All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM)
-
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
పాతబస్తీలో జెండా ఎగరేస్తాం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముందస్తు’ ఎన్నికల్లో పాతబస్తీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మజ్లిస్ కంచుకోటను బద్దలు కొడతామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని చెప్పారు. పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాతబస్తీ ఏదో ఒక్క పార్టీ సొత్తు కాదని... ఇప్పటి వరకు దానిపై సీరియస్‌గా దృష్టి సారించలేదని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తెల్చుకుంటామన్నారు. మిత్రపక్షాలతో కలిసి నగరంలో క్లీన్‌స్వీప్ చేస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యూలర్ పార్టీ అని... మజ్లిస్, టీఆర్ఎస్, బీజేపీ మూడూ ఒక్కటేనని ఆరోపించారు. మజ్లిస్ టీఆర్ఎస్కు సహకరిస్తోందని, టీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని ఆమోదంతోనే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్... బీజేపీతో జత కట్టడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో మజ్లిస్, టీఆర్ఎస్లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. అక్కడందరూ తెలంగాణ ద్రోహులే... టీఆర్ఎస్లో రాజ్యమేలుతోంది తెలంగాణ ద్రోహులేనని అంజన్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్... టీఆర్ఎస్కు మిత్రపక్షమైందన్నారు. తెలంగాణ ద్రోహులైన తుమ్మల, తలసాని తదితరులకు మంత్రి పదవులిచ్చి అందలం ఎక్కించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఉద్యమంలో భాగస్వామలైన వారికి, అమరులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో గళం విప్పింది కాంగ్రెస్ ఎంపీలేనన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 12సార్లు పార్లమెంట్‌ను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ‘తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మాయమాటలతో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముందస్తు ఎన్నికల్లో చీటింగ్ టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. అన్నింట్లో వైఫల్యం... నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ నగరాభివృద్ధికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. వాగ్దానాల అమలుకు సంబంధించి కేసీఆర్ అన్నింటా వైఫల్యమయ్యారని అన్నారు. పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని మభ్య పెట్టాడన్నారు. మెట్రో, కృష్ణ జలాల ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, పనులు పూర్తయిన తర్వాత ప్రారంభించడంలో గొప్పేమిటని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పాత నగరానికి మెట్రోను విస్తరించాలన్నారు. కార్యకర్తలకు పెద్దపీట... రానున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని అంజన్‌కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల టికెట్ల కోసం సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు అవకాశం రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో సమర్థులను బరిలో దింపుతామని, టికెట్ ఆశించి భంగపడ్డ వారు నిరాశ పడకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పార్టీ మరవదని, అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. -
ఆర్డినెన్స్‌తో న్యాయం జరగదు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిఫుల్ తలాక్ ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు న్యాయం జరగదని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర మంత్రి వర్గం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంపై మండిపడ్డారు. బుధవారం మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మహిళలకు ఆర్డినెన్స్ వ్యతిరేకమని, దానితో మరింత అన్యాయం జరిగే అవకాశమే ఉంటుందని అన్నారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమే అవుతుందన్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా కేసు నమోదైతే మహిళలకు అండగా నిలబడేది ఎవరని ప్రశ్నించారు. కేసుకు గురైన వ్యక్తి జైలుకు వెళ్తూనే భరణం ఎలా చెల్లిస్తారని, శిక్ష పూర్తయి బయటికి వచ్చేవరకు మహిళ చిక్కుల్లో పడాల్సిందేనా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను ఇక్కట్ల పాల్జేసేందుకు మోదీ సర్కార్ ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తోందన్నారు. దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్తే ఆర్డినెన్స్ నిలబడదన్నారు. -
మజ్లిస్ ఒత్తిడితోనే నాపై కేసు: రాజాసింగ్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా తిరంగ యాత్ర చేపట్టారంటూ అబిడ్స్ పోలీసులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను కలసి వివరణ ఇచ్చారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ...తనపై ఎన్ని కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తిరంగ ర్యాలీ నిర్వహించడం అన్యా యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తిరంగ ర్యాలీ, స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. -
ఏడుగురు సిట్టింగ్లతో మజ్లిస్ తొలిజాబితా
సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం ప్రకటించింది. ప్రకటించిన జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం కల్పించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు స్థానాలు మార్పు చేయగా, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను యథాతథం స్థానాలకు ఖరారు చేసింది. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్‌పురా నియోజకవర్గానికి, యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బహదూర్‌పురాకు ముహమ్మద్ మోజం ఖాన్, మలక్‌పేటకు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లికి జాఫర్ హుస్సేన్ మేరాజ్, కార్వాన్కు కౌసర్ మొహియుద్దీన్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వారం రోజుల్లో మరో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
మజ్లిస్ మెప్పు కోసమే...
-
మజ్లిస్ మెప్పు కోసమే...
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్న కేసీఆర్, బీజేపీపై, ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షేమంకోసం ప్రధాని చేపడుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు వస్తున్నా, వాటిని ఖర్చుచేయలేక, ఆ విషయం జనం గమనించి ఎక్కడ ఈసడించుకుంటారోనన్న ఆందోళనతోనే కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నాలుగేళ్లు నిద్రమత్తులో జోగిన సీఎం, ఎన్నికల ఏడాది కావటంతో రైతు సమన్వయ కమిటీల పేరుతో జిమ్మిక్కులు మొదలుపెట్టారని విమర్శించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లు తెరిపించలేక చేతులెత్తేసి, కమీషన్ల వేటలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటూ కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేశాయి. కొన్నిచోట్ల రాస్తారోకోలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. -
దమ్ముంటే రాష్ట్రమంతా పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి దమ్ముంటే రాష్ట్రమంతా పోటీ చేయా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సవాల్ చేశారు. పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, సుభాష్, సుధాకర శర్మతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేవలం పాతబస్తీలో ఐదారు సీట్లకు పోటీ చేసి మిగిలిన స్థానాల్లో అధికారంలో ఉన్నవారిని గుప్పిట్లో పెట్టుకోవడం కాద న్నారు. రాష్ట్రమంతా పోటీ చేస్తే మజ్లిస్ నిజస్వరూపం ఏమిటో బయటపడుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీలోకి హేమాహేమీలైన నాయకులు వస్తున్నారని, వారెవరో, ఏ పార్టీలకు చెందినవారో కూడా త్వరలోనే తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పాలన ఉందన్నారు. 2022 వరకు నవభారత నిర్మాణం కోసం 6 సూత్రాల ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి 3 దాకా పార్టీ జాతీయనేత రాంలాల్, అక్టోబర్ 14, 15 తేదీల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, 23న సౌదాన్ సింగ్ పార్టీ సంస్థాగత వ్యవహారాల కోసం వస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. అక్టోబర్ మూడోవారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉంటాయన్నారు. -
‘అక్బరుద్దీన్’ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనçసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యా యత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్ సహా 10 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. అదే విధంగా ఈ కేసులో హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లను దోషులుగా నిర్ధారించి సెషన్స్ కోర్టు విధించిన శిక్షను సైతం పెంచాలని హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ పిటిషన్లు ప్రభుత్వం దాఖలు చేసింది. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది. -
మజ్లిస్ కోసమే ‘విమోచన’ జరపడం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ కోసమే సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. మజ్లిస్ కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 22, 23న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో జరుగుతాయన్నారు. ఆగస్టు 10 నుంచి 20 వరకు ప్రజాసమస్యలపై మండలస్థాయిలో, ఆ తరువాత జిల్లా స్థాయిలో ఉద్యమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి కార్యాచరణ ఉంటుందన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలుంటాయన్నారు. -
తిరిగి రండి...కలసి పనిచేద్దాం!
కుర్చీ అప్పగించేందుకు సిద్ధం.. పార్టీ వీడిన వారికి ఒవైసీ పిలుపు సాక్షి, హైదరాబాద్: పాత తప్పిదాలను మరచి కలసి పనిచేద్దామని.. పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. తానంటే గిట్టకుంటే వారికి కుర్చీ అప్పగించి సేవ చేసేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో జరిగిన మజ్లిస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముస్లింల ఐక్యతే తమ లక్ష్యమని దీనికి వారంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేవిధంగా చట్టాలు రూపొందుతున్నాయన్నారు. ముస్లింలంతా ఏకమైతే 50 పార్లమెంట్ స్థానాల్లో విజయం తప్పదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సభలో ఎమ్మెల్సీలు రజ్వీ, జాఫ్రీ, ఎమ్మెల్యేలు మౌజమ్ ఖాన్, ముంతాజ్ ఖాన్, అహ్మద్ బలాల, కౌసర్ మొహియిద్దీన్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
'ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం'
- టీఆర్ఎస్ తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ సెప్టెంబరు 17ను విమోదన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అడిగితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ వర్కర్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి? మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి, ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. వారందరినీ స్మరించుకోవాలి..’ అని పేర్కొన్నారు. మూడేళ్లలో కోటి మంది కార్మికులకు శిక్షణ ఇస్తామని, కార్మిక శాఖ పథకాలపై వారిలో చైతన్యం పెంచుతామని తెలిపారు. అసంఘటిత కార్మికులకు బోనస్ పెంచామని వివరించారు. -
వాళ్లు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు
- సెప్టెంబరు 17న జాతీయజెండా రెపరెపలాడాలి - బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి శాయంపేట(వరంగల్ జిల్లా) సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా గత, ప్రస్తుత పాలకులు మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని బీజేపీ శాసనసభ పక్ష నాయకులు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తిరంగా యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట, మైలారం, జోగంపల్లి, కొప్పుల గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన కిషన్‌రెడ్డి.. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడి సెప్టెంబర్ 17న సాధించుకున్న తెలంగాణ విమోచనను పాలకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన గుణపాఠం చెప్పేలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ ప్రాంతం నుంచి వేరుపడిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలిసిన జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర వేడుకలను అధికారికంగా జరుపుతుంటే ఒక్క తెలంగాణలో మాత్రం విస్మరిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో గత కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు తాను చేస్తున్నదేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, గంగుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ కార్పొరేటర్ కోసం సిట్ పోలీసుల వేట
చార్మినార్: పాత కేసుల్లో నిందితుడైన శాలిబండ మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ మహ్మద్ ముస్తాఫా అలీ ముజఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతడిని అరెస్టు చేయాలని మంగళవారం సిట్ పోలీసులు పాతబస్తీ తగారీ కానాకాలోని అతడి ఇంటికి వెళ్లారు. అతను లేకపోవడంతో సిట్ పోలీసులు వెనుతిరిగారు. విషయం తెలిసి చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ.. ముజఫర్ ఇంటికి వెళ్లి పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2012లో చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం విషయంలో మక్కా మసీదు వద్ద అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. ఈ ఘటనపై హుస్సేనీఆలం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఏ–1గా మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఏ–2గా మాజీ కార్పొరేటర్ ముఖరం అలీతో పాటు ఏ–3గా మజ్లిస్ పార్టీ నాయకులు, ప్రస్తుతం శాలిబండ కార్పొరేటర్ అయిన మహ్మద్ ముస్తాఫా అలీ ముజఫర్ ఉన్నారు. అనంతరం ఈ కేసు సిట్‌కు బదిలీ అయింది. గత జూలై 27న ఏ–1గా ఉన్న మహ్మద్ గౌస్‌ను సిట్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించగా ఈనెల 5న విడుదలయ్యాడు. ఈ కేసులో ఏ–3గా ఉన్న ముజఫర్‌ను కూడా అరెస్ట్ చేయడానికి సిట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
రజ్వీ నుంచి పుట్టిందే మజ్లీస్:లక్ష్మణ్
మలక్‌పేట: రజాకార్లకు నాయకుడు కాసీం రజ్వీ భావజాలంతోనే మజ్లీస్ పార్టీ ఆవిర్భవించిందని, ముషీరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బీజేపీ మలక్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాన్ని మజ్లీస్ కబంధ హస్తలనుంచి విముక్తం చేసేందుకు సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు. దేశ ఆర్ధికస్థితిని అస్తవ్యస్తం చేసేందుకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు, శక్తులకు ఎంఐఎం అండగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందువుల మనోభావాను కించపరిచేలా మాట్లాడినందుకు కేసులు పెట్టినా చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. ఎంపీ సభ్యత్వం రద్దుకు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తామన్నారు. టీఆర్ఎస్ నైజం, మజ్లీస్ ఆగడాలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో చింతా సాంబమూర్తి, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
అవినీతిని ప్రశ్నించిన నాగంపై దాడా!
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్దఎత్తున జరుగుతున్న కుంభకోణాల గురించి ప్రశ్నిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డిపై దాడి చేస్తున్న అధికార టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ... అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్ఎస్ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంచనాల తయారీ నుంచి కాంట్రాక్టుల దాకా వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగమైందన్నారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తున్న నాగంపై మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ నేతలు దాడికి దిగడం బాధాకరమని, దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి : ఐసిస్ ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని బహిరంగంగా ప్రకటించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై తగిన చర్యలు తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను లక్ష్మణ్ కోరారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది అందరికీ శత్రువేనన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి న్యాయ సహాయం అందిస్తామనడం ద్వారా ఒవైసీ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. -
నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర
సిటీ బ్యూరో: జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్రలు చేపట్టారు. ఒక వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అక్కడ విసృ్తతంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు. బహద్దుర్ పురా, జవార్నగర్, నర్సారెడ్డి కాలనీ, తాడ్బాన్, రామానర్సాపుర తదితర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, ఐటీఐలను తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గఫ్ఫార్, ముబీన్,సలీం తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు అసెంబ్లీ పోరులో మజ్లిస్
హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బోణీ కొట్టిన స్ఫూర్తితో మజ్లిస్ పార్టీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో బరిలోకి దిగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. మూడు స్థానాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసింది. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపిన ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకుంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. సీమాంచల్ ప్రాంతంలో కేవలం 6 స్థానాల్లో బరిలో దిగిన ఎంఐఎం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. కోచాదామన్ లో రెండో స్థానం, కిషన్ గంజ్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగితా చోట్ల కనీసస్థాయి ప్రభావం కూడా చూపలేకపోయింది. -
హిందుస్థాన్ జిందాబాద్’
సిటీబ్యూరో: మహా నగరంలోని ముఖ్య కూడళ్లలో ‘హిందుస్థాన్ జిందాబాద్’ ‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ, కటౌట్లు ఏర్పాటు చేస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాను ఎట్టి పరిస్థితుల్లో ‘భారత్ మాతాకీ జై’ అననని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. అదేవిధంగా ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సైతం అక్కడి అసెంబ్లీలో అదే వ్యాఖ్యలు చేసి సస్పెండైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యనేత షాబాజ్ ఖాన్ ముఖ్య కూడళ్లలో ‘ హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ పార్టీ అధినేత, అగ్రనేతలతో కూడిన ఫోటోలతో పెద్దఎత్తున ఫ్లెక్సీ, కటౌట్లను ఏర్పాటుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది. -
ఒవైసీ పౌరసత్వం రద్దుచేయండి
శివసేన డిమాండ్ ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అని నినదించేందుకు నిరాకరిస్తానన్న మజ్లిస్ పార్టీ చీఫ్ ఒవైసీ భారత పౌరసత్వాన్ని రద్దుచేసి.. చట్టపరంగా ఉరితీయాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ సంపాద కీయంలో ఒవైసీపై నిప్పులు చెరిగింది. ఒవైసీలాగా వ్యవహరించే అందరికీ పౌరసత్వాన్ని రద్దుచేసి.. ఓటింగ్ హక్కులు తొలగించాలని డిమాం డ్ చేసింది. ‘మహారాష్ట్రలోకి వచ్చి ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తే.. అతను తిరిగి ఎలా వెళ్లగలిగారు? ఇందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమాధానం చెప్పాలి? హార్దిక్ పటేల్ అనుకోకుండా జాతీయపతాకాన్ని అవమానపరిస్తే.. జైలుకు పంపించాం కదా! కానీ ఇప్పుడు భారతమాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీని చట్టపరంగా ఉరితీయాలి’ అని పేర్కొంది. ముస్లింలు ఇంకా వెనుకబడి ఉండేందుకు ఒవైసీ లాంటి వ్యక్తులే కారణమని.. పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌లో జరగాల్సిన ఒవైసీ పర్యటను అనుమతి రద్దుచేస్తున్నట్లు లక్నో మెజిస్ట్రేట్ ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందునే మజ్లిస్ చీఫ్ రెండ్రోజుల పర్యటనకు అనుమతులు ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ఎంఐఎం తీవ్ర విమర్శలు చేసింది. మజ్లిస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునేందుకే అనుమతులు ఆపారని ఆరోపించింది. -
మద్దతిస్తాం కానీ...
టీఆర్ఎస్తో మైత్రీ బంధం కొనసాగింపు అవసరమైతే సమస్యలపై గళం మజ్లిస్ పార్టీ నిర్ణయం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలక వర్గంలో భాగస్వామ్యాన్ని పంచుకోలేకపోయినా.....అధికార టీఆర్ఎస్తో మిత్ర పక్షంగా కొనసాగాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. గురువారం జీహెచ్ఎంసీ సమావేశ మందిరంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్లకు మద్దతు ప్రకటిస్తున్నట్లు మజ్లిస్ పార్టీ అహ్మద్ నగర్ కార్పొరేటర్ ఆయేషా ఫాతిమా వెల్లడించారు. దీంతో పాలక పక్షానికి మజ్లిస్ మద్దతు మరింత బలం చేకూర్చినట్లయింది. మిత్ర పక్షమే జీహెచ్ఎంసీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీమజ్లిస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు సిద్ధం కాకుండా... అధికార టీఆర్ఎస్తో గల అనుబంధం దృష్ట్యా మిత్ర పక్షంగా మారింది. ఎన్నికల్లో ఇరుపక్షాల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు లేకపోయినా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్‌ను మిత్రపక్షంగా అభివర్ణించారు. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే ఆ పార్టీ మద్దతు తీసుకుంటామని ప్రకటించారు. పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో అధికార పార్టీకి మజ్లిస్ సహకారం అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ మజ్లిస్ పార్టీ మేయర్, డిప్యూటీల ఎన్నికల్లో మద్దతు ప్రకటించి మిత్రబంధాన్ని మరింత దృఢం చేసింది. ప్రజల పక్షం అధికార పార్టీకి మిత్రపక్షమైనప్పటికీ ప్రజల పక్షాన గళం విప్పాలని మజ్లిస్ నిర్ణయించింది. పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పూర్తి స్థాయి ప్రాతినిథ్యం కలిగి ఉంది. తాజాగా కొత్త నగరంలోనూ కొన్ని డివిజన్లలో పాగా వేసింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాదు... పాలక వర్గం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే... వాటినీ ఎండగట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేటర్ల సమావేశం మేయర్ ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు గురువారం ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీలో వారు వ్యవహరించాల్సిన తీరుపై అగ్ర నాయకులు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలసి గ్రూప్ ఫొటో దిగి.. జీహెచ్ఎంసీకి బయలుదేరారు. -
నేడు మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఎంపిక
దారుస్సలాంలో కార్పొరేటర్ల సమావేశం ఎంఎ గఫార్ లేదా మహ్మద్ మెబీన్కు అవకాశం సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీ గా అవతరించిన మజ్లిస్ పార్టీలో ఫ్లోర్ లీడర్ ఎంపిక కీలకంగా మారింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో జరిగే కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫ్లోర్ లీడర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థి పనితీరు, విధేయత, ప్రజల్లో గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. అనుభవంతో నిమిత్తం లేకుండా కొత్త ముఖాలను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం 44 మంది అభ్యర్ధులు కార్పొరేటర్లుగా ఎంపిక కాగా, అందులో 35 మంది కొత్త వారే. కావడం గమనార్హం. సీనియర్ కార్పొరేటర్లు ఎంఎ గఫార్ (దూద్‌బౌలి) మహ్మద్ మెబీన్(రామ్నాస్పురా)ల్లో ఒకరిని ఫ్లోర్‌లీడర్‌గా ఎంపిక చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
మజ్లిస్ ఓటు బ్యాంకుకు గండి!
పాతబస్తీలో తగ్గిన ఓట్లు 20 నెలల్లో 1.43 లక్షలు తేడా బలపడుతున్న అధికార టీఆర్ఎస్ సిటీబ్యూరో: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పట్టు సడలిందా? ప్రజ ల చూపు ఆ పార్టీ పైనుంచి అధికార టీఆర్ఎస్ వైపు మళ్లుతోందా? జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాతబస్తీలో మజ్లిస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా... ఓటు బ్యాంక్‌కు మాత్రం గట్టి దెబ్బ తగిలింది. కేవలం 20 నెలల వ్యవధిలోనే సుమారు 1.43 లక్షల ఓట్లకు గండి పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ పాగా వేయలేకపోయిన్పపటికీ అనూహ్యంగా మజ్లిస్ ఓట్లను రాబట్టగలిగింది. గతంతో పొల్చితే మజ్లిస్ ఓట్లు గణనీయంగా తగ్గగా... టీఆర్ఎస్ బాగా పుం జుకుంది. దశాబ్దాలుగా పాతబస్తీలో తిరుగులేని శక్తిగా మారిన మజ్లిస్‌కు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాతబస్తీలోని 8 నియోజకవర్గాలకు కలిపి మజ్లిస్ పార్టీకి 5,75,537 ఓట్లు లభించగా... తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 4,41,605 ఓట్లకే పరిమితమైంది. వచ్చే మూడేళ్లలో మరింతగా ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ వ్యత్యాసం తాజా ఎన్నికల ఫలితాలను బట్టి నియోజకవర్గాల వారీ గా పరిశీలిస్తే.. కార్వాన్లో అత్యధికంగా మజ్లిస్ ఓట్లకు గండి పడింది. బహదూర్‌పురా, మలక్‌పేటలో సైతం భారీగా ఓట్లు కోల్పోయింది. కార్వాన్లో 32,084 ఓట్లు, బహదూర్‌పురాలో 27,268, మలక్‌పేటలో 23,361, చాంద్రాయణగుట్టలో 17,253, రాజేంద్రనగర్‌లో 16, 944, యాకుత్‌పురాలో 10,986, చార్మినార్‌లో 8,060, నాంపల్లిలో 7,976 ఓట్లకు గండి పడినట్లు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీకి నియోజకవర్గాల వారీగా లభించిన ఓట్లు నియోజకవర్గం 2014 2016 మలక్‌పేట 58,976 35,615 చార్మినార్ 62,941 54,881 యాకుత్‌పురా 66,843 55,857 చాంద్రాయణగుట్ట 80,393 63,140 బహుదుర్‌పురా 1,06,874 79,606 నాంపల్లి 64,066 56,090 కార్వాన్ 86,391 54,307 రాజేంద్రనగర్ 49,053 32,109 -
మజ్లిస్ కార్పొరేటర్లలో కొత్త ముఖాలే ఎక్కువ!
44 మందిలో 35 మంది కొత్తవారే... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో రెండో అతి పెద్దపార్టీగా అవతరించిన మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లలో అత్యధిక శాతం కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కాగా అందులో 35 మంది కొత్త వారు ఉన్నారు. కొత్త వారిలో 19 మంది మహిళలు కాగా, 16 మంది పురుషులు ఉన్నారు. తొమ్మిది మంది పాత కార్పొరేటర్లు తిరిగి ఎన్నికయ్యారు. మజ్లిస్ పార్టీ మొత్తం 150 డివిజన్లకు గాను 60 డివిజన్లల్లో మాత్రమే పోటీ చేసింది. డివిజన్ల డీలిమిటేషన్, రిజర్వేషన్ తారుమారుతో కేవలం తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మాత్రమే తిరిగి అవకాశం కల్పించి మిగితా 51 స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపింది. సిట్టింగ్‌లందరూ తిరిగి ఎన్నిక కాగా, కొత్తవారిలో 16 మందికి ఓటమి తప్పలేదు. పదిమంది ముస్లిమేతర అభ్యర్థులు బరిలో దిగగా నలుగురు మాత్రమే విజయం సాధిం చారు. పాతబస్తీలో పూరానాపూల్ డివిజన్ మజ్లిస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పక్షా న బరిలో దిగడంతో అక్కడ ముస్లిమేతర అభ్యర్థి బరిలో దంపి సత్తా చాటింది. పోలిం గ్ రోజు జరిగిన ఘటనతో కౌటింగ్ రోజురీ పోలింగ్ నిర్వహిం చినా సునాయాసంగా గట్టెక్కింది. ఈ సారి జీహెచ్ఎంసీలో కొత్తవారే అత్యధికంగా ఎన్నిక కావడంతో వారికి అనుభవజ్ఞులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారికి జరిగిన అభినందన సమావేశంలో సైతం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సలహాలు, సూచనలు అందించారు. రేపు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక జీహెచ్ఎంసీ మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపిక మంగళవారం జరుగనుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. 11న మేయర్ ఎన్నిక జరుగనుండటంతో దాని కంటే ముందే పార్టీ పక్ష నేత ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. పాతవారికే పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. -
‘దో’స్తానా.. సాగేనా?
టీఆర్ఎస్... మజ్లిస్ల మైత్రిపై సందేహాలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్... మిత్రపక్షమైన మజ్లిస్‌తో అధికారం పంచుకుంటుందా? లేక ఒంటరిగా ముందుకు సాగుతుందా? ప్రస్తుతం గ్రేటర్లో ప్రధాన చర్చనీయాంశమిదే. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీని మిత్రపక్షంగా పేర్కొంటూ.. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే సహకారం అందించేందుకు మజ్లిస్ ఉందని ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్కు పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం లేకుండా పోయింది. జీహెచ్ఎంసీలో మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేయర్ పీఠం కోసం అవసరమయ్యే మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. ఫలితంగా ఆ సీటు విషయమై ఎటువంటి ఆలోచనలూ పార్టీలో కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా మజ్లిస్ తమ మిత్రపక్షమని చెప్పడంతో డిప్యూటీ మేయర్ పదవి ఆ పార్టీకి దక్కవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకున్న టీఆర్ఎస్.. మజ్లిస్‌తో మైత్రిని కోరని పక్షంలో డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి ఇవ్వక పోవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి విజయం సాధించిన మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ నుంచి మజ్లిస్ పార్టీ నేతలకు ఎలాంటి మైత్రీ సమాచారం అందకపోవడంతో అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పక్షానికి మొగ్గు..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్.... రాజకీయ పరిణామాలను బట్టి అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చొని...ప్రజల పక్షం వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మెజార్టీ లేకున్నా కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకొని మూడేళ్ల పాటు పాలన పగ్గాలు చేపట్టింది. ఈసారి టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకున్నా సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో మజ్లిస్ పార్టీతో మైత్రిఅవసరం లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికలో టీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమవైఖరిని వెల్లడించాలనే యోచనలో మజ్లిస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. -
పాతబస్తీలో మజ్లిస్ హవా
44 డివిజన్లలో విజయకేతనం కొత్త నగరంలోనూ పాగా సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. పాతబస్తీలో ఎప్పట్లా హవా కొనసాగించడంతో పాటు కొత్త నగరంలోనూ పాగా వేసింది. మొత్తం 60 డివిజన్లలో బరిలో దిగి 44 స్థానాలను కైవసం చేసుకుంది. పాతబస్తీలో తాను పోటీ చేసిన డివిజన్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి కొత్తగా ఎర్రగడ్డ, షేక్‌పేట, భోలక్‌పూర్, మెహిదీపట్నం, కుర్మగూడ, ఆజంపురా డివిజన్లలోనూ జయకేతనం ఎగురవేసింది. పునర్విభజనలో తన సిట్టింగ్ డివిజన్లయిన ఫతే దర్వాజా, నూర్ఖాన్ బజార్, హుసేనీ ఆలం, చింతల్‌బస్తీ గల్లంతైనా కూడా మొత్తంమీద గతంలో కంటే ఒక డివిజన్‌ను ఎక్కువగా గెలిచింది! బీసీ,ఎస్సీ, ఎస్సీ, మహిళా అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటింది. పాతబస్తీలో మాజీ సిట్టింగ్ కార్పొరేటర్ పార్టీ ఫిరాయించినా ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడింది. పైగా గతం కంటే ఓటు బ్యాంకు పెంచుకోగలిగింది. పాతబస్తీలో చార్మినార్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు డివిజన్లకు నాలుగింటిని గెలుచుకుంది. బహదూర్‌పురా పరిధిలో ఆరు, కార్వాన్ పరిధిలో పోటీ చేసిన ఐదు డివిజన్లనూ క్లీన్‌స్వీప్ చేసింది (జియాగూడ, గుడిమల్కాపూర్ డివిజన్లలో పోటీ చేయలేదు). మలక్‌పేట్ పరిధిలోనూ మరోసారి పట్టు నిలుపుకుంది. ఆరింటికి నాలుగు డివిజన్లలో ఘన విజయం సాధించింది. యాకత్పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లకు గాను ఐదింటిలో పోటీ చేసి విజయం సాధించింది. గోషామహల్‌లోనూ ఆరు డివిజన్లకు గాను రెండింట పోటీ చేసి విజయం సాధించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు డివిజన్లను కైవసం చేసుకున్న మజ్లిస్, భోలక్‌పూర్ డివిజన్లో నెగ్గడం ద్వారా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానంలోనూ బోణీ కొట్టింది! 1986 ఎన్నికల్లో నగరంలో 38 డివిజన్లు గెలుచుకున్న పార్టీ, మెజారిటీ మార్కును చేరకపోయినా ఐదేళ్లూ నగరాన్ని పాలించింది. ఇక 2002లో 36, 2009లో 43 డివిజన్లు గెలుచుకుంది. మరోవైపు, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈసారి అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. -
పట్టు నిలుపుకున్న మజ్లిస్
బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట స్వీప్ యాకుత్‌పురా, చార్మినార్‌లో నాలుగేసి డివిజన్లు కైవసం చార్మినార్: పాతబస్తీలో మజ్లీస్ హవా కొనసాగింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 25 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో జయుకేతనం ఎగురవేసింది . సిట్టింగ్ సీట్లన్నీ తిరిగి కైవసం చేసుకుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్ ఖాతాలోకి చేరాయి. చార్మినార్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్‌లలో మజ్లీస్ అభ్యర్థులు విజయం సాధించగా...ఘాన్సీబజార్ డివిజన్లో మాత్రం బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్ డివిజన్లను మజ్లీస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్వే. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా... డబీర్‌ఫురా, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ తదితర ఐదు డివిజన్లను మజ్లీస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా... మిలిగిన గౌలిపురాలో బీజేపీ, ఐ.ఎస్.సదన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. -
5 ఓట్ల విజేత..
జాంబాగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. ఆనంద్ కుమార్ గౌడ్‌పై మజ్లిస్ అభ్యర్థి డి. మోహన్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మోహన్‌కు 8,583 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్‌కు 8,578 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్ల తేడాతో మజ్లిస్ అభ్యర్థి మోహన్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భజరంగ్ శర్మకు 5,235 ఓట్లు రాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఎం. ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ 3,382 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. - అబిడ్స్ -
పురానాపూల్ మజ్లిస్ ఖాతాలోకి...
వివాదాస్పదంగా మారి.. రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సున్నం రాజ్ మోహన్ 2,877 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజ్‌మోహన్‌కు 8,553 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌కు 5,676 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి మధుకర్ యాదవ్‌కు 1,295 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 747 ఓట్లు వచ్చాయి. -
కారు కాదు రాకెట్
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం మిన్నంటిన సంబరాలు పార్టీ శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం వాడవాడలా విజయోత్సవాలు గ్రేటర్లో కారు దుమ్ము రేపింది. ఆకాశమే హద్దుగా... రాకెట్లా దూసుకుపోయింది. కారు రేపిన దుమ్ములో సైకిల్, కమలం, హస్తం అడ్రస్‌లు గల్లంతయ్యాయి. గులాబీ గాలి ముందు ఏ పార్టీ నిలవలేకపోయింది. కారు దెబ్బకు సైకిల్ ముక్కలు చె క్కలైంది. టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని అందరూ లెక్కలేస్తే...‘సింగిల్’ సీటుకే పరిమితమైంది. ఆ పార్టీకి ‘మహా’దెబ్బ పడింది. సైకిల్‌తో జత కట్టిన పాపానికి కమలమూ వాడిపోయింది. నిన్నటి వరకూ గ్రేటర్ పాలనలో భాగం పంచుకున్న కాంగ్రెస్‌కు తేరుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లింది. టీఆర్ఎస్ తరువాత అత్యధిక సీట్లను మజ్లిస్ పార్టీ గెలుచుకుంది. -
నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!
► ప్రతిసారీ మారుతున్న రిజర్వేషన్లు ► మజ్లిస్ పార్టీకి కంచుకోటగా పురానాపూల్ ► కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్ గౌస్ మారిన సమీకరణలు చార్మినార్: పురానాపూల్... పోలింగ్ నాటి సంఘటనలు...రీ పోలింగ్‌తో ఈ ప్రాంతం ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ మొదలైనప్పటినుంచి రెండు పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు అక్కడక్కడ వాగ్వాదాలు, ఆందోళనలతో పాటు అరెస్ట్‌లూ చోటుచేసుకున్నాయి. పరిస్థితులను సమీక్షించిన ఉన్నతాధికారులు పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ-పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న రిజర్వేషన్లు 1986 నాటి బల్దియా ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న పురానాపూల్ డివిజన్ 2002లో బీసీలకు కేటాయించారు. 2009లో మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా 1986 నుంచీ మారుతూ వస్తోంది. పునర్విభజన అనంతరం తాజాగా బీసీ జనరల్‌గా మారింది. 2009లో 23,863 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 34,407. రాజకీయ నేపథ్యం 1986లో పురానాపూల్ డివిజన్ ఎస్సీలకు రిజర్వు కావడం తో అప్పట్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2002లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ విజయం సాధించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ కావడంతో మజ్లిస్ అభ్యర్థి సున్నం శ్రీలత గెలుపొందా రు. అప్పటి నుంచీ మజ్లిస్‌కు కంచుకోటగా మారింది. ప్రస్తుతం పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి. మహ్మద్ గౌస్ కాంగ్రెస్‌లో చేరడంతో.... పురానాపూల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు, భార్య కూడా రంగంలోకి దిగారు. దీంతో ఒవైసీ సోదరులకు, మహ్మద్ గౌస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన గౌస్... 2002లో చార్మినార్ డివిజన్ నుం చి, 2009లో శాలిబండ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాతబస్తీలో రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యు లు పోటీ చేస్తున్న మూ డు డివి జన్ల నుంచి విజయం సాధిం చాలనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహ్మద్ గౌస్‌కు అప్పగిం చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టినంతా పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ డివి జన్లపై పెట్టింది. మజ్లిస్ పార్టీ తప్పొప్పులను స్థానిక ప్రజ లకు చెబుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన మహ్మ ద్ గౌస్ బహిరంగ సభల ద్వారా ఒవైసీ సోదరులకు సవాళ్లు విసిరారు. ఖిల్వత్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్‌లను రప్పిం చారు. రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేప్రయత్నం చేశారు. మజ్లిస్ వ్యూహాత్మకంగా... కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు మహ్మద్ గౌస్‌కు చెక్ పెట్టాలని ఒవైసీ సోదరు లు భావించారు. దీనికి అనుగుణంగానే బహిరంగ సభను నిర్వహించిన మజ్లిస్...కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చింది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని... ‘పతంగ్’ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే... చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్), పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యం లో మధ్యాహ్నం 1.30 గంటలకు జలాల్‌కుంచా ప్రాంతంలో ఎమ్మె ల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దీం తో ఇరువర్గాల్లో ఆగ్రహం కట్టలు తెం చుకుంది. వాగ్వాదాలతో ప్రారంభమై దాడులకు దారి తీసింది. విష యం తెలుసుకున్న దక్షిణ మండల డీసీ పీ వి.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చార్మినార్ పోలీ స్ స్టేషన్‌కు... మహ్మద్ గౌస్‌ను మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ అనుచరులతో వేర్వేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రేమకు వంతెన... ప్రేమకు వారధిగా నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పేరుతో ఈ డివిజన్ ఏర్పడింది. ప్రిన్స్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీ నది ఇవతల ఉన్న భాగమతిని ప్రేమించారు. ఆమెను కలవడానికి మూసీ నదిని దాటుతూ వచ్చేవారు. దీనిని గమనించిన ఆయన తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1578లో నదిపై ప్యారానాపూల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్యార్ అంటే ప్రేమ. పూల్ అంటే బ్రిడ్జి. ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘ప్యారానాపూల్’ కాలక్రమంలో పురానాపూల్‌గా మారిం ది. పురానా అంటే పురాతన అని అర్థం. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ వంతెన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిది. -
45 సీట్లపై మజ్లిస్ ఆశలు!
పాతబస్తీలో వన్‌వే... సంఖ్య తగ్గదంటున్న పార్టీ వర్గాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళి బట్టి 45కు పైగా డివిజన్లలో విజయం తథ్యమని మజ్లిస్ పార్టీ అంచనా వేస్తోంది. పాతబస్తీలోని పూర్తి స్థాయి డివిజన్లతోపాటు నగరంలోని పలు డివిజన్లపై సైతం ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సంఖ్య తగ్గదన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. డివిజన్ల డీలిమిటేషన్, సిట్టింగ్ సీట్ల రిజర్వేషన్ల తారుమారు జరిగినా ఓటింగ్ సరళిలో మాత్రం మార్పులేదని భావిస్తున్నారు. అయితే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మారిన రాజకీయ సమీకరణలతో పాతబస్తీలోని మూడు నాలుగు డివిజన్ల్లో ధీటైన పోటీ జరిగినట్లు ఓటింగ్ సరళి బట్టి స్పష్టమవుతుందంటున్నారు. ఈసారి ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 60 స్థానాల్లో ఎంఐఎం త మ అభ్యర్ధులను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసి 43 స్థానాలను దక్కించుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈసారీ పునరావృత్తం అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్నేహపూర్వక బంధం కాస్త ఈసారి శత్రుపక్షంగా మారింది. దీంతో పురానాపుల్, ఘాన్సీబజార్, శాలిబండా, లంగర్‌హౌస్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి, జాంబాగ్ తదితర డివిజన్లలో గట్టిపోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఆజాంపురా, ఓల్ట్ మలక్‌పేట, బోలక్పూర్, బోరబండ, అంబర్‌పేట తదితర డివిజన్లలోనూ పోటాపోటీ ఉందని భావిస్తున్నారు. -
దాడులు.. ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయిన మజ్లిస్ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెడ్‌హిల్స్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా అడ్డగించి.. చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఇదే డివిజన్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రొహిబెల్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మజ్లిస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అలాగే, చావణీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిపైన, అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థిపైన మజ్లిస్ కార్యకర్తలు దాడి కి పాల్పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వరకాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బంజారాహిల్స్‌లోని ఆల్ఫోన్సస్ హైస్కూల్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. బయట తిరిగితే చంపేస్తాం నాంపల్లి: రెడ్‌హిల్స్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అయేషా ఫర్హీన్‌ను మజ్లిస్ పార్టీ కార్యకర్తలు చంపేస్తామని బెదిరించారు. పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు మంగళవారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. ఏసీగార్డ్స్‌లో ఉన్న నిలోఫర్ హెల్త్ స్కూల్ వద్దకు చేరుకున్న ఆమెకు పార్టీ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ తదితరులు తారసపడ్డారు. మజ్లిస్ కార్యకర్తలు అయేషా షర్హీన్ను తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వారిలో షకీల్ అనే కార్యకర్త ‘‘ఎంఐఎం అంటే ఏమిటో తెలుసు కదా...బయట తిరగొద్దని చెప్పినా తిరుగుతున్నావ్.. బతకాలనిలేదా.. కారెక్కి ఇంటికిపో’’ అని కత్తి చూపించి బెదిరించాడు. మజ్లిస్‌కు భయపడి వెళ్లేదిలేదని, చావో రేవో ఇక్కడే తేల్చుకుంటానని అయేషా ఫర్హీన్ తేల్చి చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ గుమిగూడిన వారిని చెదరగొట్టారు. అయితే, అప్పటికే ఆమెను బెదిరించిన షకీల్ తదితరులు వెళ్లిపోగా.. మజ్లిస్ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ మాత్రమే ఉన్నారు. కాగా, బాధితురాలు అయేషా ఫర్హీన్‌కు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ప్రొహిబెల్స్ స్కూల్ వద్ద రాళ్లు రువ్విన మజ్లిస్... ప్రొహిబెల్స్ స్కూల్లో పోలింగ్ ముగుస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి టీఆర్ఎస్ అభ్యర్థి మార్గం సరిత అక్కడికి వెళ్లారు. దీంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సుభాన్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంపై రాళ్లు రువ్వడంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అల్లరిమూకలను తరిమిగొట్టారు. ఈవీఎం బాక్స్‌లను సురక్షితంగా బయటకు తరలించారు. దాడికి పాల్పడ్డ మజ్లిస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడని దాడి జవహర్‌నగర్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడని కౌకూర్‌లో ఓ వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు. జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు కథనం ప్రకారం.. యాప్రాల్ పరిధిలోని కౌకూర్ హరిజన బస్తీకి చెందిన పేరుపల్లి శ్యాంరావు (52) మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడనే నెపంతో బైక్‌లపై వచ్చి కొందరు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజుయాదవ్, రాజారెడ్డి, చిట్టి, ఎల్లారెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ ... బంజారాహిల్స్: వెంకటేశ్వరకాలనీ కాంగ్రెస్ అభ్యర్థి బి.భారతిపై దాడి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 9లోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎవరో రిగ్గింగ్‌కు యత్నిస్తున్నారని తెలిసి వెళ్లిన ఆమెను కొందరు దుర్భాషలాడి, కులం పేరుతో దూషించారు. భుజంపై చెయ్యి వేసి నెట్టేశారు. దీంతో ఆమె కిందపడిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీ చార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. కాంగ్రెస్‌కు బాగా ఓట్లు పడుతున్నాయని ఓర్వలేక టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారని, అడ్డుకోబోతే దాడి చేశారని భారతి రోదిస్తూ తెలిపారు. పోలింగ్ బూత్ ముందు బైఠాయించి తనకు న్యాయంచేయాలని నినాదాలుచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె కవిత కూడా పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఆవేశంతో కుర్చీలు ధ్వంసం చేసి.. రోడ్డుపై బైఠాయించారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. దీంతో అరగంటపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, తనను కులం పేరుతో దూషించిన టీఆర్ఎస్ కార్యకర్తలు మజిద్అలీ, జావెద్ అలీ, నిస్సార్అలీ, ఖదీర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని భారతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చావణీలో టీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి... చంచల్‌గూడ: చావణీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ ఖలీమ్‌పై బాగేజారా ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ముర్తుజా అలీ అతని అనుచరులు దాడి చేసినట్లు రెయిన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎంబీటీ అభ్యర్థిపై ఎంఐఎం నాయకుల దాడి మలక్‌పేట: అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్పై ఎంఐఎం నాయకులు మంగళవారం దాడి చేశారు. మలక్‌పేట పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం... మలక్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న అంజదుల్లాఖాన్పై స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా... మలక్‌పేట సీఐ గంగారెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశో ద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. చాదర్‌ఘాట్: గాయపడ్డ అంజదుల్లాఖాన్‌ను పరామర్శించేందుకు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి ఎంబీటీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఎంఐఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అంజదుల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు
♦ ముస్లింలపై ఉగ్రవాదులుగా బీజేపీ ముద్ర వేస్తోంది ♦ కాంగ్రెస్‌తోనే మజ్లిస్ ఎదిగింది ♦ మజ్లిస్‌లో ఎక్కువ శాతం నేరస్తులే ♦ గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ కల్లబొల్లి మాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. కేబినెట్లో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదని, ముస్లిం లకు 12% రిజర్వేషన్లను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని ధ్వజమెత్తారు. తెలంగాణను తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలసి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. సైనిక్‌పురి, జమ్మిగడ్డ, మాణికేశ్వరినగర్, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, శంషీర్‌గంజ్, శాలిబండ, చార్మినార్, ఖిల్వత్, చౌమహల్లా ప్యాలెస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో దిగ్విజయ్ మాట్లాడారు. పాతబస్తీలో జరిగిన సభల్లో ఆయన మజ్లిస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తోనే ఎంఐఎం ఎదిగిందని, ఇప్పుడు ఆ పార్టీలో అంతా రౌడీలు, గూండాలే ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరే అల వాటు మజ్లిస్‌కు ఉందని దెప్పిపొడిచారు. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిపై పదికి పైగా కేసులు ఉన్నాయని ఆరోపించారు. మజ్లిస్ వ్యవహార శైలి పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకే దోహ దం చేస్తుందని, రెండూ మతతత్వ పార్టీలేనని అన్నారు. ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సంఘ్‌పరివార్‌లో కూడా సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే విషయాన్ని ఆ పార్టీ విస్మరిస్తోందన్నారు. దేశంలో కాంగ్రెస్ మాత్రమే నిజమైన లౌకిక పార్టీ అని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్, చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు. దీన్నిబట్టి విద్యార్థులు, దళితుల పట్ల వారి వైఖరేంటో తెలుస్తోందన్నారు. కేసీఆర్, బాబు, మోదీ ముగ్గురూ ఒక్కటయ్యారని అన్నారు. ఈ సభల్లో పార్టీ జాతీయ నాయకుడు కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ వినోద్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి ఫక్రుద్దీన్, మహిళా అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే నగర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు వచ్చిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. పాతబస్తీ అభివృద్ధికి మజ్లిస్ చేసిందేమీ లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ కృషితోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. విద్యార్థుల ఉద్యమాలతో బలం పెంచుకున్న టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక వారికి ఉద్యోగాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణలో ఒక మాట ఆంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
పేదల పక్షాన మజ్లిస్
⇒ పేదలకు రూ. 5కే భోజనం స్వచ్ఛమైన తాగు నీరు.. ⇒ తొలిసారి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సిటీబ్యూరో: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ- ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నిరుపేదలకు రూ. 5 కే భోజనం అందించడమే తమ ఎన్నికల అజెండా అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మజ్లిస్ తొలిసారి జీహెచ్ఎంసీ -2016 ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం అసద్ విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు.. గ్రేటర్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి, నూతనంగా మల్టీలెవల్ ఫై ్లఓవర్స్ నిర్మాణం. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మీర్ ఆలం ట్యాంక్ సుందరీకరణ.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు. మరిన్ని బస్షెల్టర్లు, ప్రత్యేక బస్సు మార్గాల (బస్బే) ఏర్పాటు. సిటీ ఆర్టీసీ బస్సుల నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించడానికి వ్యతిరేకం నగరవ్యాప్తంగా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు కంప్యూటర్ ఆధారంగా నిర్వహణ. ఘన వ్యర్థాల నిర్వహణకు పక్కా ప్రణాళిక అమలు. మరిన్ని స్వీపింగ్ యూనిట్ల ఏర్పాటు, చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు. శివారు ప్రాంతాల్లో నాలాల విస్తరణ, విస్తరణతో ఆస్తులు కోల్పోయేవారికిమెరుగైన పరిహారం అందజేత. గ్రేటర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా. మురికివాడల్లో తాగునీటిని శుద్ధి చేసేందుకు 1500 ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు. భూగర్భజలాలను పెంచేందుకు వర్షపునీటి సంరక్షణకు చర్యలు. నగరంలోని పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందజేత. ఇందుకోసం మరిన్ని భోజన కేంద్రాల ఏర్పాటు.గౌలిపురా, అంబర్‌పేట, న్యూ బోయిగూడ, జియాగూడ, చంచల్‌గూడలో ఆధునిక కబేళాల ఏర్పాటు.నగరంలోని ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి. 112 అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీ, కొత్తగా 33 అర్బన్ హెల్త్ సెంటర్ల మంజూరు.నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడల ప్రోత్సాహానికి మినీ, మల్టీపర్పస్స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడా మైదానాలు వ్యాయామ కేంద్రాల ఏర్పాటు. క్రీడా ఫెలోషిప్ పథకం అమలు. సిటీలో సుమారు 1000 ఈ-లైబ్రరీల ఏర్పాటు, రీడింగ్ రూమ్స్ పథకం పునఃప్రారంభం.విపత్తు నివారణ ప్రణాళికలకు రూపకల్పన. వీధి వ్యాపారుల రక్షణ చట ్టం అమలు చేస్తాం. వీధి వ్యాపారాల కోసం హాకర్స్ జోన్స్ ఏర్పాటు.నగరానికి 40 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించే విధంగా చర్యలు, రెండు స్టోరేజ్ ప్లాంట్ అమలు, శామీర్‌పేట, చౌటుప్పల్‌లో 40 టీఎంసీల స్టోరేజ్ ప్లాంట్లు నిర్మాణం. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పూర్తి. విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల సౌకర్యం. నగర ంలో సీసీ టీవీల నిఘా విస్తరణ. -
50 సీట్లపై మజ్లిస్ గురి..!
డివిజన్లలో ఓవైసీ బ్రదర్స్ ప్రచారం సిటీబ్యూరో: ఇప్పుడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 డివిజన్లపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. మొత్తం 150 డివిజన్లకు గాను 60 స్థానాల్లో పోటీకి దిగింది. బరిలో దిగిన డివిజన్లు ఎట్టి పరిస్థితిలోనూ చేజారకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసి 43 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్ పార్టీ ఈసారి పది డివిజన్లను తగ్గించుకుంది. పట్టులేని చోట పోటీ చేసి ఓడిపోయే కంటే బలమైన స్థానాలు చేజారకుండా చూసుకోవాలని భావిస్తోంది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడంతో పాటు సొంత గడ్డపై పార్టీ పూర్వ వైభవం చెక్కుచెదరకూడదని నేతలు నిశ్చయించుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన మజ్లిస్ బ్రదర్స్.. అభ్యర్థుల విజయానికి సైతం అదేస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బ్రదర్స్ సుడిగాలి పర్యటన.. ఎన్నికల అజెండా లేకుండా స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారానికి దిగిన ఒవైసీ బ్రదర్స్ గల్లిగల్లీలో పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభలతో సాగుతున్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సుడిగాలి పర్యటనలు చేస్తూ గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అధికార టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు లేనప్పటికీ వ్యతిరేకత కూడా ప్రదర్శించడం లేదు. బహిరంగ సభల్లో కేవలం కాంగ్రెస్, తెలుగు దేశం- బీజేపీలపై మాత్రమే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదీ గత చరిత్ర.. మూడు దశాబ్దాల క్రితం 1986లో జరిగిన ఎన్నికల్లో 100 వార్డులకు గాను 38 స్థానాల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో పూర్తిస్థాయి మెజార్టీ లేకుండా ఐదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించింది. 2002 ఎన్నికల్లో 36 డివిజన్లు, 2009లో 43 స్థానాల్లో విజయం సాధించారు. ఈసారి 60 డివిజన్ల బరిలో దిగి కనీసం 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని వ్యూహాత్మకంగా సాగుతున్నారు. -
ఊపర్ షేర్వానీ... అందర్ పరేషానీ
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్లిస్ పాలనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు అబిడ్స్: మజ్లిస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు గతంలో అనేకసార్లు నగరాన్ని పాలించి ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ...’గా తయారు చేశాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే అది మోరీలో వేసినట్లే’నని అన్నారు. గురువారం సాయంత్రం జాంబాగ్‌లో ప్రారంభించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. 65 ఏళ్లు పాలించిన వారి వల్లే గ్రేటర్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిఉంటే గ్రేటర్ హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నగరంలో రోజుకు 4-5 గంటల పాటు కరెంట్ కోతలు ఉండేవని... 19 నెలల టీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా కరెంట్ కోతలు చూశారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతోనే అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జాంబాగ్, బేగంబజార్ అభ్యర్ధులు ఎం.ఆనంద్ కుమార్‌గౌడ్, రమేష్కుమార్బంగ్, టీఆర్ఎస్ గోషామహల్ అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్, ఆర్.వి. మహేందర్ కుమార్, ఇన్చార్జ్ ప్రేమ్‌కుమార్‌ధూత్, నగర గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. -
మజ్లిస్ మాకు మిత్రపక్షం: సీఎం
మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఎవరు ప్రధానంగా పోటీ ఇస్తారని భావిస్తున్నారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత వేరే సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకున్న మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు టీఆర్ఎస్తో చేతులు కలుపుతుందన్న సంకేతాలను సీఎం సూచనప్రాయంగా ఇచ్చారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశమని, అందుకే రూ. 40 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించామని అన్నారు. ఇప్ఉడు పరివ్రమలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కంపెనీలలో విద్యుత్ కోతల వల్ల కార్మికులకు వారానికి రెండు రోజులు ఉపాధి ఉండేది కాదని, ఇప్పుడు తామిచ్చే కరెంటు వల్ల అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నీళ్లు ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అసలు వాటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే.. ఒకవేళ వాళ్లు గెలిచినా అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరని సీఎం ప్రశ్నించారు. ఆకతాయిల ఆగడాలకు షీ టీమ్స్‌తో చెక్ పెట్టామని, ఆటోరిక్షాలకు పన్ను రద్దు చేశామని, రూ. 30 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, లక్షల మంది పేదలకు పట్టాలిచ్చామని కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరంలో మురుగునీరు పోగొట్టాలంటే రూ. 12 వేల కోట్లు ఖర్చుపెట్టాలని, దానికి సుమారు 3 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. ఈ దుస్థితి కాంగ్రెస్, టీడీపీల పుణ్యమా అనే నెలకొందని మండిపడ్డారు. డ్రైనేజి సిస్టం అంతా కాంగ్రెస్, టీడీపీల హయాంలో కబ్జాలలో కూరుకుపోయిందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు.. తాను లేవనెత్తిన అంశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ రాష్ట్ర వాసైనా తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు ఊడ్చడానికి ఆ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను ఆయన ఇంకేం ఊడ్చుతారని ఎద్దేవా చేశారు. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 25 వేల కోట్లు తెచ్చి, హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రం చేస్తామని తెలిపారు. -
మజ్లిస్ మాకు మిత్రపక్షం: సీఎం
-
మజ్లిస్‌లో తగ్గిన ముస్లిమేతరులు
{పధాన పక్షాల్లో ముస్లింలకు కనిపించని ప్రాధాన్యం అధికార పార్టీలోనూ అంతే సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘జై భీమ్.. జై మీమ్’ అనే నినాదంలో బరిలో దిగిన ఆల్ ఇండియా -మజ్లిస్ -ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీలో ముస్లిమేతర అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2009 ఎన్నికల్లో సుమారు 20 మంది ముస్లిమేతర అభ్యర్థులను రంగంలో దించిన మజ్లిస్ పార్టీ ఈసారి ఆ సంఖ్యను సగానికి కుదించింది. గతంలో మొత్తం 70 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపిన పార్టీ... ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం 60 డివిజన్లకే పరిమితమైంది. ముస్లింలు, బడుగు, బలహీన, దళిత వర్గాలు ఏకమైతే అధికారం హస్తగతం అవుతుందని బహిరంగ సభల్లో పార్టీ అధినేత అసదుద్దీన్ పదే పదే చేసే వాఖ్యలకు.. ప్రస్తుత జీెహ చ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి నిలిపిన అభ్యర్థుల సామాజిక వర్గాల సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన పక్షాల్లో చోటేదీ? ప్రధాన రాజకీయ పార్టీల్లో ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 34 శాతం పైగా డివిజన్లలో ముస్లింల ప్రాబల్యం ఉంది. ఈ దామాషా ప్రకారం కూడా వారికి సీట్లు లభించలేదు. ముస్లింల పక్షపాతిగా చెప్పుకునే అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం సీట్లలో 15 శాతమే వారికి కేటాయించింది. మొత్తం 150 డివిజన్లలో పోటీకి దిగగా... కేవలం 23 స్థానాలనే ముస్లింలకు కేటాయించింది. సెక్యుల ర్ పార్టీగా ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీ మొత్తం 149 స్థానా ల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. అందులో 28 స్థానాల్లోనే ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. ఇక తెలుగుదేశం-బీజేపీ కూటమి కూడా ముస్లింలకు ప్రాధాన్యమీయలేదు. తెలుగుదేశం 14, బీజేపీ 5 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. వామపక్షాలలో సీపీఎం పోటీ చేసిన 22 డివి జన్ల కు గాను మూడు చోట్ల, సీపీఐ 21 డివిజన్లకు గాను 5 చోట్ల ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించింది. బీఎస్పీ 55 డివిజన్లకు గాను ఆరు, బీఎస్పీ 55కు ఆరు, లోక్‌సత్తా 26 స్థానాలకు ఒక చోట ముస్లిం అభ్యర్థిని పోటీలో నిలిపాయి. బరిలో 241 మంది... జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు గాను వివిధ పార్టీల తరఫున 1,333 మంది అభ్యర్థులు తలపడుతుండగా... అందులో ముస్లిం అభ్యర్థులు 241 మంది ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున 162 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 79 మంది బరిలో ఉన్నారు. మజ్లిస్‌లో ఇతరులకు కనిపించని ప్రాముఖ్యం ముస్లింల పక్షాన గళం విప్పే మజ్లిస్ పార్టీ మొత్తం 60 స్థానాలలోనే పోటీకి పరిమితమైంది. వీటిలో ముస్లిం అభ్యర్థుల ను 50 డివిజన్లలో, ఇతరులను10 స్థానాల్లో బరిలో దింపింది. ఎంబీటీ 20 స్థానాల్లో పోటీ చేస్తుం డగా... 15 డివి జన్ల లో ముస్లింలను రంగంలోకి దిం చింది. ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 12 డివిజన్లలో ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలిపాయి. -
మజ్లిస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం
కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అయ్యర్ సుల్తాన్‌బజార్: కాంగ్రెస్, టీఆర్ఎస్తో గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకోగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నాయని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అయ్యర్ అన్నారు. టీఆర్ఎస్ అబద్ధపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. శుక్రవారం రాత్రి ఆయన బషీర్‌బాగ్‌లో గన్‌ఫౌండ్రీ డివిజన్ మాజీ కార్పొరేటర్ మధుగౌడ్, బీజేపీ గన్‌ఫౌండ్రీ అభ్యర్ధి సరితాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు చిత్తుకావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ, టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రఘునందన్‌యాదవ్, దినేష్‌యాదవ్, అనిల్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బరిలో 60 మంది మజ్లిస్ అభ్యర్థులు
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు గాను 60 చోట్ల ఆల్ ఇండియా మజ్లిస్- ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. 2009 ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఈసారి 60 డివిజన్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో తలపడుతున్న అభ్యర్ధులు వివరాలివీ... ఓల్డ్‌మలక్‌పేట్ -జూవేరియా ఫాతిమా, అక్బర్ బాగ్-సయ్యద్ మీనాజుద్దీన్, ఆజాంపురా-అయేషా జహాన్ నసిమ్, చావ్నీ-మహ్మద్ ముర్తుజా అలీ, డబీర్‌పురా- మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెందీ, రెయిన్ బజార్-మీర్ వాజీద్ అలీఖాన్, పత్తార్ఘట్టి-సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మొఘల్‌పురా-అమతుల్ అలీమ్, తలాబ్‌చంచలం-నస్రీన్ సుల్తానా, లలిత్‌భాగ్-మహ్మద్ అలీ షరీఫ్, కుర్మగూడ-సలీమా బేగం, సంతోష్ నగర్-మహ్మద్ ముజఫర్ హుస్సేన్, రియాసత్ నగర్-మీర్జా ముస్తాఫా బేగ్, కాంచన్ భాగ్-రే ష్మా ఫాతిమా, బార్కాస్-షబనా బేగం, చాంద్రాయణగుట్ట-అబ్దుల్ వాహెబ్, ఉప్పుగూడ-ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దద్, జంగంమెట్-మహ్మద్ అబ్దుల్ రహమాన్, ఫలక్‌నుమా-కె.తారాబాయి, నవాబ్ సాబ్‌కుంట-షిరీన్ ఖాతూన్, శాలిబండ-మహ్మద్ ముస్తాఫా అలీ, ఘన్సీబజార్- సబీనా బేగం, పురానాపూల్-సున్నం రాజమోహన్, దూద్‌బౌలి-ఎంఏ గఫార్, జహనూమా-ఖాజా ముబ్షరుద్దీన్, రామ్నాస్పురా-మహ్మద్ ముబీన్, కిషన్‌బాగ్-మహ్మద్ సలీం, సులేమాన్ నగర్-అబిదా సుల్తానా, శాస్త్రిపురం-ఎండీ మిస్బాద్దీన్, మైలార్‌దేవ్‌పల్లి-సయ్యద్ హైదర్ అలీ, అత్తాపూర్-బి.రజని, దత్తాత్రేయ నగర్-ఎమ్డీ యూసుఫ్, కార్వాన్-ఎం.రాజేందర్ యాదవ్, లంగర్‌హౌస్-అమీనాబేగం, గోల్కొండ-హఫ్సియా హన్సీఫ్, టోలిచౌకి- డాక్టర్ అయేషా హుమేరా, నానల్‌నగర్-మహ్మద్ నసీరుద్దీన్, మెహిదీపట్నం-మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఆసిఫ్‌నగర్-ఫహీమినా అంజుమ్, విజయనగర్ కాలనీ-సల్మాన్ అమీన్, అహ్మద్ నగర్-అయేషా రుబీనా, రెడ్‌హిల్స్-అమేషా ఫాతిమా, మల్లేపల్లి-తరాన్నుమ్ నాజ్, జాంబాగ్-డి. మోహన్, గోల్నాక-సకీనా బేగం, అంబర్‌పేట-మహ్మద్, బోలక్పూర్-మహ్మద్ అఖిల్ హైమద్, షేక్‌పేట-మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,సోమాజిగూడ-జి.దేవి, వెంగళరావు నగర్-ఎం.శ్యామ్ రావు, ఎర్రగడ్డ-షాహిన్ బేగం, రహమత్ నగర్- నవీన్ యాదవ్, బోరబండ-నర్సింగ్‌రావు, శేరిలింగంపల్లి-షేక్ ఖాజా హుస్సేన్, అల్లాపూర్-ఖుర్షీద్ బేగం, ఓల్డ్ బోయిన్పల్లి-మహ్మద్ ఓమెరా, గాజులరామారం-ఎండీ సమీర్ అహ్మద్, రంగారెడ్డినగర్-కె.చెన్నయ్య, మౌలాలి-రహమతున్సీసా బేగం, బౌద్ధనగర్-షబానాబేగం -
పాతబస్తీ అభివృద్ధి మజ్లిస్‌తోనే..: అసదుద్దీన్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రారంభించారు. ఉప్పుగూడ డివిజన్లో ఆయన ఎంఐఎం అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్‌తో కలసి విస్తృతంగా పాదయాత్ర చేశారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దల దీవెనలు అందుకుంటూ ముందుకు సాగారు. నర్కీపూల్‌బాగ్, అహ్మద్ కాలనీ, బిస్మిల్లా హోటల్, చాంద్రాయణగుట్ట రోడ్డు తదితర ప్రాంతాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ...పాతబస్తీ అభివృద్ధి మజ్లిస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. కాగా బార్కాస్ డివిజన్ నూరీనగర్, అహ్మద్ నగర్లలో మజ్లీస్ శాసనసభ పక్షనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. బార్కాస్ ఎంఐఎం అభ్యర్థి షబానా బేగంతో కలిసి ఆయన బస్తీలో పర్యటించి మజ్లిస్‌కు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. -
కదిలిన కాషాయ దళం
ప్రచార వ్యూహాల తో ముందుకు 55 స్థానాల్లో గెలుపుపై బీజేపీ గురి సిటీబ్యూరో : గ్రేటర్ పీఠమే లక్ష్యంగా కాషాయ దళం ఎన్నికల పోరుకు సిద్ధమైంది. టీడీపీ పొత్తుతో అగ్రనేతలు అభ్యర్థుల తరఫున ప్రచార వ్యూహాలతో ముందుకెళ్లేందుకు శ్రేణులను సన్నద్ధం చేశారు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్న హామీతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూట మి బరి లోకి దిగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో నగరంలో 5 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకున్న బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో సైతం అదే ఊపును కొనసాగించాలని యోచి స్తోంది. గ్రేటర్లో 87 స్థానాల్లో టీడీపీ, 63 స్థానా ల్లో బీజేపీ సిద్ధమయ్యాయి. మజ్లిస్, టీఆర్ ఎస్‌లకు బల్దియా పీఠం దక్కకుండా చేస్తామని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకొనేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకునేందుకు గ్రేటర్ బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్తీల్లో ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు, రోడ్ కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. పార్టీని విజయం దశగా నడిపే భారమంతా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. పార్టీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆయన ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ-టీడీపీ కార్పొరేటర్లను గెలిపించడం ద్వారా సత్తా చాటుకునేందుకు ప్రణాళికబద్ధం గా వ్యవహరిస్తున్నా రు. మజ్లిస్‌ను అడ్డుకోవడమే తమ ధ్యేయమని ప్రకటించడం ద్వారా పాతబస్తీలో మైనార్టీయేతరులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. 2002 కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో గోదాలోకి దిగిన బీజేపీ మళ్లీ అదే పరిస్థితిని పునరావృతం చేయాలని ఆరాటపడుతోంది. పాత నగరంలో తమ పట్టును మ రింత పటిష్టం చేసుకునేందుకు గ్రేటర్ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని నేతలంతా కలసికట్టుగా ముందుకు కదులుతున్నారు. నేడు నామినేషన్లు నగరంలో తమకు కేటాయించిన 63 డివిజ న్ల లో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ... వారి కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. నామినేషన్లకు తుది గడువు ఆదివారంతో ముగియనున్నందున శనివారం అర్థరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 10 గంటలలోపే అభ్యర్థులకు బి-ఫారాలు అందించేలా నగర బీజేపీ ఏర్పా ట్లు చేసింది. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసిన ‘ఎన్నికల కమిటీ’ ఇద్దరికీ ఫోన్ చేసినట్లు సమాచారం. వారిని పిలిపిం చి... పార్టీ నిర్ణయాన్ని వెల్లడించి.. గెలిచిన తర్వాత పార్టీ మారనన్న హామీ ఇచ్చాకే వారి లో ఒకరికి బి-ఫారం ఇవ్వాలని నిర్ణయిం చినట్లు సమాచారం. బి-ఫారాలు అందకపోయినా శనివారం సుమారు 93 మంది బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
గెలుపే లక్ష్యం!
పాతబస్తీలో రిజర్వేషన్లపై తర్జనభర్జన ఎన్నికల్లో విజయానికి కసరత్తు శివారుపై మజ్లిస్ దృష్టి భారీగా దరఖాస్తులు సిటీబ్యూరో: పాతబస్తీలో అధిక శాతం డివిజన్లు రిజర్వ్ కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ విషయమై మజ్లిస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. జాతీయ స్థాయి విస్తరణకు పరుగులు తీస్తున్న తరుణంలో సొంత గడ్డ ‘బల్దియా’ ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. టీఆర్ఎస్ వ్యూహంతో మజ్లిస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 44 డివిజన్లలో 36 స్థానాలు రిజర్వుడు కేటగిరిలోకి మారాయి. కేవలం 8 డివిజన్లు మాత్రమే జనరల్‌కు మిగిలాయి. అయినప్పటికీ తమకు గట్టి పట్టున్న పాతబస్తీలో ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో రెండు మూడు రోజులుగా అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కీలక నేతలైన అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రీ,హసన్ జాఫ్రీ, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు వెనుకనున్న టీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పి కొట్టి... వాటిని చేజారకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నారు. శివారుపై ఆశలు పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాలలోని డివిజన్లపై మజ్లిస్ పార్టీ దృష్టి సారించింది. సీట్ల కేటాయింపులో దళితులు, బీసీలకు పెద్ద పీట వేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘షహర్ హమారా.. మేయర్ హమరా’ అనే నినాదంతో ప్రచారానికి దిగుతోంది. దీంతో ముస్లిమేతరులు సైతం పార్టీ తరఫున పోటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శివారు డివిజన్లలోనూ ముస్లింల ప్రాబల్యం ఉండటంతో దరఖాస్తులు భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు గుర్రాలతో పాటు వారి ఆర్థిక వనరుల పరిస్థితిని తెలుసుకునేందుకు సర్వే చేసినట్టు సమాచారం. ప్రధాన సీట్లపై కన్ను నగరంలోని ప్రధాన డివిజన్లలోనూ పాగా వేయాలని మజ్లిస్ నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌తో పాటు ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో బలమైన బీసీ, దళిత అభ్యర్థులను రంగంలో దింపేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. అవసరమైతే రాజకీయ పరిణామాలను బట్టి కలిసి వచ్చే పక్షాలతో కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగాలని అగ్రనేతలు భావిస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన డివిజన్లను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా చూడాలని వ్యూహ రచన చేస్తున్నారు. -
'టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ నడిపిస్తోంది'
-
'టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ నడిపిస్తోంది'
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే నైతిక అర్హత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... మజ్లిస్‌ను ఒప్పించడానికే ఒవైసీ కనుసన్నల్లో ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కుమ్మక్కై దొడ్డిదారిన హైదరాబాద్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఏడాదిన్నరగా టీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ను మజ్లిస్ నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 60 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని... ఆ కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీని పిలవలేదని కె.లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రులు ఎన్నికలు, ఉప ఎన్నికలు కోసమే తప్ప పరిపాలన చేసేందుకు కాదని కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో సీట్లు పంచుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జేపీ నద్దా, దత్తాత్రేయ హాజరవుతారని వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య హైదరాబాద్ నగరంలో నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తామని... ఈ సభలకు కేంద్రమంత్రులు హాజరవుతారన్నారు. జనవరి 28,29,30 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారని లక్ష్మణ్ చెప్పారు. సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్
హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికల్లో విజయం తమదేనని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం రాత్రి గోల్కొండ సీరత్ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ మిలాద్ గ్రౌండ్లో జరిగిన జల్సా మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. నగర ప్రజలు మజ్లిస్ పార్టీని ఆదరిస్తున్నారనీ, తాము ఎలాంటి ఎన్నికల హామీలు ఇవ్వమని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తమకు బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇస్తామని, అదేవిధంగా అవసరమైతే వారి నుంచి మద్దతు తీసుకుంటామని తెలిపారు. కొందరు యువకులు ఇస్లాం పట్ల సరైన అవగాహన లేక ప్రలోభాలకు లొంగి విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు -
'హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంపై చర్చించాలని పేర్కొంటూ మజ్లిస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎట్టి పరిస్థితిలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుబట్టారు. దీంతో తొలుత స్పీకర్ మధుసూదనాచారి ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలపైనే ప్రధానంగా చర్చించాలని బీఏసీలో నిర్ణయించడమైందని అన్నారు. అప్పటికీ ఆయన వినకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని రైతుల ఆత్మహత్యలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఈ చర్చ జరిగిన తర్వాతే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ అంశంపై చర్చ జరుపుకుందామని చెప్పారు. మంత్రి హరీశ్ రావు కూడా సభకు సహకరించాలని కోరడంతో చివరకు అక్బరుద్దీన్ వెనక్కు తగ్గి రైతుల అంశంపై చర్చ ప్రారంభమైంది. -
మజ్లిస్ మెప్పుకోసమే పాకులాట
సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్ హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు కీలుబొమ్మగా మారి విమోచన ఉత్సవాలు నిర్వహించేందుకు ముందుకురాలేదని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ పార్టీ మెప్పుకోసమే పాకులాడుతోందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలసిన నిజాం జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా ఉత్సవాలు జరుపుతున్నాయని, అక్కడ ముస్లింలు లేరా? అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. మంగళవారం బీజేపీ చేపట్టిన చలో సెక్రటేరియెట్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా చలో సచివాలయం చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఇందిరాపార్కు చౌరస్తా సమీపంలో ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితర నాయకులతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతకు ముందు జరిగిన ధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విమోచన ఉత్సవాలను ముస్లింలు వ్యతిరేకించడం లేదని, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎం మాత్రమే వ్యతిరేకిస్తోందని అన్నారు. త్యాగాలు అవసరమో, ఎంఐఎం కావాలో టీఆర్ఎస్ తేల్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, నాయకులు చింతా సాంబమూర్తి, వెంకటరమణి, చంద్రయ్య, నాగూరావ్ నామోజీ తదితరులు మాట్లాడారు. -
మజ్లిస్‌తోనే మా పోటీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ కమిటీ గురువారం హైదరాబాద్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసన సభ పక్ష నేత డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... బల్దియా మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన పోటీ ఎంఐఎం అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నామన్నారు. అందుకోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోని దిగుతామన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన సీనియరు నేతలు పాల్గొన్నారు. -
ఒంటరి పోరు తప్పదా?
మజ్లిస్ ప్రకటనలతో టీఆర్ఎస్లో గుబులు ఒంటరిగానే గ్రేటర్ ఎన్నికల్లోకి.. ఎంఐఎంతో అవగాహనైనా ఉంటుందని ఆశలు హైదరాబాద్: గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) ఇప్పుడు ఏకంగా ‘గ్రేటర్’ పీఠాన్నే కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏడాది కాలంగా గ్రేటర్లో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ముందుకెళుతోంది. జంట నగరాల్లో బలంగా ఎంఐఎంతో అవగాహనతో ముందుకెళుతూనే మరోపక్క తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తూ వస్తోంది. అయితే, ఇప్పటివరకు అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తోన్న ఎంఐఎం గ్రేటర్ ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతామని ఆ పార్టీ అధినేత స్వయంగా స్పష్టం చేయడం గులాబీ శిబిరంలో గుబులురేపుతోంది. వాస్తవానికి హైదరాబాద్ గ్రేటర్‌గా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లో కానీ, అంతకు ముందు జరిగిన ‘మున్సిపల్’ ఎన్నికల్లో కానీ ఎంఐఎం ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అవగాహనతో వెళ్లిన ఎంఐఎం ఆ పార్టీతో కలసి గ్రేటర్ పీఠాన్ని పంచుకుంది. పొత్తు కాదు ... అవగాహనే.. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ రాష్ర్టవ్యాప్తంగా స్థానిక సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ప్రధాన దృష్టి పెట్టింది. కొన్నింటిని స్వతహాగా చేజిక్కించుకోగా, మరికొన్నింటిని ‘అధికారహోదా’లో దక్కించుకుంది. కానీ, రాజధాని హైదరాబాద్‌లో మాత్రం పూర్తిస్థాయిలో పట్టుసాధించాలన్న వ్యూహంతో పార్టీ నాయకత్వం ఉంది. గ్రేటర్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఇప్పటికే అనేక ఎత్తులు వేసింది. ఎంఐఎంతో ముందునుంచీ స్నేహంగానే ఉంటూ వస్తోంది. ఆ పార్టీ ఏది కోరినా తీరుస్తూనే ఉంది. దీంతో గ్రేటర్లో ఎంఐఎంతో కలిసే పోటీచేస్తామని ఇప్పటిదాకా గులాబీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. ఎంఐఎంతో అంటకాగొద్దని, ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలే గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్లో ముస్లిం నేతలు చెబుతున్నా ఎంఐఎంతో స్నేహపూర్వకంగా ఉంటూనే వచ్చింది. ఎంఐఎం ప్రకటన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని దాదాపు తేలిపోయింది. టీఆర్ఎస్లో ముస్లిం నాయకులు మాత్రం ఎంఐఎంతో కలసి పోటీ చేయడం వల్ల తమకు అవకాశాలు రాకుండా పోతాయని భావించారు. దీంతో ఓల్డ్‌సిటీలో పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని విజయవంతం చేశారు. ఇదిలాఉండగా, ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేకపోయినప్పటికీ అవగాహన మాత్రం ఉంటుందని అధికార పార్టీ నేతలు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గ్రేటర్‌కు ... గులాబీ గురి గ్రేటర్‌పై గురిపెట్టిన అధికార టీఆర్ఎస్ ముందుగా డివిజన్ల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. 2011 జనాభా లెక్కల మేరకు డివిజన్లను 150 నుంచి 200కు పెంచే పనిలో పడింది. గడిచిన ఏడాది కాలంగా స్పెషల్ అధికారి పాలనలో ఉన్న గ్రేటర్‌కు ఈ ఏడాది చివరి నాటికల్లా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కనీసం 101 డివిజన్లలో గెలవాలి. ఈ కారణంగానే హైదరాబాద్‌లో కొంత ప్రాబల్యం ఉన్న టీడీపీని బలహీన పరిచే వ్యూహాన్ని టీఆర్ఎస్ అనుసరించింది. నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని పార్టీలో చేర్చుకుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ఎంబీటీ 1, పీఆర్పీ 1 స్థానంలో గెలవగా, కాంగ్రెస్, ఎంఐఎం అవగాహనతో అధికారం పంచుకున్నాయి. ఈసారి కూడా ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశాలు తక్కువ కాబట్టి, అధికార టీఆర్ఎస్, ఎంఐఎం కచ్చితంగా ఎన్నికల అవగాహనతో వెళతాయని విశ్లేషిస్తున్నారు. -
ఎన్కౌంటర్ చంద్రబాబు
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ధ్వజం * శేషాచలం ఘటనకు బాబు మూల్యం చెల్లించక తప్పదు * రెండు రాష్ట్రాల్లో జరిగినవీ బూటకపు ఎన్కౌంటర్లే సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ ఘట నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదనిడమజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నగరంలోని ఖిల్వత్ మైదానంలో యునెటైడ్ ముస్లిం ఫోరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 20 మంది కూలీలను కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఆయన నారా చంద్రబాబు కాదని, ఎన్కౌంటర్ చంద్రబాబు అని అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రం లో బాబు అధికారంలో ఉన్నప్పుడు 2,002 బూట కపు ఘటనలను ప్రోత్సహించి తగిన మూల్యం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. బాబు పరిపాలనకు సమర్థుడు కాదని, ఆయన్ను గద్దె దించిన ఘనత యునెటైడ్ ముస్లిం ఫోరందేనని ఆయన గుర్తు చేశారు. ముస్లిం లను జిహాది పేరుతో, దళితులను స్మగర్ల పేరుతో హతమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిట్‌ను అంగీకరించబోం.. ఆలేరు ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం వేసిన సిట్‌ను అంగీకరించబోమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆలేరు ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కలసి కోరితే ఆయన పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ సందీప్ శాండిల్యపై తమకు నమ్మకం లేదని, గతంలో మక్కా మసీదు బాంబు పేలుడు ఘటన సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులపై ఆయన ముస్లిం యువకులకు వ్యతిరేకంగా తప్పుడు నివేదిక సమర్పించారని అన్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యదర్శి జారీ చేసిన సిట్ జీవోలో మృతి చెందిన వారిని తీవ్రవాదులుగా పేర్కొన్నారని, వారిని కోర్టు శిక్షించనప్పుడు తీవ్రవాదులని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన 17 మంది పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల వినాశనానికి మోదీ కుట్ర ప్రధాని మోదీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూ... ముస్లింల వినాశనానికి పాల్పడుతున్నాడని అసదుద్దీన్ దుయ్యబట్టారు. ముస్లింల చరిత్రను మోదీ తెలుసుకోవాలని, ముస్లింలతోనే ప్రపంచం.. ప్రపంచంతోనే ముస్లింలని ఆయన పేర్కొన్నారు. -
అవి పోలీసుల ప్రతీకార హత్యలే: అసదుద్దీన్
-
పోలీసులే జడ్జిల్లా వ్యవహరిస్తారా?
హైదరాబాద్ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. పోలీసులే జడ్జిల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ ఖైదీలపై కాల్పులు ఏవిధంగా జరుపుతారని అసదుద్దీన్ అన్నారు. అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని ఆయన కోరారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమే పథకం ప్రకారం వికారుద్దీన్ గ్యాంగ్ ని హతమార్చిందని ఆయన అన్నారు. -
పోలీసుల ప్రతీకార హత్యలు: అసదుద్దీన్
హైదరాబాద్: వరంగల్ శివారులో జరిగిన ఎన్కౌంటర్ ఘటన పోలీసుల ప్రతీకార హత్యలుగా మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఐదుగురు అండర్ ట్రయిల్ ఖైదీల ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సూర్యాపేట ఘటనకు ప్రతీ కారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసు అధికారులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఐదుగురు ఖైదీల ఎన్కౌంటర్ బూటక మని ఎంబీటీ బాధ్యుడు అమ్జదుల్లా ఖాన్ అన్నారు. -
పుణే కార్పొరేషన్లపై ఎంఐఎం కన్ను
పింప్రి, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలను సాధించి శాసనసభలో అడుగుపెట్టిన ఎంఐఎం ఇక మున్సిపాలిటీలపై దృష్టి సారించింది.. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో పాగా వేయడానికి ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. పుణే కార్పొరేషన్లో 20 స్థానాలు, పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్లో 13 స్థానాలపై ఎంఐఎం గురి పెట్టింది. పలురాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు కూడా మజ్లిస్ పట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. పుణేలో ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై నిర్వహించిన బహిరంగ సభలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని శివసేన అడ్డుకున్న సంగతి తెల్సిందే. తన సభకు ఆటంకం కలిగించడంతో ఒవైసీ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఒక్కడినే అన్ని బహిరంగ సభలలో ప్రసంగిస్తానని సవాల్ విసిరి వెళ్లారు. దీనితొ మరో రెండు సంవత్సరాలలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. పుణే కార్పొరేషన్లో 76 స్థానాలుండగా, పింప్రి-చించ్వడ్లో 64 స్థానాలున్నాయి. రెండింటిలో కలిపి కనీసం 30 స్థానాలను సాధించేందుకు ఎంఐఎం రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో వంద శాతం విజయం సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కలుపుకొని వారికి కొన్ని స్థానాలను కేటాయిస్తే, మరిన్ని స్థానాలను పార్టీ ఖాతాలో వేసుకోవచ్చని వ్యూహం రచిస్తోంది. పుణే నగరంలోని కొండ్వాలో (2), గణేష్‌పేట్ నానాపేట్, మంగళవార్ పేట్, జునా మంగళవార్ పేట్, కసబాపేట్, శివాజీనగర్-పాటిల్ ఎస్టేట్, యరవాడా, శాస్త్రినగర్‌లోని వార్డులపై ఎంఐఎం అధ్యయనం చేస్తున్నది. అలాగే పింప్రి-చించ్‌వడ్‌లోని కాసర్వాడి, జిరాత్వాడి, కాలేవాడి, నెహ్రునగర్, రూపీనగర్, చిఖిలి, కుదల్ వాడి, ఆకృడి, దాపోడీ, చించ్‌వడ్‌లోని వార్డులపై ఎంఐఎం దృష్టి పెట్టింది. ముస్లిం మంచ్‌కు చెందిన అంజుమన్ ఇనాందర్ మాట్లాడుతూ...రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం కేవలం ముస్లిం అభ్యర్థులనే కాకుండా ఆయా వార్డులలోని పరిస్థితులను బట్టి ఇతర అభ్యర్థులను కూడా రంగంలోకి దింపుతామని చెప్పారు. -
'టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తు ఎండగట్టాలి'
హైదరాబాద్: జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... అధికార టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య పొత్తును ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న టీఆర్ఎస్... మాటలకే మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. రాజయ్య బర్త్రఫ్పై ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!
సాక్షి, ముంబై: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాలకు తెర తీశారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడి చందంగా బీజేపీ, శివసేనలను ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండురోజుల పాటు జరగనున్న ఆ పార్టీ సమావేశాలను శరద్‌పవార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాధించలేదని, దీంతో రాష్ట్రంలో తొందర్లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఎత్తుగడ దాగి ఉందనే కోణంలో అప్పుడే రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన మరో కూటమిగా ఎన్నికల్లో పోటీచేస్తూ వచ్చాయి. కాగా, మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలూ సీట్ల సర్దుబాటు కాక ఒంటరిగానే పోటీకి దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ (122) అతి ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో శివసేన(63), కాంగ్రెస్(41), ఎన్సీపీ(40) నిలిచాయి. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీకి భేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీ మద్దతు తీసుకోవడంపై వ్యతిరేకత రావడంతో బీజేపీ కొంత వెనక్కు తగ్గింది. తర్వాత మద్దతు కోసం శివసేనతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య కొంతవరకు సానుకూలంగా చర్చలు జరిగినా, మంత్రిత్వశాఖల కేటాయింపుల్లో తేడాల వల్ల అవి ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే గత 12వ తేదీన బీజేపీ సర్కార్ మైనారిటీ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై శివసేన మండిపడుతూ.. ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. అలాగే తమ మంత్రులపై ఉన్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ సర్కార్‌కు ఎన్సీపీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆరోపించింది. అయితే ‘బలపరీక్ష’ సమయంలో బీజేపీ మూజివాణి ఓటు ద్వారా బలపరీక్షను నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ మొత్తం తతంగంలో ఎన్సీపీ చాలా తెలివిగా వ్యవహరించింది. బలపరీక్ష సమయంలో బీజేపీతో శివసేన పొత్తు కుదుర్చుకునేందుకు అవకాశాలు తగ్గిస్తూ, తమ పార్టీ బీజేపీకి భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పదేపదే ప్రకటించింది. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్వయంగా కూడా ఇటువంటి ప్రకటనలు చేయడం విశేషం. దీని దెబ్బతో శివసేన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బీజేపీ మూజువాణి ఓటుతో గట్టెక్కి కొంత అపవాదును మూటగట్టుకుంది. ఈ పరంపరలో బీజేపీ, శివసేనల పైన ఒత్తిడి పెంచేందుకే ఇప్పుడు ‘పవార్’ గేమ్ ప్రారంభించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇదే సమయంలో తమ గత ప్రభుత్వంలో తమ మంత్రులు అవినీతికి పాల్పడలేదని, అవసరమైతే ఎటువంటి సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని పేర్కొనడం విశేషం. అలాగే బీజేపీకి శివసేనతో జతకట్టే పరిస్థితి లేదని, అదే సమయంలో తమ మద్దతు తీసుకునే ధైర్యమూ లేదని వ్యాఖ్యానించడం ఫడ్నవిస్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడం కిందేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన ప్రతిపక్షంలో ఉంది. ఆరు నెలల తర్వాత తిరిగి జరిగే బలపరీక్షలో బీజేపీ సర్కార్‌కు కాంగ్రెస్, ఎన్సీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. అలా కాకుండా, బీజేపీ సర్కారు మనుగడ సాధించాలంటే తమ పాత్ర చాలా కీలకమనే భావన ఆ పార్టీలో కలగజేసేందుకే పవార్ ఈ ఎత్తుగడ వేశారని చెప్పవచ్చు. ప్రభుత్వ మనుగడ శివసేనపై ఆధారం...? తొలిసారిగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం మనుగడ శివసేన నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్టయితే రాష్ట్రంతోపాటు కేంద్ర రాజకీయాల్లో బీజేపీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిరానుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారాన్ని కాపాడుకునేందుకు శివసేన మద్దతు మినహా బీజేపీ వద్ద మరో ప్రత్యామ్నామం లేదు. దీంతో శివసేనకు అవసరమైతే ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చే ఆస్కారముంది. ఇదిలా ఉండగా, ప్రత్యేక విదర్భకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతులుకలిపేందుకు సిద్ధమవుతారా అనేది వేచిచూడాల్సిందే. -
మజ్లిస్ పార్టీ నుంచి ఇలియాస్ బహిష్కరణ
సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీ నుంచి అనంతపురం జిల్లాకు చెందిన సీఎం ఇలియాస్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటనలో తెలుపారు. అతనితో ఇకపై మజ్లిస్‌పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. -
శివసేన Vs మజ్లిస్
-
పింఛన్ అర్హత వయోపరిమితి తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ అర్హత వయోపరిమితి 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో మజ్లిస్ ఎమ్మెల్యేలు సమావేశమై సంక్షేమ పథకాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను లబ్ధిదారులకు నగదు రూపం లో కాకుండా బ్యాంక్ ఖాతాల ద్వారా అందించాలన్నారు. నగదు రూపంలో పంపిణీ చేస్తే పక్కదారి పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం 40 శాతం వరకు పిం ఛన్లు లబ్ధిదారులకు అందడం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా దరఖాస్తుల పరిశీలన పక్కాగా చేయాలని కోరారు. బోగస్ లభ్ధిదారులను ఎంపిక చేస్తే సం బంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యు లు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి నిబంధన దృష్టిలో పెట్టుకొని నియోజవర్గానికి ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అనుమతించిన ఆధార్ కేంద్రాల్లో సర్వీస్ చార్జీల పేరిట ఒక్కొకిరి నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని, దీంతో ఆధార్ నమోదు కోసం కుటుంబాలు సగటున రూ.1500పైగా భారం మోయకతప్పడం లేదని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొవచ్చారు. నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస దృవీకరణ పత్రాలను త్వరగా జారీ చేయాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్, మౌజం ఖాన్, కౌసర్ మొహియొద్దీన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ జాఫ్రీ, హైదరాబాద్ కలెక్టర్ మీనాలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఏడంతస్తుల ఎత్తులో
నగరవాసులు మెట్రో రైలు ప్రయాణాన్ని త్వరలో మరింత ఆస్వాదించనున్నారు. ఇందుకు కారణం మూడో దశలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ).... నగరంలోని దౌలాకువాన్ ప్రాంతంలో త్వరలో మెట్రో రైళ్లను 23.6 మీటర్ల ఎత్తున నడపనుండడమే. దౌలాకువాన్ వద్ద 23 మీటర్ల పొడవైన మెట్రో పిల్లర్లు న్యూఢిల్లీ: మెట్రో మూడో దశలో భాగంగా మజ్లిస్ పార్కు-శివ్‌విహార్ కారిడార్‌లో భాగంగా దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ నిర్మాణం జరుగుతోంది. దీని పొడవు 59 కిలోమీటర్లు. దీని కిందనే దౌలాకువాన్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గముంది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే మెట్రో రైళ్లకు ఎంతమాత్రం అంతరాయం కలగకుండా ఇంజనీర్లు, సిబ్బం ది ఈ పనులను ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నా రు. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కార్పొరేట్ కమ్యూనికే షన్స్ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ మాట్లాడు తూ ‘దౌలాకువాన్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు స్థంభాల ఎత్తు దాదాపు ఏడు అంతస్తుల ఎత్తు లో ఉంటాయి. ఇది నగరంలోనే అత్యం త ఎత్తయిన మార్గం కానుంది. గతంలో కర్కర్డుమా ప్రాంతం లో నిర్మించిన మెట్రో మార్గం ఎత్తు 19 మీటర్లు’అని అన్నారు. ఎయిర్‌పోర్టు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేం దుకుగాను రాత్రి గం 12.30 నుంచి ఉదయం నాలు గు గంటలవరకూ మాత్రమే ఎయిర్‌పోర్టు లైన్‌పైన పనులను చేపడుతున్నామన్నారు.ఈ సమయంలో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఎటువం టి కార్యక్రమాలకు అనుమతి ఉండబోదన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డైవర్షన్ రోడ్డును కూ డా నిర్మించామన్నారు. ఎయిర్పోర్ట్ లైన్ కార్యకలాపాలు, నిర్వహణ విభాగం నుంచి అన్పి అనుమతు లూ పొంది న తర్వాతే పనులను ప్రారంభించామన్నారు. తగు భద్రతా చర్యలు దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ పనులను చేపట్టిన నేపథ్యంలో దీని కింది భాగంలో పనిచేసే సిబ్బందితోపాటు రైళ్లకు భద్రత కల్పించేందుకుగాను డీఎంఆర్సీ తగు భద్రతా చర్య లు తీసుకుంది. ఇందులోభాగంగా ఎయిర్పోర్ట్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటుచేసింది. దీంతోపాటు ఆరుగురు సివిల్ ఇంజనీర్లు, ఇద్దరు భద్రతా నిపుణులు, కార్యకలాపాలు, నిర్వహణ విభాగానికి చెందిన ఇంజనీర్లు, ఇతర నిపుణులతో కూడిన ఆరు బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు కన్నార్పకుండా తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలోని ప్రస్తుత వయాడక్ట్, ఓవర్ ఎలక్ట్రిఫికేషన్ (ఓహెచ్ఈ)లపై సెగ్మెంట్లను ఏర్పాటుచేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కింది మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడుతున్నాయి. -
మైనారిటీ బడ్జెట్ పది రెట్లు పెంచాలి
14వ ఆర్థిక సంఘానికి ఎంపీ అసదుద్దీన్ లేఖ సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మైనారిటీల సంక్షేమం, వివిధ పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ కేటాయింపులను పది రెట్లు పెంచాలని కోరుతూ 14వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం లేఖ రాశారు. మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఇటీవల జాతీయ మైనార్టీస్ కమిషన్, విద్యాసంస్థలు,జాతీయ శాంపిల్ సర్వే సంస్థలు చేసిన అధ్యయనాల్లో సైతం ఈ విషయం వెల్లడైందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం కింద మైనారిటీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల ప్లాన్, నాన్‌ప్లాన్ కేటాయింపులు తగినంతగా ఉండాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ మాదిరిగా బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్ రూపొందించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
ఎంఐఎం ఎన్ని‘కలలు’
సాక్షి, ముంబై: తన పార్టీని మహారాష్ట్రలో వీలైనంత మేర విస్తరించేందుకు మజ్లిస్-ఎ-ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రయత్నాలు తీవ్రం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ పార్టీ ఇప్పటికే మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించి ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తూర్పు ఔరంగాబాద్, సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎంఐఎం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల బలాబలాలను మదింపు చేయనున్నట్టు తెలిసింది. సెప్టెంబరు మొదటివారంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్సీపీకి చెందిన కొంద రు అసంతృప్తి నాయకులు ఎంఐఎంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. మరాఠ్వాడా, ముంబై, నాసిక్ జిల్లాలతోపాటు విదర్భ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్లో 11 స్థానాలను ఎంఐంఎం గెలుచుకున్నప్పటికీ, సిల్లోడ్ మున్సిపాలిటీలో అంతగా విజయం సాధించలేకపోయింది. దీని తరువాత నిర్వహించిన లోకసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా, తాజా అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టింది. మరాఠ్వాడలో 25 శాతం ముస్లింలు మరాఠ్వాడాలో దాదాపు 25 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్ల సంఖ్య 30 నుంచి 40 శాతం వరకు ఉంది. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతోనూ పొత్తులు పెట్టుకునే విషయంపై కూడా ఎంఐఎం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన ఏడుగురు నాయకులు ఈసారి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో టిక్కెట్ లభించని అభ్యర్థులు ఎంఐఎం నుంచి పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది. సంప్రదింపుల్లో ఉన్నారు.. -ఖురేషీ ఔరంగాబాద్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి బరుస్తున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు జావేద్ ఖురేషీ తెలిపారు. ఎన్సీపీకి చెందిన పలువురు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పారు. అయితే ఔరంగాబాద్ టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంపై తుది నిర్ణయం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీసుకుంటారని చెప్పారు. -
గ్రేటర్ ఎన్నికల దృష్ట్యానే మజ్లిస్‌తో మంతనాలు
ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆరోపణ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆక్రమణల పేరిట ఇళ్లను కూల్చివేస్తున్న రాష్ట్రప్రభుత్వం మరోవైపు మజ్లిస్‌తో దోస్తీకోసం పలురాయితీలు ప్రకటిస్తోందని ఇదంతా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి శనివారం బర్కత్‌పురాలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్లు, అసెంబ్లీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21న సికింద్రాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభినందన సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనేలా అమిత్‌షా ఆ సమావేశంలో కార్యకర్తలకు కర్తవ్యబోధన చేసి వారిలో ఉత్సాహాన్ని నింపుతారన్నారు. ఈనెల 15న గోల్కొండ కోటలో జరిగిన పతాకావిష్కరణ సందర్భంగా పాతబస్తీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారని, అందులో పాత బస్తీలో పురాతన స్థలాల్లో నిర్మించిన బహుళ అంతస్థుల నిర్మాణాలకు ఎలాంటి అపరాధ రుసుము, పన్నులు విధించకుండా ప్యాకేజీలు ప్రకటించేలా సమాలోచన చేసినట్లు తనకు తెలిసిందన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టాలు తీసుకురావాలి రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తవాటిని తీసుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన కొన్ని చట్టాలు కోస్తా ప్రాంతానికి అనూకూలమైనవన్నారు. బార్ అసోసియేషన్ చైర్మన్ ఎ. నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల కోసం రూ.వంద కోట్లు కేటాయించడం సంతోషదాయకమన్నారు. ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు విఠల్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షునిగా పిటం ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్య దర్శిగా నరేష్ కుమార్ ఎన్నికయ్యారు. -
మజ్లిస్‌తో టీఆర్ఎస్ దోస్తీనా?
తెలంగాణను వ్యతిరేకించిన ఆ పార్టీకి సలాం కొడతారా?: కిషన్‌రెడ్డి ఆ పార్టీ రజాకార్ల వారసత్వమని మరిచారా? తెలంగాణలో ఖాసీం రజ్వీ అకృత్యాలు గుర్తులేదా..{పజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ బదులు మరేదైనా చారిత్రక గుర్తును వాడాలి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచేలా వ్యవహరించిన మజ్లిస్‌తో దోస్తీకి ఎందుకు తాపత్రయపడుతున్నారో తెలంగాణ రాష్ర్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నీడలో బలపడేందుకు నిన్నటి వరకు యత్నించిన మజ్లిస్ పార్టీ నేతలపై దేశ ద్రోహం కేసులున్న సంగతి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అయినా వారి మద్దతు కోసం వారికి ఎదురేగి మరీ సలాం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖాసిం ర జ్వీ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లెల్లో వందలమంది మహిళలపై అత్యాచారాలు చేసి అడ్డొచ్చిన వారిని ఊచకోత కోసిన రజాకార్ల వారసత్వంగా ఎదిగిన పార్టీ మజ్లిస్ అన్న విషయాన్ని కేసీఆర్ మరిచారా అని ప్రశ్నించారు. తెలంగాణలో సాయుధపోరాటం ఎందుకు వచ్చిందో, నాటి యోధులకు ఎందుకు సమరయోధుల పింఛన్ ఇస్తున్నారో టీఆర్ఎస్ అధినేత గుర్తుచేసుకోవాలన్నారు. కొద్దిసేపు పోలీసులు పట్టించుకోకుంటే భారతీయుల సంగతేంటో చూద్దామంటూ ప్రసంగించి ఒక వర్గం వారిని రెచ్చగొట్టి దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న మజ్లిస్ నేతలకు కేసీఆర్ కుటుంబం సాదరస్వాగతం పలికి ప్రభుత్వానికి మద్దతు కోరటం దారుణమన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని మజ్లిస్ మద్దతుతో ఏర్పాటు చేయటం ఏమాత్రం శుభం కాదన్నారు. హైదరాబాద్‌లో బలంలేని టీఆర్ఎస్ త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ పది సీట్లు పొందేందుకు మజ్లిస్ దోస్తీకి ఆరాటపడటం అవకాశవాదమన్నారు. చార్మినార్ ఓ మతానికి సంబంధించిందని గతంలో పదేపదే చెప్పిన మజ్లిస్ నేతల ఒత్తిడితో దాని చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో పొందుపరచాలని చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. వాస్తవానికి కూడా చార్మినార్ కట్టడంలో మసీదు ఉన్నందున... అది కాకుండా రాష్ట్ర చరిత్రను ప్రతిబింబించే ఇతర గుర్తులకు ఆ చిహ్నంలో చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విధివిధానాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలి... రాష్ట్రం విడిపోయినప్పుడు ఉద్యోగుల విభజన ఎలా జరగాలన్న అంశంపై రూపొందించిన విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారమే ఇప్పుడు పంపకం జరగాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పంపకం సామరస్యపూర్వకంగా జరిగేలా సహకరించాలే తప్ప రెచ్చగొట్టేలా వ్యవహరించ వద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ నేత విఠల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించటం అవివేకమన్నారు. -
'మజ్లిస్‌తో టీఆర్ఎస్ పొత్తు ప్రమాదకరం'
-
ప్రభుత్వంలో చేరేది లేదు..
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ స్పష్టీకరణ ప్రభుత్వ చిహ్నంగా చార్మినార్ ను గుర్తించాలి.. కేసీఆర్‌కు అసద్ పలు ప్రతిపాదనలు సాక్షి,సిటీ బ్యూరో: ఏళ్లుగా పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో తొలిప్రభుత్వంలో చేరబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తాం..తప్ప పదవులపై వ్యామోహం లేదని తేల్చిచెప్పింది. దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. ఈ నేపధ్యంలో గురువారం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ, అగ్రనేత అక్బరుద్దీన్లు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై మహానగరాభివృద్ధిపై తమ ప్రతిపాదనలు ముందుంచారు. ఇదీ మా లెక్కంటూ స్పష్టంచేశారు. ఆ వివరాలు.. నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ చిహ్నంగా చారిత్రక కట్టడమైన చార్మినార్ గుర్తించాలని విజ్ఞప్తి. ప్రస్తుతం కొనసాగుతున్న జీహెచ్ఎంసీని రద్దు చేసి దానిస్థానంలో పాత ఎంసీహెచ్‌ను పునరుద్ధరించాలి. నగర శివారు రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రాంతాలను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి. నగరానికి కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో తీసుకరావాలి. పాతబస్తీ అభివృద్ధికి 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మంజూరుచేసిన రూ.2,075 కోట్లను విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలి. నగరంలో విద్యుత్ సమస్యను అధిగ మించేందుకు 440-800 కేవీ సబ్స్టేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలి. ధర్మాస్పత్రి ఉస్మానియాను అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్ కంటే మెరుగ్గా అభివృద్ధి పర్చాలి. బండ్లగూడలో అందుబాటులో ఉన్న 100 ఎకరాల భూమిని బలహీనవర్గాల వారికి ఇళ్లస్థలాలుగా కేటాయించాలి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరి మైనార్టీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలి. ముస్లింలు 45 శాతం ఉన్న హైదరాబాద్ జిల్లాలో ముస్లిం అధికారులనే జిల్లా విద్యాశాఖాధికారిగా పోస్టింగ్ ఇవ్వాలి. ఉర్దూ టీచర్ల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి. మైనార్టీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లింలలో విద్యను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. -
‘పుర’ ఫలితాల్లో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠభరితంగా సాగిన పురపోరులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెండు, టీడీపీ రెండు గెలుచుకోగా.. ఒక దాంట్లో మిశ్రమ ఫలితం వచ్చింది. జిల్లాలోని వికారాబాద్, బడంగ్‌పేట పురపాలక సంఘాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీలను తెలుగుదేశం చేజిక్కించుకుంది. మరోవైపు తాండూరులో వెలువడిన అనూహ్య ఫలితాలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచాయి. ఊహించనిరీతిలో మజ్లిస్ పుంజు కోవడమే కాకుండా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్తో సమానంగా పది వార్డులను గెలుచుకుని చైర్మన్ రేసులో నిలిచింది. మైనార్టీ ఓటర్ల అండతో మరోసారి మున్సిపాలిటీని దక్కించుకుంటామని భావించిన కాంగ్రెస్.. గెలుపువాకిట బోల్తా పడింది. కేవలం 8 వార్డులకే పరిమితమైంది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, ఓటర్ల మద్దతును కూడగట్టలేకపోయింది. గంపెడాశలు పెట్టుకున్న ఉద్యోగసంఘాలు, బలమైన సామాజికవర్గాలు ఆ పార్టీకి అండగా నిలబడలేదు. అయితే, మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్, టీడీపీలను వెనకకు నెట్టడంలో సఫలమయ్యారు. పైచేయి..! వికారాబాద్ పురపాలక సంఘాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఓటర్ల ఏకపక్ష తీర్పుతో చైర్మన్ పదవిని సునాయసంగా నిలబెట్టుకుంది. మొత్తం 28 డివిజన్లలో ఆ పార్టీ 14 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. పురపాలక ఎన్నికల సమయంలో పలువురి వలసలతో టీడీపీ బలపడిందని ప్రచారం జరిగినా, ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అది అంతగా ఫలితం చూపలేదని అర్థమవుతోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. ఇక నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత బడంగ్‌పేటకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో పదిహేను స్థానాలను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. ఇక్కడ టీడీపీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. కేవలం ఒక వార్డుతో మాత్రమే సరిపెట్టుకుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన రాజకీయ చతురతతో తిరుగులేని విజయాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు. సైకిల్ జోరు! కొత్తగా ఏర్పడిన పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రెండింటిలోనూ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించింది. కాంగ్రెస్ నైతల అనైక్యత, లుకలుకలను అనూకులంగా మలుచుకుని విజయం సాధించింది. టికెట్ల వేటలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు, ప్రచారపర్వంలో అనుసరించిన విధానం విజయావకాశాలను దెబ్బతీసింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయడం కలిసొచ్చింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రెండు పురపాలికలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. తాండూరులో ‘గాలి’పటం! అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మజ్లిస్ ఊహకందని విజయాలను నమోదు చేసింది. చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడంలో మజ్లిస్ నిర్ణయాత్మకశక్తిగా మారుతుందని ప్రధాన పార్టీలు భావించాయి. ఈ క్రమంలోనే మజ్లిస్ మద్దతు కోసం వెంపర్లాడాయి. అయితే ఊహించనిరీతిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అంచనాలను దెబ్బతీయడమేకాకుండా ఆ పార్టీలకు సమఉజ్జిగా నిలిచింది. టీఆర్ఎస్తో సమానంగా పది వార్డులను గెలుచుకున్న మజ్లిస్.. చైర్మన్ పీఠంపై కన్నేసింది. హంగ్ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ (8)తో జతకట్టడం ద్వారా మున్సిపాలిటీపై జెండాను ఎగురవేయాలని ఎంఐఎం భావిస్తోంది. టీఆర్ఎస్ మద్దతు కూడా దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్న ఆ పార్టీ.. ఈనెల 16వ తర్వాత శాసనసభ ఫలితాలను పరిశీలించి తదనుగుణంగా అడుగులు వేయాలని యోచిస్తోంది. కాగా, అతివిశ్వాసంతో దెబ్బతిన్న కాంగ్రెస్.. ఇప్పు డు నష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఎంఐఎంకు అండగా నిలవ డం, లేదా మద్దతు తీసుకోవడం ద్వారా మున్సిపాలిటీని తిరిగి నిలబెట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా పుర ఫలితాలు వెలువడిన అనంతరం మజ్లిస్ పెద్దలతో ఆ యన మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భంగపాటు! పురపాలక ఎన్నికల్లో పలువురు చైర్మన్ అభ్యర్థులకు భంగపాటు ఎదురైంది. వికారాబాద్‌లో నాలుగు పర్యాయాలు వరుస విజయాలతో ఓటమెరుగని చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్(టీడీపీ) ఈసారి పరాజయం పాలయ్యారు. టీడీపీ తరుఫున చై ర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో ము న్సిపాలిటీలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ వార్డులు లభించినప్పటికీ, ఆయన మాత్రం విజయం సాధించలేకపోయారు. అలాగే టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి శుభప్రదపటేల్ కూ డా గెలుపు ముంగిట బోల్తా పడ్డా రు. తాండూరులో కూడా ఆపార్టీ చైర్పర్సన్ అభ్యర్థి విజయాదేవి సమీప టీడీపీ ప్రత్యర్థి చేతిలో ఓడిపోగా, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి యాలాల యాదయ్య కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. -
రెపరెపలు అక్కడివరకేనా..?
పాతబస్తీ దాటని ‘పతంగి’ ప్రచారం మిగతా స్థానాల్లో కనిపించని హోరు సీటు దక్కని సిట్టింగ్‌లు ప్రచారానికి నై సాక్షి,సిటీబ్యూరో: మజ్లిస్ కంచుకోట పాతబస్తీలోనే ఆ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుండగా..మిగతా నియోజకవర్గాల్లో వెనుకబడిపోతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎన్నికల్లో గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన పార్టీ ప్రచారపర్వంలో మాత్రం పాతబస్తీ నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాల్లో పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తోంది.ఏకంగా కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంకు ఎన్నికలు పూర్తయ్యే వరకు విరామం ప్రకటించి మొఘల్‌పురాలోని ఒక ఫంక్షన్‌హాల్‌ను ఎన్నికల కార్యాలయంగా మార్చుకుంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానాలపైనే అధికదృష్టి సారించడంతో సిట్టింగేతర కొత్త స్థానాల్లో ప్రచారహోరు ఇంకా ఊపందుకోలేదు. పాతబస్తీకే పరిమితం మజ్లిస్ పార్టీ అగ్రనేతల పర్యటనలు పాతబస్తీకే పరిమితమవుతున్నాయి. పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ, చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారంలో తీరిక లేకుండా సాగుతున్నారు. సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. సిట్టింగ్ నియోజకవర్గాలు చార్మినార్, మలక్‌పేట, యాకుత్‌పురా, బహుదూర్పురాల్లో కూడా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గల్లీగల్లీకి తిరుగుతూ పతంగి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాంపల్లి, కార్వాన్ స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కనబెట్టి కొత్తవారిని బరిలోకి దింపడంతో అక్కడి ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ప్రచారం ఊపందుకుకోలేదు. కొత్త స్థానాల్లో ఊసేలేని ప్రచారం మజ్లిస్ కొత్తగా బరిలో దిగిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారహోరు ఇంకా పుంజుకోలేదు. అడపాదడప పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ తన లోక్‌సభ పరిధి దాటి ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లల్లో ప్రచారం చేస్తుండగా.. మిగతా నేతలు మాత్రం పెద్దగా తిరగట్లేదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఫర్వాలేదనిపిస్తున్నా..మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం పత్తా లేకుండా పోయింది. దీంతో ఈసారి గ్రేటర్‌వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ బరిలో దిగినప్పటికీ పతంగి ప్రచారం పాతబస్తీ మినహా మిగతా నియోజకవర్గాల్లో అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. -
ఆలె నరేంద్ర - విలక్షణం, వివాదాస్పదం
బుధవారం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో మరణించిన ఆలె నరేంద్ర రాజకీయం విలక్షణమే కాదు. వివాదాస్పదం కూడా. ఆయన తెలంగాణలో బిజెపి ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించారు. కానీ బిజెపి కార్యకర్తలు ఆయన వేరే పార్టీలో చేరినప్పుడు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. కానీ చివరికి కాంగ్రెస్ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆలె నరేంద్ర 1980 వ దశకపు రాజకీయాలకు ప్రతినిధి. అప్పట్లో పాత బస్తీ మత కల్లోలాలతో కుతకుతలాడుతూండేది. ఆ రోజుల్లో ఒక వర్గానికి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహిస్తే, ప్రత్యర్థి వర్గానికి టైగర్ నరేంద్ర నాయకుడిగా నిలిచారు. అటు ఒవైసీకి, ఇటు నరేంద్రకు రాబిన్ హుడ్ ఇమేజీ ఉండేది. పాతబస్తీలోనే ఇల్లు ఉండి, అక్కడే నివసించిన చాలా తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర ఒకరు. కానీ నరేంద్ర ఏ నాడూ పాత బస్తీ నుంచి గెలుపొందలేదు. 1983 ఎన్నికల్లో ఆయన చంద్రాయణ గుట్ట నుంచి పోటీకి దిగారు. ఆయనకి ప్రత్యర్థిగా మజ్లిస్ నేత అమానుల్లా ఖాన్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా హోరాహోరీ జరిగింది. ఒకానొక సందర్భంలో ఇరువురు నేతలు పరస్పరం కాల్పులు కూడా జరుపుకున్నారు. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాన్ని సామూహికంగా నిర్వహించే పద్ధతిని పాపులర్ చేయడంలోనూ ఆయన పాత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా కూడా పనిచేశారు. ఈ సంఘటన తరువాత నరేంద్ర రాజకీయం పాతబస్తీ కేంద్రంగా సాగినా, ఆయన ఎన్నికల్లో గెలిచింది మాత్రం కొత్త బస్తీనుంచే. నరేంద్ర రాజకీయంగా జెయింట్ కిల్లరే. ఆయన టీడీపీ సీనియర్ నేత ఉపేంద్రను ఒక సారి ఓడించారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి తలపండిన కాంగ్రెస్ నేత బాగారెడ్డిని ఓడించారు. బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫు నుంచి చట్ట సభలకు ఎన్నికయ్యారు. కానీ మనసు మాత్రం ఆరెస్సెస్ తో నే ఉండేది. ఇతర పార్టీల్లో ఉంటున్నప్పటికీ ఆయన ఆరెస్సెస్ కార్యక్రమాలకు యూనిఫారం ధరించి మరీ హాజరయ్యేవారు. తిరిగి ఆయన బిజెపిలో చేరేనాటికే ఆరోగ్యం బాగా క్షీణించింది. గత దశబ్దంగా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆయన కుమారుడు జితేందర్ గౌలీపురా కార్పొరేటర్. ఇంకో కుమారుడు ఆలె భాస్కర రాజ్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆయన సోదరుడు శ్యామ్ కుమార్ ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతానికి ప్రధాన ప్రచారక్ గా ఉంటున్నారు. నరేంద్ర మృతితో ఎనభైయవ దశకంలోని పాతబస్తీ రాజకీయాల ప్రధాన పాత్రధారులు సాలార్ సలాహుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్, నరేంద్రలు ఇప్పుడు చరిత్ర పేజీల్లోకి వెళ్లిపోయినట్టయింది. -
ఆరు అసెంబ్లీ స్థానాలకు మజ్లిస్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్ -ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి మీర్ మజాజ్ అలీ, భువనగిరి స్ధానానికి మోతీలాల్ నాయక్, పటాన్చెరు స్థానానికి సయ్యద్ రహమత్, అంబర్‌పేట స్థానానికి నలిగంటి శరత్, సికింద్రాబాద్ స్థానానికి జెమ్స్ సిల్వేస్టర్, జూబ్లీహిల్స్ స్థానానికి నవీన్‌యాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇది వరకు ఎంఐఎం హైదరాబాద్ నగరంలోని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే. -
ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
-
ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
హైదరాబాద్: అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లీమీన్(ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంటిరిగానే పోటి చేస్తున్నాం అని ఓవైసీ తెలిపారు. ఎంఐఎంతో జత కట్టేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంఐఎం ఖరారు చేసింది. ఇద్దరు కొత్త అభ్యర్థులకు ఎంఐఎం చోటు కల్పించింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెడుతామని ఓవైసీ తెలిపారు. హైదరాబాద్ లోకసభ స్థానంలో హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. నగరాభివృద్దే ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు భద్రత కల్పిస్తామని ఓవైసీ భరోసా ఇచ్చారు. 1984 నుంచి ఎంఐఎం హైదరాబాద్ లోకసభ స్థానంలో విజయం సాధిస్తోంది. -
అభివృద్ధే మా ప్రచార ఆయుధం: అసదుద్దీన్
అబిడ్స్, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో ‘మా పని.. మా నినాదం’ అనే అంశంతో ప్రజల ముందుకు వెళ్తామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధే తమ ప్రధాన ఎన్నికల ఆయుధమన్నారు. మంగళవారం దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో తమ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీలంతా తమ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులేదు.. తెలంగాణ, సీమాంధ్రలో కూడా ఎంత మంది అభ్యర్థులను పోటీకి దింపుతున్నదీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అసదుద్దీన్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో 2వ జాబితా విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి హవా కొనసాగిస్తామన్నారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే వెళుతున్నట్టు ఆయన వివరించారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చినా తాము అందుకు సుముఖంగా లేమని తెలిపారు. నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ స్థానాలలో కొత్తవారైనా విజయం సాధిస్తారన్నారు. కార్వాన్ నియోజకవర్గం ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తుందని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు. హైదరాబాద్ నుంచి తాను బరిలో దిగుతున్నట్టు చెప్పారు. -
జహీరాబాద్‌పై ‘మజ్లిస్’ గురి
జహీరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక మున్సిపాలిటీపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొంది చైర్మన్ పదవి విషయంలో కీలకంగా మారాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పట్టణంలో మొత్తం 24 వార్డులకు గా ను 11 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న వార్డులపైనే ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన సమయంలో మజ్లిస్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రతి ఎన్నికల్లోనూ చైర్మన్ పదవిని స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోతూ వచ్చింది. చైర్మన్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తుండడంతో మజ్లిస్‌కు కలిసి రావడం లేదు. గతంలో కౌన్సిల్లో ఆరుగురు కౌన్సిలర్లను గెలుపొందిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. ఈ ఎన్నికల్లో అప్పటి రికార్డులను బద్దలు కొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ తరఫున 3వ, 6, 8, 9, 12, 17, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. పార్టీ ఇన్చార్జి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ లుక్మాన్ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన పోటీ చేసిన వార్డు మహిళలకు రిజర్వు కావడంతో ఈ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఈ పార్టీ అభ్యర్థులు దాదాపుగా అన్ని వా ర్డుల్లోనూ గట్టి పోటీ ఇవ్వనున్నారు. 12వ వార్డు ఎస్టీలకు, 19 వ వార్డు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయా వార్డుల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండడంతో అక్కడ కూడా అభ్యర్థులను పోటీకి దింపారు. మజ్లిస్ రంగ ప్రవేశం కా ంగ్రెస్, టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. మజ్లిస్ బలపడకుండా ఉండేందుకు గాను కాంగ్రెస్ నేతలు తమ వంతు వ్యూహరచన చేస్తున్నారు. అసదుద్దీన్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం.. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత ఆదివారం జహీరాబాద్ మున్సిపాలిటీలో పర్యటించా రు. ఆయన రెండు వార్డుల్లో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించారు. మజ్లిస్ గెలుపుతోనే ముస్లిం మైనార్టీల ప్రగతి ముడిపడి ఉందని ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని ఆయన కోరారు. అధినేత పర్యటనతో పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. ఒవైసీ పర్యటన దరిమిలా ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. -
మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ
మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐల ఆసక్తి ఆచితూచి అడుగేస్తున్న మజ్లిస్ సాక్షి,సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో పొత్తు కోసం మూడు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్‌తోపాటు టీఆర్ఎస్, సీపీఐలు మజ్లిస్‌తో ఎన్నికల పొత్తు లేదా అవగాహన కుదుర్చుకునేం దుకు తీవ్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ కూడా సార్వత్రిక ఎన్నికల పొత్తులపై కనీసం పెదవివిప్పకుండా మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. గ్రేటర్లో కాంగ్రెస్ గాలం : నగరంలో గట్టి పట్టుగల మజ్లిస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర యత్నాలు చేస్తోంది. గత రెండుసార్లు మాదిరి ఈసారి కూడా మజ్లిస్‌తో కలిసి అవగాహనతో ముందుకెళ్తే కొన్నిస్థానాల్లో సునాయసంగా బయటపడొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఏడాదిన్నర క్రితం చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్‌తో మజ్లిస్ తెగదెంపులు చేసుకున్నప్పటికీ తిరిగి మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా దగ్గరైంది. మరోవైపు పొత్తు షరతులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదించకుండా మజ్లిస్ పార్టీకే మిగిలిన పదవీకాలాన్ని వదిలివేయడం వెనుక కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల వ్యూహం బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరానికి చెందిన ఇద్దరు తాజా మాజీమంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లు మజ్లిస్‌తో పొత్తు కోసం ఆసక్తి కనబర్చుతున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ముస్లింఓటు బ్యాంకు కలిసొచ్చి అధికస్థానాల కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. గులాబీ గురి : తెలంగాణ ఏర్పాటుతో జోష్ మీదున్న టీఆర్ఎస్ కూడా మజ్లిస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టంచేసిన కేసీఆర్ మజ్లిస్‌తో కలిసి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్‌తో దోస్తీ చేస్తే తెలంగాణవ్యాప్తంగా ముస్లింఓట్లతో లబ్ధిపొందవచ్చని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. సీపీఐ ఆసక్తి : బీజేపీ, దాని మిత్రబృందాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసొచ్చే శక్తులతో సీపీఐ పొత్తులకు సన్నద్ధమవుతోంది. ముస్లిం వర్గంలో గట్టి పట్టున్న మజ్లిస్‌తో కలిసినడిస్తే కాషాయ మిత్రబృందాన్ని అడ్డుకోవడంతోపాటు పోటీచేసే పరిమిత స్థానాల్లో సైతం సునాయసంగా బయటపడివచ్చని ఆపార్టీ భావిస్తోంది. రెండంకెల వ్యూహంలో మజ్లిస్ : పాతనగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ..ఈసారి నెలకొన్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకొని చట్టసభల్లో రెండెంకల సీట్లు దక్కించుకునే వ్యూహరచనలో పడింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐలు పొత్తులపై ఆసక్తి కనబర్చడం మజ్లిస్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా కనీసం 25 సీట్లకు తగ్గకుండా విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. -
మజ్లీస్ తరఫున విద్యావంతుల పోటీ
జహీరాబాద్, న్యూస్‌లైన్: మజ్లిస్ పార్టీ తరఫున ఉన్నత విద్యావంతులు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో ఒకరు ఎస్టీ, ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఆయా వార్డులు రిజర్వు కావడంతో ఈ మేరకు పార్టీ ఇన్చార్జి ఎం.డి.లుక్మాన్ ఉన్నత విద్యావంతులను ఎంపిక చేసి పోటీలో నిలిపారు. 12వ వార్డు నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.కృష్ణ రాథోడ్ పోటీ చేస్తున్నారు. బీఎస్సీ చదివిన ఇతను బీఎడ్, డీఎడ్లను కూడా పూర్తి చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక 19వ వార్డు తరఫున ఎంబీఏ పూర్తి చేసిన నరేష్కుమార్ పోటీ చేస్తున్నారు. ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు నరేష్కుమార్ తెలిపారు. అన్ని మతాలు, అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నట్లు ఆయా వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కృష్ణ, నరేష్‌కుమార్‌లు పేర్కొన్నారు. -
పార్టీ ఏం చెబితే అదే చేస్తా!
మీరు నాంపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటున్నారు. ఇంకొన్ని పేర్లూ వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?.. ఎమ్మెల్యే.. ఎంపీ.. దేన్ని ఎంచుకుంటారు?’.. శుక్రవారం మేయర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాజిద్ హుస్సేన్‌ను చుట్టుముట్టిన ప్రశ్నలివి. మజ్లిస్ పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని, అంతకుమించి వ్యక్తిగత నిర్ణయమంటూ ఉండదని ఆయన బదులిచ్చారు. ప్రథమ పౌరుడనేది హోదా అయినప్పటికీ.. నగరానికి ప్రథమ సేవకుడిగానే పనిచేశానన్నారు. మేయర్‌గా పనిచేసిన 26 నెలల కాలం సంతృప్తినిచ్చిందని, అన్నివర్గాల సహకారంతో బాధ్యతలు నిర్వహించానన్నారు. ఇళ్ల వద్దకే బర్త్సర్టిఫికెట్లు, వివిధ విభాగాల్లో ఆన్లైన్ సేవలు, పేదలకు సబ్సిడీ పై భోజనం, బస్తీల్లో నీటిశుద్ధి ప్లాంట్లు వంటి పనులు బాగా సంతృప్తినిచ్చాయన్నారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా, లోటు బడ్జెట్లో ఉన్న జీహెచ్ఎంసీ ఖజానాను పరిపుష్టం చేశామన్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా ఉద్యోగాల భర్తీ, శివార్లలోని 36 గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం కాకుండా కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానించామని గుర్తు చేశారు. మెట్రోపాలిటన్ సిటీ కి తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందన్నారు. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు, తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశం మేరకు తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కొత్తగా రాబోయే కాంగ్రెస్ పార్టీ మేయర్‌కు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్, పార్టీ ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. 22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం తన రాజీనామాకు ఆమోదం తెలిపేందుకు వీలుగా ఈనెల 22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మాజిద్ హుస్సేన్ తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు మేయర్ రాజీనామాను సర్వసభ్య సమావేశం ఆమోదించాలి. ఆ సమావేశాన్ని మేయరే ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ఆశావహుల్లో ఆశలు.. మాజిద్ హుస్సేన్ రాజీనామాతో.. మేయర్ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఆశలు చిగురించాయి. కొత్తగా మేయర్‌గా ఎన్నికయ్యే వారికి ఆరేడు నెలల అవకాశమే ఉన్నప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా, ఓవైపు అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే మేయర్ పదవికి అవకాశం రానుండటంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ టిక్కెట్ అడగాలా? లేక మేయర్ పదవి కోరుకోవాలా? అనే ఊగిసలాటలో ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. మేయర్ రాజీనామాతో డిప్యూటీ మేయర్‌గా ఉన్న రాజ్‌కుమార్ (కాంగ్రెస్) సైతం రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన రాజీనామాను మేయరే ఆమోదించాల్సి ఉన్నందున.. 22లోగా ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ రాజీనామా చేయగలరనే అభిప్రాయాలున్నాయి. ‘‘మాజిద్ హుస్సేన్ ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ డివిజన్ కార్పొరేటర్. రేపు ఎమ్మెల్యేగా నిలబడాలా.. ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏం చెబితే అది చేస్తా. ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ బాధ్యత చూడటమే నా పని’’ - శుక్రవారం సాయంత్రం మేయర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మాజిద్ హుస్సేన్