ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు. ఇలాంటి టైంలో మానవ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి టూల్స్ వినియోగం పెరగడం. వాటివల్ల ఉద్యోగం కోల్పోయిన వారి బాధల్ని, కష్టాల్ని, కన్నీటిని వివరించడం వర్ణనాతీతం.
గత ఏడాది నవంబర్‌లో విడుదలైన చాట్‌జీపీటీ సహా ఏఐ జనరేటివ్ టూల్స్ రాకతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే చర్చ టెక్ ప్రపంచంలో ఊపందుకుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడంతో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి.
ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది
ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగం కోల్పోయానంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. 2002లో ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్‌మోడో ప్రారంభమైంది. అయితే తాజాగా, గిజ్‌మోడో స్పానిష్ (Español) లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని యాజమాన్యం తొలగించింది. వారి స్థానంలో చాట్‌జీపీటీని వినియోగించడం ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఉద్యోగం కోల్పోయిన బాధిత ఉద్యోగుల్లో ఒకరైన మాటియాస్ ఎస్ జవియా ట్విటర్ వేదికగా స్పందించారు. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది. గిజ్‌మోడ్ ట్రాన్స్‌లేటర్లను మార్చేసేంది. వారి స్థానంలో ఏఐని ఉపయోగిస్తుంది. అంటే మనుషులు ఉద్యోగుల్ని ఏఐ రిప్లేస్ చేసిందంటూ ట్వీట్‌లో వాపోయారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టికల్స్ ‘ఆర్టిఫిషియల్’గానే ఉన్నాయ్
ఉద్యోగుల తొలగింపుపై గిజ్‌మోడో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంజీ అనే కార్మిక సంఘం సైతం కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిజ్‌మోడోలో ఎంతో నైపుణ్యం కలిగిన పాత్రికేయుల స్థానంలో కృత్రిమ మేధను తీసుకురావడాన్ని కార్మిక సంఘం ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏఐని ఉపయోగించి ట్రాన్స్‌లేషన్ చేయడం అంత మంచిది కాదు. ఆ ఆర్టికల్స్‌ను యూజర్లను ఆకట్టుకోవడం లేదు. ఆక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్ క్యారీ చేసేలా అంశాలు లేవని అన్నారు.
సంస్థలు పట్టించుకోవడం లేదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ ఉద్యోగాలు పోయాయని గతంలో కార్మికులు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కంపెనీలు ఉద్యోగుల ఆవేదనని పట్టించుకోవడం లేదు. డబ్బును ఆదా చేసేందుకు, వేగవంతంగా వారి పని పూర్తి చేసేందుకు సహకరిస్తున్న ఏఐ టూల్స్‌ను వినియోగించేందుకు మొగ్గు చూపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment