ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.
రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు.
ఈ తరుణంలో పారిస్‌లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్‌లో మస్క్ రిమోట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్‌లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్‌లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.
ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్‌లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment