైన విశ్వంలో మానవునికి సాటిౖయెన సృష్టియేదియు లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరచాడు. అయితే, మానవుడు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి, తనను సృజించిన దేవుని మీదే తిరుగుబాటు చేయగా తట్టుకో లేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగ్గరవ్వాలనే కరుణామయునిగా ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితంగా ప్రేమించి, ప్రాణ త్యాగాన్ని చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక.దేవుని ప్రేమను రుచిచూసిన యోహాను అనే భక్తుడు రాసిన సువార్తలో ఓ అద్భుతమైన వాక్యం ఉంది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.’ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాశుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా? నా జీవితం అంకితం నీకే.’ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో పురాతత్త్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ ప్రదేశం మొదట ఫోనీషియన్ కాలనీగా, వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో హస్నోనియన్ పాలనలో బాగా విస్తరించబడింది. ఆ తదుపరి రోమన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానిని స్వయం ప్రతిపత్తిగల నగరంగా ప్రకటించారు. వారి ద్వారా నియమించబడిన హేరోదు రాజు ఈ ప్రాంతాన్ని గణనీయంగా విస్తరించాడు. అతడు అక్కడ ఒక నౌకాశ్రయాన్ని నిర్మించి, ఆ పట్టణాన్ని, ఓడరేవును కైసరు అగస్టస్‌కు ౖకైసరియగా అంకితం చేశాడు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం.పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. సువార్తలలో పిలాతు గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. చరిత్ర కూడా ఆ విషయాలను ధ్రువీకరిస్తుంది. పిలాతు ప్రతిభ కలిగిన నాయకుడు, పాలకుడు. అతడు యూదయ ప్రాంతానికి గవర్నరుగా రోమన్ల ద్వారా నియమించబడ్డాడు. సమర్థంగా పరిపాలించడంలోను తన అధికారంతో అందరినీ అదుపులో ఉంచడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతడు న్యాయదృష్టి గలవాడని, ప్రజాక్షేమం ఎరిగినవాడని అంటారు. రోమన్ల టోపీల మీద ఉండే కైసరు ప్రతిమ విషయంలో యూదులకు, పిలాతుకు ఒకసారి వాదం వచ్చింది. ఎలాంటి ప్రతిమ పరిశుద్ధ పట్టణంలో కనబడకూడదని యూదులు వాదించారు. చివరకు కైసరుకు ఆ విషయాన్ని నేరుగా విన్నవించుకొని యెరూషలేములో ఉన్నంత వరకు రోమా సైనికులు వాటిని ధరించకూడదన్న తీర్పును పొందారు. మరొక సందర్భంలో యెరూషలేములో నీటి కొరతను నివారించడానికి ఓ మంచి కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. అంత పెద్ద పనికి ధనం ఎలా సమకూర్చాలి? దేవాలయం నుండి తీసుకోవాలనుకున్నాడు. యూదులు నిరాకరించారు. నీటి సరఫరా మెరుగుపడితే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉన్నప్పటికీ యూదు నాయకులు ఒప్పుకోలేదు. వీధులలో ప్రదర్శనలు జరిగాయి. తిరుగుబాటు జరిగింది. అప్పుడు పిలాతు సైనికులను మారువేషాల్లో జనంలో కలిసిపోయేలా చేసి, అంతా ఆదమరచి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలోనే హఠాత్తుగా ఊచకోత కోయించాడు. యెరూషలేము వీధుల్లో రక్తం ఏరులై పారింది. యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చుటకు పిలాతు వద్దకు తీసుకెళ్ళారు. ఆ దినాల్లో యూదుల పెద్దలకు ఎవ్వరికీ మరణ శిక్ష విధించే అధికారం లేదు. యేసుకు మరణశిక్ష విధించబడాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా పిలాతు ముందుకు తీసుకొచ్చారు. తనకెదురైన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మొదటిసారి ‘మీరతనిని తీసుకొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి’ అన్నాడు. రెండవసారి హేరోదు దగ్గరికి పంపివేయాలని చూశాడు. యేసును శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని సానుభూతిని రేకెత్తించి తప్పించుకోవాలనుకున్నాడు. బరబ్బను తీసుకొని వచ్చి వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోమనడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. చివరికి నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి’ అని చెప్పాడు. యేసుక్రీస్తునకు అన్యాయపు తీర్పు తీర్చబడినది. సిలువను భుజమున మోపి యెరూషలేము వీధుల్లో ఆయన్ను నడిపించి, చివరకు కల్వరి అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి, ఆయనకు సిలువ మరణాన్ని విధించారు. ప్రస్తుత దినాల్లో యెరూషలేము సందర్శించే ప్రతి ఒక్కరూ వయా డొలోరొసా అని పిలువబడే సిలువ మార్గంలో నడుస్తారు. అందులో 14 విశిష్ట ప్రాంతాలుంటాయి. మొట్టమొదటిగా చంద్రుని మీద కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ యెరూషలేమును దర్శించినప్పుడు క్రీస్తు సిలువబాటలో నడిచాడు. ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడ్చి ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకు అంతగా చలించిపోయారని ఎవరో అడిగితే నీల్ ఇలా సమాధానమిచ్చాడు. ‘నేను లక్షల మైళ్ళు ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా ఇంతటి ఉద్వేగానికి లోనవలేదు గాని క్రీస్తు ప్రభువు సంచరించిన ప్రాంతాలను నా పాదాలు తాకినప్పుడు కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది.’ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాల ముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలలో కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించుము’’ అని చెప్పెను (లూకా 23:34).యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికీ, వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. పగలను ప్రతీకారేచ్ఛలను మనసులో ఉంచుకున్నంత కాలం మనిషి సంతోషంగా ఉండలేడని వైద్యులు చెబుతున్న సత్యం. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో తెలిసి తెలిసి ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)’యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరో ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారి పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాప పడకుండా ఆయనను దూషిస్తూ ‘నీవు క్రీస్తువు గదా! నిన్ను నీవు రక్షించుకొని, నన్ను కూడా రక్షించు’మని హేళనగా మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో లేదు. రెండోవాడు మాత్రం అతనిని వారించి, యేసువైపు చూచి ‘నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’మని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు’ అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం. ‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’ – (యోహాను 19:26,27). యేసుక్రీస్తు తనను నమ్ముకున్న వారిని ఏనాడూ ఒంటరిగా విడువడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనా పాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. అంతటి మరణ వేదనలో సైతం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను’– (మత్తయి 27:45).ఈ మాట అరమేయిక్ భాషలో ప్రభువు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. ప్రభువు పలికిన ఈ మాటకు ‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి’ అని అర్థం. మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇల వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. అయినా ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ‘దప్పిగొనుచున్నాను’ (యోహాను 19:28)యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలను అనుభవించాడు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యాలను చేశాడు. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడ్డాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం! ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘సమాప్తమైనది’ (యోహాను 19:28).ఇది విజయానందంతో వేసే జయకేక. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి, సాధించాక వేసే కేక. మరింతకు ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానంద కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో ఆకస్మికంగా రాలేదు. ఒక పరమార్థం కలిగి తండ్రి పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు, దానిని నెరవేర్చుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కాని, దానిని నెరవేర్చి మనుషులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోష కేక వేసారు. ‘తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంటున్నాను’– (లూకా 23:46).ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ, మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన చివరి మాట ‘అప్పగించుకొంటున్నాను’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవునికి అప్పగించుకోవాలి. ఈ లోకంలో ఎలా బతికినా, చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమేకాదు, లోపల ఆత్మ కూడా ఉంది అని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి.యేసు సిలువలో చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు అనే ధనికుడు యూదుల న్యాయసభ సభ్యుడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడుగుతాడు. పిలాతు అంగీకారాన్ని తెలిపిన పిమ్మట యేసు దేహాన్ని సిద్ధపరచి తన సమాధిలో ఉంచాడు. ఆ సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము కూడా సహకరిస్తాడు. దుఃఖ వదనాలతో బహుశా ప్రతి ఒక్కరూ ఆ సాయంత్రం తమ గృహాలకు వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో యేసును అపరిమితంగా ద్వేషించిన యూదా పెద్దలకు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి సమాధిని కాపలా కాయుటకు కావలివారు కావాలని అడిగారు. వారు రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చేసరికే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చేశారు. మరణపు ముల్లు విరిచివేయబడింది. మరణపు మెడలు వంచబడ్డాయి. తరతరాలుగా మనిషిని బంధించి యుంచిన మరణం నిర్వీర్యమై పోయింది. ఆ తెరువబడిన సమాధి నుండి వారికి దూత ద్వారా వచ్చిన సందేశం ఇది. ‘మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.’ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలోని యేసుక్రీస్తు ఖాళీ సమాధికి వెళ్తే ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. క్రీస్తు పునరుత్థానం ప్రవక్తల ద్వారా ముందే ప్రవచించబడింది. తాను మరణించక మునుపు అనేకసార్లు తన పునరుత్థానం గురించి క్రీస్తు తెలియచేశాడు. పునరుత్థానుడైన క్రీస్తు తన దర్శన భాగ్యాన్ని అనేకులకు ఇచ్చాడు. ఐదువందల మందికి పైగా సజీవుడైన క్రీస్తును కన్నులారా చూశారు. ఆయన మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. ఏళ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకాలతో ఆనందించే అవకాశం కలిగింది. రోగం మీద, వ్యాధి బాధల మీద సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కలిగించింది. ఇంతవరకు మానవాళి మీద çపంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.సమాధికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని, ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇవి మానవ హృదయాలకు సంబంధించినది తప్ప భౌతికానుభవాలకు చెందినవి కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ ఇట్టే అవగతమవుతుంది. లోక వినాశానానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది.యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవులకు చేకూరిన ప్రయోజనాలు ఇవి. సమాధానం: యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దాన వచనం ‘సమాధానం కలుగును గాక!’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. భయపడకుడి: పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా పొందుకునే మరొక వాగ్దానం ‘భయపడకుడి’. లోకమంతా ఎన్నో భయాలతో నిండినది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం తప్పక స్వంతం అవుతుంది.నిరీక్షణ: యేసుక్రీస్తు మొదటగా లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగి లేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్ర జీవితాన్ని, ఆయన యందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశపడతారు కాని, ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జర్మనీలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని, సగటు మనిషి బానిసగానే ఉన్నాడని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వల్ల రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురుతిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే!ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశా నిస్పృహలతో తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడిరది. జర్మనీలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిట’ని ప్రశ్నించాడు. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. ‘నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా!’ లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికీ బెదిరిపోడు. తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే, లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. -
పెట్స్‌కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్‌లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్‌ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్‌తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్‌తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్‌లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్‌లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి: -
హనుమద్వ్రత మహిమ
కౌరవులతో జరిగిన మాయద్యూతంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు. ద్రౌపదీ సమేతంగా పాండు నందనులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అడవులలో సంచరిస్తూ నానా ఇక్కట్లు పడసాగారు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు శిష్యసమేతంగా పాండవులనే అనుసరిస్తూ అరణ్యమార్గం పట్టాడు. అరణ్యవాస కాలంలో ధౌమ్యుడు పాండునందనులకు అనేక ధర్మశాస్త్రములు, పురాణాలను చెబుతూ ఉండేవాడు. వారి చేత సమయానుకూలంగా పూజ పురస్కారాదులు చేయిస్తూ ఉండేవాడు.కొన్నాళ్లకు పాండవులు ద్వైతవనానికి చేరుకుని, అక్కడ మకాం వేశారు. పాండవులను చూడటానికి ఒకనాడు వ్యాస మహర్షి ద్వైత వనానికి చేరుకున్నాడు. ధర్మరాజు, ఆయన నలుగురు సోదరులు, ధౌమ్యుడు, ఆయన శిష్యులు ఎదురేగి వ్యాస మహర్షిని సగౌరవంగా స్వాగతించారు. ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాలను సమర్పించి, అతిథి సత్కారాలు చేశాడు. పాండవుల యోగక్షేమాలను వ్యాసుడు పేరు పేరునా అడిగి తెలుసుకున్నాడు. ద్రౌపది పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు.‘మహర్షీ! ఎన్నడూ ధర్మం తప్పని మాకు ఈ అరణ్యవాస క్లేశమెందుకు సంభవించింది? తెలిసి గాని, తెలియక గాని మా వల్ల జరిగిన అపరాధం ఏదైనా ఉందా? తెలిసీ తెలియక అపరాధం చేసిన ఫలితంగానే ఈ ఇడుములు సంభవించినట్లయితే, దానికి పరిహారమేదైనా ఉందా?’ అని ధర్మరాజు సవినయంగా వ్యాసుడిని అడిగాడు.‘నాయనా, యుధిష్ఠిరా! నీ సోదరుడు అర్జునుడు తెలిసీ తెలియనితనంతో ఒకసారి హనుమంతుడి పట్ల అపచారం చేశాడు. దాని ఫలితంగానే మీకు ఈ ఇక్కట్లన్నీ వచ్చి పడ్డాయి. రాజసూయం విజయవంతంగా చేసిన ఆనందంలో మీరంతా ఇంద్రప్రస్థంలో తులతూగుతూ ఉన్న కాలంలో ద్రౌపది హనుమద్వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది. సంకల్పానికి చిహ్నంగా పవిత్ర తోరాన్ని ధరించింది. అర్జునుడు ఆమె చేతికి ఉన్న తోరాన్ని గమనించాడు. అదేమిటని అడిగాడు. హనుమద్వ్రతం చేసే సంకల్పంతో కట్టుకున్న పవిత్ర తోరమని ద్రౌపది చెప్పింది. ఈ వ్రతం చేయమని తనకు శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పింది. తన రథం మీదనున్న జెండాపై ఉండేవాడు ఒకరు, తన రథాన్ని తోలేవాడు ఇంకొకరు. వీరిద్దరూ తనకంటే అధికులా అనే అహంకారంతో అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న ఆ తోరాన్ని తీసేయించాడు. పూజలు వ్రతాలు దేవతలకు చేయాలి గాని, ఒక వానరానికి చేయడమా అని ఈసడించాడు. ద్రౌపది విలపిస్తూ తోరాన్ని తీసేసింది. ఫలితంగా తాను సంకల్పించిన వ్రతాన్ని ఆమె చేయలేకపోయింది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు చేయవలసిన పవిత్ర వ్రతం అది. ద్రౌపదికి వ్రతభంగం జరిగిన కారణంగానే మీకు ఇక్కట్లు మొదలయ్యాయి. పదమూడేళ్లు మీకు ఈ కష్టాలు తప్పవు. ఆ తర్వాతనైనా సకల శుభాలు జరగాలంటే, ఈ వనవాసకాలంలోనే హనుమద్వ్రతం చేయడం మంచిది’ అని చెప్పాడు వ్యాసుడు.అక్కడే ఉన్న ద్రౌపది తనకు వ్రతభంగం కలిగిన మాట నిజమేనని చెప్పింది. అర్జునుడు తానే ఆమె చేతికి ఉన్న తోరాన్ని తీసివేయించానని పశ్చాత్తాపంతో చెప్పాడు.‘సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఇప్పటికైనా ఆచరించడమే మీకు శ్రేయస్కరం’ హితవు చెప్పాడు వ్యాసుడు.‘వ్రత విధానం ఏమిటో సెలవివ్వండి మహర్షీ!’ అని ప్రార్థించాడు ధర్మరాజు.‘మార్గశిర శుక్ల త్రయోదశి రోజున హనుమంతుడి విగ్రహాన్ని గాని, చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించి పూజించాలి. హనుమంతుడి శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపా కలశంలోకి ఆవాహన చేసి, కలశ స్థాపన చేయాలి. వ్రతానికి ఉపక్రమించే ముందు, వ్రత సంకల్పాన్ని చెప్పుకుని, వ్రతాన్ని ఆచరించేవారు పవిత్ర తోరాన్ని ధరించాలి. పుష్పాక్షతలతో వ్రతపూజ చేయాలి. హనుమంతుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. వ్రతపూజ తర్వాత హనుమత్ కథల శ్రవణం చేయాలి. ఆ తర్వాత హనుమత్ ప్రసాదాన్ని ఆరగించాలి. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా పదమూడు సంవత్సరాలు హనుమంతుడిని ఆరాధిస్తే, సంపూర్ణంగా హనుమంతుడి అనుగ్రహం లభించి, ఆపదలు, గ్రహబాధలు, రోగపీడలు, శత్రుబాధలు తొలగుతాయి. సకల సంపదలు, సుఖశాంతులు దక్కుతాయి’ అని వివరించాడు వ్యాసుడు. అంతేకాకుండా, హనుమంతుడి మహిమను తెలిపే కథలను ఆయన పాండవులకు చెప్పాడు. వనవాస కాలంలో సాక్షాత్తూ శ్రీరాముడు సుగ్రీవాదులతో కలసి పంపాతీరాన హనుమత్ వ్రతాన్ని ఆచరించాడని, ఆ తర్వాత లంకపై వానర సేనతో కలసి దండెత్తి, రావణ సంహారం చేయగలిగాడని చెప్పాడు.ద్వైతవనంలో పాండవులతో కొన్నాళ్లు గడిపి వ్యాసుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మార్గశిర మాసం వచ్చింది. వ్యాసుడు చెప్పినట్లుగానే ద్రౌపదీ సమేతంగా పాండవులు ధౌమ్యుడి ఆధ్వర్యంలో హనుమత్ వ్రతాన్ని ఆచరించారు. నియమం తప్పకుండా పదమూడేళ్లూ పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సకల శుభాలు కలిగాయి. అర్జునుడి జెండాపై పరివేష్ఠితుడైన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తుదముట్టడంతో పాండవులకు రాజ్యం దక్కింది. ∙సాంఖ్యాయన -
యువ కథ: సింహాసనం
‘లైట్స్.. కెమెరా.. యాక్షన్!’ అన్నాడు డైరెక్టర్ బాలరాజ్ వర్మ. ట్రైన్ సెట్లో హీరోయిన్ సనుష దాస్‌ను చుట్టుముట్టిన రౌడీల బారి నుంచి హీరో నితీష్ కాపాడే సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఒకే షాట్లో తీయాల్సిన కీలకమైన సన్నివేశం కావటంతో సినిమా యూనిట్ మొత్తం చాలా ఏకాగ్రతతో ఎవరి పని వారు చేస్తున్నారు. ఇంతలో గేదెల అరుపులకు షాట్ ఫెయిల్ అయింది. ఆ షాట్ బాగా రావటం కోసం చాలా ప్రాక్టీస్ చేసిన నితీష్‌కు పట్టరాని కోపం వచ్చింది. అ కోపంలో నితీష్ ‘ఎవడ్రా! ఆ గేదెలను ఇక్కడికి తీసుకువచ్చింది?’ అంటూ గట్టిగా అరిచాడు.‘గేదెల దొడ్లో గేదెలు కాక గాడిదలు ఉంటాయా? అడ్డ గాడిద!’ అని అరుస్తూ కుడితి నీళ్ళు నితీష్ మొఖం మీద కొట్టి నిద్రలేపాడు నూకరాజు.‘మంచి కల పాడు చేశావ్ కదా నాన్నా! నా జీవితంలో నిద్రలో వచ్చే కలలు కూడా పూర్తి అవ్వవు. ఛీ!’ అంటూ లేచాడు నితీష్,‘ఏడిసావులే గాని గేదెలను తోలుకుపోయి, అందరికీ పాలు పోసి రా! లేట్ అయిందని నాకు మాట వస్తే నిన్ను బిందెట్టుకు కొడతా’ అన్నాడు నూకరాజు.బద్ధకంగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు నితీష్.సైకిల్ స్టాండ్ తీసి, ప్రతి రోజులాగానే గేదెలను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పోశాక మేనమామ సుంకరరాజు ఇంటికి వచ్చాడు. ‘ఏరా! ఈ మధ్య కనపడటం లేదు. బొత్తిగా ఇంటికి రావటం మానేశావ్?’ అన్నాడు సుంకరరాజు. ‘అదేంలేదు.. కొత్త ఇల్లు కడుతున్నాము కదా! అక్కడే దగ్గర ఉండి చూసుకుంటున్నా మావయ్య!’ అన్నాడు నితీష్. ‘దానితో పాటు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదరా! యాక్టర్, ట్రాక్టర్ అంటూ ఖాళీగా ఎన్నాళ్లు ఉంటావ్?’ అన్నాడు సుంకరరాజు. ఆ ఉచిత సలహా విన్న నితీష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ‘అన్నట్టు చెప్పటం మర్చిపోయా. నిన్ననే స్నేహకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. హైదరాబాద్‌లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకి లక్షన్నర జీతం. రెండు నెలలలో పెళ్లి అనుకుంటున్నాము. నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి’ అన్నాడు సుంకరరాజు. ఇంతలో నితీష్ మరదలు స్నేహ ఇంటి డాబాపై నుంచుని సిగ్గు పడుతూ, సెల్ ఫోన్లో మాట్లాడటం చూశాడు నితీష్. ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్ధం చేసుకున్న నితీష్, ‘సరే మావయ్య! ఉంటాను’ అని వెనుదిరిగాడు.పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నితీష్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నెమ్మదిగా అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను ఒక నిమిషం పాటు చూసుకుంటూ ఉండిపోయాడు. నితీష్ కళ్ళు ఎర్రబడ్డాయి. కుడి చేతి పిడికిలి బిగుసుకుంది. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది ఆ ఒక్క నిమిషం. తనలో పీకల వరకు నిండిపోయిన బాధని, కోపాన్ని, నిస్సహాయతను దిగమింగుకున్నాడు. రోజూలాగే తనకు ఇష్టమైన నటులు ఎన్టీఆర్, విక్రమ్ నటించిన సినిమాలు అన్నీ అదే పనిగా చూసి, వాటినే తనదైన శైలిలో సాధన చేయటంతో ఎప్పటిలాగే సమయం తెలియకుండానే గడిచిపోయింది.సాయంత్రం సుమారు ఐదు గంటలకి స్నేహితుడు జాన్‌బాబుతో కలిసి వీధి చివర టీ షాపుకి వచ్చి కూర్చున్నాడు. నితీష్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చోడం గమనించిన జాన్‌బాబు మళ్ళీ ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ‘ఇదిగోరా టీ..’ అని టీ గ్లాసు చేతికి అందించాడు. ఇంతలో గట్టునాని, అతని స్నేహితులు వచ్చి ఎదురు బెంచీ మీద కూర్చున్నారు. నానికి, నితీష్‌కు స్కూల్లో చదువుకునే రోజుల నుంచి వైరం ఉంది. అది తెలిసిన జాన్ అక్కడి నుంచి త్వరగా టీ తాగి నితీష్‌ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు.కానీ నివురుగప్పిన నిప్పులా లోపల రగిలిపోతూ బయటకి ప్రశాంతంగా కనిపిస్తున్న నితీష్‌తో ‘ఏరా! ఆ సర్పంచ్ బావమరిది సినిమాలో వేషం ఇస్తా అని రెండు లక్షలు దొబ్బేశాడంటగా?’ అన్నాడు నాని. చేతిలోని టీ గ్లాసుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నితీష్. ‘అయినా నీ మొఖానికి సినిమాలు ఎందుకురా? మా ఫెర్టిలైజర్స్ కంపెనీ యాడ్‌కి కూడా పనికిరావు’ అన్నాడు నాని వెటకారంగా. చుట్టూ ఉన్న అందరూ నవ్వడం చూసి జాన్, నితీష్ భుజం మీద చేయి వేసి ‘పద వెళ్దాం’ అన్నాడు. నితీష్ ఇంకా ఆ టీ గ్లాస్‌నే చూస్తూ అలా ఉండిపోయాడు.‘అవును స్నేహ నిన్ను వదిలేసిందంటగా! మంచిపని చేసిందిరా బాబు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి’ అన్నాడు నాని. నితీష్ చేయి బిగుసుకుంది. చేతిలో ఉన్న టీ నాని మొఖం మీద కొట్టి, రెప్పపాటులో నాని చేయి వెనక్కి వంచి పక్కనే ఉన్న నారింజ మిఠాయి సీసాతో తల పగలగొట్టాడు. వెంటనే నాని స్నేహితులు నితీష్, జాన్ మీద పడి, పిడిగుద్దులు కురిపించారు. నితీష్ దొరికినవాడినిదొరికినట్టు కొడుతూ పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసి జాన్‌తో కలిసి ఆరోజుకి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.రాత్రికి ఇంటికి చేరుకున్న నితీష్, కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న నూకరాజు, నితీష్ చేతి మీద మొఖం మీద గాయాలు చూశాడు. ‘మళ్ళీ దెబ్బలు తిన్నావా?’ అన్నాడు నూకరాజు అనుమానంగా చూస్తూ.‘లేదు ..ఈసారి వాడి బుర్ర పగలగొట్టా’ నసిగాడు నితీష్ కోపంగా.‘అబ్బో! చాలా గొప్ప పని చేశావ్. థూ.. ఏం బతుకురా నీది? ముడ్డి కిందకి పాతికేళ్లు వచ్చినా, వయసు మళ్లిన నాన్న గురించి గాని, మంచం పట్టిన అమ్మ గురించి గాని ఏరోజైనా ఆలోచించావా? అదిగో బయట దొడ్డిలో గేదెల దగ్గర పడుకుంటావు కదా! అవి కనీసం పెట్టిన తిండికి తిరిగి పాలైనా ఇస్తాయి. నీ కన్నా అవే నయం. ‘అమ్మకి ఏమయింది?’ అని చిన్నప్పటి నుంచి అడుగుతున్నావు కదరా. ఇప్పుడు విను.. నీ చిన్నప్పుడు నువ్వు బావిలో పడబోతుండగా నిన్ను కాపాడి తలకి దెబ్బ తగిలించుకుని మంచం పట్టింది. ఆరోజు నిన్ను కాపాడకపోయినా బాగుండు’ అని కోపంగా తింటున్న కంచంలో చేయి కడుక్కుని లేచి వెళ్లిపోయాడు నూకరాజు.మరుసటి రోజు ఉదయం నూకరాజు లేచి చూసేసరికి, నితీష్ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఊరంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి జాన్ ఫోన్‌కి నితీష్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘నేను హైదరాబాద్ వెళుతున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. సినిమా హీరో అయ్యాకనే మళ్ళీ అనకాపల్లిలో అడుగు పెడతా. లేకపోతే నా శవం కూడా ఎవరికీ దొరకదని నాన్నకి చెప్పు’ అని ఉంది.నితీష్ తన సైకిల్ అమ్మేయగా వచ్చిన మూడువేల రూపాయిలు, రెండే జతల బట్టలతో మర్నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఫిల్మ్ నగర్ దగ్గరలో జూనియర్ ఆర్టిస్టులు ఉండే ఒక అతి చవక హాస్టల్లో దిగాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. నితీష్ హాజరు కాని స్టూడియో లేదు. ముట్టుకోని డైరెక్టర్ ఇంటి గేట్ లేదు. ఎంత నిరాశ ఎదురు వచ్చినా అది నితీష్ ముఖంలో కనపడలేదు. ఆరోజు అర్జున స్టూడియోస్‌లో డైరెక్టర్ రాజకుమార్ పూర్తిగా కొత్త నటీ నటులతో ఒక సినిమా కోసం ఆడిషన్ చేయబోతున్నాడని తెలిసింది నితీష్‌కి. తన వివరాలు, నటించిన వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈసారి నిరాశ ఎదురవలేదు.‘వచ్చే ఆదివారం మీరు తప్పక హాజరు కాగలరు’ అని సమాధానం వచ్చింది. ఈ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు.చివరికి ఆడిషన్‌కు హాజరయ్యి రంగస్థలం మీద అడుగు పెట్టాడు. అందరూ అనుకుంటున్నట్టు డైరెక్టర్ ఆ క్యారెక్టర్‌కి రాసిన డైలాగులు చూసి తనదైన శైలిలో చెప్పమని అడగలేదు. ‘ఇప్పటిదాకా నీ జీవితాన్ని, కొన్ని మరచిపోలేని సంగతులని నీ శైలిలో చెప్పు’ అన్నాడు డైరెక్టర్. అలా చేయటం నితీష్‌కి కొత్త అయినప్పటికీ రెండు నిమిషాలు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని నోరు విప్పాడు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను కన్న తల్లి ఎందుకు మంచం పట్టిందో నిన్నటి వరకు తెలుసుకోలేని మూర్ఖుడిని. వయసు మళ్లిన, అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఆనందంగా చూసుకోకపోగా, నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని నా వయసు ఉన్న మిగతా అబ్బాయిల్లాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, నా తరఫు నుంచి ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా, పందికొక్కులా మొత్తం గుల్ల చేస్తున్న నీచమైన కొడుకుని నేను. ప్రాణంగా ప్రేమించి తనతో ఒక జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి, డబ్బు పరపతి లేకపోతే ముఖం కూడా చూడదని గ్రహించలేకపోయిన మూర్ఖపు ప్రేమికుడిని. కాని, ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలను. ఎదురుదెబ్బ ఎటువైపు నుంచి అయినా రానీ, ఎలాగైనా రానీ వాటిని వంచి ఈ సినిమా అనే సింహాసనం మీద ఎక్కి కూర్చుంటా!’ అన్నాడు నితీష్ ఉద్వేగంగా.నితీష్ ప్రదర్శన చూసి డైరెక్టర్‌తో సహా మిగతా సభ్యులు కూడా చలించిపోయారు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. మరుసటి రోజు ఉదయం అసిస్టెంట్ డైరెక్టర్ బాబీ నుంచి కాల్ కోసం చూస్తూ కూర్చున్నాడు.ఏకంగా డైరెక్టర్ రాజకుమార్ నుంచే కాల్ రావటంతో నితీష్ రెట్టించిన ఉత్సాహంతో ‘హలో! సర్!’ అన్నాడు. ‘గుడ్ మార్నింగ్ నితీష్! మనం ఈ సినిమా చేస్తున్నాం.. ప్రొడ్యూసర్‌కి నీ బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చింది. నీ ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మేము అనుకుంటున్న విలియమ్ పాత్రకి వంద శాతం కుదురుతుంది’ అన్నాడు డైరెక్టర్ రాజకుమార్.‘కానీ సర్! నేను ఆడిషన్ ఇచ్చింది హీరో క్యారెక్టర్‌కి కదా సర్?’ అన్నాడు నితీష్.‘హహ.. నువ్వు స్క్రిప్ట్ చదివాక విలియమ్ క్యారెక్టరే చేస్తాను అని అడుగుతావ్’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్!’ అన్నాడు నితీష్ ‘నీకు ఆకామడేషన్, కారు ప్రొడ్యూసర్‌గారు అరేంజ్ చేశారు. ఈవెనింగ్ షిఫ్ట్ అయిపో. నెక్స్›్టవీక్ నుంచి షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్! థాంక్ యు సో మచ్’ అన్నాడు నితీష్ ఆనందంగా. అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. వెంటనే నితీష్ వాళ్ళ నాన్న నూకరాజుకు ఫోన్ చేసి ‘అమ్మని తీసుకు వచ్చేయమని జాన్‌కి చెప్పు‘ అన్నాడు. ‘పెద్ద నటుడిని అయినప్పుడే వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోయావుగా? అది పూర్తిచేసి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు’ అని కాల్ కట్ చేశాడు నూకరాజు. రెండు నిమిషాలు బాధ పడినా నితీష్ మళ్ళీ తన యాక్టింగ్ సాధన కొనసాగించాడు. ఆరోజు ఏప్రిల్ 2, అర్జున స్టూడియోస్‌లో రెగ్యులర్ షూట్ డే1. అదే రోజు స్నేహకి మరొకరితో అనకాపల్లిలో పెళ్లి కూడా. నితీష్ తన కారు నుంచి బయటకి రాగానే డ్రైవరు గొడుగు పట్టుకున్నాడు. మరో పక్క స్నేహని పెళ్లికి ముస్తాబు చేసి బాజా భజంత్రీలతో కళ్యాణమండపం వైపు తీసుకువెళుతున్నారు.. యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఉంది. నితీష్ తన వైపు తరుముతూ వస్తున్న వ్యక్తిని తన చేతిలో ఉన్న చైన్‌తో మెడకు కట్టి ఐదో అంతస్తు నుంచి తోసి ఉరివేసి వేలాడతీసే సీన్. మరో పక్క స్నేహ పెళ్లి పీటల మీద తల వంచి తాళి కట్టించుకుంటోంది. నితీష్ ఆ రోజు షూటింగ్లో ఎంతగా నిమగ్నం అయ్యాడంటే స్నేహ పెళ్లి రోజు కూడా మర్చిపోయేంత. సంవత్సరం గడిచింది సినిమా విడుదలై రెండు రోజులు అయింది, ఏ టీవీ చానల్ చూసినా, సోషల్ మీడియా చానల్ చూసినా నితీష్ గురించి, నితీష్ నటన గురించే చర్చ. ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా ఐదు సినిమాలలో హీరోగా నటించేందుకు సంతకం చేశాడు. స్నేహ సీమంతం జరుగుతోంది. నితీష్ తండ్రి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చే జనాల తాకిడి ఎక్కువ అయింది. ‘బహుశా అల్లుడుగారు ఎక్కువ మందిని పిలిచి ఉంటారు’ అనుకున్నాడు సుంకరరాజు. ‘ఎవరయ్యా రెండు సింహాసనాలు తెచ్చింది? ఇది సీమంతం. పెళ్లి కాదు. ఒకటి సరిపోతుంది .రెండోది తీసుకుపొండి’ అన్నాడు. సుంకరరాజు. చూస్తూ ఉండగానే సుంకరరాజు ఇల్లు ఉండే ప్రాంతం అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో జనసంద్రం అయిపోయింది. అప్పటికి గాని అర్థంకాలేదు వాళ్ళు అందరూ సుంకర రాజు మేనల్లుడు హీరో నితీష్‌ని చూడటానికి వచ్చిన జనం అని.ఇంతలో ఒక వోల్వో కారు సుంకరరాజు ఇంటి ముందు ఆగింది. సూట్ వేసుకుని కారు దిగుతున్న నితీష్‌ని చూసి నూకరాజు, సుంకరరాజుల నోటి వెంట మాట రాలేదు. మేనల్లుడికి ఎదురెళ్లి దగ్గర ఉండి లోపలకి తీసుకు వస్తూ ‘నువ్వు వస్తావ్ అనుకోలేదు రా! చెప్పి ఉండాల్సింది కదరా!’ అన్నాడు.‘ఇలా వస్తా అని నేనూ అనుకోలేదు మావయ్య!’ అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు నితీష్. ఆ మాటలకి ఎలా స్పందించాలో తెలియని సుంకరరాజు ఒక అర నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. జనంలో నుండి ఇంటి లోపలికి వచ్చిన నితీష్ స్నేహకి ఎదురుగా రెండో సింహాసనంలో కూర్చున్నాడు. అక్షింతలు వేస్తూ రెండు లక్షల రూపాయల చెక్ అందిస్తూ ‘పుట్టబోయే బిడ్డ అవసరాలకి ఉపయోగపడతాయి’ అన్నాడు నితీష్. అక్కడ నుండి నితీష్‌తో కలిసి వెళ్లిపోతున్న జాన్ గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ‘అల్లుడుగారికి నెలకి లక్షన్నర అంటగా జీతం. మా వాడికి నెలకి కార్ పెట్రోల్‌కే రెండు లక్షలైపోతోంది. పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది’ అని చురక అంటించాడు.‘ఆడు నా మేనల్లుడు. ఆడెప్పుడూ నాకు అల్లుడే రా! ఆడంత గొప్పోడవుతాడని, ఏదోరోజు సింహాసనం మీద కూచుంటాడని నాకు ముందే తెలుసురా జాన్ బాబు! మా స్థాయి సరిపోదనే పిల్లని ఆడికివ్వలేదు’ అన్నాడు సుంకరరాజు తెలివిగా! తన తెలివికి తనే మురిసిపోతూ. -
ఈ వారం కథ:: సుందరరామయ్య@ 70
‘తాతగారూ!’ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు వొళ్లు మండి వెనక్కి తిరిగి చూశాడు!సందేహం లేదు. పిలిచింది తననే. పిల్చిన శాల్తీ చిన్న పిల్లేంకాదు, సుమారు నలభై యేళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనసు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకి తను తాతగారా? ఆవిడగారి వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తీరా తిరగబడి ఆవిడ వయసడిగి దులిపేద్దామనుకునేలోగా తిరిగి ఆమే నోరువిప్పింది. ‘తాతగారూ, ఒరిజనల్స్ తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ! తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కున చల్లారిపోయింది. జెరాక్స్ కాపీలు మాత్రం తీసుకొని ఒరిజనల్సే మర్చిపోయి, నెట్‌సెంటర్ నుంచి బయటకొస్తున్న సుందర రామయ్య నాలుక కరచుకొని వెనక్కువెళ్లి ఆవిడకు‘థాంక్స్’ చెప్పి మరీ అవి తీసుకున్నాడు.తనకిష్టం లేని పదం ‘తాతగారు’. తానంత ముసిలోడిలా కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే ‘అంకుల్’ అనే పదముందిగా? తనను అంకుల్ అనో, మాస్టారూ అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే ‘బాబాయి’అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాపు మెట్టుదిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకొచ్చాడు.çస్కూటర్ ‘సెల్ఫ్‌స్టార్ట్’ కాక అవస్థలు పడుతూ నిట్టూరుస్తుండగా, నెట్సెంటర్కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామీ ఆగి ‘మాష్టారూ, మెయిన్ స్టాండ్ వేసి ‘కిక్’ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వెయ్యడానికి శక్తి చాలని సుందరరామయ్య ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి ‘అలవాటు లేదు’ అంటూ సాయం చేయ్యమన్నట్టు చూశాడు. విషయం అర్థమైన ఆ మనిషి అవలీలగా మెయిన్ స్టాండ్ వేసి, స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. ‘«థాంక్సండి’ అంటున్న సుందరరామయ్యను ‘అండి’ అనకండి గురువుగారూ, నేను మీ స్టూడెంట్‌నే, గుర్తుపట్టలేదా?’ అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా! ‘మాష్టారూ, మీరు కింగ్‌లా వుండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు!’ అని కామెంట్ చేసి వెళ్ళడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలి పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండుమీద కారం చల్లినట్టయింది. ‘తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోడానికి కొందరు ఇలాగే విమర్శలు, ఎదురుదాడి చేస్తుంటారు. తన శిష్యుణ్ణని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్నా నిక్షేపంలాంటి జుట్టు వుంది. అది చూసి అసూయపడి తన శరీర పటుత్వం గురించి వాగి వుండొచ్చు’ అని సరిపెట్టుకొని సుందరరామయ్య స్కూటరెక్కాడు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి, అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్‌సెంటర్ నిర్వాహకురాలి మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి ‘షాకు’లు రాళ్లలా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. ఆ మధ్య పూర్వవిద్యార్థులు తారసపడితే ‘మాష్టారూ మీలో మార్పులేదు. అప్పుడెలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు’ అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది డెబ్బైయవ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎదురయిన వాళ్లు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలు అడక్కుండానే– ‘íపిడుగులా వుండేవారు మాష్టారు, బాగా పాడయిపోయారు. నడకలో తేడా వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. మీరు రిటైరయి ఎన్నేళ్లయింది? ఏ సంవత్సరంలో రిటైరయ్యారు? అని వివరాల్లోకి వెళుతుంటే వాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి తల ప్రాణం తోకకొస్తోంది!వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని వుండగా ఆ దారిన వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి ‘‘తాతగారూ, అబద్ధాల సత్యవతిగారి ఇల్లెక్కడ?’’ అని అడిగింది. అంతే ఆ అమ్మాయి మీద ఒంటి కాలి మీద లేచి, ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’’ అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారుపడుతూ, ‘‘అబద్ధాలనేది ఆవిణ్ణి కించపరిచేది కాదండి, ఇంటిపేరు’’ అని సమర్థించుకునేలోగా, ‘‘నువ్వింకా చిన్నకూచిననుకుంటున్నావా? పెళ్లయితే ఇద్దరు పిల్లలకు తల్లయేదానివి. నీకు నేను తాతలా కనిపిస్తున్నానా?’’ అని చిర్రుబుర్రులాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన ఆ అమ్మాయి, నలుగురూ చేరి గొడవయ్యేలోగా వెటకారంగా ‘సారీ తాతగారూ’ అంటూల్లగా అక్కణ్నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కున వేలే సుకున్నారు!పై సంఘటన జరిగిన రెండ్రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ ‘స్కిడ్’ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వున్న షాపుల వాళ్లు పరుగెత్తుకొని వచ్చి స్కూటర్‌నీ, తనను లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగుచేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి, బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చెయ్యబోతే వాళ్లు వారించి మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టారు. ఆ తరువాత తను వెళ్లడానికి తొందరపడుతుంటే– ‘‘పెద్దవయసు కదా మాష్టారూ, ఇక మీరు స్కూటర్ మానెయ్యాలి, మీరు వెనక కూర్చుంటే మీ యింటి దగ్గర మా వాడు దింపి వస్తాడు’’ అని వాళ్లు తన పెద్దరికాన్ని గుర్తుచేస్తూ, సానుభూతిలో సహాయం చేస్తామంటే, తనకు మాత్రం వాళ్లు తన వయసును వెక్కిరిస్తున్నట్టనిపించి ‘‘సింగినాదం! వయసుదేముంది? బండిరాయి మీదకెక్కితే ఏ వయసు వాళ్లైనా పడకతప్పదు! అని పడ్డం తన వయసువల్ల కాదని వాళ్లను మారుమాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు. ఇంటికెళ్లిన తరువాత తన ఘనకార్యం విని– ‘పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనడం మీలాంటి వాళ్లను చూసే..’ అని యిల్లాలు నెత్తి వాచేలా చీవాట్లు పెట్టింది!ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చొని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్స్‌లూ దంచేస్తుంటే ఆనంద పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ అయిదారుగురు వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే ‘‘మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం’’ అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిలయ్యారు. కుశల ప్రశ్నల అనంతరం వాళ్లు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్‌లో ఒక ‘సీనియర్ సిటిజన్’ను సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారనీ, మీ అనుమతి, బయోడేటాల కోసం వచ్చామనీ విన్నవించారు. వాళ్ల ప్రతిపాదన విన్న తరువాత తనకు కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ‘‘నేను మీకంత వృద్ధుడిలా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడంలేదు. కానీ డెబ్బయ్యేళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే డెబ్బయ్యేళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులు చేస్తుంటే మనమంతా చూడ్డం లేదూ? అందుచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే గాటన కట్టెయ్యకూడదు. పరీక్షల్లో అరవయ్యేళ్ల వృద్ధుడు అని రాస్తుంటారు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మట్టుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలా వార్ధక్యాన్ని అంగీకరించను. ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అని నిత్యయవ్వనాన్నే కోరుకుంటాను. ‘‘మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 20–20 క్రికెట్ పడుచుతనంలాంటిది. వన్డే క్రికెట్ మధ్యవయసులాంటిది. ఇక టెస్ట్‌మ్యాచ్ వార్ధక్యం లాంటిది. వీటిని బట్టి నేనేమిటో మీకర్థమైంది కదా! నేను నడకలో కాని, ఆటల్లో కాని, మీకెవరికీ తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని, సీనియర్ సిటిజన్‌గా నన్ను సన్మానిస్తామనడం నా ఫిట్నెస్ను అవమానించడమే! దయచేసి మీరు చెయ్యదలచుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఒక దండ తీసుకొనివస్తాను’’.తన వాగ్ధాటికి, ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు ‘«థాంక్స్’ చెప్పి వెళ్లిపోయారు. ఆ క్లబ్ సభ్యులలో ఒకరైన డా.ధన్వంతరి దగ్గరకు వారం తిరక్కుండా తను వెళ్లవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికి పోయాడు.‘‘రండి, రండి, దయచేయండి ఓల్డ్ యంగ్‌మెన్ గారూ, ఊరక రారు మహాత్ములు’’ అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తి పొడుపు ధ్వనించింది.‘‘నేను పక్కింటాయనతో పందెం కాసి వంద కొబ్బరి కాయలు వొల్చాను. ఆ శ్రమకి ఒళ్లంతా పులిసిపోయింది. ఆపైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని.’‘‘మాష్టారూ, మీరెంతటి ఐర¯Œ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు’’ అంటూ చెయ్యి, బీపీ చూశాడు. ‘‘అంతా నార్మల్‌గానే వుంది, ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్లలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. ఇరవైలోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు వూరుకోదు’’ అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలా గుచ్చుకొని ఇక డాక్టరు ముఖం చూడకూడదు అనుకున్నాడు తను!‘‘ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా, తన కిష్టంలేని వయసును గుర్తుచేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధపెడుతూనే వున్నాయి. కథల్లోనూ, సినిమాల్లోనూ తాతలకూ, తండ్రులకూ పెట్టే ‘అయ్యా’తో అంతమయ్యే పేరు కూడా తన నందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి ఒక కారణమేమో! చిన్నప్పుడే తన పేరును మార్చుకుంటానంటే అది తాతగారి పేరని, మార్చడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే అరవయ్యేళ్లకే తాతా అని పిలిపించుకోవలసి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలయినంత ఆలస్యం చేశాడు. చివరకు బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి, వాళ్లు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా వుండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం, ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా ‘బామ్మగారూ’ అని పిలిపించుకొనే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంటపెట్టుకొని తిరిగితే తన వయసు బయటపడుతుందని ఆమెను ఎక్కడకూ తీసుకెళ్లడం లేదు.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, అడ్డమైన వాళ్లు తన వయసు గురించి వాగి మూడ్‌ను పాడు చేస్తున్నారు. ఇంకా తలనెరిసిన ఇద్దరు, ముగ్గురు తను ‘యాక్టివ్’గా వుండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు అయిదారేళ్లు కలిపి ‘అలా కనిపిస్తున్నావు మరి’ అంటున్నారు. ఇలాంటి వాళ్లందరి తెగులు కుదర్చాలంటే తను గ్లామరు పెంచుకోవాలి. మరింత స్మార్ట్‌గా తయారయి ‘మాష్టారూ, మీకు డెబ్బయ్యేళ్లంటే ఎవరూ నమ్మరు. యాబైలలోనో, అరవైలలోనో వున్నట్లు కనిపిస్తున్నారు’ అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకొని హుటాహుటిన క్లాత్షాపుకు వెళ్లాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు వయసు దాచుకోడానికి టీషర్ట్లు వేసుకుంటున్నారు గనుక తాను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి అరడజను టీషర్ట్లు తీసుకున్నాడు. అక్కడ ‘జీన్స్’ చూసి వాటిమీద కూడా మోజుపడ్డాడు. కానీ మోకాళ్ల దగ్గర చిరుగులు వగైరాలున్న అవి మీకు బావుండవని ‘సేల్స్ బాయ్స్’ నిరుత్సాహపరిస్తే వాటి జోలికి వెళ్లలేదు. ఆనాటి నుంచి నిగనిగలాడే నల్లజుట్టు, డైలీ షేవ్, మోడరన్ డ్రెస్‌లు వగైరా మార్పులతో కనీసం పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయ్యకపోవడంతో బెంగ తప్పింది. కొస మెరుపు: ‘‘నన్ను కొట్టినా, తిట్టినా పడతాను కాని వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను’ అని తెగేసి చెప్పే సుందరరామయ్య డెబ్బై దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురు పడిన వాళ్లు సానుభూతి చూపిస్తుంటే–‘ ఎంత రాయిలాంటి వాడయినా వయసును, వార్ధక్యాన్ని ఒప్పుకోకతప్పదు. నాకూ డెబ్బయ్యేళ్లు నిండాయి మరి!’’అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూమ్లో జారిపడితే అతనికి కాలు విరిగింది. -
ఆ పని చేయడం బాగా అలవాటైపోయింది: మమితా బైజు
ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju) గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తండ్రి బైజు కృష్ణన్– డాక్టర్. తల్లి హోమ్ మేకర్. మిథున్ అనే అన్నయ్య ఉన్నాడు. తన పదహారవ ఏట– ‘సర్వోపకారి పాలక్కారన్’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సైకాలజీ చదువుతూ, మధ్యలో ఆపేయడం వల్ల ఏమో.. కనబడ్డ ప్రతి ఒక్కరి సైకాలజీ స్టడీ చేయడం అలవాటైపోయింది తనకు.మలయాళంలోనే..తెలుగులో మమితా డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసస నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని, అవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. ‘ప్రేమలు’ సినిమాతో ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాని, మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో చేయడానికి ఇష్టపడటం లేదు మమితా. శ్రీలీల పాత్రలో..తమిళంలో విజయ్ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్’లో మమితా బైజు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే కూతురిలాంటి పాత్ర. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటున్నారు. తెలుగులో శ్రీలీల చేసిన పాత్ర తమిళంలో మమితా బైజు చేస్తోంది. మొదటి రోజు షూటింగ్లో విజయ్‌ని చూడగానే చాలా థ్రిల్ ఫీలయ్యానంటుంది మమితా. విజయ్ డైరెక్ట్‌గా తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, ‘ఏమ్మా ఎలా ఉన్నావు’ అని పలకరించినప్పుడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని చెప్పింది. ప్రేమలు పారితోషికం ఎంతంటే?తన బ్యాగ్‌లో ఎప్పుడూ రంగు రంగుల మట్టి గాజులు , ఓ జత స్పేర్ డ్రెస్, చాక్లెట్లు ఉంటాయని చెప్పింది. రోజూ జిమ్ చేయడం అలవాటు. ‘హెలెన్’, ‘కప్పెలా’ మలయాళ సినిమాలతో పాపులర్ అయిన అన్నా బెన్ జిమ్ మేట్. ఇద్దరూ కలిసి వర్కవుట్స్ చేయడం ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది. ‘ప్రేమలు’ సినిమాకి రూ. 30 లక్షలు ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ కావడంతో తన పారితోషికం రూ. 50 లక్షలకు పెంచింది. వేరే లాంగ్వేజెస్‌కి వెళ్తే, ఇంకా పెరుగుతుంది కాని, మలయాళంలో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అంది. ఆ హీరోనే ఫేవరెట్యూత్కి ఫేవరెట్ క్రష్ అయిన మమితాకి మాత్రం హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి. తమిళ డైరెక్టర్ బాలతో ఓ సినిమా కమిట్ అయింది మమితా. కాని మధ్యలోనే సినిమా నుంచి బయటికి వచ్చింది. షూటింగ్లో బాల మమితాని బూతులు తిట్టి కొట్టాడని, అందుకే మానేసిందని వార్తలు వచ్చాయి. మమితా మాత్రం తన పర్సనల్ రీజన్స్ వలన ఆ సినిమా మానేసిందని చెప్పింది. తనని బాల కొట్టలేదని, అది మీడియా క్రియేషన్ అని కామెంట్ చేసింది. బాల మాత్రం మమితా తన కూతురులాంటిదని, తన డ్రెస్ సెన్స్ నచ్చక తీసేశానని చెప్పాడు.చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్. అంటోన్న ఖుష్బూ కూతురు -
చిటికెలో జుట్టుని నచ్చిన హెయిర్ స్టైల్లో మార్చుకోవచ్చు ఇలా..!
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్లెస్ గాడ్జెట్‌తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్లెస్ గాడ్జెట్‌లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి. దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది. ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్‌తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.జుట్టు రాలు సమస్యకు చెక్..ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్‌లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. (చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్‌ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!) -
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రాధ, ధర్మవరంవయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్‌కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్‌ని కలవాలి. మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ముందు టీఎస్‌హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు ప్లానింగ్‌కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్ఎమ్ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..? -
అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!
తల్లితో కలసి సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు ఆ తనయుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బజాజ్ చేతక్ స్కూటర్‌పై సుదీర్ఘ యాత్ర సాగించారు ఆ తల్లీ తనయులు. భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, మయాన్మార్ దేశాలను కూడా వారు సందర్శించారు. మైసూర్‌కు చెందిన ఆ తనయుడు కృష్ణకుమార్ (45), అతడి తల్లి చూడా రత్నమ్మ (75). వారి ఆధ్యాత్మికయాత్ర ఎలా సాగిందంటే..కృష్ణకుమార్ తనకు 21 ఏళ్ల కిందట తన తండ్రి కొనిచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్‌పై తల్లిని కూర్చోబెట్టుకుని ఈ యాత్ర ప్రారంభించారు. తండ్రి భౌతికంగా లేకపోయినా, ఈ వాహనం రూపంలో ఆయన తమతో పాటు ఈ యాత్రలు చేస్తున్నారనే భావిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు 92,822 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఏడుపదులు దాటిన వయసులోనూ రత్నమ్మ ఓపికగా స్కూటర్‌పై కూర్చుని యాత్రలు సాగిస్తుండటం విశేషం. ఇటీవల వారు విశాఖ చేరుకున్న సందర్భంగా, వారు తమ యాత్రా అనుభవాలను వివరించారు.మాతృసేవా సంకల్పయాత్ర...కృష్ణకుమార్ తల్లి చూడా రత్నమ్మ కుటుంబ బాధ్యతల్లో పడి ఇల్లు దాటి ఎక్కడకూ వెళ్లలేక పోయింది. ఒకసారి మాటల మధ్యలో ఇదే విషయాన్ని కొడుకుతో చెప్పి బాధపడింది. తల్లి మాటలకు కృష్ణకుమార్ ఆవేదన చెందాడు. ఎలాగైనా, తల్లిని ఆధ్యాత్మిక యాత్రకు తీసుకువెళ్లాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను అన్నింటినీ చూపించాలని నిశ్చయించుకున్నాడు. కొద్దిరోజుల్లోనే తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చాక తల్లితో కలసి స్కూటర్‌పై ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించాడు. వారం రోజుల్లో 2,673 కిలోమీటర్ల ప్రయాణంకోవిడ్ సమయంలో వీరు భూటాన్ సరిహద్దులో 52 రోజులు చిక్కుకున్నారు. అక్కడి నుంచి అతి కష్టం మీద అనుమతులు తెచ్చుకుని, తన తల్లిని తీసుకుని కేవలం వారం రోజుల్లో 2,673 కిలోమీటర్లు ప్రయాణం చేసి మైసూర్‌కు చేరుకున్నాడు. కేవలం రెండు రోజుల్లో 891 కిలోమీటర్లు ప్రయాణించిన సందర్భాన్ని మరచిపోలేమని కృష్ణకుమార్ చెబుతాడు. బదరీనాథ్, కేదార్నాథ్, కాశ్మీర్, వైష్ణోదేవి, పరశురామ్ కుండ్, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, భారత్–చైనా సరిహద్దుల్లోని అతి ఎత్తైన ప్రాంతం తవాంగ్, మేచుక వంటి ప్రదేశాలను సైతం వీరు సందర్శించారు. ఈ యాత్రలో కృష్ణకుమార్ తన తల్లికి లెక్కలేనన్ని ఆలయాలను స్వయంగా చూపించాడు. ఈ తల్లీ తనయులు కేవలం పట్టణాలనే కాకుండా చిన్నచిన్న గ్రామాలు, అక్కడ ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తన 68వ ఏట ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన చూడా రత్నమ్మ నేటికీ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా తన ప్రయాణాన్ని కుమారుడి చేయి పట్టుకుని సాగిస్తున్నారు. తాజాగా వీరు పంచారామాల యాత్ర ముగించుకుని విశాఖకు చేరుకున్నారు. కోవిడ్ సమయంలో తీర ప్రాంతంలోని ఆలయాలను వీరు సందర్శించలేకపోయారు. దీంతో మైసూర్ నుంచి వీరు తిరిగి ఈ యాత్రను ప్రారంభించారు. రోజూ దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, ముందుకు సాగుతున్నారు.చిన్న అనారోగ్యం కూడా లేదు...తన కోసం అన్నీ చేసిన అమ్మ కోసం తాను ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకున్నాడు కృష్ణ కుమార్. తన వద్దనున్న డబ్బులతోనే ఈ యాత్రలను పూర్తిచేస్తున్నారు. వీలయినంత వరకు ఆలయాలు, మఠాలు, క్షేత్రాలలో బస చేస్తారు. బయటి ఆహారం తినకుండా ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకుంటారు. ఇప్పటి వరకు చేసిన యాత్రల్లో తమకు కనీసం జ్వరం, జలుబు వంటివి కూడా రాలేదని, తన కంటే తన తల్లి పదిరెట్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈ యాత్రల్లో పాల్గొంటున్నట్లు కృష్ణకుమార్ చెప్పారు.మాట ఇచ్చాను... నెరవేరుస్తున్నానుఅమ్మకు ఇచ్చిన మాట కోసం ఈ యాత్రలు చేస్తున్నా. మాట ఇస్తే దానిని నెరవేర్చడం ముఖ్యం. బయటి ప్రపంచాన్ని చూడని మా అమ్మకు నేను దేశం అంతా చూపించాను. ఎంతో క్లిష్టమైన ప్రాంతాలకు సైతం స్కూటర్‌పై చేరుకున్నాం. అమ్మకు సేవ చేయడం, ఆమ్మతో ఉండటం చాలా సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది.– కృష్ణకుమార్ ఫొటో: పి.ఎల్.మోహనరావు(చదవండి: అలాంటి స్పందన ఊహించలేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన..) -
పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
‘లైఫ్‌లో గోలా ఉండాలి, గోలూ ఉండాలి..’ అన్నట్లు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా, సరదాగా గడపటం, అందంగా కనిపించడం ముఖ్యం. అందుకే, నటి నేహా శెట్టి ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ మీ కోసం.. ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయటం ఇష్టం. వాటివల్లే చాలా నేర్చుకున్నా. సడన్‌గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల ఉంగరాలు, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటాయని అంటోంది నేహా శెట్టి.మహిళ అందాన్ని పెంచడంలో ముందు ఉండే ఆభరణమే ముక్కెర. ఇది ఒకప్పటి ఓల్ట్ ఫ్యాషన్. కాని, ఇప్పుడు ఓల్ట్ ఈజ్ గోల్డ్ అనే రేంజ్లో స్టయిలింగ్‌లో దూసుకొచ్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులనూ దోచేస్తోంది. ట్రెండింగ్ ఆభరణం కావడంతో మార్కెట్లో ఇవి రకరకాల డిజైన్స్, మెటల్స్‌లో లభిస్తున్నాయి. అయితే, వీటిని కొనేటప్పుడు ముక్కుపుడకలో ఉన్న రాళ్లు, వజ్రాలను బాగా పరిశీలించి, ఊడిపోకుండా ఉండే రాళ్ల ముక్కు పుడకలను కొనుక్కోవాలి. ఆ స్టోన్స్ పోతే చూడ్డానికి అస్సలు బాగోదు. కొంతమందికి చిన్న ముక్కు, కొందరికి పెద్ద ముక్కు ఉంటుంది. ముక్కుకు తగ్గ సైజు ముక్కు పుడకను ఎంచుకోవాలి. ఒకసారి ముక్కుకి పెట్టుకొని అది మీకు నప్పుతుందా లేదా అని చూసుకొని తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రెస్డ్ నోస్ రింగ్స్దే. ఇది ముక్కు కుట్టించుకోని వారు కూడా ధరించి మురిసిపోతున్నారు. పైన చూపించిన నటి నేహా శెట్టిలా. ఇక ఇక్కడ నేహా ధరించిన జ్యూలరీ.. ఇయర్ రింగ్స్ బ్రాండ్: సంస్కృతి సిల్వర్ ధర: రూ. 8,600, ఉంగరం బ్రాండ్: తంత్ర బ్రాస్ జ్యూలరీ ధర: రూ. 450, కాగా, చీర బ్రాండ్: సురుమయే ధర: రూ. 22,000/- (చదవండి: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!) -
న్యూ కెరీర్ ఎక్స్‌ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
రొటీన్స్ కోర్సులు.. రొడ్డకొట్టుడు చదువులు..వీటితోనే భవిష్యత్తుకు భరోసా అనేది ఓ అపోహ! ఇంజినీరింగ్, మెడిసిన్స్, మేనేజ్మెంట్ కోర్సులతోనే..కెరీర్ అద్భుతంగా ఉంటుందనేది ఓ భ్రమ! మరి అవికాక, ఈ పోటీ ప్రపంచంలో బతకనేర్పే విద్యలేవీ లేవా? ఆసక్తికి, ఆదరణకు తులతూగే కోర్సులే లేవా? అంటే..కొత్తకొత్త కోర్సులు చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులను తమవైన రంగాల్నిఎంచుకోమంటూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, అకాడమీలు, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి. దేశ విదేశాల్లో చక్కని ఉపాధి అవకాశాలనూ అందిస్తున్నాయి. అలాంటి కొన్ని అరుదైన కోర్సుల గురించే ఈ ప్రత్యేక కథనం.. ఎథికల్ హ్యాకింగ్సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎథికల్ హ్యాకింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు నిర్దిష్టమైన అర్హతలు లేనప్పటికీ, కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. కొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ అవసరం కావచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఆసక్తి, నేర్చుకోవాలనే తపన రెండూ ముఖ్యమే. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఇన్ఫర్మేషన్స్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. కోర్సును ఎంచుకునే ముందు సంస్థ గుర్తింపు, కోర్సు సిలబస్, ఫీజుల వివరాలు సరిచూసుకోవడం ఉత్తమం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు లభిస్తాయి. యాక్టే టెక్నాలజీస్ అనే ఐటీ శిక్షణ సంస్థ ఎథికల్ హ్యాకింగ్‌పై మాతృభాషలోనే కోర్సులను అందిస్తోంది.పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఇది మానవ సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సంఘర్షణలను తగ్గించడానికి, పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, అవగాహనను అందించే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ మొదలైన అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలలో పని చేయొచ్చు. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఇంగ్లిష్‌పై పట్టుతో పాటు సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.హోరాలజీఇది కాలగమనానికీ, గడియారాల తయారీకి సంబంధించిన శాస్త్రం. ఈ కోర్సులను అందించే సంస్థలను బట్టి అర్హతలు మారతాయి. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. కొన్ని సంస్థలు సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, కోర్సులో జాయిన్ చేసుకుంటాయి. పలు సాంకేతిక విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలు దీనికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. ఈ రంగంలో ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులు లేవు. అయితే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు హోరాలజీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.ఎథ్నోబోటనీమానవులు, మొక్కల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది బోటనీ, ఆంత్రొపాలజీల సమ్మేళనం. ఇందులో ఔషధ విలువలు, ఆహార విలువలు, సాంకేతిక ఉపయోగాలు మొదలైన అంశాలను విశ్లేషిస్తారు. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, బోటనీ, ఫార్మసీ, ఆయుర్వేదం, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు సోషల్ సైన్సెస్, ఆంత్రొపాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఏనిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీజంతువుల మనస్తత్వానికి, వాటి భావోద్వేగాలకు చెందిన శాస్త్రం ఇది. దీనిలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, జువాలజీ, సైకాలజీ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఫైర్ ఇంజినీరింగ్ఇది అగ్ని ప్రమాదాలను నివారించడం, వాటిని ఎదుర్కోవడం, ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే కోర్సు. దీనిలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బి.ఈ/బీటెక్), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్.ఈ/ఎమ్‌టెక్) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అనుమతిస్తాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్ఇది పాడి పశువుల నిర్వహణకు సంబంధించిన కోర్సు. ఇందులో పాడి పశువుల పెంపకం, పోషణ, ఆరోగ్యం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్, నిర్వహణ వంటి అంశాలను నేర్పిస్తారు. డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, యానిమల్ సైన్స్ ్స లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.ప్రాప్ మేకింగ్ ఇది సినిమా, థియేటర్, టెలివిజన్, ఈవెంట్స్, ప్రకటనలు మొదలైన వాటి కోసం ప్రత్యేకమైన వస్తువులను (ప్రాప్స్) తయారు చేయడానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సు. సినిమాల్లోను నటీనటులు రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు. సన్నివేశాల్లోనూ రకరకాల వస్తువులు అలంకరణలు ఉంటాయి. వీటిని సినీ పరిభాషలో సెట్ ప్రాపర్టీస్ అంటారు. వీటి తయారీ గురించిన అధ్యయనం. ప్రాప్ మేకింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, డిజైన్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.డెత్ స్టడీస్ ఇది మరణం, మరణ ప్రక్రియ, దుఃఖం, మరణానంతర జీవితం వంటి అంశాలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది మరణం గురించి శాస్త్రీయ, మానసిక, సామాజిక, తాత్త్విక కోణాలను పరిశీలిస్తుంది. ఇది సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఏ/ ఎం.ఎస్.సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, రెలిజియస్ స్టడీస్ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు మెడికల్, నర్సింగ్, సోషల్ వర్క్ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి.ట్రీ క్లైంబింగ్ఇది చెట్లు ఎక్కడం, వాటిని నిర్వహించడం, రక్షించడం వంటి నైపుణ్యాలను నేర్పించే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది అటవీ నిర్వహణ, అర్బోరికల్చర్, వన్యప్రాణుల పరిశోధన వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. ట్రీ క్లైంబింగ్ కోర్సులలో సాధారణంగా సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్ని కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని సంస్థలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి. కొన్ని ప్రైవేట్ అడ్వెంచర్ స్కూల్స్, సంస్థలు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.పోలార్ లాఈ కోర్స్‌లో ధ్రువప్రాంతాల చట్టాల గురించిన అధ్యయనం చేయవచ్చు. పోలార్ లా అనేది ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన న్యాయ విభాగం. ఇది అంతర్జాతీయ చట్టం, పర్యావరణ చట్టం, సముద్ర చట్టం, మానవ హక్కుల చట్టం వంటి వివిధ రంగాలను కలుపుతుంది. పోలార్ లాలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎల్ఎల్ఎమ్), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, లా (ఎల్ఎల్బీ) లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులను కూడా అనుమతిస్తాయి.పారాసైకాలజీపారాసైకాలజీ అనేది మానసిక శక్తులు, అతీంద్రియ అనుభవాలు వంటి వాటిని అధ్యయనం చేసే కోర్సు. ఇందులో టెలిపతీ, క్లేర్వోయన్స్ ్స, ప్రీకాగ్నిషన్, సైకోకైనెసిస్, పునర్జన్మ వంటి అంశాలను విశ్లేషిస్తారు. పారాసైకాలజీలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఏ/ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, ఫిలాసఫీ, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.జెరంటాలజీ ఇది వృద్ధాప్య ప్రక్రియను, వృద్ధులను అధ్యయనం చేసే శాస్త్రం. దీనికి జీవశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి వివిధ రంగాలతో సంబంధం ఉంటుంది. వృద్ధుల జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో అధ్యయనం చేస్తుంది. కోర్సు స్థాయిని బట్టి, అర్హతలు మారుతుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీకి దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు సాధారణంగా డిప్లొమా లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీవశాస్త్రం, మనస్తత్త్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.స్టాండప్ కామెడీస్టాండప్ కామెడీ అనేది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్, అనుభవంతో నేర్చుకునే కళ. అయినప్పటికీ, కొన్ని సంస్థలు స్టాండప్ కామెడీకి సంబంధించిన కోర్సులు, వర్క్‌షాప్‌లు అందిస్తున్నాయి. స్టాండప్ కామెడీ కోర్సులకు సాధారణంగా అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. కొన్ని సంస్థలు, వర్క్‌షాప్‌లు 18 సంవత్సరాలు నిండిన వారిని అనుమతిస్తాయి. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, హాస్య చతురత, స్టేజ్ ఫియర్ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ కోర్సుకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆన్స్ లైన్స్ వేదికలు కూడా స్టాండప్ కామెడీ కోర్సులు అందిస్తున్నాయి.పప్పెట్ ఆర్ట్ ఇది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఈ కోర్స్ తోలుబొమ్మల కళపై అధ్యయనం. పప్పెట్ ఆర్ట్‌లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎఫ్ఏ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎఫ్ఏ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.విటికల్చర్ ఇది ద్రాక్ష సాగు శాస్త్రం. ఇందులో ద్రాక్ష రకాలు, నేల, వాతావరణం, సాగు పద్ధతులు, తెగుళ్ళు, వ్యాధుల నిర్వహణ వంటి అంశాలు ఉంటాయి. విటికల్చరిస్టులు నాణ్యమైన ద్రాక్షను ఉత్పత్తి చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేస్తారు. ఈనాలజీ–ఇది వైన్ తయారీ శాస్త్రం. ఇందులో ద్రాక్ష రసాలను వైన్స్ గా మార్చే ప్రక్రియ, కిణ్వన ప్రక్రియ, వైన్ నాణ్యతను అంచనా వేయడం వంటి అంశాలు ఉంటాయి. ఈనాలజిస్టులు వివిధ రకాల వైన్లను తయారు చేయడానికి, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని సంస్థలు సైన్స్ ్స స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి. కొన్ని సర్టిఫికెట్ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. బ్రూవింగ్ అండ్ డిస్టిలింగ్ఆల్కహాల్ ఉత్పత్తి ప్రక్రియలు, నిర్వహణ గురించి ఈ కోర్సులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. బీర్, వైన్, స్పిరిట్స్, ఇతర ఆల్కహాలిక్ పానీయాల తయారీలో ఉపయోగించే సాంకేతికతలు, పదార్థాలు గురించి అవగాహన కల్పిస్తాయి. ఈ కోర్సులో చేరడానికి సైన్స్ ్స స్ట్రీమ్‌లో 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని సంస్థలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ప్రవేశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక కోర్సులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉండాలి. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కొన్ని కళాశాలల్లో సీటు లభిస్తుంది.బేకింగ్ సైన్స్ ్స అండ్ టెక్నాలజీఇది ఆహార శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం కలయికతో కూడిన ఒక ప్రత్యేకమైన కోర్సు. పాకకళలో బేకింగ్ చాలా పురాతన ప్రక్రియ. ఓవెన్లలో రొట్టెలు, బిస్కట్లు, కేకులు వంటివి తయారు చేసే పద్ధతులు, ఈ ప్రక్రియలో నవీన సాంకేతికల గురించిన అధ్యయనం ఇది. ఇందులో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని వర్సిటీలు హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ వంటి అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి. ఇంటర్నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లలో ఈ కోర్సులు లభిస్తాయి.ఇవే కాదు, మాంటిస్సోరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి పలు కోర్స్‌లు ఆసక్తిగల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్, ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో కూడా కొత్త ధోరణులు మొదలయ్యాయి. ఏది ఏమైనా ప్రేరణ, ప్రక్షాళన లేనిదే ఏ ప్రయాణం విజయవంతం కాదు. భవిష్యత్తు నిర్దేశానికి అవే అసలైన వారధులు. నిజానికి ఇలాంటి ఎన్నో రంగాలు విద్యావ్యవస్థల్లో పట్టభద్రులను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తిని బట్టి అడుగులు వేయడమే ఆలస్యం. -
ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?
ఊసరవెల్లుల్లా రంగులు మార్చే ఈ చెట్లు ‘ఉప్ప’చెట్లు. ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు రంగులు మార్చుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గరువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఈ చెట్లను చూడవచ్చు. దాదాపు పదహారువేల ఎకరాల విస్తీర్ణంలోని వనంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఇరవై మీటర్ల ఎత్తులో గుండ్రంగా పెరుగుతాయి. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ‘సపోటసీ’ కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ‘ఇండియన్ బటర్ ట్రీ’ అని పిలుస్తారు. ఉప్ప చెట్ల వనంలో నెమళ్లు సహా రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ దోమలు, గబ్బిలాలు మాత్రం కనిపించవు.ఏడాదికి రెండుసార్లు రంగుల మార్పుఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండుసార్లు రంగులు మారుతాయి. సాధారణం ఇవి మిగిలిన ఆకుల్లా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. తొలుత తెలుపుగా, తర్వాత లేతగులాబిగా మారి, చివరకు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్ల పువ్వులు నాగమల్లి పూలలా తెల్లగా, అందంగా ఉంటాయి. వీటి పరిమళాలు చాలా దూరం వరకు గుబాళిస్తుంటాయి.పిక్కలకు ఓ లెక్కుంది!ఉప్ప కాయలను పగలగొడితే లోపల పిక్కలుంటాయి. సాదాగా ఉంటే మగ పిక్కలని, త్రికోణాకారంలో ఉంటే ఆడ పిక్కలని గిరిజనులు నమ్ముతారు. విద్యుత్తు సౌకర్యం లేని రోజుల్లో– కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రం చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు. లేదంటే సన్నని ఇనుప తీగతో పిక్కలను దండలా గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కలను మెత్తగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకోవడానికి, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పైపూతగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. బీజం ఎక్కడ పడింది!ఉప్ప చెట్లు శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జాతీయ వృక్షం. మన దేశంలో హిమాలయాల చుట్టుపక్కల, బిహార్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దక్షిణాదిన అల్లూరి జిల్లాలోనే తారసపడతాయి. ఈ చెట్ల పుట్టుక గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడిగాడట! వారు తిరస్కరించగా, కొంత దూరం ప్రయాణించి మరో ఇంటికి వెళ్లి వేడుకున్నాడు. ఆ ఇంట్లో భోజనం పెట్టగా, తిని సంతృప్తి చెంది, ఆ ప్రాంతంలో బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు గిరిజనం చెబుతున్నారు. అవే బంగారం గరువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని ప్రతీతి. జయపురం రాజా విక్రమ్దేవ్వర్మ ఈ ప్రాంతంలో ఉప్ప విత్తులు జల్లించారన్నది మరో కథనం. గిరిజనులు ఈ చెట్లను అతి పవిత్రంగా చూసుకుంటారు. ఈ తోటలో ఎవరైనా మలమూత్రాదులు విసర్జిస్తే శిక్షిస్తారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు పెట్టారు. చెట్లను కొడితే కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చారు. ఈ చెట్ల రక్షణ బాధ్యత గ్రామ దేవత గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని నమ్ముతారు. అరవై ఏళ్ల కిందట గ్రామదేవతకు గుడి నిర్మించారు. ఏటా ఇక్కడ ఘనంగా జాతర జరుపుతారు.ఎలా చేరుకోవాలంటే...పాడేరుకు 30 కిలోమీటర్లు, అరకు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరాన ఉంది. సబ్బవరం మీదుగా పాడేరు–అరకు మార్గంలో ఉప్ప గ్రామానికి చేరుకోవచ్చు. కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో వచ్చేవారు వాహనాల్లో ఇంధనం నింపుకోవాలంటే డుంబ్రిగుడలో మాత్రమే పెట్రోల్ బంకు ఉంది. ఉప్ప తోటల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ -
ఈ జెల్ సాక్స్‌తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్..!
సాధారణంగా మనం వాడే చెప్పులను బట్టి, వాతావరణాన్ని బట్టి, జాగ్రత్త లేకపోవడాన్ని బట్టి పాదాలు పొడిబారినట్లు తయారవుతుంటాయి. కాళ్లు తెల్లగా పొట్టురేగినట్లు ఉన్నా, మడమలు పగిలిపోయినా అసలు అందంగా కనిపించవు. అలాంటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ సమయం లేని వారు ఇలాంటి జెల్ సాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. రాత్రి ఈ సాక్స్ వేసుకుని పడుకుంటే తెల్లారేసరికి పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.పొడి పాదాలు, పగిలిన మడమలు ఉన్నవారికి, పాదాల చర్మాన్ని మృదువుగా, నునుపుగా ఉంచుకోవాలనుకునే వారికి, రాత్రిపూట సౌకర్యవంతమైన ఫుట్ కేర్ ట్రీట్మెంట్ కోరుకునేవారికి ఈ సిలికాన్ జెల్ సాక్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇవి పాదాలకు అవసరమైన తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.డీప్ హైడ్రేషన్ కారణంగా పాదాలు పగిలినట్లు మారినా, దుమ్ము, ధూళిలో తిరిగినా, కాళ్లు చూడటానికి అసహ్యంగా మారినా ఈ సిలికాన్ సాక్స్‌లో ఆయిల్స్ లేదా మాయిశ్చరైజర్ క్రీమ్స్ లేదా ఫుట్ సీరమ్‌లను కొద్దిగా వేసుకుని, సాక్స్ లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని, పాదాలకు తొడుక్కోవాలి.అయితే ముందుగా కాళ్లను శుభ్రంగా క్లీన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ ఉన్న సాక్స్‌ని తొడుక్కుని ఉదయాన్నే తీసెయొచ్చు. ఈ సాక్స్‌ని గోరువెచ్చని నీటిల్లో క్లీన్ చేసుకుని, ఆరబెట్టుకోవాలి. ఇవి క్వాలిటీని బట్టి రూ. 199 నుంచి ఐదారొందల వరకూ ఆన్లైన్లో అమ్ముడుపోతున్నాయి. సైజులను గమనించుకుని, రివ్యూలు చూసి కొనుగోలు చేయడం ఉత్తమం.(చదవండి: -
భలే బతుకు చక్రాలు..! చూస్తే మతిపోవాల్సిందే..
సాధారణంగా ఇల్లస్థలాలు చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో చూస్తుంటాం. కానీ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగర శివారు ప్రాంతానికి వెళ్తే, పచ్చదనంతో నిండిన పెద్దపెద్ద చక్రాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చక్రంలో 16 ఇళ్లు సకల సౌకర్యాలతో, ఆవాసయోగ్యంగా అగుపిస్తాయి. ‘బ్రాండ్బై గార్డెన్ సిటీ’ అనే ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ.. ప్రకృతి జీవనానికీ దగ్గరగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అందరి మనసుల్ని దోచేస్తుంటాయి. 1964లో ఎరిక్ మైగిండ్ అనే భవన నిర్మాణకర్త ఆలోచనల్లోంచి ఈ లేఔట్ పుట్టిందట. ఇలాంటి పచ్చని చక్రాలు ఈ ప్రదేశంలో చాలానే ఉంటాయి. ప్రతి సర్కిల్ మధ్యలో పార్కింగ్ స్థలం ఉంటుంది. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు మరింత మేలు చేస్తాయని స్థానికుల నమ్ముతారు. చక్రంలోనే ప్లాట్ చూడటానికి కట్ చేసిన కేకుముక్కలా ఉంటుంది. అయితే ఈ అందమైన ఇళ్ల నిర్మాణాలను డ్రోన్ వ్యూలో చూసిన వారు ఎవరైనా ‘అబ్బా భలే ఉంది, ఇలాంటి చోట ప్రశాంతంగా బతకొచ్చు’అంటుంటారు. అయితే కొందరు ‘చూడటానికి బాగున్నా, నివాసానికి అసౌకర్యంగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు తప్పించుకోవడం కష్టమవుతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అతిచిన్న అంతర్జాతీయ వారధి..!) -
అతిచిన్న అంతర్జాతీయ వారధి..!
ఇది ప్రపంచంలోనే అతి చిన్న అంతర్జాతీయ వారధి. కేవలం కొన్ని అడుగులు వేసి, ఈ వంతెనను ఇట్టే దాటేయవచ్చు. దీని మీదుగా స్పెయిన్ నుంచి పోర్చుగల్ దేశానికి వెళ్లొచ్చు. దీనిని ‘మార్కో ఇంటర్నేషనల్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. కేవలం 6 మీటర్ల పొడవు, 1.45 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను 2008లో నిర్మించారు. స్పెయిన్‌లోని ఎల్ మార్కో గ్రామం నుంచి పోర్చుగల్ గ్రామమైన వర్జియా గ్రాండ్ల మధ్య ఉండే చిన్న వాగును దాటేందుకు, వెదురు బొంగులతో దీనిని నిర్మించారు. ఈ వంతెన రెండు వేర్వేరు టైమ్జోన్ల పరిధిలో ఉంది. స్పెయిన్ వైపు సెంట్రల్ యూరోపియన్ టైమ్ (సీఈటీ) జోన్‌లోను, పోర్చుగీస్ వైపు గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) జోన్‌లోను ఉండటం విశేషం. దీని మీదుగా ప్రయాణిస్తే, టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. దీని మీదుగా కేవలం పాదచారులు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. పర్యాటకులకు ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వందలాది మంది ఈ వంతెనను దాటుతూ టైమ్ ట్రావెలింగ్ చేసిన అనుభూతిని పొందుతున్నారు. (చదవండి: krithi shetty: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!) -
నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
కృతి మూడోతరగతి చదువుతున్నప్పుడు ఒక బుక్ ఫెయిర్‌లో పుస్తకం కొనడానికి అమ్మను డబ్బు అడిగితే, వాళ్లమ్మ చాలా సంతోషించింది. కాని, కృతి ‘హౌ టు బి గార్జియస్’ అనే బ్యూటీ బుక్‌తో ఇంటికి వెళ్లింది. చిన్నప్పటి నుంచి అందంపై ఎంతో శ్రద్ధ చూపే తను, ఫ్యాషన్‌లోనూ అంతే ఆసక్తిని కనబరుస్తున్న విషయం ఆమె ఫ్యాషన్ స్టయిలే చెప్తుంది. ఆ విషయాలే మీ కోసం.. సౌందర్యం, చర్మ రక్షణ కోసం చాలా తెలుసుకొని, ఎన్నో వీడియోలు, నిపుణుల సలహాలు తీసుకున్నాకే నాపై ప్రయత్నిస్తా. చక్కెరకు దూరంగా ఉండటం వలన వచ్చిన అందం, ఇప్పటివరకు ఏ బ్యూటీ ప్రాడక్ట్ నాకు ఇవ్వలేదు. జ్యూలరీలో లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టం. అవి నా ముఖానికి బాగా నప్పుతాయని అంటోంది కృతి శెట్టి.ఆభరణాలన్నీ అలంకరించుకోవటం ఓ స్టయిల్ అయితే, కేవలం ఒకే ఒక్క ఆభరణంతో స్టయిలింగ్ చేసుకోవటం ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ముఖ్యంగా చెవులకు ధరించే దుద్దులు, జూకాలను సాధారణం కంటే కాస్త పెద్ద సైజులో ధరిస్తే మెడను బోసిగా ఉంచుకున్నా, ఇతర ఆభరణాలు ధరించకపోయినా అందంగానే కనిపించొచ్చు. కాని, ఎప్పుడూ ఒకే రకం ఇయర్ రింగ్స్ బోర్ కొడతాయి. అయితే, ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ ఫ్రేమ్ ఒక్కదానితో వివిధ రకాల స్టడ్స్‌ను మార్చుకుంటూ చాలా రకాలుగా స్టయిలింగ్ చేసుకోవచ్చు. (చదవండి: కేన్సర్‌తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?)మొదట్లో కేవలం బంగారు ఆభరణాలకే లభించే ఈ డిటాచబుల్ ఫ్రేమ్స్, ప్రస్తుతం ఖర్చుకు ఖర్చు ఆదా చేయడానికి, స్టయిల్‌కు స్టయిలిష్ లుక్ అందించడానికి మార్కెట్లో వివిధ మెటల్స్‌లోనూ లభిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలాంటి ఫ్రేమ్స్‌తో డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసేయండి పైన చూపించిన నటి కృతి శెట్టిలా. డ్రెస్ డిజైనర్ ప్రియల్ ప్రకాశ్ ధర: రూ. 27,500 జ్యూలరీ బ్రాండ్ మయరా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.(చదవండి: సమ్మర్ ఫ్యాషన్: ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్) -
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
‘అది దా సర్ ప్రైజ్’ అనే పాటలోని హుక్ స్టెప్‌తో ఎంతోమందికి నచ్చిన కేతికా శర్మ (Ketika Sharma), అంతే ఎక్కువగా ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంది. ఎన్ని తిట్టినా, ఎంత పొగిడినా తన పని తాను చూసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న కేతికా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మూవ్మెంట్స్ చెప్పినప్పుడు లోతుగా ఆలోచించను. వాళ్ళు చెప్పినవి చెప్పినట్టుగా సమయానికి ఎలా చేయగలను అనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. హీరోయిన్గా అవకాశాలు రాక ఐటమ్ సాంగ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఒక్క ఐటమ్ సాంగ్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెడుతోంది.లక్నోలో స్కూలింగ్ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివాను. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్‌లోకి వచ్చాను. ‘థగ్స్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లు. మోడలింగ్‌కి అభ్యంతరం చెప్పలేదు. కానీ, హీరోయిన్ అవుతానంటే మాత్రం ఒకటికి వందసార్లు ఆలోచించారు. ఏడాది టైమ్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో వాళ్లు మరో మాట మాట్లాడలేదు.సోషల్ మీడియాలో ఎన్ని డబ్ స్మాష్ వీడియోలు చేశానో లెక్కే లేదు. ఆ వీడియోలు చూసే దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతానని అనుకోలేదు. కాని, సినిమా ఫ్లాప్ అవుతుందని ఊహించలేదు. కొన్ని రోజులు మూడౌట్ అయ్యాను.జీవితంలో మరిచిపోలేని సందర్భం అంటే, ‘రొమాంటిక్’ సినిమా లాస్ట్ డే షూటింగ్. అదే రోజు నాగశౌర్య హీరోగా ‘లక్ష్య’ సినిమా ఆఫర్ వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకుండానే, రెండో సినిమా అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.ఇద్దరు స్టార్ బ్రదర్స్‌తో కలిసి నటించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్. ‘బ్రో’లో సాయి ధరమ్ తేజతో, ‘రంగ రంగ వైభవంగా’లో అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, థ్రిల్గానూ ఫీలయ్యాను.చదవండి: అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..? -
Ramayanam: విరాధుడి వధ
దశరథుడు కైకకు ఇచ్చిన మాటను అమలు చేయడానికి సీతా సమేతంగా రాముడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వారికి తోడుగా బయలుదేరాడు. అయోధ్యను విడిచి సీతా రామ లక్ష్మణులు అడవుల వైపు సాగారు. అడవుల్లో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, ముందుకు సాగుతూ, కొన్నాళ్లకు వారు దండకారణ్యం చేరుకున్నారు. దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కీకారణ్యం. సీతా రామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతున్నారు. గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. కొనదేలిన రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. అడపా దడపా క్రూర మగాల గంభీర రావాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి. అంతలోనే ఆకాశం మేఘావతమైంది. ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరవసాగాయి. కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది.‘నాథా! దాహం వేస్తోంది. దగ్గర్లో తటాకం ఏదైనా కనిపిస్తుందేమో చూడండి’ అందామె. దగ్గరలో నీటి జాడ కానరాలేదు. సీతా రామ లక్ష్మణులు ముగ్గురూ మాట్లాడుకుంటూ ముందుకు నడక సాగించారు. కొంత దూరం నడిచాక కనుచూపు మేరలో ఒక చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్ది, దాని చుట్టూ దట్టమైన ముళ్ల కంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైంది. లక్ష్మణుడు కత్తితో ముళ్ల కంచెలను కత్తిరించి, తోవ ఏర్పాటు చేశాడు. రాముడు కొంత దూరంలో చెట్టుకు ఆనుకుని నిలబడ్డాడు. సీత కూడా భర్త పక్కనే నిలబడింది. నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు. అదే సమయంలో భీకర ధ్వని వినిపించింది. ఆ ధ్వని క్రూరమగాల గర్జనలా లేదు. అంతకు మించిన తీవ్రతతో కర్ణభేరులు అదరగొట్టే ధ్వని అది. ఉలిక్కిపడిన లక్ష్మణుడు తన వెనుకనే ఉన్న సీతా రాములకు ఆపద ఏమైనా రాలేదు కదా అనే అనుమానంతో వెనక్కు చూశాడు. దూరాన చెట్టుకు ఆనుకుని రాముడు కనిపించాడు. తన వెనుక సీత ఉన్న వైపు రాముడు చూశాడు. అటువైపు భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. గుహలాంటి నోరు తెరిచి, వికటాట్టహాసం చేస్తూ వాడు సీతను ఒడిసి పట్టుకుని ఉన్నాడు. సీత ఎంతగా వదిలించుకుంటున్నా, ఏమాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేశాడు. రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు. ఇద్దరూ రాక్షసుడి వైపు విభ్రాంతులై చూశారు. వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతన చూసి రామ లక్ష్మణులు దిగ్భ్రాంతులయ్యారు.సీతను పట్టుకుని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చాడు.‘నా పేరు విరాధుడు’ అని వికటాట్టహాసం చేశాడు ఆ రాక్షసుడు.రామ లక్ష్మణులు బదులు పలకక వాడి వైపు తీక్షణంగా చూశారు.‘ఏం అలా చూస్తున్నారు? నా పేరు ఎప్పుడూ వినలేదా? చూడబోతే మీరు ఇదివరకు ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే! పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు నారవస్త్రాలు ధరించి, విల్లంబులు, ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు. ఈమెను చూడబోతే సర్వాలంకృతగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తోంది. మీరు మోసకారుల్లా ఉన్నారు. ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పట్టుకువచ్చారు? అంతఃపుర స్త్రీని పట్టుకొస్తే పట్టుకొచ్చారు గాని, బుద్ధి ఉన్నవారెవరైనా సుకుమారులైన స్త్రీలను అడవికి పట్టుకొస్తారా?’ అని గద్దించాడు.రామ లక్ష్మణులు బదులివ్వకపోవడంతో విరాధుడు మళ్లీ ఇలా అన్నాడు: ‘అడవి జంతువులను తిని మొహం మొత్తింది. ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది. అయితే ముందు మీరెవరో చెప్పండి. మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను’ అన్నాడు. ‘అసలు నువ్వెవరివో చెప్పు. నువ్వెవరివో తెలియకుండా నిన్ను చంపము’ అన్నాడు లక్ష్మణుడు.‘మీరెవరని అడిగితే బదులివ్వకుండా, నన్నే నువ్వెవరివని అడుగున్నారే? ఒక్క పిడికిటి పోటు యమపురికి పోయే మీతో ఇంత మట్లాడటం అనవసరం’ అని రెచ్చిపోయాడు విరాధుడు.అప్పుడు రాముడు ‘మేము రామ లక్ష్మణులం. ఈమె నా పత్ని జానకి. ఈమెను ఏ అంతఃపురం నుంచి పట్టుకు రాలేదు. స్వయంవరంలో శివధనుర్భంగం చేసి పెళ్లాడాను’ అన్నాడు. అప్పుడు విరాధుడు ‘నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద. నన్ను విరాధుడంటారు. తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాను. ఎలాంటి ఆయుధాలైనా నన్నేమీ చేయలేవు. ఈమెను ఇక్కడ విడిచిపెట్టి, మీ దారిన మీరు వెళ్లండి’ అని పలికాడు.రాముడు కుపితుడయ్యాడు. ‘ఓరీ, రాక్షసాధమా! భూమ్మీద బతకాలని ఉంటే నా సీతను వదిలి వెనక్కు వెళ్లిపో!’ అన్నాడు.‘నన్ను చంపుతానంటున్నారుగా! వ్యర్థప్రలాపాలు దేనికి? చూపించండి మీ ప్రతాపం’ అన్నాడు. అక్కడితో ఆగకుండా, తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు.రాముడు నాలుగు బాణాలను వెనువెంటనే సంధించి, ఆ శూలాన్ని గాల్లోనే ముక్కలు చేశాడు. విరాధుడు రెచ్చిపోయి, సీతను అక్కడే వదిలేసి, రామ లక్ష్మణులిద్దరినీ చెరో చేత్తో ఒడిసి పట్టుకుని, అడవిలో పరుగులు తీశాడు.లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి, ఒడిసి పట్టుకున్నాడు.‘అన్నా! వీడి చెరో భుజాన్నీ ఇద్దరం ఒకేసారి నరికేద్దాం’ అన్నాడు.ఇద్దరూ ఒకేసారి విరాధుడి రెండు భుజాలను ఒక్కసారే నరికేశారు. వాడు పెడబొబ్బలు పెడుతూ కుప్పకూలాడు. అయినా, అతడి ప్రాణం పోలేదు. ‘తపశ్శక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు. నేను వీడి కంఠాన్ని తొక్కి పడతాను. నువ్వు గొయ్యి తవ్వు. అందులో వీణ్ణి పూడ్చేద్దాం’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు గొయ్య తవ్వుతుండగా, విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు. వెంటనే విరాధుడి ప్రాణం పోయింది.∙సాంఖ్యాయన -
యువ కథ: మనిషి చనిపోయిన తర్వాత 7నిమిషాలు పాటు..
‘మనిషి చనిపోయే ఆఖరి నిమిషాలలో ఏడు నిమిషాలపాటు ప్రాణం వుంటుంది. ఆ సమయంలో జీవితమంతా కళ్ళముందు కనిపిస్తుంది’ అని చాలామంది అంటుంటే విన్నాను కాని, దాన్ని అనుభవించే రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేకపోయాను.చుట్టూ చీకటిగా వుంది. భయమేస్తోంది. అయినా ఇక భయమెందుకులే! జరగాల్సినదంతా గత రెండు గంటల్లోనే జరిగిపోయిందిగా! పన్నెండేళ్ళ క్రితం వార్తా కార్యక్రమాల్లో నిర్భయ సంఘటన గురించి విన్నప్పుడు అందరి ముఖాల్లోనూ ఆందోళన చూశాను. ఈరోజు మనిషి తోలు కప్పుకున్న మృగాలు నన్ను వెంటాడి క్షణక్షణం హింసిస్తూ, అటువంటి స్థితిలోకే నన్నూ నెట్టేస్తుంటే జీవచ్ఛవంలా పడుండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ నరరూపరాక్షసులు నన్ను అనుభవించి, దొంగల్లాగా పారిపోయారు.పోలీసు సైరన్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు నన్ను వెతికి, ఎక్కడున్నానో కనిపెట్టేసరికి నా ఊపిరుంటుందో లేదో! అవునూ, ఇప్పుడు పోలీసులు వస్తున్నారంటే అమ్మానాన్న కూడా వస్తూ వుంటారేమోగా! ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడమే గాక ఫోన్ కూడా ఎత్తకపోవడంతో భయపడి, నాన్న తన క్లాస్మేట్ అయిన సీఐ రమణమూర్తి అంకుల్‌కి ఫోన్ చేసినట్టున్నారు. పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో! నన్ను ఇలా చూసి వాళ్ళు తట్టుకోగలరా? అమ్మకి అసలే బాలేదు. నాన్నేమో సున్నితమైన మనిషి. జరిగినదాని గురించి కన్నా, నన్ను తలచుకుని వాళ్ళేమైపోతారోనన్న బాధే ఎక్కువగా వుంది. అలా అని, లేచి వెళ్ళి వాళ్ళకి బాధపడొద్దని చెప్పే పరిస్థితిలో లేను. కాలూ, చెయ్యీ కదపలేకపోతున్నాను. గొంతులోంచి మాట రావడం లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పటివరకూ సాఫీగా సాగిన నా జీవితం, కొన్ని గంటల క్రితం కొన్ని ఊహించని మలుపులు ఎందుకు తిరిగింది?‘అమ్మా! తలుపేసుకో, నేను వెళ్తున్నాను’‘వెళ్తున్నాను కాదే, వెళ్ళొస్తాను!’‘ఆ, అదే అదే. నువ్వు టైమ్‌కి మందులు వేసుకుని పడుకో, లేదంటే జ్వరం తగ్గదు. అసలే వైరల్ ఫీవర్’‘సరేరా. మర్చిపోకుండా వేసుకుంటానులేగాని, దేవుడికి దణ్ణం పెట్టుకునిరా. ఇవాళ ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు. శుభంగా జరగాలని కోరుకో!’‘అబ్బా! ఇంకా దణ్ణంపెట్టుకోమనలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఉండు, నీ ఆనందం కోసం కుంకుమ కూడా పెట్టుకుని వస్తా’‘జాగ్రత్త తల్లీ! వెళ్ళాక మెసేజ్ చెయ్యి. సర్వీస్ సెంటర్ వాడు కారు ఎప్పుడిస్తాడట?’‘ఇందాక ఫోన్ చేస్తే, రేపొద్దున్నకల్లా అయిపోతుందన్నాడమ్మా. ఇవాళ ఒక్కరోజూ ఆటోలోనో, క్యాబ్‌లోనో వచ్చేస్తాలే’ ‘సాయంత్రం కుదిరితే త్వరగా వచ్చెయ్యమ్మా. నువ్వొచ్చే వరకు మాకు కంగారుగా వుంటుంది’‘అలాగేనమ్మా. బయలుదేరేముందు లైవ్ లొకేషన్ పెడతానులే. అయినా నాకు కరాటేలో బ్రౌన్ బెల్ట్ ఉంది కదా! నన్ను ఎవడూ ఏం చెయ్యలేడు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే, క్యాబ్ వచ్చింది. నేను వెళ్తాను. బై అమ్మా!‘ అమ్మకి ధైర్యమిచ్చాను కాని, ఈమధ్య జరుగుతున్న దారుణాలను తలచుకుంటే నాకు భయమేసింది. ఒకమ్మాయిని మానభంగం చేసినందుకు విధించిన పదేళ్ల జైలు శిక్షకుగాను ఏడేళ్లు జైల్లో ఉండి, సత్ప్రవర్తన వల్ల మూడేళ్ల ముందే విడుదలయిన వాడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్త చూస్తుండగా ఆఫీసు వచ్చింది. మనసును కలచివేస్తున్న ఆ విషయాన్ని ఆలోచనల్లోంచి పక్కకు నెట్టేసి ఆఫీసు లోపలికి అడుగుపెట్టాను.‘అమ్మా, తిన్నావా? నాన్న ఇంటికి వచ్చారా? ఫోన్ చేస్తే ఎత్తలేదు.‘‘నాన్న గంట క్రితమే వచ్చారమ్మా. ఇందాకే తిన్నాము. ఆయన నిద్రొస్తోందని ఇందాకే నడుం వాల్చారు. నువ్వు చెప్పు. కొత్త పోస్టులో ఫస్ట్ డే ఎలా ఉంది?’’‘ఇప్పటివరకూ చాలా బావుందమ్మా. నాకు కొత్త షో ఇచ్చారు. ఈ వారం దానికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. పెద్ద బాధ్యత ఉంది కానీ బరువుగా అనిపించడం లేదు. ఆసక్తిగా వుంది. ఇంకో విషయం, కాలేజీలో అర్జున్ అని నా మిత్రుడుండేవాడుకదా! తను యూకే నుంచి మొన్నే వచ్చాడమ్మా. స్నేహితులందరమూ ఇవాళ కలుద్దామను కుంటున్నాము. తను రేపు వెళ్ళిపోతున్నాడు. అదీ కాక అందరినీ కలిసి చాలా రోజులయ్యింది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో! అందుకని ఇవాళే వెళ్తాను. కొంచెం ఆలస్యమవ్వచ్చు. మీరు తినేసి వుండండి. నాకోసం వేచుండద్దు’– అమ్మతో మాట్లడిన ఆఖరి మాటలు. నాన్నతో అయితే ఇవాళ మాట్లాడలేదు కూడా. ఇప్పుడు మళ్ళీ మాట్లడగలనో, లేదోనని భయమేస్తోంది.కాలేజీ స్నేహితులను కలిసి, వారితో విందు ముగించుకుని ఫోన్లో ఆటో బుక్ చేశాను. ఇరవై నిమిషాలకు ఒక రైడ్ కన్ఫర్మ్ అయ్యింది. వచ్చిన ఆటో డ్రైవర్‘మేడమ్, రైడ్ క్యాన్సిల్ చేసెయ్యండి. మీకు చూపిస్తున్న కిరాయిలో ఎక్కువ శాతం యాప్ వాళ్ళకే పోతుంది. రైడ్ క్యాన్సిల్ చేసి, దానికన్నా ఒక యాభై తక్కువిస్తే మీకూ, నాకూ లాభమే.’‘క్యాన్సిల్ ఎందుకులే అన్నా. నేనే వంద రూపాయలు ఎక్కువిస్తాను’ అనుమానం వచ్చినా, ఇంకో ఆటో దొరకదేమోనన్న భయంతో, రైడ్ ట్రాక్ అవుతుందన్న ధీమాతో బండి ఎక్కేశాను. ఇంతలో ఫోన్ మోగింది.‘హాయ్ కీర్తీ! ఇప్పుడే ఆటో ఎక్కాను. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తానులే. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు.’ ఫోన్ మాట్లడుతూ వున్నా, ఒక కన్ను డ్రైవర్ తీరు మీద, రోడ్డు మీద వేసుంచాను. వెళుతూ వున్నంతసేపూ బానే ఉన్న డ్రైవర్, ఇంటి దగ్గరకొచ్చేసరికి స్పీడు పెంచి మా ఇంటిని దాటేశాడు. ఫోన్లో యాప్ ఓపెన్ చేసి చూస్తే, ‘డెస్టినేషన్ రీచ్డ్. హౌ వస్ యువర్ రైడ్ విత్ చెన్నకేశవులు?’ (మీరు మీ గమ్యాన్ని చేరుకున్నారు. చెన్నకేశవులుతో మీ ప్రయాణం ఎలా జరిగింది?) అని చూపించింది. ప్రమాదంలో ఉన్నానని అర్థమయ్యి అప్రమత్తమయ్యాను. ఇంటికి ఫోన్ చెయ్యబోయాను. ఇంతలో అతను ఏదో స్ప్రే కొట్టాడు.కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా డ్రైవర్‌తో సహా ముగ్గురున్నారు– అర్ధనగ్నంగా. బ్రతిమాలాను. వేడుకున్నాను. ఒక్కరు కూడా కరగలేదు. కనికరం లేకుండా రెండు గంటల పాటు వారి పని ముగించుకుని, పోలీసు సైరన్ వినపడగానే పారిపోయారు. ఒకవేళ వీళ్ళని పోలీసులు పట్టుకున్నా, ఈ రాత్రి జరిగినది నా మనసులోనుంచి చెరిగిపోదుగా! అసలు నేను గురైన హింసని నా శరీరం తట్టుకుంటుందా? నేను బ్రతికుంటానా? అసలు ఇది అనుభవించడానికి నేనేం తప్పు చేశాను? పద్ధతిగానే బట్టలు వేసుకున్నాను కదా! ఏమిటి నేను చేసిన తప్పు? స్నేహితుల్ని అయిదేళ్ళ తరువాత కలవడమా? లేదా స్నేహితుడు ఇంట్లో దింపుతానన్నా, తనని ఇబ్బంది పెట్టడమెందుకని ఆటో ఎక్కడమా? అసలు నేను అమ్మాయిగా పుట్టడమే నా శాపమా? ఏమో. ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేను. అందుకే దీన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదూ! నాకు ఒక పేరంటూ లేదు. భారతదేశంలో రోజూ అఘాయిత్యానికి గురయ్యే తొంభైమంది అమ్మాయిల ప్రతిబింబాన్ని నేను. అందరూ పూజించే దేవిని నేను. కొందరు ఆర్పేయడానికి ప్రయత్నిస్తున్నా వెలగడానికి అనుక్షణం యత్నిస్తున్న జ్యోతిని నేను. ప్రాణం కొట్టుమిట్టాడుతున్నా, నా వాళ్ళ కోసం మృత్యువుతో పోరాడుతున్న యోధురాల్ని నేను. సుఖంగా, సురక్షితంగా ఉండే జీవితానికి నోచుకోలేని అభాగ్యురాలిని నేను. పోరాడకుండా ఒక రోజు కూడా గడవదే! నేను జీవితాంతం, అనుక్షణం, ఏ జంతువు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని జాగ్రత్తపడుతూ ఉండాల్సిందేనా?’’‘ఇది ఈ వారం మనసులోని మాట కార్యక్రమంలోని కథ. ఇది ఎవరు పంపించారో కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంపించారు. చదివి వినిపిస్తున్న నాకే గుండె ఇలా బరువెక్కుతోంటే, తను దీనిని ఎలా అనుభవించారో ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. కానీ తను అన్నిటినీ ఎదుర్కొని మనతో ఇది పంచుకోవడమే ఒక గొప్ప విషయం. ఈ మనసులోని మాటను పంపించిన వారు ఇది వింటున్నారనుకుంటున్నాను. మీకు మా జోహార్లు. ఇంకో నిర్భయ, అభయ, దిశలు రాకుండా చేద్దామని మనందరం శప«థం చేద్దాం. అది మనందరి బాధ్యత. వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మనసులోని మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకూ వింటూనే ఉండండి, నవోదయం ఎఫ్ఎం, ప్రతీరోజూ కొత్త ఆరంభం. నేను మీ ఆర్జే అను. ఇది మనసులోని మాట–మదిని హత్తుకుంటుంది.’ హెడ్‌ఫోన్స్ తీసి, బ్యాగు సర్దుకుని నా కథని చివరకి ఈ ప్రపంచానికి చెప్పానన్న సంతృప్తితో ఆఫీసు బయటకు వచ్చాను.‘లేటయ్యానా? నీ ప్రోగ్రాం వింటూ వచ్చా. చాలా బాగా మాట్లాడావు. ప్రౌడ్ ఆఫ్ యూ.’ వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ కనిపించాడు. కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన కొంత కాలానికి ఏర్పడిన మా పరిచయం ప్రేమకు దారితీసి, మూడేళ్ళ క్రితం మేము ఒకటయ్యేలా చేసింది. తన హాస్పిటల్‌కు, మా ఆఫీసుకు ఒక కిలోమీటరే తేడా. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు.‘లేదు. సమయానికే వచ్చావు. ఆకలేస్తోంది. ఏమయినా తిందామా?’‘సరే, పద.’ పక్కనే వున్న చాట్ బండి దగ్గరకు వెళ్ళి కచోరీ ఆర్డర్ ఇచ్చాక, నా మనసు నన్ను బలవంతంగా గతంలోకి లాక్కెళ్ళింది. అయిదేళ్ళ క్రితం, ఆ భయంకరమైన రాత్రి నాడు తను ఏదో ఎమర్జెన్సీ కేసులో ఉండడంవల్ల పక్కరోజుకుగాని విక్రమ్‌కి జరిగిన విషయం తెలియలేదు. నాకు తెలివి వచ్చే సరికి చేతికి ఏవో ట్యూబ్‌లు తగులుతూ వున్నాయి. నేనింకా బ్రతికే ఉన్నానని అర్థమయ్యింది. ఆసుపత్రిలో వున్నాననుకుంటా! ఎదురుగా అమ్మా, విక్రమ్ మాట్లడుకుంటూ వున్నారు. వాళ్ళని చూడగానే ఆనందం, బాధ వలన కన్నీరు తన్నుకొచ్చింది. నాకు మెలకువ రావడం వాళ్ళిద్దరూ ఇంకా గమనించలేదు. వున్నట్టుండి నా మనసు నా చిన్ననాటి స్నేహితురాలు శాలిని మీదకు మళ్ళింది. తను చిన్నప్పటినుంచి ఎంతో చలాకీగా వుండేది. చాలా అందంగా వుంటుంది కూడా. తన చదువు పూర్తయిన వెంటనే తన దూరపు బంధువుతో తనకి పెళ్ళి చేశారు. ఇద్దరూ మొదట్లో బాగానే వుండేవారు. కానీ ఒక సంఘటన వారిని విడదీసింది. శాలిని కాలేజీలో వున్నప్పుడు ఒకతను తనను పెళ్ళిచేసుకోమని వెంటపడేవాడు. అందుకు తను ఒప్పుకోకపోవడం అతని అహం మీద దెబ్బకొట్టింది. శాలినీకి పెళ్ళయ్యిందని తెలుసుకున్న అతడు, ఒకరోజు వచ్చి తనపై యాసిడ్ దాడి చేశాడు. తను సమయానికి మొహం మీద చెయ్యి అడ్డుపెట్టుకోవడంతో కళ్ళకు ప్రమాదం తప్పి, కేవలం నుదురు, చెయ్యిపై యాసిడ్ ప్రభావం పడింది. ఆ దుర్ఘటన తరువాత, కేవలం తన అందం మీద మోజుతో పెళ్ళి చేసుకున్న భర్త, తననుండి విడాకులు కోరాడు. అతని నిజస్వరూపం అందరికీ అప్పుడే అర్థమయ్యింది. అది శాలినీని ఎంతో మనోవేదనకు గురిచేసింది. జరిగేవన్నీ మన మంచికే అనుకునే నేను, విక్రమ్ ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇంతలో నేను కళ్ళు తెరవడం చూసి అమ్మా, విక్రమ్ నా దగ్గరకు వడివడిగా వచ్చారు. అమ్మ ఏడుస్తూ వచ్చి కౌగిలించుకుని, నాన్నకు నేను స్పృహలోకి వచ్చిన విషయం తెలిపేందుకు వెళ్ళింది. విక్రమ్ వచ్చి ఏమీ మాట్లాడకుండా చెయ్యి పట్టుకుని నా మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. తను కూడా శాలిని మాజీ భర్తలా చేస్తాడా? జీవితాంతం తోడుంటానన్నవాడు ఇప్పుడు చెయ్యి విడిచి వెళ్ళిపోతాడా? అటువంటి ఆలోచనలు నా మదిని కలవరపెడుతుండగా తన కన్నీటి చుక్కలు నా చేతి మీద పడ్డాయి. ‘అనూ, మాకు చాలా భయమేసింది. నువ్వు పద్దెనిమిది గంటలపాటు స్పృహలో లేవు. నువ్వు మొత్తానికి లేచావు. పరిస్థితులు మళ్ళీ చక్కబడతాయి. మనం దీనిని కలిసి జయిద్దాం!’ నా అరచేతిలో తన తల వాల్చి, పసిపిల్లాడిలా ఏడుస్తూ, నాకు ధైర్యాన్నిస్తున్న తనని చూస్తే ముచ్చటేసింది. మనసు కుదుటపడింది.‘ఓయ్’ అంటూ నా భుజాన్ని విక్రమ్ తాకడంతో వర్తమానంలోకి వచ్చాను.‘అసలు నేనిప్పటివరకూ మాట్లాడినవేమయినా విన్నవా? ఏమాలోచిస్తున్నావు?’‘ఏమీ లేదు. మన బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికయినా ఈ లోకం సురక్షితంగా మారకపోదా అని ఆలోచిస్తున్నా అంతే!’ తన భుజమ్మీద తల వాల్చాను. నన్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో భద్రతగా అనిపించింది. ‘ఆ!’– ‘ఏమైంది?’– ‘తను తంతోంది. చెయ్యి పెట్టి చూడు.’ తన చేతిని నా పొట్ట మీద ఆనించాను. ఆ చిన్ని ప్రాణాన్ని స్పృశిస్తూ గడుపుతున్న మధురక్షణాలలో అనిపించింది–‘నాట్ ఆల్ మెన్. బట్ సమ్ హౌ ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యాన్’. మగాళ్ళందరూ చెడ్డవారు కాదు. కానీ అటువంటి హానికరమయిన వారెవరో, మంచివారెవరో తెలుసుకొనుట ఎటుల? నా పసిపాప పెరిగే సమయానికయినా ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే బావుండు! -
ఈ వారం కథ: ఉల్లి బంధం
‘‘లోకంలో ఎక్కువమంది అన్యోన్యత.. అంటే కమ్యునికేషన్స్ సరిగా లేక సమస్యలు తెచ్చుకుంటున్నారు’’మహానగరంలో పెద్ద దేవాలయ ప్రాంగణం. పురాణ కాలక్షేపం జరుగుతోంది. తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో భక్తులంతా కూర్చొని స్వామివారి ప్రవచనం శ్రద్ధగా వింటున్నారు.‘‘సమాచార లోపం వల్లే మెజార్టీ స్త్రీ పురుషుల్లో అన్యోన్యత దెబ్బతింటోంది. ఒకరు చెప్పింది మరొకరు సాంతం వినడం లేదు. ఠపీమని సమాధానం మాత్రం ఇచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రాక్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోవాల. నిదానం గాని, ఓ విధానం గాని ఉండట్లేదు’’భక్తజన శ్రోతలు ముసిముసిగా నవ్వుకున్నారు. కాని, ప్రియతమ్ నవ్వలేదు. అతని పక్కనే కూర్చున్న సుందరిలో కూడా స్వామివారి మాటలు నవ్వు పుట్టించలేదు. వారిద్దరూ భార్యాభర్తలు. అయినా గంభీర వదనాలతో ఉన్నారు. సుందరి.. పెళ్లయిన కొత్తలో భర్తను పేరులోనే కాకుండా అతడేం చేసినా ఇష్టసఖుడిగానే తలచేది, కొలిచేది. ప్రియతమ్.. భార్య చిలుకలు చుట్టి ఇచ్చినా, చిలుకపలుకులు పలికినా ‘గాల్లో తేలినట్టుందే’ అని సంబరపడిపోయేవాడు. మూడేళ్లు గడిచాయి. ఆ ముచ్చట్లు మాయమయ్యాయి.‘‘వాళ్ల కడుపున ఓ కాయ కాస్తే అన్నీ సర్దుకుపోతాయి’’ అని పెద్దవాళ్లు అనుకున్నదేమీ జరగలేదు. కాలం గడుస్తున్నకొద్దీ ఒకరిమీద మరొకరికి చిరాకు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. తమ ఇంట్లోనే తాము పరాయివాళ్లలాగా గడుపుతున్నారు. అయినా సరే, ఇద్దరిలో ఏ చిన్న అవసరం ఎవరికొచ్చినా మిగతావారి మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఎవరి రాజ్యంలో వారు సామంతులు మరి.మామూలుగా అయితే వంటగది ఆడవాళ్ల రాజ్యం. ఆక్కడ ‘మగా’నుభావులకు చోటుండదు. కిచెన్స్ రూమ్ వాళ్ల ఇష్టారాజ్యం. ఇదంతా ఒకప్పటి మాట. మహిళలు ఇప్పుడు పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు.‘వంట చేయడం ఏమైనా బ్రహ్మవిద్యా? యూ ట్యూబ్ చూసి చేసేయడమే కదా. ఆ మాత్రం వంటలు మేమూ చేయగలం’ అంటూ ఎంతోమంది మగమహారాజులు నారీమణులకు తీసిపోకుండా ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నారు.కాని, ప్రియతమ్ ఆ పని చెయ్యలేడు. తనకు స్టవ్ వెలిగించడమే సరిగా రాదు. ఎలాగోలా వెలిగించినా, బర్నర్ ఎటు తిప్పితే సిమ్మో, ఎటు తిప్పితే కాదో తనకు ఇప్పటికీ కన్స్ ఫ్యూజనే. ఒకసారి స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి. పాలు పొంగిపోతున్నాయని పొయ్యి దగ్గరకు పరిగెత్తి ఆ గాభరాలో వెంటనే స్టవ్ కట్ట లేకపోయాడు. గభాల్న పాలపాత్ర దించేసి, చేతులు కాల్చుకున్నాడు. అందుకే కప్పు టీ కావాలన్నా సుందరి చేసి ఇవ్వాల్సిందే! వంటగది సుందరికి ఇష్టారాజ్యం అయితే, ప్రియతమ్కు దుర్భేద్యమైన కోట.డబ్బుల్ని ఒకేసారి ఎక్కువగా చూస్తే సుందరికి గుండెలు ఝల్లుమంటాయి. ఆ పులకరింతలో వాటిని సరిగా లెక్కపెట్టలేకపోతుంది. ఎప్పుడైనా లెక్కపెట్టాల్సి వస్తే ఒకటి రెండు సార్లు లెక్కపెట్టినా, పది రూపాయలు ఎక్కువో తక్కువో అవుతుంది. అందుకే డబ్బు జోలికి తనెప్పుడూ స్వతంత్రంగా వెళ్లలేదు. ప్రియతమ్ను కట్టుకున్నాక సహజంగా ఉండే స్వాతంత్య్రం కూడా పోయింది. మనీపర్స్ ప్రియతమ్కు అల్లాఉద్దీన్స్ అద్భుత దీపం అయితే సుందరికది అర్థంకాని మాయల ద్వీపం.రోజులు గడిచేకొద్దీ ఏ చిన్న అవసరమైనా, ఒకర్నొకరు అడుక్కోవడం ఇద్దరికీ దుర్భరంగా తోచేది. భార్యాభర్తల మధ్య ఈ పరిస్థితేమిటి? ఎవరికైనా తెలిస్తే నవ్వుకోరా! అన్న ఆలోచన వచ్చినా ఎవరికి వారు సమర్థించుకునేవారు. అందులో తప్పున్నా దాన్ని దిద్దుకోవల్సింది తను మాత్రం కాదని ఒకరి మీద మరొకరు నెట్టుకునేవారు. ప్రియతమ్ గీసి గీసి లెక్కలేసి సుందరికి డబ్బులివ్వడం, సుందరి తెల్లారి లేచి నాన్చి నాన్చి పనులు చేయడం– ఇదీ తంతు! ఎప్పుడైనా పక్కింటివాళ్లతోనో, ఇంటికొచ్చిన అయినవాళ్లతోనో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సివచ్చినా, వీళ్ల బండారం బయట పడిపోకుండా ముఖాన పౌడర్లు స్నోలతో పాటు లేని నవ్వులు కూడా తగిలించుకునేవారు. దేవాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోందని, స్వామివారు చెప్పే పురాణం కన్నా ఇంటింటి రామాయణం మీద జోకులే అందరికీ కనెక్ట్ అవుతున్నాయని వీధిలో నలుగురూ అనుకోసాగారు. ఓ సాయంత్రం పక్కింటి వాళ్లు వెళ్తుంటే ప్రియతమ్, సుందరి వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది. నవ్వలేనివారు స్వర్గాన ఉన్నా ఏడుపు మొగంతోనే ఉంటారన్నట్లు, కనీసం ఇంగ్లీషు సినిమాహాల్లోలా, పక్కవారితో జతకలిపైనా నవ్వకుండా ప్రియతమ్, సుందరి గంభీర వదనాలతో ఉన్నారు. ‘‘మనిషి సంఘజీవి. ఒకరితో ఒకరు కలిసుండాలి. ఇందులో అనుమానమే లేదు. అలాగని ఒకరు లేకపోతే మరొకరు బతకలేరు అని కాదు, ఒకరికొకరుగా కలసి ఉంటూనే ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి. ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే కదా ప్రేమలు, అభిమానాలు పుడతాయి; బంధాలు బలపడతాయి. అప్పుడే కదా ఈ సమాజమే అందంగా ఉంటుంది. అందం అంటే– నేను చెప్పే అందం, మీరు చూసే అందం ఒకటి కాదు. విశ్వమానవ కళ్యాణంలోని అందాన్ని, వసుధైక కుటుంబంలోని బంధాన్ని నేను చూస్తున్నాను’’ భక్తులంతా గొప్ప ఊరటని, ప్రశాంతతను పొందిన అనుభూతితో తేలిపోయారు. అంతటి ఆనందాన్ని తట్టుకోలేని కొందరి గుండెలు ఉప్పొంగిపోగా కళ్లవెంట జలజలా ఆనందబాష్పాలు రాలాయి.స్వామివారు ఆ రోజుకి స్వస్తి చెప్పి లేవగానే భక్తజనం కూడా ఎవరిళ్లకు వారు వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.ప్రియతమ్, సుందరి మనసులపై స్వామివారి కొన్ని మాటలు బలమైన ముద్ర వేశాయి. ‘‘..ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి’’ ఈ మాటలు పదే పదే వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.స్వామివారి మాటల్లోని పూర్తి సారాంశాన్ని తీసుకోకుండా, తమకు కావల్సింది మాత్రమే పట్టుకొని రాత్రి పడుకున్నాక కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయారు. ఆఫీసుకు రెడీ అవుతున్న ప్రియతమ్ మనసులో పరిపరి విధాలా ఆలోచనలతో హాల్లో నిల్చున్నాడు క్యారియర్ కోసం. సుందరి ఇంతకీ రాదు, అంతకీ రాదు. అసహనం పెరిగిపోసాగింది. పోనీ ‘దీని కేరీజు ఎవడికి కావాలి బయట ఏదోటి తిందాం’ అనుకుంటే ఆ మసాలాలు, బిరియానీలు తన ఒంటికి పడవు. ఏదైనా హోమ్లీగా ఉండాలి. ఈ బలహీనతే దానికి బలమైన ఆయుధమైపోయింది. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు.సర్దిన క్యారియర్ యథాలాపంగా అతని చేతికిచ్చి మాటామంతి లేకుండా అక్కడే నిల్చుంది. ప్రియతమ్ అడుగుతీసి బయటపెట్టాక గేటు తలుపులు వేయడానికి వెళ్లి అక్కడ అడిగింది‘‘ఖర్చులకు డబ్బులివ్వలేదేం?’’అనిఏవేవో లెక్కలు వేసుకొని, జేబులోంచి పర్సు తీసి ఒకటికి నాలుగుసార్లు లెక్కపెట్టినవే లెక్కపెట్టి సుందరికిచ్చి బండి స్టార్ట్ చేశాడు.గేటు వేసొచ్చి సోఫాలో కూర్చుంది. ‘ఇలా గానుగెద్దులా పడుంటే, చేసి పెడుతుంటే తన విలువేంటో ఆయనకు తెలీట్లేదు. స్వామివారు చెప్పినట్టు ఎవరూ ఎవరికీ తీసిపోయి లేరు. నా వ్యక్తిత్వాన్ని నేనే కాపాడుకోవాలి. బానిస బతుకు బతకడంలో అర్థం లేదు’ అని ఒకటికి పదిసార్లు అనుకుంది.చూస్తుండగానే సాయంత్రమైంది. ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న ప్రియతమ్ తన వీధిలో రెండిళ్లు దాటీ దాటగానే ఠక్కున అతని స్కూటర్ ఆగిపోయింది. ఎదురుగా కొత్తగా వెలసిన టిఫిన్స్ కొట్టు ‘మీ వంటిల్లు’ కనిపించింది. ‘పేరు కూడా భలే ఉందే’ అనుకుంటూ బండి స్టాండ్ వేసి లోపలికెళ్లాడు. నేతి ఘుమఘుమలతో టిఫిన్లు కూడా అరటాకులో తింటున్న కస్టమర్లతో హోమ్లీగా కనిపించింది. సీరియల్ లైట్ల వెలుగు జిలుగుల్లో తనపాలిట కల్పతరువుగా కనిపించింది. తిన్నగా ఇంటికి పోనిచ్చి బండి పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.ప్రియతమ్ వచ్చాక ముందు మంచినీళ్లు, తర్వాత టీ కప్పు అందివ్వడం సుందరి చేసే పని.ఆ వేళ అలాంటిదేమీ జరగలేదు. ప్రియతమ్ ఫ్రెష్ అవడానికి వాష్‌రూమ్‌లోకి దూరాడు. కాస్సేపటికి హాల్లోకి వచ్చిన ప్రియతమ్కు చేష్టలుడిగినదాన్లా సోఫాలో సుందరి కనిపించింది. ఆమె టీ పెట్టి తీసుకురాలేదు. అతను అడగలేదు.‘తను నోరిడిచి అడగనిది నేనెందుకు ఇవ్వాలి. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఆ రోజు ఇంటి ఖర్చులకు నేనడగకుండా డబ్బులిచ్చాడా? లేదుకదా! గేటు వరకు వెళ్లినతని వెనకే వెళ్లి అడిగితే వీధిలోనే నిలబడి ఆరవైఆరు లెక్కలేసి డబ్బులు చేతిలో పెట్టాడు. కావల్సినవి కొని అన్నీ చేసేసరికి పైసా మిగల్లేదు. ఏమిటీ అవస్థ? ఇంతోటి భాగ్యానికి తనెందుకు పులుముకొని కడుక్కోవడం’ పేపరు చూస్తూ తన ఆలోచనల్లో తనుంది.ప్రియతమ్ డ్రెసప్ అయ్యాడు. చెప్పులు వేసుకొని లుంగీతోనే వీధిలోకి వెళ్లిపోయాడు. సుందరిలో ఒక్క నిముషం ఆశ్చర్యం. అంతలోనే సర్దుకొని తన పనిలో తను పడింది.‘అదేం పేదరాసి పెద్దమ్మ అనుకుంటుందేమో! దాని పుంజు కుయ్యకపోతే కప్పుటీ ఎక్కడా దొరకదనుకుంటుందేమో! రెండడుగులు వేస్తే అద్భుతమైన దుకాణం ఉందిప్పుడు. దానికా సంగతి తెలీదేమో! ఇంతకు ముందు రెండు వీధులు దాటి రోడ్డుకు వెళ్తేకాని టీ కాఫీ ఫలహారాలు కనపడేవి కావు. అవి కూడా మనకి కావల్సినట్లు ఉండేవి కావు. అయినా అంతదూరం ఎవడెళ్తాడ్రా బాబూ అనుకుంటూ ఇంట్లోనే దేవులాడాల్సి వచ్చేది.కొత్త దుకాణం ఆ బాధలన్నీ తీర్చింది’ అనుకుంటూ ఓ టీ కొనుక్కొని ఆక్కడే కాస్సేపు గడిపి ఏ టైమ్‌లో ఏయే వస్తువులు ఉంటాయో తెల్సుకొని ఆనందంగా ఇంటికొచ్చాడు.‘ఏమిటీ మనిషి? ఇంటికొచ్చిన వెంటనే టీ చుక్క పడకపోతే పిచ్చెక్కిపోయేవాడు. అలాంటి చిహ్నాలేవీ లేకుండా హుషారుగా కనిపిస్తున్నాడు’ అనుకొని వంటగదిలోకి వెళ్లి తన పనిలో పడింది.భోజనాల వేళైంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ‘‘భోజనం రెడీ’’ అంది సుందరి.‘ఏమిటి! హోటల్ ముందు బోర్డు పెట్టినదాన్లా ‘భోజనం రెడీ ఏంటి. భోంచేద్దురుగాని రండి అంటే దాని సొమ్మేమైనా పోతుందా? నా సొమ్మేగా! అయినా దానికి టీ తాగే అలవాటు లేదు. అందుకే అడిగితే కాని ఇవ్వట్లేదు. కాని, తిండి తినాలిగా. అందుకే నన్నూ పిలిచిందన్నమాట. ఏదైతేనేం, వద్దని పస్తుండలేం కదా’ అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.అందని అందాల అంచుకే చేరిననూ.. విరిసిన పరువాల లోతులే చూసిననూ.. తనివి తీరలేదే’’ పాట టీవీలో వస్తోంది. విసురుగా లేచి వెళ్లి టీవి కట్టేశాడు ప్రియతమ్. భోజనం ముగించి బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.పనులన్నీ ముగించుకొని సుందరి కూడా వెళ్లి పడుకుంది.‘ఏవిటీ అవస్థ? ఇంతకు ముందు మొక్కుబడిౖకైనా తమ మధ్య పొడి పొడి మాటలుండేవి. ముఖాన గంటు పెట్టుకొని పడుండేవాళ్లం కాము. ప్రవచనం దగ్గరకు వెళ్లొచ్చాక ఇద్దరిలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉన్న సంకోచాలు పోయి లేని తెగింపులు పుడుతున్నాయేంటి! ఇది ఎక్కడకి దారి తీస్తుంది? తెగని ఆలోచనలతో సుందరి ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఏమో!తెల్లవారింది. ఎవరి పనుల్లో వారున్నారు. ప్రియతమ్కు బెడ్ టీ అలవాటు. అలాగని నిద్రకళ్లతో, పాచిమొఖంతో తాగడు. నిద్రలేచి, వాష్‌రూమ్ అవసరాలు తీర్చుకొని బ్రష్ చేసి హాల్లో కూర్చొని పేపర్ చూస్తు ఉన్నవాడికి సుందరి టీ తెచ్చి ఇస్తుంది. అది లేటయితే అతనిలో అసహనం అంతకంతకు పెరుగుతుంటుంది. నిరసనను ఏదోరకంగా వ్యక్తం చేసేవాడు. అప్పటికీ ఆలస్యమైతే ‘‘లోపల ఏం వెలగబెడుతున్నావ్. టీ తెస్తున్నావా లేదా?’’అని అరిచేవాడు.ఈవేళ హాల్లోకి ప్రియతమ్ వచ్చాడు. కానీ టీ రాలేదు.‘మనిషొచ్చాడు. కానీ రంకె వేయలేదేంటి? చూద్దాం. ఏం చేస్తాడో. నిన్న సాయంత్రం పెద్ద ఫోజుగా బయటికెళ్లి పోయాడుగా’ అనుకుంటూ వంటగదిలోనే ఉంది సుందరి.ప్రియతమ్ సోఫా మీదున్న న్యూస్ పేపర్ తీశాడు. నిల్చొనే పేజీలు తిరగేస్తూ హెడ్‌లైన్స్ ్స ఒకసారి చూశాడు. టీ కోసం ఎదురు చూసినవాడిలా కనిపించకుండా చెప్పులు వేసుకొని లుంగీలోనే రోడ్డుకు వెళ్లిపోయాడు.సుందరి చిన్నపాటి కుదుపుకి లోనయింది. ‘ఏవిటీ మనిషి! ఉలకాయిస్తున్నాడా నన్ను? ఉలకాయించనీ. ఉలకాయించిన మొగుడ్ని ఉడతెత్తుకు పోయిందని.. ఎన్నాళ్లు ఉలకాయిస్తాడో నేనూ చూస్తాను’ అనుకుంటూ పనిలో పడింది.కాస్సేపటికి వచ్చిన ప్రియతమ్ సరాసరి వాష్‌రూమ్‌లోకి దూరిపోయాడు. మరి కాస్సేపటికి డ్రసెప్పై హాల్లోకి వచ్చాడు. సుందరి క్యారియర్ కట్టీసి అతను చూస్తుండగా టేబుల్ మీద పెట్టింది.ప్రియతమ్ పర్సులోంచి డబ్బులు చేతికొచ్చింది వచ్చినట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. అవి సరిపోతాయా చాలవా ఆన్న ఆలోచన ఆ సమయంలో అతనికి కలగలేదు.ప్రియతమ్ వెళ్లిపోయినా చాలాసేపు అలా సోఫాలో కూర్చుండిపోయిన సుందరి బలవంతంగా ఆలోచనల్ని మళ్లించడం కోసం యథాలాపంగా న్యూస్‌పేపర్ చేతిలోకి తీసుకొని తిరగేస్తూ చటుక్కున ఓ వార్త దగ్గర ఆగిపోయింది. ఆసక్తిగా వార్తను సాంతం చదివింది. ఆ తర్వాత తనకు స్పష్టమైన ఓ దారి, గమ్యం కనిపించినంత ఆనందంగా లేచింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ప్రియతమ్ కంగుతిన్నాడు. ఇంటికి తాళం వేసుంది. దానికో చీటీ తగిలించి ఉంది. ‘తాళాలు పక్కింటి ఆంటీవాళ్ల దగ్గరున్నాయి’ అని రాసుంది దానిమీద. ఎప్పుడూ జరగలేదిలా. ఆశ్చర్యపోతూనే వెళ్లి తాళాలు తెచ్చి తలుపులు తెరిచాడు. హాల్లో లైటు వేయగానే టేబిల్ మీద చిన్నసైజు లెటర్ కనిపించింది. ‘‘నేనెక్కడికి వెళ్లానా అని ఆలోచించకండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను అడుగుతీసి అడుగెయ్యలేననే కదా మీ ధైర్యం. నేను కుక్కిన పేనులా పడుంటాననే కదా మీ నమ్మకం. నాలాంటి వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. ఆర్టీసి బస్సుల్లో మా ఇష్టం వచ్చిన చోటుకు మా ఇష్టం వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛ లభించింది. నా కోసం వెతకొద్దు’’అదీ మ్యాటర్. ప్రియతమ్ లిప్తపాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే సర్దుకున్నాడు. ‘సరే. ఆ ముచ్చట కూడా చూద్దాం. అది లేకపోతే నాకు తిండి దొరకదా ఏంటి. ఎలా వెళ్లింది అలాగే వస్తుందిలే. రాకపోయినా వచ్చిన నష్టం లేదు హోమ్లీ హోటలుంది’ అని తనకు తాను చెప్పుకొని శుభ్రంగా ఫ్రెష్ అయి లుంగీలోనే రోడ్డు మీదకు వెళ్లాడు. కొత్త కొట్టు దగ్గరకి వెళ్లాడు. వేడి వేడిగా ఓ సమోసా తిన్నాడు. ఆనక ఓ స్పెషల్ టీ తాగాడు. అక్కడ మంత్లీ కార్డు సిస్టమ్ కూడా ఉందని తెలుసుకొని డబ్బు కట్టేశాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లినప్పుడు క్యారియర్ ఇచ్చేస్తే ఆఫీసుకు బయల్దేరే సమయానికి మంచి భోజనంతో క్యారియర్ రెడీ చేస్తారంట! ‘తంతే భోజనశాలలో పడ్డాం’ అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. కాస్సేపు ఇలా అలా గడిపేసి డిన్నర్ టైమ్ కాగానే మళ్లీ కొత్తకొట్టుకు వెళ్లి తృప్తిగా భోజనం చేసేసి వస్తూ వస్తూ దార్లో ఓ మిఠాయి కిళ్లీ కూడా కట్టించుకొని వేసుకొని డర్రుమని ఓ తేనుపు తీసి ఇంటికొచ్చి నడుం వాల్చీ వాల్చగానే హాయిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.∙∙ ఆ రోజు ఉదయం ప్రియతమ్ ఆఫీసుకు వెళ్లగానే పేపరు చదువుతున్నది ‘ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. సిటీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఎన్ని సార్లయినా వాళ్లు స్వేచ్ఛగా ప్రయాణించ వచ్చు’ అన్న వార్త చదివి ఎగిరి గంతేసింది. ఇక క్షణం కూడా నిలవలేక పోయింది. గబగబ పనులన్నీ ముగించుకొని చిన్న సంచిలో ఓ రవిక జాకెట్టు పెట్టుకొని ఇంటికి తాళం వేసి, దాని చెవి పక్కింటాంటీకి ఇచ్చి, రోడ్డు మీదకు వెళ్లీ వెళ్లగానే బస్సు. వెనకా ముందు చూడకుండా ఎక్కీసింది. అప్పుడు ఉదయం 11. భరత్‌నగర్ దగ్గర సుందరి ఎక్కిన బస్సు అనేక స్టాపుల్లో ఆగుతూ దిల్షుక్ నగర్ మీదుగా వెళ్తోంది. దిల్షుక్ నగర్లో సాయిబాబా మందిరం గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్లు పులకరించింది. మరో ఆలోచన లేకుండా అక్కడ దిగేసింది. ఎప్పటినుంచో దాచుకున్న వందో నూటయాభయ్యో రూపాయల్ని ఎందుకైనా మంచిదని పట్టుకొంది. బాగా దాహమేసి గొంతెండిపోతుంటే ముందు ఓ సోడా తాగింది. చాలా ఆనందమేసింది. గోలీ సోడాతో దాహం తీరినందుకు కాదు, స్వతంత్రంగా ఓ సోడా కొనుక్కోగలిగినందుకు. తర్వాత బాబాను దర్శించుకుంది. ఈలోగా ఉచిత భోజన వితరణ వేళయింది. ‘ఏమి నా భాగ్యం’ అనుకుంటూ బాబా ప్రసాదం ఆరగించింది. కొద్దిసేపు మందిరమంతా కలియతిరిగి అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సు ఎక్కీసింది. అక్కడ బస్సు మారి చిలుకూరు వెళ్లింది. బాలాజీని దర్శించుకొని తిరిగి మెహిదీపట్నం వచ్చింది. పెద్దపెద్ద స్తంభాల మీద వంకీలు తిరిగున్న బ్రిడ్జిని, స్తంభాల మధ్యనుంచి రాకపోకలు సాగించే బస్సులు, కార్లు, స్కూటర్లను ఎప్పుడూ చూడని అందాలను తనివితీరా సంతోషంగా చూసి తర్వాత కూకట్పల్లి వెళ్లే బస్సు ఎక్కి తాము ప్రవచనం విన్న గుడికి చేరింది. స్వామివారు ప్రవచనం ముగించినట్లున్నారు భక్తులెవరూ లేరు. తను వెళ్లి దేవుడ్ని దర్శించుకొని దేవాలయంలో ఓ మూల కూర్చొంది. కాస్సేపటికి పూజాదికాలు ముగించి మంగళహారతులిచ్చేసి గుడి తలుపులు వేసేసి వచ్చిన పూజారికి ఓ మూల కూర్చున్న సుందరి కనిపించింది. ‘‘ఎవరమ్మా నువ్వు. గుడి తలుపులు కూడా వేసేశాం. చూసుకో లేదా. నువ్వు ఇక్కడే ఉండిపోయావు’’ అన్నారు.‘‘లేదు స్వామీ. ఈ రోజు నేనిక్కడే ఉందామనుకుంటున్నాను. దూరం నుంచి వచ్చాను’’అంది సుందరి‘‘అలాగా! అయితే భక్తుల విశ్రాంతి మందిరం ఉంది. అక్కడుండమ్మా!’’ అన్నారు.అలా అక్కడ ఆశ్రయం పొందిన సుందరి తెల్లవారే లేచి, అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని, స్నానపానాలు కానిచ్చి దేవుని దర్శించుకొని బయటపడింది. ఆ రోజు కూడా తను చాలా చోట్లకు తిరిగి తిరిగి రాత్రికి మళ్లీ అక్కడికే చేరుకుంది.ప్రియతమ్కు బ్యాచిలర్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ‘టైమ్‌కు అన్నీ అందితే, ఈ సంసారం అనే జంఝాటమెందుకు? బ్యాచిలర్ బతుకే సో బెటర్ అయితే ఫోర్స్డ్ బ్యాచిలర్ బతుకు సోమచ్ బెటర్’ అని రోజు రోజుకీ హుషారుగా ఉన్నాడే కానీ ‘కట్టుకున్నది ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లిందో, ఏమైపోయిందో ఏమిటో’ అని ఆమె మీద ధ్యాస గాని, ఆశ గాని లేకుండా గడిపేస్తున్నాడు.ఇలా ఇద్దరూ ఒకరి నొకరు తలచుకోకుండా రెండు మూడు రోజులు గడిపేశారు. కాని, ఆ రోజు కథ అడ్డం తిరిగింది. విచిత్రంగా ఇద్దరి కొత్త జీవితం ఊహించని మలుపు తిరిగింది.ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న ప్రియతమ్ బండి ఒక్కసారి గాలి తీసినట్లు ఆగిపోయింది. కొత్తకొట్టు మూసేసి ఉంది. ఆ రోజు భోగి పండగ. సంక్రాంతికి వీధుల్లోని టీ, టిఫిన్స్ మీల్స్ దుకాణాలన్నీ బంద్ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతారు. సాయంకాలాలు, పండువెన్నెలలు, పండుగలు పబ్బాలు లేకుండా అంగళ్లమీద ఆధారపడుతూ యాంత్రికంగా గడిపేవారికి ఆ మూడు రోజులు చెప్పరాని ఇబ్బందే! భోగి ముందు రోజు తను ఆఫీసులోనే ఉండిపోవల్సి వచ్చింది. తనతోపాటు మరొ నలుగురైదురుకీ అదే పరిస్థితి. పెద్దపండగకి మెజార్టీ స్టాఫ్ సెలవులు పెట్టేయడంతో మిగిలినవారిమీద వర్క్ ప్రెజర్. డబుల్ డ్యూటీలు చేస్తేగాని పెండింగ్ అంతా క్లియర్ కాలేదు. ఆ హడావిడిలో హోటళ్ల సంగతే మరిచాడు ప్రియతమ్.డీలా పడిపోయి ఇంటికొస్తున్నవాడికి సుందరి గుర్తొచ్చింది.∙∙ సాయంత్రం వరకూ ఎక్కడెక్కడికో వెళ్లి అలవాటుపడ్డ గుడికి తిరిగొస్తున్న సుందరికి షాక్ తగిలింది. ఆలయ నిర్వాహకులు గుడిలోకి ఎవరినీ రానివ్వడం లేదు. లోపల ఉన్నవారిని వెతికి వెతికి బయటకు పంపించేస్తున్నారు. కొద్ది సేపట్లో చంద్రగహణం. అందుకే ఆలయం మూసేస్తున్నారు. సంప్రోక్షణం చేశాక మళ్లీ మర్నాటి వరకు ఆలయాన్ని తెరవరు. దర్శనాలు బంద్.సాయంత్రం బస్సులో తిరిగొస్తున్నప్పుడు అందరూ అనుకుంటుంటే తెల్సింది.. ‘ఈ వేళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్’ అని. తమ డిమాండ్లు తీర్చకపోతే సమ్మెకు దిగుతామని కార్మికులు ఎప్పుడో నోటీసు ఇచ్చారట! షరా మామూలుగా ప్రభుత్వం నాన్చి నాన్చి సంక్రాంతికి బస్సు సర్వీసులు లేకపోతే జనాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కార్మిక నాయకులతో చర్చలు మొదలుపెట్టిందట! ఆ చర్చలు మరో గంటో ఘడియలో సక్సెస్ అయితే సమ్మె ఉండదు. చర్చలు విఫలమైతే? ఏం పర్వాలేదులే, నేను నమ్ముకున్న దేవుడి గుడి ఉందిగా అని ధీమాపడ్డ సుందరికి చెంపదెబ్బ గోడదెబ్బలాగ గుడి, బస్సుల సంగతి తెల్సి నవనాడులు కుంగిపోయాయి.అక్కడే ఓ మూల గుడి స్తంభానికి జేరబడి కూలబడిపోయిన సుందరికి ప్రియతమ్ గుర్తొచ్చాడు.అందర్నీ పంపేస్తూ సుందరి దగ్గరికి వచ్చిన స్వామివారు, ‘‘అదేంటమ్మా. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. తలుపులు వేసేస్తారు. వెళ్లిపో’’ అంటూ ఆమె కళ్లలోకి చూసి అవాక్కయ్యారు. సుందరి కళ్లల్లో నీటిపొరను చూసి విచలితులయ్యారు. ఏమైందో అడిగి అంతా తెల్సుకున్నారు. ‘‘ఇదేంటమ్మా. ఇలాగేనా కాపురాలు చెయ్యడం. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి కదా. నీ తెలివితేటలు ఏమయ్యాయి? మీ ఆయన ఫోన్స్ నంబరు చెప్పు’’ అనేసరికి తడిగొంతుతో నంబరు చెప్పింది.కాస్సేపట్లోనే గుడిదగ్గరికొచ్చిన ప్రియతమ్ సుందరిని చూసి అలా ఉండిపోయాడు కాని, దగ్గరికి వెళ్లలేదు. సుందరి కూడా ఒకడుగు వేయబోయి ఆగిపోయింది. వీళ్లవస్థ చూసిన స్వామివారు ‘‘బాగుంది మీ వాలకం. ఇంత దూరం వచ్చినవాడివి దగ్గరకు రాలేవా? ఏమ్మా ఆయన వెనక ఏడడుగులు నడిచినదానివి ఒక్కడుగుతో ఆగిపోయావేం! మీకు మీరే గొప్ప అని ఎవరికి వారు అనుకుంటూ బంగారంలాంటి బంధాన్ని పాడుచేసుకుంటున్నారు. బంధమనేది ఉల్లిపాయ చందంలా పొరలు పొరలుగా బలపడాలి. వద్దనుకొని కట్ చేసుకుంటే కన్నీళ్లే వస్తాయి. పెట్రోల్ పడ్డ దగ్గర అగ్గిపుల్ల పడ్డట్టు కాకుండా పప్పు వొలికిన చోట నెయ్యి వొలికినట్లుగా కాపురం సాగాలి’’ అని ఇద్దరి చేతులు కలిపేసి తలుపేసేశారు.దగ్గరి కొచ్చిన సుందరి ఏదో అపరాధభావంతో తలొంచుకొని ఉండిపోయింది. ప్రియతమ్ ఆమె భుజాలపై చేయి వేసి ధైర్యం చెబుతున్నవాడిలా దగ్గరికి తీసుకున్నాడు. బండి స్టార్ట్ చేసి కనిపించిన గతుకుల్ని తప్పించుకుంటూ స్మూత్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే..‘‘సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా.. నీ అందచందాలింక నావె కదా’’ అన్న పాట దూరం నుంచి మైకులో వినపడుతోంది.పాట వింటూ సుందరి ప్రియతమ్ను గట్టిగా పట్టుకొని అల్లుకుపోయింది.∙ -
సత్వర స్పందనతోనే.. స్కామ్ బట్టబయలు
తమిళనాడు కడలూరు జిల్లాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేసిన ఓ మహిళ కుమారుడు తరచు ఆ బ్యాంక్‌కు వచ్చి వెళ్తుండే వాడు. ఇలా ఆ కార్యకలాపాలన్నీ తెలుసుకున్న ఈ బాబు– తనకు పరిచయస్థులైన మరో ఇద్దరితో కలిసి అక్కడి పన్రుటిలో ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరిచాడు. ఈ బ్రాంచ్ మూడు నెలలు బాగానే నడిచినా, 2020 జూలైలో పోలీసులకు ఫిర్యాదు అందటంతో, ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. దాంతో బ్రాంచ్ మూతపడింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడానికి కారణమేమిటంటే, అక్కడకు వచ్చే కస్టమర్లతో ముగ్గురు నకిలీ ఉద్యోగులూ అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలపై సత్వరం స్పందిస్తుండటమే!ఇలాంటి స్పందన కారణంగానే హైదరాబాద్‌లోనూ నకిలీ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ బయట పడింది. దీనిపై 2023 జనవరి 15న కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదే నెల 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే ఓ బ్యాంక్ గ్యారంటీ అంశానికి సంబంధించి ఈ–మెయిల్ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే? అలాంటి స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచ్చిన సందేహమే ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీల స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాల తయారీ అడ్డాలు ఉన్నాయి. సరైన అర్హతలు లేని కంపెనీలు కాంట్రాక్టులు దక్కించుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి నకిలీ బ్యాంక్ గ్యారంటీలు ఉపకరిస్తూ ఉంటాయి. కోల్‌కతా ముఠాలకు దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్‌కు చెందిన లోన్ ఏజెంట్ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇన్స్ ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ అప్పట్లో రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి వచ్చింది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో కొన్ని వ్యాపార సంస్థలు, కొందరు కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్ గ్యారంటీల కోసం ఏజెంట్ల సహాయం తీసుకుంటూ ఉంటారు. దీనికోసం కొందరు ఏజెంట్ల వద్దకు వెళ్తే, మరికొందరు ఏజెంట్లు కమీషన్ల కోసం వీళ్లను వెతుక్కుంటూ వస్తుంటారు. అప్పట్లో నాగరాజు స్వయంగా హర్షిత ఇన్ఫ్రా ఎండీని కలిశాడు. ఆయనకు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు అందిస్తానని, అందుకు కొంత కమీషన్ చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాపార రంగంలో బ్యాంక్ గ్యారంటీలు సాధారణమే కావడంతో హర్షిత ఇన్ఫ్రా ఎండీ అంగీకరించారు. నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేష్ వర్మ ద్వారా కోల్‌కతా వాసులు నీలోత్పల్ దాస్, శుభ్రజిత్ ఘోషాల్లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ పత్రాలను వివిధ కంపెనీలకు అందించారు. ఈ వ్యాపారం చేసే వారికి అనేక బ్యాంకులతో ఒప్పందాలు ఉంటాయి. నిర్ణీత సమయానికి గ్యారంటీ పత్రం తీసుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించడంతో పాటు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బు మిగుల్చుకోవాలని భావించిన ఆ నలుగురూ హర్షిత సంస్థకు మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి అందించారు. ఇవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్ డెవలప్మెంట్ శాఖకు దాఖలు చేసి కాంట్రాక్టు పనులు కూడా పొందింది. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్ చెక్ చేయవు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్‌ను సంప్రదించి సందేహ నివృత్తి చేసుకుంటాయి. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్ ద్వారా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విభాగాలు, బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న సంస్థలు క్రాస్ చెక్ చేస్తాయని తెలిసిన కోల్‌కతా ద్వయం– ఇలా వచ్చే ఈ–మెయిల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని మెయిల్ ఐడీలు రూపొందించింది. హర్షిత ఇన్ఫ్రా సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్ గ్యారంటీలను సరిచూడాలని భావించిన అర్బన్ డెవలప్మెంట్ అధికారి అందులో ఉన్న ఈ–మెయిల్‌కు సంప్రదించారు. ఫలానా బ్యాంక్ గ్యారంటీ లేఖ మీరు జారీ చేసిందేనా? అని ప్రశ్నించారు. ఈ–మెయిల్‌ను అందుకున్న శుభ్రజిత్ బ్యాంకు అధికారి మాదిరిగానే స్పందిస్తూ, అవి నిజమైనవేనంటూ బదులిచ్చాడు. కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో అర్బన్ డెవలప్మెంట్ అధికారి సందేహించారు. దీంతో కోల్‌కతాలోని బ్రాంచ్ నుంచి వచ్చిన జవాబును, ఆ బ్యాంకు గ్యారంటీలను పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. వీటిని ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా పంపి తమ సందేహాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని చూసిన అక్కడి అధికారులు అవాక్కయ్యారు. గ్యారంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు బ్రాంచ్ లేదని స్పష్టం చేశారు. తమ ఈ–మెయిల్ ఐడీలు కూడా అలా ఉండవని తెలిపారు. దీంతో ఈ శాఖ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు దీని దర్యాప్తును సీసీఎస్‌కు బదిలీ చేశారు. మరోపక్క అసలు విషయం తెలుసుకున్న హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసు కూడా సీసీఎస్‌కు బదిలీ అయింది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. వీరిపై అభియోగపత్రాలు సైతం దాఖలు కావడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. -
Rama Navami 2025: పిబరే రామరసం..
‘రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమఃరాజా సర్వస్య లోకస్య దేవానం మఘ వానివ’శ్రీరాముడి వ్యక్తిత్వం ఏమిటో తెలిపే ఈ శ్లోకాన్ని మారీచుడి నోట పలికించాడు వాల్మీకి. రాముడు అంటే మూర్తీభవించిన ధర్మం. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. అతడి పరాక్రమానికి తిరుగు లేదు. దేవతలకు దేవేంద్రుడు ప్రభువు అయినట్లుగానే, సకల చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు శ్రీరాముడు. శ్రీమహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పూర్ణావతారం. వేదవిహితమైన ధర్మం భౌతిక నేత్రాలకు గోచరించదు. ఆచరణీయమైన ధర్మం ఆకారం దాల్చాలనే కోరికతో శ్రీరాముడి రూపంలో భూమిపై అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదికావ్యం. ‘ఆయనం’ అంటే గమనం అని అర్థం. రాముడి గమనమే రామాయణం. భూమ్మీద నరుడిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి– ఇదీ ధర్మం అని సర్వలోకాలకు చాటిచెప్పాడు శ్రీరాముడు.రామాయణ గాథ మన దేశంలో పామరులకు కూడా తెలుసు. శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు, ఆదర్శదైవం కూడా! ఆసేతు హిమాచలం మన దేశంలో రామాలయాలు లేని ఊళ్లు ఉండవు. అయోధ్య నగరంలో పుట్టిన రాముడు పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. రాముడు వనవాసంలో ఉండగానే, సీతాపహరణం జరిగింది. సీతను అపహరించిన రావణుడి జాడ వెదుక్కుంటూ, దండకారణ్యంలో సంచరిస్తున్న శ్రీరాముడిని హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయనకు నమ్మినబంటు అయ్యాడు. రామలక్ష్మణులను తన ప్రభువు సుగ్రీవుడి వద్దకు తీసుకుపోయి, అతడితో మైత్రి కుదిర్చాడు. సుగ్రీవాజ్ఞతో సీతను వెదకడానికి వానరవీరులు నలుదిక్కులకూ బయలుదేరారు. దక్షిణంవైపు బయలుదేరిన బృందంలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకుని సీతమ్మవారి జాడ కనుగొన్నాడు. ఆమెకు కనిపించి, ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి మరీ రామదండు ప్రతాపం ఎలాంటిదో రావణుడికి రుచి చూపించాడు. లంక నుంచి తిరిగి వచ్చి, శ్రీరాముడికి సీతమ్మవారి క్షేమ సమాచారాన్ని తెలిపాడు. వానరసైన్యంతో లంకకు చేరుకున్న రాముడు చివరకు రావణుడిని వధించి, సీతను అయోధ్యకు తీసుకువచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు. స్థూలంగా ఇదీ రామాయణం. రామాయణం దేశ విదేశాల్లోని పలు భాషలలోకి అనువదితమైంది. రామాయణానికి సంబంధించి వేర్వేరు భాషలలో వేర్వేరు కథలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామాయణాలు ఉన్నా, వాల్మీకి విరచితమైన రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. శ్రీరాముడి ధర్మనిరతికే కాదు, ఉదాత్తతకు, స్వదేశాభిమానానికి కూడా రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి. రావణ సంహారం తర్వాత లంకాపుర వైభవాన్ని తిలకించి, లక్ష్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎటు చూసినా స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది లంకానగరం. ‘అన్నా! ఈ లంకానగరం స్వర్ణకాంతులతో ఎంత శోభాయమానంగా ఉందో కదా!’ అన్నాడు లక్ష్మణుడు. అందుకు బదులుగా శ్రీరాముడు చిరునవ్వు చిందిస్తూ–‘అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కానన రోచతేజననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని పలికాడు.అంటే, ‘లక్ష్మణా! ఈ లంకానగరం ఎంతగా బంగారు కాంతులతో ధగధగలాడుతున్నా, ఇది నాకు రుచించడం లేదు. కన్నతల్లి, పుట్టిననేల స్వర్గం కంటే గొప్పవి’ అని పలికాడు. రావణుడిని సంహరించి, యుద్ధంలో జయించినా, రాముడు లంకను స్వాధీనం చేసుకోలేదు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేసి, సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. శ్రీరాముడి స్వదేశాభిమానానికి ఇది మచ్చు తునక. రామ రావణ యుద్ధంలో రావణుడు మరణించాక, ‘నా అన్న అయినా, ఇతడు పాపాత్ముడు. ఇటువంటి పాపాత్ముడికి అంత్యక్రియలు చేయడం కూడా పాపమే’ అని నిష్ఠురంగా పలికాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి హితవు చెప్పాడు.‘మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనంక్రియాతాం అన్య సంస్కారో మయాప్యేష యథాతవ’ అని పలికాడు. అంటే, ‘వ్యక్తులు మరణించిన తర్వాత వారితో వైరం ఉండకూడదు. ఇతడికి అంత్యక్రియలు చెయ్యి. ఇతడు నీకులాగానే నాకు కూడా గౌరవార్హుడే!’ అన్నాడు. ఇది శ్రీరాముడి ఔదార్యానికి ఉదాహరణ. శ్రీరాముడు ఇంతటి ఉదాత్తుడు, ధర్మనిరతుడు కావడం వల్లనే ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. శ్రీరామ నవమి వేడుకలుశ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి చేరుకున్నాక ఇదే తిథినాడు పట్టాభిషిక్తుడయ్యాడని, సీతారాముల కల్యాణం కూడా చైత్ర శుక్ల నవమి రోజునే జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లోనూ, ఊరూరా ఏర్పాటు చేసే మంటపాల్లోను సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ కావడంతో శరీరానికి చలవ చేసే వడపప్పును, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణలోని భద్రాచలంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలోను శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో నైవేద్యంగా గోధుమరవ్వ హల్వా, పూరీలు, గోధుమపిండితో తయారు చేసే ‘పింజిరి’ అనే మిఠాయి, పాయసం, ఉడికించిన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల గురించి తెలుగు ప్రజలకు తెలుసు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య సహా దేశ విదేశాల్లో పలుచోట్ల విశేషమైన రామాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయోధ్య సహా కొన్ని అరుదైన రామాలయాల గురించి తెలుసుకుందాం.అయోధ్య బాల రామాలయంశ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన బాల రాముడి (బాలక్ రామ్) ఆలయం గత ఏడాది జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయంలో నెలకొల్పిన బాల రాముడి విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. అయోధ్య బాల రామాలయంలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. జనక్‌పూర్ సీతా రాముల ఆలయాలుసీతమ్మవారి జన్మస్థలమైన జనక్‌పూర్ నేపాల్‌లో ఉంది. ఇక్కడ పురాతన జానకీమాత ఆలయం ఉంది. ఇదే పట్టణంలోని కులదేవీ ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా రామాలయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా జనక్‌పూర్‌లోని జానకీమాత ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు జరిపి, మైథిలీ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. లక్షలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మైథిలీ సంస్కృతికి అద్దంపట్టేలా పలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఓర్ఛా రాజారామ్ ఆలయంమధ్యప్రదేశ్లోని ఓర్ఛా పట్టణంలో పురాతన రాజారామ్ ఆలయం ఉంది. ఓర్ఛా మహారాజు మధుకర్ షా జు దేవ్ పదహారో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజప్రాసాదాన్ని తలపించేలా అడుగడుగునా రాజసం ఉట్టిపడే ఈ ఆలయంలో శ్రీరాముడు సింహాసనంపై సీతాసమేతంగా ఆసీనుడై తన పరివారంతో కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తాడు. సీతారాముల సింహాసనానికి çకుడివైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సుగ్రీవుడు, కిందన ప్రార్థిస్తున్న భంగిమలో హనుమంతుడు, జాంబవంతుడు ఉంటారు. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.నాసిక్ కాలారామ్ ఆలయంనాసికా త్రయంబకేశ్వరం శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గోదావరి నది పుట్టిన చోటు ఇక్కడే ఉంది. ఇదే పట్టణంలో పురాతనమైన రామాలయం కూడా ఉంది. దీనిని స్థానికులు ‘కాలారామ్’ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడి విగ్రహాన్ని నల్లరాతితో మలచడం వల్ల ‘కాలారామ్’ అనే పేరు వచ్చింది. ఆలయ ప్రవేశమార్గంలో నల్లరాతితో మలచిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం రాష్ట్రకూటుల నాటిదని చరిత్రకారుల అంచనా. సుమారు ఏడో శతాబ్దినాటి ఈ ఆలయంపై దండయాత్ర జరిగినప్పుడు విగ్రహాలను ఒక బావిలో పడవేశారు. తర్వాత వాటిని బయటకు తీసి, పునఃప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణానికి పద్దెనిమిదో శతాబ్ది తొలినాళ్లలో సర్దార్ రంగారావు ఓఢేకర్ నిధులు సమకూర్చారు. శ్రీరామ నవమినాడు ఈ ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతాయి.కుంభకోణం రామస్వామి ఆలయంతమిళనాడులోని కుంభకోణంలో పదహారో శతాబ్ది నాటి రామస్వామి ఆలయం ఉంది. తంజావూరు నాయక రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం దేశంలోని పురాతన రామాలయాల్లో ఒకటి. అచ్యుతప్ప నాయకుని హయాంలో మొదలైన దీని నిర్మాణం రఘునాథ నాయకుని కాలంలో పూర్తయింది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. జమ్ము రఘునాథ ఆలయంజమ్ము నగరంలో తావి నదీ తీరానికి ఉత్తరాన రఘునాథ స్వామి ఆలయం ఉంది. పద్దెనిమిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో రఘునాథుడిగా శ్రీరాముడు కొలువైన ఆలయం ప్రధానమైనది. ఇదే ప్రాంగణంలో సూర్యభగవానుడి ఆలయం, శ్రీమహావిష్ణువు ఆలయం కూడా ఉన్నాయి. రఘునాథ స్వామి ఆలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కొలువై కనిపిస్తాయి. ఏటా శ్రీరామ నవమి రోజున ఈ ఆలయంలో సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.సైదాపూర్ రామ్‌కుండ్ మందిరంపాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివార్లలోని సైదాపూర్‌లో పురాతనమైన రామ్‌కుండ్ మందిరం ఉంది. వనవాస కాలంలో సీతా రామ లక్ష్మణులు ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు. పదహారో శతాబ్దిలో అంబర్ పాలకుడు మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరువలో ఉన్న తటాకాన్ని ‘రామ్ కుండ్’ (రామ కుండం) అని పిలుస్తారు. ఈ తటాకానికి చేరువలోనే భక్తుల బస కోసం ధర్మసత్రాన్ని కూడా మాన్ సింగ్ కాలంలోనే నిర్మించారు. ఇస్లామాబాద్ నగరాభివృద్ధిని పర్యవేక్షించే రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (కేపిటల్ డెవలప్మెంట్ అథారిటీ) 2006లో ఈ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా మలచేందుకు చర్యలు చేపట్టి, విగ్రహాలను తొలగించింది. అప్పటి నుంచి ఇక్కడ పూజాదికాలు నిలిచిపోయాయి. అయితే, దీనిని సందర్శించుకోవడానికి పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.అమృత్సర్ రామతీరథ్ మందిరంపంజాబ్లోని అమృత్సర్ శివార్లలో రామతీరథ్ మందిరం ఉంది. ఈ ప్రదేశంలోనే సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిందని, ఇక్కడే లవకుశులు జన్మించారని స్థలపురాణం చెబుతోంది. రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడే రచించాడని కూడా స్థలపురాణ కథనం. ఈ ఆలయం ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలో 2016లో దీనిని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఎదుట తటాకం, ఆలయ ప్రాంగణంలోని ఎనభై అడుగుల భారీ ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.∙ -
పంచాంగ సూచనలు
సూర్యభగవానుడు ధనస్సురాశిలోఉండే మాసాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షణ, శివార్చన సర్వసిద్ధిప్రదం. విద్యాప్రాప్తి కొరకు మేధా సంపత్తి కొరకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. నీలంరంగు ఉమ్మెత్త పూలతో అర్చన చేయుట సర్వకార్యసిద్ధి, శత్రుసంహారము. సంసార సంబంధమైన సర్వబాధలు నివారణకు లకీ‡్ష్మనరసింహస్తోత్ర పారాయణ చేయండి. శ్రీచక్రం ఇంట్లో వుంటే శౌచం ఎక్కువగా పాటించాలి. శివునికి బిల్వపత్రం, గణపతికి గరిక, విష్ణువుకు తులసి మహాప్రీతి. సంతానప్రాప్తికి శివారాధన విశేష ఫలితాలనిస్తుంది. బృహస్పతి అనుగ్రహం కోసం గురువారం శనగలు దానం చేస్తే మంచిది. షష్టిపూర్తి 60 నిండిన తర్వాత సంవత్సరాలలో చేసుకోవలెను. ఉగాదినాడు పంచాగానికి కాలపురుషాయ నమః అని పూజ చేయవలెను. కలియుగంలో భగవంతుడి నామస్మరణం ముక్తికి సులభోపాయం. రోజూ గణపతి స్తోత్ర పారాయణ వలన విఘ్నాలు తొలగును. దక్షిణామూర్తి, హయగ్రీవ దేవతా ఆరాధన వలన విద్యాప్రాప్తి. నిత్య భగవదారాధన తర్వాత, లోకక్షేమం కొరకు కూడా ప్రార్థించుట మంచిది. రోజూ కొంత సమయం దేశక్షేమం కొరకు దైవారాధన చేయుటచే మంచి నాయకులు ఉద్భవిస్తారు. దేవతారాధన ఎంతో– పితృదేవతా రాధనకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ఉగాదినాడు పంచాంగ పూజ, శ్రవణం తప్పక చేయవలెను. నిత్యపూజలో నివేదన చేసే పదార్థం మీద ఆవునెయ్యి తప్పనిసరిగా వేయాలి. నిత్యం దేశక్షేమం కోసం కొంత సమయం దైవారాధన చేయండి. కుజగ్రహశాంతికి సుబ్రహ్మణ్య, హనుమ పూజలు శ్రేయస్కరం. అక్షరాభ్యాసములకు ఉత్తరాయనం విశేషం కొత్తబియ్యాన్ని పితృదేవతలకు నివేదించిన తరువాతే ఉపయోగించాలి. రోజు దైవారాధన అయ్యాక భగవంతునికి యథాశక్తి నైవేద్యం పెట్టవలెను పుష్కర శ్రాద్ధం సోదరులు అందరూ కలసి పెట్టరాదు. విడిగానే పెట్టాలి. గరికతో రోజూ గణపతిని అర్చిస్తే, కార్యవిజయం, కేతుగ్రహానుకూలం. పితృ దేవతారాధన సరిగా చేయకుంటే కుటుంబంలో దోషాలు వస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మి ఆరాధన చేయండి. మాసశివరాత్రి రోజు శివకళ్యాణం చేయుట ద్వారా వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. బుధ గ్రహ అనుగ్రహం కోసం విష్ణు స్తోత్రములు పారాయణ చేయవలెను. ప్రతిరోజూ ఉదయకాలంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. శని త్రయోదశీ ప్రదోషకాలంలో శివపూజ ద్వారా సర్వసౌఖ్యాలు అందుతాయి. దీపారాధన చేయుటకు ‘‘వత్తులు’’ స్వయంగా తయారు చేసుకోవాలి. కనుమ రోజున ప్రయాణం చేసే ఆచారం మన ప్రాంతాలలో లేదు. మారేడు, తులసీ, తెల్లజిల్లేడు దేవతా వృక్షాలు. వీటిని స్నానం చేయకుండా ముట్టుకోరాదు. వ్యాసపూజ రోజున యతీశ్వరులను పూజించాలి. దుర్గాపూజలు చేయుట ద్వారా రాహుగ్రహ శాంతి కలుగును. గురు, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే విద్యాభంగం ఏర్పడుతుంది. పేగు మెడలో వేసుకుంటే నాళవేష్టన జనన శాంతి చేయించాలి. వర్జ్యంలో పుడితే విషఘటికా శాంతి చేయించాలి. శుక్ర, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే వైవాహిక జీవితం ఇబ్బందికరం. అస్థి సంచయనం కేవలం ఒక జీవనదిలోనే చేయాలి. రెండు మూడు నదులలో చేయరాదు.శంకుస్థాపన చేసిన రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయుట దోషం కాదు. శుక్ర నక్షత్రాలలో రాహువు, రాహు నక్షత్రాలలో శుక్రుడు ఉండడం వైవాహిక జీవితానికి ఇబ్బంది. శనివారం నువ్వులనూనె శరీరానికి రాసుకొని స్నానంచేయుట ద్వారా శనికి శాంతి. కార్తీకమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కైశిక ద్వాదశి అని అంటారు. కుజ గ్రహ శాంతి చేయించినా కుజదోషం ఉన్నవారికి ‘’కుజదోషం ఉందనే’’ చెప్పాలి. భగినీ హస్త భోజనం కార్తీక శుద్ధ విదియ నాడు చేయుట ఆయుర్వృద్ధి.గ్రహణ శాంతిగ్రహణ శాంతి: గ్రహణ సమయంలో ఇంట్లోని అన్ని వస్తువుల మీద దర్భలు ఉంచడం మన సనాతన ధర్మం. గ్రహణ ఆరంభంలో అందరూ సనాతన ధర్మం ఆచరించేవారు. స్నానం చేసి దైవ సంబంధ స్తోత్ర పారాయణ మంత్ర, జపాదులతో కాలక్షేపం చేసి గ్రహణానంతరం స్నానం చేయండి.దానం: వెండిచంద్రబింబం, నాగపడగ, బియ్యం, గోధుమలు, తెలుపువస్త్రం, కెంపు, రాగిపాత్ర, కంచుపాత్ర, నువ్వులు, ఆవునెయ్యి, దక్షిణ దానం ఇవ్వవలెను. గ్రహణం రోజు, మరుసటి రోజు లేదా మరల పౌర్ణమి లోపు దానం ఇయ్యవచ్చును. వెండితో చంద్రబింబం మాదిరిగా (బొట్టు బిళ్ళ మాదిరి) చేయించి దానం చేయవలెను.దాన సంకల్పం: ‘‘మమ జన్మరాశి జన్మనక్షత్రవ శాద్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే’’దాత చదవవలసిన శ్లోకం: తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమ తారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.. ఎటువంటి దానం ఎప్పుడు ఇచ్చినా దానంతో పాటుగా ‘స్వయంపాకం’ ఇవ్వడం శుభప్రదం. గ్రహజపం వంటివి చేయించినాసరే ఇవ్వండి.గ్రహణశాంతి అనేది మహర్షులు గ్రంథస్థంగా చెప్పిన అంశం. దీనికి వైదికాచారం జోడించి పెద్దలు చెప్పే విషయాలను ప్రస్తావన చేశాం. సూర్య చంద్రులను ప్రత్యక్ష దైవాలుగా భావన చేసి మనం నిత్యం దైవ సంబంధ కార్యాలు చేస్తూ ఉంటాము. వారిరువురిలో ఏ ఒక్కరైనా ప్రత్యక్షంలో లేరు అంటే గ్రహణంగా భావన చేసి శాంతి పూజ చేయుట మన మతాచారం. అందుకోసమే ప్రతి అమావాస్య వెళ్ళిన మరుసటిరోజున, గ్రహణం మరుసటిరోజున, జాతాశౌచ, మృతాశౌచములకు మరుసటì æరోజున దేవతామందిరం అంతా కూడా శుభ్రంచేసి మరలా విగ్రహాలను కడిగి శుద్ధి చేసి దేవతామందిరములో పెట్టి అర్చన చేయడం మన సంప్రదాయం. -
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
మేష రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–7.అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (తృతీయ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (లాభ), కేతువు సింహరాశి (పంచమ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (వ్యయం)లో సంచారం. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని, పనులు పాడవడం జరగదు. దూకుడుగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపం చేస్తారు. బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి, పనివాళ్లతో సమస్యలున్నా, లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు, కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఋణాలను ఎగవేసే వారు ఎక్కువ అవుతారు. కొత్త ఋణాలు దొరకవు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. నరాలు, ఎముకల సమస్యలు పెరగగలవు. మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా, మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు. రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా, ఆశించిన ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు çఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలు మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.అశ్వని: ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అందరితో మైత్రీ భావంతో ఉంటూ, సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు. మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి: మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ మధ్యలోనే వదిలి వేస్తూ ఉంటారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచనా పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ. ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి. శాంతి మార్గం: నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి. రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి. మే 15 తరువాత శని/ గురువులకు జపం దానాలు చేయడం, నవముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: గురు, కుజుల అనుకూలత బాగుంది. ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పనీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు. మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు. అందరికీ మీ మీద వైరభావం రాగలదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. పనులు వాయిదా వేయకండి. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిదికాదు. మే: కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి. వ్యయంలో వున్న రాహు, శని, శుక్ర సంచారం వల్ల ఎక్కువగా ఇుబ్బందికర çపరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి. ఋణాలు తీర్చడం, కొత్త ఋణాలు దొరకడం కష్టమవుతుంది. జూన్: జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి. ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు. బంధువుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ముందుజాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు. జులై: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వ్యవహారాలలో ఓర్పు, సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆగస్ట్: అన్ని పనులు చక్కగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు 21వ తేదీ నుండి వేగవంతమవుతాయి. మీకు అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. స్వబుద్ధితో కార్య జయం. ధన ధాన్యలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. సెప్టెంబర్: బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా, తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు. అక్టోబర్: కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు. అన్న, వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది. అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది. మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి.నవంబర్: వాక్ నియంత్రణ పాటించడం, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి. ఆర్థిక వెసులుబాటు ఉన్నా, అనవసర ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్: ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం. ప్రతిపనికీ అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు. శుభకార్యాలు, బంధు మిత్రుల కలయిక, కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, శ్రద్ధగా ఋణములు, ఖర్చులు నిర్వహిస్తారు. జనవరి: మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి. ఫిబ్రవరి: కాలం అనుకూలంగా ఉంది. గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఋణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర అవుతాయి. స్థిరబుద్ధిని ప్రదర్శించండి. మార్చి: మొండి ధైర్యం పెరుగుతుంది. వ్యయ గ్రహచారం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలత తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. వృషభ రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–3.కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (ద్వితీయ) స్థానంలో ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (దశమ), కేతువు సింహరాశి (చతుర్థ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (లాభ) సంచారం. శని, గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులను అదుపు చేయగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన ఋణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాలను సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు. షేర్ వ్యాపారులకు లాభాల పంట. రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం. మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవయోగం ఉంది.కృత్తిక 2, 3, 4 పాదాలు: అంతా శుభప్రదంగా ఉంటుంది. తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాపారులకు ఋణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. రోహిణి: తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. ప్రజాసంబంధాలు పెంచు కుంటారు.మృగశిర 1, 2 పాదాలు: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. పుణ్యకార్య, శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ. ఖర్చులు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతః కాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని, నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం. పంచముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: అన్ని పనులలోను ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు వెడతారు. మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయత్నించవలసిన పనులు ఏమయినా ఉంటే 14వ తేదీ లోపుగా చేయండి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. మే: ఎక్కువకాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిరోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్: ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తుంటాయి.పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. జులై: చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతిపనీ అనుకూలమే. మనస్సౌఖ్యం ఎక్కువ. ధనధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబపరంగా అన్నీ అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఋణ, ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు. ఆగస్ట్: అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి. భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది. తరచుగా పనులు మరచిపోతుంటారు. పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది. అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది. సెప్టెంబర్: వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. గత సమస్యల పరిష్కారానికి, కొత్త పనుల ప్రణాళికా రచనకు ఈ నెల అనుకూలం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అందరి నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు. అక్టోబర్: మనోధైర్యంతో ఉంటారు. విద్యా, వినోద, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది. పదిమందికీ సలహాలు ఇస్తారు. ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్: ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబపరంగా గురు, శుక్ర, కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. జ్ఞాతి వైరం ఎక్కువగా ఉం టుంది. శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలలో విçఘ్నాలు ఎదురవుతాయి. అనవసర కాలక్షేపాలు చేస్తారు. డిసెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా, అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు. ఇతర వ్యాపకాలు పనికిరాదు. కేవలం వృత్తి, కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. పాత ఋణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. జనవరి: పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భోజన వసతి 17వ తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఫిబ్రవరి: గోచారం చాలా బాగుంది. ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి, ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి: కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిథున రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–4, అవమానం–3.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (జన్మ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (నవమ), కేతువు సింహరాశి (తృతీయం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (దశమ) సంచారం. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతుంటారు. చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ప్రతిపనీ పరధ్యానంగా చేస్తారు. మీ ప్రయత్నాలు ఏవీ సరిగా సాగవు. చతుష్పాద జంతువులతో ఇబ్బంది ఉంటుంది. సమయపాలనతో రోజువారీ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మే వరకు కొన్ని సమస్యలు ఉంటాయి, మే తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబ వ్యవహారములలో ఇతరుల ప్రమేయాన్ని ఖండిస్తేనే సుఖపడతారు. ఉద్యోగ విషయాల్లో మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు. ప్రతిపనీ మీ అవగాహన లోపం వలన ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆలోచనలకు, అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనిశ్చితి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువ. అనవసర ఖర్చులను నియంత్రించలేకపోతారు. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వస్తునష్టం ఉంటుంది. కొత్త ఋణాలు సకాలంలో అందవు. పాత ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చికాకుపడుతుంటారు. మార్కెటింగ్ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత మంచి ఫలితాలు పొందగలరు. షేర్ వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. రైతులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందు తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిపనీ చికాకు పెడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. విదేశీ నివాస ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలలో పనులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు చాలా విషయాలలో ధైర్యంగా ఉన్నా, బుద్ధి కుశలత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుంచి పెరుగుతుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కలవర పడుతుంటారు. ఆరోగ్యంలో తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర ఘటనలేవీ ఉండవు. జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం.మృగశిర 3, 4 పాదాలు: మీ స్వభావ సిద్ధమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. చతుష్పాద జంతువులు, పెంపుడు జంతువులు ఇబ్బంది సృష్టిస్తాయి. నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా కొంత అనుమానించేలా ఉండటంతో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. ఆరుద్ర: అంతా శుభ పరిణామాలే ఉంటాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. విద్యా, విజ్ఞాన, విషయ శోధనలో కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ధనం వెసులుబాటు, పనివారి సహకారం తక్కువగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు: తరచుగా బుద్ధి స్థిమితం కోల్పోతుంటారు. ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు. అస్థిర బుద్ధితో ఏ పనీ సరిగా చేయలేరు. ఋణ విషయాలలో అవమానకర ఘటనలు ఉంటాయి. శాంతి మార్గం: కుజ గురువులకు జప, దాన, తర్పణ వంటివి తరచుగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రోజూ పఠించండి. ప్రదోషకాలంలో శివాలయంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు సంతృప్తికరంగా వ్యాపారం చేయగలుగుతారు. గురువులను, పూజ్యులను తరచుగా దర్శిస్తుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు సానుకూలం. మే: చాలా అనుకూల వాతావరణం. స్వయంగా పనులు పర్యవేక్షించడం, స్వబుద్ధితో ఆలోచించడం, సమయపాలన ద్వారా విజయావకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహకారం, తోటివారి సహకారం బాగా అందుతుంది. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్: కేవలం ఓర్పు, సహనం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఋణ సౌకర్యం తగ్గుతుంది. జులై: వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. ధనవ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. వస్తువులను తరచుగా మరచిపోతుంటారు. కార్యవిఘ్నం తరచుగా ఉంటుంది. మొండి ధైర్యంతో పనులకు శ్రీకారం చుడతారు. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్: చాలా విచిత్రమైన కాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. విజయాలు సాధిస్తారు. పని ఒత్తిడి ఎక్కువ. అనుకోకుండా కొత్త పనులు చేయవలసి వచ్చి రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సెప్టెంబర్: ఇబ్బందులు లేని కాలమే నడుస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేస్తారు. అంతా శుభంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంటుంది. పెద్దలు, పూజ్యులు, గురువుల సందర్శన, పుణ్యకార్య నిర్వహణలో కాలక్షేపం జరుగుతుంది. అక్టోబర్: సాధారణ జీవనశైలితో ముందుకు వెడతారు. తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం బాగుంటుంది. అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారం బాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు ఇబ్బంది లేకున్నా, భయంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు, శ్రమాధిక్యం ఉంటాయి. నవంబర్: ఊహాతీతంగా పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోని వ్యక్తులు కూడా సహకారం అందిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అప్పులు తీర్చడానికి అనుకూలం. ప్రయాణాలు అధికంగా చేస్తారు. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: శుక్ర, కుజుల అనుకూలత తక్కువగా ఉన్నందున కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకుండా కాలక్షేపం చేయండి. ప్రతి విషయంలో ఓర్పు అవసరం. స్నేహితుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండండి. బంధువర్గంతో కలసి చేసే వ్యాపార వ్యవహారాలు సానుకూలం కావు. పుణ్యకార్య, పుణ్యక్షేత్ర సందర్శన ఖర్చులు పెరుగుతాయి. జనవరి: తరచుగా చేస్తున్న పనులు మానేసి, దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. రవి, కుజ, శుక్ర, బుధ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారాన్ని స్వయంగా సాధించుకోవాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. ఋణ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: చాలాకాలం తరువాత అనుకూల గ్రహచారం చూస్తున్నారు. 13వ తేదీ నుండి కొంత మార్పు, 23వ తేదీ నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. పుణ్య, శుభకార్యాలు చేస్తారు. క్రమంగా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఈనెల ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఋణ సమస్యలు తీరడానికి మంచి మార్గం దొరుకుతుంది. మార్చి: గ్రహచారం అద్భుతంగా ఉంది. అందరూ సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. వాహన కొనుగోలు, అలంకరణ వస్తు కొనుగోలు పనులు వేగంగా జరుగుతాయి. కర్కాటక రాశిఆదాయం–8, వ్యయం–2, రాజయోగం–7, అవమానం–3పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (నవమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అష్టమ), కేతువు సింహరాశి (ద్వితీయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (భాగ్య) సంచారం. ఒక్కోసారి అనుకూలత, ఒక్కోసారి ప్రతికూలత ఎదురవుతాయి. మే నెల నుంచి మానసిక, శారీరక శ్రమ ఎక్కువ. మీ వస్తువులను ఏదో ఒక రూపంగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలనే విషయాలలో అనవసర ప్రయత్నాలు చేస్తారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. రోజువారీ పనుల్లో సమయపాలన లేక ఇతర పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు, మీకు సమన్వయం కుదరక బాధపడతారు. పెద్దల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల ప్రమేయం ఎక్కువ. ఉద్యోగులు మే తరువాత అధికారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటారు. మే వరకు తెలివిగా ప్రవర్తిస్తారు. స్థానచలనం, ప్రమోషన్ ఆశించిన రీతిలో ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు మే నెల నుండి ఉన్నాయి. వ్యాపారులకు జాగ్రత్తలు మే నుంచి ఎక్కువ అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన ఉండదు. మే తరువాత నిల్వలు తీసే ఖర్చులు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో అనుకూలత లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్ద ఇబ్బంది లేకున్నా, మంచి వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నుంచి చికాకులు పెరుగుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ. నకిలీ పురుగు మందులు, ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో మే నుంచి ప్రతికూలతలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. సమర్థంగా ప్రవర్తించలేరు. అనవసర విషయాలు కలవర పెడుతుంటాయి. లేని అనారోగ్యాలకు కూడా భయపడతారు. గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మే 15 తరువాత ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించలేక ఇబ్బందులకు లోనవుతారు. పునర్వసు 4వ పాదం: అనవసర ప్రయాణాలతో ఖర్చులు ఎక్కువవుతాయి. అందరితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సానుకూలత ఉండదు. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులకు సçహాయం చేసి అవమానాలకు లోనవుతుంటారు. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉన్నా, ఆశించిన ఫలితాలు అందవు. పుష్యమి: వృథా కాలక్షేపాలు అధికం అవుతాయి. వృత్తి విషయంలో మీ ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. కుటుంబ విషయాలలో మంచి చేసినా అవమనాలకు లోనయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష: తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని స్థానచలనం లేదా మార్పు ఉంటుంది. సమయపాలన లేకుండా పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.శాంతి మార్గం: రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ మంచిది. కేతువుకు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది. శివాలయంలో రోజూ ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. గురు రాహు కేతువులకు జపదానం తర్పణం మేలో చేయించండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్వయంగా విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అధికారుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కులవృత్తిలో ఉన్నవారికి అనుకూలం. మే: ఆరుగ్రహాలు భాగ్య, రాజ్య, లాభ స్థానాలలో ఉన్నా, జన్మ కుజ, నవమ శని వల్ల ఏదో తెలియని భయం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే భావన పీడిస్తుంటాయి. సమస్యలు ఉన్నా, పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుంది. జూన్: మొదటివారంలో ఆశ్లేష వారికి అనుకూలత తక్కువ. అన్నీ బాగున్నట్లుగా ఉన్నా, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తంగా నిర్వహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే సూచన. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఈ నెలలో కొత్త ఋణాలు చేస్తే, వాటిని తీర్చడం కష్టం. జులై: పుష్యమీ నక్షత్రం వారికి 20వ తేదీ నుండి కొంచెం శ్రమ ఎక్కువ. రాశివారు అందరూ ఏదో ఒక రకంగా పను వాయిదా వేస్తుంటారు. ప్రతిచోట, ప్రతిపనిలోనూ అధిక ఖర్చులు తప్పవు. భోజనం, నిద్ర వంటి రోజువారీ పనుల్లోనూ జాప్యం ఎదురవుతుంది. ఆగస్ట్: వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో పనులు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు విడనాడండి. సెప్టెంబర్: ఆర్థిక సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. ఇంటి విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారు సహకరించరు. కుటుంబ సమస్యల పరిష్కారం తేలికవుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో కాలక్షేపం బాగా సాగుతుంది. అక్టోబర్: కొత్త పనులు చేపట్టినవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారి ప్రతికూలత ఎక్కువ. అధికారుల రక్షణ విశేషంగా ఉంటుంది. స్వబుద్ధితో పనులు సానుకూలం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తేలికగా పూర్తి చేసుకుంటారు. నవంబర్: తెలివి, ఓర్పుతో విజయాలు సాధిస్తారు. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. డిసెంబర్: భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందవు. కొత్త ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. జనవరి: అన్నింటిలోనూ 17వ తేదీ నుంచి అడ్డంకులు పెరుగుతాయి. కోపావేశాలను అదుపు చేసుకోవలసిన కాలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు తగ్గించండి. కలహాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. ఫిబ్రవరి: ఎవరూ మీకు సరిగా సహాయ సహకారాలు చేయరు. పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. మార్చి: అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ నిర్వహణ, వృత్తి నిర్వహణ ఒకదానికి మరొకటి అవరోధాలు సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత తక్కువ. కుజ, గురు, శాంతి చేయించండి. ఉద్యోగ ఒత్తిడితో మీరు అందరితో కలహిస్తారు. ఇతరుల వ్యవహారాలు కలహప్రదంగా మారతాయి. సింహ రాశిఆదాయం–11, వ్యయం–11, రాజయోగం–3, అవమానం–6.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (లాభ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (సప్తమ), కేతువు సింహరాశి (జన్మ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (అష్టమ) సంచారం. మనస్పర్థలు రావడం, వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఏడాది కాలక్షేపం అవుతుంది. గురుబలం ఈ సంవత్సరమంతా శ్రీరామరక్ష. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసినా, సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతుంటారు. రోజువారీ పనుల్లో భోజన, స్నాన, నిద్రలకు కూడా సమయపాలన ఉండదు. కుటుంబ విషయాల్లో మితభాషణ అవసరం. శని, రాహు సంచారం బాగా లేదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు బాగా ఉంటాయి. మీ కింద పనిచేసేవారి ద్వారా ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ తప్పదు. పనివారితో సమస్యలు ఎక్కువ, లాభాలు తక్కువ ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది లేదు కాని, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత, కొత్త ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాత, జీర్ణ çసమస్యలు ఉంటాయి. అయితే మంచి వైద్యం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువైనా, పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు. రైతులకు శ్రమ ఎక్కువ. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఇతరుల సలహాలు పాటించకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. నిత్యం వైద్యుల సలహాలు, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి.మఘ: మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. పుణ్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బ: ఇతరులను నమ్మి ధనం పెట్టుబడులు పెట్టవద్దు. మీ వస్తువులను ఎక్కడైనా మరచిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతాయి. చేసే పనులలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. రోజువారీ పనుల్లో సమయపాలన లోపిస్తుంది. ఉత్తర 1వ పాదం: మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చక ఉద్యోగ, వ్యాపార కుటుంబ విషయాలలో ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పనీ మళ్లీ మళ్లీ చేయవలసి వస్తుంది. అందరినీ అనుమానిస్తుంటారు. పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. శాంతి మార్గం: శని రాహు కేతువులకు శాంతి చేయించండి. మే నెల నుంచి ప్రతి నెలా ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి భువనేశ్వరీ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి. కుదిరినప్పుడు చండీహోమం చేయించండి. సప్తముఖ రుద్రాక్షధారణ చేయడం శుభప్రదం.ఏప్రిల్: ప్రశాంతత కోసం, ధైర్యం కోసం ధ్యానం చేయండి. ప్రతిపనీ కాలవ్యయం, ధనవ్యయం సూచిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా, పాత ఋణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. వ్యవహార ప్రతిబంధకాలు గోచరిస్తున్నాయి. మే: తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని సూచన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. రోజువారీ పనుల్లోనూ తెలియని ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. జూన్: మఘ నక్షత్రం వారికి 7వ తేదీ నుంచి ఆరోగ్య చికాకులు ఉంటాయి. అయితే శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా శుభ, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. జులై: పుబ్బా నక్షత్రం వారు 23 వరకు, ఉత్తర 1వ పాదం వారు 23 నుంచి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. పుబ్బవారు ఈనెల 21 నుండి కొంచెం ఎక్కువ చికాకులు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో చిక్కులు తలెత్తవచ్చు. కుటుంబ, ఆరోగ్య, వృత్తి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: శ్రమ చేసి ముఖ్యమైన సమస్యలు తీర్చుకోండి. ఒకటి రెండు ప్రయత్నాలు చేయడం ద్వారా సహకరించం అనే వ్యక్తులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 నుంచి కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సెప్టెంబర్: ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేయడం, బద్ధకించడం మానకుంటే, 14వ తేదీ నుంచి మంచి పరిణామాలు ఉంటాయి. మీ శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల తోడ్పాటు పెరుగుతుంది. అక్టోబర్: పుబ్బ నక్షత్ర జాతకులు మీ వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంతి ద్వారా పరిశీలన చేయించుకోండి. చాలా సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యసాధనకు కృషి చేస్తారు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. నవంబర్: కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నా, పనుల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందగలరు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళి కలు గురించి చర్చిస్తారు. డిసెంబర్: తెలివిగా కార్యసాధన చేస్తారు. అవరో«ధాలను లెక్కచేయరు. ఉద్యోగంలో కొత్త రకంగా అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు అందుతాయి. రైతులకు విద్యార్థులకు అనుకూలం. దేవాలయ దర్శనములు చేస్తుంటారు. జనవరి: శుభా శుభ పరిణామములతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ, వ్యయ, ఋణ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మాత్రం పూర్తి భిన్నంగా చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి: ప్రతి విషయం సునిశితంగా పరిశీలించి చేయడానికి అలవాటు పడండి. పని ఒత్తిడి 13వ తేదీ నుంచి పెరుగుతుంది. మీ ఇంటి యజమాని లేదా షాపు యజమానితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే రెండు మాసాల గోచారంలో అనుకూలత తక్కువగా గోచరిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఈ నెలలోనే ఆ పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. మార్చి: చేయవలసిన పనులు మానేసి అనవసర వ్యవహారాల్లో తలమునకలు అవుతుంటారు. గ్రహచార ప్రతికూలతలు పెరుగుతున్నాయి. రాబోవు మూడు నెలలలో కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఋణ విషయాలలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాల క్షేపం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణములు విడనాడండి. కలహాలు, కొత్త ప్రయత్నాలు విడనాడండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలత తక్కువగా ఉంది. కన్యా రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (దశమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (షష్ఠ), కేతువు సింహరాశి (వ్యయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (సప్తమ) సంచారం. మే నెల వరకు పుణ్యకార్యాలు, «ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. «సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ప్రతిపనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. కొన్నిసార్లు భయం పొందుతారు. రోజువారీ పనుల్లో మే నుంచి సమయపాలన లేకుండా ప్రవర్తిస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగ విషయాలలో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు. ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది. మే నెల నుంచి మీ కింద పనిచేసే వారితో ఇబ్బంది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఋణ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. కొత్తగా వచ్చే సమస్యలేవీ ఉండవు. భార్యాపిల్లల ఆరోగ్య విషయంలోనూ శుభ పరిణామాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడానికి ఆలస్యమవుతుంది. అయితే నష్టం ఉండదు. షేర్ వ్యాపారులకు తెలివి, ధైర్యం ఉన్నా అనుకున్న ఫలితాలు దక్కవు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా సమయానికి మంచి సలహాలు అందడం వల్ల నష్టం ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. నిరుత్సాహం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా, ధైర్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కావలసిన రీతిలో లబ్ధి పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి కాని, నష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలు చూస్తారు. గర్భిణీ స్త్రీలు కంగారు పడనవసరం లేదు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో సుఖజీవనం సాగిస్తారు.ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు: ఇతరుల విషయాలలో ఎక్కువగా కలుగ చేసుకోవద్దు తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సంఘంలో అనుకూల స్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. అయితే ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. హస్త: ప్రయాణాలను వీలయినంత తగ్గించుకుంటే లాభిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి కాలక్షేపాలు పనికిరాదు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనులు వదిలేసి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు: వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల విషయాలలో కూడా ధైర్యంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ కుటుంబ విషయాలలో పనివారితో సమస్యలు తరచుగా ఉంటాయి. ఋణ వెసులుబాటు అవసర సమయంలో అందక ఒత్తిడికి లోనవుతారు. శాంతి మార్గం: ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ‘‘శ్రీరామశ్శరణంమమ’’ అని చెబుతూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రాతఃకాలంలో లకీ‡్ష్మనారాయణ పూజ చేయండి. ఏప్రిల్‌లో శని శాంతికి జపదానాదులు చేయించండి. రామాయణ పారాయణ మంచిది. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాలు ఆశించిన రీతిగా సాగుతాయి. గురు, కుజుల అనుకూలత దృష్ట్యా ఋణ సమస్యలు ఎలా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు బాగా నడపగలుగుతారు. పాత ఆరోగ్య సమస్యల పట్ల కూడా తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తరచు శుభకార్యాలలో పాల్గొంటారు. మే: అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ చికాకులు రాగలవు. తెలివిగా ఓర్పుగా ఉన్నా, వాత ఆర్థిక ఆరోగ్య కోర్టు సమస్యలు తిరగబెట్టగలవు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టమవుతుంది. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. జూన్: అందరికీ సహకరిస్తారు. మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్నిసార్లు అనుకోని లాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అయినా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. బంధువులకు సహాయం చేస్తారు. జులై: బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యసాధనలో అనుకూల స్థితిని పొందుతారు. కొన్ని మంచి ఫలితాలు కూడా అందుతాయి. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. ఇతరులపై ఆధారపడి ఏ పనినీ మొదలు పెట్టవద్దు. ఆగస్ట్: ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. మితభాషణ ఓర్పు అవసరం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. శుభకార్య ప్రయత్నాలు లాభదాయకంగా పూర్తవుతాయి. సెప్టెంబర్: చిత్త నక్షత్రం 3వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ఆరోగ్య ఋణ సమస్యలు రాగలవు. రాశి వారు అందరికీ 14వ తేదీ నుంచి దూర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. వాహనాలు, ఆభరణాల మరమ్మతులకు ధనవ్యయం బాగా అవుతుంది. అక్టోబర్: అభివృద్ధి నిరోధకమైన అంశాలను సరి చేసుకుని మంచి జీవనం వైపు ప్రయాణం చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. నవంబర్: పనులు సకాలంలో జరగకపోవడం తప్ప మిగిలినవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అందరి నుంచి సహకారం ఉంటుంది. ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.డిసెంబర్: ఉద్యోగులు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు పరిస్థితులు సానుకూలం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. జనవరి: సంతృప్తికరంగా కాలక్షేపం జరుగుతుంది. పనులు ఆలస్యమైనా, సానుకూలం అవుతాయి. ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. గత సమస్యల పరిష్కారానికి అవకాశం చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. ఫిబ్రవరి: కుటుంబ విషయాలు మినహా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారాలలో ఏదో ఒక అడ్డంకి గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అసలు ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. మార్చి: పనులు ఆలస్యమైనా, సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, ఇబ్బందికరం కాదు. రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణం. తులా రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–2, అవమానం–2.చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (భాగ్య) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (పంచమ), కేతువు సింహరాశి (లాభ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (షష్ఠ)లో సంచారం. చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం. మే నెల నుంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్య, శుభకార్యములు, సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. గత సమస్యలు తీరే అవకాశం మే నెల నుంచి పెరుగుతాయి. రోజువారీ పనులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో శుభ పరిణామాలు ఎక్కువ. ఉద్యోగులకు ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కావలసిన వనరులు సమకూరి, ఇబ్బందిలేని వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మే తరువాత ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా, వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంది. పాతా ఋణాలు తీరుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరుతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి. మే నెల నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు ఈ సంవత్సరం జూన్ నుంచి విశేష లాభాలను అందుకుంటారు. రైతులకు శ్రమ కొద్ది లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం, వరుణుడు, సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మే నుంచి విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సమస్యల పరిష్కారానికి మే నుంచి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ప్రశాంత జీవనం సాగిస్తారు. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని అధిగమించి జూన్ నుంచి విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచివైద్యం లభించి సుఖప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 పాదాలు: అద్భుతాలు చూస్తారు. కుటుంబ అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టి మంచి జీవనం సాగిస్తారు. విజయాలు సాధిస్తారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులు, పూజ్యులను దర్శించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వాతి: కుటుంబంలో పెద్దల ఆరోగ్య విష యంగా సేవలు చేయవలసి రావడంతో సొంత పనులలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మితభాషణ అవసరం అని గ్రహించండి. విశాఖ 1, 2, 3 పాదాలు: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలపై మంచి పట్టు సాధిస్తారు. ఋణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల విషయంలో చేయవలసిన పనుల పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది.శాంతి మార్గం: గురు రాహువులకు జప, దానాదులు చేయండి. సంవత్సరారంభంలో రోజూ దేవీ భాగవతం పారాయణ చేయడం బాగుంటుంది. ప్రాతఃకాలంలో విష్ణు సహస్ర నామ పారాయణం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టక పారాయణం ద్వారా పాత సమస్యలు పోతాయి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొన్ని వ్యవహారాలు లాభదాయకంగానూ, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఈ నెల ఎంత మౌనం వహిస్తే అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. మే: మితభాషణ, ఓర్పు ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. గురుబలంతో వృత్తి, ఆర్థిక, ఆరోగ్య వ్యవహార లాభాలు ప్రారంభం అవుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. జూన్: కోపావేశాలు తగ్గించుకోవాలి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. భోజనం అయిష్టమైన విధానాలతో ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయి. జులై: పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలోను, విదేశీ నివాస, కోర్టు, ఋణ వ్యవహారాలలో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా గొప్ప అనుకూల స్థితి. ఆదాయ, వ్యయ, ఋణ వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆగస్ట్: అద్భుతమైన కాలమనే చెప్పాలి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కాలం వృథా చేయకుండా ప్రయత్నించండి. ధన, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్: కుజగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. రోజువారీ పనులు బాగానే ఉన్నా, ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి వెంబడిస్తుంది. ఋణ వ్యవహారాలు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఋణ, ఆరోగ్య విషయాలలో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రభావం వలన కలçహాలు పెరగవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేస్తారు. మీ వద్ద పనిచేసేవారు మీకు బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో కాలక్షేపం చేస్తారు. డిసెంబర్: చాలా వ్యవహారాలను తెలివిగా సాధిస్తారు. పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ వద్ద పనిచేసేవారు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. జనవరి: కుటుంబ వ్యవహారాలను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. బంధువులకు, స్నేహితులకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలత. ఫిబ్రవరి: తెలివిగా ధైర్యంగా వ్యవహార లాభం అందుకుంటారు. వృత్తి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ చేయమని ప్రత్యేక సూచన. ఆదాయ, వ్యయాలను సమర్థంగా నిర్వహిస్తారు. అవసరమైన ఋణాలు సకాలంలో అందుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాలం. షేర్ వ్యాపారులు లబ్ధి పొందుతారు. మార్చి: ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయ కలహాలకు దారి తీస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని తెలివిగా దాటతారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ప్రతి విషయంలో ఆర్థిక వెసులుబాటు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం. మీ పిల్లల నుంచి ఆశించిన ఫలితాలు అందక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. వృశ్చిక రాశిఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–2.విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అర్థాష్టమ), కేతువు సింహరాశి (దశమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశి (పంచమ) సంచారం. ఏ పనిలోను స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు, చోరులు వంటి వారితో చికాకు పడుతూనే ఉంటారు. పరుషంగా మాట్లాడుతుంటారు. రోజువారీ పనుల్లో ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. మీ నుంచి కుటుంబీకులకు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి. భోజన, స్నానాదికాలలో కూడా సమయపాలన లేక జీవనశైలి ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు. ప్రమోషన్, స్థానచలనాలు అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. వ్యాపారులకు అనుకూల లాభాలు లేకున్నా, ఇబ్బందులు ఉండవు. నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి లావాదేవీలు, ఆస్తి తగాదాలలో ఇబ్బందులు తప్పవు. మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మే తరువాత డబ్బు ఇబ్బందులు తప్పవు. కొత్త ఋణాలు సకాలంలో అందవు. వాత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. షేర్ వ్యాపారులకు మే వరకు లాభాలు బాగుంటాయి. మే తరువాత లాభాలు తక్కువగా ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు మే నుంచి ఏకాగ్రత లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాలే శరణ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో విద్య కోసం వెళ్ళేవారికి మే వరకు కాలం అనుకూలం. ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు. కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం లేదనే భావనకు లోనవుతారు. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీలలో సమస్యలు వెంటాడుతాయి. గర్భిణీ స్త్రీలకు మే నుంచి జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు, పెద్దల సంరక్షణ తప్పనిసరి.విశాఖ 4వ పాదం: దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. ఋణ అసౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేయవలసిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్వబుద్ధితో చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ. అనురాధ: స్పష్టత లేని నిర్ణయాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జ్యేష్ఠ: అవసరమైన సమయాలలో ఆత్మీయులు స్పందింపక పోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. çగౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఋణం, ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడతారు. శాంతి మార్గం: మార్చి నెలలో రాహువుకు, మే నెలలో గురువుకు శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవీ భాగవత పారాయణం చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణుపూజలు చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఋణాలు ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మే: స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 15వ తేదీ తరువాత గురుగ్రహ శాంతి చేయించండి. అందరి సహాయ సహకారాలు, గౌరవం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలు చేయండి. ఒంటరిగా దూర ప్రయాణాలు విరమించుకోండి. జూన్: ఆత్మీయుల సేవలను గుర్తించరు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మరలా తిరగబడే అవకాశం ఉంటుంది. అవసరాలకు తగిన డబ్బులు సర్దుబాటు జరగదు. కొన్ని సందర్భాలలో మనో నిబ్బరం ప్రదర్శిస్తారు. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జులై: కోపావేశాలకు అనుకూల కాలం కాదు. ఉద్యోగ రీత్యా అనవసర తిరుగుడు పెరుగుతుంది. జీర్ణసంబంధ ఇబ్బందులు రాగలవు. పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. అధికారులు, తోటివారు సహకరించరు. అవసరానికి ధనం అందుబాటు తక్కువ. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆగస్ట్: కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. చాలా విషయాలలో స్వయంగా శోధించి, విజయాలు అందుకుంటారు. తెలియక చేసిన పొరపాట్లు నెలాఖరులో సరిచేసుకునే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబసభ్యులు సహకారం తక్కువ. ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ స్థితి ఉంటుంది. సెప్టెంబర్: అధిక గ్రçహానుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వ్యయాలు సమతూకంగా లేకున్నా, సమర్థంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో కొత్త ఋణాలు చేయవద్దు. అక్టోబర్: ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు మంచి మాటలు చెప్పినా, అవి వికటించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. నూతన ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరం. అవసరానికి తగిన ధనం చేకూరదు.నవంబర్: పనులు కొంచెం ఇబ్బందికరం అవుతున్నా, అన్నింటా సమర్థంగా వ్యవహరిస్తూ ముందుకు వెడతారు. ఫలితాలు ఆశించిన రీతిగా ఉండవు. విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగవు. డిసెంబర్: వృత్తి ఉద్యోగాలను శ్రద్ధగా నడపలేని పరిస్థితి ఉంటుంది. పనులు దాటవేసే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పిల్లలు వ్యతిరేక ధోరణితో ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలలో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఋణాలు చేయవద్దని సూచన. జనవరి: మంచి కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ధైర్య స్థైర్యాలను అన్ని విషయాలలోనూ ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. గత సమస్యలకు పరిష్కారాలను త్వరగా వెదకగలుగుతారు. కొత్త ఋణాలు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఫిబ్రవరి: మంచి అనుభూతులు మిగిల్చే కాలం. అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం అయినా, తెలివిగా వ్యవరించి, లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. కుటుంబ, వృత్తి విషయాలు రెండింటినీ సమర్థంగా నడిపి మంచి పేరు సాధిస్తారు. మార్చి: రోజువారీ పనులలో బాగా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరులకు సçహాయం చేయడాన్ని ఒక విధిగా భావించి చేస్తుంటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అధికారుల తోడ్పాటు తక్కువ అయినా నష్టంలేని జీవితం సాగుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. ఆదాయ, వ్యయ ఋణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. మాట నిలబెట్టుకోలేరు. ధనూ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–5మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (సప్తమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (తృతీయం), కేతువు సింహరాశి (భాగ్య) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (అర్ధాష్టమ) సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేసిన పనులకు తగిన గుర్తింపు రాదు. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ జీవనానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. స్నేహితులతో మిత సంభాషణ, సంచారం చేయండి. రోజువారీ పనులపై ప్రత్యేక దృష్టి ఉంచండి. కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబసభ్యుల కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదరద్వేషం తప్పదు. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసుకుంటే మీకు కావలసిన చోటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరూ సహకరించకపోయినా, విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సూచనలు అందుతాయి. వ్యాపారులకు కొన్నిసార్లు విశేష మందగమనం, కొన్నిసార్లు విశేష లాభాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి. ఋణ విషయాలు సానుకూలం. వాత సంబంధ ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు. మార్కెటింగ్ ఉద్యోగులు జూన్ నుంచి తేలికపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు బుద్ధి, ఓర్పుతో లాభాలు అందిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు మంచి కాలం. కోర్టు వ్యవహారాలలో స్వయంగా అన్నీ శోధిస్తే విజయం పొందగలరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగం చేయమని సూచన. వాహన కొనుగోలుకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో అంతా లాభదాయకం. ఈ రాశి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతిపనీ చేయగలం అనే ధీమా ఉంటుంది. ఉద్యోగినులకు ప్రమోషన్లు ద్వితీయార్ధంలో అందుతాయి. వ్యాపారులు శ్రమతో పనులు పూర్తి చేసు కుంటారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. జూన్ దగ్గర నుంచి అంతా అనుకూలం. కావలసిన వైద్య సదుపాయాలు, మంచి సంరక్షణ అందుతాయి. మూల: ఎవరికీ హామీలు ఇవ్వవదు. ముఖ్య వ్యవహరాలలో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం కావడం మేలు. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. పూర్వాషాఢ: మీ సహననానికి పరీక్షా కాలం. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా, సమస్యలు ఉండవు. వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యాపారులకు విజయావకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు వద్దు అనుకుంటూనే ప్రారంభించి, రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ. శాంతి మార్గం: కుజగ్రహ సంచారం ఎక్కువ ఇబ్బందికరం. జూన్ వరకు నెలకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతాయి. రోజువారీ జీవనశైలిలో విశేష మార్పులు చూస్తారు. కొన్ని సందర్భాలు ఆనందాన్ని, కొన్ని సందర్భాలు విచిత్రమైన భయాలు కలుగజేస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మే: ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారో తెలియని పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం ఇవ్వకండి. «అవసరానికి దనం సర్దుబాటు కాకపోవచ్చు. ఇల్లు లేదా వాహనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. 15వ తేదీ తరువాత అనుకూలం. జూన్: తెలివిగా ఉద్యోగ, వ్యాపార సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో నిబద్ధతతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జులై: కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఏకాగ్రత లోపిస్తుంది. వాత సమస్యలు తరచుగా వెంటబడే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్న వస్త్రాలు అందవు. స్థానచలన విషయంలో ప్రతికూలతలు రాకుండా జాగ్రత్త పడండి. తెలియని పొరపాట్ల వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆగస్ట్: అనవసర చర్చలు, వృథా కాలక్షేపాలతో అవసరమైన పనులు దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు తగ్గుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు, వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. సెప్టెంబర్: ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధు మిత్రుల కలయిక మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్య శుభ కార్యాలలో మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. సర్వత్రా విజయం ఉంటుంది. అక్టోబర్: కొన్ని విశేష కార్యక్రమములకు శ్రీకారం చేస్తారు. కాలం చాలా బాగుంది. పనులు వేగం చేయండి. బంధు మిత్రులు బాగా సహకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. నవంబర్: 15వ తేదీ తరువాత అడ్డంకులు తరచుగా వస్తాయి. ఆలోచనా శక్తి బాగున్నా పనుల అమలు కష్టం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అందరూ సహకారం చేస్తున్నట్లుగా ఉన్నా, అది భ్రమ. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే అభివృద్ధి ఉంటుంది.డిసెంబర్: అనవసర భయాందోళనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు నియంత్రించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యం. మంచి ఆలోచనలు చేసినా అమలు చేయలేని స్థితి. జనవరి: బంధుమిత్రుల రాకపోకలలో కలహాలకు అవకాశం ఇవ్వవద్దని సూచన. కొన్ని పనుల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉన్నా, ఋణ విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. కుటుంబ అవసరాలు తీర్చడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. విహార యాత్రలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఫిబ్రవరి: కాలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసేవారు మాత్రమే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. మార్చి: అంతా శుభ పరిణామాలతో గడచిపోతుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యవహారాలు ఈ నెలలో పూర్తి అయ్యే దిశగా పయనిస్తాయి. ఉద్యోగులకు చాలా విశేషమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు బాగా అనుకూలం. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. మకర రాశిఆదాయం–8, వ్యయం–14 , రాజయోగం–4, అవమానం–5 .ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (షష్ఠ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (ద్వితీయ), కేతువు సింహరాశి (అష్టమం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (తృతీయ) సంచారం. కేవలం శని, రాహు సంచారం అనుకూలత వల్ల విజయాలు సాధిస్తారు. అయితే జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాలలో చికాకులు ఉంటాయి. స్వబుద్ధి, స్వశక్తితో విజయాలు సాధిస్తారు. శ్రమతో కూడిన పనులు జూన్‌లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రోజువారీ పనుల్లో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలను కొంచెం ఓర్పుగా చూసుకోవాలి. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది. ఉద్యోగాలలో శని అనుకూలత వల్ల సర్వత్రా విజయమే. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు జూన్ వరకు విశేషం. సంవత్సరం అంతా శుభమే. వ్యాపారులు మార్పులు చేపట్టే ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు. ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించి జూన్ వరకు సుఖపడతారు. జూన్ తరువాత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశములు ఉ్తన్నాయి. తరువాత కొత్త ఋణాలు అందడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు అంతా శుభసూచకమే. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలలో మంచి లాభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు. ఇబ్బందిలేని జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబవృద్ధి సాధించుకుంటారు. గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభప్రదంగా ఉన్నా, అధైర్యం పొందుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయండి.ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు: అనాలోచిత కార్యములు ఎక్కువగా చేస్తుంటారు. నమ్మకంగా మోసగించే లక్షణాలు వున్నవారు మీ పనులలో చొరబడతారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాలలో ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రవణం: మరింత శ్రద్ధ అవసరం. ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇతర వ్యాపకాలు ఆకర్షించినా, వాటి జోలికి పోవద్దని సూచన. మితభాషణ, ఓర్పు మీకు శ్రీరామరక్షగా గుర్తించండి. ధనిష్ఠ 1, 2 పాదాలు: కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి గౌరవం అందుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. వ్యాపారులకు వర్కర్స్ ద్వారా సహకారం అందుతుంది. కొత్త అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలుపై దృష్టి ఉంచుతారు. కుటుంబ ప్రోత్సాహం అద్భుతంగా అందుకుంటారు. శాంతి మార్గం: గురువుకు, కుజుడికి మే నెలలో శాంతి చేయించండి. రోజూ శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. గురుచరిత్ర పారాయణ, సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అష్టముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండేవారు సుఖంగా ఉంటారు. అనవసర ప్రయోగాలు చేసేవారు ఇబ్బందులు పడతారు. ఈ నెలంతా వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వలన అద్భుత ఫలితాలు రాగలవు. విద్యార్థులకు కాలం అనుకూలం. మే: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కోపావేశాలకు గురి అవుతుంటారు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అధికంగా దూర ప్రయాణాలు చేయవద్దు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి విషయానికి అతిగా స్పందించవద్దు. జూన్: బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. జీవనోపాధి మార్గాలు సాధారణ స్థాయిలో నడుస్తాయి. కుటుంబ విషయాల్లో ఎప్పుడెలా సమస్యలు తలెత్తుతాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభం చేకూరుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. జులై: 16 తర్వాత అనుకూలత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళితే విజయావకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా సంచరించేవారికి ఈ నెల చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: చాలా విషయాలు స్వయంగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవు. పూర్తి అనుకూలమైన కాలం కాకున్నా, సరిగా ప్రయత్నిస్తే సమస్యలు దూరం అవుతాయి. కొత్త అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంగా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. సెప్టెంబర్: కోపావేశాలు లేనివారికి, తొందరపాటు నిర్ణయాలు చేయనివారికి చాలా మంచి కాలం. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే వాటి అమలు కష్టసాధ్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్: భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన లాభం, ప్రయాణ సౌఖ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు కొంత శ్రమను పొందినా, లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు లాభదాయకం. నవంబర్: చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి. ధైర్యం తెలివి ప్రతి విషయంలో ప్రదర్శిస్తారు. మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలు చూడడం విడనాడండి. కావలసిన ఆర్థిక వెసులుబాటు, మనిషి సహకారం బాగా అందుతాయి. ప్రశాంత జీవనంతో సుఖపడతారు. డిసెంబర్: వ్యాపార అవరో«ధాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలలో విచిత్రస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఈ నెలలో కదలికలు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాలు మినహా ఇతర పనులు చేపట్టవద్దు అని సూచన. ఋణాలు అవసరానికి సర్దుబాటు కావు. జనవరి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, కుటుంబ విషయాలు మినహా మిగిలిన వాటిని వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవడం మంచిది కాదు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి: శుభాశుభ పరిణామాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో ఎక్కువగా కలుగచేసుకోకండి. పనులు స్వయంగా చేసుకోండి. ఆగ్రహావేశాలు తగ్గించండి. చాలా ఒత్తిడితో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తారు. శుభకార్య పుణ్యకార్యాలలో ధనవ్యయం అధికం అవుతుంది. మార్చి: మంచి మార్పులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ విజయాలకు దగ్గర అవుతారు. రాబోవు మూడు మాసాలలో చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. వేగంగా పనులు పూర్తి చేసి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రశాంత జీవనం చేస్తారు. కుంభ రాశిఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–7, అవమానం–5ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (పంచమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (జన్మ), కేతువు సింహరాశి (సప్తమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (ద్వితీయ) సంచారం. ఏలినాటి శని తృతీయ భాగంలో నడుస్తుంది. రాహువు పెద్దగా యోగించకపోయినా, గురుబలం అనుకూలత వలన మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్నిసార్లు తెలివిగాను, కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తన ఉండేలా చూసుకోండి. రోజువారీ పనులలో స్థిరచిత్తం లోపించడంతో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో అనవసర కలహాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తిస్తుంటారు. గురుబలం వలన పెద్దస్థాయి కుటుంబ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలలో కొన్నిసార్లు ఓర్పుగా ప్రవర్తించి మంచి ఫలితాలు, కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు. అధికారులతో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపారులకు అంతా శుభ ఫలితాలే ఉన్నా, తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది. ఋణ విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి సరిలేక తగిన ఫలితాలు అందుకోలేరు. షేర్ వ్యాపారులకు శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో తప్పుదోవ పట్టించేవారిని గుర్తించి, దూరంగా ఉంచడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో చికాకులు, మోసం వెంట వచ్చినా చివరకు లాభాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మందగమనంగా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. రాహు ప్రభావం వల్ల మీ సేవలకు తగిన గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగానే ఉన్నా, అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందుతారు. దేవీ భాగవత పారాయణ చేయండి. దుర్గా/దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.ధనిష్ఠ 3, 4 పాదాలు: తరచుగా మోసాలకు గురవుతారు. శారీరకంగా ఇబ్బంది ఉందనే భావన గోచరిస్తుంది. చేయవలసిన పనులు ఆపేసి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అంతా బాగున్నా, తెలియని భయం వెంటాడుతుంది. అవసరాలకు కావలసిన డబ్బు అందుతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయరు. శతభిషం: వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు చికాకులు సృష్టిస్తాయి. గొప్ప కోసం విరాళాలు ఇవ్వాల్సి వచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు: ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అనుమానాలు పెరుగుతాయి. నేత్ర బాధలు చికాకులు కలిగిస్తాయి. అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్ తగ్గించండి.శాంతి మార్గం: శని, రాహు, కేతువులకు శాంతి చేయించండి. రోజూ ఇంద్రాక్షీ స్తోత్రం మరియు పిప్పలాద కృత శనిస్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీశంకర రుద్రాక్షధారణ చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది.ఏప్రిల్: సమస్యలు ఉన్నాయో లేవో చెప్పలేని సందిగ్ధ కాలం. ఓర్పుగా ఉండాలి. కొత్త పనులు చేయడం మంచిది కాదు. ఋణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలు రాగలవు. శతభిషా నక్షత్రం వారికి మానసిక అసౌకర్యం, పూర్వాభాద్ర వారికి ఆర్థిక అసౌకర్యం, ధనిష్ఠ వారికి ఉద్యోగ అసౌకర్యం ఉంటాయి. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కువవుతాయి. మే: మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అందరి సహకారం బాగుంటుంది. పూజ్యులు, గురువులు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. జూన్: జూన్, జులై నెలల్లో స్నేహితులు చేసిన పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్ వ్యాపారాలకు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఋణ, ఆరోగ్య విషయములలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడండి. ఓర్పు అవసరం. జులై: మనో ధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా, విజ్ఞాన, ప్రదర్శన చేస్తారు. చాలా వ్యవహారాలలో అడ్డంకులు రావడం, వాటిని తొలగించుకోవడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ. విద్యా వ్యాసంగం బాగుంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. ఆగస్ట్: ఋణ, ఆరోగ్య విషయాలలో ప్రతికూల సలహాలు ఇచ్చేవారికి ఆకర్షితులు అవుతారు. ఆదాయం తక్కువ, ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ప్రతివారికి సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. లాభదాయక సంఘటనలు ఉంటాయి. పెద్దలను దర్శించడం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్: అభివృద్ధికి మీ కోపావేశాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో తెలియని çపరిస్థితి. మితభాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. పనివారిని నమ్ముకొని పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. అక్టోబర్: పనులు సకాలంలో సవ్యంగా పూర్తవని కారణంగా చికాకులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో, తోటివారితో ఇబ్బందులు పెరుగుతాయి. రోజువారీ పనులు కాకుండా కొత్త çపనులు చేపట్టవద్దు. నవంబర్: పనులు సానుకూలం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అన్ని అంశాలలోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూలం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పనులు సకాలంలో అవుతాయి. డిసెంబర్: మానసిక అశాంతి ఎక్కువైనా, విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు ధైర్యం ప్రదర్శిస్తారు. ఉద్యోగాలలో అంతా సానుకూలమే. వ్యాపారులు ప్రోత్సాహకర ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. జనవరి: 13వ తేదీ నుండి జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ వరకు అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణ చికాకులు, ఆరోగ్య చికాకులు ఉంటాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా సంచరించాలి. కొత్త వ్యవహారాలు చేయవద్దు. ఫిబ్రవరి: తరచు ఇబ్బందులు వస్తుంటాయి. అయినా తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు కాని, రాబోవు మూడు మాసాలు ఒత్తిడిగానే సాగుతుంది. ఆరోగ్యం, స్థానచలనం విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు రాగలవు. మార్చి: తరచు ఎదురయ్యే సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ భద్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అధికంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీన రాశి ఆదాయం–5, వ్యయం–5 , రాజయోగం–3, అవమానం–1పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అర్థాష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (వ్యయ), కేతువు సింహరాశి (షష్ఠ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (జన్మ) సంచారం. ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం ప్రారంభం. జన్మ శని, వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ మీరు, మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు. ఇతర పనులు ఆపివేయండి. ప్రతిపనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా ఇబ్బందిలేని జీవనశైలి ఉంటుంది. అలసత్వం, పనులు వాయిదా వేయడం, అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగులు తోటివారితోను, మీ కింద పనిచేసే వారితోను జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత ఉన్నట్లు కనిపించినా, పనులు పూర్తి కావు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. పనివారితో సమస్యలు, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ఋణ విషయములో అవమానాలు ఎదురవకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. గుండె, ఎముకల సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారుల ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం కాదు. రైతులు స్వబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలలో బాగా సçహాయం చేస్తారు అనుకునేవారు కూడా మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు చికాకులతో సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవ. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఇతరుల విషయాలలో కలుగచేసుకోవద్దు. దూర ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద దృష్టి ఉంచరు. మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోగా విమర్శలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి.అనవసర భయాందోళనలు పెరుగుతాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్యలహరి పారాయణ శ్రేయోదాయకం.పూర్వాభాద్ర 4వ పాదం: అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య, ఋణ, కోర్టు విషయాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. అన్ని పనుల్లోనూ వాయిదాలను ఇష్టపడుతుంటారు. ఉత్తరాభాద్ర: వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువ. రేవతి: వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మిత్రుల సలహాలు, బంధు సహకారం అనుకూలించవు. మతిమరపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తుంటారు. శాంతి మార్గం: శని, రాహు, కుజ గ్రహశాంతి అవసరం. రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయస్వామికి ‘‘శ్రీరామ జయరామ జయజయరామ’’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, ప్రదోషకాలంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. గౌరీశంకరం రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ఈ నెలలో చేసే కొత్త ఋణాలు భవిష్యత్తుకు ప్రమాదం అవుతాయి. పనులు వాయిదా వేయడం మానుకోండి. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణాలు విడనాడడం శ్రేయస్కరం. రోజువారీ పనులు మినహా కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవదు.్ద మే: ఒక విచిత్రమైన కాలం. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. చాలా అంశాలలో తెలివి ప్రదర్శించి చికాకులు పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతుంటాయి. జూన్: కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ పనులు ఆలస్యమైనా, సానుకూలంగా పూర్తవుతాయి. వాహన, ప్రయాణ, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. జులై: పనులు సాధించే వనరులు ఉన్నా, ఆలస్యం అవుతుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. అవయవాలు కొంత ప్రతికూలిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు మందగమనంగా ఉంటాయి. ఆగస్ట్: మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతికూల సలహాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. చేయవలసిన పనులు ఆలస్యంగానూ, అనవసరమైన పనులు వేగంగానూ చేస్తూ ఉంటారు. ఎవరినీ నమ్మలేని స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు సానుకూలంగా సాగుతాయి.సెప్టెంబర్: విచిత్రమైన కాలం. ద్వితీయార్ధం కార్య వైఫల్యాలు ఉంటాయి. కొత్త పనులు చేయవద్దు. రోజువారీ పనులలోనూ, వృత్తి వ్యవహారాలలోనూ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. అక్టోబర్: బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. స్థానభ్రష్టతకు, కుటుంబంలో అనైక్యతకు అవకాశాలు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు విరమించండి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దని సూచన. నవంబర్: విచిత్రమైన కాలం. ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తవదు. ప్రతిదానికీ భయపడుతూ ఏ ప్రయత్నమూ సవ్యంగా చేయరు. మానసిక పరిస్థితికి, ఆచరణకు పొంతన ఉండదు. పుణ్యకార్యాలలో అవరోధాలు రాకుండా జాగ్రత్తపడండి. చిన్న చిన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డిసెంబర్: ఉద్యోగంలో మీ అధికారులు బాగా ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారులకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పుణ్యకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను సేవించుకుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. జనవరి: క్రమంగా లాభాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పని లాభదాయకంగా పూర్తవుతుంది. గత సమస్యల పరిష్కారానికి, భవిష్యత్ ప్రణాళికలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ చాలా అనుకూలం.ఫిబ్రవరి: చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఋణ వ్యవహారాలలో అవమానాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణములు, ఒంటరి ప్రయాణాలు రాబోవు మూడు మాసములు అనుకూలంగా అగుపించడం లేదు. ఆర్థికలావాదేవీలు ఇబ్బందికరం. మార్చి: ఆరోగ్య చికాకులు రాగలవు. తెలివిగా పనిచేయగలిగిన శక్తి ఉన్నా, నిస్తేజంగా ఉండిపోతారు. పనులు అనుకూలం కావు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడతారు. మేష సంక్రమణ ఫలముది.14 ఏప్రిల్ 2025 ఉదయం 5:33లకు విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమీ సోమవారం స్వాతి నక్షత్రం వజ్రనామయోగం, కౌలవ కరణం మీనలగ్న సమయంలో రవి మేషరాశిలో ప్రవేశం. సోమవారం సుభిక్షం. సంధ్యాకాలం ప్రజలకు సుఖం. స్వాతీ నక్షత్ర సమయంలో ప్రవేశం హానికలుగును. రోహిణీ చక్ర విధానంగా చూడగా మంచి వర్షానికి అవకాశం. సంవత్సరం అంతా ఉన్నది. ప్రవేశకాల గ్రహ సంచారం ప్రకారం లగ్నంలో చాతుర్గ్రహ కూటమి అందులోను, శని, రాహువులు పరిపాలనా రంగంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. సమాజంలో ఇబ్బందికర ఘటనలకు అవకాశం గోచరిస్తుంది. అయితే గురుసంచారం బాగుంది. కావున సాధారణ స్థాయి ఇబ్బందులుగా గుర్తించవచ్చు.రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ ఫలముది.22–06–2024 పగలు (22.35 వి.ఘ.) గం.2:32ని.లకు విశ్వావసు సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశీ ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మ యోగం తైతుల కరణం తులా లగ్నం సమయంలో రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం. ‘‘అపరేహేః ఆర్ద్రా ప్రవేశం అతిలోక పీడా’’ అపరాహ్ణ కాలములో ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశం లోకులకు ఇబ్బంది. చంద్రుడు మేషంలో ఉన్న కారణంగా దివారాత్రి దోషం తోడయి ఎక్కువ కాలం నీటి ఎద్దడి. అయితే రవి చంద్రులకు ఇరువురికీ శుభగ్రహ కలయిక వలన దోషం తక్కువగా భావించాలి. ద్వాదశ్యాం శుభప్రోక్తం అని చెప్పబడినది. ఆదివారం పశువులకు నష్టం. కశ్యపవచనం దృష్ట్యా భరణిలో చంద్రుడు ఆర్ద్రా ప్రవేశ కాలంలో వున్న కారణం సస్యవృద్ధిగా గమనించాలి. సుకర్మ యోగం సువృష్టి అని చెప్పబడినది. భరణ్యాది చతుష్కమండలం దృష్ట్యా సస్యానుకాలం వర్షయోగం చెప్పబడినది. తులాలగ్న సమయంలో ప్రవేశం సువృష్టి. తైతుల కరణం నిత్యశుభం. ఫలితం: సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సూచన: ఈరోజు వర్షం కురిసినట్లయితే, దానిని ఆధారం చేసుకొని భవిష్య వర్షయోగం నిర్ణయిస్తారు.చంద్రచారముజ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ బుధవారం ‘‘సుభిక్షం క్షేమమారోగ్యం వృష్టిసస్య వివర్ధనం స్వధర్మ నిరతాభూపాః జ్యేష్టాదౌ సౌమ్యవాసరేః’’ సస్యానుకూల వర్షాలు పాడిపంటలు సమృద్ధి ఉంటుంది. రాజులు ధర్మ నిరతులై ఉంటారు. ‘‘ఆషాఢే పంచమీ శుక్లా సోమవారో యదా భవేత్ సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్భవం’’ ఆషాఢ శుక్ల పంచమీ సోమవారం కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను సూచిస్తోంది. ‘‘ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ స్వాతీ సంయుతా మహద్వర్షం భవేద్ధ్రువం’’ అధిక వర్షాలకు అవకాశం. ‘‘ఆషాఢే కృష్ణపక్షే రోహిణీ ఏకాదశీ యుతామధ్యమ వర్షాలు మధ్యంగా సస్యాలు ఫలిస్తాయి. పుష్య అమావాస్య ఆదివారం దుర్భిక్షం మాఘ ఫాల్గుణాలలో అని గ్రహించాలి.మకర సంక్రాంతి పురుష లక్షణ ది.14 జనవరి 2026 రా.8:51లకు పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం, గండ యోగం, కౌలవ కరణం సింహలగ్న సమయాన రవి మకరంలో రవి ప్రవేశం. తర్పణాలు సంకల్పాలు 15 జనవరి ఉదయం నుండి ప్రారంభం కుంకుమోదక స్నానం రాజులకు అరిష్టం. విచిత్ర వస్త్రధారణ శుభం. మందాకినీ నామధేయం రాజులకు నష్టం. -
సరదాగా ఈ సండే చేప, చికెన్‌తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్‌తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్‌లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
‘ఇనుములో ఓ మనిషే మొలిచెనే'..!
‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నట్లు ఇప్పుడు ఇనుములో ఓ మనిషే మెులిచాడు. అమెరికన్ కంపెనీ ‘క్లోన్ రోబోటిక్స్’ మనిషిని పోలిన శరీరంతో ‘ప్రోటోక్లోన్’ పేరుతో రోబోను రూపొందించింది. ఇతర రోబోల మాదిరి కాకుండా ఇది వెయ్యి కృత్రిమ కండరాలు, 206 ఎముకలు, చర్మం, కీళ్లు వంటి ఇతర భాగాలతో నిజమైన మానవుడిలా పనిచేసే శరీరంతో ఉంటుంది. ఇందులో అమర్చిన 500పైగా సెన్సర్ల సాయంతో ఈ రోబో శ్వాస తీసుకోటం, వదలడం, చెమటలు పట్టడం, వణకడం, భయపడటం, నవ్వడం, ఏడ్వటం ఇలా మరెన్నో భావాలను వ్యక్తపరచగలదు.(చదవండి: ఏకంగా ఆన్లైన్లో మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?) -
ముత్యంలా మెరిసిపోయే హన్సిక ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
మీ వార్డ్రోబ్ను ట్రెండీగా మార్చాలంటే, నటి హన్సిక ఫ్యాషన్ స్టయిల్‌ను ఫాలో అయితే చాలు. ఎప్పటికప్పుడు స్టయిలింగ్‌లో భిన్నమైన సెలక్షన్స్‌తో అదరగొడుతూ ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఒక ఫ్యాషన్ గైడ్‌లా కనిపించే హన్సిక, ప్రస్తుతం ఉన్న ఈ లుక్ కోసం ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఎంటో ఇక్కడ చూద్దాం.. ఫ్యాషన్లు ఎన్ని మారినా వన్నె తరగని ట్రెండ్ ముత్యాలదే! తెల్లగా మెరిసిపోతూ మగువలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. వీటిని పెట్టుకున్న వెంటనే ధరించిన దుస్తుల లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. సింపుల్ పెర్ల్ జ్యూలరీతో ఆఫీస్ దుస్తులకు స్టయిలింగ్ చేసుకుంటే క్లాసిక్ లుక్ మీ సొంతం. చీర, లెహంగా, డ్రెసెస్ మీదనైనా కూడా ఇవి చక్కగా నప్పుతాయి. ఇందుకు తగ్గట్టుగానే ముత్యాల నగల్లో వివిధ ఆకర్షణీయమైన డిజైన్స్‌లో ముత్యాల ఆభరణాలు లభిస్తున్నాయి. ముత్యాలు ఎక్కువగా డార్క్ షేడ్ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఇక ముత్యాల నగలను ధరించేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. వీటిని వేరే ఇతర ఆభరణాలతో కలిపి స్టయిలింన్ చేయకూడదు. అన్నీ ఆభరణాలు ముత్యాలవే అయితే బాగుంటుంది. ఈ చిట్కానే పైన నటి హన్సిక కూడా ఫాలో అయిందని ఫొటో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ హన్సిక ధరించిన చీర బ్రాండ్ సురుమయే, ధర రూ. 23,000. బ్లౌజ్ ధర రూ. 6,00 నెక్ పీస్ బ్రాండ్: ప్రీటో ధర: రూ. 5,800 ఇయర్ రింగ్స్ బ్రాండ్: గోల్డెన్ విండోధర: రూ. 1,890 -
ఆ రూమర్స్‌తో హర్టయ్యా.. కానీ అది కిక్కిచ్చింది: కన్నప్ప హీరోయిన్
కన్నప్ప సినిమాలోని ‘సగమై – చెరి సగమై’ పాటతో అందరి దృష్టినీ ఆకర్షించింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మలబార్ గోల్డ్, శరవణన్ స్టోర్స్, చెన్నై సిల్క్స్ వంటి సంస్థల కమర్షియల్ యాడ్స్‌లో మోడల్‌గా నటించింది. తండ్రి గోపాల్ ముకుందన్ వ్యాపారవేత్త. తల్లి చెన్నైలో డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. తల్లే దగ్గరుండి భరతనాట్యం నేర్పించి, ప్రదర్శనలు ఇప్పించింది.ప్రీతియే కాదు తల్లి కూడా నటించింది!తల్లికి యాక్టింగ్ పట్ల ఎంత ఇష్టమంటే కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తే, తల్లి కూడా ఓ క్యారెక్టర్లో నటించింది. నటి లక్ష్మి కుమార్తె, ఒకనాటి హీరోయిన్ ఐశ్వర్య.. ప్రీతి ముకుందన్ తల్లి కాలేజీలో క్లాస్మేట్స్. న్యూజిలాండ్‌లో కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళూ ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. కాలేజీ కబుర్లు నెమరేసుకున్నారు. 2001 జులై 30 సోమవారం నాడు పుట్టింది ప్రీతి ముకుందన్. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. అయితే, శివ భక్తుడు కన్నప్ప మీద తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.ఆ హీరోయిన్ తప్పుకోవడం వల్ల..కన్నప్పలో హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్‌కి ప్రీతి ముకుందన్ వచ్చింది. కానీ, నుపూర్ సనన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. కన్నప్ప సినిమా ఓపెనింగ్‌లో కూడా నుపూర్ సనన్ పాల్గొంది. అప్పుడు ఎంతో బాధ పడినట్లు ప్రీతి ముకుందన్ చెప్పింది. అయితే తర్వాత నుపూర్ సినిమా మానేయడంతో– మళ్ళీ హీరోయిన్ చాన్స్ ప్రీతి ముకుందన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివుడే తనకు ఈ అవకాశం ఇచ్చాడని ప్రీతి నమ్మకం.(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో)ఆ రూమర్స్‌తో హర్టయ్యామ్యూజికల్ వీడియో ఆల్బమ్స్‌తో ప్రీతి చాలా పాపులర్. ముత్తు–2, ఆశాకాండ, మోరిని మొదలైన వీడియోల్లో డ్యాన్స్ చేసింది. కన్నప్ప మొదటి తెలుగు సినిమా కాదు. అంతకు ముందు ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాలో శ్రీ విష్ణు పక్కన హీరోయిన్గా నటించింది. తమిళంలో స్టార్ అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఆ సినిమా హీరో కెవిన్‌తో తన పేరు జత చేసి, రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం ఫీలయ్యాను అంది. ప్రభాస్‌తో నటించడం..కన్నప్ప సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తిసాములో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. గ్లామరస్‌గా ఎక్స్పోజ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో షూట్స్‌తో ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది. మలయాళంలో మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కెరీర్లోనే కిక్ ఇచ్చిన హయ్యస్ట్ మూమెంట్ అంది ప్రీతి ముకుందన్.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?
ఆన్లైన్లో ప్రతి వస్తువు అమ్మకానికి ఉంచినట్లే, చైనాలో మట్టిని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, ఈ మట్టి అలాంటి ఇలాంటి మట్టి కాదు, ‘ఇదొక అదృష్టాల మట్టి, ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురిపిస్తుంది’ అంటూ బ్యాంకుల ఆవరణలోని మట్టిని రాత్రివేళలో సేకరించి ఆన్లైన్లో అమ్ముతున్నారు. వంద గ్రాముల మట్టి ధర సుమారు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉంటోంది. ఈ మట్టితో ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్మి, బ్యాంకుల ముందు మట్టిని, బ్యాంక్ లోపల పూలకుండీల వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా సేకరిస్తున్న వీడియాలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధంగా ప్రకటించింది. ఇలాంటివి నమ్మవద్దని ప్రకటనలు ఇస్తోంది చైనా ప్రభుత్వం. (చదవండి: -
అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే స్మార్ట్ ఆభరణాలు..! థర్మామీటర్ చెవిపోగు ఇంకా..
అందం కోసం ఆభరణాలను ధరించడం మామూలే కాని, అవే ఆభరణాలు అందంతోపాటు ఆరోగ్యాన్ని, టెక్నాలజీని అందిస్తే భలే బాగుంటుంది కదూ! అయితే, ఈ గాడ్జెట్స్ మీ కోసం..థర్మామీటర్చెవిపోగుశరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే థర్మామీటర్ చేసే పనిని చేస్తుంది ఈ చెవిపోగు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో షిర్లీ, జుయే, యుజియా అనే ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఈ చెవిపోగుతో శరీర ఉష్ణోగ్రతను సులభంగా తెలుసుకోవచ్చు. డ్యూయల్ సెన్సర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ యాంటెనాతో తయారైన ఈ చెవిపోగు బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఉష్ణోగ్రతతో పాటు, పరిసరాల ఉష్ణోగ్రతలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి, మొబైల్‌కు సమాచారం ఇస్తుంది. పీరియడ్స్ మూడ్ స్వింగ్స్కు చెక్అమ్మాయిలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్‌లో విపరీతమైన కడుపునొప్పితో పాటు, మూడ్ స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ ‘ఫెమ్టెక్ బీబీ రింగ్’. ఇదొక స్మార్ట్ రింగ్, సాధారణ హెల్త్ ట్రాకర్ మాదిరిగానే ఇందులోనూ, వివిధ సెన్సర్లతో పాటు, ఎమోషన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దీనిని ధరిస్తే ప్రతినెలా భావోద్వేగాల్లో వచ్చే మార్పులను పరిశీలించి సమాచారం ఇస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.బైస్కోప్ గాగుల్స్కళ్లకు ధరించే కళ్లజోడు స్మార్ట్‌గా మారిపోయిన విషయం తెలిసిందే! అయితే, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని, కావాల్సిన సమాచారాన్ని కళ్లజోడు అద్దాలపైనే చూసే వీలు కల్పించే వీటి లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది. వాటిలో ఒకటి మినీ ప్రొజెక్టర్‌లా పనిచేసే ఈ ఐఎన్‌ఎమ్‌ఓ2 వైర్లెస్ గ్లాసెస్. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో ఎప్పుడైనా సరే కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఇన్విజిబుల్ స్క్రీన్ వేసి చూపిస్తుంది. మల్టీమీడియా హెడ్సెట్ సాయంతో వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు. కేవలం వంద గ్రాముల బరువుతో, సౌకర్యవంతంగా ఉండే దీని ధర 599 డాలర్లు (అంటే రూ.52,302) మాత్రమే!‘లబ్‌డబ్’ లవ్ లాకెట్ ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్. ఇదొక లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్‌లో వారి కాంటక్ట్‌ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. (చదవండి: వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి..) -
Dog: ప్రేమకి, విశ్వాసానికి మారుపేరు..
కుక్క– ధర్మరాజుతో స్వర్గాన్ని, దేవదాసుతో దైన్యాన్ని సమానంగా పంచుకున్న ఈ జాతి విరోధాభాసకు చక్కటి ఉదాహరణ. కుక్కలు అరుచుకుంటాయి, అంతలోనే ఎంతకీ విడివడనంతగా కలుసుకుంటాయి. ప్రేమకి, విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి, అత్యంత నీచమైన తిట్టుగా వాడబడతాయి. వాటి గొడవలతో, అరుపులతో మిగతావాళ్లు పడే భయాన్ని పట్టించుకోనంత స్వార్థంతో ఉంటాయి. ఒక్కటీ అందిరాదని తెలిసినా, పుంజీడు పిల్లల్ని కని; తినీ తినకా, చచ్చీ చెడీ, నిస్వార్థంగా వాటిని పోషిస్తాయి.‘నా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల ఏం చేచ్చోంది లా’ అంది వందన అతని వతైన తల చెరిపేస్తూ,‘ఏయ్, ఏంటిది? లే, ఇది హాలు. కిటికీలోంచి కనబడతాం’ అన్నాడు మౌళి లాప్టాప్లో పనిచేసుకుంటూ.‘ఎదురింటివాళ్ళు లేరు లేరా. అయినా ‘చౌ చౌ’ బ్రీడ్ కుక్కపిల్లలా ఇంత జుట్టేంటిరా? నీ జుట్టు నాకుండి, హాయిగా నీకు బట్టతల వస్తే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నా’ అంది వందన అతని ఒళ్ళో కూర్చుని, ఒతైన జుట్టుని వేలితో తిప్పుతూ.లాభం లేదని, లాప్టాప్ పక్కన పెట్టి, ‘అయితే తలుపేయ్, జుట్లు పీక్కుందాం’ అన్నాడతను కొంటెగా ఆమెని దగ్గరకి లాక్కుంటూ.‘నోర్మూసుకుని పని చూసుకో! ఇంత పిసరు చనువిస్తే చాలు, రెచ్చిపోతావ్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏదో అప్పుడప్పుడూ ముద్దొస్తావు. అంతమాత్రాన బుద్ధిలేదూ?’ అంటూ అతని క్రాఫ్ సరిచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది వందన.అంతలో వందనకి ఫోన్ వచ్చింది. ‘ఆ వదినా చెప్పండి, అవునా వెరీ గుడ్. ఆ.. ఇదిగో మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి, అలాగే, మేము రేపు ఉదయమే బయల్దేరి వస్తాం’ అంటూ భర్తకేసి తిరిగి, ‘ఏమండీ, మీ అక్క ఫోన్, మీ మేనకోడలు హడావిడి చేసిందట, మాట్లాడండి’ అంటూ ఫోన్ మౌళికి ఇచ్చింది.ఆ రాత్రి. పాలమీగడలాంటి ఆమె వంటిపై పాము కుబుసంలాంటి నైటీ మెరిసిపోతోంది. విరబోసుకున్న కురుల్లో విరిసిన మల్లెలు కారుమబ్బుల్ని చీల్చుకొచ్చిన వెలుతురు చుక్కల్లా ఉన్నాయి.‘రేపు ఊరెళ్తే ఓ మూడురోజులు మళ్ళీ పస్తే. అయినా ఇంతందంగా ఉండే నీకు ఏంగర్ ఇష్యూస్ ఏంటిరా’ అన్నాడతను ఆమెకి చేరువౌతూ.‘అక్కడకి నువ్వేదో శాంతమూర్తివైనట్టు. అయినా సత్యభామ కోపం కూడా కృష్ణుడిపై ప్రేమలో భాగమే! సహిస్తేనే సౌఖ్యం, భరిస్తేనే భోగం’ అందామె కొంటెగా.ఒక్క ప్రథమకోపం తప్పిస్తే, అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటుంది వందన.అందుకే భర్తొదిలేసిన అక్కని, భార్యొదిలేసిన అన్నని, ఊళ్ళో అమ్మకొదిలేసి మరీ సిటీలో వందనకి వందనంగా ఉంటున్నాడు మౌళి.∙∙ ఆ మర్నాడు ఉదయమే కార్లో బయలుదేరి ఊరికి వెళ్లారు. పిల్లని చాప మీద కూర్చోపెట్టారు. నెమ్మదిగా పేరంటాళ్ళు రావటం మొదలుపెట్టారు.‘అక్కా అందరూ వచ్చారు కదా! ఇంకా దేనికి వెయిటింగ్?’ అడిగాడు మౌళి లోపలికి వస్తూ.‘అదే రా మీ ఆవిడ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళింది. అరగంటయింది, ఇంకా రాలేదు. తను లేకుండా మొదలుపెడితే ఏమనుకుంటుందో అని...’ అంటూ నసిగింది శ్యామల.‘వాళ్ళ వాళ్ళతో ఫోన్ మాట్లాడిందంటే ఓ పట్టాన వదలదు. ఉండక్కా, నేనెళ్ళి తీసుకొస్తా’ అంటూ మేడెక్కాడు మౌళి. అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వందనని కిందకి రమ్మని సైగ చేశాడు, అతన్ని ఆగమని, ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ‘హా అక్కా, వాళ్ళు పెళ్లి వైజాగ్‌లో చేయమంటున్నారు అంతేగా. నువ్వేం కంగారు పడకు. మీరు ఓకే అని చెప్పండి. నువ్వు, బావ, నీ కూతురు వచ్చేయండి. మొత్తం నేను చూసుకుంటా. అది నాకూ కూతురే. నేను దగ్గరుండి చేస్తా పెళ్లి. కల్యాణ మంటపం ఇప్పుడే బ్లాక్ చేస్తా’ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడుతోంది వందన.ఆ సంభాషణ విని మౌళికి చిరాకేసింది. అతనికి తోడల్లుడు అంటే పడదు. నక్కు నక్కుగా ఉండి అందర్నీ వాడుకుంటాడని. దానికి తోడు పెళ్లి హడావిడి అంతా వందన నెత్తి మీదేసుకుంటే ఇంక ఆమె తనకి కనీసం ఓ రెండు మూడు నెలలు దొరకదు.ఆమె ఎంతకీ ఫోన్ ఆపకపోవటంతో ‘హే, ఆపు నీ సోది. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత పెళ్ళి. సాయంత్రానికి మన ఊరెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు ఫంక్షన్‌కి వచ్చాం కదా. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. రా కిందకి’ అన్నాడు విసుగ్గా. ఇంట్లో తనని ‘పెళ్ళాం కూచి’ అనుకోవటం మౌళికి తెలుసు. అది తప్పని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా అతనలా మాట్లాడ్డానికి ఓ కారణం.ఆ మాటలు అవతల ఫోన్లో ఉన్న వందన అక్కకి లీలగా వినబడ్డం వల్లనేమో,‘సరే వందనా, అత్తవారింట్లో బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చేస్తాలే’ అని ఫోన్ పెట్టేసింది.అప్పటికే శ్యామల కూడా మేడమీదకి రావటంతో తమ్ముడు మరదల్ని విసుక్కోవటం చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న సంతోషపు తెర వందన చూసింది. అంతే, భర్త చూపించిన విసుగు కంటే, అక్క విందన్న ఉక్రోషంతో, ఆడపడుచు ఉందన్న అవమానంతో, వందనకి కోపం నషాళానికి అంటింది.‘మా అక్క కూతురి పెళ్లంటే నా కూతురి పెళ్లిలాంటిది. శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సోది అంటావా? మాటలు మర్యాదగా రానీ’ అంది వందన విసురుగా కిందకి వెళుతూ.అతనూ తగ్గలేదు. ‘చూడూ, మనమా వాళ్ళకంటే చిన్నవాళ్ళం. వాళ్ళు ఎత్తిపెట్టుకుని మనదగ్గరకి వచ్చేస్తే, అన్నీ మనమెక్కడ చూడగలం? పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. పైగా మీ బావకి కనీసం బండి తొక్కడం కూడా రాదు. ఎక్కడికైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏం? మీ అన్నయ్య కూడా వైజాగ్‌లోనే ఉంటున్నాడుగా! అతనితో మాట్లాడొచ్చుగా? మీ అక్క నీకే ఎందుకు చెబుతోంది. ఆ పిల్ల వాడికీ మేనకోడలే కదా?’అన్నాడు విసురుగా. అప్పటికే ఇద్దరూ కిందకి దిగారు. శ్యామల ముందే దిగిపోయింది.‘నోర్ముయ్. వాడూ, వీడు అంటున్నావేంటి రా’ వందన ఊగిపోతోంది కోపంతో.‘ఏయ్ మర్యాదగా మాట్లాడు’ అన్నాడు మౌళి. వాళ్లిద్దరూ చుట్టూ ఎవరున్నారో ఎప్పుడో మర్చిపోయారు. ఆ క్షణం వాళ్ళు వీధికుక్కల్ని తలపించారు.‘నీకు మర్యాదిచ్చేదేంటిరా. నోటికొచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా రాత్రికి నా పక్కలోకే చేరతావురా కుక్కా’అంతే. మౌళి చుట్టూ చూశాడు. అప్పటికే అక్కడికి చేరిన పేరంటాళ్ళు ఉండాలన్న ఉత్సుకతకీ, ఉంటే గొడవ ఆపేస్తారేమో అనే అనుమానానికి మధ్యలో ఊగిసలాడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గంటగంటకీ గడియారంలో పక్షి బైటకొచ్చినట్టు అడపాదడపా తలుపు సందుల్లోంచి ఓసారి మొహం బైటపెట్టి మళ్ళీతలుపుచాటుకి వెళ్లిపోతున్నారు. పిల్లలు ఒకప్పుడు చిత్రలహరి చూడ్డానికొచ్చినట్టు కిటికీల దగ్గరకి చేరారు. మౌళి స్పృహలోకొచ్చాడు. అమాంతం తనని లోపలికి తీసుకెళ్ళిపొమ్మని భూదేవిని వేడుకున్నాడు. భూదేవి పలక్కపోవటంతో, ఏం చెయ్యాలో తెలీని ఉక్రోషంతో వందన మీదకి వెళ్ళాడు.‘ఆగక్కడ. నా ఒంటిమీద చెయ్యి పడిందో ఇంటిల్లిపాదినీ జైల్లో తోయిస్తాను’ ఊగిపోతూ వేలు చూపిస్తోంది వందన.అంతే. ఒళ్ళో కూర్చున్న ‘చివావా’ కుక్కపిల్ల వృషణాలు కరిచినట్టు వణికిపోయాడు మౌళి.శ్యామల కారుతున్న చెమటని సైతం లెక్కచేయకుండా ఫ్యాన్ కూడా లేని కొట్టుగదిలోకి పరిగెత్తింది. అమ్మ వెనుకే ఉండి, చిమ్మిలి నలిగిందో లేదో, బెల్లం సరిపోయిందో లేదో ఆరారా రుచి చూస్తున్న విస్సుబాబు తల్లి వెనక్కి మరింతగా ఒదిగిపోయాడు.అందరికన్నా ముందు తేరుకున్నది రామలక్షే్మ! గబ గబా చెయ్యి కడుక్కుని, కోడలికి గ్లాస్‌తో మంచినీళ్ళిచ్చి, పక్కనే ఉన్న స్టూల్ జరిపి, ‘ముందు నువ్వు కూర్చో తల్లీ, వాడొట్టి మూర్ఖుడు, నేను మందలిస్తా’ అంది.‘చూడండి మీ కొడుకు బుద్ధి. ఏం? నేను మీ అందరితో కలివిడిగానే ఉంటున్నాను కదా. సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నకల్లా పరిగెత్తుకుని రాలేదా. నా వాళ్ళు అనుకోబట్టే కదా. అదే నీ కొడుక్కి మాత్రం మా వాళ్లంటే ఎరుసు. ఎప్పుడూ వాళ్ళని చులకనగానే మాట్లాడతాడు’ అంది వందన రొప్పుతూ.రామలక్ష్మి ఆమెని స్టూల్ మీద కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించి ఆమె పక్కనే కింద కూర్చుంది. మౌళిని బైటకి పొమ్మని హెచ్చరించింది. కాసేపాగి, వందన వణుకుతున్న గొంతుతో, ‘ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. వాడితో నేను వెళ్ళను. నా దగ్గర ఒక్క రూపాయి ఉంచడు నీ కొడుకు. బస్సెక్కి వెళ్ళిపోతా, నాక్కొంచెం డబ్బివ్వండి’ అంది.‘అమ్మా, నువ్వు మంచిదానివి. ఇంటికోడలు ఇలా కంటతడి పెట్టి వెళ్ళిపోతే ఆ చంటిదానికి మంచిది కాదు. ఈ ఒక్కపూట ఉండి సాయంత్రానికి వెళ్లిపోదురు. మీరిద్దరూ విడివిడిగా వెళితే వీధిలో పరువు పోతుంది. వాణ్ణి నేను మందలిస్తాను. నిన్ను ఒక్క మాట అనకుండా ఉండే పూచీ నాది’ అంటూ వందన కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది రామలక్ష్మి.నెమ్మదిగా పేరంటం అయిందనిపించారు. మౌళి, వందన మాట్లాడుకోలేదు.అతికష్టం మీద పిల్లతో ఫోటోకి మాత్రం నించున్నారు. ఆ రోజు సాయంత్రం. మౌళి కారు స్టార్ట్ చేశాడు. రామలక్ష్మి వందన చేతిలో రెండువేలు పెట్టి, ‘అమ్మా, వాడిమాటలేం పట్టించుకోకు. నా బిడ్డలాంటిదానివి. నీకు వాడితో ఎప్పుడు చికాకు అనిపించినా ఇక్కడకు వచ్చేయ్’ అంది.వందన అతని పక్క సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుని డోర్ బలంగా వేసింది.ఆ శబ్దానికి రామలక్ష్మి గుండెలు అదిరాయి. కారు కీచు శబ్దం చేసుకుంటూ దుమ్ము రేగ్గొట్టి వెళ్ళింది. రామలక్ష్మి వీధి అరుగుమీద కూలబడింది.రామలక్ష్మికి పదిహేనో ఏట పెళ్లయింది. పద్దెనిమిదికి ముగ్గురు పిల్లలు. భర్తని పిచ్చికుక్క కరవటంతో రేబిస్ వచ్చి ఆర్నెల్లు నరకయాతన పడి మరణించాడు. అతని ఉద్యోగం ఆమెకిచ్చారు. కుక్కపిల్లల్ని తల్లికుక్క పొదువుకుని కాపాడినట్టు పిల్లల్ని పెంచుకొచ్చింది. కూతురు శ్యామలకి చెమటెక్కువ. ‘ఓస్ అంతేనా’ అనుకునేంత కాదు.డాక్టర్‌కి చూపిస్తే ‘హైపర్ హైడ్రోసిస్’ అని చెప్పేంత. ‘బుల్ డాగ్’లా వాసన కొడుతోందనిపెళ్ళైన వారానికే ఓ పిల్లని కనడానికి సరిపడా ‘అనుభవం’ ఆమెకి వదిలేసి ‘పరియా’ బ్రీడ్వీధికుక్కలా పారిపోయాడు భర్త.రామలక్ష్మి రెండో సంతానం విస్సుబాబు. అమ్మ కూచి. ‘మాస్టిఫ్’ బ్రీడ్ లా ఇంట్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం తప్పిస్తే అతని వల్ల రామలక్ష్మికి మరే ఉపయోగం లేదు.పెళ్లయ్యే వరకు ఉద్యోగం ఉంది అనిపించాడు. అవగానే మానేశాడు. భార్య వేరు కాపురం పెట్టమంది. ‘అమ్మని, వదిలి ఎలా వెళ్తాం?’ అన్నాడు. ఎలా వెళ్లాలో ఆమె వెళ్లి చూపించింది. అప్పుడప్పుడూ స్వప్నస్ఖలనాలతో అతనికి భార్యలేని లోటు తెలియలేదు. వీళ్ళిద్దరినీ రామలకే‡్ష్మ పోషిస్తుంది.పిల్లల చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పించుకుంది రామలక్ష్మి. ‘పుంజు’లకి, ‘పెట్ట’కి కూడా పెళ్లి గండం ఉందని తెలిసింది. భయపడినట్టుగానే కూతురు, పెద్దకొడుకు పెళ్లిళ్లు పెటాకులైపోయాయి. రెండు డక్ అవుట్ల తర్వాత దిగే బాట్స్మెన్ని పెవిలియన్ నించి చూస్తున్న మేనేజర్లా రామలక్ష్మి దడదడలాడుతూ మూడోవాడైన మౌళికి పెళ్లి చేసింది. కొడుక్కి కోరికెక్కువ, కోడలికి కోపమెక్కువ. వాళ్ళు చిన్న మాట అనుకున్నా ఆమెకి కంగారెక్కువ. ఆ రోజు జరిగిన గొడవతో చిన్నప్పుడు జోస్యం చెప్పిన చిలక ఇప్పుడు ఆమె తల్లో రాబందులా తిరగసాగింది.మౌళి, వందన, వాళ్ళింటికి చేరేటప్పటికి రాత్రయింది. ఇంత తిన్నామనిపించి, బెడ్రూమ్లో ‘ఇగో’ అనే పాముని చెరోవైపు పట్టుకుని సాగదీసి వీసెలకొద్దీ విషాన్ని చిమ్మిన తర్వాత ఏ అర్ధరాత్రికో అమృతం చిలికారు.మరి అదేరాత్రి రామలక్ష్మికి ఎలా గడిచింది? ‘కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో’ అని ఆలోచించటానికి మౌళి మహాకవి కాదు.ఆ మర్నాడు వాళ్లిద్దరూ పన్నెండు రోజులుండటానికి సరిపడా బట్టలూ, గట్రా తెచ్చుకుని మళ్ళీ కార్లో ఊరొచ్చారు. బతికుండగా బువ్వెట్టకపోయినా చితిలో చక్కెర పోశాడు. ఈ పదకొండు రోజులూ పాటించవలసిన నియమాలు చెబుతూ బ్రహ్మచర్యం కూడా పాటించాలని బ్రహ్మగారు మౌళిని చాటుకి పిలిచి చెప్పారు. తలైతే ఊపాడు కానీ, అందరికీ కనబడే భూశయనం, ఏకభుక్తం వరకే పాటించగలిగాడు. మధ్యలో ఓ రోజు రాత్రి వందన అతన్ని ఓదార్చడానికి దగ్గరకి తీసుకున్నప్పుడు పాలమీగడ, పాముకుబుసం మళ్ళీ తెరమీదకొచ్చాయి. ‘చౌ చౌ’ బ్రీడు, ‘చివావా’ బ్రీడూ కలిసి ఆ రాత్రి చిత్తకార్తెని తలపించాయి. అది చూసి (?) రామలక్ష్మి అస్సలు బాధపడలేదు. పైగా వాళ్లిద్దరూ కలిసున్నందుకు ఎంతో సంతోషించడంచేత, ఆమెకి ప్రేతత్వ విముక్తి కలిగి, హాయిగా యమదూతల ఎస్కార్ట్‌లో వెళ్ళిపోయింది.మునిసిపాలిటీ వాళ్ళు వలతో వస్తే, వయసులో ఉన్న కుక్కలన్నీ తలో రకంగా తప్పించుకోగా, ఎటూ కదల్లేక దొరికిపోయి, ఆ కుక్కలబండిలో బిక్కు బిక్కు మంటూ, కంటనీరు కారుస్తూ, చావుకెదురు చూస్తూ, ఒంటరిగా మిగిలిపోయిన వీధి కుక్కలా గొడవ జరిగిన రోజు రాత్రంతా గడిపిన రామలక్ష్మి దుఃఖం ఎవరికి పట్టాలి? బతికుండగా నరకం చూపించి, చచ్చాక ‘పున్నామనరకం’ తప్పించే ‘కొడుకు’ విరోధాభాసకు మరో ఉదాహరణ. -
యువ కథ: ఎంత ధైర్యం నీకు?
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్‌లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్‌తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది. -
సోమదత్తుడి వృత్తాంతం
యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా, సుభిక్షంగా పరిపాలించేవాడు. సోమదత్తుడు సత్య ధర్మాలను పాటించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. సాధు సజ్జనులను సముచితంగా గౌరవించేవాడు. సోమదత్తుడి వైభవం నానాటికీ ద్విగుణం కాసాగింది. అతడి వైభవం శత్రువులకు కంటగింపుగా మారింది. ఎవరికి వారే అతడిపైకి యుద్ధానికి వెళితే ఎదిరించడం సాధ్యం కాదని తలచి, శత్రువులందరూ సోమదత్తుడికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అందరూ కలసి అతడిపై యుద్ధం చేసి, అతడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తీర్మానించుకున్నారు.శత్రువులందరూ అదను చూసుకుని, సోమదత్తుడి రాజధాని మహిష్మతీపురాన్ని నలువైపుల నుంచి ముట్టడించారు. శత్రువుల దురాక్రమణ సంగతి తెలియగానే, సోమదత్తుడు సైన్యాన్ని ఆయత్తం చేసి, యుద్ధానికి బయలుదేరాడు. వేలాది అక్షోహిణుల చతురంగ బలాల మధ్య భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా గజ తురగాలు నేలకొరిగాయి. వేలాది రథాలు విరిగిపోయాయి. యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.రాజ్యం శత్రువశం కావడంతో సోమదత్తుడు తన భార్య దేవికతో కలసి అడవుల్లోకి చేరుకున్నాడు. అడవులలో ప్రయాణిస్తుండగా, వారికి గర్గ మహాముని ఆశ్రమం కనిపించింది.మహర్షిని ప్రార్థిస్తే, తమ కష్టాలు తీరవచ్చని భావించింది దేవిక.ఆమె ఆశ్రమం వద్దకు చేరుకుని, గర్గ మహాముని ముందు మోకరిల్లింది.‘మహర్షీ! శరణు శరణు! శత్రువుల చేతిలో ఓటమి చెంది నా పతి రాజ్యభ్రష్టుడయ్యాడు. భర్తతో కలసి నేను అడవుల పాలయ్యాను. నా పతిని మీరే రక్షించాలి’ అని ప్రార్థించింది.గర్గ మహాముని ఆశ్రమం వెలుపలకు వచ్చాడు.ఆశ్రమం వెలుపల దీనవదనంతో నిలుచున్న సోమదత్తుడు కనిపించాడు.గర్గుడు రాజ దంపతులను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు.‘రాజా! ఇది గార్గ్యాశ్రమం. ఇక్కడ భయమేమీ లేదు. నీకొచ్చిన కష్టం దుస్సహమైనది. విజయ సిద్ధి కలిగించే మంత్రాన్ని నువ్వు అనుష్ఠించలేదు. అందువల్లనే నీకు ఈ దుస్థితి వాటిల్లింది. ఎలాంటి కష్టాలు వాటిల్లినా, ధైర్యం రాజ లక్షణం. ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డడమే క్షాత్రధర్మం. అందువల్ల ధైర్యంగా ఉండు. పరిస్థితులు చక్కబడతాయి’ అని సోమదత్తుడికి నచ్చజెప్పాడు గర్గ మహాముని.‘మునీశ్వరా! నా కష్టాలు గట్టెక్కే మార్గం బోధించండి. ఈ గడ్డుకాలాన్ని దాటడానికి నేను ఆచరించవలసిన వ్రతమైనా, జపించదగ్గ మంత్రమైనా సెలవీయండి. అందుకు పాటించవలసిన నియమాలను ఆదేశించండి’ అని వినయంగా అభ్యర్థించాడు సోమదత్తుడు.‘రాజా! సమస్త బాధలను తొలగించి, అఖండ విజయాలను అందించే అమోఘమైన విద్య ఒకటి ఉంది. అది పంచముఖ ఆంజనేయ విద్య. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను’ అని పలికి, గర్గుడు ఇలా చెప్పాడు:‘వైశాఖమాస కృష్ణపక్ష దశమి రోజున గాని, ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున గాని, మాఘం మొదలుగా మొదటి ఐదు మాసాలలో వచ్చే మొదటి శనివార దినాలలో గాని, మృగశిరా నక్షత్రం వచ్చే రోజున గాని, శ్రావణ పౌర్ణమి రోజున గాని, కార్తీక శుక్ల ద్వాదశి రోజున గాని, మార్గశిర శుక్ల త్రయోదశి రోజున గాని హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు పవిత్ర తోరాన్ని పదమూడు ముడులతో ధరించి, వ్రతదీక్ష చేపట్టాలి. బంగారం, వెండి, రాగి వంటి లోహపు రేకుల మీద చెక్కిన హనుమద్ యంత్రం గాని, భూర్జపత్రం లేదా తాళపత్రం మీద గీసిన యంత్రం గాని, లేదా పిండిలో గీసిన యంత్రం గాని, పూర్ణకుంభం లేదా హనుమద్ప్రతిమను గాని పూజామండపంలో నెలకొల్పి ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రతపూజ పరిసమాప్తం అయిన తర్వాత పదమూడు నేతి అప్పాలను వాయనంగా ఇవ్వాలి. గురువుకు ధనధాన్యాదులను కానుకగా ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు అన్న సమారా«ధన చేయాలి. గొప్ప సంకల్పసిద్ధి కోరేవారు పదమూడేళ్ల పాటు ఈ హనుమద్వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాలి. దీనివల్ల హనుమదనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఘనవిజయాలు దక్కుతాయి.’గర్గుడు చెప్పిన హనుమద్వ్రత విధానాన్ని సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. గర్గుని ఆధ్వర్యంలోనే భార్యా సమేతుడై, హనుమద్వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. హనుమదనుగ్రహంతో ఖడ్గసిద్ధి పొందినవాడై, శత్రువులను దునుమాడి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత సోమదత్తుడు గర్గుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయనకు ఘనంగా ధన ధాన్యాలను, గోవులను సమర్పించి, సత్కరించాడు. సాంఖ్యాయన -
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్‌మెన్‌గా పిలిచే ప్రొఫెషనల్స్‌కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్‌కు చెందిన సుభాష్‌కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్‌తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్‌ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్‌లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్‌లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్‌షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్‌లో పట్టుకుంది. హైదరాబాద్‌లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్‌లూ జరిగాయి. -
ఆటగాళ్ల ఊరు.. ఆత్మకూరు
తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక అమ్మాయిని మహిళల ఫుట్‌బాల్ జట్టుకు అందించిన ఊరు అది. క్రీడలను ఎంతగానో ప్రేమించే ఆ ప్రాంతం ఎందరినో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పరిచయం చేసి, క్రీడాకారుల కర్మాగారంగా గుర్తింపు సాధించింది. ఆటగాళ్ల ఊరుగా పేరుపొందిన ఆత్మకూరుపై ఈ కథనం..తిరుమలరావు కరుకోల, సాక్షి విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గంలోని ఆత్మకూరు క్రీడాకారుల కర్మాగారంగా పేరుపొందింది. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు, మూడున్నర ఎకరాల మైదానంలో ఏదో ఒక మూల కొందరు విద్యార్థులు క్రీడల్లో సాధన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్‌తో పాటు పలు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. ఇక్కడి స్థానికులు కూడా చాలామంది ఏదో ఒక సమయంలో మైదానానికి వస్తుంటారు. వృద్ధులు నడక కోసం వస్తుంటారు. ఉద్యోగార్థులు శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2015–16 నుంచి క్రీడల్లో సత్తా చాటుకుంటోంది. ఈ పాఠశాలలో ఒక గది నిండా క్రీడా పోటీల్లో విద్యార్థులు సాధించిన జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, క్రీడా సామగ్రి కనిపిస్తాయి. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఏటా ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతూ వస్తున్నారు. క్రీడల పోటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభ చూపుతుండటం విశేషం. ఇక్కడే చదువుతున్న విష్ణు ప్రణవి, అస్మిత, శ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ సహకారంతో వీరు శిక్షణలో రాటు దేరారు. నిరంతర సాధనతో ఈ ఐదుగురూ అండర్–13 జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. 2015–16 నుంచి క్రీడా పరంపరఈ పాఠశాలలో క్రీడా పరంపర 2015–16 నుంచి మొదలైంది. ఆ ఏడాది పాఠశాల నుంచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ముగ్గురు, క్రికెట్‌కు ఒకరు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌కు పదిమంది, క్రికెట్‌కు ఒకరు ఎంపికయ్యారు. దాంతో విద్యార్థుల్లో క్రీడోత్సాహం పెరిగి, ఖాళీ వేళల్లో మైదానం బాటపట్టారు. వారి ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ పాఠశాల నుంచి 2023–24లో ఫుట్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ముగ్గురు, రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ముగ్గురు, అథ్లెటిక్స్‌లో ముగ్గురు ఆడారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.మాస్టర్ అథ్లెట్స్లోనూ మేటిఆత్మకూరులో విద్యార్థులు, యువతే కాదు, నలభై ఏళ్ల వయసుకు పైబడినవారు సైతం మాస్టర్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇక్కడి నుంచి యాభయ్యేళ్లు దాటిన నలుగురు జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోలో జగన్మోహన్ రెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. లాంగ్ జంప్‌లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు. అలాగే 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో మహమ్మద్ షఫీ మొదటి స్థానంలో నిలిచారు. వీరిద్దరూ క్రీడల కోటాలోనే కొలువులు సాధించారు. ఇక్కడి నుంచి క్రీడల కోటాలో కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కొలువులు సాధించిన వారు దాదాపు ముప్పయి మంది వరకు ఉండటం విశేషం.ఫొటోలు: ముల్లా ఖాసింవలీ, ఆత్మకూరు, అనంతపురంజాతీయ ఫుట్‌బాల్‌కు ఏకైక తెలుగమ్మాయిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మందల అనూష జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన తొలి అమ్మాయిగా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురూ ఆడపిల్లలే! అనూష అందరికంటే చిన్నమ్మాయి. ఆమె అక్కలు చందన, రాజేశ్వరి కూడా ఫుట్‌బాల్ ఆడేవారు. వారికి పెళ్లిళ్లు కావడంతో ఆటకు దూరమయ్యారు. అనూష 2017లో జరిగిన మిక్స్డ్ జెండర్ ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులోని రూట్ క్లబ్ తరఫున 2022లోను, కెంప్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున 2024లోను బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో జరిగిన టోర్నీలలో పాల్గొంది. అనంతపురంలో 2024 నవంబర్‌లో జరిగిన జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో సత్తా చాటి, అండర్–20 భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైంది. బెంగళూరులో 2024 డిసెంబర్లో జరిగిన భారత్–మాల్దీవుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సత్తా చాటుకుంది. -
ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?
నేను డెలివరీ అయి వారం రోజులు అవుతుంది. కాన్పులో రక్తస్రావం ఎక్కువ అయింది అని ఐరన్ టాబ్లెట్స్ రోజుకి రెండు వేసుకోమన్నారు. అవి నాకు పడటం లేదు. ఏదైనా వేరే మార్గం ఉంటే చెప్పండి? – లలిత, గుంటూరు. ఐవీ ఐరన్ ఇన్ఫ్యూజన్ థెరపీ అనేది మీకు ఉత్తమ మార్గం. ఐరన్ మాత్రలు పడనివారికి, ఐరన్ మాత్రలతో వాంతులు, వాంతి వచ్చినట్టు ఉబ్బరం ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఐవీ లైన్ పెట్టి గ్లూకోజ్‌లో వేసి ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఇది డే కేర్ పద్ధతిలో ఇస్తారు. మీ హీమోగ్లోబిన్ లెవెల్, మీ బరువును బట్టి ఎంత మోతాదు, ఎన్ని సార్లు ఇవ్వాలి అనేది డాక్టర్ పరిశీలించి ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీ లేదా కాన్పు జరిగిన తరువాత కూడా రక్తహీనతను నయం చేయడానికి ఇస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో కూడా సేఫ్‌గా తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ తీసుకునే రోజు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. రెండు నుంచి నాలుగు డోసులు దాకా ఇస్తాం. రెండు నుంచి మూడు రోజుల గ్యాప్‌లో తీసుకోవాలి. కొంతమందికి ఇంజెక్షన్‌లోని రసాయనాలకు రియాక్షన్స్ రావచ్చు. దద్దుర్లు, ఆయాసం, దురదలు ఉంటాయి. అందుకే, టెస్ట్ డోస్ ఇచ్చి మీకు ఓకే అయితేనే ఫుల్ డోస్ ఇస్తాం. అన్నీ డోసులు పూర్తి అయిన నాలుగు వారాల తరువాత హీమోగ్లోబిన్ ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఏ సమయంలో అయినా, ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. కొంతమందికి ఇంకేదైనా కారణంతో రక్తహీనత ఉంటే, అది హీమోగ్లోబినోపతీ క్యారియర్– సికిల్ సెల్, థలసీమియా ఉన్నా ఈ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. ఐరన్ ఓవర్‌లోడ్ శరీరానికి ప్రమాదకరం అవుతుంది. చిన్న అసౌకర్యం, ఉబ్బసం, ఆయాసం మొదట కాస్త ఉన్నా వెంటనే తగ్గిపోతాయి. అందుకే, రక్తం తక్కువ ఉండి, సరిగ్గా ఆహారం తీసుకోలేని వారు, మాత్రలు పడనివారు, రక్తమార్తిడి వద్దనుకునేవారు, ఈ ఐవీ ఐరన్ థెరపీని తీసుకోవటం మంచిది. అవి నాకు పడటం లేదు.డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?) -
ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?– కావేరి, నెల్లూరు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్‌ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్ను సంబంధిత ఎక్స్పర్ట్ థెరపిస్ట్లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి. హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది. రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్‌లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్‌లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్‌ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్‌లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్‌నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్ని పీల్చుకునే పద్ధతి. దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్‌ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?) -
ప్రపంచ వాతావరణ సంస్థ ఎలా ఏర్పాటైందంటే..! ఇప్పటికీ 75 ఏళ్లా..?
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది. ‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది. చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా. ‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి. ‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్‌లో ఏర్పాటైంది. అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్‌లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్‌లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది. బ్రిటన్‌లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్‌ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. (చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.అధిక బరువు స్థూలకాయంశరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడంమితిమీరిన ఒత్తిడఇతరేతర ఆరోగ్య సమస్యలుజన్యు కారణాలుకొన్ని ఔషధాల దుష్ప్రభావంచికిత్స పద్ధతులుఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడంఅధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడంస్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడంస్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.మన దేశంలో స్థూలకాయం తీవ్రతమన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరంపొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. పిల్లల్లో స్థూలకాయం లక్షణాలుకొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. బీఎంఐ పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.ఇవీ లక్షణాలుఒక పట్టాన తగ్గని తలనొప్పిఅధిక రక్తపోటువిపరీతమైన దాహంతరచు మూత్రవిసర్జన చేయడంఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడంవయసుకు తగిన ఎదుగుదల లేకపోవడంపిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. (చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలుపిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.డాక్టర్ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడుస్థూలకాయంపై పోరాటందేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్ యాదవ్, ఒలింపిక్స్ విజేత, షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్‌లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..) -
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..!
గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే ‘గేట్ టు హెల్’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది. (చదవండి: ∙ -
శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?
👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్ని అడిగినా, ‘డాక్టర్ కాబోయి యాక్టర్‌ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది. విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.👉: కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్. యశ్ భార్య రాధికా పండిట్‌కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!👉: యశ్ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్‌తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.👉: పుష్ప –2లో కిస్సిక్ సాంగ్‌తో ఆడియన్స్‌ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది.👉: డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్‌గా డాన్స్ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి పెట్టారు.👉: పుష్ప –2లో ఐటమ్ సాంగ్ చేసి, సమంతని రీ ప్లేస్ చేసింది. కిస్సిక్ సాంగ్‌కు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్‌లో భగవంత్ కేసరిలోని పాత్ర, సాంగ్స్‌లో కిస్సిక్ సాంగ్ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.👉: నితిన్‌తో రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో రెండో సినిమా. నిజానికి రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్నా హీరోయిన్గా చేయాలి. మొదట షూటింగ్ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్ చేసింది.👉: పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.👉: బై టూ లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పింది శ్రీ లీల.👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్లా కోట్లాది వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటుంది శ్రీ లీల. -
పరీక్ష హాల్లో టాపర్స్ టెక్నిక్స్!
పరీక్ష హాల్ అనేది యుద్ధభూమి కాదు, ఇదొక గేమ్బోర్డ్! పరీక్షల్లో నిజమైన విజేతలు ఎవరంటే ఎక్కువగా చదివినవాళ్లు కాదు. పరీక్ష హాల్లో సరిగ్గా ఆలోచించి, సమయాన్ని ప్లాన్ చేసుకుని, ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అంటే మీ విజయం మీ మైండ్‌సెట్, ప్లానింగ్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది! అందుకే పరీక్ష హాల్లో మెదడు ఎలా పనిచేస్తుంది? టాపర్ల సీక్రెట్ మైండ్ హ్యాక్స్ ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం.చేయకూడనివి...గడియారం చూస్తూ ఆందోళన చెందవద్దు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఒక్క ప్రశ్నకే అతుక్కుపోయి ఎక్కువ సమయం వృథా చేయడం.పరీక్ష మధ్యలో ‘నేను తక్కువ మార్కులు తెచ్చుకుంటానేమో‘అనే అనవసరమైన ఆలోచనలతో భయం పెంచుకోవడం.ప్రశ్నలకు పూర్తి సమాధానం రాశానా? లేదా? అన్న ఆందోళనకి లోనవడం.ఎవరైనా పేపర్ రాయడం పూర్తిచేస్తే, ఒత్తిడిగా ఫీల్ అవ్వడం.పరీక్ష భయాన్ని తగ్గించే ‘పామింగ్ టెక్నిక్’కొంతమంది విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. సింపతటిక్ నర్వస్ సిస్టమ్ అధికంగా యాక్టివ్ కావడమే దీనికి కారణం. దీన్ని నియంత్రించేందుకు ‘పామింగ్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సులువు. చేతులను రుద్ది వేడిగా చేయండి · కళ్లు మూసుకుని వేడి చేతులను కళ్ల మీద ఉంచండి లోతుగా ఊపిరి తీసుకుంటూ, ‘నేను ప్రశాంతంగా ఉన్నాను‘ అని మౌనంగా చెప్పుకోండి 30 సెకన్ల పాటు అలా ఉంచిన తర్వాత, చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్‌లోకి మార్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పరీక్ష ముందు, ప్రశ్నపత్రం చూసిన వెంటనే ఇది చేయడం మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనకు తీసుకెళుతుంది.మైండ్ బ్లాక్ అయ్యిందా? నో ప్రాబ్లెమ్కొందరు విద్యార్థులకు పరీక్ష మధ్యలో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. చదివినవేవీ గుర్తుకురావు. దీన్ని హ్యాండిల్ చేసేందుకు టాపర్లు జీఎస్ఆర్ మోడల్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మీరూ దాన్నే ఫాలో అవ్వండి!Ground Yourself – కాళ్లు నేలకి ఆనించి 5 సెకన్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి. Switch Focous– 10 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి.Restart Slowly – నెమ్మదిగా ప్రశ్న మళ్లీ చదవండి.పరీక్ష హాల్లో మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్పరీక్ష సమయంలో ఒక్కసారిగా ప్రశ్న అర్థం కాకపోతే, మెదడు ‘ఫ్రీజ్‘ అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించేందుకు మైండ్‌ఫుల్‌నెస్ సైకాలజీలో ఉపయోగించే ‘గౌనర్–స్విచ్ మోడల్‘ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే... గౌనర్ మోడ్ (గమనించు): ప్రశ్న అర్థం కాకపోతే, కొంతసేపు అక్షరాలను ప్రశాంతంగా గమనించు.స్విచ్ మోడ్ (మార్చు): ప్రశ్నను పూర్తిగా వదిలేయకుండా, కొంచెం వెనక్కి వెళ్లి మళ్ళీ నిశ్శబ్దంగా చదువు.స్కానింగ్ మోడ్: పక్కనే ఉన్న ఇతర ప్రశ్నలను చూసి, మైండ్‌ను మళ్ళీ సెట్ చేసుకోవడం. ఇది మెదడును బ్లాక్ అవుట్ నుంచి రికవరీ మోడ్‌లోకి తీసుకువచ్చి, మరింత చురుకైన ఆలోచనకు సహాయపడుతుంది.చివరి నిమిషాల్లో చేయవలసినవిపరీక్ష పత్రం అందుకున్న వెంటనే, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి · ముఖ్యమైన సమాధానాల్ని గుర్తించి, ముందుగా అవి రాయడం మొదలుపెట్టండి · ప్రశ్నలకు సమాధానం రాస్తూ, మధ్యలో చిన్న మైండ్‌ఫుల్ బ్రేక్స్ తీసుకోండి సమాధానాలను సాఫ్ట్‌గా, క్లియర్‌గా రాయండి మార్కుల స్కోరింగ్‌కు డయాగ్రామ్స్, హైలైట్స్ ఉపయోగించండి గుర్తులేదనుకున్న ప్రశ్నలపై చివరి 15 నిమిషాల్లో ప్రయత్నం చేయండి. పరీక్ష అనేది మీరు చదివిన తీరుకే కాదు, మీ మానసిక స్థిరత్వానికి కూడా పరీక్ష. ఈ టూల్స్టెక్నిక్స్ ఉపయోగించుకుని ప్రశాంతంగా, ప్లానింగ్‌తో రాస్తే, మీరు విజయం సాధించటం ఖాయం! పరీక్ష అనేది ఒక స్ట్రాటజిక్ గేమ్! దీనిని గెలవడం మీ చేతుల్లోనే ఉంది! పరీక్షలో విజయం సాధించేది ఎక్కువగా చదివినవారు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలిగినవారే!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి? – రాధ, శ్రీకాకుళంప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్–డి సప్లమెంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్సీజీ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది.విటమిన్–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్–డి సప్లమెంట్స్ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్సీజీ టాబ్లెట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్–ఎ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్ ప్రాడెక్ట్స్‌లో హై విటమిన్–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్‌చేస్తే..) -
నరనారాయణులతో ప్రహ్లాదుడి యుద్ధం
హిరణ్యకశ్యపుడి వధ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జనరంజకంగా పరిపాలన చేయసాగాడు. ప్రహ్లాదుడి పాలనలో పాతాళలోకంలో శాంతి సామరస్యాలు వర్ధిల్లసాగాయి.ఒకనాడు భృగుమహర్షి కొడుకు అయిన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. ఆయన స్నానం చేస్తుండగా, ఒక భీకరసర్పం ఆయనను కాటువేసి, ఆయన కాలిని చుట్టుకుంది. విష్ణుభక్తుడైన చ్యవన మహర్షి మనసులో విష్ణువును ధ్యానం చేశాడు. పాముకాటు ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అయితే, ఆయన కాలిని చుట్టుకున్న పాము, ఆయనను పాతాళలోకానికి లాక్కుని పోయింది. చ్యవనుడిని పాతాళంలో విడిచి, పాము తన దారిన తాను పోయింది.పాతాళంలో కనిపించిన చ్యవనుడిని ప్రహ్లాదుడు చూశాడు.బహుశా, ఇంద్రుడు పంపితే వచ్చి ఉంటాడని అనుకున్నాడు.చ్యవనుడి వద్దకు వెళ్లి పలకరించాడు. ‘మహర్షీ! తమరెవరు? ఇలా దయచేశారేమిటి? దేవతలు ఎవరైనా పంపితే వచ్చారా? వారి నుంచి ఏదైనా వర్తమానం తీసుకొచ్చారా?’ అని అడిగాడు.‘ప్రహ్లాదా! అలాంటిదేమీ లేదు. నర్మదా నదిలో స్నానం చేస్తుండగా, ఒక సర్పం నన్ను తీసుకొచ్చి, ఇక్కడ పడేసి పోయింది. నేను భృగుపుత్రుడిని. నన్ను చ్యవనుడు అంటారు’ అని బదులిచ్చాడు.ప్రహ్లాదుడు చ్యవనుడికి అతిథి మర్యాదలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. చ్యవనుడు కాస్త సేదతీరాక, అతడితో ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టాడు.‘మహర్షీ! భూలోకంలో తమరు ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించుకుని ఉంటారు కదా! వాటిలో గొప్ప పుణ్యాన్ని కలిగించే తీర్థాల గురించి చెప్పండి’ అని వినయంగా అభ్యర్థించాడు.‘నాయనా, ప్రహ్లాదా! భూలోకంలోని భరతఖండంలో నైమిశారణ్యం ఉంది. అది తాపసులకు ఆలవాలం. అక్కడ నైమిశతీర్థం ఉంది. భూలోకంలో ఇది ఉత్తమమైనది. పాతాళంలో చక్రతీర్థం, ఆకాశంలో పుష్కరతీర్థం ఉత్తమమైనవి. వీటిలో స్నానం ఆచరించిన వారికి ఇహపరాలలో సుఖసౌఖ్యాలకు లోటు ఉండదు’ అని చెప్పాడు చ్యవనుడు.కొన్నాళ్లు ప్రహ్లాదుడికి అతిథిగా ఉన్న తర్వాత చ్యవనుడు తిరిగి భూలోకానికి వెళ్లిపోయాడు.చ్యవనుడి మాటలతో ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆయన చెప్పిన తీర్థాలను సందర్శించుకోవాలని అనుకున్నాడు.ఒకనాడు సుముహూర్తం చూసుకుని, పరివారంతో సహా ప్రహ్లాదుడు తీర్థయాత్రకు బయలుదేరాడు.మొదటగా నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సరస్వతీ నదిని దర్శించుకున్నాడు. నదీస్నానం చేసి, అక్కడ పితృతర్పణాలు విడిచాడు. అక్కడ ఉన్న పురోహితులకు విరివిగా అనేక దానాలు చేశాడు.తర్వాత నైమిశారణ్యంలో సంచరిస్తూ, నైమిశ తీర్థంలో స్నానం చేశాడు. స్నానానంతరం వేటకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు మహర్షులు కనిపించారు. వారికి నీడ కల్పిస్తున్న చెట్టు కొమ్మలకు విల్లంబులు వేలాడుతూ కనిపించాయి. ఆ మహర్షులిద్దరూ నరనారాయణులు. ఆ చెట్టుకు వేలాడుతున్న ధనుస్సుల్లో ఒకటి: శారఙ్గం, మరొకటి: అజగవం. వాటికి తోడుగా రెండు అక్షయ తూణీరాలు. శారఙ్గం నారాయణుడి ధనుస్సు, అజగవం నరుడి ధనుస్సు.తాపసుల వద్ద ఆయుధాలను చూసి, ప్రహ్లాదుడు ఆగ్రహం చెందాడు. ‘మీరు కపట సన్యాసుల్లా ఉన్నారు. నిజంగా తపస్సు చేసుకునేవారే అయితే, మీకు ఆయుధాలెందుకు? మీరు ఆయుధాలనే నమ్ముకుంటే యుద్ధం చేయాలి. తపస్సు చేయదలచుకుంటే, ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవాలి’ అని నిలదీశాడు.యుద్ధానికి కవ్విస్తున్న ప్రహ్లాదుడితో పోరుకు ముందుగా నరుడు సిద్ధమయ్యాడు. తన అజగవం తీసుకుని, అతడిపైకి శర పరంపర కురిపించాడు. ప్రహ్లాదుడు కూడా వెనక్కు తగ్గకుండా యుధ్ధం చేశాడు. వందేళ్లు పోరు సాగింది. ప్రహ్లాదుడి ధాటికి నరుడు ఇబ్బంది పడుతుండటం చూసి, నారాయణుడు తన శారఙ్గాన్ని అందుకుని, యుద్ధంలోకి దిగాడు. మరో వందేళ్లు పోరు జరిగింది. ఎవరికి ఎవరూ తీసిపోలేదు. ప్రహ్లాదుడికి శక్తి సన్నగిల్లసాగింది. ఓటమి అంచుల్లోకి చేరుకున్నాడు.అంతలోనే అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.ప్రహ్లాదుడు విష్ణువు ముందు మోకరిల్లాడు. ‘స్వామీ! ఏ యుద్ధంలోనైనా గెలుపు నాదే! మరి ఇప్పుడేమిటి ఇలా జరిగింది?’ అని దీనంగా ప్రశ్నించాడు.‘వీరు నర నారాయణులు. నా అంశతో పుట్టినవారు. కారణజన్ములు. వీరివంటి తాపసులతో ఎన్నడూ తగవు పెట్టుకోకు’ అని హితవు పలికాడు శ్రీమహావిష్ణువు.ప్రహ్లాదుడు వారి ముందు మోకరిల్లి, క్షమాపణలు చెప్పి, తిరిగి పాతాళానికి వెళ్లిపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: మసాన్ హోలీ
బ్లూసీ కేఫ్‌లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్ వైపు చూస్తూ సిగరెట్ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్‌పాత్ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి చేరుకున్నాడు సత్యానంద్. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్ నెల చలికూడా రైల్వేస్టేషన్స్ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడవనెంబర్ ప్లాట్‌ఫామ్ మీద...’లోయర్‌బెర్త్ మీద కూర్చొని విండోతెరిచి సెల్ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర. మిడిల్‌బెర్త్ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్‌బెర్త్ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్‌ఫోన్స్ వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.ప్లాట్‌ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్‌బెర్త్ యువకుడు. బ్యాక్‌ప్యాక్ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్ విప్పుకుంటూ ‘నాది మిడిల్‌బెర్త్ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్.‘మాది వరంగల్. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్ స్టేషన్స్ పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్‌లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్‌ప్యాక్ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’ కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్‌కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్‌కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్ రావు వ్యాపారంలో సత్యానంద్ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్‌లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి. బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్.కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.సత్యానంద్‌కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్ అర్హతతో సత్యానంద్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్‌రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్‌కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్‌కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్‌కి.జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్. ఇసుకలో బ్యాగ్పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్‌కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’..(2025).(1995) లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు . ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ .యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్‌ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్ హోలీ’ వేడుక జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్‌వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్ హోలీ’. మసాన్స్ అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్‌కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్వైపు చూశాడు. మసాన్స్ హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.‘మోహన్స్ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్ హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్‌కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు. అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్ చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్వద్దే కూర్చొని మసాన్స్ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్ వద్ద మసాన్స్ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.(2030)ఊరుచివరి శ్మశానం:చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..వాన కురుస్తోంది. కరెంట్ పోయినా ఇన్వర్టర్ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్‌లైట్ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది. -
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్‌ను పొజిషన్లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు. ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ ..నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ అర్జున్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్‌కి సైగ చేశాడు అర్జున్. వారు తమతో పాటుగా స్నిఫర్ డాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.తక్షణమే అర్జున్ అతని టీమ్ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్ను కలవరపరిచింది. వెంటనే హోటల్ లోపలకు పరుగు తీశాడు. అర్జున్ టీమ్ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్ వాళ్లు స్నిఫర్ డాగ్స్‌తో హోటల్ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్స్పెక్టర్ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్‌ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్‌ను పొజిషన్లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47 రైఫిల్ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.అర్జున్ గాలిలోకి డైవ్ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్ రైఫిల్ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్‌ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్. కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్.. నేను మీ గులాం.. నసీర్ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్‌కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్..మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్ మినిస్టర్ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్ మినిస్టర్ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్ .. నాకు రెండుగంటలు టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్‌లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్ చేశాడు. పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్ వెయిట్ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్ సేవర్ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.‘కమాన్ .. అర్జున్ కమాన్.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్‌ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్ వంక చూశాడు. అర్జున్ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్ కళ్ళు అక్కడ ఆన్ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అర్జున్ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్. ‘అర్జున్ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్’ అన్నప్పుడు కనురెప్పలు కదిలించాడు అర్జున్. ఎన్ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్‌కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు. -
రైస్ ఫూలింగ్
రైస్ పుల్లింగ్ యంత్రం దగ్గర పెట్టుకుంటే వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయంటూ రియల్టర్ వెంకట రమణ నుంచి రూ.24 లక్షలు కాజేసిన పబ్బతి వెంకటేశ్వర్లుపై హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి ముఠాలు అనేకం ఉన్నాయి. కాయిన్, చెంబు, బిందె, యంత్రం... ఇలా వివిధ వస్తువులు చూపించే ఈ చీటర్స్ అవి బియ్యాన్ని తమవైపు ఆకర్షిస్తాయని, వాటిని దగ్గర పెట్టుకుంటే దశ తిరిగిపోతుందంటూ నమ్మబలుకుతారు. వీరి వలలో పడుతున్న అమాయకులు భారీ మొత్తాలు కోల్పోతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా రాణిపేట ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అనేక మంది రైస్ పుల్లింగ్ పాత్రలు ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సంచరిస్తుంటారు. రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం అని అర్థం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటిని దక్కించుకుంటే అమోఘమైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. వీళ్లు కస్టమర్లకు రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ పాత్రలను కొనేవారికి తాము విక్రయిస్తున్న వాటిని చూసే అవకాశం కూడా ఇవ్వరు. ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమను ప్రత్యక్షంగా చూపించమని పట్టుబడితేనే చూపిస్తారు. ఈ మోసగాళ్ళు ఎన్ని చెప్పినా, కొందరు కస్టమర్లు నమ్మరు. ఇలాంటి వాళ్లు ఆయా గ్యాంగ్స్‌తో తమ ముందు రైస్ పుల్లింగ్ చేసి చూపించమని కోరుతూ ఉంటారు. ఇలాంటి వారిని బుట్టలో వేసుకోవడానికి నేరగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఈ చీటర్స్ సాధారణ నాణెం/చెంబు/బిందె తదితరాలను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘వంట’ చేస్తుంటారు. బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్ళీ బియ్యంలా కనిపించేలా చేస్తారు. ఇలా బియ్యంలా కనిపించే ఎండిన అన్నంలో ఇనుప రజను కలిసి ఉంటుంది. మోసగాళ్ళు రైస్ పుల్లర్‌గా చెప్తున్న పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన బియ్యం వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చేసి కస్టమర్లకు చూపించే ఈ మోసగాళ్ళు వారిని బుట్టలో వేసుకుంటుంటారు. ఇలాంటి ముఠాలలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే ఉంటున్నారని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పలు కేసులు స్పష్టం చేస్తున్నాయి. తాము నష్టపోయిన మొత్తాన్ని అదే మార్గంలో మళ్లీ సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? తేల్చుకోవడం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఈ రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అక్కడ రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్టు నటిస్తూ, వాటికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రయాన్–3లో వినియోగించడానికి ఉపకరించే లోహమని, రూ.కోట్ల ఖరీదు ఉంటుందని సర్టిఫికెట్లలో ప్రచురిస్తుంటారు. ఇదంతా దాన్ని కొనేవాళ్ళ ఎదురుగానే∙జరుగుతుంది. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుంది. బాధితుల్లో వ్యాపారులు, విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉంటారు. పరువు కోసం ఆలోచించే వీళ్ళు రైస్‌పుల్లర్స్ కొనడానికి ప్రయత్నించి మోసపోయినా, ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణంగానే ఓ నేరగాడు లేదా ముఠా పది నేరాలు చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతుంటాయి. ఇదే నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. ఓ ముఠా పోలీసులకు చిక్కినప్పుడు అనేక నేరాలు అంగీకరిస్తుంటుంది. అధికారులే స్వయంగా ఆయా బాధితులను సంప్రదించి, ఫిర్యాదు చేయాలని కోరిన సందర్భాలూ ఉంటున్నాయి. అయితే బయటపడటానికి ఇష్టపడని బాధితులే అత్యధికులు ఉంటున్నారు. కేవలం రైస్ పుల్లింగ్ పేరుతోనే కాదు, మరో పది రకాల వస్తువులు, పద్ధతుల పేర్లు చెప్పి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. వీటి బారినపడి మోసపోయిన వాళ్లు వందలు, వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటికీ అనేక మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆశతో ఇలాంటి మోసగాళ్ల వల్లో పడి భారీగా నష్టపోతున్నారు. ఇండియన్ శాండ్ బో జాతికి చెందిన పాము తల, తోక ఒకేలా ఉంటాయి. దీన్ని రెండు తలల పాము అని, డబుల్ ఇంజన్ పేరుతో అది దగ్గర ఉంటే దశ తిరిగిపోతుందని విక్రయిస్తుంటారు. ప్రత్యేకంగా తయారైన ఓ అద్దం ఉంటుందని, దాని ముందు నుంచి ఎవరైనా వెళ్తే అవతలి వారికి వివస్త్రులుగా కనిపిస్తారని నమ్మిస్తారు. వీటితో పాటు వందేళ్లకు పైగా బతికిన త్రాచుపాము తలపై ఏర్పడే నాగమణి, రెండు వైపులా కళ్లు కలిగి ఉండే నెమలి ఈక, నల్లపసుపు, ఎర్ర కలబంద, నల్ల వావిలాకు, లిల్లీపుట్స్, ఇరీడియం తదితరాల పేర్లు చెప్పి మోసం చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రైస్ పుల్లింగ్ కథలే నడుస్తుంటాయి. -
సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!
మూణ్ణాలుగు రోజుల్లో సునీతా విలియమ్స్ ఈ నెల 19న లేదా 20న ‘దివి’ నుండి దిగి వస్తారన్న ఆశతో ఈ భూగోళమంతా విశ్వాంతరాళంలోకి వెన్నెల కన్నులతో ఎదురు చూస్తోంది! ఒకవేళ ఇప్పటికే ‘నాసా’ ఆమెను భూమి మీదకు చేర్చి ఉంటే కనుక ఆ సంబరాలకు... రేపు కల్పనా చావ్లా జన్మదినమైన మార్చి 17 కూడా తోడవుతుంది. కల్పన అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కాగా, సునీత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాల కారణంగా సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా పైనే ఉండిపోతే, ఇరవై రెండేళ్ల క్రితం – భూమి పైకి తిరిగొస్తుండగా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పన కలలా మిగిలారు. సునీత ఇప్పుడు క్షేమంగా భువికి దిగి రావటమంటే సునీతే కాదు, కల్పన కూడా మళ్లీ పుట్టినట్లే!వారం అనుకున్నది...!సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12న లేదా 15న భూమి మీదకు తిరిగి రావాలి. కానీ రాలేదు! భూకక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! ‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. మార్చి 19న సునీతను, విల్మోర్ను భూమిపైకి తేవాలని ‘నాసా’ ప్రయత్నం. యాదృచ్ఛికం ఏమిటంటే – స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా పరీక్షించటానికి వెళ్లిన సునీత, విల్మోర్ అదే స్టార్‌లైనర్ పని చేయకపోవటంతో అక్కడే చిక్కుకుపోవటం!బరువు తగ్గి.. బుగ్గలు పీక్కుపోయినా.. నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల సునీత ఆరోగ్యం క్షీణించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఫొటోలలో బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి పోయి, బాగా బక్కచిక్కినట్లుగా సునీత కనిపిస్తున్నారు. అంతరిక్షంలో ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికన్ వైద్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నవారికి ‘స్పేస్ ఎనీమియా’ వస్తుందని, ‘మైక్రో–గ్రావిటీ’కి గురవుతున్నప్పుడు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కన్నా, వాటి క్షీణత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే వైరల్ అవుతున్న ప్రతి ఫొటోలో కూడా సునీత ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో కనిపిస్తుండటం విశేషం! సునీత అంతరిక్షంలోకి వెళ్లటం ఇది మూడోసారి.రెండు దశాబ్దాల క్రితం 2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లి, రెండు వారాల తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నప్పుడు ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పనా చావ్లా కన్ను మూశారు. ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కల్పన తొలిసారి 1997 నవంబర్ 19న అంతరిక్షానికి బయల్దేరి, తిరిగి పదహారు రోజుల తర్వాత డిసెంబర్ 5న భూమి పైకి తిరిగి వచ్చారు. తర్వాత ఐదేళ్లకు రెండోసారి అదే స్పేస్ షటిల్లో ఆరుగురు క్రూ మెంబర్స్‌తో కలిసి అంతరిక్ష పరిశోధనలను ముగించుకుని వస్తూ.. భూమికి చేరువవుతుండగా జరిగిన ఆ ఘోర దుర్ఘటనలో తక్కిన వ్యోమగాములందరితో పాటు ప్రాణాలు కోల్పోయారు. వారి వ్యోమ నౌక 84,000 ముక్కలైంది. భారతీయుల గుండెలు కోట్ల తునాతునకలయ్యాయి.సునీత అంతరిక్షంలో చిక్కుకుపోయిప్పటి నుండీ ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు కల్పనే గుర్తుకు వస్తున్నారు. ఈ సమయంలో సునీత క్షేమంగా భూమి పైకి తిరిగి రావటం అంటే తనొక్కరే రావటం కాదు. తన రూపంలో కల్పన ఆత్మను భౌతికంగా సాక్షాత్కరింప జేయడం కూడా.పాలపుంత పౌరులుసునీతా విలియమ్స్ 1965లో యు.ఎస్.లో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లోవేనియన్ మహిళ. సునీత ఫిజిక్స్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో డైవింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ‘నాసా’ వ్యోమగామి అయ్యారు.కల్పనా చావ్లా 1962లో హరియాణాలో జన్మించారు. తండ్రి బనారసీ లాల్ చావ్లా టైర్ల ఉత్పత్తి కంపెనీ యజమాని. తల్లి సంజోగ్తా ఖర్బందా. కల్పన ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ చేశారు. అనంతరం స్పేస్ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడి నుంచి నాసాకు వెళ్లారు. -
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.శరవేగంగా జ్యోతిష వ్యాపారంఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.ఆసియా దేశాల్లో..భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి. మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.జపాన్‌లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్‌ను రూపొందించుకుంటారు. జపాన్‌లో గ్రెగేరియన్ కేలండర్‌ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.మయాన్మార్లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్‌గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్లో ఇప్పటికీ పాటిస్తారు.పాశ్చాత్య దేశాల్లో.. ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్సైట్లు, యాప్‌లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.ఆఫ్రికా దేశాల్లో.. ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు. ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు. -
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్‌లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్‌ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి: -
అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!
యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. క్లింట్ హిల్ ఇటీవలే ఫిబ్రవరి 21న తన 93వ యేట కన్నుమూశారు. తుదిశ్వాస వరకు కూడా జీవితమంతా ఆయన ఒకటే ఆశించారు. తను 1963 నవంబర్ 22నే.. ‘ఆన్ ది స్పాట్’ చనిపోయి ఉంటే బాగుండేదని, ప్రజల మనసుల్లో తనకు చిరస్మరణీయ స్థానం దక్కి ఉండేదని! ఏమిటి ఆ రోజుకు అంత ప్రత్యేకత? అదేమిటో తెలుసుకోవాలంటే, ముందు ఆయన ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి!ఐదుగురు ప్రెసిడెంట్ల దగ్గర..!ఐసనోవర్ మొదలు, వరుసగా జాన్ ఎఫ్. కెన్నెడీ, లిండన్ బి.జాన్సన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్.. మొత్తం ఐదుగురు అమెరికా ప్రెసిడెంట్ల దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా పని చేశారు క్లింట్ హిల్! గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మిలటరీ సర్వీస్‌ను ముగించుకుని వచ్చాక 1958లో ప్రెసిడెంట్ ఐసనోవర్ సీక్రెట్ సర్వీస్‌లో ఏజెంట్‌గా తొలి ‘టఫెస్ట్’ జాబ్! అప్పటికి అతడి వయసు 26 ఏళ్లు. ఐసనోవర్ 1953 నుంచి 1961 వరకు ఎనిమిదేళ్ల పాటు రెండు టెర్మ్‌లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత జాన్ ఎఫ్.కెన్నెడీ అధ్యక్షుడిగా వచ్చేవరకు ఐసనోవర్ దగ్గర మూడేళ్లు పని చేశారు హిల్. తర్వాత కెన్నెడీకి, ఆయన సతీమణి జాక్వెలీన్‌కు సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా ఉన్నారు. ‘‘ఆ రోజే, ఆన్ ది స్పాట్, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది’’ అని క్లింట్ ఏ రోజు గురించైతే అంటూండేవారో ఆ.. 1963 నవంబర్ 22.. కెన్నడీ హయాం లోనిదే!అసలు ఆ రోజు ఏమైంది?!ఏమీ కాలేదు! 62 ఏళ్ల క్రితం నాటి ఆ మధ్యాహ్నం 12.29 నిముషాల వరకు కూడా– అసలు ఏమీ కాలేదు. ఆ తర్వాతి 30వ నిముషంతోనే ఆ రోజుకు ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చి పడింది. ఓపెన్ టాప్ కారులో వెళుతున్న జాన్ ఎఫ్. కెన్నెడీ తలలోకి దూరాన్నుంచి తుపాకీ బులెట్ వచ్చి దిగబడింది! కెన్నెడీ అక్కడిక్కడ తల వాల్చేశారు. కారులో ఆయన పక్కన ఆయన సతీమణి కూర్చొని ఉన్నారు. వారి కారు వెనకే సీక్రెట్ ఏజెంట్ క్లింట్ హిల్ కూర్చొని ఉన్న కారు వెళ్తోంది. కెన్నెడీపై కాల్పులు మొదలవ్వగానే క్లింట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక ఉదుటున గాల్లోంచి పైకి లేచి, కెన్నెడీ ఉన్న కారు మీదకు దూకారు. అతడి మొదటి లక్ష్యం ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడటం, కొన్ని లిప్తల ఆలస్యంతో ఆ లక్ష్యం చేజారింది. రెండో లక్ష్యం జాక్వెలీన్ని కాపాడటం. అప్పటికే ఆమె దిక్కు తోచనట్లు సీట్లోంచి పైకి లేచి కంగారుగా కారు పై భాగంలోకి వచ్చేశారు. హిల్ తక్షణం ఆమెను తిరిగి ఆమె సీట్లోనే కూర్చోబెట్టి ఆమెకు వలయంగా ఏర్పడ్డాడు. ఇదంతా కూడా కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడే. క్షణమైనా ఆలస్యం చేయలేదు..!కెన్నెడీపై కాల్పులు జరుగుతున్నట్లు గ్రహించగానే హిల్ వెంటనే తన కారులోంచి నేరుగా కెన్నెడీ ఉన్న కారు పైకి జంప్ చేశారు! ‘‘ఆ ఘటనలో నేను సెకనులో ఐదో వంతు వేగాన్ని, కనీసం ఒక సెకను వేగంగానైనా సాధించగలిగి ఉంటే... దురదృష్టవశాత్తూ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని ఉండి ఉండేవాడిని కాదు..’’ అని అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రాం ‘సీబీఎస్ 60 మినిట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హిల్. ‘‘ఆ వేగం నాకు సాధ్యపడి ఉంటే ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడే ప్రయత్నంలో నాకూ బులెట్లు తగిలి ఉండేవి. నేనూ ఆన్ ది స్పాట్ చనిపోయి ఉండేవాడిని. అప్పుడు నా మరణానికి ఒక సార్థకత ఉండేది’’ అని కుమిలిపోయారు హిల్. ఆ అపరాధ భావనతోనే 1975లో గెరాల్డ్ ఫోర్ట్ అధ్యక్షుడు అయిన రెండో ఏడాదే, తన 43 ఏళ్ల వయసులో సీక్రెట్ సర్వీస్ నుంచి ముందుగానే పదవీ విరమణ చేశారు. ‘‘హీరోని కాదు, నేనొక జీరో!’’ఆ రోజు– కెన్నెడీ కారు, ఆ వెనుక మరికొన్ని కార్లు, నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళుతున్న సమయంలో, రోడ్డుకు రెండు పక్కల నిలబడి చేతులు ఊపుతున్న జనం మధ్యలో అబ్రహాం జఫ్రూడర్ కూడా ఉన్నాడు. అతడొక వస్త్రాల వ్యాపారి. ప్రెసిడెంట్ కెన్నెడీ కాన్వాయ్‌ని ఉత్సాహం కొద్దీ వీడియో తీస్తూ ఉన్న అబ్రహాం చేతిలోని కెమెరాలో... కెన్నెడీపై కాల్పులు జరగడం, ఆయన తలవాల్చటం, వెనుక కార్లోంచి క్లింట్ హిల్ అమాంతం ఈ కారులోకి దూకటం– అన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ వీడియో బయటికి వచ్చాక.. హిల్ అమెరికా ప్రజల హీరో అయ్యారు. కానీ హిల్ హీరోలా ఫీల్ అవలేదు. తానెందుకు బతికిపోయానా అని జీవితాంతం జీరోలా బాధపడుతూనే ఉండిపోయారు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలారు. జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా అమెరికన్ ప్రజలు అతడిని కొనియాడారు. (చదవండి: -
ఈ వారం కథ: మెలకువలో చీడకల
‘‘రీచ్ అయ్యావా?’’, టింగ్‌మని వాట్సప్‌లో భర్త. అబ్బో! కేరింగ్ మెసేజే అనుకుంటూ ‘‘హా, ఇప్పుడే ఆఫీస్ లోపలికొచ్చాను’’ అని ఆమె రిప్లై.‘‘ఒకసారి లొకేషన్ పంపు’’మెసేజ్‌ని ముసుగు తీస్తే బయటపడ్డ అనుమానం.‘‘యే! నమ్మట్లేదా నన్ను? అయినా దించిన ఓలా డ్రైవర్ నుండి డ్రాప్ లొకేషన్ కూడా పంపించుకున్నావ్ కదా! మళ్లీ ఏంటీ? దున్నపోతులా పడుకునే బదులు పొద్దున్నే లేచి నన్ను డ్రాప్ చెయ్యొచ్చుగా?’’ అని ఫాస్ట్‌గా టైప్ చేసింది కోపం బాధ కలిపి, కానీ పంపలేదు. బ్యాక్ స్పేస్ బటన్ మీద ఒత్తిడి పెంచడంతో టైప్ చేసిందంతా క్లియర్ అయింది, స్క్రీన్ మీద పడిన కన్నీటి బొట్లు తప్ప!లొకేషన్ పంపించింది.వచ్చిన మెసేజ్లోని ఆమె కోపాన్ని పసిగట్టి, ‘‘ఆఫీస్ అయిపోతే నిన్ను పికప్ చేసుకోవడానికి అడిగాన్లే’’ మెసేజ్‌కు అతడి సమాధానం.ఆమె నమ్మినట్టుగా ఓ థంబ్సప్ ఎమోజీ పంపింది ఏడుపు ముఖం దాచుకుంటూ. ‘‘మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి, కాసేపు మీటింగ్ రూమ్‌లో కూర్చోండి’’ అనగానే ఆమె మూడ్ మారింది. సిస్టం కీబోర్డులతో కుస్తీ పడుతున్న ఎంప్లాయీస్‌ని గమనిస్తూ కూర్చుంది.‘‘హలో మేడమ్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మై సెల్ఫ్ యామిని’’ అంటూ ఓ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చింది.‘‘హలో, ఐయామ్ మధుమతి’’‘‘తెలుసు మేడమ్‘‘‘‘అయ్యో, మేడమ్ వద్దు. కాల్ మీ మధు’’‘‘అంటే, ఇక్కడికి రాక ముందు కూడా మీరు నాకు మేడమే కదానీ’’మధుమతి వెలిగిపోయింది, కానీ ఏదో గుర్తొచ్చి ఆ బ్లష్ అంతా ఒక్కసారిగా ఫ్లష్ అయిపోయింది.‘‘కూల్ మేడమ్, మీరు లెక్చరర్‌గా చేసిన కాలేజ్‌లోనే నేను చదువుకున్నాను’’ చెప్పింది యామిని.‘‘అది అర్థమైంది. కానీ, ఈ విషయం ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా?’’ అడిగింది మధుమతి.‘‘లేదు, ఇంకా ఎవరికీ చెప్పలే’’ పూర్తి చేయకముందే,‘‘చెప్పొద్దు కూడా ప్లీజ్. సారీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఏ ఇయర్ పాస్డ్‌ఔట్?’’ అడిగింది మధుమతి.‘‘2021 మేడమ్’’ చెప్పింది యామిని.‘‘నీకోటి చెప్పాలి యామిని, బట్ ప్లీజ్ కీపిట్ సీక్రెట్’’ అని కాస్త ముందుకు వంగి, ‘‘నేను ఆ కాలేజ్‌లో మానేసి, గ్యాప్ తీసుకుని, ఈ కంపెనీలో జూనియర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కాలేజ్‌లో వర్క్ చేసినట్టు ఏమీ చెప్పలేదు ఈ కంపెనీ వాళ్లకి. నో ఎక్స్‌పీరియ¯Œ ్స. సో నో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్’’ అంది మధుమతి.‘‘అచ్ఛా ఓ..కే’’ దీర్ఘంగా చూస్తూ తలూపింది యామిని.‘‘మేడమ్, నాకో డౌట్. టెక్నికల్లీ మీరు చాలా సౌండ్. కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి మీరంటే క్రేజ్ కూడా! మీకు ప్రమోషన్ కూడా వచ్చిందని విన్నాను. అలాంటిది మీరు రిజైన్ చేయడానికి రీజన్ మీ పెళ్లా?’, మధుమతి తాళి చూస్తూ అడిగింది యామిని.‘‘హ్మ్...నో’’,‘‘మరి?’’‘‘చెప్తాను, కానీ అది చెప్పే కంటే ముందు ఒకటి అడగాలి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి సిటీలో బానే సెటిల్ అవుతున్నవ్ కదా ఇప్పుడు మన కాలేజ్ గురించి నీకేం అనిపిస్తుంది?’’ అడిగింది మధుమతి.మొదట బ్లాంక్ ఫేస్ పెట్టింది. ‘‘చెప్పాలంటే, ఇప్పుడనే కాదు ఎప్పుడడిగినా సేమ్ ఫీలింగ్ అలాంటి బేకార్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యానా అని’’ అంది యామినీ.మధుమతి తన ఫోన్ తీసి ‘ఇది చదువు’ అని ఇచ్చింది,‘ఇది అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీట్స్. మారుతున్న కాలంతో పాటు ఇంజనీరింగ్‌లో కూడా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలాంటి అధునాతన కోర్సులు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో అందిస్తున్నాం! రాష్ట్ర రాజధానికో మరో నగరానికో వెళ్లాల్సిన పనిలేదు, కాలేజీ మన ఊరికి దగ్గర్లోనే! హాస్టల్ ఫెసిలిటీ, స్కాలర్షిప్ కూడా కలదు’యామిని మొత్తం చదివి, అర్థమయ్యీ కానట్టుగా ఫోన్ ఆమెకిచ్చేసింది.‘‘ఇంటర్ కాలేజీల్లోంచి స్టూడెంట్స్ లిస్ట్ తీసుకుని, పేరెంట్స్‌కి ఒక్కో లెక్చరర్ నుండి ఒక్కో నంబర్ ద్వారా ఈ మెసేజ్‌లు పంపేది మేమే! మన ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ ఇలాంటి పనులు మాతో చేయిస్తుంటాడు. ఇంజినీరింగ్ తర్వాత మీ 35 సంవత్సరాల కెరీర్ వాళ్లకు అనవసరం, వాళ్లకు నువ్వు ఓ 35 వేల రూపాయిల రీయింబర్స్మెంట్ ఐటమ్వి మాత్రమే! లెక్చరర్‌గా నాకే చాలాసార్లు అనిపించింది, అలాంటిది స్టూడెంట్స్‌గా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అంది మధుమతి.‘నో నో, ఎలాగో అయిపోయి సంవత్సరాలు దాటాయి కదా మేడమ్. ఇప్పుడేం చేస్తాం. సో మీరు జాబ్ మారింది పెళ్లై కాదు కాలేజ్ వల్లేనా? అలా అయితే వేరే కాలేజీలు ఉన్నాయిగా!’ అంది యామిని.‘‘కాని, ఎక్కడికి వెళ్ళినా నా కోసమే కాలేజ్కొచ్చే స్టూడెంట్స్ ఉన్నారని నువ్వే అన్నావ్ కదా, అలాంటి విషయాలు అల్లరిగా పైకి కనబడినా లోపలి చిల్లరతనం ఏదో రోజు బయటపడుతుంది. లాస్ట్ ఇయర్, క్లాస్ రూముల్లో మందు తాగే బదులు పైన టెర్రస్ మీద తాగి పడిపోండంటూ రెండు రూములు కట్టించాడు ప్రిన్సిపాల్! అడిగితే ఏం చెప్పాడో తెలుసా? ‘చెప్తే వినే వాడు స్టూడెంటే కాదు అని సినిమా డైలాగులు కొట్టి వెళ్లిపోయారమ్మా స్టూడెంట్సు. పైగా ఏసీ ఉందనీ నా క్యాబిన్లోకి వచ్చి మందు సిట్టింగ్‌లు వేస్తామంటే టెర్రస్ మీద రూమ్‌లు కట్టించాను. మరేం చేయమంటావ్? మర్యాద కాపాడుకోవాలిగా’ అన్నాడు’’‘కాని అది మర్యాద కాదు సార్’ అని అంటే,దానికి ఆయన, ‘ఆపమ్మా తల్లీ, లెక్చర్లు స్టూడెంట్స్కివ్వు కాని, నాలాంటి ప్రిన్సిపాల్‌కి కాదు. ఏమైనా ఉంటే ప్రిన్సిపాల్ మీదికో కాలేజ్ మీదికో వచ్చి ఎగురుతారు గాని, స్టూడెంట్స్ వేషాలేమైనా తక్కువా! స్నానాలు చేయకుండానే, గడ్డాలు గీసుకోకుండానే కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండానే కాలేజీకి వస్తారు, రావడంతోనే అమ్మాయిలని, లేడీ స్టాఫ్‌ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఓ ముప్పైఐదు నలభై వయసున్న లెక్చరర్లతో ఫ్రెండ్షిప్లు చేయడం, వెనకేసుకొస్తారు కాబట్టి వాళ్లను కూడా కలుపుకొని పార్టీలు షికార్లకి తీసుకెళ్లి అటెండె మేనేజ్ చేయడం. చొక్కా పైబటన్ పెట్టుకోరు, అడిగితే ఉడుకపోస్తుంది అని మిగతా బట¯Œ ్స కూడా విప్పేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఫస్టియర్ క్లాస్ రూముల్లో కండోమ్స్ దొరకడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, పోలీసులు వచ్చి మరీ డ్రగ్స్ దొరకబట్టే దాకా తెలీలేదు కాలేజ్ హాస్టల్లో ఎన్ని దరిద్రాలున్నాయో... ఛీ...ఛీ... ఏమైనా మారుద్దామంటే ఎన్నిసార్లని కన్నేసి ఉంచుతాం? ఎంతమంది మీదేసి ఉంచుతాం చెప్పు!కనీసం అమ్మాయిలైనా బుద్ధిగా శ్రద్ధగా ఉంటారా అంటే కనబడితే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. గర్ల్స్ హాస్టల్ కదా నేనెలా వెళ్లి చెక్ చేస్తాను అని వార్డెన్లను చూడమంటే రూమ్స్ నిండా బీరుసీసాలే! చదివే ఓపికుండదు గాని పొద్దున్నుండి రాత్రి వరకు హెడ్సెట్లు పెట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. వాడెవడినో ప్రేమించిందే గాక వాడు పెట్టమన్నాడని సిగ్గులేకుండా వెళ్లి వాళ్ల హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది...చ్చీచ్చీఛీఛీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగో జాయిన్ అయిన కొద్ది రోజులకే తెలుస్తోంది కదా వాళ్ల పిల్లలు ఎలా తయారవుతున్నారో, పేరెంట్స్ వచ్చి మళ్లీ నా మీదనే పడి చస్తారు చెడగొడ్తున్నారనీ... వాళ్లేదో పద్ధతిగా పెంచారా?’మధుమతి ప్రిన్సిపాల్ మాటలు చెప్తుంటే యామినికి తన కాలేజీ రోజులు ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. ఇలాంటి రోజుల నుండి బయటపడ్డా అనే ఫీలింగ్ ఎంత రిలాక్స్డ్గా ఉందో తనకి!‘ఇవే కాదు అసలు దరిద్రాలు కాలేజీలో జరిగే యాన్యువల్ డేలు, ఫ్రెషర్–ఫేర్వెల్ పార్టీల్లో ఉంటాయి. దానికి గెస్టులుగా సినిమా హీరోలు, హీరోయిన్లు. అసలు వాళ్లే ఎందుకు? సరే ఆ ఏజ్‌లో సినిమా వాళ్లంటే ఓ క్రేజ్, ఓ ఇన్స్పిరేషన్ అని అనుకున్నా, అప్పటి వరకు కాలేజీ మొహం కూడా చూడని వాళ్లు ఇలాంటి ప్రోగ్రాంలకి తప్పక వస్తారు. స్టూడెంట్స్ చేసే గోలను చూసి సినిమా వాళ్లు ఇదే బాగుందని, ‘నెక్స్ట్ టైం నుండి సినిమా ప్రమోషన్ కూడా కాలేజీలోనే చేస్తే బాగుంటదని’ ఎవడో తొత్తు సలహా ఇస్తాడు. అలాంటి ప్రమోషన్‌కి పక్క కాలేజీ వాళ్లు కూడా ఈ కాలేజీకే వస్తారు. తాగేసి ఫ్యా అంటూ గొడవలు మొదలై, పాన్ పరాగ్ ఉమ్మిన ప్రహరీ గోడలకు రక్తంతో మెరుగులు దిద్దుతారు. సర్లే ఇదంతా ఒక్క రోజేగా అనుకుంటే ఆ హీరోను చూసి ఇంకో హీరో, అది చూసి మరో హీరో.ఇన్ని ప్రోగ్రాంల మధ్య సిలబస్ టైముకి అవదు, పైగా లైబ్రరీలో బుక్స్ సరిగ్గా ఉండవు, ఉండాల్సినంత మంది లెక్చరర్లు ఉండరు. ఖర్చుతో పని కాబట్టి ప్రిన్సిపాల్ పట్టించుకోడు. పైగా ‘అరవై ఉన్న క్లాసులో చదివేది పదిమందేగా! కనీసం కాలేజీకి సినిమా ఫంక్షన్తోనైనా పేరు వస్తుంది’ అని ఊరుకుంటాడు. వచ్చిన సినిమా వాళ్ళు ప్రమోషన్ మాటలు మాట్లాడుతారా అంటే, ‘ఏమీ చదవకుండానే నేనీ పొజిషన్లో ఉన్నాను. చదువు దేనికీ పనికిరాదు. కాలేజీ ఉన్నది కేవలం మిమ్మల్ని రోబోలుగా మార్చి పనిప్పించడానికే! ముందు ప్రపంచాన్ని చదవండి’ అని అంటుంటే ఆ వయసుకి ఆ మాటలు ఎంత వరకు అర్థమవుతాయి?ప్రపంచాన్ని ఎంత చదివినా, చదవాల్సిన టైమ్‌లో పుస్తకాలు చదవకపోతే స్టూడెంట్స్ ఏ ఎగ్జామైనా ఎలా పాసవుతారు? కానీ ఆ స్పీచ్‌లకు చప్పట్లు, విజిల్స్‌తో కాలేజీ దద్దరిల్లేది’’ గ్లాసులో నీళ్ళు అందుకుంటూ అంది మధుమతి.యామిని ఏమీ అనలేక, ఆ కంప్లయినింగ్ టోన్ వినలేక సఫొకేట్ అవుతోంది. మేడం లెక్చరర్‌గా మానేసినా, కూడా క్లాస్ పీకడం మాత్రం మానట్లేదని అనుకుంటూ,‘‘సర్లేండి మేడమ్. మనం మాత్రం ఏం చేస్తాం. కాఫీ?’’ అడిగింది‘‘ఇదంతా తప్పు కదమ్మా. అందుకే’’ ఆపేసింది నీళ్లు తాగుతూ.‘ఏం చేశారనీ’ కుతుహలంతో అడిగింది యామిని.‘‘ల్యాబ్స్, లైబ్రరీ, టాయిలెట్స్, హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలతో సహా కలిపి యూజీసీకి కంప్లైంట్ రాశాను’’ చెప్పింది.‘‘యూజీసీకా! వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే, ఈ పాటికి చాలా కాలేజీలు’’ యామిని ఏదో చెప్పేలోపే మధుమతి ఫోన్ రింగ్ అయ్యింది.సైలెంట్లో పెట్టి కాల్ కట్ చేసింది.‘‘అయ్యో లిఫ్ట్ చేయండి’’ అంది యామిని ‘‘ఇట్స్ ఓకే. ఇతని గురించే చెప్పాలి. కాలేజీలో నాకు ప్రమోషన్ వచ్చాక, ఇతని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. బాగున్నాడు. నచ్చి పెళ్లి చేసుకున్నాను. అతను అదే టౌన్ కాబట్టి జాబ్ కంటిన్యూ చేశాను. అంతా బాగుండేది. కొత్తలో ఇబ్బందులున్నా కూడా లైఫ్‌లో ఎక్సైట్మెంట్ ఉండేది’’ అని ఆమె మెల్లిగా తల దించుకుంది. దుఃఖం ఆగట్లేదు, గొంతు తడబడుతోంది. వణుకుతున్న చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. యామిని అయోమయంగా, ‘‘అయ్యో మేడమ్, ఏమైంది, ప్లీజ్ ఏడ్వకండి’’ అంది దగ్గరికి తీసుకుంటూ.‘‘అలాంటి టైంలో ఒక మగ లెక్చరర్‌తో నాకు అఫైర్ ఉన్నట్టు నా హస్బెండ్‌కి పదేపదే కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు, మెసేజ్‌లు పెట్టారు. కాలేజీలో ఏ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా తెలీకుండా ఫొటోలు తీసి పంపేవారు’’ ఏడ్చుకుంటూ చెప్పింది మధుమతి. యామిని ఇంకా దగ్గరికి తీస్కోగానే, ‘‘నేను ఏ అఫైర్ పెట్టుకోలేదమ్మా నిజంగా. అదే నా భర్త నమ్మాడో లేదో తెలీదు. నేను ఏ తప్పు చేయలేదని నమ్మినట్టే మాట్లాడతాడు కాని, మళ్లీ డౌట్ పడతాడు. జీతాలు పెంచమని అడిగినందుకు బౌన్సర్లతో కొట్టించారని ఓ లెక్చరర్ నాతో చెప్పుకుంటే, అతనికి నాకు అఫైర్ ఉందని కాలేజీలో స్ప్రెడ్ చేశారు. విషయం తెలుసుకున్న మా నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నానా మాటలంది. నా భర్త మాత్రం కనీసం ఓ మాటైనా అనలేదు కాని, నా ఫోన్ లాక్కున్నాడు. నంబర్ మార్చాడు. పాత నంబర్ బ్లాక్ చేసి, సిమ్ కాల్చేశాడు. ఇంట్లో వాళ్ల ఫోన్ నంబర్లు తప్ప ఇంకెవరి నంబర్లు నా ఫోన్లో ఉండకుండా చేశాడు. ఎవరికి కాల్ చేస్తున్నాను, ఎవరికి మెసేజ్‌లు పెడ్తున్నానో చూసేవాడు. ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వద్దన్నాడు. మెల్లగా జాబ్ మానేయమని ప్రెజర్ పెట్టాడు! సడన్‌గా జాబ్ మానేస్తే, ‘తప్పు చేసింది కాబట్టే మానేసింది’ అనుకుంటారని నేను చెప్పినా వినలేదు. సిటీకి తీసుకొచ్చాడు. ఎప్పుడన్నా కాలేజీ ప్రస్తావన తెస్తే చిరాకుపడుతూ అరిచేవాడు. అతనే సర్వస్వం అనుకున్నాక జాబ్ వదిలేయడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. మూడు నెలల తర్వాత, ఇంటి నుంచే వర్క్ చేసుకునే సౌకర్యం సాఫ్ట్‌వేర్‌లో ఉంది కాబట్టి గట్టిగా అడిగాను. ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలా వచ్చి ఈ కంపెనీలో!’’ మధ్య మధ్యలో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మధుమతి.‘‘రిలాక్స్ మేడమ్. అప్పుటి నుండి ఏదేదో చెప్తున్నారు అనుకున్నాను గాని, మీకు ఇంత జరిగిందని, ఇంత బాధ దాచుకున్నారని అనుకోలేదు. షేమ్ ఆన్ దోస్ పీపుల్. అలాంటి కాలేజీలో చేయకపోవడమే బెటర్ లెండి. టైమ్ తీసుకుని మంచి ప్లేస్‌కే వచ్చారు. డోంట్ వర్రీ, ఈ కంపెనీ, మా టీమ్ చాలా బెటర్. ట్రస్ట్ మీ’’ అంటూ మధుమతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అభయమిచ్చింది యామిని.ఈ గ్యాప్‌లో మధుమతి ఫోన్లో భర్త నుండి మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు.‘‘సిగ్నల్స్ లేవనీ, ఫోన్ సైలెంట్లో ఉందని చెప్పకు. వాటర్ కూడా సరిగ్గా తాగలేదని నీ స్మార్ట్ వాచ్ చెప్తోంది. ఫోన్ మర్చిపోయి బాత్రూమ్కి కూడా వెళ్లవు అని నాకు తెలుసు. నా మెసేజ్‌లు, కాల్స్ అన్నీ చూస్తావు కాని, కావాలనే రిప్లై ఇవ్వవని కూడా తెలుసు. నీ కోపమంతా ఇంట్లో చూపించు మధు, ప్లీజ్ నేను ఆల్రెడీ నీ ఆఫీస్ దగ్గరున్నాను. కిందికి రా ప్లీజ్’’ వాట్సాప్‌లో భర్త.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి ల్యాప్‌టాప్, యాక్ససరీస్ ఇచ్చారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేస్తామని చెప్పారు. యామినికి ‘బై’ చెప్పి ఆఫీస్ బిల్డింగ్ కిందకి వచ్చింది మధుమతి.‘‘ఒక్కరోజు, అది కూడా రెండు మూడు గంటలు బయటికి వస్తే ఇన్ని కాల్స్ మెసేజెస్సా! ఛీ’’ అతన్ని తిడుతూనే బైక్ ఎక్కి కూర్చుందామె. వెనక నుండి ఓ రెండుసార్లు అతని హెల్మెట్ మీద కొట్టింది కూడా. అతను ఏం మాట్లాడకుండా బండి ముందుకు పోనిచ్చాడు. ‘ఎందుకంత స్పీడు, మెల్లిగా’ అంటూ ఇంకా తిడుతోంది.‘‘ఐయామ్ సారీ’’ అన్నాడతను.ఆమె కాసేపు మౌనంగా ఉంది. చౌరస్తా దాటి ఓ ఖాళీ రోడ్డు రాగానే, వెనక నుండే అతన్ని మెల్లగా కౌగిలించుకుంటూ వాలిపోయింది. అతను ఇంకాస్త స్లో అయ్యి, చిన్నగా బ్లష్ అవుతూనే సిగ్గుగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. ‘కొత్తగా ఉందిరా అంతా, కాని, బానే ఉండేలావుంది. నేను సెట్ అవగలను అనిపిస్తోంది. నువ్వు కూడా సెట్ అవ్వొచ్చుగా! మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ప్రేమగా పిలుస్తూ దగ్గరికి తీస్కోవటం, ప్రతి సాయంత్రం బయటకెళ్తూ కబుర్లు చెప్పుకోవటం, ఇంటి పనిలో నాకు హెల్ప్ చేస్తూ..’ ఆమె చెప్తూ పోతుంటే మళ్లీ మెయిన్ రోడ్ వచ్చిందని బండాపాడు సిగ్నల్ చూసి. హెల్మెట్ తీయడు, ఎక్స్ప్రెషన్ కనబడదు.అయినా అతనంత పెద్ద ఎక్స్‌ప్రెసివ్ కాదులే, కోపం తప్ప మిగతా అన్ని ఫీలింగ్స్ దాచుకుంటాడనీ ఆమె కంప్లైంట్ కూడా!ముగింపు నిజానికి అతను అంతగా ఏం దాచుకున్నాడంటే, కాలేజ్ బాత్రూంలో లేడీ లెక్చరర్ల వీడియోలు కూడా తీశారనీ, అలా ఆమె వీడియో కూడా తీసి అతనికే పంపారనీ ఆమెకి చెప్పకుండా దాచాడు!అఫైర్ అలిగేషనే తట్టకోలేని ఆమె ఈ విషయం తెలిస్తే మానానికి పోయి సూసైడ్ చేసుకుని చస్తుందేమోననే భయంతో ఆమె దగ్గరి నుండి ఫోన్‌తో సహా లాక్కొని, సిమ్ కాల్చి, విషయం ఆమెకి చేరకుండా చేశాడు!ఇక మనుషుల్ని నమ్మడం మానేసిన అతను కాలేజీకే కాదు, ఎక్కడకి వెళ్ళినా అక్కడి బాత్రూంకి వెళ్తుందని, ఎక్కడికీ పంపించకుండా ఆమెని కాపాడే ప్రయత్నం బయటపడకుండా దాచాడు.ఇప్పుడూ అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి బాత్రూం మాత్రమే వాడుకోవచ్చని ఈ జాబ్‌కి రిఫర్ చేయించి మరీ ఇప్పించాడని ఆమె దగ్గర దాచాడు.ఉపసంహారం 1సడన్‌గా ఇంజనీరింగ్ బుక్సో, బస్సో కనబడినా, ‘మేడమ్’ అనే పిలుపు వినబడినా ఆమెలో ఓ అలజడి! ఆ రోజంతా డల్లైపోతుంది. రాత్రవగానే ఓ దిక్కు పడుకొని దిండు తడుపుకుంటుంది. నిద్ర పట్టక భర్త వైపు తిరిగే సరికి అతను మాత్రం గాఢనిద్రలో ఉంటాడు. ఆమె దిండు ఇంకా ఎక్కువ తడుస్తుంది.ఉపసంహారం 2ఎక్కడికి వెళ్లినా ఆమెకి బాత్రూం వస్తుందేమోనని, త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బైక్ నడుపుతుంటాడు. ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా, ఏం చూడాల్సి వస్తుందోనని భయంతో రోజు గడుపుతుంటాడు. ఇలా మెలకువలో పీడకలలా వెంటాడే అతనికి, రాత్రులు నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర పట్టదు. అతనికి నిద్రే ఓ ఉపశమనం మరి!సంహారంఏదో పోగొట్టుకున్నట్టు రోజు గడిపే ఇద్దరూ తెల్లారేసరికి మాత్రం ఒకరినొకరు హత్తుకొని నిద్రలోనే కలిసిపోయినట్టు కనబడతారు, ఒకే దుప్పటిలో. అలా ఓ రోజు లేచేసరికి మధుమతి ఇన్‌బాక్స్‌లో‘ఏఐ’ ద్వారా స్పై కెమెరాలను కనిపెట్టే మొబైల్ యాప్, ఇప్పటి వరకు తీసినవి లింక్ పెడితే వాటిని సైబర్ సెక్యురిటీతో బ్లాక్ చేయించగల యాప్ తయారు చేసే ప్రాజెక్ట్‌లోకి డెవలపర్‌గా తీసుకుంటున్నట్టు యామినికి మెయిల్ వచ్చింది. అదే ఇక నుండి ఆమెను రోజంతా యాక్టివ్‌గా ఉంచే మాత్ర, అతనికి రాత్రులు మాత్రలు అక్కర్లేకుండా పట్టే నిద్ర. -
నగరాన్ని తలపించే హైటెక్ నౌక..!
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్మెంట్లను ఆరు డెక్‌లలో నిర్మించారు. సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్‌పూల్, కాక్టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం. రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్‌లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.(చదవండి: భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?) -
యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే!
‘ఏంటమ్మా.. నేను ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు తెలుçసమ్మా.. నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది’.. అరిచేశా కాస్త గట్టిగానే!‘అలా ఏం కాదు నాన్నా! నాకు కొంచెం బెంగగా ఉంటుంది. అందుకే ఇలా’ అమ్మ సంజాయిషీ.ఏంటో అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. రేపో మాపో పదో తరగతి పూర్తవుతుంది. ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను. నేనూ పెద్దాడిని అయిపోయాను. అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది. నేను స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుంచి 20 నుంచి 30 అడుగులు వేస్తే సరిపోతుంది. పొద్దున్నే లేచి, కావాల్సిన బుక్స్ అన్నీ బ్యాగులో పెట్టుకుని, హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా. సరిగ్గా ఉదయం ఎనిమిదికల్లా స్కూలు బస్సు వచ్చేస్తుంది. ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యే లోపు అమ్మ నాకు కావాల్సిన క్యారేజీ కట్టే పనిలో ఉంటుంది. నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు, టిఫిన్లు. హడావిడిగా అన్నీ ఒక్క చేత్తో చేసేస్తుంది. నేనేమో రెడీ అయిపోయి బ్యాగు వేసుకోగానే, చేతికి లంచ్ క్యారేజీ ఇచ్చేస్తుంది. అక్కడితో అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది. స్కూలు బస్సు ఎక్కి, అది కదిలే వరకు అక్కడే ఉంటుంది. నాతో పాటు బస్సులో వచ్చే మిగతా ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కాని, మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావుడి చేసేస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అదో రకంగా చూస్తారు నా వంక, కొన్నిసార్లు నవ్వుతారు కూడా! ఇదంతా రోజూ అనుభవిస్తుంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది.ఇలా ఆలోచిస్తున్న నేను బస్సు హారన్ సౌండ్‌తో ఒక్కసారిగా గతం నుంచి తేరుకున్నాను. దూరం నుంచి బస్సు నా వైపు వస్తోంది. అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పెట్టిన బ్యాగు లాక్కుని ముందుకు పరుగెత్తింది. తెలియకుండానే ‘జాగ్రత్త..’ అని నా నోటి నుంచి వచ్చిన మాట పూర్తి కాకుండానే, ‘నాకు తెలుసు డాడీ’ అంటూ పరుగులు పెట్టింది. ఆ మాట వినగానే మళ్లీ ఎక్కడో తడిమినట్లు అనిపించింది. బస్సు ఆగింది. చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు. వాళ్లతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీటులో కూర్చుని, బయటికి చేయి చూపిస్తూ ‘టాటా డాడీ’ అని నవ్వుతూ చెబుతోంది. బస్సు అటు వెళ్లగానే, నేను నా కారు పార్క్ చేసిన వైపు వెళ్లాను. కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాను. దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు. ఏంటీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది. అమ్మ నన్ను చాలా ప్రేమించింది. అందరి కన్నా ఎక్కువే ప్రేమించింది. కాని, ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా? అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా? తండ్రయ్యాక తెలిసింది.. పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుంది అని. వాళ్లు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని. ఆరేళ్లుగా నా కూతుర్ని చూస్తున్నా– స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది. ఎంచక్కా రెడీ అయిపోతుంది. కానీ నాకెందుకు? తను జాగ్రత్తగా స్కూలు బస్సు ఎక్కేవరకు ఒక తెలియని బెరుకు. ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకం. ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది.ముభావంగానే లోపలికి వెళ్లిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది. అది అందుకుని ఏమీ మాట్లాడకుండానే, బెడ్ రూంలోకి వెళ్లిపోయా. నేను అలా వెళ్లడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి, వంటగదిలోకి వెళ్లిపోయింది. రూంలోకి వచ్చిన నేను, చేతిలో ఉన్న కాఫీని టేబుల్‌పై పెట్టేసి పైన చొక్కా తీసేసి, అలా బెడ్‌పై వాలిపోయా. వంటింట్లో నుంచి కమ్మటి వాసన, తాలింపు చప్పుళ్లు. నా భార్య మధ్యాహ్నానికి కావాల్సిన వంటలో నిమగ్నమైపోయింది. కాసేపు అలా కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చేయి పెట్టి నా జుట్టు నిమిరినట్టు అనిపించింది. చెప్పాలంటే చాలా హాయిగా, తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది. కాస్త తేరుకున్న నాకు ఒక మాట వినపడింది. ‘ఏంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో బాగానే ఉందా?’ కళ్లు తెరిచిన నాకు ఎదురుగా అప్పటివరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్న నా భార్య. తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను. ఎదురుగా కప్‌బోర్డులో పెట్టిన అమ్మ ఫొటోపై నా దృష్టి పడింది. ఆ ఫొటో వంకే చూస్తూ.., ‘మనం ఊరికి వెళ్లి ఒకసారి అమ్మని కలవాలి’ అన్నా. అది విని లలిత కూడా ఆ ఫొటో వైపు చూసి చిన్నగా నవ్వింది.ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతున్న నాకు.. హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. లలిత ఫోన్లో మాట్లాడుతోంది. ఇంకెవరితో, మా అమ్మతోనే! మేము పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని, తను చెప్పడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది. ఈ ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడం, మళ్లీ పాపని చూసుకోవడం వల్ల ఎప్పుడోగాని అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు. ఎప్పుడైనా అమ్మే నా సెల్ నంబర్‌కి కాల్ చేసినా ఆఫీసు పనుల్లో తలమునకలై ఉన్న నేను.. తర్వాత చేస్తాలే అమ్మా అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్లే ఎప్పుడూ మాట్లాడుకునేది. ఒకసారి మొదలెడితే వాళ్ల లోకంలోకి వాళ్లు వెళ్లిపోయి, పక్కన వాళ్లను పట్టించుకోనంతగా మునిగిపోతారు. అలా అనుకుంటూనే హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద నా కోసం పెట్టిన క్యారేజీ తీసుకుని, ఆఫీసుకు వెళ్లొస్తా అన్నట్లు లలిత వంక సైగ చేస్తూ వెళ్లిపోయా. గుమ్మం వరకూ వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత కూడా నావైపు చేయి ఊపింది.కారు వేగంగా వెళుతోంది. పాపతో కలిసి లలిత, నేను ఊరికి వెళ్తున్నాం. వాతావరణం చక్కగా ఉంది. ఊరికి దగ్గర్లో పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కమ్మటి మట్టి వాసన. నా కూతురు కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ‘ఇంకా ఎంత దూరం నాన్నా! నాన్నమ్మని ఎప్పుడు కలుస్తాం’ అని ఒకటే ప్రశ్నలు. ‘వచ్చేశాంలేమ్మా! దగ్గర్లోనే ఉన్నాం’ అంటూ లలిత బయటికి పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెబుతోంది. డ్రైవింగ్ చేస్తున్న నాకు కూడా లోలోపల అదే ఆరాటం ఉన్నా బయట పడలేనేమో కదా! అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంతో నాకు కూడా చిన్న పిల్లాడినై గెంతాలని ఉంది. ఇలా అనుకుంటుండగానే కారు పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది. దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. పుట్టి పెరిగిన ఊరు కదా మరి!కారు ఇంటి ముందు ఆగిందో లేదో, తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది. కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది. ఎదురుగా వస్తున్న మనవరాలిని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది. ‘నాన్నమ్మా!’ అని గట్టిగా హత్తుకోగానే, అమ్మ తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం. ’ఎలా ఉన్నావు నాన్నా’ అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే, లలిత వంక కూడా చూసింది. ’నువ్వు ఎలా ఉన్నావమ్మా’ అని అడుగుతూనే, తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. నా తలని తన ఒడిలోకి అదుముకుని ప్రేమగా నా వీపు తడుతూ, ‘ఎప్పుడు తిన్నారో ఏమో! పదండి వెళ్లి భోజనం చేద్దాం’ అంది. ‘సరే అమ్మా, తిందాంలే!’ అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. అమ్మతో చాలా చెప్పాలి అనిపించింది. అమ్మని చూడగానే గుండెలో భారం దిగినట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ చూపించే అపురూపమైన ప్రేమను ఇబ్బందిలా ఫీలయ్యే నా తెలియనితనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది. సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టి, కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదికి చేరింది. ఎన్నో చెప్పాలనుకున్నా, క్షమించమని అడగాలి అనుకున్నా కానీ ఏమీ చెప్పలేక మాటలు పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన ప్రాయశ్చిత్తంలా అనిపించింది. కాలిని తాకిన నా చేయి వంక చూస్తూ అమ్మ కళ్లల్లో చిన్నగా తడిని చూశా. అమ్మ వెనక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నాన్నమ్మ చెంపలపై ముద్దులు పెడుతోంది. -
రాజవర్ధనుడి కథ
పూర్వం దమనుడు అనే రాజుకు రాజవర్ధనుడు అనే కొడుకు ఉండేవాడు. తండ్రి తదనంతరం రాజవర్ధనుడు పట్టాభిషిక్తుడై, రాజ్యభారాన్ని చేపట్టాడు. ప్రజలకు చోరభయం, దుష్టమృగ భయం, శత్రుభయం, క్షామం, దారిద్య్రం లేకుండా రాజ్యాన్ని ధర్మమార్గంలో సుభిక్షంగా పాలించసాగాడు. పొరుగు రాజ్యాన్ని పాలించే విధూరథుడికి రాజవర్ధనుడి పాలనాదక్షత గురించి తెలిసింది. విధూరథుడికి మానిని అనే కుమార్తె ఉంది. రాజవర్ధనుడు తన కుమార్తెకు తగిన వరుడని తలచి, అతడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. మానిని ద్వారా రాజవర్ధనుడికి అనేకమంది కుమారులు కలిగారు. భార్యతో హాయిగా సంసారయాత్ర సాగిస్తూ, రాజవర్ధనుడు రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా పాలించసాగాడు. అలా ఏడువేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఒకనాడు రాజవర్ధనుడికి భార్య మానిని స్వయంగా తలంటు పోయసాగింది. తలంటు పోస్తుండగా, ఆమె కన్నీటి బిందువులు వెచ్చగా రాజవర్ధనుడి నుదుటిపై పడ్డాయి. ఈ పరిణామానికి రాజవర్ధనుడు ఆందోళన చెందాడు. ‘మహారాణీ! ఏమైంది? ఎందుకు దుఃఖిస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.‘మహారాజా! మీ తలవెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అందువల్లనే నాకు తీరని విచారంగా ఉంది’ అని ఆమె బదులిచ్చింది.‘మహారాణీ! ప్రకృతి సహజమైన పరిణామానికి విచారిస్తావెందుకు? ఏడువేల సంవత్సరాలు సుఖాలను అనుభవించాం. సద్గుణ సంపన్నులు, పాలనాదక్షులు అయిన సుపుత్రులను పొందాం. మానవులకు జరామరణాలు తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వార్ధక్యం మరింతగా మీద పడకముందే, రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, మనం తపోవనాలకు వెళ్లిపోదాం’ అని చెప్పాడు రాజవర్ధనుడు.రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, రాజవర్ధనుడు భార్యాసమేతంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నట్లు తెలిసి, మంత్రి పురోహితులు విచారించారు. ఈ సంగతి తెలిసి పౌరులు మరింతగా ఆందోళన చెందారు. ‘ఇన్నాళ్లూ మనల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన రాజు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతే, ఇక బతకడం దండగ’ అనుకుని, ప్రజలు బాధపడసాగారు. రాజుకు మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగించాలని భావించిన మంత్రులు, ఇందుకు సమర్థులైన పురోహితులను తపోవనాలకు పంపారు. ఇదంతా రాజుకు తెలియకుండానే చేశారు.పురోహితులు సూర్యభగవానుడి గురించి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి కోరిక మేరకు రాజవర్ధనుడికి మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని వరంగా ప్రసాదించాడు. వారు సంతోషంగా రాజధానికి చేరుకుని, మంత్రులకు సూర్యుడు వరమిచ్చిన సంగతి చెప్పి, ఇళ్లకు వెళ్లిపోయారు. సూర్యభగవానుడి వరప్రభావం వల్ల రాజు మరో పదివేల ఏళ్లు తమను పరిపాలించబోతున్నాడని తెలిసి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఒకవైపు రాజ్యంలో ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు రాజవర్ధనుడు అంతఃపురంలో విచారగ్రస్తుడై కూర్చుండిపోయాడు. అతడి తీరును గమనించిన మహారాణి మానిని, ‘మహారాజా! ప్రజలంతా సంతోషంగా ఉంటే, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు?’ అని అడిగింది. ‘మహారాణీ! మీరంతా ఉండగా, నాకొక్కడికే పదివేల ఏళ్ల ఆయుర్దాయం కలగడం మంచిది కాదు. మంత్రి పురోహితాదులు, ఆప్తులు అందరూ మరణించిన తర్వాత నేను బతికి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అన్నాడు రాజవర్ధనుడు.‘మహారాజా! మీరు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నాయి. దీనికి తరుణోపాయం ఏమిటి?’ అని అడిగింది మానిని. ‘రేపటి వేకువనే మనం తపోవనాలకు బయలుదేరుతున్నాం’ అన్నాడు రాజవర్ధనుడు.మర్నాటి వేకువనే రాజదంపతులు తపోవనాలకు చేరుకున్నారు. రాజవర్ధనుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాత్మా! నాకొక్కడికే పదివేల సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వడం న్యాయమేనా? నా భార్యా పుత్రులకు, మంత్రి పురోహితులకు, నా రాజ్య పౌరులకు కూడా అంతే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు’ అని వరం కోరుకున్నాడు రాజవర్ధనుడు.సూర్యభగవానుడు అతడి ప్రజానురాగానికి సంతోషించి, ‘తథాస్తు’ అని అనుగ్రహించాడు.రాజవర్ధనుడు భార్యాసమేతంగా తిరిగి రాజధానిలోకి అడుగుపెట్టాడు.పురజనులను సమావేశపరచి, సూర్యభగవానుడు అనుగ్రహించిన వరం గురించి చెప్పాడు. ప్రజలందరూ రాజవర్ధనుడికి జయజయధ్వానాలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు.∙సాంఖ్యాయన -
సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్‌గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్‌కు స్మార్ట్‌గా, కూల్‌గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...సన్‌స్క్రీన్ టెస్టర్ వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. క్యాప్ విత్ ఫ్యాన్వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. (చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..) -
ఆటోనే ఆధారమైంది!
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ.40 కోట్ల సొత్తు, నగదు దోచుకుపోయారు. ఒక ఆటో ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. సంఘటన జరిగిన ఇరవై గంటల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకుని, సొత్తు రికవరీ చేశారు. రోహిత్ కేడియా తన ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సంస్థ కేడియా ఆయిల్స్ కంపెనీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవైమంది పని చేస్తున్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలోని తమ ఇంటి ప్రాంగణంలోనే పనివారి కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు.రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బీరుల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పనిచేసి, ఏడాది కిందట మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. దుబాయ్‌లో డెస్టిన్‌షన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో సహాయంగా ఉండటానికి సుశీల్‌ను రోహిత్ 15 రోజుల కిందట పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి సుశీల్‌తో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. సుశీల్, బసంతి మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ కుటుంబం మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో దుబాయ్ వెళ్లారు. దీన్ని అదనుగా భావించిన సుశీల్ ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను పిలిపించాడు. ఫిబ్రవరి 10న వచ్చిన మోల్హు అదే రోజు అర్ధరాత్రి దాటాక సుశీల్‌తో కలిసి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాభరణాలు, 1.4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, రూ.19.63 లక్షల నగదు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి తస్కరించారు. ఈ సొత్తుతో పాటు బసంతిని తీసుకుని ఉడాయించారు. ఫిబ్రవరి 11న ఉదయం రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని మిగిలిన పనివాళ్లు గుర్తించి దుబాయ్‌లో ఉన్న యజమానికి చెప్పారు. ఈ కేసు ఛేదించడానికి నారాయణగూడ పోలీసులు, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నా, మానిటర్ లేదు. రోహిత్ కుటుంబ సభ్యులు తమ సెల్ఫోన్లలోనే ఈ దృశ్యాలు చూస్తుంటారు. సెల్ఫోన్లో రికార్డయిన అనుమానితుల వీడియోలు తమకు పంపాలని పోలీసులు రోహిత్‌ను కోరారు. వీటిని పంపిన రోహిత్, ఆ ముగ్గురిలో ఇద్దరిని సుశీల్, బసంతిగా గుర్తించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగితే, ఉదయం 9 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా నిందితులు చిక్కరని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోహిత్ ఇంటి సమీపంలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పోలీసులు పరిశీలించి, నిందితులు చోరీ చేసిన ఇంటి నుంచి తెలుగు అకాడమీ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఆటో ఎక్కినట్లు గుర్తించారు. అయితే ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో వాహనం వెళ్లిన దిశను ఆధారంగా చేసుకున్నారు. నిందితులతో ఉన్న ఆటో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ కమిషనరేట్, ట్రాఫిక్ కమిషనరేట్ మీదుగా ప్రయాణించినట్లు గుర్తించారు. సుశీల్ బిహార్‌కు, బసంతి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని రోహిత్ ద్వారా తెలుసుకున్న పోలీసులు– నిందితులు ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటుకు వెళ్లి ఉంటారని అంచనా వేశారు. అంత సొత్తుతో విమానం ఎక్కే అవకాశం ఉండదని, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఉంటారని భావించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఫ్లాట్‌ఫామ్స్‌పై ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించి, ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని, అది ఉదయం 6.45 గంటలకు బయలుదేరిందని గుర్తించారు. వెంటనే ఈస్ట్‌జోన్ డీసీపీ బి.బాలస్వామి రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల ఫొటోలు పంపారు. అధికారులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులకు జనరల్ బోగీలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ ముగ్గురూ తారసపడ్డారు. వీరిని పట్టుకుని, రైల్వే పోలీసులు సొత్తు రికవరీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న హైదరాబాద్ పోలీసులకు వీరిని అప్పగించారు. మరోవైపు, రోహిత్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు సుశీల్‌తో పాటు మోల్హు వేలిముద్రలను సేకరించారు. వీటిని తమ డేటాబేస్‌లో సెర్చ్ చేయగా, 2023 జనవరి 31న దోమలగూడలో జరిగిన స్నేహలతాదేవి హత్యకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది. అప్పట్లో ఆమెకు కేర్ టేకర్‌గా పని చేసిన బిహారీ మహేష్‌కుమార్ ముఖియా, మోల్హు ముఖియాతో కలిసి ఆ వృద్ధురాలిని చంపి, రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. గత ఏడాది అక్టోబర్‌లో మహేష్ చిక్కినా, మోల్హు పరారీలోనే ఉన్నాడు. కేడియా ఇంట్లో దొరికిన వేలిముద్రల ఆధారంగా నాటి కేసులోనూ మోల్హు నిందితుడని గుర్తించారు. దీంతో ఇతడిని తొలుత నారాయణగూడ, ఆపై దోమలగూడ కేసుల్లో అరెస్టు చేశారు. నిందితులు చిక్కడం ఆలస్యం కావడంతో స్నేహలతాదేవిని చంపి ఎత్తుకుపోయిన సొత్తులో కనీసం ఒక్క రూపాయి కూడా రివకరీ కాలేదు. ∙శ్రీరంగం కామేష్ -
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్ వార్స్’ సినిమాల్లో విలన్ అయిన ‘డార్త్ వాడర్’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్మార్కెట్లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్’ జాతికి చెందిన జెయింట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. -
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!) -
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది. దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది. తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.అంచనాలు నెరవేరకపోతే!?‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది. ‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది ‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.అసలైన సమస్య ఏమిటి?‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? ‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి. సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలిసైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!) -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్‌లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్‌కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్‌కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్‌లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్‌కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్‌లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్‌తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్‌గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్‌తో బ్రెస్ట్ పంప్‌తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్‌గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!
తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్ చేంజర్ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే తేడాలతో పాటు నా డిఫరెంట్ ఐబ్రోస్ స్టయిల్స్ కూడా నా లుక్స్‌ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార.అందాల చేతులకు సెలబ్రిటీ టిప్చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్ అవుతాయి. జీన్స్, వెస్టర్న్వేర్ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్ సెలబ్రిటీ స్టయిల్ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్‌గా ఉండే బ్రాస్లెట్తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్లెట్స్ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్ సొంతం అవుతుంది. ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్‌గా స్టయిల్ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్లెట్స్ను కూడా కార్ట్‌లో యాడ్ చేసుకోండి. (చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!) -
విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!
పత్రిక నిర్వహణ ఆషామాషీ కాదు. చేయితిరిగిన రచయితలు, పాత్రికేయులు సైతం పత్రికను స్వయంగా నిర్వహించాలంటే, వెనుకాడుతారు. అలాంటిది కొందరు హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పయిమూడు సంచికలను వారు విజయవంతంగా ప్రచురించారు. ఇటీవల ప్రచురించిన ముప్పయిమూడో సంచికను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు.లెక్కల మాస్టారి చొరవతో ప్రారంభంవిద్యార్థులు నడుపుతున్న ఈ మాసపత్రిక పేరు ‘మంగళ విద్యావాణి’. మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, గణిత అవధాని అరుణ్శివప్రసాద్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2018లో ఈ పత్రికను ప్రారంభించారు. సొంత ఖర్చులతో తొలి సంచికను ప్రచురించారు. తొలి నాలుగు నెలలు 8 పేజీలు, ఆ తరువాత 12 పేజీలు, ప్రస్తుతం 16 పేజీలతో మాసపత్రిక నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో 20, 24, 28 పేజీలతో కూడా సంచికను వెలువరించారు. మాసపత్రిక నిర్వహణలో ముఖ్యపాత్ర అరుణ్శివప్రసాద్దే. పత్రిక రూపకల్పన, ఆవిష్కరణ, దాతలను సంప్రదించడం వంటి కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. పత్రికను 16 పేజీలతో తేవడానికి రూ.4 వేలు ఖర్చవుతోంది. మాసపత్రిక ప్రచురణ ఖర్చులను దాతల నుంచి స్వీకరిస్తుంటారు. ప్రతి నెలా 250 ప్రతులను ముద్రిస్తున్నారు. ఈ పత్రికను పాఠశాలలో రెండువందల మందికి ఉచితంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రతులను పరిసర ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలలకు అందిస్తున్నారు. సొంత ముద్రణాలయం లేనందున ఇతరుల చేత డీటీపీ చేయించి, జిరాక్స్ చేసి పంపిణీ చేస్తున్నారు. కవర్‌పేజీ కన్నా సెంటర్ పేజీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సెంటర్ పేజీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పాఠశాల కార్యక్రమాల ఫొటోలను ప్రచురిస్తున్నారు.ఉపాధ్యాయుల సహకారంపత్రిక ప్రచురణలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. పత్రికలో ప్రచురించే రచనలకు తగిన అంశాలపై సూచనలు చేయడమే కాకుండా, వాటిలో అక్షరదోషాల సవరణ బాధ్యతలను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని, పూర్తిగా విద్యార్థులే ఈ పత్రికకు రచనలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, మంత్రులు, వారి శాఖలు, శాస్త్రవేత్తల చరిత్రలు, క్రీడలపై కథనాలు, కవితలు వంటి రచనలతో పత్రికను ముచ్చటగా తీసుకొస్తున్నారు. విద్యార్థుల చిత్రలేఖనానికి ప్రత్యేకంగా పేజీని కేటాయించి, ప్రోత్సహిస్తున్నారు. చివరి పేజీలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలను, వారి వివరాలను ప్రచురిస్తున్నారు.పఠనాసక్తిని పెంపొందించడానికే!: అరుణ్శివప్రసాద్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికను ప్రారంభించాం. విద్యార్థుల్లో రచనాసక్తిని పెంపొందించడం, వారిలోని కళానైపుణ్యాన్ని వెలికి తీయడం, పోటీ తత్త్వాన్ని పెంపొందించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దోహదపడేలా పత్రికను తీసుకొస్తున్నాం. సహకారం అందిస్తున్న దాతలుమంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారా నడుపుతున్న ‘మంగళ విద్యావాణి’ పత్రిక మొదటి సంచికను వ్యవస్థాపకుడు అరుణ్శివప్రసాద్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. తరువాత సహోపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వివిధ పాఠశాలల యాజమాన్యంతో పాటు ఇతర దాతలు పత్రిక ముద్రణకు సహకరిస్తున్నారు. అమెరికాలో ఉన్న అరుణ్శివప్రసాద్ స్నేహితుడు పార్థసారధి సహకారంతో 18వ మాసపత్రికను 50 వేలతో గణిత సూత్రాలతో ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిని ఉచితంగా పంపిణీ చేశారు.మేధావుల ప్రశంసలువిద్యార్థులే రచయితలుగా వ్యవహరిస్తూ మాసపత్రికను నడుపుతున్న మంగళపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే ప్రప్రథమమని పలువురు మేధావులు కొనియాడుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులు, మాసపత్రికను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విఠపు బాలసుబ్రమణ్యం ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా 25వ సంచికను ఆనాటి కలెక్టర్ సగిలి షన్మోహన్, 27వ సంచికను ప్రస్తుత ఎమ్మెల్యే మురళిమోహన్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి ‘మంగళ విద్యావాణి’ సంచికలను ఆవిష్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. గత ఏడాది ‘హిందీ దివస్’ సందర్భంగా మాసపత్రికను పూర్తిగా హిందీలోనే ప్రచురించడాన్ని అభినందించారు. గత డిసెంబర్లో 28 పేజీలతో భారత గణిత శాస్త్రవేత్తల చరిత్రను గురించి ప్రత్యేక సంచిక వెలువరించడం ప్రశంసనీయమని కొనియాడారు. బాబన్నగారి శివశంకర్, బంగారుపాళెం(చదవండి: వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..) -
యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!
తన కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్‌కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్మ్యాన్కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు. పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు. దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్మెంట్ వెలుగులోకి వచ్చింది. సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు. ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్‌కు సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది. సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది. -శ్రీరంగం కామేష్(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!) -
ఫైటింగేల్ ఆఫ్ ఇండియా..! ఆ ముగ్గురే..
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా. (చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!) -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!
చిన్న చిన్న కష్టాలకే చాలామంది దిగాలుగా జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారందరూ ఒక్కసారి ఫొటోలో కనిపిస్తున్న ఈ చేపను చూస్తే, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి అని ఈ చేప బాగా నమ్మినట్లు ఉంది. అందుకే, సముద్రం నుంచి చేపల వలలో చిక్కినా; ఫిషింగ్ మార్కెట్‌కు తరలించినా; ఆఖరుకు తన శరీరంలోని సగభాగాన్ని కత్తిరించినా ఈ చేప తన జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. తోకతో పాటు తన శరీరంలో సగభాగం కోల్పోయినా, అది కుళ్లిపోయినా ఈ చేప సుమారు ఆరు నెలల పాటు సజీవంగానే ఉంది. ఇటీవలే థాయ్‌లాండ్ చేపల బజారులో కనిపించిన ఈ చేపను వాచారా చోటె అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. చేప ఆత్మవిశ్వాసాన్ని మెచ్చి, దానికి ‘ఐ హాఫ్’ అని పేరు పెట్టి, జాగ్రత్తగా ఈ చేపను పెంచుకుంటున్నాడు. ‘ప్రస్తుతం దానికి తగిన చికిత్స అందిస్తున్నాను. ఒకవేళ చేప మరణిస్తే, దానికి పూర్తి గౌరవ మర్యాదలతోనే అంత్యక్రియలు నిర్వర్తిస్తాను’ అని చోటె చెప్పాడు.(చదవండి: శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..) -
అప్పట్లో ఒకడుండేవాడు!
1993 నుంచి 2009 వరకు: పొడవాటి జుట్టు... ముఖంలో నిర్లక్ష్య ధోరణి... పోలీసులు పక్కనున్నా ధాటిగా మాట్లాడగలిగే తెగింపు... 2009 నుంచి 2012 వరకు: నీట్‌గా కట్ చేసిన హెయిర్... పైకి వినయ విధేయతలు... పోలీసులతో మర్యాద పూర్వక ధోరణి...హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు శివారు జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 172 చోరీలు చేసిన మహ్మద్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ మారుతి నయీం వ్యవహారశైలి ఇది. పోలీసు విభాగంతో పాటు నగర వాసుల్లో అనేకమందికి ‘సుపరిచితుడైన’ ఈ ఘరానాదొంగ కథ 2012 మే 18న ముగిసింది. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల్లో అనుచరుల చేతిలోనే హతమయ్యాడు.యాకుత్‌పురలోని నాగాబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా నయిముద్దీన్ అలియాస్ మారుతి నయీం అలియాస్ అయూబ్ నేర ప్రస్థానం దాదాపు పంతొమ్మిదేళ్లకు పైగా కొనసాగింది. 1993లో చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టిన నయీంపై 2012 వరకు 172 కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కనివి ఇంకా అనేకం ఉంటాయని పోలీసులు చెబుతుంటారు. నయీంపై రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్లో నోన్ డెకాయిటీ షీట్ ఉండేది. పేరుకు మాత్రం కారు మెకానిక్‌గా చలామణీ అయ్యే ఇతగాడు నానా నేరాలు చేసేవాడు. 2002 అక్టోబర్‌లో జరిగిన బేగంబజార్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ ఉదంతం ఇతని నేరజీవితంలో అతి దారుణమైంది. ఆ దుకాణంలో దొంగతనానికి వెళ్లి, ఏమీ దొరకలేదనే అక్కసుతో దుకాణంలోని టపాసులకు నిప్పు పెట్టాడు. ఈ దుకాణం పై అంతస్తులో కార్తికేయ లాడ్జి ఉండేది. ఫైర్ వర్క్స్‌లో మొదలైన మంటలు పైకి విస్తరించాయి. దీంతో లాడ్జిలో నిద్రపోతున్న 13 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. ఉదంతం జరిగిన రోజు ఇది షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంగా భావించారు. కొన్నాళ్లకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులున్నా, పోలీసులు మాత్రం అతడికి ఒక్క కేసులోనూ శిక్ష పడేలా చేయలేకపోయారు. పైగా, అతడు సాక్షాత్తు పోలీసుల కస్టడీ నుంచే మూడుసార్లు పరారయ్యాడు.జైలుకు వెళ్లిన ప్రతిసారీ అక్కడి చిల్లర నేరగాళ్లను చేరదీస్తాడు. వారితో జైల్లోనే ఓ కొత్త ముఠా కట్టి బయటకు వస్తుండటం నయీం నైజం. ఆ ముఠాలో ఉండి, బెయిల్ పొంది బయటకు వచ్చే వారితో తనకూ బెయిల్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. విడుదల చేయించాక వాళ్లతో కలిసే దొంగతనాలు చేస్తాడు. స్నాచింగ్స్, చోరీలు, షట్టర్ లిఫ్టింగ్స్ వంటి నేరాలు చేయడంలో దిట్ట అయిన ఖాజా నయీముద్దీన్‌కు మారుతీ కారుతో అనుబంధం ఉంది. మెకానిక్ కావడంతో తేలిగ్గా కారు చోరీలు చేస్తాడు. ఎక్కువగా మారుతీ కారునే ఎంచుకుని, అందులో తిరుగుతూ దాన్ని షట్టర్‌కు అడ్డుపెట్టి, తాళం పగులకొట్టి దర్జాగా లోపలికి ప్రవేశించి, దుకాణాలను లూటీ చేసేవాడు. అందుకే ‘ఖాజా’ స్థానంలో ‘మారుతి’ వచ్చింది. పాత నేరగాళ్లతో పాటు ప్రతిసారీ కొత్తగా మరికొందరిని దొంగలుగా తయారు చేస్తుంటాడు. ఒకసారి తన ముఠాలో వాడిన నేరగాళ్లను మరోసారి వినియోగించేవాడు కాదు. వారి ద్వారా తన ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో వారిని దూరంగా ఉంచేవాడు. చోరీ సొత్తులో కేవలం కొంత మాత్రమే వారికి పంచి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లకు చోర విద్యలో ఆరితేరే వాళ్లు విడిగా ముఠాలు కట్టుకుని నేరాలు చేసే వాళ్లు. మారుతి నయీం 1993–2012 మధ్య 21 సార్లు అరెస్టయ్యాడు. ఇతడు తొలిసారి, చివరిసారి అరెస్టయింది పాతబస్తీలోనే! తొలిసారిగా 1993లో డబీర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసులు 1994, 2000, 2002ల్లో హుమయూన్‌నగర్ పోలీసులు 1996లో, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 2001లో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2005లో, షాహినాయత్‌గంజ్ పోలీసులు 2006 ఏప్రిల్‌లో, తూర్పు–పశ్చిమ మండలాల పోలీసులు సంయుక్తంగా 2006లో అరెస్టు చేశారు. 2011లో ఆయుధచట్టం కింద ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. 2009, 2010ల్లో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆఖరిగా 2012 జనవరి 12న ఫలక్‌నుమా పోలీసులు మహ్మద్ తారిఖ్, మహ్మద్ ముజాహిద్‌లతో కలిసి అరెస్టు అయ్యాడు. అదే ఏడాది మే 18న హతమయ్యాడు. నగరంలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్ల పరి«ధిలోనూ చేతివాటం ప్రదర్శించిన నయీంపై ఒక్క కేసులోనూ నేర నిరూపణ జరగలేదు. నేరాల్లో దిట్ట అయిన నయీం నగరానికి చెందిన ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. మారుతి నయీంను పట్టుకోవడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్ లాంటిది. అతడిని అరెస్టు చేస్తే, ఏమాత్రం ఇంటరాగేషన్ అవసరం లేకుండానే రూ.లక్షల సొత్తు రికవరీ ఇస్తుండేవాడు. బంగారం, వాహనాలు, వెండి, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు ఇలా అనేకం అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల ఫలితంగా అనుచరుల చేతిలోనే హతమయ్యాడు. -
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు. (చదవండి: వామ్మో ఇదేం బిజినెస్? విలనీజం వ్యాపారమా..!) -
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్‌ను చావగొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది. మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్‌కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్లా నటిస్తాడు. మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు. సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది. (చదవండి: జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..) -
పరమశివుడి గృహపతి అవతారం
సూత మహర్షి ఒకసారి నైమిశారణ్యంలోని మునులకు పరమశివుడి అవతార గాథలను చెప్పాడు. పశుపతి అయిన పరమశివుడు గృహపతిగా అవతరించిన గాథ ఇది.పూర్వం నర్మదాతీరంలోని నర్మపురంలో విశ్వానరుడు అనే ముని ఉండేవాడు. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుల వద్ద వేదశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. యుక్తవయస్సు రాగానే శుచిష్మతి అనే శ్రోత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాక విశ్వానరుడు తన సహధర్మచారిణితో కలసి నిత్యాగ్నిహోత్రిగా, పంచయజ్ఞ పరాయణుడిగా, షట్కర్మ నిరతుడై, దేవ, పితృ, అతిథిసేవా తత్పరుడై, నిత్య శివార్చన కొనసాగిస్తూ, ప్రశాంత జీవనం సాగించేవాడు.ఒకనాడు శుచిష్మతి భర్తను సమీపించి, ‘నాథా! పరమశివుడి దయవల్ల ఇప్పటి వరకు మనకు ఏ లోటు లేదు. మనకు లేనిదల్లా సంతానభాగ్యం ఒక్కటే! సాక్షాత్తు శంకరుని వంటి పుత్రుని అనుగ్రహించమని శంకరునే కోరండి’ అని అడిగింది.భార్య కోరిక మేరకు విశ్వానరుడు వారణాసి నగరానికి చేరుకున్నాడు. విశ్వేశ్వర లింగం సహా అక్కడ కొలువై ఉన్న అన్ని శివలింగాలను అర్చించాడు. తొలిగా గణనాథుడికి ప్రణమిల్లి, ఆ తర్వాత విశాలాక్షిని, అన్నపూర్ణను, కాలభైరవుడిని, ఆదికేశవుడిని పూజించి, శాస్త్రోక్తంగా కాశీ నగరాన్ని సేవించాడు. ఎందరో సిద్ధపురుషులు ఆరాధించి, సిద్ధి పొందిన వీరేశలింగం ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. ఒక నెల ఏకభుక్తాన్ని, రెండోనెల నక్తాన్ని, మూడోనెల అయాచిత ఆహారాన్ని, నాలుగోనెల ఉపవాసాన్ని, ఐదోనెల పాలను, ఆరోనెల పండ్లను, ఏడోనెల నువ్వులను, తొమ్మిదోనెల పంచగవ్యాన్ని, పదోనెల చాంద్రాయణాన్ని, పదకొండోనెల దర్భాగ్ర జలాలను, పన్నెండోనెల వాయుభక్షణంతోను– ఇలా క్రమక్రమంగా తపోదీక్షను కఠినతరం చేస్తూ వచ్చాడు. పదమూడోనెల వేకువ జామునే గంగా స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనానికి వెళుతున్న వేళ సుందర వదనారవిందుడు, చితాభస్మాలంకారుడు, దిగంబరుడు అయిన ఎనిమిదేళ్ల బాలుడు వేద సూక్తాలను వల్లె వేస్తూ కనిపించాడు. అతడు బాలశివుడిలా కనిపించాడు. అతడిని చూడగానే విశ్వానరుడు పులకాంకితుడయ్యాడు. చేతులు జోడించి, ఆశువుగా అష్టకాన్ని పలుకుతూ, శివస్తుతి చేశాడు.విశ్వానరుడి స్తోత్రానికి బాలుడి రూపంలో ఉన్న పరమశివుడు పరమానందం చెందాడు. ‘భక్తా! నీ భక్తిశ్రద్ధలకు పూర్తిగా సంతుష్టుడినయ్యాను. ఏదైనా ఉత్తమ వరం కోరుకో, తప్పక తీరుస్తాను’ అన్నాడు.‘పరమేశ్వరా! నువ్వు సర్వజ్ఞుడివి. నీకు తెలియనిదేముంది? నాకు అర్హమైనదానిని నువ్వే అనుగ్రహించు’ అన్నాడు విశ్వానరుడు.విశ్వానరుడి మాటలకు పరమశివుడు మరింతగా సంతోషించాడు.‘విప్రోత్తమా! త్వరలోనే నేను నీకు పుత్రుడినై పుడతాను. గృహపతి నామంతో దేవతలకు సైతం ప్రీతిపాత్రుడనవుతాను. సంతానాభీష్టులైన దంపతులు నువ్వు నన్ను స్తుతిస్తూ పలికిన అభిలాషాష్టకాన్ని పఠించినట్లయితే, తప్పక సంతానవంతులవుతారు’ అని వరమిచ్చాడు.కొన్నాళ్లకు శుచిష్మతికి పండంటి బాలుడు పుట్టాడు. విశ్వానరుడు అతడికి గృహపతి అని నామకరణం చేశాడు. ఏడో ఏట ఉపనయనం చేశాడు. తొమ్మిదేళ్లు నిండేసరికి ఆ బాలుడు చతుర్వేదాలను, షడంగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒకనాడు నారద మహర్షి విశ్వానరుడి ఆశ్రమానికి వచ్చాడు. విశ్వానరుడు ఆయనకు తన కొడుకును పరిచయం చేశాడు. బాలుడైన గృహపతి సాముద్రిక లక్షణాలను పరిశీలించిన నారదుడు ‘విశ్వానరా! ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండో ఏట అగ్నిగండం ఉంది. జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడు చెప్పిన మాటలకు విశ్వానరుడు, శుచిష్మతి దంపతులు దుఃఖంలో కూరుకుపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించిన గృహపతి వారిని ఓదార్చాడు. ‘మీరు శోకాన్ని విడిచిపెట్టండి. నా జన్మకు కారణం నాకు తెలుసు. సాక్షాత్తు పరమశివుడిని ఆరాధించి, జనన మరణాలను జయించి తిరిగి వస్తాను. కాశీ నగరానికి వెళ్లేందుకు అనుమతించండి. అక్కడ తపస్సు చేసి, అనుకున్నది సాధిస్తాను’ అని పలికాడు. తల్లిదండ్రులు అనుమతించడంతో గృహపతి వారణాసి చేరుకున్నాడు. ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానమాచరించి, విశ్వేశ్వరుడిని సేవించుకున్నాడు. తర్వాత అనుకూల ప్రదేశాన్ని చూసుకుని, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, దాని ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. గృహపతి ప్రతిరోజూ మానసపూజ కొనసాగిస్తూ, కఠిన నియమాలతో తపస్సు చేయసాగాడు.కొన్నాళ్లు గడిచాక, ఒకనాడు దేవేంద్రుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘బాలకా! వరం కోరుకో’ అన్నాడు.‘నేను పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నాను. అతడి నుంచి మాత్రమే వరం స్వీకరిస్తాను. నువ్వు తప్పుకో’ అన్నాడు.బాలుడి ధిక్కారానికి కుపితుడైన ఇంద్రుడు అతడి పైకి తన వజ్రాయుధాన్ని దూశాడు. వజ్రఘాతానికి బాలుడు మూర్ఛపోయాడు.వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఛితుడైన బాలుడిని తన చేతులతో స్పృశిస్తూ, ‘నాయనా! గృహపతీ! లే! నీకు శుభాలు కలుగుతాయి’ అన్నాడు. నిద్రలోంచి మేల్కొన్నట్లుగా లేచిన బాలుడిని పరమశివుడు తన ఒడిలోకి తీసుకుని, లాలించాడు. -
మహేంద్రగిరి..శివభక్తుల సిరి
మహేంద్రతనయ– ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందునే ఈ నదికి మహేంద్రతనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో విశిష్టత కూడా ఉంది. రోజున ఈ కొండలు అశేష శివభక్తకోటితో కళకళలాడుతూ కనిపిస్తాయి.శివపూజా విధానంలో మూర్తి పూజకంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పంచపాండవులు ఇదే విశ్వసించారు. మహేంద్రగిరిపై మహాశివుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి తరించారు. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి శిఖరం 1,501 మీటర్ల ఎత్తులో (4,925 అడుగులు) ఉంటుంది. మహేంద్రగిరి శిఖరాగ్రాన పంచపాండవుల ఆలయాల నిర్మాణం అప్పటి అద్భుత వాస్తునిర్మాణ ప్రతిభకు తార్కాణం. వీటి నిర్మాణం నేటికీ అంతు చిక్కని రహస్యమే! పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి, ఆరాధించారని భక్తులు చెబుతారు. ఇక్కడ ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి శిథిలమయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. ముప్పయి అడుగుల ఎత్తులో అరుదైన రాతికట్టుతో నిర్మించిన కుంతీ ఆలయం అబ్బురపరుస్తుంది. ఆలయం ఎదురుగా రెండు పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారన్నది అంతుబట్టని విషయం. కుంతీ మందిరం ఉత్తరదిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాలలోనూ ఇదే పురాతనమైనది. పర్వతం చివర ఒక కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. మాఘమాసంలో కనుచూపు మేరంతా మంచుదుప్పటి కప్పుకుని కనిపించే మహేంద్రగిరుల మహోన్నత ప్రకృతి సౌందర్యం చూసి తరించాల్సిందే! ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడి ఆలయాల్లో భారీస్థాయిలో శివార్చన జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాశివరాత్రికి ముందురోజే ఇక్కడకు చేరుకుంటారు. మహాశివరాత్రి రోజంతా పూజ, పురస్కారాలతో జాగరం చేస్తూ ‘జాగరమేళా’ నిర్వహిస్తారు.ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దేవమాలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తయిన పర్వతం మహేంద్రగిరి. రామాయణంలో మహేంద్రగిరి కొండను మహేంద్రపర్వతంగా పేర్కొన్నారు. దాదాపు 1200 వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి అధ్యయనంలో తేలింది. దాదాపు మూడువందలకు పైగా ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి.మహా శివరాత్రి యాత్రకు ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. మందస సమీపంలోని సాబకోట, సింగుపురం గ్రామాల వద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తాయి. సుమారు 32 కిలోమీటర్లు కొండలు, వాగులను దాటి కాలిబాటన మహేంద్రగిరులను చేరుకోవాలి. శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి, కొయిపూర్ మీదుగా కూడా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్లు ప్రయాణించి మహేంద్రగిరిని చేరుకోవచ్చు. శివరాత్రి రోజు తప్ప ఏడాదంతా మానవ సంచారం కానరాని ఈ మార్మిక మహేంద్రగిరి సందర్శన ఆద్యంతం అద్భుతం. బాలు అయ్యగారి -
అమ్మతనం
‘‘అమ్మా, సరితా! నువ్వేమీ కంగారు పడకు. మీటింగ్ అయిపోయాకే నిదానంగా ఇంటికి రా! నేను మీ ఇంటికి వస్తూ వస్తూ, డే కేర్ సెంటర్లో ఉన్న మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వస్తున్నాను’’ అంటూ విషయం అంతా చెప్పి ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ సరితకి మేనత్త అయినా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అన్నీ అమ్మలా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది.ఆరోజు ఆఫీసులో మీటింగు లేటుగా ముగియడంతో రాత్రి 8 తర్వాతే ఇంటికి చేరుకుంది సరిత. అప్పటికే అన్నపూర్ణమ్మ అన్నం పెట్టడంతో బాబు తిని నిద్రపోయాడు. నిద్రపోతున్న బాబును చూసుకుని, అన్నపూర్ణమ్మను చూసి ‘‘అత్తమ్మా! తిన్నారా లేదా?’’ అడిగింది సరిత. ‘‘నేను తిన్నానమ్మా! పాపం అసలే ఆఫీసులో హడావిడిలో సమయానికి తింటున్నావా లేదో! నీకు ఇష్టమని గుత్తొంకాయ కూర చేశాను. కడుపునిండా తిని పండుకోరా బుజ్జీ!’’ అని సరితకి చెప్పి, తను కూడా వెళ్లి నిద్రపోయింది. సరిత భోజనం పూర్తి చేసుకున్నాక బాబు దగ్గరికి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం– తెల్లారింది.ఆ రోజు ఆదివారం. ఆఫీసుకు సెలవు కావడంతో లేటుగా లేచి, గది నుండి బయటికి వస్తున్న సరితని చూస్తూ, ‘‘అమ్మా! సరితా, రాత్రి అసలే ఇంటికి లేటుగా వచ్చావు. రావడం అలసిపోయి ఉంటావని ఏమీ మాట్లాడ లేకపోయాను. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి అమెరికాలో జాబు కదా, అప్పుడప్పుడు బాబుతో మాట్లాడుతూ ఉంటాడా? ఎలా ఉన్నాడు? మళ్లీ ఇండియాకి ఎప్పుడు వస్తాడంట?’’ అని ఆరా తీసింది అన్నపూర్ణమ్మ. ‘‘గత ఏడాదే కదా అత్తమ్మ వచ్చి వెళ్లారు. ఈ ఏడాది చివర్లో రావచ్చు’’ చెప్పింది సరిత .‘‘ ఏమ్మా? సరితా! బాబు రాత్రి ఏడుస్తా ఉన్నాడు, ఎందుకు?’’ అడిగింది అన్నపూర్ణమ్మ. ‘‘అదే అత్తమ్మా! ఇంతకుముందు ఇలా లేదు కాని ఈమధ్య ఎందుకో అబ్బాయి రాత్రి అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి ఏడుస్తున్నాడు. కారణం తెలియదు. మళ్లీ నచ్చజెప్పి పడుకోబెడితే పడుకుంటున్నాడు. ఏమిటో! అత్తమ్మా నాకు ఏమీ తెలియడం లేదు. బాల్యంలో ఇవన్నీ మామూలే ఏమోనని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను’’ అంది సరిత. సరిత బాబును తీసుకొని హాలులో బొమ్మలతో ఆటలాడిస్తుండగా టిఫిన్ సంగతి చూద్దామని వంట గదిలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. హాలులో హఠాత్తుగా పిల్లోడి ఏడుపు విన పడడంతో ‘ఏమైందమ్మా?’ అంటూ హాలులోకి వచ్చింది అన్నపూర్ణమ్మ. పిల్లవాడి తీరును చూసి ఒకింత ఆందోళనకు లోనయ్యింది ఆమె. ‘‘ఏమైందమ్మా? సరితా! బాబు అంతగా భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు కారణమేంటి?’’ అడిగింది అన్నపూర్ణమ్మ. తన కారు బొమ్మతో ఆడుతూ ఉండగా కారు బొమ్మ చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది అత్తమ్మా! దానికే వాడు ఏడుస్తున్నాడు. నేనేమీ అనలేదు, కొట్టలేదు’’ అంటూ వాపోయింది సరిత.అన్నపూర్ణమ్మ ఆ బాబు దగ్గరికి వెళ్లి ఓదార్చి ఎత్తుకొని, ‘‘కన్నా! ఏమైందిరా! బొమ్మ పోతే పోయింది, మరొకటి తెచ్చుకోవచ్చులే! దాని కోసం అంతగా ఏడవకు నాన్నా!’’ అంటూ బుజ్జగించింది.వెంటనే ఆ బాబు వచ్చిరాని మాటలతో ‘‘నేను కావాలని చేయలేదు. అది అదే విరిగిపోయింది నన్ను కొట్టొద్దు. నా చెయ్యి మెలి పెట్టొద్దు నాకు నొప్పిగా ఉంటుంది’’ అంటూ ఏడుపు మొదలెట్టాడు.అన్నపూర్ణమ్మకు ఆ డే కేర్ సెంటర్లో చూసుకునే విధానం పూర్తిగా అర్థమైపోయింది. అన్నపూర్ణమ్మ ఏదో చెప్పే లోపల సరితకి కూడా విషయం అర్థమైనా, ‘‘డే కేర్ సెంటర్లో అంతమంది పిల్లల్ని చూసుకున్నప్పుడు ఒక దెబ్బ కొట్టినా తప్పేమీ లేదులే అత్తమ్మా! మనం సీరియస్‌గా తీసుకుంటే ఎలా? అని ప్రశ్నించింది సరిత.‘‘అబ్బాయి ఉద్యోగంలో బిజీ. నువ్వు ఉద్యోగంలో బిజీ. ఇలా అయితే మీ బిడ్డ చాలా ఇబ్బంది పడతాడు కదమ్మా! అది కూడా ఆలోచించాలి కదా!’’ అంది అన్నపూర్ణమ్మ.‘‘అలా అయితే ఏం చేయమంటారు అత్తమ్మా! బాగా చదువుకొని ఉద్యోగం చేసేది నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కదా! ఇప్పుడు నన్ను ఉద్యోగం మానేసి, బాబును చూసుకోమంటారా? ఇది ఎంతవరకు న్యాయం? ఉద్యోగం అనేది మగవాళ్ళ పనేనా ఆడవాళ్ళది కాదా?’’ అంటూ గొంతు పెంచి ఉక్రోషంతో సమాధానం చెబుతున్న సరితని చూసి నవ్వుకుంది అన్నపూర్ణమ్మ. ‘‘నువ్వు చదువుకున్నావు కాబట్టే, అర్థం చేసుకుంటావని నీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. డే కేర్ సెంటర్ అనే చట్రంలో పిల్లల్ని బిగించి, వారి స్వేచ్ఛను హరించివేస్తే వారి మనోవికాసం దెబ్బతింటుందని తెలియదా నీకు? తల్లి తొలి గురువు. పిల్లల్ని ఎలా బుజ్జగించాలో? ఎలా దండించాలో? వాళ్ళు ఎలా స్పందిస్తారో? వివిధ దశల్లో వాళ్ళల్లో వచ్చే మార్పులు ఎలా వుంటాయో? అన్నీ తెలుసుకోగలిగేది కేవలం తల్లి మాత్రమే అనే చిన్న విషయం నీకు తెలియదా సరితా?’’ అంటూ హితబోధ చేస్తున్న అన్నపూర్ణమ్మని మధ్యలోనే ఆపి, ‘‘అంటే అత్తమ్మా! నేను డే కేర్‌లో వేయడం తప్పంటావా?’’ అని ఎదురు ప్రశ్న వేసింది.దానికి సమాధానంగా, ‘‘డే కేర్ సెంటర్లో బాగా చూసుకోరు అని నేను చెప్పటం లేదు. అందులో వదలాల్సిన అవసరంలో నీవు లేవు అని గుర్తు చేస్తున్నాను. కనీసం పిల్లవాడు బడికి వెళ్లే సమయం వరకైనా నువ్వు ఉద్యోగం మాని ఈ బిడ్డ సంరక్షణలో గడపాలి అనేదే నా ఆశ. నిన్న నేను బాబుని తీసుకురావడానికి డేకేర్ సెంటర్‌కి వెళ్లినప్పుడు నాలాగే తమ పిల్లల కోసం అక్కడికి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రావడం చూశాక నా మనసుకు ఎంతో బాధ కలిగిందమ్మా! మీ బాబు కూడా నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చినప్పుడు నాకు ఎంత బాధ అయిందో తెలుసా? కనీసం నన్ను చూసి ఒక నెల పైనే అయ్యి ఉంటుంది. కానీ ఇంటికి తీసుకు వెళ్లడానికి ఒకరు వచ్చారు అని తెలియగానే ఆ బాబు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి హత్తుకొని బోరున ఏడ్చినప్పుడు నా మనసు ద్రవించి పోయిందమ్మా!’’ అంది అన్నపూర్ణమ్మ.‘‘అంటే నేను బాగా చూసుకోవట్లేదు అంటున్నారా?’’ అని అడిగింది సరిత.‘‘పిల్లల్ని చూసుకోవలసినప్పుడు చూసుకోలేని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం. ఇది గుర్తుంచుకో అమ్మా! పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తే రేపు వీళ్లు కూడా పెద్దవాళ్ళు అయ్యాక ప్రతిదానికి భయపడతారు. అంతేకాదు, మనసున్న మనుషుల్లా కాకుండా, మరమనుషులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. నేడు మీరు డేకేర్ సెంటర్లో వేసినట్టు రేపు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్‌లో వేసే అవకాశం లేకపోలేదు. వాళ్ల బాల్యం తల్లిదండ్రుల వద్ద గడిపినప్పుడే తల్లిదండ్రులు వాళ్ల కోసం చేసే త్యాగం, సేవ, పెద్దల పట్ల వినయం, ఇరుగుపొరుగు వారితో నడుచుకోవలసిన తీరు, తోబుట్టువులతో సఖ్యతగా మెలగడం అలవాటవుతాయి. పాఠంలా చెబితే వచ్చేవి కాదమ్మా ఇవన్నీ, మనతో గడిపినప్పుడే, మనలో ఒకరిగా ఉన్నప్పుడే వాటంతట అవే అలవడతాయి. బిడ్డను తన బాల్యం నుంచి తనను వేరు చేసే ఈ కేర్ సెంటర్లో వేయడం వద్దమ్మా! ఇవన్నీ నీకు ఒక మేనత్తగా కంటే అమ్మగా చెబుతున్నాను అని అనుకో’’ చెప్పింది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ మాటలకి ఆలోచనలో పడింది సరిత.‘‘అయినా ఎవరిని అనుకుని ఏమి లాభంలే, బిజీబిజీ బతుకులాయే! ఈ హడావిడి ప్రపంచంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మాతృమూర్తులుగా బతకడానికి ప్రయత్నించడం లేదని అనిపిస్తోంది. నేటి కాలపు మనుషులు ఆకాశంలోని చంద్రుని తాకాలి అనే అంత ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మన మనసులలోని లోతులోకి వెళ్ళి ఆ లోటుపాటుల్ని సవరించుకొని ఎదగడానికి ప్రయత్నించడం లేదు కదా!’’ వాపోయింది అన్నపూర్ణమ్మ.‘‘అంటే అత్తమ్మ నన్ను ఉద్యోగం చేయొద్దంటారా?’’ ప్రశ్నించింది సరిత.‘‘అమ్మా, సరితా! నేను చెప్పేది బాగా అర్థం చేసుకో తల్లీ, అబ్బాయి సంపాదిస్తున్నాడు కదా! అని అంటున్నాను. నీ ఉద్యోగంపైనే నీ జీవితం ఆధారపడలేదు అని గ్రహించమంటున్నాను. నీ బిడ్డ జీవితం మాత్రం నీపైనే ఆధారపడి ఉంది. అది తెలుసుకోమంటున్నాను. దీని పట్ల మాత్రం అశ్రద్ధ వహించకు అని చెబుతున్నాను. అయినా అంతదాకా ఎందుకు? ఇందాక నువ్వే చెప్పావు కదమ్మా! ‘ఇంతకుముందు లేదు గాని, ఈమధ్య కాలంలోనే బాబు రాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాడు అని’, అంటే బహుశా ఇది తనని డే కేర్ సెంటర్లో వేయడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు అని. చదువుకున్న తల్లిగా నువ్వు గుర్తించలేకపోయావా?’’ ప్రశ్నిస్తున్న అన్నపూర్ణమ్మ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది సరిత.చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తనని అత్తమ్మ ఎలా చూసుకుందో, తనను ఏనాడూ ఇటువంటి డేకేర్ సెంటర్లో కాని, హాస్టల్లో కాని వేయకుండా తన దగ్గరే పెట్టుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తన అత్తమ్మ కంటే కన్నతల్లి అయ్యుండి తన బిడ్డకు ఎటువంటి పరిస్థితి కలిగించిందో, బిడ్డను చూసుకునే విధానంలో తన పరిస్థితి ఏమిటో తలచుకొని మనసులోనే బాధపడింది సరిత.తనలో మార్పును కలిగించిన తన అత్తమ్మకు మనసులోనే చేతులు జోడించి నమస్కరించుకుంటూనే, మరో వైపు అపరాధ భావంతో అన్నపూర్ణమ్మని చూస్తూ, ‘‘నన్ను క్షమించండి అత్తమ్మా! ఇకమీదట ఉద్యోగానికి వెళ్ళను. పూర్తిగా బాబు బాగోగులకే సమయం కేటాయిస్తాను. కనీసం మా బాబుకు పదేళ్ళు నిండే వరకు ఉద్యోగం జోలికి పోను’’ అని చెప్పింది సరిత. ఆమెలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది అన్నపూర్ణమ్మ.మరుసటి రోజు.. ఉదయాన్నే నిద్ర లేచి తయారయ్యి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది సరిత . అది చూసిన అన్నపూర్ణమ్మ నిన్ననే కదా ఉద్యోగం మానేస్తాను అంది మళ్లీ ఇలా ఆఫీసుకు తయారయ్యిందేమిటి? అని ఆశ్చర్యంగా సరిత వైపు చూస్తూ ఉండగా, సరిత ఒక చిన్న నవ్వు నవ్వి, ‘‘అత్తమ్మా! కంగారు పడకండి. నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఆఫీసుకు వెళ్ళేది నా రాజీనామా ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరుతున్న సరితని చూసి, ఆనందంగా సాగనంపింది అన్నపూర్ణమ్మ. - కె. అమృత జ్యోత్స్న -
రసోన్మాది
‘‘రహస్యాలకే జీవితవంతా ఖర్చుపెడతన్నట్టు ఉంది’’ మావిడిచెట్టు చుట్టూ కట్టిన గట్టుమీద కూర్చుంటూ అంది ప్రశాంతి. ఆమె మొహం వంక చూస్తూ మాట్లాడటానికి సదుపాయంగా ఉండేలా సర్దుకుని, ‘‘ఇపుడు బానే ఉందికదా! కుదిరినపుడల్లా కలుస్తూనే ఉన్నాం. ఒకేళ కుదరక దూరమైపోయామనుకో! పదేళ్ళ తర్వాత కలిసినా నీమీద ఇదేప్రేమ ఉంటుంది, నేనేం మారను.’’ అంటున్నపుడు భార్యాపిల్లలు గుర్తొచ్చారు మాధవకి. ఏవనలేదామె. మసక వెన్నెల్లో అతని స్నేహితుని తోట పూల సువాసనలతో ఊరడిస్తోంది. తోటని దాటి పొలాల మీదుగా చూపు సాగుతూ పోతోంది. తారలతో మిలమిల మెరుస్తున్న ఆకాశం నుంచి ఉన్నట్లుండి వెలుగుగీత గీస్తూ ఉల్క జారిపడడాన్ని చూసి ఉద్వేగంతో నిల్చుంది ప్రశాంతి. ‘‘నువ్వే కావాలనుకున్నాక ఇదంతా ఇరుగ్గా ఉంది. మణి చాలా మంచాడు. కానీ అతని మొహం కూడా చూడబుద్ది కావడంలేదు. పెద్ద ఇనపచేత్తో నొక్కేసుకుంటున్నట్టు ఉంది. ఆ సంసారంలో ఉండలేను. అదుగో ఉల్క రాలింది చూశావా! నేనక్కడకి పోతాను’’ చున్నీ గట్టుమీద పడేసి భూమి, ఆకాశం కలిసినట్లున్న అంచువైపు అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అయోమయం అయిపోయాడు మాధవ. ఆడవాళ్ళు ఇలా మాట్లాడడం, ముప్ఫైమూడేళ్ళ వయసులో శరీరమంతా తాండవం చేస్తున్నంత వేగంతో కదలడం చూసెరగడు. అలా వదిలేస్తే ఆ అంచుని చేరుకుని అది పట్టుకుని పైకి ఎగబాకి, ఆకాశంలోకి దూకి మాయమైపోతుంది. తనకిక జీవితంలో దొరకదు. పిచ్చి ఉద్రేకంతో ‘వస్తున్నా ఆగూ’ అంటూ చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయి చేలకి అడ్డంబడి ఆమె వెనకాల పరుగుపెట్టాడు. పాదాలకి తుప్పలు, ఎండుమొరళ్లు గుచ్చుకుని రక్తం చిగురిస్తున్నది. ఎగుడు దిగుడు నేలలోపడి కాలిమడమలు నెప్పి పుడుతున్నాయి. అలవాటు తప్పిన పరుగువల్ల ఆయాసంతో పడతాలేస్తా ఎట్టకేలకి ఆమెని చేరుకుని గట్టిగా కావిలించుకున్నాడు.పోటెక్కిన రెండుసముద్రాలు కావిలించుకున్నట్లు కల్లోలం ఎగసిపడతా ఉంది. ఏదో అనబోతున్న ఆమె పెదాలకి చేతివేళ్లు అడ్డంపెట్టి ‘‘మనిద్దరం ఇల్లు తీసుకుందాం’’ అన్నాడు. ఎంతగట్టిగా ఊపిరిపీల్చి వదిలిందీ అంటే ఆ వేడికి కనలినట్లయ్యాడు.చేతులు చేతులు పట్టుకుని తిరిగివచ్చాక– పరిగెత్తి వచ్చిన నేలని, కోసుకుపోయి మంటపెడుతున్న పాదాలను చూసుకున్నపుడు బైటకి రాలేని చాలాలోతుకి దిగబడిపోయినట్లు భయంవేసింది మాధవకి. అంతలోనే మొండిధైర్యం తెచ్చుకుని ఆమెచేతిని బిగించి పట్టుకున్నాడు.‘అతను మిగతావాళ్ళని చూస్తున్నపుడు జీసస్ లాగా నన్ను చూస్తున్నపుడు మాత్రం గ్రీక్ దేవుడు ఎరోస్ లాగా అనిపించాడు’ అని ప్రశాంతి చెప్పిన రోజే మణిశంకర్‌కి అనుమానం వచ్చింది. ఆ మాటకి కాదు, ఆమె ముఖంలో కనిపిస్తున్న వెలుగుకి. అపుడు అతని గుండె కొద్దిగా వణికింది. ‘ఎవర్నో పొగిడి తనలో అసూయ తెప్పించి మరింతగా ఆమె కొంగుపట్టుకు తిరిగేలా చేసుకోడానికి వాడిన జాణతనపు ట్రికీ మాటలివి’ అనుకుంటేగానీ అతనికి ఊపిరాడలేదు. కానీ, ఇపుడు లగేజ్ సర్దుకుని ‘అతను నాకు నచ్చాడు, ఇంట్లోంచి వెళ్లిపోతాను’ అంటుంటే మణికి ఏమీ అర్థంకాలేదు. వెర్రిపిల్ల అని తెలుసుగానీ, ఇలా వెళ్లిపోతానూ అనేంత వెర్రితనం ఆమెనుంచి తనకు ఎదురైతే ఎలా రియాక్టవ్వాలో తెలీడంలేదు. పెళ్ళిచూపుల కోసం ప్రశాంతి ఇంటికి వెళ్ళినరోజు గుర్తువస్తా ఉంది. ఆరోజు ప్రశాంతి వాళ్ళమ్మ కూతురి అందం, మంచితనం, తెలివితేటలు, ప్రైవేటు ఉద్యోగాన్ని ఎంత ఓర్పుతో చేసుకువస్తున్నదీ చెప్పింది. ఔనన్నట్లు తలూపుతూ ఉన్న వాళ్ళనాన్న ఉన్నట్లుండి జోక్యం చేసుకుని వీరగాథ ప్రారంభవాక్యంలా ‘ఇంటర్ ఫస్టియర్‌లో ప్రశాంతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, వారంపోయాక తిరిగివచ్చింది’ అన్నాడు. తుళ్ళిపడ్డాడు మణిశంకర్. వాళ్ళమ్మ నిమిషంలో తేరుకుని, ‘అసలు విషయం సరిగ్గా చెప్పండి’ కసిరింది భర్తని. కథంతా చెప్పుకొచ్చాడతను. సినిమా పిచ్చితో ఇంట్లోంచి వెళ్ళిపోయి, వారంరోజులు స్టూడియోల చుట్టూ తిరిగింది టీనేజ్ ప్రశాంతి. మోసం చేయబోయిన ఒకరిద్దరు మగాళ్లని చూసి భయంవేసి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఎవరితోనో లేచిపోయి కన్నవాళ్ళ పరువుతీసిందని ఊరంతా గగ్గోలుపెట్టినా తిట్టకుండా కొట్టకుండా మంచిమాటలు చెప్పి కూతుర్ని కాపాడుకున్నారు. అక్కడితో ఆ పిచ్చి వదిలిపోయింది. ‘‘వాళ్ళనాన్నలా ఏదొచ్చినా పట్టలేం. ఇద్దరికీ ఏ పిచ్చిబడితే అదే. అంతే తప్ప మా పిల్ల మనసు బంగారం బాబూ!’’ వాళ్ళమ్మ చెప్పింది. ఆమె మాటల వెనుక ఈ సంబంధం కూడా తప్పిపోతుందేమోనన్న భయం, దిగులు వినబడ్డాయి. తను నచ్చాడని నిర్భయంగా చెప్పిన ప్రశాంతి ఆసక్తిగా అనిపించింది మణికి. ఆ ఆసక్తి పెళ్ళికి పనికివచ్చేదో కాదో అర్థం చేసుకోడానికి కొంతసమయం తీసుకుని రెండుసార్లు ఆమెని బైటకలిశాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారిద్దరూ. ఆమె చేతిలోని లగేజీ లాక్కుని పక్కకి విసిరికొట్టి ‘పిచ్చిమాటలు ఆపు’ అన్నాడు మణిశంకర్. మొండిగా నిల్చుంది ప్రశాంతి. ‘‘ఏంటీ?’’ రెట్టించాడు.‘వెళ్లిపోతాను’ మళ్ళీమళ్ళీ అదేమాట. ‘‘మరి పిల్లాడిని ఏం చేస్తావ్?’’ ఆశ్చర్యంగా అన్నాడు ఏం చెప్పాలో తోచనట్లు తలవంచుకుంది. పిల్లాడు కడుపున పడ్డాడని తెలిసిన దగ్గర్నుంచీ ఆ ఎనిమిదినెలలు పుట్టబోయే బిడ్డకోసం అటు లోకాన్ని ఇటు తిరగేసి చుట్టూ అందర్నీ అల్లల్లాడించిన తల్లి ఈరోజు కఠినమైన ప్రియురాలు అయ్యింది. ఆపుకోలేని కోపంతో ఆమెని బెడ్రూమువైపు తోసి, ‘‘ఎక్కడికీ వెళ్ళేది! కొడ్తే.. మూతిపళ్లు రాల్తాయ్! ఇంత రంకుతనం ఎపుడు నేర్చావసలు!’’ అన్నాడు. అపుడే స్కూలునుంచి వచ్చిన కొడుకు ఇంట్లో ఎపుడూ వినని ఈ మాటలు మంచివో చెడ్డవో తెలీక మొహంలో ఏ భావం పలికించాలో తెలీని కన్ఫ్యూజన్లో అటూ ఇటూ చూస్తున్నాడు. ప్రశాంతి మళ్ళీ లగేజీ అందుకోబోయింది. వంగిన ఆమెని మణిశంకర్ నిటారుగాలేపి చెంపలమీద, వీపుమీద కొట్టి లోపలిగదివైపు నెట్టుకుంటూ వెళ్తుంటే పిల్లాడు గింగుర్ల గొంతుతో ఏడుపు అందుకున్నాడు. ఆ ఏడుపు వినలేనట్లు మొహం తిప్పుకుని చెయ్యి విదుల్చుకుని తనే లోపలికి వెళ్ళి కూచుంది. కదలకుండా కళ్ళు విప్పకుండా కళ్ళు తడవకుండా అలానే కూచుంది. రాత్రి పదయింది, పన్నెండు రెండు మూడయింది. గుండెల్లో గుబులు, భయం, అవమానం– కళ్లమీదకి మగత కమ్ముకొస్తుంటే కళ్ళుమూస్తూ తెరుస్తూ ఆదమరిస్తే ఎక్కడ మాయం అవుతుందోన్నట్లు కాపలా కాస్తున్నాడు. అపుడే కన్నంటుకున్న సమయంలో ఆమె చేతిగాజు నేలకి రాసుకుని చిన్నశబ్దం వచ్చింది. దానికే తుళ్ళిపడి లేచి నిల్చున్నాడు. ఎర్రబడిన కళ్ళతో తూలుతూ ఊగుతున్న అతన్ని బిక్కమొహంతో చూసింది ప్రశాంతి. మనసు కలిచివేసింది మణికి ‘ఈ తొమ్మిదేళ్లలో విడిపోయేన్ని గొడవలులేవు సరికదా, అన్యోన్యంగా ఉన్నాము కూడా’ విచారంగా అనుకున్నాడు. అయిదునెలల కడుపుతో ఉండి, బాగా జబ్బుపడిన ఆడబడుచుని, పిల్లల్ని ఇంటికితెచ్చి కంటికిరెప్పలా చూసుకుని బాగుచేసి పంపిన ప్రేమమయి తను. మారుమూల పల్లెకి ఏదో పనిమీద ఇద్దరూ వెళ్ళినపుడు తను తలనొప్పితో పడుకుంటే రాత్రిపూట సైకిల్ మీద పది కిలోమీటర్ల దూరమున్న టౌనుకి వెళ్ళి సారిడాన్ టాబ్లెట్స్ తెచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ బాగా భయపెట్టింది. ఇపుడిలా వెళ్లిపోతానన్న పంతం!ఆమె పక్కనే కూలబడి, పొదివిపట్టుకుని, ‘‘మనకి ఎందుకమ్మా ఇలాటి పరువుతక్కువ పనులు! చక్కగా ఉందాం’’ అన్నాడు. అతని మొహం వంక దీనంగా చూస్తూ గడ్డం పట్టుకుని ‘‘మణీ నన్ను వెళ్లనివ్వా ప్లీజ్’’ బతిమలాడుతూ అంది. ఆమెని దూరంగా విసిరికొట్టి టపటప తల బాదుకున్నాడు. పొద్దున్నే ప్రశాంతి అమ్మానాన్నలకి మణి ఫోనుచేసి విషయం చెపుతుంటే– గదినుంచి బైటకివచ్చి చెప్పి వెళ్లడానికన్నట్లు పక్కన నిల్చుంది. అతనికి తిక్కరేగిపోయింది. ఫోన్ విసిరికొట్టే ముందు వాళ్ళపెంపకాన్ని ఓ బూతుమాటతో తిట్టాడు. ప్రశాంతిని బరబరా లాక్కువెళ్ళి మెయిన్ డోర్ అవతలకి నెట్టి, మొహాన దడాలున తలుపుమూసి, వెనక్కి తిరిగిచూస్తే టేబుల్ చాటునుంచి భయంగా నక్కినక్కి చూస్తున్న కొడుకు. వాడిని గట్టిగా పట్టుకుని బావురుమన్నాడు మణిశంకర్. చిన్నయిల్లు. బాల్కనీ మీదకి కమ్ముకొచ్చిన కాడమల్లిచెట్టు, నాలుగుగోడల మధ్య ఎటువంటి భయాలులేని ఏకాంతం. గుమ్మంలోకి అడుగుపెట్టగానే హాలుమధ్యన నిలబడి చేతులు చాపిన మాధవ. కంటిచివర్లు పిగిలిపోయేంతగా అతన్నేచూస్తూ, అన్నీ, అందరూ మాయమై తన విశ్వమంతా అతనొక్కడే. మూడురోజులు అవసరమైన షాపింగ్ చేస్తూ ఇల్లంతా సర్దుకుంటూ వండుకుని తింటూ ఒకరినొకరు విడవకుండా లంకెవేసుకుని తిరుగుతూ ఒకటే కబుర్లు. వాటికి అర్థంపర్థం ఏమీలేదు. పనికిమాలిన మాటలకి కూడా ఇంత ఆకర్షణ ఉన్నదా అని అబ్బురపడుతూ మూడుక్షణాలుగా గడిచిపోయాయి. నాలుగోరోజు భార్యకి చెప్పడానికి వెళ్ళిన మాధవ ఒకపూటంతా రాలేదు. మెట్లదగ్గర బెంగగా కూచుని ఎదురుచూసింది. మూడుసార్లు ఫోన్ చేసింది. అతను కట్ చేస్తూ ఉన్నాడు. సాయంత్రం నాలుగింటికి వచ్చాడు. రాగానే ఆమెని గట్టిగా కావిలించుకుని, ‘‘చెప్పేసాను. ‘కేసుపెడితే గవర్నమెంట్ ఉద్యోగం ఊడుతుందని భయంలేదా’ అంది. జీతం మొత్తం ఆమెకి అందే ఏర్పాటు చేస్తానని, కష్టంవస్తే నిలబడతానని చెప్పాను. అయిపోయిందిక, కానీ చాలా అన్యాయం చేశా వాళ్ళకి’’ దిగులుగా అన్నాడు. అయిపోలేదని ఇంకోగంట తర్వాత తెలిసింది. మాధవభార్య, ఆడపిల్లలిద్దర్నీ తీసుకుని బంధువులతో సహా వచ్చింది. ప్రశాంతిని కొట్టయినా మాధవని తీసుకుపోవడానికి. ప్రశాంతిని లోపలపెట్టి తాళంవేసి, తాళం జేబులో వేసుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడిపోయాడు మాధవ. ఎంతగొడవ జరుగుతున్నా అక్కడనుంచి కదలలేదు. అతన్ని చెప్పు తీసుకుని ఎడాపెడా కొడుతూనే ఉంది భార్య. ఎంతోముద్దుగా పెంచుకున్న పిల్లలిద్దరూ తండ్రిని చుట్టుకుని ‘నాన్నా భయంవేస్తోంది. ఇంటికి పోదాం’ అంటున్నారు. ‘రేపు వస్తానమ్మా’ మెల్లిగా చెపుతున్నాడు. మాధవ మొండికెత్తి ఉన్నవిషయం గ్రహించి నాలుగుదెబ్బలు వేసి కాండ్రించి మొహంమీద ఉమ్మి, వెళ్లిపోయారు వాళ్ళంతా. ఆర్నెల్లపాటు ప్రశాంతి, మాధవల్ని ఇళ్ళకి రప్పించడానికి చాలా జరిగాయి. విడదీయాలని చూసేకొద్దీ మరింత దగ్గరయ్యారు. ఉద్యోగాలకి వెళ్ళినపుడు తప్ప ఇల్లుదాటి ఎరుగరు. ఇంట్లోకూడా స్పర్శకి అందేంత దూరంలో ఉండేవారు. విడాకులు లేకుండానే రెండుజంటలూ విడిపోయాయి. మణిశంకర్ ఏడాదిలో మళ్ళీ పెళ్లిచేసుకున్నాడు. మాధవభార్య రోజుకి పదిసార్లు వాళ్లిద్దర్నీ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. కేవలం వాళ్ళిద్దరి మధ్యే అయితే చాలాగొప్పగా ఉంది. ఆటపాటలు, ముచ్చట్లు, రోజుకొక కొత్తవంట, టీవీలో నచ్చిన సినిమాలు చూడటం, నది ఒడ్డున రికామీగా కూచోవడం. ‘‘ఆమెకేమీ! ఇంకో ఆడదాని మొగుడిని తగులుకుని అసలామె ఉసురు పోసుకుని కులుకుతా తిరుగుతోంది’’ అని పక్కింటామె తను వినేట్లు ఎవరితోనో అంటున్నపుడు ఇద్దరి మధ్యా ఇంకా చాలామంది ఉన్నారన్నది తెలిసింది. ఇలాంటి మాటల వల్ల పాతసర్కిల్స్లో తిరగడానికి మాధవ ఇబ్బందిపడేవాడు. ‘మనం నిలబడాలి’ గట్టిగా చెప్పేది ప్రశాంతి. ఓసారి బజారుకి వెళ్ళినపుడు ప్రశాంతి– మాధవ భుజంమీద చెయ్యేసి ఏదోచెపుతూ నడుస్తుంటే ఉన్నట్లుండి చెయ్యిలాగేసి ఆమెవరో తెలీనట్లు గబగబా దూరం జరిగిపోయాడు. భార్య తరఫు బంధువును చూసి ఇలా చేశాడని తెలిసి ఇల్లు యుద్ధరంగమయింది. ఎంత పెద్దగొడవ అంటే ఇలా తిట్టుకోగలమని తమకే తెలీనంత విభ్రమ. తనచేతిని విసిరికొట్టి అతను దూరంగా పోవడం గురించి ప్రశాంతి పదేపదే నిలదీసి అడుగుతుంటే మాధవకి చాలా విసుగు, చిరాకు వచ్చాయి.‘‘బైటకూడా అంత రాసుకుపూసుకు తిరగాలా? ఉచ్చ ఇంట్లో పోసుకుంటాము గానీ బజారున కాదు’’ అనేసి వెళ్ళిపోయాడు. నిశ్చేష్ట అయింది ప్రశాంతి. తమప్రేమ దేనితో సమానమని అతనన్నాడు! రెండుగంటలు ఊరంతా తిరిగి ఇంటికి వచ్చిచూస్తే మణికట్టు కోసుకుని రక్తంకారుతున్న చేత్తో బాత్రూములో పడుంది ప్రశాంతి. అంత భయం జీవితంలో ఎరగడు మాధవ. నిలువెల్లా వణుకుతూ దగ్గరకి వెళ్ళాడు. తన చేతుల్లో గింజుకుంటున్న ఆమెని లేపి కూచోబెట్టి తలుపు ఓరగావేసి, ఫోను తీసుకుని బైటకి వచ్చేశాడు. మణికి కాల్ చేసి విషయం చెప్పి ‘హాస్పిటల్‌కి మీరే తీసుకువెళ్లాలి’ అన్నాడు. అటు చెప్పేది వినకుండా ఫోనుపెట్టేసి ఆగమాగంగా నడుస్తూ ఎటో వెళ్ళిపోయాడు. వచ్చాడు మణిశంకర్. తననిలేపి కారువైపు నడిపిస్తున్న అతని మొహంలో అంతులేని సంతృప్తిని మూతలు పడుతున్న కళ్లతో చూసింది ప్రశాంతి. తమ్ముడు వరసయ్యే డాక్టర్ దగ్గరికి తీసికెళ్లాడు మణి. మాధవ గవర్నమెంట్ ఉద్యోగి కనుక పారిపోయాడని, ఇంకా విడాకులు ఇవ్వలేదు కనుక కేసు తనమీదకి వచ్చే అవకాశం ఉందని, అందుకే తీసుకొచ్చాననీ చెప్పాడు. రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించి, నాలుగోరోజు ఆమె ఇంట్లో దింపాడు. కాడమల్లి చెట్టొకటే తోడుగా మరి నాలుగురోజులు గడిచాక బెరుగ్గా ఇంట్లో అడుగుపెట్టాడు మాధవ. మాటలులేవు. యుగాలుగా వేచిచూస్తున్న అద్భుతం నట్టింట్లోకి వచ్చినట్లు చేతులు చాపింది. పసిపిల్లాడిలా పరిగెత్తుకువచ్చి అంటుకుపోయాడు. కట్టువేసి ఉన్నచేతిని అపురూపంగా పట్టుకుని, ‘ఇక ఎవరికీ దేనికీ భయపడను, ఈ చెయ్యి విడిచిపెట్టను’ అన్నాడు. అదెంత నిజమైపోయిందంటే ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆ చేతిని వదిలేవాడుకాదు. వారి రిలేషన్ గురించి ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడుతున్నపుడు ఆమె మొహంలో స్థిమితపు నవ్వు ఎందుకు మెరిసేదంటే– మాధవ ఆమె మణికట్టు మీది గీతలని రహస్యంగా నిమురుతూ ఓదార్చేవాడు కనుక. ఇంటి జరుగుబాటు అంతా ప్రశాంతి చూసేది. తన జీతమంతా భార్య ఎకౌంటుకి పంపేసేవాడు మాధవ. అదికాక భార్యాబిడ్డలకి చేసిన అన్యాయం గుర్తువచ్చినపుడల్లా పిల్లలకి, భార్యకి బోనస్ డబ్బులతోనో ప్రశాంతి దగ్గర తీసుకునో బహుమతులు పట్టుకు వెళ్ళేవాడు. ‘ఎందుకివన్నీ! మనిషికి సాటి వస్తాయా?’ అని మాధవ భార్య ఏడ్చేది.ప్రశాంతికి ఆ అవకాశం లేదు. పిల్లాడిని కలవడానికి మణి ఒప్పుకోలేదు. ‘గట్టిగా అడిగేహక్కు నాకులేదు’ అనుకుంటుందామె. వాడిని చూసి అప్పటికే ఏడెనిమిదేళ్లు అయింది. తల్లిదండ్రులు ఆశ్రమ జీవితంలో మునిగిపోయారు. మాధవ తప్ప ఆమెకి ఎమోషనల్ బంధం ఎవరితోనూ మిగలలేదు. దానివల్ల కూడా అతనే ఆమెకి పూర్తిలోకం. మాధవ భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళినపుడల్లా ప్రశాంతికి మనసు కలుక్కుమంటూ ఉండేది. రాన్రానూ అది ఓపలేని కుళ్లుగా మారిపోవడం గ్రహించుకున్నపుడు పశ్చాత్తాపంగా అనిపించి కొంతడబ్బు మాధవ చేతబెట్టి పిల్లలకి ఏవైనా కొని పట్టుకెళ్లమని చెప్పేది. మాధవ రెండురోజులు వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళినపుడు గుండె బద్దలవుతున్నట్లు ఉండేది. ఆఫీసుకి పనిమీద వచ్చే కొత్తమనుషులతో స్నేహంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేసి ఆ కాలాన్ని దాటేది. ఓరోజు మాధవ భార్యాపిల్లలు అద్దెకి ఉంటున్న ఇల్లు అత్యవసరంగా ఖాళీచేయాల్సి వచ్చింది. అపుడు చాలా బాధపడ్డాడు. ఇకమీదట వారు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, ఒక ఫ్లాట్ కొనాలని చెప్పి లెక్కలు వేశాడు. లోనుపెట్టినా ముందుగా కట్టాల్సిన డబ్బు చాలడంలేదు. అతను ఇంట్లో దిగులుగా తిరుగుతుంటే చూడలేక బీరువాలో దాచిన నగలు పట్టుకొచ్చి ఇచ్చింది ప్రశాంతి. అయిదారు లక్షలు విలువైన నగలవి. ఇవ్వడానికి ఇంకేమీ మిగలనంతగా ఖాళీ చేసుకుంటున్న ఆమెని చూస్తే మణికిలానే భయంవేసింది మాధవకి. రెండేళ్ళు నలిగాక ఇల్లు పూర్తయింది. గృహప్రవేశంరోజు మాధవ, భార్యతోకలిసి పీటలమీద కూచుని సత్యన్నారాయణవ్రతం చేసాడని, పెద్దకూతురు ఇన్‌స్టాలో ఫోటోలు పెట్టినపుడు తెలిసింది ప్రశాంతికి. మాధవ ఆ విషయం తనదగ్గర దాచిపెట్టడం ఆమె తట్టుకోలేకపోయింది. పూర్తి ఒంటరినని అనిపించినపుడు ఆమెకి ఏడుపు రాలేదు. అవమానం, కక్షలతో దహించుకుపోయింది. పైకి నిమ్మళంగా ఉంది. మాధవ ఇంటికివచ్చాక ఎటువంటి గొడవపడే ఉద్దేశంలేని గొంతుతో ‘ఆఫీసులో పరిచయమయిన ఒకఫ్రెండ్ దగ్గరికి వెళ్లిపోతున్నానని, అతను భార్యకి దూరంగా ఒక్కడే ఉంటున్నాడ’ని చెప్పింది ప్రశాంతి. వ్రతం గురించి చెప్పకపోవడంవల్ల గాయపడుతుందనుకున్నాడు కానీ ఇంతశిక్ష ఊహించలేదు. బతిమలాటలు ఏడుపులు మొత్తుకోళ్ళు అయ్యాయి. ఫలితంలేదు. ప్రశాంతి తిండిమానేసి రెండురోజుల్లో వేలాడిపోయేసరికి ఇక తప్పలేదు. మాధవ స్వయంగా కారులో కాకినాడ తీసుకువెళ్ళి ఆమెచెప్పిన వ్యక్తి ఇంటిదగ్గర దింపి వెనుతిరిగి చూడకుండా బయల్దేరాడు. ఎవరూలేని చోట కారాపి తనచేతుల వంక నమ్మలేనట్లు చూసుకుంటూ– ‘‘ఈ చేతులతో నా అమ్మని, నా బంగారుతల్లిని ఎవరికో అప్పగించి వచ్చానా!’’ అని గొణుక్కుంటూ స్టీరింగ్ కేసి చేతులు బాదుకున్నాడు. ఇల్లు కదలకుండా తరుచూ గుమ్మంవంక చూస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ ఆమెకి ఇష్టమైన వంటచేసి డైనింగ్ టేబిల్ మీద ఉంచేవాడు. పక్కలు శుభ్రంగా దులిపి ఉతికిన దుప్పట్లు మార్చి, తువ్వాళ్ళు పువ్వుల్లా మడతపెట్టి– ఆమెకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసేవాడు. ‘నా అమ్మలు, నా బంగారం ఎక్కడా ఉండలేదు, వచ్చేస్తుంది చూడు’ అని కాడమల్లిచెట్టుతో పదేపదే చెప్పేవాడు. అతని నమ్మకం వమ్ముకాలేదు.రక్తంమడుగులో ఉన్న మనిషిని వదిలేసి పారిపోయి, అన్నీ బాగయ్యాక తిరిగొచ్చిన మాధవకోసం ఆమె ఎలా చేతులు చాపిందో అతనూ అంతే. తప్పిపోయిన గువ్వపిట్ట తిరిగొచ్చి గుండెమీద వాలినంత సంబరంతో హత్తుకున్నాడు. పొద్దున్నే కారేజీ కట్టుకుని వెళ్లొస్తానని తలూపి ఆఫీసుకి వెళ్ళిన మాధవ తిరిగిరాలేదు. ‘జీతాలు బహుమతులు ఎందుకు నాకు! మనిషి కావాలి’ అని తపించిపోయిన భార్య దగ్గరికి ఎట్టకేలకి జీవంలేని శరీరంతో చేరుకున్నాడు. ఆఫీసువాళ్ళు, బంధువులు, పాతస్నేహితులు అందరూ వచ్చారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న మాధవ భార్యాపిల్లల్ని చూస్తుంటే ఎవరికీ దుఃఖం ఆగడంలేదు యాభైఏళ్లకే అతనికి నూరేళ్ళు నిండిపోవడానికి ప్రశాంతి కారణంగా కనిపించింది మాధవ భార్య తరఫు వారికి. మణికి విషయం తెలిశాక, ఆ ఇంటికివెళ్ళి అక్కడ ప్రశాంతి కనపడక వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చిచూస్తే– పళ్ళెంనిండా వంటకాలు ఏవో పెట్టుకుని కిందామీదా పోసుకుంటూ ఆబగా తింటున్న ప్రశాంతి కనపడింది. అతనికేదో అర్థమయి జాలి కలిగింది. ‘‘వస్తావా, అక్కడికి వెళ్దాం.’’ అన్నాడు. అతనివంక అసహ్యంగా చూసింది. కాసేపు ఆగి ‘‘ఆ మాధవ చేతకాని పిరికిపంద. అతనికి, అతని కుటుంబానికి ఎంత పెట్టానో తెలుసా? ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? అతను మంచివాడు కాదు’’ అంటూ తలపోతలో చెప్పుకుంటూ పోతోంది. వింతగా చూశాడతను. మాధవ పోగానే ప్రశాంతి మారిపోయిందని వాళ్లిద్దరికీ పరిచయం ఉన్నవారు అనుకున్నారు. ఎవరు పరామర్శకి వచ్చినా మాధవని తిట్టిపోస్తూ ఉండేది. ఒంటికి అతుక్కున్న చర్మపు తీరున అతన్ని పోషణ చేసినామె ఇంత ద్వేషంతో ఎందుకు మాట్లాడుతుందో ఎవరికీ అర్థంకాలేదు. కాకినాడ ఫ్రెండుకి ఫోనుచేసి, ‘నీ దగ్గరికి వచ్చేస్తాను’ అంది ఓరోజు. భార్య తిరిగి వచ్చేసింది కాబట్టి తీసుకువెళ్లలేను అన్నాడతను ఇబ్బందిగా. ‘సరేలే చక్కగా బతకండి’ నవ్వుతూ చెప్పింది. ఎపుడు చూసినా పెద్దగా నవ్వుతూ, గలగలమంటూ సందడిగా ఉన్నట్లు కనబడేది. మాధవపోయిన నెలకి కాబోలు బజారులో అతని పెద్దకూతురు ఎదురైనపుడు ఇలాగే పలకరించింది. ఆమె నవ్వుమొహం చూసో, మరెందుకో! ఆ పిల్లకి ఒళ్ళుమండి నడిబజారులో ప్రశాంతి చెంపమీద లాగిపెట్టి కొట్టింది. చుట్టూ అందరూ అయ్యో అంటుంటే ‘నాకు ఇది చాలదు, ఇంకా కావాల’ని గొణుక్కుంటూ వచ్చేసింది. నాలుగునెలల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండేది. రోజుల తరబడి స్నానం చేసేదికాదు, పళ్ళు తోముకునేది కాదు. చేతికి ఏది దొరికితే అది తినేది. ఒకటే ఆలోచనలు. వాటిమధ్య వాళ్ళమ్మ ఎపుడూ అనేమాటలు ఓరోజు గుర్తొచ్చాయి. చాలా రిలీఫ్ అనిపించింది.అంతే! హుషారుగా లేచి అన్నిపనులూ చేసుకుంది. మాధవ వస్తువులు పదేపదే ముట్టుకుని, ఒంటికి పులుముకుని చివరికి శుభ్రంగా సర్దిపెట్టింది. అర్ధరాత్రయ్యాక పేపర్, పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టింది. ‘నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడు మేడమీద గాలిపటం ఎగరేస్తుంటే చేతినుంచి కొస, జారి గాలిపటం ఆకాశంలోకి ఎగిరిపోయిందట. నేను ఏడుపు లంకించుకుని గాలిపటాన్ని పట్టుకోడానికి కిందామీదా చూడకుండా పిట్టగోడ మీదకి ఎక్కి గాల్లోకి దూకబోతుంటే చివరి నిమిషంలో చూసిన నాన్న రెండుకాళ్ళూ పట్టుకుని వెనక్కి లాగారట. ఈ విషయం చిన్నప్పటినుంచీ వందసార్లు చెప్పి ‘దీనికి ఉన్మాదం ఎక్కువ’ అనేది అమ్మ. ఇపుడు కూడా నా రంగురంగుల గాలిపటం ఎగిరిపోయింది. వెతుక్కోడానికి వెళ్తున్నా. ఇక కాళ్ళుపట్టి వెనక్కిలాగేవాళ్ళు లేరు’– ఎవరూ క్షమించాల్సిన అవసరం లేని ప్రశాంతి. -
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
ఫ్యాషన్ మోజా? ఉందిగా శ్రీజా!
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్‌గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.కొన్ని నెలల్లోనే బొటిక్‌తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్‌ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్‌గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్‌గా పనిచేసింది.⇒ జెట్ స్పీడ్‌తో పరుగెట్టే ఫ్యాషన్‌తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్‌గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్‌లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్‌కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్‌గోపాల్ -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్‌వర్క్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్‌వెల్ట్‌తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్‌లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్‌ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్‌ను తిరస్కరించింది.⇒ బన్‌తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
యాప్‌రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్‌ఫోన్– స్మార్ట్‌ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్‌తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్‌ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్‌పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్‌తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్‌గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్‌లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్‌లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్‌డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్‌సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్‌లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్‌ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్‌దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్‌లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్‌గా నిలిచాయి. యాప్స్‌లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్‌టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్‌లో లాస్ట్ వార్, వైట్‌ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్‌తోపాటు నాన్ –గేమ్స్‌లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్‌లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్‌స్టైల్, టేబుల్‌టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్‌లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్‌లో భారత్‌లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్‌లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్‌కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్‌కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్‌బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్‌బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్‌బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్‌లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్‌బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్‌బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్‌తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్‌తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్‌తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా 17.91 శాతం -
అల్లుడు యముడు!
అజిత్‌కుమార్ లండన్‌లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటారు. అతడు లండన్‌లో ఉంటూనే, హైదరాబాద్‌లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్‌పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మియాపూర్ గోకుల్ప్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్‌కుమార్‌తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్‌లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు రమేష్‌కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్‌లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్‌లో ఉండే పూర్ణచందర్‌ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్‌ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది. శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్‌మన్ కొడుకు రమేష్‌ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్‌లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్‌కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్‌ను మళ్లీ హైదరాబాద్‌కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్‌పై అరెస్టు వారంట్‌ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్‌ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ∙శ్రీరంగం కామేష్ -
నిర్వర్ణం
‘ఒకరోజు నలుపు తెలుపు ప్రేమలో పడింది. కానీ ఈ తెలుపు ఆ నలుపుని తనూ ‘తెలుపు’ అయి రమ్మని, అలా మారితేనే ప్రేమిస్తానంటుంది. పాపం ‘నలుపు’! తను తెలుపుగా మారటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. పాల మీగడలు పాత్రలకొద్దీ తింటాడు. ఆకాశాన తెలతెల్లని మబ్బుతరగలపై రోజూ పొర్లుతాడు. సాగర కెరటాల నురగలపై స్నానాలు చేస్తాడు. ధవళ వస్త్రాలెన్నో చుట్టుకుంటాడు. తెల్లని పూలమాలలు లక్షలాదిగా ధరిస్తాడు. హంసలు, పావురాలు వంటి ఎన్నో తెలుపు రంగు పిట్టల రెక్కలను ఎరువు తెచ్చుకుని; ఎగురుతూ, దుముకుతూ క్షీరసాగరాలలో మునకలేస్తాడు. గుడులూ గోపురాలపైన వెలిగే శ్వేతకాంతుల దివ్వెల వెలుగులను తనలోకి స్వీకరిస్తాడు. నింగిచుక్కల తళుకులు తెచ్చుకుని దేహమంతా పులుముకుంటాడు. హేమంత వేళల హిమాద్రుల మంచుమంచెలపై ఎన్నో రాత్రులు శయనిస్తాడు. ఇన్ని చేసినా తీరా నలుపు– తెలుపును సమీపించిన ప్రతిసారీ నలుపుగానే ఉంటున్నాడు. ‘ఎప్పటికైనా నలుపు నలుపే గదా!’ అని దుఃఖిస్తున్నాడు. అలా వేల వసంతాలు వృథా అయిపోవలసిందేనా అని నలుపు ఎంతో బెంగపెట్టుకున్నాడు. చివరికి ఓ క్షణంలో జాలిపడిన తెలుపు నలుపుని దగ్గరకు తీసుకుంటుంది. ఒకే ఒక బిగి కౌగిలి! అంతే! ఆ రాత్రి నక్షత్రాలు నీలాకాశంతో ‘రహస్యంగా’ రమించాయట! నలుపు ప్రాణులన్నీ తెలుపు ప్రాణులను పెనవేసుకున్నాయి. రేయీ పగలూ కలిసి ఒకే మధుపాత్ర నుండి రతిఫలరసాలు తప్పతాగాయి. cవెలుగుల స్పర్శతో ఆ క్షణాన చీకటి ఛాయలన్నీ తీయని స్ఖలనాలు పొందాయట!ఉదయం విరిసింది. వేకువనే లేచి, తెల్లని ఉల్కలను రాలుస్తున్న తన పైటకొంగును సర్దుకుని లేచి వెళ్ళిపోబోతున్న ‘తెలుపు’ చేతిని గట్టిగా పట్టుకుని లాగి ‘అదేంటి? నన్నెందుకు విడిచి పోతున్నావు?’ అని నిలదీస్తాడు నలుపు. అతని బేలతనం చూసి నవ్వుకున్న తెలుపు ‘ఈ లోకం ఏనాడో అనాదిగా నలుపు– తెలుపులుగా విడిపోయిందోయ్! ఎప్పుడైనా, ఎక్కడైనా వాటి మధ్య ఉండే పలుచని విభజన రేఖలు ఒకవేళ ఎవరైనా శాశ్వతంగా చెరపగలిగితేనే, చీకటి వెలుగుల సంగమాల సంజెపొద్దుల్లోనే మనకు శాశ్వత కలయిక సాధ్యం! అప్పటివరకు సెలవా మరీ!’ అంటూ శ్వేత వలయాలుగా పైకి లేచి పరిసరంలోని ప్రతి తెల్లని జీవ నిర్జీవ పదార్థాలలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది తెలుపు! నలుపు ఎంతో నిస్పృహతో తన కన్నతల్లి అయిన నిశీధి ఒడిలో తలవాల్చి పడుకొని విశ్వంలో కృష్ణబిలాలకు ప్రభాత వేలుగురేఖల కుంచెలతో తెలుపు రంగులద్దుతున్నట్లుగా తెల్లవారు ఝామున కలలు కంటూ ఇంకా తన ప్రేయసి ‘తెలుపు’ తలపులలోనే బతుకెళ్ళదీస్తున్నాడు. యుగాల నిరీక్షణ అది. అయినా నలుపు నలుపే, తెలుపు తెలుపే గదా! వాటి సంగమం అసాధ్యం. సాధ్యమైనా అది క్షణ భంగురమే కదా!’‘ఇప్పుడది ఎందుకే అంత పెద్దగా చదువుతున్నావు?’‘మొత్తం మీద భలే లౌక్యంగా రాశావే మామ్మా, సో క్రాఫ్టీ!’‘తమరి పొగడ్తలేం నాకవసరం లేదులే!’‘సర్లేవే! ఇంతకీ ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన మహానుభావులెవరో? గట్టిగానే లాబీయింగ్ చేసినట్టున్నావు. మూడొందల పేజీల ముచ్చటైన అబద్ధాలు– అబ్బో! ‘కాల–శ్వేత సంగమం’ అంటూ తమరి ఈ మహావచన కావ్యానికి ఆ టైటిలొకటి! అంతా వొట్టిదే!’’‘నోర్ముయ్! వొట్టిదో గట్టిదో మరి నువ్వూ ఇలా రాయవే చేతనైతే!’‘రాస్తాను.. రాస్తాను.. కానీ ఇలా కాదు!’‘అబ్బో! మరెలా?’‘నే రాస్తే నీలా కాదులే, రాసిందే జీవిస్తా! జీవించేదే రాస్తా!’‘రాసేది అంతా చూసేదేనే ఫూల్! చేసేది కాదు!’‘ఏం? చేసేది రాస్తే? ఒకట్రెండు పుస్తకాల్లోనైనా తమరు చేసింది రాస్తే బాగుండేది!’‘గమ్మునుండవే పిల్లా! భయమెరుగని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!’‘నువ్వే గమ్మునుండవే! వృద్ధనారీ పతివ్రతా! నాకూ వచ్చు సామెతలు’‘ఎంతగా బరితెగిస్తున్నారే మీ తరం!’‘మీ తరాలేమన్నా తక్కువ తిన్నారా ఏంటి?’‘ఏం తెలుసే మా గురించి నీకు కోణంగిదానా?’‘క్లబ్బులూ పబ్బులూ చాలా ఉండేవిగా మీ అభ్యుదయ రైటర్స్ గ్యాంగులకు! ఏ అర్ధరాత్రో, అపరాత్రో గూళ్ళకు చేరుకునేవాళ్ళటగా!’‘ఏయ్.. నోర్మూయ్!’‘హేయ్.. నువ్వే మూసుకో!’‘నువ్వా కులం తక్కువోడితో కులికొచ్చినట్లు కాదులే!’‘ఐతే కులం ఎక్కువైనోళ్లతో గెలుక్కోవచ్చన్న మాట– మీలా!’పొగలు సెగలు కక్కుతూ బామ్మ చెప్పు తీసుకొని కొట్టటానికన్నట్లు చేయి పైకి లేపింది. మనుమరాలు వేగంగా కదిలి, బామ్మ చేతినలాగే ఒడిసి పట్టుకొని ఆమెను విసురుగా నెట్టేసింది. గోడకు కొబ్బరికాయలా తగిలిన బామ్మ తల పగిలి కిందికి జారుతూ ఉంటే ఆ గోడపై సన్నగా, బారుగా ఓ నెత్తురు చిత్తరువును అద్దినట్లయింది. అన్ ఫోర్స్డ్ ఎర్రర్ అయినా, ఆవేశపు అనర్థం అనుకున్నా, మొత్తం మీద జరిగింది వర్ధమాన రచయిత్రి చేతిలో వెటరన్ కవయిత్రి దుర్మరణం.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, మూడుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తీసుకున్న శ్రీమతి సత్యవేణమ్మ హత్య. ఆవేశపరురాలైన ఆమె మనవరాలు విశ్వంభరనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అయితే, ఇంట్లో వాళ్లు తన కులాంతర ప్రేమ వివాహానికి అంగీకరించక హింసించటం వల్లనే అసలిదంతా ఒక్క క్షణంలో ఆవేశకావేశాలు కమ్మి జరిగిపోయిందని హత్యకు పాల్పడ్డ మనవరాలు చెబుతోంది. అతి ఆవేశపరురాలు అయిన ఆ మనవరాలిని సత్యవేణమ్మగారి గదిలో కాకుండా వేరే గదిలో నిర్బంధించి వున్నట్లయితే మహారచయిత్రి ప్రాణాలు నిలిచి ఉండేవని పోలీసులు, నేర నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నారు. మన దేశంలో యువతలో ముఖ్యంగా యువతుల్లో నానాటికీ చెలరేగుతున్న హింసా ప్రవృత్తిని చర్చించటానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు జాయినవుతున్నారు ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు, గొప్ప మహిళా అభ్యుదయవాది, మహావక్త శ్రీమతి మౌనమ్మగారు, అలాగే నేషనల్ మెన్స్ రైట్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ శ్రీ వాగేశ్వర్రావుగారు. చర్చకు ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్!చాలారోజులపాటు ఆ ఒక్క వార్త నాన్–వెజ్ చానళ్ళ నోటికి నల్లిబొక్కలా, వెజిటేరియన్ చానళ్ళకు ఆవకాయ ముద్దల్లా రుచిగా నలిగింది.∙∙ ‘ఒకరోజు తెలుపు నలుపుని ప్రేమిస్తుంది. నలుపు కూడా తెలుపుని ఇష్టపడతాడు. నలుపు తామిద్దరం కలవటం లోకానికి ఇష్టముండదని, ఒకవేళ కలిసినా లోకం సహించలేక తమను అంతం చేస్తుందని, అందుకే నలుపు తన ప్రియురాలు తెలుపుని తనలా ‘నలుపు’గా రూపాంతరం చెంది తిరిగి రమ్మని కోరుకుంటాడు.పాపం ఆ తెలుపు తాను నలుపు కావటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతిలోని కాటుక వర్ణాలన్నీ సేవిస్తుంది. అగ్గిని తొక్కుతుంది. బుగ్గిని బుక్కుతుంది. నిశరాత్రుల గుండెల్లోని తమస్సునంతా తాగుతుంది. కారు మేఘాలను, కాకులూ కోయిలల రెక్కలను ఎరువు తెచ్చుకుని ఎగురుతుంది. నీలి సంద్రపు గర్భాల అంధకారపు నీడలతో తానమాడుతుంది. కృష్ణపక్షపు నీలిమనంతా గంధలేపనాలుగా పులుముకుంటుంది. పాతాళపు ఛాయలు భుజిస్తుంది. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకెళ్ళి భీకర రక్తమాంసాలు పారే వైతరణీ నదిలో యమకింకరుల చేతుల్లో గాలాలకు దొరికిన చేపల్లా వేలాడుతూ, భీకర ఘోషల ప్రతిధ్వనులతో నిండిన శాపగ్రస్థులైన వారి ఆత్మల్లో దాగి ఉన్న పశ్చాత్తాపపు చీకటిని సేవించి, పున్నమి జోత్స్నల వెన్నెల రేఖ ఒక్కటి కూడా తనపై పడకుండా జాగ్రత్తగా ఆకాశ వీథులు దాటి బయలుదేరింది. అలా తెలుపు తాను నలుపు రంగు ముగ్ధమనోహరియై సందెపొద్దుల్లో తన ప్రియుని బిగికౌగిళ్లలో కరిగిపోవాలని ఆశగా ఎగిరొస్తుంటే, తన సొంత తెలుపుజాతి వాళ్లే దారుణంగా దాడిచేసి, ‘ఏమే నీచపుదానా! మన జాతి వర్ణాన్నే మార్చాలని చూస్తావే? హంసలా పుట్టి కాకిలా మారటమేంటే భ్రష్టురాలా!’ అంటూ నలుపుగా మారిన తెలుపుపై చెప్పలేని అశ్లీల భాషను ఉపయోగించారు! ఆ నలుపుగా మారిన తెలుపుని పాతకాలంనాటి పెద్ద పెద్ద గంగాళాలలో పురాతన వర్ణ ద్రావకాలలో ముంచి సంప్రోక్షణలు, శుద్ధి క్రియలూ చేసి దానిని మళ్లీ తెలుపురంగులోకి మార్చి వదిలేశారు! అయ్యో పాపం తెలుపు! గుండెలు పగిలే దుఃఖంతో విలపిస్తూ, తను మళ్లీ నలుపు దగ్గరకు తిరిగొచ్చింది. విషయమంతా గ్రహించిన నలుపు తన ప్రేయసి తెలుపుని దగ్గరకు తీసుకొని విశ్వమంత ప్రేమను పంచి శాశ్వత సంగమంతో తనలో కలిపేసుకుంటుంది. ఆశ్చర్యంగా అనంతర యుగాలలో ఈ నలుపు–తెలుపులు రెండూ కూడా క్రమంగా తమ తమ రంగుల్ని విడిచి ‘నిర్వర్ణం’ కాసాగాయి.’‘ఎందుకమ్మా ఆ ఇంట్రోని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదువుతున్నావు?’‘అబ్బ బామ్మా! ఇంత లోతుగా రాశావంటే నువ్వు ప్రపంచాన్ని ఎంత బాగా చూసి ఉంటావు!’‘నే చూసింది మాత్రమే రాయలేదే!’‘మరి?’‘నేను చేసింది, నాకు నే చేసుకుంది, లోకం నాకు చేసిందీ కూడా!’‘నిర్వర్ణం– ద కలర్ ఈజ్ డెడ్’– ‘అసలీ పుస్తకం టైటిలే అమోఘం బామ్మా! ఈ పుస్తకానికి ఒకే ఏడాది సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు, బుకర్ ప్రైజ్ రావటం రియల్లీ ఆసమ్! యు మేడ్ హిస్టరీ, గ్రాండీ!’‘ఈ అవార్డులు రివార్డుల కన్నా నా మనవరాలులాంటి ఎంతోమంది యూత్ నా పుస్తకాలు చదివి, స్పందించటం అతి గొప్ప ప్రశంస అమ్మా! రోజూ ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్‌లో..’ అంటూ మనవరాలి నుదుటిపై ఓ తియ్యటి ముద్దిచ్చింది విశ్వంభర. ‘గ్రేట్ బామ్మా! కీప్ రాకింగ్!’‘షాకింగ్ టూ బేబీ!’ఇద్దరూ ఒక్కసారే ఫెళ్లుమని నవ్వారు.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద రచయిత్రి శ్రీమతి విశ్వంభరకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం, ఈ ఉదయం ఆమెకు అవార్డు ప్రకటించిన భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ. ఒక భారతీయ మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, బాహాటంగా రాయగలగడం మహా సాహసం అని అవార్డు కమిటీ సభ్యులు విశ్వంభరను ప్రశంసించారు. చిన్ననాడు తను ఈడుకొస్తున్న రోజుల్లో తన మేనమామ వెంటబడి ఎలా హింసించాడో, తాను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటానంటే తన తండ్రి తనను ఎలా గృహనిర్బంధంలో ఉంచాడో, ఆ సమయంలో తనను బంధించిన గదిలో మేనబావలు నీచంగా, నిర్లజ్జగా ‘ఆ జాతి తక్కువ వాడితో కాకపోతే మనలోనే ఎవడో వరసైనవాడిని తగులుకోరాదటే!’అంటూ తనపై తోడేళ్లలా ఆ రోజు ఎలా దాడికి సిద్ధమయ్యారో– ఇవన్నీ తెలిసి కూడా ఖండించని తన బామ్మ, అభ్యుదయ రచయిత్రి అయిన శ్రీమతి సత్యవేణమ్మతో ఒక సందర్భంలో మాటా మాటా పెరిగి చివరికి వారిరువురి మధ్యన జరిగిన చిన్న పెనుగులాటలో సీనియర్ రైటర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవటం ఎలా జరిగిందో; అదంతా అన్ ఫోర్స్డ్ ఎర్రర్లా జరిగిందని తాను పశ్చాత్తాపంతో ఎంత మొత్తుకున్నా ఎవరూ అర్థం చేసుకోలేదని; చివరికి తాను జైలుపాలైనప్పుడు సైతం జైలు అధికారుల్లో ఒకడు దారుణంగా భయపెట్టి తనను ఎలా శారీరకంగా దోచుకున్నాడో; ఇదంతా తెలిసీ తను విడుదలైన తర్వాత తనను స్వీకరించి వివాహం చేసుకున్న భర్తతో కూడా సంసార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అనుభవించిందో; భర్త మరణం తర్వాత ఒంటరిదై ఒక తోటి నవలా రచయితతో తను స్నేహం చేసేటప్పుడు ఇంటా బయటా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నదో– అలాంటి ఎన్నో జీవితానుభవాల్ని ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రాసినందుకు శ్రీమతి విశ్వంభర ఎట్టి అవార్డుకైనా అర్హురాలేనని అభ్యుదయవాదులు అంటున్నారు. అయితే మాజీ నేరస్థురాలు, ముప్పయ్యేళ్లుగా తన రచనలతో హద్దుమీరిన స్వేచ్ఛను, తిరుగుబాటు ధోరణిని, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో ఆడవాళ్ళను తప్పుదారి పట్టిస్తూ వచ్చిన ఈ రచయిత్రికి ఇంత అత్యున్నత సాహితీ పురస్కారం ఇవ్వటం పట్ల అటు పురుషుల ఐక్య సంఘాల జేఏసీనే గాకుండా, ఇటు కొన్ని మహిళా సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ అవార్డు ప్రకటన అంశం గురించి చర్చించటానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవిపండితులు, సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ అవాకుల అప్పారావుగారు, ప్రముఖ అభ్యుదయవాది, ఎమ్మెల్సీ అయిన శ్రీమతి చెవాకుల సక్కుబాయిగారు– ఇంకా.................గారు, ................. గారు కూడా.’మొదటి వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’రెండవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’మూడవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’‘ఈనాటి ఈ బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా.... లైవ్ డిబేట్ ఇంతటితో ముగిసింది. నిత్యం ‘తాజా లొల్లి’ కోసం మన సత్యం‘బాజా’ చానల్‌ను వీక్షిస్తూనే ఉండండి– వీక్షిస్తూనే ఉండండి– తర్వాతి కార్యక్రమం ‘మేం వాగుతునే ఉంటం– మేం వాగుతునే ఉంటం’‘స్టే ట్యూన్డ్!’ -
ఇలాంటి భాగస్వామిని భరించడం కష్టమే!
కవిత హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కుమార్‌తో పెళ్లయి రెండేళ్లవుతోంది. కవిత కలుపుగోలు మనిషి, కుమార్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. దీంతో ‘నీ పని నువ్వు చూసుకోక అందరితో మాట్లాడతావెందుకు?’ అని దెప్పుతుంటాడు. చిన్న చిన్న పనులకు కూడా తప్పు పడుతుండేవాడు. ‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలువు’ అని తరచు అనేవాడు. కొన్నాళ్లకు కవిత కూడా కుమార్ మాటలు నిజమేనేమో అనుకోవడం మొదలుపెట్టింది. ‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే కుమార్ ఎందుకలా అంటాడు’ అని అనుకునేది. తనకేదో సమస్య ఉందనే ఆలోచనలతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. నిరంతరం ఆందోళనగా ఉంటోంది. ఒంటరితనం, భయం, నిస్సహాయత. ఎవరితోనూ మాట్లాడాలనిపించడంలేదు. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్నిరకాల టెస్టులు చేయించుకుంది. శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, ఒకసారి సైకాలజిస్ట్‌ను కలవమని సూచించారు. దాంతో కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన ఇంటి వాతావరణం గురించి, భర్త ప్రవర్తన గురించి వివరంగా చెప్పింది. మెల్లగా మంటపెడతారు... కవిత చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్‌కు గురవుతుందని అర్థమైంది. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొందరు చేసే మానిప్యులేషన్‌ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తాము గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్న విషయాన్ని బాధితులు గుర్తించలేరు. అసలా దిశగా ఆలోచించలేరు. అందుకే భర్త మానిప్యులేషన్ గురించి కవితకేం చెప్పలేదు.మూడునెలల్లో పరిష్కారం... మొదట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆందోళన తగ్గించుకునేలా సహాయం అందించాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. తాను గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్నానని అప్పుడు అర్థం చేసుకుంది. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్సైజ్లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను.స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ కవిత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. కుమార్ మాటలను పట్టించుకోవడం మానేసింది. కవిత ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న కుమార్ కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది. గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు» నువ్వు ప్రతిదానికీ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్. » అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. · నీకోసమే అలా చేశాను. » నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?» నేను నీకు చెప్పాను, గుర్తులేదా? » అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. » నీపట్ల నాకెప్పుడూ నెగటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగటివ్ గా చూస్తున్నావ్.మాయ మాటలు నమ్మొద్దు» గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. » గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా, చేసే పనులపై దృష్టి పెట్టాలి. » ‘నీకు పిచ్చి’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. » ‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకు గుర్తుందో అదే నిజమని గుర్తించాలి. »గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్‌కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. » గ్యాస్ లైటర్‌తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. » మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి. -
ఆమె కథ
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత. ‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత. ‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి. ‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత. ‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా. ‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. ‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా. ‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్! ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి. ‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా. ‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి. ‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా. ‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. ‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. ‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి. ‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా. తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి. ‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా. ‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి. ‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. ‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత. ‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా. ‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత. ‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్. ‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత. ‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. -
లవణాసుర సంహారం
కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు మధువు. దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను ఆదరించేవాడు. ఆపన్నులను ఆదుకునేవాడు. మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు. పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి, వరప్రసాదంగా ఇచ్చాడు. ‘నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది’ చెప్పాడు పరమశివుడు.‘పరమేశ్వరా! ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు’ ప్రార్థించాడు మధువు.‘అది కుదరదు. నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది’ అన్నాడు శివుడు.తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని, దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు. కుంభీనసి అనే దానవకాంతను పెళ్లాడాడు. కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు.పెరిగి పెద్దయ్యే కొద్ది లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు. కొడుకు చేష్టలకు మధువు కలతచెందేవాడు. కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుక్కు అప్పగించి, వరుణ లోకానికి వెళ్లిపోయాడు.తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శ్రుతిమించాయి. అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు. రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువుదీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చి, లవణుడి ఆగడాలను గురించి మొరబెట్టుకున్నారు. ‘రామా! లవణాసురుడు నానాటికీ శ్రుతి మించుతున్నాడు. ఎందరో రాజులను వేడుకున్నాం. వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు. రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం’ అని చెప్పారు.వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు.‘మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళతారు?’ అని అడిగాడు.ముందుగా భరతుడు ‘నేను వెళతా’ అంటూ సిద్ధపడ్డాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, ‘అన్నా! నువ్వు అరణ్యవాసం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు. ఇకనైనా భరతుణ్ణి సుఖంగా ఉండనివ్వు. నేను వెళ్లి లవణాసురుణ్ణి చంపి వస్తాను’ అని చెప్పాడు. ‘తమ్ముడా! నువ్వు సర్వసమర్థుడివి. నువ్వా రాక్షసుణ్ణి చంపి, అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో’ అన్నాడు. వెంటనే పురోహితులను పిలిపించి, శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు. ‘లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది. దానిని అతడు ఇంటివద్ద వదిలి, దూరంగా వెళ్లినప్పుడే అదను చూసి అతణ్ణి చంపాలి’ అని చెప్పి, అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు.శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు. లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్లి, పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉన్నాడు. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. ‘ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు. నీలాంటి వాళ్లెందరో నాకు ఆహారమైపోయారు. మర్యాదగా అడ్డు తొలగు’అన్నాడు లవణుడు. ‘నేను దశరథ పుత్రుణ్ణి. శ్రీరాముడి తమ్ముణ్ణి. నీతో యుద్ధానికి వచ్చాను’ నిదానంగా బదులిచ్చాడు శత్రుఘ్నుడు.‘అలాగా! నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి తమ్ముడివన్నమాట! నీ కోరిక తప్పక తీరుస్తాను. లోపలకు వెళ్లి నా ఆయుధాన్ని తెచ్చుకోనీ’ అన్నాడు. ‘చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను’ అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు. చిర్రెత్తిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి పెరికి, శత్రుఘ్నుడి మీదకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం మొదలైంది. చెట్లతో లవణుడు, బాణాలతో శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాడారు. పరస్పరం గాయపరచుకున్నారు. లవణుడు విసిరిన భారీ చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు.శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా, అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు.ఈలోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, లవణుడి మీదకు వదిలాడు. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి, పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది. లవణుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు. -
పన్నుపోటుండదు దేనికీ లోటుండదు
ఆ దేశాలలో ప్రజలకు ఆదాయపు ‘పన్ను’పోటు ఉండదు.అయినా అభివృద్ధికి, సంక్షేమానికి లోటు ఉండదు.పన్నులు లేకున్నా, ఖజానా నిండుగానే ఉంటుంది.అన్ని వర్గాల పౌరులకు సామాజిక భద్రత ఉంటుంది.పన్యాల జగన్నాథదాసుమన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్‌లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్‌లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్‌లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది. విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది. శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది.ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు. అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది.ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.యుఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్‌లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.ఉత్తర కొరియా రూటే సెపరేటు!పౌరులపై కొన్ని దేశాలు ఆదాయపు పన్ను విధించకపోయినా, ఇతరేతర పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తయితే, ఉత్తర కొరియా రూటే సెపరేటు! ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదాయపు పన్నునే కాదు, అన్ని రకాల పన్నులనూ 1974లోనే రద్దు చేసింది. నరకానికి నకలుగా పేరుమోసిన ఉత్తర కొరియాలో పౌరులకు ‘పన్ను’పోటు లేదు గాని, ప్రభుత్వం కోరుకున్నప్పుడు పౌరులు ఉచితంగా సేవలందించాల్సి ఉంటుంది. అణ్వాయుధాల తయారీలోను, క్షిపణి ప్రయోగాల్లోను తలమునకలుగా ఉంటూ తరచు వార్తలకెక్కే ఉత్తర కొరియాలో ప్రజాసంక్షేమం మృగ్యం.మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్‌లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్‌లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్‌లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది.విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది.శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది. ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు.అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.\యుఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్‌లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.‘పన్ను’పోటు లేని గల్ఫ్ దేశాలు⇒ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్⇒ ఖతర్⇒బహ్రెయిన్⇒సౌదీ అరేబియా⇒ కువైట్⇒ ఒమన్‘పన్ను’పోటు లేని చిన్న దేశాలుచమురు ఎగుమతుల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే గల్ఫ్ దేశాలు పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లోని మొదటి మూడు దేశాలైన వాటికన్ సిటీ, మొనాకో, నౌరు కూడా పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకుండానే మనుగడ సాగిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆదాయపు పన్ను ద్వారా ఖజానాకు రాబడి లేకపోయినా, ఈ దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో చూద్దాం.వాటికన్ సిటీ: పోప్ పాలనలో ఉండే వాటికన్ సిటీ క్రైస్తవులకు ప్రధాన కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ పౌరులెవరూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికన్ సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉండే రోమన్ కేథలిక్ క్రైస్తవుల ద్వారా వచ్చే స్వచ్ఛంద విరాళాలు, నగరంలో ప్రవేశానికి విదేశీయులకు విక్రయించే టికెట్లు, స్టాంపులు, నాణేలు, జ్ఞాపికల విక్రయాలు, పెట్టుబడులపై వడ్డీల ద్వారా భారీగా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. వాటికన్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా జరిపే ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది.మొనాకో: ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచే దేశం మొనాకో. ఇక్కడి పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకం, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల ద్వారా మొనాకోకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమ తమ దేశాల్లోని ‘పన్ను’పోటు తప్పించుకోవడానికి చాలామంది విదేశీయులు ఇక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటుంటారు.ఇక్కడి క్యాసినోలు భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వివిధ మార్గాల్లో గణనీయంగా ఆదాయం వస్తుండటంతో ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, మొనాకో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించగలుగుతోంది. మొనాకో ప్రభుత్వం తన పౌరులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు మాతృత్వ, పితృత్వ భృతి, పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పింఛన్ల చెల్లింపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.నౌరు: ఓషియానా ప్రాంతంలోని నౌరు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తుంది. నౌరు ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. చుట్టూ సముద్రం తప్ప మరే సహజ వనరులు లేకపోయినా, నౌరు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.చేపల వేటకు లైసెన్సులు, ఆశ్రయం కోరి వచ్చే శరణార్థుల నుంచి వీసా రుసుములు, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, విదేశాలలో నిర్వహించే బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా నౌరుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఏటా ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. నౌరు ప్రభుత్వం వార్ధక్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, జనన మరణాల భృతి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించని పలు చిన్నా చితకా దేశాలు ప్రధానంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పౌరసత్వం కోరుకునే విదేశీయుల నుంచి పెట్టుబడుల సేకరణ, రియల్ ఎస్టేట్, మత్స్యసంపద తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా సంపద సృష్టించుకుంటూ, ఇవి తమ పౌరులపై పన్నుభారం మోపకుండా మనుగడ సాగిస్తున్నాయి. -
స్టార్స్ లక్కీ చార్మ్
ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్‌గా మారిన ఆమె విశేషాలు..నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్లో ‘ఐ మేడ్ ఇట్’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్‌లో ఫ్యాషన్ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్ స్టార్ చేసింది. తొలి అవకాశమే అమితాభ్ బచ్చన్ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ సినిమాకు లీపాక్షి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. బ్లాక్ అండ్ వైట్‌తో పాటు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌తో మ్యాజిక్ చేసి, అమితాభ్ను సూపర్ చార్మింగ్‌గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూ, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్‌గా మారింది.ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్ గేమ్‌ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్ ఫార్ములాను వివరించింది లీపాక్షి.అందుకే, లీపాక్షితో స్టయిలింగ్ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడతారు. అమితాభ్తోపాటు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కు లీపాక్షీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. -
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్‌ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్‌ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్‌కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్‌ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్‌ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
నేషనల్ క్రష్మికా
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు అందుకుంది.⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్‌తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది.⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్‌గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది. ⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న. -
యువ కథ: మలిసంధ్య
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్‌లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్‌ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్‌పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్‌లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్‌ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్‌ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్‌కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్‌తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్‌ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్‌డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
నిర్మలాను ఎవరు చంపారు?
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్‌లోని కాంచన్‌పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్‌లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్‌లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్‌పూర్‌లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్‌సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్‌లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్‌ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్‌మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్‌దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్‌లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్‌ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. -
నాన్సీ త్యాగీ
లైఫ్‌స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్‌ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్‌ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్‌లోని తన అనుభవాలను, లైఫ్‌స్టయిల్ థింగ్స్‌ని, ఫ్యాషన్ టిప్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్‌కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్‌లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్‌సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
దూకుడుతో శిశురక్షణ
కార్పస్ క్రిస్టీ కేథలిక్ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్ ఫెస్టివల్’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్ కొలాచో’ (ది డెవిల్) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు. -
అక్కరలేని మనిషి
ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం; సకాలంలో పని పూర్తి చెయ్యటం; డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు. నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది. మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను. ‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది. ‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను. ‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది. ‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది. ‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్‌లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను‘పెళ్ళయిందా?’‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది ‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది. ‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ. ‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది. ‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా. ‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు. అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్‌లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!ఎవరిదో అన్నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.‘అవునండి!’ సమాధానం ఇచ్చాను. ‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది ‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది. బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా! ‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను. ‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను. ‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.‘అపార్ట్మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసే ఒకాయన.‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి అయ్యాడు. ఏ మనిషైనా అంతే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరగానే అక్కరలేని మనుషులుగా మారిపోతారు. వాళ్ళ మాటలు, ప్రవర్తనతో నాకు మనుషులంటేనే అసహ్యం వేసింది. తోటి మనిషి ఆపదలో వుంటే సాయం చెయ్యకపోగా, ఇలాగేనా మాట్లాడేది అని నాలో నేనే మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నా పరిస్థితి అర్థమయిన వాడిలా, ‘సార్! అపార్టుమెంట్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఓ పదివేలు ఇవ్వగలను’ అన్నాడు సెక్రటరీ. ‘దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా!’ అన్పాను అనుమానంగా.‘గణేశ్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను, ఫరవాలేదు లెండి’ అన్నాడుగణేశ్ నవరాత్రులంటే, కిక్కురుమనకుండా వేలకు వేలు చందాలిస్తారు. ఓ మనిషి ప్రాణం పోతోంది సాయం చెయ్యండి అంటే, ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏం మనుషులో ఏమో! ఎక్కడికి పోతోంది ఈ లోకం అనుకుంటూ, సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకుని అక్కడి నుంచి కదిలాను.నేను ఎదురుపడగానే, ‘ఏమైంది?’ అంటూ అడిగింది మా ఆవిడ. జరిగింది మొత్తం చెప్పాను.‘మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?’ ప్రశ్నించింది. ‘అదే అర్థం కావట్లేదు. తొందరపడ్డానేమో!’ అన్నాను. ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్లింది. ఏం చెయ్యాలి, లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, అనవసరంగా మాట ఇచ్చానా? అని నన్ను నేను తిట్టుకుంటూ సోఫాలో జారగిలపడి కళ్ళు ముశాను. రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయితే కళ్ళు తెరిచా. ఎదురుగా మా ఆవిడ చేతిలో డబ్బుతో.. ఓ క్షణం అర్థంకాక, ఆమెవంక ఆశ్చర్యంగా చూశాను. ‘మీరు హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత నాన్న వచ్చి వెళ్ళారు. నా పేరున రాసిన పొలం పంట తాలుకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు’ అంటూ నా చేతిలో డబ్బులకట్ట పెట్టింది.‘వీటితో నగలు చేయించుకుంటానన్నావు’ ‘పరవాలేదు లెండి ఓ మనిషి ప్రాణం కన్నా, నా నగలేమీ ఎక్కువ కాదు. మరోసారి చూద్దాం నగల సంగతి’ అంటూ ఓ చిన్న నవ్వు నవ్వింది.ఆ నిమిషాన మా ఆవిడని చూస్తుంటే, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి వుంది అనిపించింది. ఆనందంతో శ్రీమతి నుదుట ముద్దాడి, హాస్పిటల్లో డబ్బు కట్టుడానికి బయలుదేరాను.ఓ నెల రోజుల తరువాత పెద్దాయన వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు. ఈ నెల రోజులు ఎక్కడా కనపడకపోతే విశ్రాంతి తీసుకుంటు న్నాడేమో అని సరిపెట్టుకున్నాను. వాళ్లని చూడగానే, ‘ఎలా వున్నారు? రండి కూర్చోండి’ అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ. ‘కాఫీ తెస్తాను..’ అని లోపలికెళుతుంటే ‘వద్దమ్మా, ఒక్క నిమిషం ఇలా కూర్చో’ అంది పెద్దాయన భార్య. ఆవిడ మాటలు అర్థం కాక వాళ్ల ఎదురుగా కూర్చుంది మా ఆవిడ.‘అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు’ అని నాలో నేను అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ వుండిపోయాను. ఇంతలో పెద్దాయన తనతో తెచ్చిన సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి, ‘అమ్మా! ఇవి మా ఇంటి కాగితాలు, మా తదనంతరం నీ పేరున రాయించాను’ అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు.ఆ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము. ముందుగా తేరుకున్న మా ఆవిడ, ‘ఏంటండి, ఇదంతా, మేం ఏం సాయం చేశామని? ఆ లక్ష చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే పోయేదిగా!’ అంది.ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమయ్యింది. ‘లేదమ్మా! డాక్టరుగారు కాస్త పని తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. మీ డబ్బు చెల్లించే దారి నాకు కనపడటం లేదు. అయినా నా ప్రాణాలు కాపాడిన మీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నా కూతురుకి ఇస్తున్నాను అనుకో అమ్మా!’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లోనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేక పోయింది. నిన్నటి దాకా వాళ్ళు ఎవరో, ఊళ్ళోవాళ్ళు అన్న మా ఆవిడను వాళ్ళు సొంత కూతురిలా భావించటంతో మా ఆవిడ మనసులో నుండి పెల్లుబికిన ప్రేమబాష్పాలవి. ఆ నిమిషాన మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి, మళ్ళీ నమ్మకం ఏర్పడటం మొదలయ్యంది. మనిషికి మనిషి సాయం చెయ్యటానికి స్నేహితుడో, బంధువులో కానక్కరలేదు. కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు. అలా గుండెల్లో తడి ఉన్న మనుషులే నిజమైన ఆత్మబంధువులు అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను, తను కూడా ఆనందంతో నా వంకే చూస్తోంది. ‘కాగితాలు తీసుకోవద్దు’ అన్నట్టు సైగ చేశాను. అలాగే అంటూ తల ఆడించింది. -
అంతా ప్రేమమయం...
అలనాడు భక్త రామదాసుకు అంతా రామమయంగా, జగమంతా రామమయంగా అగుపించింది గాని, ప్రేమికులకు మాత్రం అంతా ప్రేమమయంగా, జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ప్రేమికులు జరుపుకొనే రోజు కాబట్టి ఇది ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలయ్యాక ప్రపంచీకరణ నేపథ్యంలో పలు విదేశీ వేడుకలు మన దేశానికీ పాకాయి. మూడు దశాబ్దాలకు ముందు మనవాళ్లకు వాలంటైన్స్ డే ఏమిటో తెలీదు. వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అని ఇప్పుడు అందరికీ తెలుసు. దీనికి కారకుడైన సెయింట్ వాలంటైన్ చరిత్ర గురించి కూడా జనాలకు కొంతవరకు తెలుసు. అయితే, వాలంటైన్స్ డే గురించి చాలామందికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదైన విశేషాలు మీ కోసం..» వాలంటైన్స్ డే నేపథ్యం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటిది. అప్పట్లో రోమన్ ప్రజలు ‘లూపర్‌కేలియా’ పేరుతో సంతాన సాఫల్య వేడుకను ఫిబ్రవరి 13–15 తేదీలలో జరుపుకునేవారు. వారు ఈ వేడుకలో సంతాన సా«ఫల్యానికి అధిదైవమైన లూపర్కస్ను ఆరాధించేవారు. ఈ సందర్బంగా జంతుబలులు ఇచ్చేవారు. పోప్ గెలాషియస్–ఐ క్రీస్తుశకం ఐదో శతాబ్ది చివరి రోజుల్లో ‘లూపర్‌కేలియా’ వేడుకను నిషేధించి, దాని బదులుగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ప్రవేశపెట్టాడనే కథనం ఉంది.»సెయింట్ వాలంటైన్ ఒకరు కాదు, ముగ్గురు అని కూడా చెబుతారు. విచిత్రంగా వీరిలో ఇద్దరు క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటి రోమన్ పాలకుడు క్లాడియస్–ఐఐ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే! యుద్ధ సమయంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోరాదన్న క్లాడియస్– ఐఐ ఆజ్ఞలను ఉల్లంఘించి, రోమ్ నగరంలో సైనికులకు ప్రేమ వివాహాలు జరిపించినందుకు సెయింట్ వాలంటైన్ మరణశిక్ష పొందాడు.ఈ కథనం చాలామందికి తెలిసినదే! రోమ్కు చేరువలోనే తెర్ని పట్టణానికి చెందిన సెయింట్ వాలంటైన్ పేరు గల మరో వ్యక్తి కూడా క్లాడియస్–ఐఐ చేతిలో మరణశిక్షకు గురయ్యాడు. అయితే, కేథలిక్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం సెయింట్ వాలంటైన్ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట!» సైనికులకు పెళ్లిళ్లు జరిపించాడనే అభియోగంపై సెయింట్ వాలంటైన్‌ను క్లాడియస్–ఐఐ నిర్బంధించాడు. చెరసాల నుంచి సెయింట్ వాలంటైన్, చెరసాల పర్యవేక్షకుడి కూతురికి ప్రేమలేఖ రాశాడు. దాంతో అప్పటి వరకు చూపులేని ఆమెకు చూపు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే, సెయింట్ వాలంటైన్‌కు క్రీస్తుశకం 270 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలు చేశారు. » వాలంటైన్స్ డే వేడుక ఖండాంతరాలకు పాకిన తర్వాత వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు గిరాకీ పెరిగింది. తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు ఆధునిక కాలానికి చెందినదై ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో లండన్ టవర్ జైలులో బందీగా ఉన్న ఖైదీ అక్కడి నుంచి తన భార్యకు బొమ్మలతో కూడిన ప్రేమలేఖ రాశాడు. బహుశా అదే తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు అని చరిత్రకారులు భావిస్తారు. ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లో వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులు బాగా ప్రాచర్యంలోకి వచ్చాయి. » పాశ్చాత్య ప్రపంచంలో పదిహేడో శతాబ్దం వరకు ప్రేమికులు చేతితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ఇచ్చి పుచ్చుకునేవారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఎస్తర్ ఏ హౌలాండ్ వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మార్చేసింది. పంతొమ్మిదో శతాబ్దిలో ఆమె స్వయంగా రూపొందించిన డిజైన్లతో అందంగా ముద్రించిన వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులను అమ్మడం ప్రారంభించింది. ఆమె వ్యాపారం అనతి కాలంలోనే అమెరికా అంతటా విస్తరించింది. దీంతో ఎస్తర్ ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలంటైన్స్’గా ప్రఖ్యాతి పొందింది.» తాజా లెక్కల ప్రకారం వాలంటైన్స్ డే రోజున వివిధ దేశాల ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల సంఖ్య 15 కోట్లకు పైగానే ఉంటుంది. వీటికి తోడు చాక్లెట్ గిఫ్ట్ బాక్సులు, గులాబీల పుష్పగుచ్ఛాలు, బంగారు ఉంగరాలు, ఇతరేతర కానుకల సంఖ్య లెక్కలకు కూడా అందదు. ఏది ఏమైనా, వాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పర్వదినం. -
సుజాత ఏకపాదులు
ఉద్దాలక మహర్షి కూతురు సుజాత. ఉద్దాలకుడు ఆశ్రమవాసం చేస్తూ, గురుకులం నడిపేవాడు. అతడి వద్ద ఎందరో శిష్యులు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు వేదపఠనం చేస్తున్నప్పుడు సుజాత తరచుగా అక్కడకు వచ్చి కూర్చునేది. వారి వేదపఠనాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఒకరోజు సుజాత ఎప్పటిలాగానే పండ్లు, పాలు తీసుకుని తండ్రి వద్దకు వచ్చింది. ఉద్దాలకుడు కూతురిని తల నిమిరి, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమె రాకతో వేదాధ్యయనానికి కొద్ది క్షణాలు అంతరాయం కలిగింది. శిష్యుల చూపులు గురువుగారి వైపు, ఆయన గారాల కూతురి వైపు మళ్లాయి. గురువుగారి వైపు చూసే చూపులు భక్తి గౌరవాలతో నిండి ఉంటే, సుజాత వైపు చూసే చూపులు భయం భయంగా, చూసీ చూడనట్లుగా ఉండే దొంగ చూపుల్లా ఉన్నాయి. అక్కడ ఉన్న శిష్యులందరిలోనూ ఏకపాదుడి చూపుల్లో ప్రత్యేకత ఉంది. గురువుగారి వైపు అతడు చూసే చూపుల్లో భక్తి శ్రద్ధలు, సుజాత వైపు చూసే చూపుల్లో నిర్లిప్తత, నిరాసక్తత కనిపిస్తున్నాయి.శిష్యులు తిరిగి వేదాధ్యయనం ప్రారంభించారు. గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, ప్రతి స్వరాన్ని మననం చేసకుంటూ, ఒక్క పొరపాటైనా లేకుండా చెప్పగలిగేవాడు ఏకపాదుడు ఒక్కడే! గురువు ముఖతః వచ్చిన ప్రతి స్వరమూ అతడికి మరుక్షణమే కంఠస్థమయ్యేది. ఏకపాదుడు ఏకసంథాగ్రాహి.ఉద్దాలకుడు సాధుస్వభావి. శిష్యులకు ఎలాంటి ఆంక్షలు పెట్టేవాడు కాదు. అవసరమైన నియమాలను సూచనప్రాయంగా మాత్రమే చెప్పేవాడు. గురువుగారు చెప్పకపోయినా, ఏకపాదుడు స్వయంగా తనకు తానే కొన్ని నియమాలను విధించుకుని, క్రమశిక్షణతో పాటించేవాడు. గురువుగారి బోధనలను శ్రద్ధగా ఆలకిస్తూ, అధ్యయనం చేసేవాడు. ఏకపాదుడి గుణగణాలు ఉద్దాలకుడిని ఆకట్టుకున్నాయి. పసితనం నుంచే తండ్రి దగ్గర కూర్చుంటూ వేదాధ్యయనం వినడాన్ని అలవాటుగా చేసుకున్న సుజాతకు క్రమంగా ఏకపాదుడిపై ఆసక్తి పెరగసాగింది. అధ్యయనం కొనసాగుతున్నంత సేపు ఆమె ఏకపాదుడినే తదేకంగా చూడసాగేది. అతడి నిత్యకృత్యాలను గమనించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. రోజులు, నెలలు, ఏడాదులు గడిచిపోతున్నాయి. సుజాత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఏకపాదుడు యువకుడవుతున్నాడు. ఏకపాదుడిని చూడటం కోసమే సుజాత త్వరగా తన పనులు ముగించుకుని, అధ్యయనం సాగేటప్పుడు తండ్రి వద్దకు చేరేది. సుజాత రాక ఆలస్యమైతే, ఏకపాదుడి చూపులు ఆమె కోసం వెదుకులాడేవి.అధ్యయన వేళల తర్వాత మిగిలిన శిష్యులతో పాటు ఏకపాదుడు దర్భలు, అరణి, కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లేవాడు. ఏకపాదుడిని సుజాత అనుసరించేది. దర్భలు, పుల్లలు ఏరుకునేటప్పుడు కూడా అతడు వేదపాఠాలను మననం చేసుకుంటూ ఉండేవాడు. తన రాకను అతడు పట్టించుకోకుంటే, సుజాతకు కోపం వచ్చేది. అయితే, అతడి ఏకాగ్రచిత్తానికి లోలోపల మెచ్చుకునేది. ఒకనాడు గురువుగారి వద్ద కూర్చున్న సుజాత వైపు నుంచి ఏకపాదుడు ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోయాడు. అతి ప్రయాసతో చూపులను గురువుగారి మీదకు మరల్చాడు. చిత్తాన్ని అధ్యయనంపై కేంద్రీకరించాడు. ఉద్దాలకుడు అంతా గమనిస్తూనే, ఏకపాదుడి ఏకాగ్రతకు ఎంతో ఆనందించాడు. ఉద్దాలకుడి శిష్యులలో ఏకపాదుడు మిగిలిన శిష్యులందరి కంటే మిన్నగా అధ్యయనం పూర్తి చేశాడు. అతడికి ఇక బ్రహ్మచర్యం కొనసాగించవలసిన అవసరం లేదని ఉద్దాలకుడు నిర్ణయించాడు. ఒకనాడు ఉదయాన్నే ఏకపాదుడిని పిలిచాడు. ‘నాయనా! నీ అధ్యయనం పూర్తయింది. గురుకులం విడిచి స్వతంత్రంగా నువ్వే ఇతరులకు గురుత్వం వహించే స్థాయి పొందావు. నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు’ అని చెప్పాడు. ఏకపాదుడు వినయంగా గురువుకు పాదాభివందనం చేశాడు. అదే సమయంలో ఉద్దాలకుడు తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ‘నీకు సమ్మతమయితే, మా సుజాతకు నువ్వే తగిన వరుడివని నా నమ్మకం’ అన్నాడు.గురువుగారి మాటకు ఏకపాదుడు మహదానందం చెందాడు. ఈ సంభాషణను గుమ్మం చాటు నుంచి వింటున్న సుజాత కూడా ఆనందంలో తేలిపోయింది. గురువుగారి మాటకు ఏకపాదుడు వెంటనే బదులివ్వక నేలచూపులు చూడసాగాడు.‘ఏకపాదా! నీ అభిప్రాయం..’ అడిగాడు ఉద్దాలకుడు.‘గురువర్యా! తమరి మాట నాకు శిరోధార్యం’ అంటూ ఏకపాదుడు మరోసారి పాదాభివందనం చేశాడు.ఉద్దాలకుడు సుముహూర్తాన్ని నిర్ణయించి, తన కూతురు సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం జరిపించాడు. -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్‌గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్‌ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్‌క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్‌గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్‌ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్‌ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్‌ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్‌ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్‌లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్‌లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
అభినయ శోభన
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన -
రహస్యగదిలో బంగారు నిధి
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. -
బ్రెయిలీలో భగవద్గీత
అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలో రాశారు. ఎందరో అంధులకు భగవద్గీతను చదివే అవకాశం కల్పించాలనేదే అలూరుకు చెందిన అంధ ఉపాధ్యాయుడు బూర్ల తిక్కలక్ష్మన్న సంకల్పం. ఇదీ ఆయన స్ఫూర్తి గాథ..రామకృష్ణ, కర్నూలు కల్చరల్ఒకవైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే, బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాసిన బూర్ల తిక్కలక్ష్మన్న కర్నూలు జిల్లా ఆలూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర్ల హనుమన్న, నరసమ్మ. పదో తరగతి వరకు ఆలూరులోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ అంధుల కళాశాలలో ఇంటర్, టీటీసీ పూర్తిచేసి, బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత అలూరు మండలం మూసానిపల్లెలో 1993లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆలూరు మండలం హులేబీడు ప్రభుత్వ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్గా పనిచేస్తూ, మరోవైపు కర్నూలులోని ఒక కళాశాలలో బీఈడీ చదువుతున్నారు.చిన్మయి మిషన్ సహకారంచిన్మయి మిషన్ ఆదోని శాఖ సహకారంతో బ్రెయిలీ భగవద్గీతను 2001లో వెయ్యి కాపీలను ముద్రించారు. దీనిని ముంబైలోని చిన్మయి మిషన్ స్వామీజీ తేజోమయానంద చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్మయి మిషన్ అనుమతితో రెండోసారి కూడా బ్రెయిలీ భగవద్గీత ప్రతులను ముద్రించారు. వీటిని అప్పటి ఆలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ హేమ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య సహకారంతో ఆదోని లక్ష్మమ్మవ్వ జీవిత చరిత్రను మాస్టారు బ్రెయిలీ లిపిలో రాశారు.మాస్టారి సేవలు.. సత్కారాలు⇒ 2005లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.⇒ 2012లో కర్నూలులో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిల చేతుల మీదుగా సన్మానం. ⇒ 2004 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో గీతా జ్ఞాన యజ్ఞాల నిర్వహణ.⇒ 2014 నుంచి బ్రెయిలీ భగవద్గీత ఆలయం వద్ద ప్రతి ఆదివారం భగవద్గీత శ్లోకాల పోటీల నిర్వహణ. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.1000, రూ.500, రూ.300 చొప్పున నగదు బహుమతుల ప్రదానం.⇒ కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో ఆలూరులో బ్రెయిలీ భగవద్గీత ఆలయం నిర్మాణం పరిపూర్ణం.⇒ భగవద్గీతపై అవధానం కొనసాగిస్తున్న మొదటి అంధ ఉపాధ్యాయుడు లక్ష్మన్న. ⇒ 2020 ఏప్రిల్ 4న ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో మొదటిసారి భగవద్గీతపై అష్టావధానం నిర్వహణ. ఐదేళ్ల శ్రమ: బూర్ల తిక్కలక్ష్మన్న‘పుట్టుకతోనే అంధుడిని. నిరుపేదను. నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. నా తపన గమనించి మా నాన్న ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించారు. కృష్ణుడిపై భక్తి భావంతో బ్రెయిలీలో భగవద్గీతను రాయాలనుకున్నాను. తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాదరావు సహకారంతో భగవద్గీత 18 అధ్యాయాల్లోని 701 శ్లోకాలకు ప్రతి పదార్థ తాత్పర్యాలు రాసి, 300 పేజీల పుస్తకాన్ని ముద్రించాను. యజ్ఞంలా తలపెట్టిన ఈ పని పూర్తికావడానికి ఐదేళ్లు శ్రమించాను.మా తెలుగు ఉపాధ్యాయుడు శివశంకరయ్య చిన్నతనం నుంచి భగవద్గీత గురించి చెప్పారు. మరో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్ సహకారంతో భగవద్గీతను తెలుగు బ్రెయిలీ లిపిలో రాశాను. ఆయన నా భక్తికి మెచ్చి మేము కట్టించిన గుడికి రాధాకృష్ణుల విగ్రహాలను బహుమానంగా ఇచ్చారు. పిల్లల మనసు పరిశుభ్రమైన పలక వంటిది. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, భగవద్గీత, భాగవతం లాంటì వాటిని నేర్పించాలి. ఏటా మూడు నెలలు అన్ని పాఠశాలల్లో భగవద్గీత గురించి ప్రచారం చేస్తాం. తరువాత భగవద్గీత పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తున్నాం. భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మరిన్ని అవధానాలు నిర్వహించాలన్నదే నా లక్ష్యం. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్‌ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్‌వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్‌ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్‌తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు
ఒక చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్‌పై వదలడమో, రిమాండ్‌కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు. -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్‌కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్‌గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్‌కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్‌లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్‌పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్‌మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్‌ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. -
ప్రక్షాళన
‘ఆర్య బావ ఫోన్ చేశాడు నాన్నా, ఈవేళ మధ్యాహ్నం రెండుగంటల బస్సుకి వస్తున్నాడట!’బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది. మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపూ, జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది.పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారంలాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త! పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషప్పురుగు కుట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్య దారిలోనే ప్రాణాలు పోయాయని! నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది. అమ్మ శోకాలు మొదలెట్టింది. విషయం తెలిసి పరామర్శకి వచ్చిన చుట్టపక్కాలంతా ‘పుడుతూనే తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు’ అంటూ నా మేనల్లుడిని దూషిస్తుంటే వినలేకపోయాను. పసివాడిని హత్తుకుంటూ ‘ఆపండి! పసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తోంది’ అంటూ వాళ్ళందరి నోర్లూ మూయించింది నా భార్య సుజాత. ఆ తర్వాత నాతో ‘మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి’ అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకి కదిలేను. టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము.భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క. తనతో పాటే అమ్మ కూడా! అది చూసి, వయసులో చిన్నదైనా తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని, బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత. దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని, బాబుని తీసుకొని తిరిగొచ్చేశాము.బావ చనిపోయిన ఆరుమాసాలకి ‘రామం, ఒక్కమారు ఊరికి వెళ్లి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా! ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనల్లుడి పేరున రిజిస్టర్ చేయించుకునిరా’ అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా!‘అమ్మా! బావ వాళ్లకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు, పంపకాల గురించి మాట్లాడ్డానికి!’ అన్న నా మాటలకి, వెంటనే ‘అదేం మాటరా? ఇల్లూ, రెండెకరాల పొలమూ లేవూ! మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆ ఆస్తి మొత్తానికీ హక్కుదారు వీడేగా! మనం వెళ్లి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది’ అంది అక్క.‘అది చెప్పేదీ నిజమేరా, దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయమాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు’ ఆర్డర్ వేసింది అమ్మ. మరుసటి రోజే బావ వాళ్లూరికి ప్రయాణమయ్యాను.వాళ్ళింట్లో నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కూర్చున్న మూడుగంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులని అంచనా వేస్తూనే వుంది. పెచ్చులూడుతున్న గోడలూ, పై పెంకుల మధ్యనుండి తొంగి చూస్తున్న మబ్బుతునకలూ, వాటిగుండా కిందకి జారుతున్న వానచినుకులూ, ఇంకా ఆ అక్కాచెల్లెళ్ళ చిరుగుల బట్టలూ.. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కళ్ళెదుట నిలిచినట్టనిపించింది. ఉన్న ఆ రెండు ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకీ, ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికే అరకొరగా సరిపోతోందేమో!భోజనాల అనంతరం ఆ పెద్దావిడ ‘కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతురిని పుట్టింటికి పంపించేస్తే, రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు’ అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు. పాతికేళ్లు నిండిన చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నేను బతికుండగా దీని పెళ్లి చూస్తానో, లేనో’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ మాటలకి ‘అధైర్యపడకండి. మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి’ అంటూ ఓదార్చాను. బావ బాధ్యతలను పంచుకోని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను. ఒట్టి చేతులతో నేనలా వెనక్కొచ్చేయడం అమ్మకి, అక్కకి బొత్తిగా నచ్చలేదు. సుజాత మాత్రం ‘మంచి పని చేశారు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని బాధపెట్టడం మనకి శ్రేయస్కరం కాదు’ అంది.రెండేళ్ళ తర్వాత మాకూ బాబు పుట్టాడు. అంతదాకా ‘బాబూ’ అని పిలుస్తున్న నా మేనల్లుడికి ‘ఆర్య’ అనీ, నా కొడుక్కి ‘అంకిత్ ’ అనీ నామకరణం చేసి, ఇద్దరినీ రెండు కళ్ళలా చూసుకోసాగాం. వాళ్ళిద్దరూ బావామరుదులే అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండడంతో కుట్టుపనులు చేస్తూ, చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత. ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున, అక్కయ్య ‘లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజినీరింగు చేస్తే లక్షల్లో సంపాదన వుంటుంది. జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు’ అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది. ‘పిల్లలకి ఆసక్తిలేని చదువులని వాళ్ళపై రుద్దడం మంచిది కాదు అక్కయ్యా! వాడికిష్టమైన కామర్సు చదివి, ఆపైన బ్యాంకు పరీక్షలు రాసి, పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడులెద్దూ’ అంటూ నచ్చజెప్పి వాడిని కామర్సు గ్రూపులో చేర్పించాను.ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది. నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూర్లోని బడికి బదిలీ అయింది. పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి, నేనొక్కడినే వెళ్లాను. ఆర్యని డిగ్రీ కాలేజీతోపాటు బ్యాంకు పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను. అలాగే అంకిత్‌ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్సు గ్రూపులో చేర్పించి, ఎంసెట్ కోచింగులో పెట్టాను. ఏడాదిన్నర కాలం ఏ సమస్యలూ లేకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్! దానికి మించిన దుర్వార్తని మరో ఆరునెలల్లో వినాల్సి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.ఆ దుర్దినాన.. అల్మారా అంతా కిందా మీదా చేస్తున్న నన్ను చూసి ‘దేనికోసమండీ, అంతలా వెతుకుతున్నారు?’ అడిగింది సుజాత.‘అంకిత్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. అవసరాలకెప్పుడూ ఆదుకునే షావుకారు, ఈమారు పెద్దమొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు. వాటి కోసం వెతుకుతున్నాను’ అన్నాను.‘ఆ మధ్యెప్పుడో అత్తయ్యగారు, వదినగారు ఆ పత్రాలని తీసుకున్నారండీ. మళ్లీ ఇక్కడ పెట్టారో, లేదో! ఉండండి, వదినగారిని అడుగుతాను’ అని సుజాత అంటుండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ‘ఏమిటిరా, ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరానా పడుతున్నారు?’ అడిగింది.‘ఇంటిపత్రాల కోసం అక్కయ్యా ..’ అని చెబుతుండగానే ‘అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని, వాటితో నీకేం పనిరా ఇప్పుడు?’ అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది.‘హమ్మయ్య, ఇంటి దస్తావేజులు ఎక్కడికీ పోలేదన్నమాట. అవి కనబడకపోయేసరికి కంగారేసింది అక్కా. నీ మేనల్లుడి ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టక తప్పడం లేదక్కా’ అన్నాను.నా మాటలకి అక్కయ్య కళ్ళలో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపైన కొద్దిసేపు అక్కయ్య ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత మెల్లగా ‘అది కాదురా తమ్ముడూ, అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది. తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరమొస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా’ అన్న అక్కయ్య మాటలకి నేను, సుజాత దిగ్భ్రాంతి చెందాము.‘అమ్మ అలా చేసిందా? ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా..’ నా మాట పూర్తి కాకుండానే ‘ఏమోరా, అవన్నీ నాకు తెలియదు’ అనేసి అక్కయ్య వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేనూ, సుజాతా చేష్టలుడిగిపోయాము. ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి! నా మేనల్లుడిని నా కొడుకుతో సమానంగానే కదా చూశాను. వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా? నేను గానీ, సుజాతగానీ ఎన్నడైనా అక్కని, ఆర్యని పరాయివాళ్ళుగా చూశామా? నా జీతమంతా ఈ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసమే కదా వెచ్చించాను. అమ్మకివన్నీ తెలియవా? పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా.. అక్కయినా అమ్మని వారించి ఉండాల్సింది కదా! సర్లే , జరిగిందేదో జరిగిందనుకుని సర్దిచెప్పుకుందామనుకున్నా, కనీసం ఇప్పుడైనా ఇంటిపత్రాలని తెచ్చిచ్చి ‘ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా, వెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకురా’ అనాలి కదా అక్కయ్య! మరిదేమిటి, అలా వెళ్ళిపోయింది? మనసంతా భారమవగా నిస్సత్తువగా మంచంపై కూర్చుండిపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే, మెట్టినింట్లో ‘అందరూ నా వాళ్లే’ అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో! ఆ ఆలోచనతో గభాల్న తలెత్తగా.. కళ్ళనీళ్ళతో కనిపించిన సుజాతని చూసి చలించిపోయాను. లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోపెట్టాను. ‘బెంగపెట్టుకోవద్దు సుజా.. నా పీఎఫ్‌లో కొంత డబ్బుంది. అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వేం దిగులు పెట్టుకోకు’ అంటూ భరోసా ఇచ్చాను.నా మాటలు వింటూనే సుజాత భోరున ఏడ్చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా చలించకుండా, దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరకి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. దుఃఖభారం ఉపశమించే దాకా తనని అలాగే ఏడవనిచ్చాను. కొంతసేపటికి తేరుకున్న సుజాత ‘నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండీ! అదేమంత పెద్దవిషయమని? నా నగలను కుదువపెట్టినా, లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది. కాని, ఇన్నేళ్లుగా మనతోనే మసలుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తోంది. మన అనుకున్నవాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండీ! మనది కాని ఈ ఇంట్లో ఉండేందుకు నాకెంత మాత్రం మనస్కరించడం లేదు. మీతో పాటు వచ్చేస్తానండీ’ అంది దీనంగా.‘అలాగే సుజా, ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తిచేసి వాడ్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. కాకపోతే నాదొక విన్నపం.. ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కల్మషమైన వారి మనసుల్ని పాడు చేయొద్దు. దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం, ప్లీజ్’ అన్నాను తన రెండుచేతులూ పట్టుకుని. సరే అన్నట్టుగా తలూపింది సుజాత. ఆ తర్వాత అక్కకీ, నాకూ మధ్య మాటలూ, రాకపోకలూ ఆగిపోయాయి. పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆర్యని చూసేందుకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది.‘మావయ్యా..’ అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పర్శకి ఆలోచనల నుండి బైటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ‘ఇన్నాళ్ళకి ఈ మావయ్యని చూడాలనిపించిందటరా’ అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా.‘అదేం మాట మావయ్యా? ఎన్నోసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది, కాని ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది. అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకి నేను సెలెక్టయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్యా. మరో నెలలో ట్రైనింగ్‌కి వెళ్ళాలి’ అంటూ నా నోట్లో మైసూరుపాకు కుక్కాడు ఆర్య.అదే ఊపులో వంటింట్లోకి వెళ్లి ‘అత్తయ్యా’ అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు. వాడి పట్ల సుజాతదీ మాతృవాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరికి తీసుకుంది.‘ట్రైనింగ్ పూర్తయాక పోస్టింగు విజయవాడలోనే ఇస్తారనుకుంటా. అప్పటికి మావయ్యక్కూడా విజయవాడకి బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒక్కచోటే ఉండొచ్చు కదత్తయ్యా’కల్లాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది.ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదరువులే ఉండడం చూసి ‘అత్తా, ఈ రుచి ఇంకెక్కడా దొరకదు’ అంటూ ఆవురావురని ఆరగించాడు. ఆ తర్వాత అంకిత్‌తో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ ‘మావయ్యా , ఇది మీకివ్వమని ఇచ్చింది అమ్మ’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవరుని నా చేతిలో పెట్టాడు. నేనూ, సుజాతా ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము. తెరిచి చూస్తే అందులో సీల్ చేసిన పెద్ద ఎన్వలప్, ఒక ఉత్తరం కనిపించాయి. ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలెట్టాను..‘తమ్ముడూ! ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటాని ఆశ్చర్యపోతున్నావు కదూ! నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ. తండ్రిలేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థంలేని శంకతో, అంతకు మించిన ధనాశతో అమ్మని ప్రేరేపించి, చేయకూడని తప్పే చేశాను. బావ చనిపోయిన నాటినుండి నన్నూ, నీ మేనల్లుడినీ ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకూ, సుజాతకూ ఆజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను. ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించేస్తోంది.’‘క్యాన్సర్’ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను. అది చూసి సుజాత గభాల్న నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది..‘నమ్మకద్రోహం చేసిన నన్ను, తోబుట్టువే కదాని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా, పైనున్న ఆ భగవంతుడు శిక్షించక మానడుగా! బ్లడ్ క్యాన్సర్‌తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. అందుకు బాధ లేదు. కాని, నీ మేనల్లుడిని ఒంటరిని చేసి వెళ్తున్నానే దిగులు మాత్రం తొలిచేస్తోంది. ఇన్నాళ్ళూ తండ్రిలేని లోటు తెలీకుండా పెంచిన నువ్వూ , సుజాతా ఇకపై వాడికి తల్లి లేని లోటూ తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట! ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి. ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞురాలిని. చిన్న కోరిక తమ్ముడూ! నా చివరి రోజులని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా! నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయల్దేరుతున్నాను. కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్తున్నాను. మిమ్మల్ని చూడాలని, మీ నీడన చేరాలని మనసు ఆరాటపడుతోంది. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ! ఇట్లు మీ అక్కయ్య!’ ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటున వేణుగోపాలస్వామి ఆలయం వైపు వెళ్ళాను, నాతోపాటే సుజాత కూడా! అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను. చిక్కిశల్యమైంది. మాకు కన్నీళ్లాగలేదు. మమ్మల్ని చూసి భోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం. ‘మహాపరాధం చేశాను. ఫలితంగా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతున్నాను’ అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సుజాత.‘మీకేం కాదు. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. అన్ని జబ్బులనూ నయం చేయలేకపోయినా, తీవ్రతను తగ్గించి, ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కనిపెడుతూనే వున్నారు. ధైర్యంగా వుండండి. పదండి ఇంటికి వెళ్దాం’ అంది సుజాత.‘అవును అక్కయ్యా! నీకేం కాదు’ అని నేనంటూండగానే అక్కయ్య సెల్ మోగింది. ఫోన్ తీసిన అక్కయ్య.. నిలబడే ఓపిక లేక అక్కడే మెట్లపై కూర్చుంది. ఫోన్ తెరపై‘డాక్టర్ సునీల్’ అన్న పేరు కనబడగానే ఆత్రంగా ఆ ఫోన్ అందుకుని ‘డాక్టర్ గారూ! మా అక్కయ్య ఆరోగ్యం ఎలా వుందో వివరంగా చెప్పండి ప్లీజ్, నాకు చాలా కంగారుగా వుంది’ అన్నాను.‘మీ అక్కయ్య టెస్టు రిపోర్టులని నిన్ననే మరో స్పెషలిస్ట్‌కి చూపించాం. ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదనీ, కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని కచ్చితంగా చెబుతున్నారు. అయినా చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి, మరోమారు బోన్ మ్యారో టెస్ట్ చేయిస్తే మంచిది’ చెప్పాడు డాక్టర్. ఆ మాట వింటూనే ‘మా చెవుల్లో్ల పాలు పోశారు డాక్టర్ గారూ! రేపే ముంబైకి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తాను. థాంక్యూ’ అని ఫోన్ పెట్టేసి, ‘చూశావా అక్కయ్యా! నీకే జబ్బూ లేదు. అనవసరంగా భయపడిపోయి మమ్మల్నీ భయపెట్టావు’ అన్నాను హాయిగా నవ్వేస్తూ.‘పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బహుశా, ఇదంతా నా మనసుని ప్రక్షాళనచేసి, నన్ను మీ వద్దకి చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో!’ అంటూ రెండు చేతులూ ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య. ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది. ‘శుభం! సాక్షాత్తూ ఆ వేణుగోపాలస్వామే అభయమిచ్చాడు, ఇంకేం భయం లేదు’ అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళనా మటుమాయమవగా ఆనందంగా ఇంటికి బయల్దేరాం! -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
నమ్మకమే పునాది.. కోల్పోతే కష్టమే!
సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్‌గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు. అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్‌లైన్‌కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.సంధ్య మామూలుగానే రిజర్వ్డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్‌గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య. ఆ సమయంలోనే రాజీవ్ టీమ్‌లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్‌కి పూర్తిచేయాలని లేట్ అవర్స్‌లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్‌కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి. రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్‌ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్‌ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్‌పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది. ఆ తర్వాత రాజీవ్‌తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్‌ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు. అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.» ఎమోషనల్ ఓపెన్నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.» అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి. -
పెద్దయ్య
మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు. ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి. రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు. అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట. వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు. పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు. మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు. టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్‌మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్‌మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్‌రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య. -
వాలి చేతిలో రావణుడి పరాజయం
వరగర్వంతో కయ్యానికి కాలుదువ్వి, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి పాలైనా, రావణుడికి బుద్ధి రాలేదు. పులస్త్యుడి వల్ల కార్తవీర్యార్జునుడి చేతి నుంచి బతికి బయటపడ్డాడు గాని, లేకుంటే అతడి చేతిలోనే అంతమైపోయేవాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో జరిగిన పరాభవాన్ని రావణుడు త్వరలోనే మరచిపోయాడు. ముల్లోకాలలో బలవంతులుగా పేరుమోసిన వారందరినీ జయించాలన్న కండూతి అతడికింకా పోలేదు. కిష్కింధ పాలకుడైన వాలి మహాబలవంతుడని రావణుడు తన మంత్రుల ద్వారా విన్నాడు. ఎలాగైనా, వాలితో యుద్ధం చేసి, అతణ్ణి గెలవడం ద్వారా లోకానికి తన బలం చాటాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పుష్పకాన్ని అధిరోహించి, కిష్కింధకు వెళ్లాడు.రావణుడు కిష్కింధకు వెళ్లేసరికి వాలి నగరంలో లేడు. వాలి సభా మందిరంలో అతడి మంత్రి తారకుడు, మామ సుషేణుడు, యువరాజైన వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఇతర వానర యోధులు ఉన్నారు. ‘నేను లంకాధిపతిని. నన్ను రావణుడంటారు. వాలి ఎక్కడ? నేను వాలితో యుద్ధం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘రావణా! మా రాజు వాలి ఇప్పుడు నగరంలో లేడు. అతడు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో నాలుగు సముద్రాలలో స్నానం చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. నువ్వు అప్పటి వరకు వేచి ఉండవచ్చు. అయినా, వాలితో యుద్ధం నీకు క్షేమం కాదు. అదిగో ఆ అస్థిపంజరాల గుట్టలు చూడు. వాలితో యుద్ధానికి వచ్చి, అతడి చేతిలో హతమైపోయిన అభాగ్యులవే అవన్నీ. కాదూ కూడదూ ఇప్పటికిప్పుడే అతడి వద్దకు వెళ్లాలనుకుంటే, ఈ వేళకు అతడు దక్షిణ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాడు. నువ్వు నిరభ్యంతరంగా అక్కడకు వెళ్లవచ్చు’ అన్నాడు తారకుడు.రావణుడు పుష్పకవిమానంలో దక్షిణ సముద్రానికి వెళ్లాడు. ఆ సమయానికి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు.వాలిని వెనుక నుంచి ఒడిసి పట్టుకుందామనే ఉద్దేశంతో రావణుడు అతడి వైపు నడిచాడు. ఓరకంటితో వాలి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రావణుడు దగ్గరకు రాగానే, హఠాత్తుగా అతడి మెడను చంకలో ఒడిసి పట్టుకుని, ఆకాశంలోకి పైకెగిరాడు. వాలి చర్యకు రావణుడు దిగ్భ్రాంతి చెందాడు. అతడి పట్టును విడిపించుకోవడానికి గోళ్లతో రక్కాడు. దంతాలతో కొరికాడు. అయినా, వాలి లెక్క చేయకుండా ఎగురుతూ పోయి, తూర్పు సముద్రంలో మునిగి స్నానం చేశాడు. నిష్ఠగా సంధ్యావందనం చేశాడు. ఇన్ని చేస్తూనే రావణుడి మెడ మీద నుంచి తన పట్టును ఏమాత్రం సడలించలేదు. రావణుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాహాకారాలు చేశాడు.వాలి అతడి హాహాకారాలను ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడి నుంచి రావణుడిని పట్టుకుని ఆకాశమార్గంలో ఎగురుతూ ఉత్తర సముద్రం వద్దకు వెళ్లాడు. సముద్రంలో తనతో పాటు రావణుడిని కూడా ముంచుతూ తేల్చుతూ స్నానం చేశాడు. అక్కడ యథావిధిగా సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. వాలి చేష్టలకు రావణుడికి శక్తులన్నీ ఉడిగిపోయి, భయం పట్టుకుంది.వాలి అక్కడి నుంచి పైకెగిరి కిష్కింధ వైపు ప్రయాణం ప్రారంభించాడు. కిష్కింధ నగరం వెలుపల ఉపవనంలో రావణుడిని విసిరేశాడు. రావణుడు పొదల మధ్య పడ్డాడు. ఈ దెబ్బకు రావణుడికి కళ్లు బైర్లు కమ్మాయి.రావణుడిని చూసి, వాలి వినోదంగా నవ్వాడు.‘చూడటానికి మహారాజులా ఉన్నారు? ఇంతకీ తమరెవరు? ఎక్కడి నుంచి తమరి రాక? ఏ పని మీద వచ్చారు?’ అని వేళాకోళంగా ప్రశ్నించాడు.కొద్ది క్షణాలకు రావణుడు తేరుకున్నాడు. నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, ‘వానరేశ్వరా! నన్ను రావణుడంటారు. నేను లంకాధిపతిని. దేవతలను జయించినవాణ్ణి. అయితే, నీ శక్తి అమోఘం, అద్భుతం, అద్వితీయం. గమన వేగంలో నువ్వు గరుడుడిని, వాయువును మించిపోయావు. నన్ను ఏకంగా చంకలో ఇరికించుకుని, మూడు సముద్రాల్లో ముంచి తేల్చావు. బుద్ధి గడ్డితిని నీతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నీ శక్తిని చూశాక నేను నా ఆలోచనను విరమించుకుంటున్నాను. నీ అంతటి వీరుణ్ణి నేను ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులుగా బతుకుదాం’ అన్నాడు.రావణుడి కోరికను వాలి సమ్మతించాడు. అతడిని స్నేహితుడిగా అంగీకరించాడు. తనతో పాటు కిష్కింధ నగరానికి తీసుకుపోయి, ఘనంగా ఆతిథ్యం ఇచ్చాడు.వాలికి అతిథిగా రావణుడు కిష్కింధలో కొన్నాళ్లు గడిపి, వాలి వద్ద సెలవు తీసుకుని లంకకు తిరిగి వెళ్లిపోయాడు. -
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్‌ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్‌ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్‌కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్‌ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్‌లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్‌ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం.