కేవలం రూ.15,000 పెట్టుబడితో రూ.1.2 కోట్లు సంపాదించడం ఎలా? ఇదేదో క్లిక్‌బైట్ టైటిల్ అనుకుంటే పొరబడ్డట్లే. అక్షర సత్యం. ఎందుకంటే? కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగంలో ఇలా అసాధ్యాల్ని సుసాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీతో కోకొల్లలు.
ఇద్దరు స్నేహితులు. ఓ వైపు జాబ్ చేస్తూ అదనపు ఆదాయం కోసం చాట్‌జీపీటీని ఉపయోగిస్తూ రూ.15,000 పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత (AI) స్టార్టప్‌ను ప్రారంభించారు. అయితే, రోజులు గడిచే కొద్ది చాట్‌జీపీటీ వినియోగం పెరగడంతో ఆస్టార్టప్‌కి ఊహించని విధంగా ఫండింగ్ వచ్చింది. ఈ డిమాండ్‌నే ఆ ఇద్దరు స్నేహితులు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వెంటనే అదనపు ఆదాయం కోసం ప్రారంభించిన స్టార్టప్‌ను రూ.1.2 కోట్లకు అమ్మేశారు.
ఎవరా ఇద్దరు స్నేహితులు?
గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్ సంస్థ వై కాంబినేటర్ వర్చువల్ స్టార్టప్ ఫౌండర్ మీటప్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సాల్ ఐయెల్లో,మోనికా పవర్స్‌లు పరిచయమయ్యారు. ఆ మీటప్ తర్వాత ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బులు సంపాదించేందుకు వీలుగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించాలని అనుకున్నారు.
చాట్‌జీపీటీని వినియోగించడంలో ఆరితేరారు
స్టార్టప్‌ను ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు మార్కెట్‌లో రిసెర్చ్ చేశారు. ఇందుకోసం చాట్‌జీపీటీని ఉపయోగించారు. మనం అడగదలుచుకున్న ప్రశ్న ఏదైనా చాట్‌జీపీటీకి అర్ధమయ్యేలా దాని భాషలోనే అడగాలి. అలా అడిగితే వంద శాతం సత్ఫలితాలు వస్తాయి. ఆ ఇద్దరు స్నేహితులు ఇదే విషయాన్ని గ‍్రహించారు. పరిధికి మించి చాట్‌జీపీటీని వినియోగించడంలో నిష్ణాతులయ్యారు.
అదే బిజినెస్ ఐడియా మారి
అదే సమయంలో ఏఐ స్టార్టప్‌లలో సీటీవోగా పనిచేస్తున్న ఐయెల్లో, బ్రాండింగ్ కంపెనీలో ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తున్న పవర్స్‌కు ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఏఐ ఆధారిత బిజినెస్ మార్కెట్ రీసెర్చ్ టూల్‌ను ప్రాంభించాలని అనుకున్నారు.
పెట్టుబడి రూ.15,000
వెంటనే రూ.15,000 పెట్టుబడితో నాలుగు రోజులు కష్టపడి DimeADozen.ai పేరుతో ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే రీసెర్చ్ చేయాలి. ఆ అవసరాల్ని ఈ వెబ్‌సైట్ నుంచి అందిస్తారు. ట్రెడింగ్‌లో ఉన్న బిజినెస్ ఏంటి? ఎక్కడ? ఎలా? ప్రారంభించాలి. లాభాల్ని ఎలా గడించాలి? ఇలాంటి ప్రశ్నల ప్రవాహానికి తడబడకుండా తడుముకోకుండా చాట్‌జీపీటీని ఉపయోగించి కస్టమర్లకు సమాచారం అందిస్తారు. ఇందుకోసం సాంప్రదాయ రీసెచ్చ్ ఏజెన్సీలు లేదా రీసెర్చ్ ఇంజిన్‌లు వసూలు చేసే ధరకంటే తక్కువ ఛార్జ్ చేస్తారు.
స్టార్టప్‌ను ఎలా ప్రారంభించారు? ఎప్పుడు అమ్మారు?
నాలుగు రోజుల్లో స్టార్టప్ ప్రారంభించిన ఐయెల్లో, మోనికా పవర్స్‌లు దానిని ఏడు నెలల పాటు కొనసాగించారు. గత నెలలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఫెలిప్ అరోసెమెనా,ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తున్న డేనియల్ డి కార్నెయిల్’లు భార్య భర్తలు. వాళ్లిద్దరు DimeADozen (డీమెడ్జన్)ని పార్ట్‌టైమ్‌లా కాకుండా ఫుల్‌టైం సంస్థగా అభివృద్ది చేయాలని భావించారు. దానిని 1.2 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేశారు.
రూ.15,000 పెట్టుబడితో కోట్లలో లాభం
ఆ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఐయెల్లో,పవర్స్‌కు ఒక్కొక్కరికి రూ.54,82,732.20 కంటే ఎక్కువే వచ్చింది. ఇక స్టార్టప్ కోసం ఖర్చు పెట్టింది కేవలం డొమైన్ ఖర్చు , డేటాబేస్ మొత్తం కలిపి రూ.15,000 ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం లాభమే. పైగా తాము అమ్మిన కంపెనీకి సలహాదారులగా వారానికి ఐదుగంటలే పనిచేయాలని భావిస్తున్నాం. ఇది నిజంగా డబ్బును ముద్రిస్తుందంటూ ఐయెల్లో సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment