మజ్లిస్ కార్పొరేటర్లలో కొత్త ముఖాలే ఎక్కువ!
44 మందిలో 35 మంది కొత్తవారే...
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో రెండో అతి పెద్దపార్టీగా అవతరించిన మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లలో అత్యధిక శాతం కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కాగా అందులో 35 మంది కొత్త వారు ఉన్నారు. కొత్త వారిలో 19 మంది మహిళలు కాగా, 16 మంది పురుషులు ఉన్నారు. తొమ్మిది మంది పాత కార్పొరేటర్లు తిరిగి ఎన్నికయ్యారు. మజ్లిస్ పార్టీ మొత్తం 150 డివిజన్లకు గాను 60 డివిజన్లల్లో మాత్రమే పోటీ చేసింది. డివిజన్ల డీలిమిటేషన్, రిజర్వేషన్ తారుమారుతో కేవలం తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మాత్రమే తిరిగి అవకాశం కల్పించి మిగితా 51 స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపింది. సిట్టింగ్‌లందరూ తిరిగి ఎన్నిక కాగా, కొత్తవారిలో 16 మందికి ఓటమి తప్పలేదు. పదిమంది ముస్లిమేతర అభ్యర్థులు బరిలో దిగగా నలుగురు మాత్రమే విజయం సాధిం చారు. పాతబస్తీలో పూరానాపూల్ డివిజన్ మజ్లిస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పక్షా న బరిలో దిగడంతో అక్కడ ముస్లిమేతర అభ్యర్థి బరిలో దంపి సత్తా చాటింది. పోలిం గ్ రోజు జరిగిన ఘటనతో కౌటింగ్ రోజురీ పోలింగ్ నిర్వహిం చినా సునాయాసంగా గట్టెక్కింది. ఈ సారి జీహెచ్‌ఎంసీలో కొత్తవారే అత్యధికంగా ఎన్నిక కావడంతో వారికి అనుభవజ్ఞులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారికి జరిగిన అభినందన సమావేశంలో సైతం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సలహాలు, సూచనలు అందించారు.
రేపు జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక
జీహెచ్‌ఎంసీ మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపిక మంగళవారం జరుగనుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. 11న మేయర్ ఎన్నిక జరుగనుండటంతో దాని కంటే ముందే పార్టీ పక్ష నేత ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. పాతవారికే పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.