పట్టు నిలుపుకున్న మజ్లిస్
బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట స్వీప్
యాకుత్‌పురా, చార్మినార్‌లో నాలుగేసి డివిజన్లు కైవసం
చార్మినార్: పాతబస్తీలో మజ్లీస్ హవా కొనసాగింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 25 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో జయుకేతనం ఎగురవేసింది . సిట్టింగ్ సీట్లన్నీ తిరిగి కైవసం చేసుకుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్‌పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్ ఖాతాలోకి చేరాయి.
చార్మినార్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్‌లలో మజ్లీస్ అభ్యర్థులు విజయం సాధించగా...ఘాన్సీబజార్ డివిజన్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్ డివిజన్లను మజ్లీస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్‌వే. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా... డబీర్‌ఫురా, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ తదితర ఐదు డివిజన్లను మజ్లీస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా... మిలిగిన గౌలిపురాలో బీజేపీ, ఐ.ఎస్.సదన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.