
దేశంలో నివసించే ప్రజలకు అత్యంత కీలకమైన కార్డులు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఆధార్ కార్డు, రెండోది పాన్ కార్డు. ప్రతిరోజూ ఏదో ఒక పని కోసం ఈ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ రెండు డాక్యుమెంట్లు లేకపోతే అనేక పనులు నిలిచిపోతాయి.
అందుకే ఈ రెండు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండటం చాలా ముఖ్యం. కొంతమంది ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకుంటుంటారు. వాటి నంబర్లు కూడా తెలియవు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి గురించి మీరు ఆన్‌లైన్లో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏమిటి.. సులభమైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ నెంబర్ రీట్రీవ్ చేసుకోండిలా..
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
'రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ' ఆప్షన్ కోసం చూడండి.
క్యాప్చా కోడ్‌తోపాటు మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్‌తో లింక్ చేసిన ఈ-మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ముందుకు సాగడం కోసం దానిని నమోదు చేయండి.
విజయవంతంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే, సహాయం కోసం ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.
పాన్ నెంబర్ పొందండిలా..
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ సందర్శించండి
'నో యువర్ పాన్'పై క్లిక్ చేయండి
మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
అథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
వెరిఫికేషన్ తర్వాత మీ పాన్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment