కృత్తిమ మేధ (ai) చాట్‌జీపీటీ రాకతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్‌లో ప్రకంపనలు నెలకొన్నాయి. మనుషుల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు, ఇప్పటికే పలు రంగాల్లో మనుషుల స్థానాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించడమే అందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదికలో రానున్న 10 ఏళ్లల్లో అభివృద్ది చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషిన్ వంటి టెక్నాలజీలతో ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, పని ప్రదేశంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా దాదాపు పది మందిలో ఎనిమిది మంది మహిళలు వేరే కంపెనీకి వెళ్లాల్సి వస్తుందని లేదా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని అధ్యయనంలో గుర్తించింది.
ఫుడ్ సర్వీస్, కస్టమర్ కేర్, సేల్స్, ఆఫీస్ సపోర్ట్ వంటి రంగాల్లో ఎక్కువ మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. పురుషులతో పోలిస్తే తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ ఆటోమేషన్ కారణంగా ఉపాధి పోయే అవకాశం ఉందని వెల్లడించింది. 2030 నాటికి పురుషుల కంటే మహిళలు చేస్తున్న ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతికూల ప్రభావం ఎక్కువ శాతం ఉంది.
ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగం చేస్తున్న సంస్థలో కొనసాగాలంటే.. సదరు కంపెనీకి కావాల్సిన నైపుణాలను తెలుసుకొని, ముందే నేర్చుకొని ఉండడం మంచిదన్న అభిప్రాయాన్ని హైలెట్ చేసింది. మొత్తం మీద, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఈ సందర్భంగా అమెరికాలో కనీసం 12 మిలియన్ల మంది కార్మికులు 2030 చివరి నాటికి వృత్తులను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. 300 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. చాట్‌జీపీటీలు వంటి టెక్నాలజీలు పోటాపోటీగా మనుషులు రాసే కంటెంట్‌లు.. కృత్తిమ మేధ’ టూల్స్ రాస్తాయని, రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత మరింత పెరిగే అవకాశం స్పష్టం చేసింది.
చదవండి👉 అంతా చాట్‌జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment