సాక్షి, హైదరాబాద్: ఉర్దూ తర్జుమా సిబ్బంది లేకపోవటం బుధవారం అసెంబ్లీలో మజ్లిస్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి బిల్లుపై ఓటింగ్ పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల ప్రకటించటంతో వారు ‘వుయ్ వాంట్ ఓటింగ్’ అంటూ నినాదాలు చేశారు. చర్చలో పాల్గొనాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు పోడియం వద్దే నినాదాలిస్తుండటంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి పది గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తన ప్రసంగంలో నిజాం పాలన, రజాకార్ల నేత ఖాసిం రజ్వీ అకృత్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మజ్లిస్ సభ్యులు అడ్డుతగిలారు. ఆయన మాటలు అర్థం కావట్లేదని, ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం అనువాదకుడు అందుబాటులో లేనందున, ఆ ఉపన్యాస కాపీని అందజేస్తానని స్పీకర్ చెప్పటంతో మజ్లిస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో అనువాదకుడి కోసం డిమాండ్
Published Thu, Jan 23 2014 3:18 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
Advertisement