
పరీక్ష హాల్ అనేది యుద్ధభూమి కాదు, ఇదొక గేమ్‌బోర్డ్! పరీక్షల్లో నిజమైన విజేతలు ఎవరంటే ఎక్కువగా చదివినవాళ్లు కాదు. పరీక్ష హాల్‌లో సరిగ్గా ఆలోచించి, సమయాన్ని ప్లాన్ చేసుకుని, ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అంటే మీ విజయం మీ మైండ్‌సెట్, ప్లానింగ్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది! అందుకే పరీక్ష హాల్‌లో మెదడు ఎలా పనిచేస్తుంది? టాపర్ల సీక్రెట్ మైండ్ హ్యాక్స్ ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం.
చేయకూడనివి...
గడియారం చూస్తూ ఆందోళన చెందవద్దు. ఇది ఒత్తిడిని పెంచుతుంది.
ఒక్క ప్రశ్నకే అతుక్కుపోయి ఎక్కువ సమయం వృథా చేయడం.
పరీక్ష మధ్యలో ‘నేను తక్కువ మార్కులు తెచ్చుకుంటానేమో‘అనే అనవసరమైన ఆలోచనలతో భయం పెంచుకోవడం.
ప్రశ్నలకు పూర్తి సమాధానం రాశానా? లేదా? అన్న ఆందోళనకి లోనవడం.
ఎవరైనా పేపర్ రాయడం పూర్తిచేస్తే, ఒత్తిడిగా ఫీల్ అవ్వడం.
పరీక్ష భయాన్ని తగ్గించే ‘పామింగ్ టెక్నిక్’
కొంతమంది విద్యార్థులకు పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. సింపతటిక్ నర్వస్ సిస్టమ్ అధికంగా యాక్టివ్ కావడమే దీనికి కారణం. దీన్ని నియంత్రించేందుకు ‘పామింగ్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సులువు.
చేతులను రుద్ది వేడిగా చేయండి · కళ్లు మూసుకుని వేడి చేతులను కళ్ల మీద ఉంచండి
లోతుగా ఊపిరి తీసుకుంటూ, ‘నేను ప్రశాంతంగా ఉన్నాను‘ అని మౌనంగా చెప్పుకోండి
30 సెకన్ల పాటు అలా ఉంచిన తర్వాత, చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్‌లోకి మార్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పరీక్ష ముందు, ప్రశ్నపత్రం చూసిన వెంటనే ఇది చేయడం మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనకు తీసుకెళుతుంది.
మైండ్ బ్లాక్ అయ్యిందా? నో ప్రాబ్లెమ్
కొందరు విద్యార్థులకు పరీక్ష మధ్యలో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. చదివినవేవీ గుర్తుకురావు. దీన్ని హ్యాండిల్ చేసేందుకు టాపర్లు జీఎస్‌ఆర్ మోడల్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మీరూ దాన్నే ఫాలో అవ్వండి!
Ground Yourself – కాళ్లు నేలకి ఆనించి 5 సెకన్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి.
Switch Focous– 10 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి.
Restart Slowly – నెమ్మదిగా ప్రశ్న మళ్లీ చదవండి.
పరీక్ష హాల్‌లో మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్
పరీక్ష సమయంలో ఒక్కసారిగా ప్రశ్న అర్థం కాకపోతే, మెదడు ‘ఫ్రీజ్‘ అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించేందుకు మైండ్‌ఫుల్‌నెస్ సైకాలజీలో ఉపయోగించే ‘గౌనర్–స్విచ్ మోడల్‘ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే...
గౌనర్ మోడ్ (గమనించు): ప్రశ్న అర్థం కాకపోతే, కొంతసేపు అక్షరాలను ప్రశాంతంగా గమనించు.
స్విచ్ మోడ్ (మార్చు): ప్రశ్నను పూర్తిగా వదిలేయకుండా, కొంచెం వెనక్కి వెళ్లి మళ్ళీ నిశ్శబ్దంగా చదువు.
స్కానింగ్ మోడ్: పక్కనే ఉన్న ఇతర ప్రశ్నలను చూసి, మైండ్‌ను మళ్ళీ సెట్ చేసుకోవడం. ఇది మెదడును బ్లాక్ అవుట్ నుంచి రికవరీ మోడ్‌లోకి తీసుకువచ్చి, మరింత చురుకైన ఆలోచనకు సహాయపడుతుంది.
చివరి నిమిషాల్లో చేయవలసినవి
పరీక్ష పత్రం అందుకున్న వెంటనే, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి · ముఖ్యమైన సమాధానాల్ని గుర్తించి, ముందుగా అవి రాయడం మొదలుపెట్టండి ·
ప్రశ్నలకు సమాధానం రాస్తూ, మధ్యలో చిన్న మైండ్‌ఫుల్ బ్రేక్స్ తీసుకోండి
సమాధానాలను సాఫ్ట్‌గా, క్లియర్‌గా రాయండి
మార్కుల స్కోరింగ్‌కు డయాగ్రామ్స్, హైలైట్స్ ఉపయోగించండి
గుర్తులేదనుకున్న ప్రశ్నలపై చివరి 15 నిమిషాల్లో ప్రయత్నం చేయండి.
పరీక్ష అనేది మీరు చదివిన తీరుకే కాదు, మీ మానసిక స్థిరత్వానికి కూడా పరీక్ష. ఈ టూల్స్టెక్నిక్స్ ఉపయోగించుకుని ప్రశాంతంగా, ప్లానింగ్‌తో రాస్తే, మీరు విజయం సాధించటం ఖాయం! పరీక్ష అనేది ఒక స్ట్రాటజిక్ గేమ్! దీనిని గెలవడం మీ చేతుల్లోనే ఉంది! పరీక్షలో విజయం సాధించేది ఎక్కువగా చదివినవారు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలిగినవారే!
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!)
Comments
Please login to add a commentAdd a comment