translater
-
‘AI నా ఉద్యోగాన్ని లాగేసుకుంది’
ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు. ఇలాంటి టైంలో మానవ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి టూల్స్ వినియోగం పెరగడం. వాటివల్ల ఉద్యోగం కోల్పోయిన వారి బాధల్ని, కష్టాల్ని, కన్నీటిని వివరించడం వర్ణనాతీతం. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన చాట్‌జీపీటీ సహా ఏఐ జనరేటివ్ టూల్స్ రాకతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే చర్చ టెక్ ప్రపంచంలో ఊపందుకుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడంతో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగం కోల్పోయానంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. 2002లో ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోడో ప్రారంభమైంది. అయితే తాజాగా, గిజ్మోడో స్పానిష్ (Español) లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని యాజమాన్యం తొలగించింది. వారి స్థానంలో చాట్‌జీపీటీని వినియోగించడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉద్యోగం కోల్పోయిన బాధిత ఉద్యోగుల్లో ఒకరైన మాటియాస్ ఎస్ జవియా ట్విటర్ వేదికగా స్పందించారు. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది. గిజ్మోడ్ ట్రాన్స్‌లేటర్లను మార్చేసేంది. వారి స్థానంలో ఏఐని ఉపయోగిస్తుంది. అంటే మనుషులు ఉద్యోగుల్ని ఏఐ రిప్లేస్ చేసిందంటూ ట్వీట్లో వాపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టికల్స్ ‘ఆర్టిఫిషియల్’గానే ఉన్నాయ్ ఉద్యోగుల తొలగింపుపై గిజ్మోడో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంజీ అనే కార్మిక సంఘం సైతం కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిజ్మోడోలో ఎంతో నైపుణ్యం కలిగిన పాత్రికేయుల స్థానంలో కృత్రిమ మేధను తీసుకురావడాన్ని కార్మిక సంఘం ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏఐని ఉపయోగించి ట్రాన్స్లేషన్ చేయడం అంత మంచిది కాదు. ఆ ఆర్టికల్స్‌ను యూజర్లను ఆకట్టుకోవడం లేదు. ఆక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్ క్యారీ చేసేలా అంశాలు లేవని అన్నారు. సంస్థలు పట్టించుకోవడం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ ఉద్యోగాలు పోయాయని గతంలో కార్మికులు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కంపెనీలు ఉద్యోగుల ఆవేదనని పట్టించుకోవడం లేదు. డబ్బును ఆదా చేసేందుకు, వేగవంతంగా వారి పని పూర్తి చేసేందుకు సహకరిస్తున్న ఏఐ టూల్స్‌ను వినియోగించేందుకు మొగ్గు చూపడం గమనార్హం. -
Translator: తోడుదొంగ?
‘‘అనువాదకుడనేవాడు మూలరచయితకి తోడుదొంగ!’’ అన్నాడు హొర్హే గాంజాలిజ్ మోర్. అనువాదాలు చదువుకునేవాళ్ళలో చాలామందికి తెలిసిన విషయమే ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడు చెప్తున్నాడు! అతను చెప్పని మాటొకటి వుంది– ఈ తోడుదొంగలు ఉమ్మడిగా దోచుకునేది పాఠకుల హృదయాలను!! అవును మరి, రచయితలన్నాకా అన్ని విషయాలూ విప్పిచెప్పేస్తారా? కాస్తా అర చాటుగానో, తెరచాటుగానో వాళ్ళు చెప్పే మాటల్లోని సారాంశాన్ని గ్రహించాల్సిన రసజ్ఞత వినే వాడిది. పోతే, రచయితలు – అనువాదకుల గురించి మోర్ చెప్పిన విషయం తెలుగుజాతికి బాగా తెలుసు. ఎందుకంటే, మన ‘‘ప్రామాణిక సాహిత్యం మొదలయిందే ఓ అనువాదంతో. వ్యాసుడనే కృష్ణ ద్వైపాయనుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ‘కవిత్రయం’ అనే నన్నయ, తిక్కన, ఎర్రన తెలిగించడంతోనే ప్రామాణిక సాహిత్య సృజన మొదలయిందని మన పెద్దలు చెప్పారుగా! కాకపోతే, భారతానువాదం పూర్తయ్యేసరికి పాఠకులకు దక్కేది మూలపాఠంలోని 21.5 శాతమేనని వాళ్లు చెప్పలేదు. తర్వాతి రోజుల్లో మరో పెద్దాయన ఆ లెక్కతీశాడు! అయినా, అనువాదమంటే ఆషామాషీ వ్యవహారమా? శ్రీనాథుడు ఆరేడువందల సంవత్సరాల కిందట అదేమాట అన్నాడు కదా! శబ్దాన్ని అనుసరించి–భావాన్ని ఉపలక్షించి – అభిప్రాయాన్ని గ్రహించి – రసాన్ని పోషించి–అలంకారాన్ని భూషించి – ఔచిత్యాన్ని ఆదరించి – అనౌచిత్యాన్ని పరి హరించి మరీ తాను అనువాదం సాగించానన్నాడా పండిత కవి. మనలో మనమాట – విద్వదౌషధం అనిపించుకున్న నైషధాన్ని తెనిగిస్తూ, ‘‘గమికర్మీకృత నైకనీవృతుడనై’’ అంటూ పదబంధాలకు పద బంధాలను ఎత్తుకొచ్చి మెత్తేసిన శ్రీనాథుడు చెప్పినట్లే చేసివుంటే, ‘‘మీ ‘డుమువులు’ మీరు తీసేసు కుని, మా నైషధం మాకు ఇచ్చెయ్యం’’డని సంస్కృత విద్వాంసులు ఎందుకంటారు? అయితే, కవిగా ఏం చేసినా, పండితుడిగా శ్రీనాథుడికి అనువాదం కేవలం భాషాంతరీకరణం మాత్రమే కాదని బాగా తెలుసు! ‘‘అనువాదం మాటలకే పరిమితమయిన వ్యవహారం కాదు సుమా! ఒకానొక సంస్కృతిని సంపూర్ణంగా బోధపరచడమే అనువాదమవుతుం’’దని మనకాలపు బహుముఖ ప్రజ్ఞావంతుడు యాంటనీ బర్జెస్ అదే మాట మనకర్థమయ్యేలా – ఆంగ్లంలో– అన్నాడు! ‘అనువాదమనే ప్రక్రియే లేకపోతే, మనం సరిహద్దులకే పరిమితమైపోతాం! అంచేత అను వాదకుడే నా కీలక సహచరుడు. అతగాడే, నన్ను విశాల విశ్వానికి పరిచయం చేస్తా’’డన్నాడు ఇటాలో కాల్వినో – పశ్చిమాంధ్ర భాషలో. (అనగా, ‘‘ఇటాలియన్లో’’ అని వివరించాలంటారా?) ప్రపంచానికి ఈ కొసన ఉన్న దక్షిణాంధ్ర ప్రాంతంలో, ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట పుట్టిన ధూర్జటి రాసిన ‘‘శ్రీకాళహస్తీశ్వర శతకం’’ ఆంగ్లంలోకి అనువాదమయి, అనేక విదేశ భాషలకు పరిచయం కావడం చూస్తే కాల్వినో మాటలు ఎంత వాస్తవాలో బోధపడుతుంది! ఎక్కడో ఐరోపా ఖండం ఉత్తరాంచలంలో పొడుగ్గా వ్యాపించి వుండే దేశం నార్వే. అక్కడ పుట్టిన హెన్రిక్ ఇబ్సెన్, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచమంతటా ఆధునిక నాటక కళను వ్యాపింపచేశాడంటే, అది అనువాదకుల సహాయంతోనే సాధ్యమయింది. అలాగే, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచాన్నం తటినీ ప్రభావితం చేసిన మార్క్స్–ఎంగెల్స్ లాంటి అసాధారణ మేధావులనే ప్రభావితులను చేసినవాడు ఫ్రెంచ్ నవలారచయిత, నాటకకర్త ఆనరే ద బాల్జాక్. బాల్జాక్ రచనలు కూడా అను వాదకుల పుణ్య మానే అన్ని దేశాల్లోనూ భావవిప్లవాన్ని రగిలించగలిగాయి. ‘‘మాటలు ప్రపంచ మంతా పర్యటిస్తాయి; వాటికి అనువాదకులే చోదకు’’లంది ఆనా రుస్కోనీ. అది అక్షర సత్యం!! ఆమె స్వయంగా ఓ అనువాదకురాలు కావడం వల్లనే అంత చక్కగా చెప్పగలిగిందనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్ధంలో చాలా దేశాల గురించిన సమాచారం దూరదేశాలకు సైతం వ్యాపించినందువల్ల ఉన్నదున్నట్లుగా అనువాదాలు చేసినా పాఠకుల ఆదరణకు పాత్రం కాగలుగు తున్నాయి. కానీ, అంతకుముందు – ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు – చాలామంది అనువాదకులు అనువాదాలను అనుసృజనల రూపంలో చేయవలసివచ్చింది. కానీ, రచయితలు ఈ తరహా అనుసృజనలను మెచ్చలేదు. ‘‘మూలంలోని ఏ విషయమూ మార్చకుండానే, ఆ భాషలో చెప్పిందాన్ని అంతటినీ మరో భాషలోకి మార్చడమే అనువాద’’మని గ్యుంథర్ గ్రాస్ అన్నమాట రచయితలకు అనువాదకుల మీద ఉన్న ఫిర్యాదును ప్రతిధ్వనిస్తోంది. ఉదాహరణకు, ఆలివర్ గోల్డ్‌స్మిత్ నవల ‘‘ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్’’ను, కందుకూరి వీరేశలింగం కొంతవరకూ అనువాదమే చేశారు. కానీ, తన ప్రయత్నం సఫలం కాదనిపించి, ‘రాజశేఖర చరిత్రము’ పేరిట అనుసృజనగా వెలువరించారు. అది పాఠకుల సౌకర్యార్థం చేస్తున్న పనేనని ఆయన త్రికరణశుద్ధిగా నమ్మారు. ఆయన అనుసృజన ‘ద ఫార్చ్యూన్ వీల్’ పేరిట యథామూలంగా ఆంగ్లంలోకి అనువాదం కావడం ఓ విశేషం! సృజనాత్మక సాహిత్యం విషయంలో అనుసృజనలను –ఒక మేరకు– కవిత్వంలో ఏమైనా సహిస్తున్నారేమో కానీ, ఇతరత్రా ఈ ఆచారం అంతరించిందనే చెప్పాలి. చివరిగా ఒక్కమాట– ‘విద్వత్వంచ నృపత్వంచ న ఏవతుల్యే కదాచన– స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే!’ అని చిన్నప్పుడు మనమందరం చదువుకున్న ఓ సుభాషితం చెబుతోంది. ఈ ఏడాది శతజయంతి జరుపుకొంటున్న రాచమల్లు రామచంద్రారెడ్డి అలా అన్నిచోట్లా ఆరతు లందుకున్న విద్వాంసుడు. ఆయనకి మనమూ అర్పిద్దాం నీరాజనం! -
గూగుల్ ట్రాన్స్ లేటర్‌తో మిస్సింగ్ కేసు ఛేదన
రాజేంద్రనగర్: తప్పిపోయి తిరుగుతున్న వృద్ధుడిని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గూగుల్ ట్రాన్స్ లేటర్ సాయంతో పట్టుకొని కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు.. శంషాబాద్ నర్కూడ ప్రాంతానికి చెందిన విజయ్‌నాయక్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఠాణా పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఓ వృద్ధుడు రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని దగ్గరకు పిలిచి రోడ్డుపై తిరిగితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అతడికి తెలుగు అర్థంకాకపోవడంతో నవ్వుతూ అలాగే రోడ్డుపై తచ్చాడసాగాడు. దీంతో విజయ్‌నాయక్ అతడిని కూర్చోబెట్టి టీ, బిస్కెట్ ఇచ్చారు. వివరాలు అడిగానా వృద్ధుడి నుంచి సమాధానం రాలేదు. అనంతరం కానిస్టేబుల్ తన విధులు ముగియడంతో వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా విజయ్‌నాయక్ అక్కడ విధులు నిర్వహిస్తుండగా వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. టీ, బిస్కెట్ ఇవ్వాలని సైగలద్వారా చెప్పడంతో ఇచ్చారు. ఇలా వారంరోజుల పాటు ఇలా జరిగింది. వృద్ధుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదు. ఈనెల 12న తిరిగి వృద్ధుడు ఆరాంఘర్ చౌరస్తాకు రావడంతో విజయ్‌నాయక్ దగ్గరికి పిలిచాడు. తన సెల్‌ఫోన్ లోని గూగుల్ ట్రాన్స్ లేటర్ తో వృద్ధుడి మాటలను తెలుగులో అనువధించారు. వృద్ధుడు తాను తప్పిపోయానని.. ఇంటికి పంపించమని ?ప్రాధేయపడ్డాడు. అతడి నుంచి వివరాలు రాబట్టగా.. తన పేరు మధన్ మాలిక్ అని, వెస్ట్‌బెంగాల్ హౌరా రూరల్ జిల్లా రోజా గ్రామమని తెలిపాడు. నాలుగు నెలల క్రితం మరో ఆరుమందితో కలిసి వడ్రంగి పని చేసేందుకు వచ్చానని తెలిపాడు. తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని వేడుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ సంబంధిత వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేయగా వృద్ధుడి గ్రామం ఉదయ్నారాయణపూర్ ఠాణా పరిధిలో ఉందని గుర్తించారు. సదరు ఠాణా నంబర్‌ను సేకరించి అదేరోజు అక్కడి పోలీసులతో మాట్లాడి విషయాన్ని వివరించారు. వృద్ధుడితో పోలీసులు మాట్లాడి వివరాలు తీసుకొని కుటుంబీకులకు తెలిపారు. వృద్ధుడి కుటుంబీకులు అదే పోలీస్‌స్టేషన్ లో 2019 జూన్ 19న మిస్సింగ్ కేసు పెట్టారు. 13నవారు ఉదయ్‌నారాయణ్‌పూర్ ఠాణాకు చేరుకున్నారు. వీడియో కాల్ చేయడంతో వృద్ధుడు తన కుటుంబీకులను గుర్తించాడు. తాము రాజేంద్రనగర్ వస్తున్నామని, అప్పటి వరకు వృద్ధుడిని సంరక్షణ చూసుకోవాలని వారు కానిస్టేబుల్‌ను కోరడంతో ఆయన విషయాన్ని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ ప్రసాద్‌తో పాటు లా ఆండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్ సురేష్‌కు వివరించారు. బుధవారం రాత్రి అక్కడి పోలీసులు, మధన్ మాలిక్ కుమారుడు రాజేంద్రనగర్ ఠాణాకు చేరుకున్నారు. వృద్ధుడికి సంబంధించిన పత్రలు చూపించడంతో వారికి అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ విజయ్‌నాయక్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. -
ట్రాన్స్‌లేటర్స్ పేరుతో నయా దందా
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాన్స్‌లేటర్స్ పేరుతో కొందరు దారణమైన దోపిడిలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన రోగులను టార్గెట్‌గా చేసుకుని దందాలు చేస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతర దేశాస్తులు బాష రాకపోవడంతో ప్రతి విషాయానికి ట్రాన్స్‌లేటర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వారి వద్దనుంచి లక్షల సొమ్మును కాజేస్తున్నారు. ఈ దందా నగరంలో ఎక్కువగా ఆస్పత్రుల వద్ద సాగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే బంజారాహీల్స్‌లో వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఆనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోరకు చేరింది. ఇక్కడి భాష రాకపోవడంతో ఓ ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుంది. గాల్ బ్లాడర్‌లో ట్యామర్ ఉండడంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను తప్పుడు సమాచారంతో మోసం చేశాడు. బ్లాడర్ మార్పిడితో పాటు డబ్బు విషయంలో కూడా అబద్దాలు చెప్పి.. రూ. 3లక్షల బిల్లును రూ. 7లక్షలుగా చెప్పి దోపిడికి పాల్పడ్డాడు. విషయం తెలుకున్న మహిళ షాక్‌కు గురైంది. అనంతరం బంజారాహీల్స్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
సభలో అనువాదకుడి కోసం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఉర్దూ తర్జుమా సిబ్బంది లేకపోవటం బుధవారం అసెంబ్లీలో మజ్లిస్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి బిల్లుపై ఓటింగ్ పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల ప్రకటించటంతో వారు ‘వుయ్ వాంట్ ఓటింగ్’ అంటూ నినాదాలు చేశారు. చర్చలో పాల్గొనాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు పోడియం వద్దే నినాదాలిస్తుండటంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి పది గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తన ప్రసంగంలో నిజాం పాలన, రజాకార్ల నేత ఖాసిం రజ్వీ అకృత్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మజ్లిస్ సభ్యులు అడ్డుతగిలారు. ఆయన మాటలు అర్థం కావట్లేదని, ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం అనువాదకుడు అందుబాటులో లేనందున, ఆ ఉపన్యాస కాపీని అందజేస్తానని స్పీకర్ చెప్పటంతో మజ్లిస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.