Know
-
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
చదువులో కాదు.. అనుభవంలో ...
త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో...‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు... కఱుకైన హృద్రోగ గహనమును గొట్ట....’’ అంటారు. ఎటువంటి గుణాలయినా ఉండొచ్చు. ఎంత తెలివిగలవాడయినా కావొచ్చు. ఏది తెలియాలో అది తెలియాలంటే మాత్రం గురువు ఉండి తీరాలి. ఏది తెలియాలి... అంటే.. కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... హృద్రోగం చాలా కరుకైనదే.. ఊపిరి అందని వాడికి అది పరీక్షాకాలం... ఇంతమందిని విడిచిపెట్టి పోతున్నానన్న భావన.. అది కరుకైనది... దానిని గహనమున కొట్ట... అంటే అరణ్యంలా.. ఎలా చేస్తున్నాడో తెలియకుండా దానిని కొట్టగలిగినవాడు గురువు... అన్నాడు. తెలియని విషయాలు తెలియుకుండా పోవడం... తెలియవు అన్నంత వరకు పనికొస్తాయేమో గానీ.. ఆత్మ అనుభవం లోకి రావడం... అద్వైతానుభూతిని పొందడం... అన్న దగ్గరకు వస్తే అది గురువుగారి వీక్షణములచేత మాత్రమే సాధ్యమవుతుంది.. అంటాడు త్యాగయ్య. అమ్మవారిని మూడు రకాలుగా – కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని... అక్షి సంబంధంగా పిలుస్తారు. ఆమె గురు మండల రూపిణి. గురువులు కూడా మూడు రకాలుగా అను గ్రహిస్తారు. కామాక్షి–కుక్కుట న్యాయం.. అలాగే గురువు హస్త మస్తక సంయోగంలో శిష్యుడి బ్రహ్మస్థానం లో తన చేతిని ఉంచి అనుగ్రహిస్తాడు. అది పక్షి గుడ్డును పొదిగి దాని నుంచి పిల్ల వచ్చేటట్లుగా చేయడంలాగా ఉంటుంది. అలా పొదుగుతాడు శిష్యుడిని. అదే స్పర్శ దీక్ష. రెండవది మీనాక్షి. విజ్ఞాన శాస్త్రంలో ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేపగుడ్లు పెట్టి, వాటిని ప్రేమగా చూసిన మాత్రం చేత అవి పిల్లలవుతాయి.. అంటుంది. అలా గురువు కేవలం తన చూపులతో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా భగవాన్ రమణులు ఒకసారి అనుగ్రహించారు. అది మీనాక్షి. మూడవది విశాలాక్షి. బ్రహ్మాండం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పరదేవత చూస్తుంటుంది. అందరూ తన బిడ్డలే అన్న స్మరణతో అనుగ్రహిస్తుంటుంది. ‘వాడు వృద్ధిలోకి రావాలి’ అని గురువు గారు సంకల్పించినంత మాత్రం చేత శిష్యుడు ఆ స్థితిని పొందుతాడు. అది విశాలాక్షీ తత్త్వం. నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి... ఈ మూడూ కూడా శిష్యుడి వైపునుంచి గురువుకు, గురువు వైపునుంచి శిష్యుడికి ఉంటాయి. అదొక విచిత్రం. తెలిసినా తెలియక పోయినా నన్ను గురువుగారు ఒకసారి ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు, స్మరిస్తే చాలు.. అన్న నమ్మకం ఉంటే... వాడు గురి కలవాడు. ఎవరి మీద అది ఉందో వారు గురువయిపోతారు. వాడి కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... అంటే అలా కొట్టగలిగినవాడు గురువు.. అంటున్నాడు త్యాగరాజు. అజ్ఞాన గ్రంథులను తొలగించి జ్ఞానాన్ని కలుగ చేయాలి అంటే... ఒక సద్గురువు ఉండాలి. అప్పుడు భగవంతుని దర్శనం.. ఆత్మ అనుభవంలోకి వచ్చి... శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది, నిష్కళంకమైనది... అయిన ఆత్మ నేను తప్ప శరీరం కాదు... అని శ్లోకాల్లో చెప్పినవి, నోటితో చెప్పినవి కాక.. అనుభవంలో తెలుసుకుంటాడు శిష్యుడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి
మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది. దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది. – తూమాటి భద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
క్రెడిట్ కార్డు మోసం: డబ్బులు పోతే ఏం చేయాలి?
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో క్రెడిట్, డెబిట్ కార్డుల అక్రమ లావాదేవీలు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కార్డు యజమానికి తెలియకుండా కార్డు విదేశాలలో స్వైపింగ్ కావడం, కస్టమర్ల లక్షల కొద్దీ డబ్బులు పోగొట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఖాతాదారుల ప్రమేయం, ఓటీపీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఆన్లైన్ షాపింగ్ తదితర ప్రాంతాల్లో కార్డు స్వైపింగ్ కావడం మరింత ఆందోళన సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి డబ్బులు మాయమైతే ఏం చేయాలి. దీనికి ఆర్బీఐ ఇటీవలి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం! ఇలాంటి లావాదేవీలను గుర్తించినపుడు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదు. అనుమానిత లావాదేవీ జరిగినట్టు గుర్తించిన వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి లేదా బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. అలాగే బ్యాంకు అంబుడ్స్మెన్లలో ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్‌క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ కార్డుపై మీకు తెలియకుండా జరిగిన లావాదేవీలకు మీరు బాధ్యులు కారు. అలాంటి కేసులలో వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలగకుండా, భారం పడకుండా చర్యలు తీసుకోవడంతో వెంటనే తాత్కాలికంగా మరో కార్డును వినియోగదారుడికి అందించే ఏర్పాటు కూడా చేస్తుంది. ఆ తరువాత వినియోగదారుడి కార్డు ఎక్కడ ఉపయోగించారనే విషయంపై బ్యాంకు ఆరా తీస్తుంది. వినియోగదారుడి ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవీలకు సంబంధించి వాస్తవంగా మీకు తెలియకుండా జరిగిందా? కావాలనే మీరు చేయించారా? అనే విషయాలపై కూడా కనుగొంటుంది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తమ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్బీఐకి తెలియజేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు తిరిగి చెల్లిస్తుంది. కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ మోసాలకు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. అయితే కార్డు లేదా ఆన్లైన్ లావాదేవీ నుంచి డబ్బు కోల్పోయినట్లయితే మూడు పనిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియపరచాల్సి ఉంటుంది. ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు పనిదినాల్లోగా తెలియజేసినట్లయితే, బ్యాంకు ఖాతాదారు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకూ నష్టాన్ని భరించాల్సి రావచ్చు. అది ఖాతా రకం, క్రెడిట్ కార్డు పరిమితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖాతాదారు నిర్లక్ష్యం( ఓటీపీ, సీవీవీ లాంటి వివరాలు వెల్లడించడం ద్వారా) కారణంగా మోసం జరిగిన సందర్భంలో నష్టాన్ని బ్యాంకు భరించదు. అది ఖాతాదారే భరించాల్సి ఉంటుంది. కానీ అనధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియజేసిన వెంటనే మళ్లీ ఏదైనా అనుమానస్పద లావాదేవీ జరిగితే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుంది. ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిన తర్వాత బ్యాంకు ఖాతాదారు సదరు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అనధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 పనిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెనక్కు వస్తుందనే అంశం అనధికారిక లావాదేవీ జరిగిన రోజు ఎంత డబ్బు మినహాయించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దేశంలో క్రెడిట్ కార్డుతో జరిగే లావాదేవీలలో ఓటీపీ, పిన్ తప్పని సరిగా ఉంటాయి. ఆన్లైన్లో కార్డు వివరాలను ఉపయోగించి జరిగే లావాదేవీలలో ఓటీపీ, కార్డును నేరుగా ఉపయోగించి జరిగే లావాదేవీలలో పిన్ నెంబర్ తప్పని సరిగా ఉపయోగించాలి. అయితే అంతర్జాతీయంగా కొన్ని దేశాలలో ఆన్లైన్లో జరిగే లావాదేవీలకు ఓటీపీ అనేది తప్పనిసరి కాదు. ఇలాంటి లావాదేవీలు కార్డు నెంబరు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలు ఉంటే సరిపోతుంది. దీనినే సైబర్ చీటర్లు ఆసరాగా చేసుకుంటున్నట్లు పోలీసులు, బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. కార్డుపైనే ఈ వివరాలు ఉండడంతో ఇవి తస్కరణకు గురయ్యే అవకాశాలుంటాయి. దీంతో కార్డును ఎవరికి ఇవ్వకపోవడం, ఎక్కడ పడితే అక్కడ స్వైపింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలి. -
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి మహబూబ్‌నగర్ న్యూటౌన్: తల్లిపాల ప్రాధాన్యతను ప్రజలందరు తెలుసుకోవాల్సిన అవసరముందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోత్సS్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణిలు, బాలింతలు, కిశోరబాలికలు, ఏఎ¯Œæఎంలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి మహిళ ప్రసవించిన వెంటనే ముర్రుపాలు పట్టడం, 6 నెలల వరకు ముర్రు పాలు పట్టడం వంటి విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3న స్కూళ్లలో కిశోరబాలికలకు తల్లిపాల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4న జిల్లా స్థాయిలో తల్లిపాలు, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వటం, ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించడం వంటి వాటిపై అవగాహన, 5న ప్రాజెక్టు స్థాయిలో అవగాహన, 6న వెల్‌బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
ఆర్థిక రాజధానిలో ఆ ప్రదేశాలు మీకు తెలుసా?
ముంబైః ఎత్తైన కట్టడాలు, సినీతారల జిలుగువెలుగులు, స్టూడియోలు, ఖరీదైన మార్కెట్లు, గేట్ వే ఆఫ్ ఇండియాను చూస్తూ కనిపించే తాజ్ మహల్ హోటల్... ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై కలల నగరం. ప్రపంచానికి అమెరికా దేశం ఓ కలలా ఎలా కనిపిస్తుందో.. భారత దేశానికి ముంబై ఆలాంటిదనే చెప్పాలి. ఏడు ద్వీపాల నగరంగా కూడ ఆ నగరాన్ని పిలుస్తారు. అయితే అక్కడి కొన్ని అద్భుత స్థలాలను గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ విభిన్న ప్రాంతాలను గుర్తించడంలో మెట్రో నగరం... శ్రద్ధ తీసుకోవడం లేదు. ముంబై ప్రజలు.. హాయ్ చెప్పే కన్నా ముందు చాయ్ అంటారనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఉదయం రాత్రి తేడా లేదు. జనసంద్రం నుంచీ దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఓ గుక్కెడు టీ తాగేందుకు అక్కడి జనం ఎంతో ఇష్టపడతారు. సముద్ర తీరంలో కూర్చొని ఒక్క సిప్ చాయ్ తాగి, ఒత్తిడినుంచి బయట పడుతుంటారు. ముంబైలోని మిడ్ నైట్ చాయ్, వర్లీ సీ ఫేస్ వంటి ప్రదేశాలు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. నగరంలో మరో ప్రధానమైన ప్రాంతం.. ధారవి కచ్చర్పట్టి. ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా ప్రసిద్ధి పొందిన ప్రాంతమది. అయితే చాలామంది సందర్శకులకు తెలియనిది అక్కడి ధారవి మార్కెట్. షాపింగ్ చేసేందుకు అదో ప్రధాన కేంద్రంగా చెప్పాలి. లెదర్ జాకెట్స్ నుంచి బ్యాగ్ ల వరకూ, ఫ్యాషన్ ఉపకరణాల నుంచి జ్యువెలరీ వరకూ ఏ వస్తువైనా ధారవిలో దొరికిపోవాల్సిందే. బల్లార్డ్ ఎస్టేట్ లోని బ్రిటానియా కంపెనీ రెస్టారెంట్ దర్శించారంటే ఓ ప్రత్యేక అనుభూతి కలగక మానదు. అక్కడి ఇరానీ కేఫ్ లో 93 ఏళ్ళ వ్యక్తి... పర్షియన్ ఫ్లేవర్ తో రుచికరమైన టీ అందించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆ వయసులో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అక్కడ సేవలు అందించడం ముంబై నగరానికే వన్నె తెస్తుంది. అలాగే నగరంలోని క్వీన్స్ నెక్లెస్ పై కుంటుంబంతో సుదీర్ఘమైన డైవ్ అనుభవం.. హృదయాంతరాలను హత్తుకు పోతుంది. అక్కడ బ్యాచులర్స్ అందించే ప్రత్యేక సేవలకు తోడు... స్ట్రాబెర్రీ షేక్ తాగితే సందర్శకులు ఫిదా అయిపోవాల్సిందే. ముంబై మానియా భావాల్లో మరింత చైతన్యం నింపాల్సిందే. ముంబై పశ్చిమ శివారు ప్రాంతం.. బాంద్రాలో చెట్ల నీడన నెలవైన విలక్షణ హెర్సెర్ఛ్ బేకరీ కూడ సందర్శకుల మనసును కట్టిపడేస్తుంది. ఆకర్షణీయమైన కుటీరాలతో విభిన్నంగా కనిపిస్తూ...ఆనందతీరాలకు చేరుస్తుంది. చెట్ల నీడన పక్షుల గూళ్ళను తలపించే కాటేజ్ లలో.. సాధారణ బర్గర్లు, ర్యాప్ లు మొదలైన భక్ష్య భోజ్యాలతోపాటు చల్లని నిమ్మరసం.. ఆత్మారాముడి ఆరాటాన్ని తీర్చడంతోపాటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ స్థలాన్ని సల్మాన్ ఖాన్ కూడ తరచుగా సందర్శిస్తుంటాడన్నవార్తలు ఉన్నాయి. ఇంకా ఆలస్యం దేనికి? ముంబై నగరంలో వేసవి విడిదికి సిద్ధమైపొండి మరి!