స్టడీ టిప్స్
మొదటి రోజు ఎగ్జామ్‌కి జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటారు. కాని అవన్నీ ఆలాగే ఉన్నాయి కదా? అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ బయలుదేరే ముందు హాల్‌టికెట్, పెన్‌లు, జామెట్రీ బాక్సుల వంటివన్నీ సరిగ్గా ఉన్నాయా? అని చెక్ చేసుకోవాలి. ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే జవాబు రాయడం మొదలు పెట్టాలి. పేపర్ ఇచ్చే ముందు ఒకసారి హాల్‌టికెట్ నంబరు, ఎక్స్‌ట్రా షీట్ల టోటల్ నంబరు... వంటి వాటిని చెక్ చేసుకోవాలి.
ఎగ్జామ్‌కు వెళ్లేటప్పుడు వాతావరణానికి తగినట్లు సౌకర్యంగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. మరీ టైట్‌గా ఉండే సింథటిక్ డ్రెస్ కలిగించే అసౌకర్యం మైండ్ మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వదులుగా ఉండే కాటన్ డ్రెస్‌లు వేసుకుంటే మంచిది. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన వెంటనే మరొక సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయకుండా రిలాక్స్ కావాలి. మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మంచి మూడ్‌తో చదవాలి.