
మంథని/యైంటింక్లయిన్‌కాలనీ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు(Online Betting App) అనేకమందిని బలితీసుకుంటున్నాయి. ఈ వ్యసనానికి అలవాటుపడ్డ యువ కులు అప్పులపాలై, ఆఖరు కు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేన సాయితేజ (26) ఈనెల 18న రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు.
సాయితేజ గోదావరిఖనిలో చదువుకున్నాడు. అక్కడే ఓ యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సాయితేజ గోదావరిఖనిలోనే ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడడంతో సాయితేజ దారితప్పినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి సాయితేజ బెట్టింగ్‌లకు అలవాటు పడటంతో రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు.
ఇంట్లో ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. మళ్లీ అటువైపు వెళ్లనని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మా రు. కానీ, బెట్టింగ్ వ్యసనం బారినపడ్డ సాయితేజ, మళ్లీ అదేతోవలో వెళ్లడంతో మరోసారి అప్పుల పాలయ్యాడని, ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది. అతను ఈ సారి రూ.4లక్షలకు పైగా అప్పు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment