సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో ఇచ్చే 20 శాతం ఇంటర్నల్ మార్కులను వచ్చే వారంలో ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారు(డీఈవో)లకు సోమవారం పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఈవోలతో ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.
ఇంటర్నల్ మార్కుల అప్‌లోడ్ అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఈవోలకు వివరించారు. దీనిపై ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించాలని, వచ్చే వారంలో ఈ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని చిరంజీవులు సూచించారు. ఈసారి పదో తరగతి ఫలితాల శాతాన్ని పెంచాలని, టీచర్ల హాజ రుపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
అలాగే ఏడాది కాలంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల నెలవారీ పదోన్నతులు, ప్రైవేట్ స్కూళ్ల లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించడం, మండలాల్లో మోడల్ స్కూళ్ల ఏర్పాటుపైనా చర్చించారు. పాఠశాల విద్యాశాఖ తోపాటు, సర్వశిక్షా అభియాన్‌లో వివిధ పథకాల కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై మంగళవారం పూర్తిస్థాయి ప్రతిపాదనలు అందజేయాలని విద్యా శాఖ విభాగాధిపతులను కూడా ఆయన ఆదేశించారు.
వారంలో పది ఇంటర్నల్ మార్కుల అప్‌లోడ్
Published Tue, Feb 10 2015 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement