
ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.
ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.
సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.
ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk.
This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025