Subject
-
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో మూడో స్థానంలో చంద్రబాబు
-
జీఎస్టీ చట్టం: ఓ ఆసక్తికరమైన వార్త
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు. -
పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ఎమర్జెన్సీ దుష్ఫలితాలు, రాజ్యాంగ దుర్వి నియోగాన్ని భావితరాలకు తెలి పేందుకు పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర మంత్రి వెం కయ్యనాయుడు సూచించారు. ఎమర్జెన్సీ ని చీకటిరోజుగా అభివర్ణిస్తూ ప్రజా స్వామిక భారతదేశంలో ఎమర్జెన్సీని మించిన చెడు నిర్ణయం లేదన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, వాటి ఫలితాలు భావితరాలకు తెలియాల్సిన అవసరముందన్నారు. ఆదివారం హైదరా బాద్‌లో జరిగిన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ.. అప్రజాస్వామిక, నియం తృత్వ నిర్ణయానికి 1977లోనే కాకుండా మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయాల్లో విపక్షనేతలు, మీడియా నిర్వాహకులు, ఉద్యమకారులు, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సెన్సార్‌ను అంగీకరించని పత్రికలను వెలువరించకుండా చేశారని, ప్రతిపక్షనేతలను జైళ్లలో పెట్టార ని, ప్రశ్నించిన సొంత పార్టీ నేతలనూ ఇందిరాగాంధీ వేధిం చారన్నారు. ఎన్నికల గడువును ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచారని, ఇలాంటి అవకాశమే ఉంటే పదవుల నుంచి ఎవరూ దిగరని పేర్కొన్నారు. మారువేషాల్లో తిరిగాం: దత్తాత్రేయ కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ఇప్పటికీ ఎమర్జెన్సీ తరహా ఆలోచనా విధానమేనన్నారు. బ్రిటీష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడినట్టే కాంగ్రెస్‌తో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశాన్ని జైలుగా మార్చారని, మారువేషాల్లో తిరిగామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు!
లైఫ్ చదువుకు పెద్ద పీట... మంచిదే! మరి... చదువు ఏం నేర్పాలి? పిల్లల్లో విలువల్ని నేర్పాలి... బతకగలమనే ధైర్యాన్నివ్వాలి! అలాంటి చదువును... ఇప్పుడు చదవనిస్తున్నామా? నాకిదిష్టం అని చెప్పే అవకాశం ఈ తరం పిల్లలకు ఉంటోందా? వాళ్లలో ఆలోచన పుట్టకముందే ఆశయాలు సిద్ధమవుతున్నాయి. డాలర్ల సంపాదనే జీవితమా? తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యమా! ఇవన్నీ కనిపించని రంపాలే. ...లేత గుండెలను కోస్తున్నాయి. చిట్టి మొగ్గలు వాడిపోతున్నాయి పిల్లల్ని వికసించనివ్వండి! వాళ్లను ఆలోచించనివ్వండి!! ‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను... కాలేకపోయాను. మా అబ్బాయి డాక్టర్ అయి నా కల తీరుస్తాడు’’ మురిసిపోతూ చెప్తున్నాడు పవన్‌కుమార్ ఫోన్లో తన ఫ్రెండ్‌తో. రీడింగ్ టేబుల్ దగ్గర ఉన్న వినీత్‌కి వినిపిస్తూనే ఉన్నాయా మాటలు. తల పుస్తకంలో దూర్చి ఉన్నాడు, కళ్లు అక్షరాల వెంట పరుగుతీస్తున్నాయి. విషయమే బుర్రకెక్కడం లేదు. ఏవేవో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. న్యూటన్స్లా, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్, బయాలజీ ల్యాబ్ ప్రాక్టికల్స్ అన్నీ 24 ఫ్రేమ్స్‌లో కళ్లముందు గిర్రున కదలాడుతున్నాయి. ఆకు అడ్డుకోత, చర్మ నిలువుకోత... రికార్డు రాసి రాసి తనకు మాత్రం గుండెకోత మిగిలేట్టుంది... నిర్లిప్తంగా పుస్తకం మూశాడు. ‘‘చంటీ బుక్ మూస్తున్నావ్... రివిజన్ పూర్తయిందా’’ అన్నది డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్న సుమిత్ర. ‘‘వేరే సబ్జెక్టు చదువుదామని...’’ ఆపద్ధర్మంగా తోచిన అబద్ధం చెప్పి, తప్పదన్నట్లు మరో పుస్తకం తీశాడు వినీత్. ఆ క్షణానికైతే తప్పించుకుని మరో పుస్తకంలో తల దూర్చాడు. పేరెంట్స్ తన ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భావం ఎక్కడో గుండెల్లో కలుక్కుమనిపించింది. ‘‘రాత్రి పదకొండయింది. ఇక పడుకో నాన్నా! మళ్లీ నాలుగింటికే లేవాలి కదా’’ అంటూ లైటాపేసింది సుమిత్ర. ‘‘సతీశ్ వాళ్లబ్బాయి అర్ధరాత్రి రెండింటి వరకు చదువుకుంటున్నాడు. వీడిని పది దాటినప్పటి నుంచి నువ్వే ఎప్పుడెప్పుడు పడుకోబెడదామా అన్నట్లు చూస్తుంటావు. ఇలాగైతే మెడిసిన్‌లో సీట్ వచ్చినట్లే’’ విసుక్కున్నాడు పవన్. ‘‘నిద్రపోకపోతే ఎలా? చదివింది బుర్రకెక్కాలి కదండీ!’’ సుమిత్ర సర్దిచెప్పబోయింది. ‘‘నువ్విలాగే వెనకేసుకురా. లాస్ట్ వీక్... వీక్లీ టెస్ట్‌లో మార్కులు తగ్గినప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పటికి మూడుసార్లు ఫోన్ చేశారు. ర్యాంకు తెస్తాడని మీ వాడి మీద హోప్స్ పెట్టుకున్నాం. ఇలాగైతే కష్టం’’ అంటూ చివాట్లేశారాయన. ఎంతెంత ఫీజులు కట్టాను. నీకే బాధ్యత తెలియకపోతే ఇక వాడికెలా తెలుస్తుంది. డబ్బు కడితే తెలుస్తుంది... భార్య మీద ఉన్న పాత అసహనాలన్నీ ఈ వంకతో తీర్చుకున్నాడు పవన్. వినీత్ పడుకున్నాడు. కళ్లు మూసుకుంటే కనురెప్పల కింద పుస్తకాల దొంతరలు కనిపిస్తున్నాయి. పేరెంట్స్ మాటలు చెవుల్ని తాకుతున్నాయి. మూసుకుందామంటే చెవులకు రెప్పలు లేవు.పరీక్షలన్నీ అయిపోయాయి. రిజల్ట్స్ రోజు దగ్గర పడుతుంటే... పవన్‌లో ఆందోళన పెరుగుతోంది. ఏదైమైనా తన కొడుకు డాక్టర్ కావాల్సిందే. డాక్టర్గారి తండ్రిగా పొందే గౌరవాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒక్కో రిజల్ట్ వస్తుంటే అంచనాలు తప్పుతున్నాయేమోననే ఉద్వేగం కూడా పెరుగుతోందా తండ్రిలో. ‘‘ప్రణవ్! నీకు ఈ టీషర్ట్ ఇష్టం కదా తీసుకో’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తమ్ముడికిచ్చాడు వినీత్.‘‘థాంక్స్ అన్నయ్యా!’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తీసుకుని ఒంటిమీద పెట్టుకుని అద్దంలో చూసుకున్నాడు ప్రణవ్. వినీత్ తమ్ముడి కళ్లలో ఆనందం చూస్తూ ‘‘నా జీన్స్, హుడీస్, జెర్కిన్స్లో నీకేమేమి కావాలో అన్నీ తీసుకో’’ అన్నాడు. ప్రణవ్కది కొత్త. అన్నయ్య అడక్కుండానే ఇవ్వడం ఎప్పుడూ లేదు. ‘‘అన్నీ నేను తీసుకుంటే నీకు వద్దా అన్నయ్యా? ఎప్పుడూ ఒక్కసారి వేసుకుంటానన్నా ఇచ్చేవాడివి కాదు. ఇప్పుడన్నీ ఇచ్చేస్తున్నావేంటన్నయ్యా. నెక్ట్స్ ఇయర్ నువ్వు మెడిసిన్‌లో చేరి హాస్టల్కెళ్లిపోతావ్గా. అందుకే ఇప్పుడే ఇస్తున్నావా’’ వినీత్సమాధానం కోసం చూడట్లేదు ప్రణవ్. తానే ఓ సమాధానం వెతుక్కున్నాడు. వినీత్ మెల్లగా చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకు అర్థం వెతకడం ప్రణవ్ బాల్యానికి చేతగాదు, నవ్వులో తేడా గుర్తించగలిగిన సుమిత్రకు, పవన్‌కు... వినీత్ అలా నవ్వినట్లే తెలియదు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరూ నిద్రలేచిన అలికిడి లేదు. సుమిత్ర నిద్రలేచి పాలపాకెట్ కోసం తలుపు దగ్గరకు వెళ్లింది. చెయ్యెత్తి గడియ తీయబోయింది... కానీ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇంత ఉదయాన్నే తలుపు ఎవరు తీశారు? బహుశా రాత్రి పవన్ కారిడార్‌లో నిలబడి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూనే లోపలికి వచ్చాడేమో! తలుపు గడియ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు... అనుకుంది. అదే మాట భర్తను అడిగింది. తాను గడియ వేసినట్లు చెప్పాడు. అంతలోనే పవన్‌కు ఏదో సందేహం... వినీత్ గదిలోకెళ్లి చూశాడు.బాత్రూమ్లో ఉన్నాడేమోనని చెవులు రిక్కించాడు... నిశ్శబ్దం. ‘‘వినీత్‌ను బయటకు పంపించావా?’’ సుమిత్రకు వినిపించేలా అన్నాడు. లేదంది సుమిత్ర. గుండె కొట్టుకోవడం పైకి వినిపిస్తోంది పవన్‌కి. రీడింగ్ టేబుల్ మీద రోల్ చేసి క్లిప్ పెట్టిన పేపర్ మీద ఆగింది అతడి దృష్టి. క్షణాల్లోనే అర్థమైంది... వినీత్ లేడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ‘‘నాన్నా! మీ యాంబిషన్‌ని నేను ఫుల్‌ఫిల్ చేయలేను. సారీ’’ అని ఒకే ఒక వాక్యం ఉంది. సుమిత్రకు పవన్ మీద పట్టరాని కోపం వస్తోంది. వినీత్ బాల్యం వాడిది కాకుండా పోవడానికి కారకుడు భర్తేనని ఆమె గుండె ఘోషిస్తోంది. ఒక్కో సంఘటనా కళ్ల ముందు మెదలుతోంది. పవన్ అప్పటికే ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. సుమిత్ర ఆవేశంగా లేచి వెళ్లి... వినీత్ పుస్తకాలన్నీ తెచ్చి పవన్ ముందు పడేసింది. ‘‘మీకు ఏడాది టైమిస్తాను. వీటన్నింటినీ చదివి పరీక్ష రాయండి. మెడిసిన్‌లో సీటొచ్చే ర్యాంకు కాదు కదా! కనీసం క్వాలిఫై అవండి’’ అంటున్నప్పుడు ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. సుమిత్రను సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు పవన్. వినీత్ ఆచూకీ తెలియడం లేదు. కనీసం బాడీ కూడా... కన్న పేగు ఆ మాట అనలేక పోతోంది... కానీ కడుపు రగిలిపోతూనే ఉంది, మనసు కుమిలిపోతోంది. వాళ్లిద్దరినీ మార్చి మార్చి చూసిన సైకాలజిస్ట్ ‘‘మీరు డాక్టర్ కావాలనుకుని కాలేకపోయారు, మీ కొడుకు ద్వారా ఆ కోరిక తీర్చుకోవడానికి ఇది రెండున్నర గంటల సినిమా కాదు కదా! జీవితం... మీ అబ్బాయి జీవితం. మీ లక్ష్యాలను అందుకోవడానికి పిల్లలను సాధనాలు చేయడం సబబేనా’’ అంటూ మొదలు పెట్టి గంటన్నర సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్య వ్యాపారంగా మారిన నేపథ్యంలో ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఇంజనీరు లేదా డాక్టరు అయి తీరాలనే టార్గెట్‌ని పేరెంట్స్ మెదళ్లలో చొప్పించిన వైనం పవన్‌కు అర్థమవుతోంది. ఆ మాయాజాలంలో పడి వినీత్ గమ్యాన్ని అగమ్యగోచరంగా చేశాననే పశ్చాత్తాపం మొదలైంది.‘‘వినీత్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదో పని చేసుకుని బతుకుతున్నాడా? ఎప్పటికైనా ఇంటికి వస్తాడా’’ ప్రశ్నలు అనుక్షణం ఎదురుగా వెక్కిరిస్తున్నాయి. పరీక్షే జీవితం కాదు! జీవితం అంటే పరీక్షలో రాణించడం ఒక్కటే కాదని పిల్లలకు చెప్పాలి. లైఫ్‌లో సక్సెస్ అయిన వారిలో స్కూల్ ఫైనల్ ఫెయిలైన వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లు ఒక ఫెయిల్యూర్ తర్వాత జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ఎలా మలుచుకున్నారో, ఎలా రాణించారో వివరించాలి. ఒకసారి పరీక్ష పోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, కోరుకున్న కోర్సులో సీట్ రాకపోయినా ప్రయత్నించడానికి మరో ఏడాది మన చేతుల్లోనే ఉందని చెప్పి వారిని ప్రోత్సహించాలి. కనిపించే లక్షణాలివి! ⇒ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. దేనిమీదా ఆసక్తి ఉండదు. ⇒వాళ్లకు ఇష్టమైనవి వండినా కడుపునిండా తినలేరు. కంటినిండా నిద్రపోలేరు. ⇒తమకిష్టమైన దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఇతరులకిచ్చేస్తుంటారు. ⇒కొన్నాళ్లయినా అమ్మానాన్నలను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఫలితాలు ఆశించిన విధంగా లేనప్పుడు... పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ల ప్రవర్తనలో తేడాను గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ఒంటరిగా వదలకూడదు. – వాకా మంజులారెడ్డి ఇన్పుట్స్: రోష్ని స్వచ్ఛంద సంస్థ -
తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం
తిరువనంతపురం: కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి. ఈ నిర్ణయం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి విజయన్ మీడియాకు తెలిపారు. మలయాళం బోధించని పాఠశాలలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కొత్త నియమాన్ని పాటించని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రూ. 5 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో ఇతర రాష్ట్ర విద్యార్థులు, విదేశీ విద్యార్థులకు మినహాయింపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ పి.సదాశివం ఆమోదం తెలిపారు. -
స్టడీ టిప్స్
మొదటి రోజు ఎగ్జామ్‌కి జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటారు. కాని అవన్నీ ఆలాగే ఉన్నాయి కదా? అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ బయలుదేరే ముందు హాల్‌టికెట్, పెన్లు, జామెట్రీ బాక్సుల వంటివన్నీ సరిగ్గా ఉన్నాయా? అని చెక్ చేసుకోవాలి. ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే జవాబు రాయడం మొదలు పెట్టాలి. పేపర్ ఇచ్చే ముందు ఒకసారి హాల్‌టికెట్ నంబరు, ఎక్స్ట్రా షీట్ల టోటల్ నంబరు... వంటి వాటిని చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్‌కు వెళ్లేటప్పుడు వాతావరణానికి తగినట్లు సౌకర్యంగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. మరీ టైట్‌గా ఉండే సింథటిక్ డ్రెస్ కలిగించే అసౌకర్యం మైండ్ మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వదులుగా ఉండే కాటన్ డ్రెస్‌లు వేసుకుంటే మంచిది. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన వెంటనే మరొక సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయకుండా రిలాక్స్ కావాలి. మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మంచి మూడ్‌తో చదవాలి. -
సబ్జెక్టుల్లో ప్రపంచంలోనే బెస్ట్ వర్సిటీలు ఇవే..
న్యూయార్క్: ప్రతి ఏడాది ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలను గుర్తించి వాటి జాబితాను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకిగ్స్ సంస్థ విడుదల చేసింది. బోధన, అకాడమిక్ పనితీరు, వర్సిటీలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశోధనలు, ఉద్యోగుల పనితీరు విద్యార్థుల పురోగతి వంటి అంశాల అధారంగా మొత్తం 16 ఉత్తమ వర్సిటీల జాబితాను ప్రకటించింది. అయితే, పైన తెలిపిన అంశాలను ప్రాథమికంగా సర్వే కోసం తీసుకున్నా.. కేవలం సబ్జెక్టుల ఆధారంగా మాత్రం అత్యుత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ యూనివర్సిటీల జాబితా ప్రకటించింది. అవి ఏంటంటే.. 1.హార్వార్డ్ యూనివర్సిటీ అమెరికా 2.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా 3.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, బ్రిటన్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, బ్రిటన్ 5.వెజినింజెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్ 6.ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, బ్రిటన్ 7.యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా, అమెరికా 8.యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, హాంకాంగ్ చైనా 9.ఈటీహెచ్ జూరిచ్, స్విట్జర్లాండ్ 10.యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటన్ 11.కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్, అమెరికా 12.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బార్కెలీ క్యాంపస్, అమెరికా 13.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా, అమెరికా 14.ది జులియార్డ్ స్కూల్, అమెరికా 15.యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ అమెరికా 16.యూనివర్సిటీ ఆఫ్కాలిఫోర్నియా, డేవిస్ క్యాంపస్, అమెరికా -
రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు!
హైదరాబాద్: టెన్త్ పరీక్ష ఫలితాలు ఆది, లేదా సోమవారం విడుదలయ్యే అవకాశముంది. ఈసారి టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్స్ విధానం అమల్లోకి తేవడం తెలిసిందే. దీంతో రెండింటినీ కలిపి మార్కులు లెక్కించి, వాటిని గ్రేడ్ పాయింట్ యావరేజ్‌కు మార్పు చేసి ఫలితాలను ప్రకటించాలి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండటంతో ఆలస్యమైంది. ఆ పనులు పూర్తయినందున 17, లేదా 18వ తేదీన ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
పదికి పదిలమే
ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి నూతన సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి అప్పుడే పదికి పది పాయింట్లు సాధ్యం మరి కొద్ది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సిలబస్ అందునా సీసీఈ మోడల్ పరీక్ష విధానం మొదటి సారిగా అమలు చేయనున్నారు. దీంతో విద్యార్థులో కాస్త భయం, ఎలా ప్రిపేరవ్వాలా అన్న ప్రశ్న వేధిస్తున్నాయి. సరైన ప్రణాళి కతో చదువుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ పది పాయింట్లు సాధించొచ్చని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. - లబ్బీపేట తెలుగులో మార్కులు సులువే ► ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ►ప్రతిపదార్థాలు చదివేటప్పుడు నక్షత్రం గుర్తుగల పద్యాలను ఎక్కువగా చదవాలి. ► పద్య పూరణలు చేసేటప్పుడు ప్రాస అక్షరాలను సరిచూసుకోవాలి. ► అపరిచిత పద్యగద్యాలను చదవి అర్థం చేసుకుంటే మార్కులు ఎక్కువ పొందొచ్చు. ►వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు సామెతలు గానీ, జాతీయాలు గానీ వాడితే ఎక్కువ మార్కులు వస్తాయి. ►ఉపవాచకంలో సంఘటనలను వరుసక్రమంలో రాసేందుకు క్షుణ్ణంగా ఉపవాచక పఠనం చేయాలి. ► ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే పార్ట్-బీ విషయంలో తగిన శ్రద్ధ వహించాలి ►వాక్యాలు, వానిలోని రకాలు అన్నింటిలోను ప్రాక్టీసు చేయాలి. ► సంస్కృతం చదివేటప్పుడు, రాసేటప్పుడు సారాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ► శబ్దధాతువులను ఎక్కువుగా సాధన చేయాలి. హిందీపై ఆందోళన అనవసరం ► హిందీలో పది పాయింట్లు సాధించడానికి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉండేలా సాధన చేయాలి. పాఠ్యపుస్తకాలను చదవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే పూర్తిసామర్థ్యంతో సారాంశం రాయగలుగుతారు. ► వ్యాకరణంలో కూడా 25 కి 25 మార్కులు సాధించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకంలోని భాషను ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఏ విధంగా ప్రశ్నను అడిగినా సమాధానం రాయగలిగేలా సాధాన చేయాలి. ►ప్రతి వాక్యాన్ని అర్థవంతంగా రాయాలి. ప్రతి ప్రశ్నకూ కవిని పరిచయం చేస్తూ సమాధానం రాయాలి. దీని వల్ల పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ►పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా మన సమాధానం ఉండాలి. ► లేఖ రాసేటప్పుడు ఒక్క పేజీలోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ► వ్యాసం రాసేటప్పుడు ముఖ్యాంశాలను పరిచయం చేస్తూ, సైడ్ హెడ్డింగ్ రాస్తూ పేరాలుగా విభజించాలి. ► పాఠ్యపుస్తకంలోని ప్రతిపాఠం వెనుక ఇచ్చిన వ్యాకరణాన్ని తప్పకుండా చదివి సాధన చేయాలి. ఇంగ్లిషులో మార్కులు ఎంతో ఈజీ ► మొదట ఇచ్చిన పశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి ► సమాధానాలను వరుసక్రమంలో రాయాలి. ►ఇంగ్లిష్‌లో ప్రశ్నలకు మూడు విధాలుగా మార్కులు కేటాయిస్తారు. ఒక మార్క్, రెండు మార్కులు, పది మార్కులు విభాగాలు ఉంటాయి. ► రెండు మార్కుల విభాగంలో రెండుకు రెండు మార్కులు వచ్చే విధంగా పది వ్యాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయాలి. ► ఒక మార్కు ప్రశ్నలకు 3, 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ముఖ్యమైన వాక్యాలను అండర్లైన్ చేయాలి. ► టెక్ట్స్‌బుక్ ఒకేబులరీని తప్పనిసరిగా వాడాలి. వ్యాక్యాలు సమాధానానికి సంబంధించినవిగా ఉండాలి. ► పేపర్-2లో ఉండే పది మార్కుల ప్రశ్నలకు రైటింగ్ స్కిల్స్ అండ్ లెటర్ రైటింగ్ రెండు పేజీలకు తగ్గకుండా టాఫిక్‌కు సంబంధించిన పదాలను వాడుతూ సమాధానాలను రాయాలి. ► లెటర్ రైటింగ్‌లో ఫార్మెట్‌ను ఫన్క్చ్యుయేషన్ సహా పాటించాలి. మంచి పదాలను ప్రయోగించాలి. గణితమంటే భయమొద్దు ► గణితంపై భయం వీడాలి. భావనలు, పద్ధతులను ఉపయోగించి లెక్కల సాధన రోజూ చేయాలి. ► సూత్రాలను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఉదాహరణ సమస్యలను అవగాహన చేసుకోవాలి. ► సమస్యలో ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకుని లెక్క చేసే పద్ధతిని తెలుసుకోవాలి. ► వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, ప్రోగ్రేషన్స్, ప్రాబబులిటీ, కో ఆర్డినెట్ జామెట్రీ, మెన్సురేషన్, సంఖ్యాకశాస్త్ర అంశాలపై దృష్టి సారించాలి. ► లెక్కల సాధనకు అన్ని సూత్రాలను నేర్చుకోవాలి. ► పార్ట్-బీ కోసం ఎక్కువ బిట్స్‌ను సాధన చేయాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నా పత్రాలు సాధన చేయాలి. ► ఒక్క మార్కు ప్రశ్నల కోసం అన్ని అధ్యాయాలందు ఉన్న నిర్వచనాలు, ఫజిల్స్, పదసమస్యలు, పట సమస్యలను సాధన చేయాలి. సాంఘికశాస్త్రంలో బిట్లు, మ్యాపులు కీలకం ► ప్రస్తుత సిలబస్‌ని అనుసరించి ప్రతి విద్యార్థి పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన పొందాలి. ► సాంఘికశాస్త్రంలో పది పాయింట్లు రావడానికి ముఖ్యమైన అంశంగా బిట్స్ మ్యాప్ పాయింటింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ► ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులను విద్యార్థి అవగాహన చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. ► ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో ఏ విధంగా ప్రశ్న అడిగినప్పటికీ సరైన సమాధానం రాసేలా సాధన చేసి సిద్ధంగా ఉండాలి. ► పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా నేర్చుకుని వాటిపై పట్టు సాధించాలి. ► ఆయా పాఠ్యాంశాలు, ప్రశ్నలకు సంబంధించిన కాలం(సంవత్సరాలు), వ్యక్తుల పేర్లపై పూర్తి అవగాహన పొందాలి. ► పాఠ్య పుస్తకంలో ఇచ్చిన బార్ గ్రాఫులను, వెన్, డయాగ్రామ్స్, టైమ్ లైన్ చార్ట్స్‌ను అర్థం చేసుకుని రాయగలిగితే పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఫిజికల్ సైన్స్.. పాఠ్యపుస్తకాలను చదవాలి ► విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ► అకడమిక్ స్టాండర్డ్స్ మార్కుల వెయిటేజీ గురించి అవగాహన ఉండాలి. ► కెమిస్ట్రీలో ఉన్న ఈక్వేషన్స్‌ను బాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ►పాఠ్యపుస్తకంలోని బొమ్మలు, వాటి భాగాలను సరైన విధంగా గుర్తించేటట్లుగా సాధన చేయాలి, భాగాల విధులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ►పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు, బిట్స్‌కు ప్రధాన్యత ఇవ్వాలి. సమ్స్(సాల్వ్డ్, అన్సాల్వ్డ్)ను సాధన చేయాలి. ►డు యు నో దిస్, ట్రై దిస్, అడిషనల్ ఇన్షర్మేషన్, థింక్ అండ్ డిస్కస్, బిల్డ్ అప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మాటిక్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇన్టెక్ట్స్ క్వశ్చన్స్ వంటి వాటిని హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్(హాట్స్)గా అడగవచ్చు. ►కేటాయించిన మార్కులను బట్టి సమాధానాలు హెచ్చుతగ్గులు లేకుండా రాయాలి. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయాలి. ► ప్రతి లెసన్‌కు మైండ్ మ్యాపింగ్ ఫార్మెట్‌ను తయారు చేసుకుని దానిని సాధన చేయాలి. నేచురల్ సైన్స్‌లో.. విశ్లేషించి జవాబులు రాయాలి ► పాఠ్యపుస్తకాలను అనుసరించి విషయ పరిజ్ఞానం పొందడంతో పాటు, దానిలోని అన్ని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి సమాధానాలు రాయాలి. ►రాసిన సమాధానాలను పుస్తక పరిభాషను అనుసరించేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిత్రాలు గీసేటప్పుడు చెక్కినట్లుగా అర్థవంతంగా గీయాలి. అన్ని భాగాలను సరిగా గుర్తించాలి. ►దైనందిన జీవితంలో జరిగే విషయాల గురించి అవగాహన ఉన్నచో సమాధానాలు సులువుగా రాయగలుగుతారు. ► అన్నింటికంటే మంచి ఆరోగ్యం, {పశాంతమైన మనస్సు ఎంతో అవసరం సరిగా ప్రజెంట్ చేయడం ముఖ్యం మనం ఎంతకష్టపడి చదవినా దానిని సరిగా ప్రజెంట్ చేయలేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందమైన చేతిరాత, మార్జిన్లు కొట్టడం, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పాటించడం ముఖ్యం. పేజీకి 18 నుంచి 20 వాక్యాలు ఉండేలా రాయాలి. సైడ్ హెడ్డింగ్స్‌కు తప్పనిసరిగా అండర్లైన్ చేయాలి. బ్లూ, బ్లాక్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. స్కెచెస్, షేడ్పెన్స్ వాడకూడదు. పరీక్ష సమయానికి అర్ధగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. పరీక్ష రాసేటప్పుడు పూర్తి ఏకాగ్రత, సమయపాలన పాటించాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే పదిలో పదికి పది పాయింట్లు తేలిగ్గా సాధించవచ్చు. - మురళీకృష్ణ, ఏజీఎం, శ్రీ చైతన్య స్కూల్స్ ఒత్తిడిని దూరంచేయాలి పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా కామన్ పరీక్షలు రాస్తున్నారు. అందునా ఈ ఏడాది కొత్త సిలబస్ ఎలా ఉంటుందోనని ఆందోళన సహజం. అయితే ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కచ్చితంగా సమాధానం రాయగలమనే సానుకూల దృక్పథంతో పరీక్ష హాలులోకి వెళ్లాలి. ఎటువంటి ఒత్తిడికి తావివ్వకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే చదివిన ప్రశ్నలు కూడా సమాధానం రాయలేని స్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో ముందుగానే ఎలా ప్రశ్నలు సమాధానాలు రాయాలి. మంచి మార్కులు పొందడం ఎలా అనే అంశంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంతో పరీక్షకు ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాలి. ఒకేవేళ్ల ట్రాఫిక్‌లో చిక్కుకుని పరీక్షకు ఆలస్యంగా వెళ్తే ఆ ఒత్తిడిలో సరైన సమాధానాలు రాయలేరు. అందుకే కేర్‌ఫుల్‌గా ఉంటే మంచి మార్కులు పొందవచ్చు. - డాక్టర్ టి.ఎస్.రావు, సైకాలజిస్ట్ -
వారంలో పది ఇంటర్నల్ మార్కుల అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో ఇచ్చే 20 శాతం ఇంటర్నల్ మార్కులను వచ్చే వారంలో ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారు(డీఈవో)లకు సోమవారం పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఈవోలతో ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఇంటర్నల్ మార్కుల అప్లోడ్ అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఈవోలకు వివరించారు. దీనిపై ఎంఈవోలు, హెడ్మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించాలని, వచ్చే వారంలో ఈ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని చిరంజీవులు సూచించారు. ఈసారి పదో తరగతి ఫలితాల శాతాన్ని పెంచాలని, టీచర్ల హాజ రుపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అలాగే ఏడాది కాలంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల నెలవారీ పదోన్నతులు, ప్రైవేట్ స్కూళ్ల లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించడం, మండలాల్లో మోడల్ స్కూళ్ల ఏర్పాటుపైనా చర్చించారు. పాఠశాల విద్యాశాఖ తోపాటు, సర్వశిక్షా అభియాన్‌లో వివిధ పథకాల కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై మంగళవారం పూర్తిస్థాయి ప్రతిపాదనలు అందజేయాలని విద్యా శాఖ విభాగాధిపతులను కూడా ఆయన ఆదేశించారు. -
తెలంగాణ పాఠాలపై ప్రాథమిక నివేదిక!
రాష్ట్ర గేయంగా ‘జయ జయహే తెలంగాణ’ హైదరాబాద్: తెలంగాణలో పాఠ్య పుస్తకాల్లో తీసుకురావాల్సిన వూర్పులపై విద్యా పరిశోధన శిక్షణ వుండలి(ఎస్సీఈఆర్టీ) నేతృత్వంలో సబ్జెక్టు నిఫుణులు బుధవారం సవూవేశమై తరగతుల వారీగా, సబ్జెక్టుల వారీగా ప్రాథమిక నివేదికను రూపొందించారు. పాఠ్యాంశాల్లో అవసరమైన చిత్రపటాలు, రాష్ట్ర చిత్రపటం, రాష్ట్ర గే యుం వంటివీ నిర్ణరుుస్తారు. ‘జయుజయుహే తె లంగాణ..’ అనే గేయూన్ని రాష్ట్ర గేయుంగా పెట్టాలని ఇప్పటికే ఓ అభిప్రాయూనికి వచ్చారు. ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రాల్లో ఏయే పాఠాలున్నారుు.. ఆ పాఠాలు రాసిన రచరుుతలెవరు? వారు ఏ ప్రాం తానికి చెందిన వారు? ఆ పాఠ్యాంశాన్ని ఎం దుకు పెట్టారు? అనే వివిధ విశ్లేషణలతో కూడిని నివేదికలను తరగతుల వారీగా, పాఠ్యాంశాల వారీగా రూపొందించారు. ఏయే పాఠ్యాంశాల్లో వూర్పులు తీసుకురావాలి? ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి? ఇంకా అదనంగా ఏయే పా ఠ్యాంశాలను పొందుపరచాలనే విషయూలపై వా రంతా నివేదికలు సిద్ధం చేసుకొని రావాల్సిం దిగా ఎస్సీఈఆర్టీ కోరింది. దసరా సెలవుల తరువాత అధికారులతోపాటు కమిటీల్లోని సభ్యులంతా సవూవేశమై పాఠ్యాంశాల్లో తీసుకురాబోయే వూర్పులను ఖరారు చేయునున్నారు. -
నిర్లక్ష్య ఫలితం ఇది!
కనువిప్పు ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. పెద్దల మాట చద్ది మూట అంటారు. నేను మాత్రం పెద్దలు ఏదైనా చెప్పబోతే ‘చెప్పింది చాలు. సుత్తి ఆపు’ అన్నట్లుగా చూసేవాడిని. నీతులు చెప్పబోతే నిప్పులు మింగినట్లు ఇబ్బందిగా ముఖం పెట్టేవాడిని. ‘‘ఎప్పుడు చూసినా బజార్లో కనిపిస్తావు. బుద్ధిగా చదువుకోవచ్చు కదా’’ అని ఒకసారి మా పెద నాన్న అంటే- ‘‘నా విషయం మీకు అనవసరం. ఈ నీతులేవో మీ అబ్బాయికి చెప్పుకోండి’’ అన్నాను కోపంగా. ఇక అప్పటి నుంచి పెదనాన్న నన్ను చూస్తేనే ఒకలా ముఖం పెట్టేవారు. ‘‘గొడవల్లో తలదూరుస్తున్నావట. చదువుకోవాలని లేదా?’’ అని మా బావ ఒకసారి అక్షింతలు వేయబోతే- ‘‘నాకు చెప్పేంత సీన్ నీకు లేదు. నీ పనేదో నువ్వు చూసుకో’’ అని దురుసుగా సమాధానం ఇచ్చే సరికి ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారు. ‘‘నువ్వు పరాయి వాడివైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వినాల్సిన అవసరం లేదు. నువ్వు దగ్గరి బంధువు కదా అని నీ మంచికే చెప్పాను. ఇక ముందు నేను నీతో మాట్లాడను. దయచేసి నువ్వు కూడా నాతో ఎప్పుడూ మాట్లాడవద్దు’’ అన్నాడు బావ బాధగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొడవలు. దగ్గరి వాళ్లు ఎందరో దూరం అయ్యారు. అయినా సరే నాలో పశ్చాత్తాపం లేదు. మార్పు లేదు. అందరూ అనుకున్నట్లుగానే ఇంటర్మీడియెట్ తప్పాను. ఎన్నిసార్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేక పోయాను. ఖాళీగా ఉంటే మరింత చెడిపోతాడనే కారణంతో నాన్న నాతో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టించాడు. ఈ కొట్టు వల్ల లాభాలు రావు. నష్టాలు రావు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది. ‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను. అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు. నాన్న నా గురించి గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు నా కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి. -టియస్, రాజమండ్రి -
సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
‘చిన్ననాటి నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదవాలనే ఆశయం.. దానికోసం ఎనిమిదో తరగతి నుంచే కృషి... వీటికి కుటుంబ సభ్యుల తోడ్పాటు.. ప్రోత్సాహం తోడవడం.. తాజా విజయానికి ప్రధాన కారణాలు’ అంటున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన చింతకింది సాయిచేతన్. ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ పూర్తి చేసి తర్వాత సివిల్ సర్వీసెస్‌లో విజయంతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటున్న చింతకింది సాయిచేతన్ సక్సెస్ స్పీక్స్.. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ముత్పూర్ గ్రామం. అమ్మానాన్న ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న సురేందర్ రెడ్డి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అమ్మ నిర్మల లాలాపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ విజయంలో అమ్మ, నాన్నల తోడ్పాటు ఎంతగానో ఉంది. చిన్ననాటి నుంచే ఇంజనీరింగ్‌పై దృష్టి: ఇంజనీరింగ్ చదవాలి.. అది కూడా అత్యున్నత ఇన్స్టిట్యూట్లో చదవాలి అనే కోరిక చిన్ననాటి నుంచే ఉంది. అందుకు మార్గం ఐఐటీలే అని తెలిసింది. బాబాయి జితేందర్ రెడ్డి ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. బంధువుల్లోనూ చాలామంది ఐఐటీల్లో చదివారు. ఆదే స్ఫూర్తితో ఐఐటీల్లోనే ఇంజనీరింగ్ సీటు సాధించాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీకి ఫౌండేషన్ కోర్సులో చేరాను. ప్రిపరేషన్.. ప్రణాళికబద్ధంగా: ఐఐటీకి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మాత్రం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొదలుపెట్టాను. క్లాస్‌రూం సెషన్స్, స్టడీ అవర్స్, సెల్ఫ్ స్టడీ అన్నీ కలిపి రోజుకు 11-12 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందిం చుకున్నా. జేఈఈ పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చదివాను. అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. వాస్తవానికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంత క్లిష్టంగా ఉండేది. అయితే దీనికోసం ప్రత్యేకించి సమయం కేటాయించకుండా మిగతా సబ్జెక్ట్‌ల మాదిరిగానే చదివాను. అందుబాటులోని సమయంలోనే పరిపూర్ణ అవగాహన సాధించేందుకు కృషి చేశాను. బేరీజు వేసుకుంటూ: జేఈఈలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌ను.. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ చదివాను. బోర్డ్ సిలబస్‌లో లేని, ఎన్సీఈఆర్టీలో మాత్రమే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఏ విషయాన్నయినా ఒక్కసారి చదివితే మెదడులో నిక్షిప్తమవుతుంది. అది బాగా అడ్వాంటేజ్‌గా మారింది. మా బ్యాచ్ నుంచి ఐపీఈ సిలబస్ మారింది. దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే ఉంది. కాబట్టి ప్రత్యేకించి చదవాల్సిన అంశాలు చాలా తక్కువగా ఉండడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రాక్టీస్ + అప్లికేషన్ ఓరియెంటేషన్: చదవడం ఎంత ముఖ్యమో... చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రతి రోజు చదివిన అంశాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయడం హాబీగా చేసుకున్నాను. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ప్రతి అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో చదవడం లాభించింది. వీటితోపాటు ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి సొంత నోట్స్ రాసుకోవడం రివిజన్ సమయంలో బాగా ఉపయోగపడింది. తద్వారా ఈ విజయం సాధ్యమైంది. ఐఐటీ టు ఐఏఎస్: ప్రస్తుతం వచ్చిన ర్యాంక్‌తో ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో చేరతాను. నాలుగేళ్ల ఈ కోర్సు పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై ఐఏఎస్ సాధించాలని.. తద్వారా ప్రజలకు సేవ చేయడమే భవిష్యత్తు లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒత్తిడి లేకుండా.. లక్ష్యంపైనే దృష్టి: జేఈఈ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకూడదు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని చదువుతూ ఒత్తిడికి గురైతే.. వెంటనే దాన్ని వదిలేసి సులువుగా, ఇష్టంగా ఉన్న అంశం చదవడం మేలు. అంతేకాకుండా ఒత్తిడికి లోనైతే లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉంది. సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం విస్మరించకూడదు. మానసిక సంసిద్ధత, ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అకడెమిక్ ప్రొఫైల్: 2012లో పదోతరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ) 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (983 మార్కులు) ఎంసెట్-2014లో 10వ ర్యాంకు బిట్‌శాట్-2014 స్కోర్ 398 జేఈఈ-మెయిన్ మార్కులు - 340 జేఈఈ-అడ్వాన్స్డ్ మార్కులు- 320 -
మందులను ఎందుకు నిషేధిస్తారంటే...
విషయం ఒక మందు మార్కెట్లోకి రావడానికి ముందు అనేక దశల్లో పరీక్షలు జరుగుతాయి. ముందుగా జంతువుల మీద ప్రయోగించి ఎటువంటి అనుబంధ సమస్యలూ లేవని నిర్ధారించుకున్న తరవాత ప్రయోగానికి సిద్ధమైన మనుషులకు కొంత టెస్ట్ డోస్ ఇచ్చి దాని ప్రభావాన్ని గమనిస్తారు. ఒక మందు ఇన్ని దశలను దాటి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ కొన్ని మందులు దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులను కలగచేస్తుంటాయి. మరికొన్ని మందులను ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఫలానా అనారోగ్యానికి ఫలానా మందు వాడిన వారిలో మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని నిర్ధారణగా తెలిస్తే ప్రభుత్వం ఆ మందులను నిషేధిస్తుంది. భారత ప్రభుత్వం తాజాగా స్థూలకాయాన్ని తగ్గించే ఫెన్ఫ్లురామైన్, డెక్స్ఫెన్ఫ్లురామైన్ ఔషధాలను నిషేధించింది. వీటిని దీర్ఘకాలం వాడడం వలన కార్డియాక్ ఫైబ్రోసిస్ (గుండె కవాటాల మందం పెరగడం), శ్వాస వ్యవస్థ ఒత్తిడికి లోనవడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు, ఫలితంగా ఉన్నట్లుండి గుండె ఆగిపోయి హఠాన్మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అందుకే అవి నిషేధానికి గురయ్యాయి. -
తెలుగులో బోల్తా పడ్డారు!
- టెన్త్‌లో గణితం తర్వాత మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్ - కేవలం 15 వేల మందికే ఇంగ్లీష్‌లో ఏ1 గ్రేడ్ సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థుల కొంప ముంచింది గణితమే. లెక్కలు రావడం లేదు సరే అనుకున్నా మాతృభాషలో గట్టెక్కలేక చతికిల పడ్డ విద్యార్థులూ ఎక్కువగానే ఉన్నారు. లెక్కలు తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు తప్పింది తెలుగులోనే. పదో తరగతి ప్రథమ భాషలో తెలుగు/హిందీ/ఉర్దూ తీసుకోవడానికి అవకాశం ఉం ది. రాష్ట్రంలో ప్రథమభాషగా తెలుగు తీసుకున్న వి ద్యార్థుల సంఖ్య ఎక్కువ. తర్వాత స్థానం ఉర్దూ తీసుకున్న వారిది. గణితంలో గరిష్టంగా 6.17 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా 4 శాతం మంది ప్రథమ భాషలో గట్టెక్కలేకపోయారు. మాతృభాషలో ఫెయిల్ అయిన వారి శాతం గతేడాది కంటే 0.65 శాతం ఎక్కువగా ఉంది. మాతృభాష కాని ద్వితీయ భాష(తెలుగు/హిందీ)లో కనిష్టంగా 1.73 శాతం మంది విద్యార్థులే ఫెయిల్ అయ్యారు. ద్వితీయభాష ఉత్తీర్ణత మార్కులు 18 కావడం కూడా ఉత్తీర్ణత శాతం పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ఇంగ్లిష్ మహాకష్టం మన విద్యార్థులకు ఇప్పటీకీ మింగుడుపడని సబ్జెక్టు ఇంగ్లిషే. ఆంగ్లంలో 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పాసయితే.. అందులే 1.44 శాతం మంది అంటే కేవలం 15,328 మందికే ఏ1 గ్రేడ్ వచ్చింది. లెక్కల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయి ల్ అయినా ఆంగ్లంతో పోలిస్తే లెక్కల్లో ఏ1 గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.