GHMC Election
-
అందరినీ కూడగట్టి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి టీఆర్ఎస్ చొరవ చూపుతుందని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ రెండోవారంలో సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదు. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మతవిద్వేషాలను రెచ్చగొట్టి... ప్రజలను విభజిస్తూ, భావోద్వేగాలతో రాజకీయ లబ్దిపొందుతోంది. దేశానికి నష్టం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ చతికిలపడింది. బడేభాయ్ వెంటే చోటేభాయ్ అన్నట్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి సరైన మార్గం చూపడంలో విఫలమయ్యాయి. దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. బీజేపీ విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది’అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు. ‘ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీం విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడాను. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండోవారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంలో దిట్ట మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో తప్పుడు విధానాలు, ప్రచారాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందన్నారు. కాంగ్రెస్ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతరపక్షాలపై పడిందన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతూ సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చింది. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతున్నది. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంగారుబాతులను అమ్మేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట మోదీ సర్కారు వాటిని ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోంది. వాజ్‌పేయి, మన్మోహన్ హయాంలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తూ మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది’అని కేసీఆర్ విమర్శించారు. ‘లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవ, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేస్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’అని కేసీఆర్ ప్రశ్నించారు. బంగారుబాతు లాంటి ఎల్ఐసీతో పాటు రైల్వేలు, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ లాంటి నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేట్ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందిని తెలిపారు. ‘1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల భారతదేశం వెనక్కిపోతున్నది’అని విమర్శించారు. -
'మొన్న హరీష్.. ఇప్పుడు కేటీఆర్‌ను ఓడిస్తాం'
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని 23 మంది పార్టీ ముఖ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విస్తృత ప్రచారం చేయాలని, సోమవారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఇంకా మీడియా, పబ్లిసిటీ, కార్యక్రమాల కోఆర్డినేషన్ తదితర పది రకాల కమిటీలను ఏర్పాటుచేశారు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు: లక్ష్మణ్ గ్రేటర్ ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేవని, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రజలను పట్టించుకోవట్లేదని, గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 450 ఇళ్లు కట్టించారన్నారు. అంతకంటే ఎక్కువగా నిర్మిస్తే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అప్పుడు హరీశ్.. ఇప్పుడు కేటీఆర్’ బీజేపీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సోషల్ మీడియా విభాగాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ దుబ్బాక లో హరీశ్‌రావును ఎదుర్కొన్నామని, ఇపుడు కేటీఆర్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇదే.. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కన్వీనర్‌గా జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్, జాయింట్ కన్వీనర్లుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డిని నియమించారు. సభ్యులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పి.ము రళీధర్‌రావు, రాజాసింగ్, ఎన్.రాంచంద ర్రావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మో త్కుపల్లి నర్సింహులు, డి.రవీంద్రనాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.రాములు, రాపో లు ఆనందభాస్కర్, ఎం.రఘునందన్‌రావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శృతిని నియమించారు. -
సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ భారీ విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఈ నెల 12న రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యూహం ఖరారు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయ బాధ్యతలను కేటీఆర్ నిర్వర్తిస్తారు. నోటిఫికేషన్‌కు, ఎన్నికల తేదీకి నడుమ ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా వేగంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే చాన్స్ ఉండటంతో గ్రేటర్ ఎన్నికల్లో మెరుపు వేగంతో కదలాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్‌కు గులాబీ దండు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు పార్టీపరంగా ఇన్చార్జిల నియామకంపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇన్చార్జిల జాబితాపై స్పష్టత రాగా... ఒకటి రెండు రోజుల్లో ఏయే డివిజన్లో ఎవరు పనిచేస్తారనే అంశంపై స్పష్టత రానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసే సత్తా ఉన్న ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్ ఛైర్మన్ల్లకు డివిజన్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రులు కూడా కేవలం ఒక్కో డివిజన్‌కు మాత్రమే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వంటి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ రాష్ట్ర యంత్రాంగమంతా జీహెచ్ఎంసీలో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే మూడు విడతలుగా సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మూడు విడతలుగా పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరు... తదితరాలపై టీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గతంలోనే నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సర్వేలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా ఇప్పటికే పార్టీ పరిస్థితిపై డివిజన్ల వారీగా పార్టీ అధినేత ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పనితీరు సరిగా లేని కార్పొరేటర్లను పక్కన పెట్టి అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. విపక్షంలో బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వారిని పార్టీలోకి రప్పించడంపైనా దృష్టి పెట్టాలని భావిస్తోంది. సుమారు 15 మంది పార్టీ కార్పొరేటర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గతంలోనే కేటీఆర్ వెల్లడించిన నేపథ్యంలో చాలా చోట్ల ఔత్సాహికుల నుంచి టికెట్ల కోసం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్చార్జిల నుంచి మరోమారు నివేదికలు తీసుకుని, షెడ్యూలు వెలువడిన తర్వాత సీఎం, కేటీఆర్ వారితో మరోమారు సమావేశమవుతారు. -
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
-
గ్రేటర్లో బ్యాలెట్టే
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం, వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఇతరత్రా విషయాలపై సవివరంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు, ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయి రిజర్వ్ సింబల్స్ పొందిన 39 రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది. దీనిపై స్పందించిన 8 గుర్తింపు పొందిన పార్టీల్లో ఐదు బ్యాలెట్ బాక్స్ వైపే మొగ్గుచూపగా ఒక పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికలకు మొగ్గుచూపింది. అలాగే 18 రిజిస్టర్డ్ పార్టీల్లో 11 బ్యాలెట్ బాక్స్‌ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరగా, రెండు పార్టీలు ఈవీఎంల వైపు మొగ్గుచూపాయని తెలి పింది. మిగతా 7 పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని ఎస్ఈసీ పేర్కొంది. బ్యాలెట్‌తో పోల్చితే ఈవీఎంలతో ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అందుబాటులో లేని వీవీప్యాట్లు... ఈవీఎంలకు వీవీప్యాట్ మెషీన్లను అనుసంధానించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తమ వద్ద వీవీప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో వాటి కోసం హైదరాబాద్ ఈసీఐఎల్, బెంగళూరు బీఈఎల్ల నుంచి కొటేషన్లు కోరామని ఎస్ఈసీ వివరించింది. అయితే దీనిపై వీవీప్యాట్ల తయారీకి ఢిల్లీలోని ఈసీ అనుమతి కోరుతూ ఆయా సంస్థలు లేఖలు రాశాయని, ఈసీ నుంచి ఇంకా జవాబు రావాల్సి ఉందని తెలిపింది. వీవీప్యాట్లు అందుబాటులో లేని కారణంగానే 2019లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, 2020 మొదట్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌లతో నిర్వహించిన విషయాన్ని ఎస్ఈసీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈవీఎం, వీవీప్యాట్లతో హైరిస్క్ వల్లే.. ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగానికి ముందు వివిధ ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉందని, అన్ని దశల్లోనూ తయారీదారుల పక్షాన పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ప్రమేయం ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. అంతేకాకుండా మూసి ఉంచిన గదుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను శుభ్రం చేయడం, కట్టి ఉంచిన మిషన్లను తెరవడం, మళ్లీ ప్యాక్ చేయడం వంటి పనుల్లో భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తుందని తెలియజేసింది. ఈ విధంగా ‘హైరిస్క్ కమ్యూనిటీ’గా ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తికి అధిక అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. బ్యాలెట్ బాక్స్‌లు, ఈవీఎంలకు సంబంధించి... 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంట్ సవరించాక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి వీలు ఏర్పడింది. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. 1995 నుంచి 2019 వరకు జరిగిన అన్ని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ బాక్స్‌లతోనే జరిగాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు 1995, 2000లో బ్యాలెట్ బాక్స్‌లతో... 2005, 2014లలో జరిగిన ఎన్నికలను ఎస్ఈసీ ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) నిర్వహించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మొదటి సాధారణ ఎన్నికలను 2002లో బ్యాలెట్ బాక్స్‌లతో, 2009, 2016 ఎన్నికలు ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) జరిగాయి. -
బ్యాలెట్ విధానంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు
-
విష వలయంగా రాజధాని: కేసీఆర్
♦ సరిదిద్దేందుకు నడుం బిగించండి ♦ ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి ♦ 11 నుంచి కార్పొరేటర్లకు శిక్షణ ♦ జీహెచ్ఎంసీ, పురపాలక శాఖపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ నగరం ఓ విష వలయంగా మారింది. దీన్నించి నగర ప్రజలను బయట పడేయాలి. నగరం ఎట్లుండేది, ఎట్లుండాలనే అంశాలను బేరీజు వేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘‘కాంట్రాక్టర్లు ముఠాలుగా ఏర్పడి చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. నగరంలో కాపిటల్ అసెట్స్ పెరగడానికి, రోడ్లు బాగుపడడానికి జీహెచ్ఎంసీ నిధులు కేటాయించాలి. చెత్త, శిథిలాల తొలగింపు, నిధుల వినియోగం, పచ్చదనం, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ తదితరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగాలి. నగరంతో పాటు అందులో విలీనమైన మున్సిపాలిటీల అభివద్ధికి ప్రణాళికలు సిద్ధం కావాలి. మంజూరైన మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, బస్ బేస్, మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, శ్మశానవాటికల నిర్మాణ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చే ప్రణాళికను అమలు చేయండి. ప్రతి ఐదు వేల మందికి ఒక ప్రజా కమిటీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీలో భాగంగానే కంటోన్మెంట్‌నూ అభివద్ధి చేయండి’’ అని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు పురపాలక శాఖపై కేసీఆర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షనిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి, పురపాలక మంత్రి కె.తారక రామారావు, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓ సునామీలా ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని, వారందరి నమ్మకాన్ని నిలబెట్టేల పని చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కరెంటు ఇస్తున్నామని, ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలకు విడమరిచి వారి లో విశ్వాసం నింపాలని చెప్పారు. ‘‘జీహెచ్ఎంసీలో ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇది ఫలించాలంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పనిచేయాలి. అలాగని ప్రతిజ్ఞ చేయాలి. టీం వర్క్ చేయాలి. బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లో జరగాల్సిన, జరుగుతున్న పనులను పర్యవేక్షించాలి. అందరం కలిస్తే ఏదైనా చేయవచ్చు’’ అని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లకు శిక్షణ భావి అవసరాలకు తగ్గట్లు హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఉం దని సీఎం అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ కార్పొరేటర్లకు, 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు ‘ఆడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’(ఆస్కీ) ఆధ్వర్యంలో ప్రగతి రిసార్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శిక్షణ తరగతుల్లో కార్పొరేటర్లను ఏ విధంగా కార్యోన్ముఖులు చేయాలనే అంశంపై ఎజెండా రూపొందించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీటిలో పాల్గొనాలన్నారు. ‘‘నాగపూర్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయండి. ఆయా కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లను శిక్షణ తరగతులకు పిలిచి వారి అనుభవాలు పంచుకోండి’’ అని సూచించారు. -
తెలంగాణలో బీజేపీది ఇక ఒంటరిపోరే!
♦ టీడీపీ పొత్తుతో ఎదగలేమన్న కమలనాథులు ♦ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామన్న దత్తాత్రేయ ♦ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సగం మంది డుమ్మా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవసానదశకు చేరుకున్న తెలుగుదేశంపార్టీతో పొత్తు కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీకి నూకలు చెల్లినట్టేనని కమలనాథులు అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని ఎక్కువ ఊహించుకొని బోల్తాపడ్డామని, సైద్ధాంతికంగా బీజేపీకి అండగా నిలిచేవారు కూడా తెలుగుదేశం కారణంగా దూరమవుతున్నారని ఆ పార్టీ నాయకులు కుండ బద్దలు కొట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నగర శివార్లలోని కొంపల్లిలో జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నేతలు హాజరయినప్పటికీ, సగానికిపైగా కార్యవర్గం డుమ్మా కొట్టింది. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకుంటేనే బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటే 2019 ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని పలువురు పేర్కొన్నారు. ‘దేశంలో మోదీ ప్రభంజనం ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దిగ జారడానికి టీడీపీతో పొత్తే కారణం’ అని పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశానికి ముందు, అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విశ్వాసాన్ని చూరగొంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని సంపాదించినట్లు అవుతుందని, ఏకపక్ష ధోరణిలో వెళితే మాత్రం అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కరువు వైఫల్యాలు, అనేక అంశాలపై నిలదీస్తూనే ఉంటామని, రాష్ట్రంలో పైకి ఆదర్శప్రాయ వాతావరణం కనిపిస్తున్నా ప్రత్యక్షంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడతామన్నారు. సగానికి పైగా డుమ్మా! బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పలువురు ముఖ్యమైన నాయకులతోపాటు సగం మంది కార్యవర్గ సభ్యులు డుమ్మా కొట్టారు. పార్టీ అంతర్గతపోరులో భాగంగా కొంతకాలంగా అంటీముట్టనట్లుగా ఉం టున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు పార్టీ ఆఫీసు బేరర్లు రామకృష్ణారెడ్డి, వెంకటరమణి, కుమార్ వంటి నాయకులు గైర్హాజరయ్యారు. సుమారు 330 మందితో గల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి 153 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ప్రజాక్షేత్రంలో పోరుబాటే! తెలంగాణలో బలమైనశక్తిగా మారిన టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే పోరుబాట ఒక్కటే శరణ్యమని బీజేపీ నేతలు గుర్తించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి 24న జరిగే పంచాయతీ దివస్ వరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సామాజిక సామరస్యత పేరుతో నాలుగు రోజులపాటు అంబేడ్కర్ విగ్రహాలను శుభ్రపరచడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రామ రైతుసభల పేరుతో 17 నుంచి 20వ తేదీ వరకు పర్యటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
విశ్వ రూపిణి
విద్య, వైద్య, ఐటీ రంగాల్లో స్త్రీలే టాప్ నేడు మహిళా దినోత్సవం ‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అనే మాట మహిళల విషయంలో పాతబడి పోయింది. అవకాశాల్లోనూ అధికులమని నిరూపిస్తున్నారు. అవని నుంచి అంతరిక్షం వరకూ ప్రతిచోటా తమ ముద్ర వేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల పగ్గాలు చేపట్టి.. వ్యాపార సామ్రాజ్యంలో మహరాణులుగా ఎద గడమే కాదు... పాలనలో సైతం పురుషులకు తీసిపోమని నిరూపిస్తున్నారు. కార్పొరేటర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... భాగ్యనగరిని ‘విశ్వ’నగరిగా తీర్చిదిద్దే క్రతువులో భాగస్వాములయ్యేందుకు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సిటీబ్యూరో: ‘విశ్వ’మంత ఆశయంతో... వినూత్న వేగంతో... మహా నగరి మహిళలు దూసుకుపోతున్నారు. అవాంతరాలను... అడ్డంకులను... ఎదుగుదలకు మెట్లుగా మలచుకొని మునుముందుకు సాగుతున్నారు. రాజకీయాలు... సేవ.. క్రీడలు... ఉద్యోగ... పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాల స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలనే తీసుకుంటే ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 79 మంది (మొత్తం 150 స్థానాలు) కార్పొరేటర్లుగా ఎన్నికై... స్థానిక పరిపాలనలో కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో ఉన్న కోటాను 33 నుంచి 50 శాతానికి పెంచాక... నిర్వహించిన ఎన్నికల్లో తమకు కేటాయించిన 75 స్థానాలతో పాటు అదనంగా బంజారాహిల్స్, వెంకటాపురం, ఫలక్‌నూమా, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలో మహిళలే ఎన్నికయ్యారు.ఈ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎంపీలు... ఎమ్మెల్యేలు నవ చరిత్రను లిఖించే రోజులు సమీప భవిష్యత్తులోనే సాకారం కాబోతున్నాయనడంలో సందేహం లేదు. సేవల్లో టాప్ నగరంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో ఆందోళనకర గణాంకాలు (954-1000) ఉన్నా... విద్య.. ఐటీ.. వైద్య రంగాల్లోసేవలందిస్తున్న మహిళల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. వైద్య రంగంలో మహిళల సంఖ్య 60 శాతం దాటగా... ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, విద్యా బోధనలోనగర మహిళలు 50 శాతాన్ని మించిపోయారు. హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఐటీ సర్వీసుల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య మగాళ్లను దాటే స్థాయికి చేరిందని ఇటీవల ఒక ప్రముఖ సంస్థ అంచనా వేసింది. ఇవి కాకుండా బీపీఓ, ఆతిథ్య, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లోనూ మహిళల శాతం గణనీయంగా పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో అంకితభావం... సమయ పాలన... క్రమశిక్షణ అధికంగా ఉంటోందని... ఈ నేపథ్యంలోనే వివిధ యాజమాన్యాలు మహిళా ఉద్యోగినుల ఎంపికకే ప్రాధాన్యమిస్తున్నాయని హెచ్ఆర్ కన్సల్టెంట్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడంతో వారి సంఖ్య పోలీస్ విభాగంలోనూ భారీగా పెరగనుంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఐదు శాతం లోపే. ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో నగర మహిళలు ఆ అవకాశాన్ని అందుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. చదువులోనూ పైచేయి గ్రేటర్‌లోనూ... జంట జిల్లాల పరిధిలోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే చదువులో పైచేయి సాధిస్తుండడం గమనార్హం. హైదరాబాద్‌లో గత ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో అబ్బాయిలు కేవలం 56 శాతం పాసైతే.... అమ్మాయిలు 73 శాతం.... రంగారెడ్డి జిల్లాలో అబ్బాయిలు 71 శాతం... అమ్మాయిలు 78.89 శాతం ఉత్తీర్ణులు కావడం... వారి ప్రతిభను చాటి చెబుతోంది. టెన్త్‌లోనూ అమ్మాయిల ఉత్తీర్ణత అబ్బాయిల కంటే పది శాతం అధికంగా నమోదు కావడం విశేషం. ‘ఎక్స్పో’జర్ అతివలకే ఆమెదే ఆధిపత్యం లైఫ్‌స్టైల్‌ప్రతినిధి: నగర మహిళలు అడుగు పెట్టని రంగం దాదాపు లేదనే చెప్పాలి. కొన్ని రంగాల్లో మగవారిని తోసిరాజని మరీ దూసుకుపోతున్నారు. అదే స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. నగరంలో మహిళల ఆధిక్యానికి అద్దం పట్టే రంగాలు, అంశాల్లో కొన్ని... నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళల ఆధిపత్యం సుస్పష్టం. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్న రాఖీ కంకారియా ఈ రంగంలో రాణించాలనుకునే వారి కోసం అకాడమీని నెలకొల్పారు. ఈవెంట్ మేనేజర్లుగా రాణిస్తున్న మగవారు ఉన్నప్పటికీ కొన్ని ఈవెంట్లు పూర్తిగా మహిళాధిక్యాన్ని కనబరుస్తున్నాయి. స్టార్ హోటళ్లు, క్లబ్బులలో విభిన్న రకాల ఉత్పత్తులు విక్రయించే ఎక్స్‌పోల నిర్వహణలో మహిళలదే పైచేయిగా చెప్పాలి. వహ్వా... పీఆర్వో... మీడియాకు, ప్రజలకు మధ్య వారథిగా.. చెరగని చిరునవ్వుతో... ఆకట్టుకునే సంభాషణా చాతుర్యంతో విధులు నిర్వర్తించే పీఆర్వో విభాగంలో మహిళల హవా నడుస్తోంది. నగరంలో పదుల సంఖ్యలో ఉన్న పీఆర్ ఏజెన్సీలలో అమ్మాయిలే అధిక సంఖ్యలో కనిపిస్తారు. మీడియా సంబంధాలు నెరపేందుకు సంస్థాగతంగానూ, వ్యక్తిగత పీఆర్వోలుగానూ మహిళలనే నియమించుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఫ్యాషన్‌లో ఓషన్‌లా... సిటీలో ఫ్యాషన్ అనుబంధ రంగాలు పుంజుకోవడంతో పాటు వాటిలో మహిళల ఆధిపత్యమూ పెరుగుతోంది. స్త్రీ, పురుష డిజైనర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన డిజైనర్లలో వర్ష, శిల్పారెడ్డి, అనుశ్రీరెడ్డి తదితర మహిళలే ముందున్నారు. సిటీలో పేరొందిన డిజైనింగ్ స్కూల్స్ అన్నీ దాదాపు మహిళలు నిర్వహిస్తున్నవే. గాలిలో తేలిపోతూ... గాలిలో ఎగిరే ఎయిర్ హోస్టెస్ జాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన నగరానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో... ఇక్కడి అమ్మాయిల్లోనూ అనేక మందిలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంపై ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగానే వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జే.. జేజే ‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి ‘ఇది చాలా హాట్ గురూ’ వంటి చమత్కారాలతో శ్రోతలను అలరించే రేడియో జాకీల హవా మొదలై దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ రంగంలో మగవాళ్లు ఉన్నప్పటికీ సిటీలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఆర్జేల్లో మహిళలేఎక్కువని చెప్పాలి. భార్గవి, ప్రతీక వంటి కొందరు సినిమా స్టార్లతో సమానంగా ఆదరణ పొందుతున్నారు. ప్రమోటర్‌గా సూపర్ వివిధ ఈవెంట్లలో, పెద్ద పెద్ద సమావేశాల్లో అతిథులను పలుకరిస్తూ, వారికి అవసరమైన సరంజామాను అందిస్తూ చిరునవ్వుతో సందడి చేస్తారు ప్రమోటర్స్. నగరంలో వేల సంఖ్యలో ప్రమోటర్స్ ఉన్నారు. ఈ రంగంలోనూ అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువని ఈవెంట్ మేనేజర్ రాజ్‌కిషోర్ చెప్పారు. -
రాజీనామాలుండవు... తొలగింపులే...!
జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన తమ పార్టీ నాయకత్వం తీరే చిత్రవిచిత్రంగా ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ నాయకులే గొణుక్కుంటున్నారట. రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ జీహేచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన తీరు పట్ల జాతీయనాయకులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ర్టంగా తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఇదేమి గతి అంటూ కూడా రాష్ట్రనాయకుల తీరుపై ఒకింత అసహనం కూడా వెలిబుచ్చుతున్నారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ను కోరారట. అపాయింట్మెంట్ అయితే దొరకలేదు కాని అసలు ఎందుకు కలవాలని అనుకుంటున్నారో చెప్పాలని గట్టిగా అడిగారట. ఆ విషయాన్ని సోనియాగాంధీకే చెబుతానని సదరు నేత చెప్పినా అదేం కుదరదు కారణం చెప్పాల్సిందేనంటూ ఢిల్లీనేతలు రెట్టించారట. జీహేచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేందుకే అపాయింట్మెంట్ కోరానని ఆ ముఖ్యనేత అసలు విషయం బయటపెట్టారట. దీనికి ప్రతిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి వచ్చినపుడు తామే పిలిపిస్తామని అధిష్టానం దూతలు ఆ నేతకు చెప్పి పంపించేశారట. కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేయడమంటూ ఉండదని, తొలగింపులే ఉంటాయనేది దీనివెనక అసలు రహస్యమని రాష్ర్టపార్టీ నేతలు చెవులు కొరుక్కోవడం కొసమెరుపు. -
అక్రమ పద్ధతులతో టీఆర్ఎస్ రాజకీయం: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ పద్ధతుల ద్వారా రాజకీయాలు చేయడమే టీఆర్ఎస్ పార్టీకి తెలిసిన విద్య అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అధికారంలో రావడానికి సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్న టీఆర్ఎస్, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా ఈవీఎంలనే ట్యాంపరింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రలోభాలకు దిగి బెదిరించడం, దౌర్జన్యం చేయడం ద్వారా పైచేయి సాధించిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా నమోదు కావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. -
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీ నామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సోమవారం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం బాధాకరమని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో మల్లేశం కోరారు. ఇదిలా ఉండగా బల్దియా ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. పార్టీ పరాజయం నేపథ్యంలో ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పలువురు పార్టీ నేతలు డీసీసీ అధ్యకుడు క్యామపై మాటల దాడికి దిగడంతో ఆయన మనస్తాపం చెంది అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. అలాగే పార్టీ అధిష్టానం నుంచి రాజీనామా చేయాలని ఒత్తిడి రావడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దానం రాజీనామా ఆమోదం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ చేసిన రాజీనామా ఆమోదానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దానం రాజీనామాను ఆమోదించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నుంచి సూచనలు అందినట్లుగా తెలిసింది. దీంతో నేడో, రేపో దానం రాజీనామాకు ఆమోదముద్ర వేయనున్నట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. -
'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం'
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గెలుపు రోల్డు గోల్డ్ బంగారం తీరుగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై జనం చాలా ఆశలు పెట్టుకున్నారని, లక్ష ఇళ్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు. ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే నమ్మకం తనకు లేదన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీకి, బడ్జెట్ లో నిధులు కేటాయింపుకు పొంతన లేదని గుర్తు చేశారు. నాడు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమవు తుందని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నాయకులందరూ సమిష్టి బాధ్యత వహించాలని అన్నారు. ఈవిఎంల ట్యాంపరింగ్ పై పీసీసీ ఐటీ సెల్ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు నోటా బటన్, ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎన్నికల అవకతవకలపై ఈసీ దృష్టికి తీసుకెళ్తాం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. గాంధీభవన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత వీవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లను అమర్చారు’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రిటింగ్ మిషన్లను ఎందుకు అమర్చలేదని, అలాగే ఈవీఎంలలో నోటా బటన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి, సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2010 ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలంటూ టీఆర్ఎస్ నేత ఎస్.నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పట్లో ఈసీ సమర్థించకపోతే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చేత నామినేషన్ దాఖలు చేయించారని శ్రావణ్ చెప్పారు. జాంబాగ్‌లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్‌బూత్ పరిధిలో 125 ఓట్లు ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయన్నారు. 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే... లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్కు వంద సీట్లు, తమ మిత్రపక్షం ఎంఐఎంకు 45 సీట్లు వస్తాయని కచ్చితంగా ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ సోమవారం గాంధీభవన్‌కు రావాలని కోరారు. డివిజన్ వారీగా పోలైన ఓట్లపై సమీక్ష జరిపి తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శ్రావణ్ చెప్పారు. -
ఏ పూలతో నిను కొలిచినా...
కొండంత దేవునికి కొండంత పత్రితో పూజ చేయలేకపోయినా, పరిపూర్ణ మనసుతో మదిలో తలచుకుంటే చాలునని నాయకులందరూ చదువుకున్నవారే. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు, నాయకులకు సహజంగా ఓటరే దేవుడు. ఓటరు దేవుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పద్ధతిని అనుసరించడమూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆనవాయితీగా వస్తోంది. గ్రామాల్లో అయితే ఒక ఓటరుపై ఒక అంచనా ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు మనసును గెలుచుకోవడానికి మార్గం తెలియక చాలామంది అభ్యర్థులు అవస్థలు పడగా, కొందరైతే ఎదురుదెబ్బలు తిన్నారట. శివారుప్రాంతంలోని ఒక డివిజనులో రిటైర్డు మిలిటరీ ఆఫీసరును మచ్చిక చేసుకోవడానికి పోటీచేసిన అభ్యర్థి ఒకరు సాయంత్రం పూట వస్తానని టైం తీసుకుని కలిశారట. ఎన్నికల్లో మద్దతుకోసం వట్టి చేతులతో పోవడం ఎట్లా అని ఒక మోస్తరు మందుబాటిల్ తీసుకుని వెళ్లాడట. పది నిమిషాలు మంచిచెడూ మాట్లాడిన తర్వాత ఈ అభ్యర్థి తీసుకుపోయిన బాటిల్‌ను టేబుల్ మీద పెట్టాడట. ఆ బాటిల్‌ను కింద నుంచి మీదకు చూసిన ఆ మిలిటరీ ఆఫీసరు తన పనిమనిషిని పిలిచి ఇంటిలో ఉన్న బాటిల్‌ను తెమ్మన్నాడట. మిలిటరీ ఆఫీసరు తెచ్చిన చాలా ఖరీదైన మందుసీసాను పనిమనిషితో మూత తెరిపించి, పోటీచేస్తున్న అభ్యర్థి తెచ్చిన బాటిల్‌ను తాగుపో అని పనిమనిషికి ఇచ్చాడట. మద్దతు అడగడానికి వచ్చిన ఆ అభ్యర్థి మారుమాట్లాడకుండా మిలిటరీ అధికారి చెప్పిన మాటలు విని, పోసిన మందు తాగి బయటపడ్డాడట. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో పతంగి పాగా
మలక్‌పేట... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి పట్టు నిలుపుకొంది. మొత్తం 6 డివిజన్లకుగాను నాలుగు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం మూడు డివిజన్లు సాధించగా ఈ సారి మరో సీటును అదనంగా గెలుపొందడం విశేషం. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లోనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసం ఉంది. ఆయన తన సొంత ఇలాకాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గత బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్లలో ఎంఐఎం, మూడు డివిజన్లలో టీడీపీ, ఒక స్థానంలో ఎంబీటీ గెలుపొందింది. ఈసారి పునర్విభజనతో డివిజన్ల సంఖ్య ఆరుకు తగ్గినా ఎంఐఎం తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. మూసారాంబాగ్‌లో తీగల సునారితారెడ్డి, సైదాబాద్ నుంచి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి టీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11378 ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో 26 వేల పైచిలుకు ఓట్లు సాధించి ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగింది. గతంలో నియోజకవర్గంలో తిరుగులేని తెలుగుదేశం పార్టీ ఈ సారి తుడుచుపెట్టుకుపోవడం గమనార్హం. పార్టీ తరఫున హేమాహేమీలు బరిలోకి దిగినా పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో అజాంపురా నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈ సారి అక్భర్భాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. -
పట్టు నిలుపుకున్న మజ్లిస్
బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట స్వీప్ యాకుత్‌పురా, చార్మినార్‌లో నాలుగేసి డివిజన్లు కైవసం చార్మినార్: పాతబస్తీలో మజ్లీస్ హవా కొనసాగింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 25 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో జయుకేతనం ఎగురవేసింది . సిట్టింగ్ సీట్లన్నీ తిరిగి కైవసం చేసుకుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్ ఖాతాలోకి చేరాయి. చార్మినార్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్‌లలో మజ్లీస్ అభ్యర్థులు విజయం సాధించగా...ఘాన్సీబజార్ డివిజన్లో మాత్రం బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్ డివిజన్లను మజ్లీస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్వే. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా... డబీర్‌ఫురా, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ తదితర ఐదు డివిజన్లను మజ్లీస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా... మిలిగిన గౌలిపురాలో బీజేపీ, ఐ.ఎస్.సదన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. -
శివార్లలోనూ... అదే హోరు!
ఖైరతాబాద్ కారుకు స్పీడెక్కువ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు బహ్మ్రారథం పట్టారు. ఈ స్థానంలో టీడీపీ బలపరిచిన బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ కూటమి ఒక్క సీటును కూడా గెలువ లేకపోయింది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి , తిరుగులేని అధిక్యతను చాటారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 19,768 ఓట్లు రాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 69,886 ఓట్లు సాధించి, గతం కంటె 50,118 ఓట్ల అధిక్యత సాధించింది. బీజేపీ-టీడీపీ కూటమికి గతంలో 53,102 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 35,793 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 32,256 ఓట్లు రాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 17,834 ఓట్లు వ చ్చాయి. జూబ్లీహిల్స్‌లో... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరుతో సైకిల్ పంక్చర్ కాగా, కమలం వాడిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్క సీటును గెలిపించుకోలేక పోయారు. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయకు 50,898 ఓట్లు రాగా, టీఆర్ఎస్ 18,436 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 33,634 ఓట్లు సాధించి రెండవ స్థానాన్ని నిలుబెట్టుకున్నా, టీడీపీ-బీజేపి కూటమి 21,329 ఓట్ల చావుదెబ్బతింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 33,642 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో మాత్రం 20,135 ఓట్లతో సరిపెట్టుకున్నా గ తంలో కంటే 13,507 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి. సికింద్రాబాద్ ఏకపక్ష తీర్పు సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. తార్నాక మినహా మిగతా నాలుగు డివిజన్లలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్‌కు 36, 600 మెజార్టీ కట్టబెట్టిన లష్కర్ ఓటర్లు ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 59,987ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చారు. నగరంలోనే రికార్డు సీతాఫల్మండి టీఆర్ఎస్ అభ్యర్థి సామలహేమ భారీ మెజారిటీ సాధించారు. టీడీపీ అభ్యర్థి మేకల కీర్తికి 4208ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.వాణికి 1899ఓట్లు రాగా. సామలహేమ 19,279ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. డిపాజిట్ దక్కించుకున్న మాజీ మేయర్ నియోజకవర్గ పరిధిలోని తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. తార్నాక డివిజన్లో 29,367 ఓట్లు పోలవగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సరస్వతికి 18,051 ఓట్లు పడగా, మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి కేవలం 5110 ఓట్లతో సరిపెట్టుకుని డిపాజిట్ దక్కించుకున్నారు. మట్టికరిచిన మాజీలు నియోజకవర్గంలోని రెండు డివిజన్ల నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసినా అందరూ పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ నుంచి పోటీచేసిన మాజీ మేయర్, కాంగ్రెస్ అభ్యర్థి బండ కార్తీకారెడ్డి, బౌద్దనగర్ డివిజన్ నుంచి ఇద్దరు మాజీ కార్పోటర్లు ఆదం ఉమాదేవి (కాంగ్రెస్), పీ.స్వరూపాగౌడ్ (బీజేపీ)లు పరాజయం పాలయ్యారు. ఐదు డివిజన్లలో విజయదుంధుభి మోగించిన ఐదుగురు మహిళలు రాజకీయాలకు కొత్త కావడం గమనార్హం. ఎల్బీ నగర్... ఎల్బీనగ ర్లో కారు జోరు ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్లింది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కారు స్పీడును ఎక్క డా అందుకోలేకపోయాయి. 11 డివిజన్లకు గాను అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ రీతిలో పోటీ ఇవ్వగలిగారు. సెటిలర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇంటి స్థలాల క్రమబద్దీకరణ తదితర హామీలు టీఆర్ఎస్ విజయం చేకూర్చాయని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో సఫలీకృతులయ్యారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు 71791 ఓట్లు రాగా ఈసారి పార్టీ రెట్టింపు స్థాయిలో ఓట్లు దక్కించుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు 56489 ఓట్లు, టీడీపీ, బీజేపీ కూటమికి 84,316 ఓట్లు దక్కాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హస్తానికి షాక్.. ఇదిలా ఉండగా అన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్‌పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం విశేషం. బీఎన్‌రెడ్డి నగర్లో ఆ పార్టీ వెయ్యి ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క కార్పొరేటర్‌ను గెలిపించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్భీనగర్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నియోజకవర్గంలో ఒక్క డివిజన్‌లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోవడం గమనార్హం. పరువు నిలబెట్టుకున్న రామ్మోహన్ గత సార్వత్రిక ఎన్నికల్లో 71791 ఓట్లు సాధించి ఓటమి పాలయినప్పటికీ బల్దియా ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. ఈ సారి 11 డివిజన్లలో పాగా వేయడంతో పరువును నిలబె ట్టుకున్నట్లైంది. అంబర్‌పేట తారుమారు అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అయితే ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నియోజకవర్గంలో 48 శాతం పోలింగ్ నమోదు కాగా, ఐదు డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం గమనార్హం. 2009 బల్దియా ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లో మూడింటిలో కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి ఎంఐఎం, ఒకదానిలో స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టడం విశేషం. ముషీరాబాద్ అయ్యో... లక్ష్మణా..! సిటీబ్యూరో; బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలో కారు జోరందుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లలో బీజేపీ ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. ఇందులో ఐదు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగగా, మిగిలిన మరో స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే..బీజేపీ-టీడీపీ కూటమి హోరంగా దెబ్బతినగా, టీఆర్ఎస్ మాత్రం రెట్టింపు బలాన్ని పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకొని, నియోజకవర్గంలో పాగాకు ప్రయత్నిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 65,209 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 28,762 ఓట్లతోనే సరి పెట్టుకోవాల్సివచ్చింది. ఎంఐఎం 12,122 ఓట్లు సాధించి ఉనికిని చాటుకుంది. మల్కాజిగిరి కారుకు బ్రహ్మరథం సిటీబ్యూరో : మల్కాజిగిరి నియోజకవర్గంలోని 9 డివిజన్లలోనూ టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం, నేరేడ్మెట్, ఈస్ట్ఆనంద్బాగ్, మల్కాజిగిరి, వినాయక్‌నగర్, మౌలాలీ, గౌతమ్నగర్లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అల్వాల్‌లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి 10,616 ఓట్లతో సమీప ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధిపైన విజయం సాధించారు. అల్వాల్‌లో బీజేపీ అభ్యర్ధికి 3,072 ఓట్లు మాత్రమే లభించడం గమనార్హం. మచ్చబొల్లారం డివిజన్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి జితేందర్నాగ్ను రెండవ సారి కూడా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఏకంగా 13,557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా గత మెజారిటీని అధిగమించి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. .2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 77,132 ఓట్లు లభించగా, ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో 90 వేలకు పైగా ఓట్లు లభించాయి. -
5 ఓట్ల విజేత..
జాంబాగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. ఆనంద్ కుమార్ గౌడ్‌పై మజ్లిస్ అభ్యర్థి డి. మోహన్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మోహన్‌కు 8,583 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్‌కు 8,578 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్ల తేడాతో మజ్లిస్ అభ్యర్థి మోహన్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భజరంగ్ శర్మకు 5,235 ఓట్లు రాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఎం. ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ 3,382 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. - అబిడ్స్ -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు
నెం అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం స్థానాలు టీఆర్ఎస్ ఎంఐఎం టీడీపీ- బీజేపీ కాంగ్రెస్ 1 ఉప్పల్ 10 09 -- -- 01 2 ఎల్ బీ నగర్ 10 10 -- -- -- 3 మహేశ్వరం 03 02 -- 01 -- 4 మలక్ పేట్ 06 02 04 -- -- 5 చార్మినార్ 06 -- 05 01 -- 6 యాకుత్ పూరా 06 01 04 01 -- 7 చాంద్రాయణగుట్ట 07 -- 07 -- -- 8 బహుదూర్ పూరా 06 -- 06 -- -- 9 గోషామహల్ 06 03 02 01 10 రాజేంద్రనగర్ 05 03 02 -- -- 11 కార్వాన్ 06 01 05 12 నాంపల్లి 07 01 06 -- -- 13 ఖైరతాబాద్ 05 05 -- -- -- 14 జూబ్లీహిల్స్ 07 05 02 -- -- 15 ముషీరాబాద్ 06 05 01 -- -- 16 సనత్ నగర్ 06 06 -- -- -- 17 అంబర్ పేట్ 05 05 -- -- -- 18 శేరిలింగంపల్లి 10 10 -- -- -- 19 పటాన్ చెరు 03 02 -- -- 01 20 కూకట్ పల్లి 08 07 -- 01 -- 21 కుత్బుల్లా పూర్ 08 08 -- -- -- 22 మల్కాజ్ గిరి 09 09 -- -- -- 23 సికింద్రాబాద్ 05 05 -- -- -- మొత్తం 150 99 44 05 02 -
నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!
► ప్రతిసారీ మారుతున్న రిజర్వేషన్లు ► మజ్లిస్ పార్టీకి కంచుకోటగా పురానాపూల్ ► కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్ గౌస్ మారిన సమీకరణలు చార్మినార్: పురానాపూల్... పోలింగ్ నాటి సంఘటనలు...రీ పోలింగ్‌తో ఈ ప్రాంతం ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ మొదలైనప్పటినుంచి రెండు పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు అక్కడక్కడ వాగ్వాదాలు, ఆందోళనలతో పాటు అరెస్ట్‌లూ చోటుచేసుకున్నాయి. పరిస్థితులను సమీక్షించిన ఉన్నతాధికారులు పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ-పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న రిజర్వేషన్లు 1986 నాటి బల్దియా ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న పురానాపూల్ డివిజన్ 2002లో బీసీలకు కేటాయించారు. 2009లో మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా 1986 నుంచీ మారుతూ వస్తోంది. పునర్విభజన అనంతరం తాజాగా బీసీ జనరల్‌గా మారింది. 2009లో 23,863 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 34,407. రాజకీయ నేపథ్యం 1986లో పురానాపూల్ డివిజన్ ఎస్సీలకు రిజర్వు కావడం తో అప్పట్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2002లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ విజయం సాధించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ కావడంతో మజ్లిస్ అభ్యర్థి సున్నం శ్రీలత గెలుపొందా రు. అప్పటి నుంచీ మజ్లిస్‌కు కంచుకోటగా మారింది. ప్రస్తుతం పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి. మహ్మద్ గౌస్ కాంగ్రెస్‌లో చేరడంతో.... పురానాపూల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు, భార్య కూడా రంగంలోకి దిగారు. దీంతో ఒవైసీ సోదరులకు, మహ్మద్ గౌస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన గౌస్... 2002లో చార్మినార్ డివిజన్ నుం చి, 2009లో శాలిబండ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాతబస్తీలో రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యు లు పోటీ చేస్తున్న మూ డు డివి జన్ల నుంచి విజయం సాధిం చాలనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహ్మద్ గౌస్‌కు అప్పగిం చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టినంతా పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ డివి జన్లపై పెట్టింది. మజ్లిస్ పార్టీ తప్పొప్పులను స్థానిక ప్రజ లకు చెబుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన మహ్మ ద్ గౌస్ బహిరంగ సభల ద్వారా ఒవైసీ సోదరులకు సవాళ్లు విసిరారు. ఖిల్వత్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్‌లను రప్పిం చారు. రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేప్రయత్నం చేశారు. మజ్లిస్ వ్యూహాత్మకంగా... కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు మహ్మద్ గౌస్‌కు చెక్ పెట్టాలని ఒవైసీ సోదరు లు భావించారు. దీనికి అనుగుణంగానే బహిరంగ సభను నిర్వహించిన మజ్లిస్...కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చింది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని... ‘పతంగ్’ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే... చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్), పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యం లో మధ్యాహ్నం 1.30 గంటలకు జలాల్‌కుంచా ప్రాంతంలో ఎమ్మె ల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దీం తో ఇరువర్గాల్లో ఆగ్రహం కట్టలు తెం చుకుంది. వాగ్వాదాలతో ప్రారంభమై దాడులకు దారి తీసింది. విష యం తెలుసుకున్న దక్షిణ మండల డీసీ పీ వి.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చార్మినార్ పోలీ స్ స్టేషన్‌కు... మహ్మద్ గౌస్‌ను మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ అనుచరులతో వేర్వేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రేమకు వంతెన... ప్రేమకు వారధిగా నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పేరుతో ఈ డివిజన్ ఏర్పడింది. ప్రిన్స్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీ నది ఇవతల ఉన్న భాగమతిని ప్రేమించారు. ఆమెను కలవడానికి మూసీ నదిని దాటుతూ వచ్చేవారు. దీనిని గమనించిన ఆయన తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1578లో నదిపై ప్యారానాపూల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్యార్ అంటే ప్రేమ. పూల్ అంటే బ్రిడ్జి. ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘ప్యారానాపూల్’ కాలక్రమంలో పురానాపూల్‌గా మారిం ది. పురానా అంటే పురాతన అని అర్థం. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ వంతెన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిది. -
కౌంట్‌డౌన్
⇒ నేడే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ⇒ మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం ⇒ సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రకటన ⇒ మొదటి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు ⇒ 4 గంటల్లో పూర్తి చేయాలని యత్నం ⇒ జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి వెల్లడి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం తేలనున్నాయి. గెలిచేదెవరో.. ఓడేదెవరో మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పురానాపూల్ వార్డుకు రీపోలింగ్ జరుగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం ముగిసే వరకు (సాయంత్రం 5 గంటలు) ఫలితాలను వెల్లడించరు. సాయంత్రం 5 గంటల తర్వాతే వార్డుల ఫలితాలు ప్రకటిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లు, ఇతర వివరాలను జీహెచ్ంఎసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వివరించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కౌం టింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. కౌం టింగ్ ఏర్పాట్లు చేసిన దాదాపు 25 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అడిషనల్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిట ర్నింగ్ అధికారులు ర్యాండమ్‌గా నియమిస్తారు. ఓట్ల లెక్కిం పు మొత్తం ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇంకా.. ⇒తొలుత మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ⇒మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ⇒దీని కోసం రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ⇒నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. జనరేటర్లు అందుబాటులో ఉంచుతారు. ⇒కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లు నిషిద్ధం. ⇒ఫలితాల వివరాలు తెలియజేసేందుకు మీడియా కేంద్రా లు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు తెలిసినప్పటికీ సాయంత్రం 5 గంటల వరకు వెల్లడించరు. కౌంటింగ్ మొదలైన రెండు గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ⇒ మొత్తం ఫలితాల వెల్లడికి నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా. ⇒ మొత్తం 1,674 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ⇒ కౌంటింగ్ సిబ్బంది 5,626 మంది. ⇒827 రౌండ్లలో మొత్తం లెక్కింపు పూర్తవుతుంది. ⇒ లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించరు. ⇒ తొలి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ⇒ నాలుగు గంటల్లో అన్ని వార్డుల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పాసులు ఉన్న వారికే అనుమతి. ⇒ పాసులు లేకుండా ఎవరూ రావద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. ⇒ పోలీసుల అనుమతి ఉంటేనే విజేతలు ర్యాలీలు నిర్వహించాలి. 3 నుంచి 10 రౌండ్లు కౌంటింగ్ కేంద్రాల్లోని సదుపాయాలు.. పోలింగ్ కేంద్రాలను బట్టి మూడు నుంచి పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం వార్డుల సంఖ్య 150. వీటిలో 99 వార్డుల లె క్కింపు ఒకేసారి (మధ్యాహ్నం 3 గంటలనుంచి) ప్రారంభమవుతుంది. అవి పూర్తయ్యాక మరో రెండు, మూడు దఫాల్లో లెక్కింపు జరుగుతుంది. తొలి దశలో ఫలితాలు వెలువడే వార్డులు: తొలి రెండు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో కాప్రా, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, చిలుకానగర్, రామంతాపూర్, అక్బర్‌బాగ్, రెయిన్‌బజార్, లలితాబాగ్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, శాలిబండ, జియాగూడ, దత్తాత్రేయనగర్, లంగర్‌హౌస్, టోలిచౌకి, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, కాచిగూడ, అడిక్‌మెట్,ముషీరాబాద్, షేక్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్, చింతల్, నేరేడ్మెట్ ఉన్నాయి. మూడు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో సైదాబాద్, సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, రామ్‌నగర్, ఖైరతాబాద్, మియాపూర్, భారతీనగర్, ఆర్సీపురం, ఓల్డ్‌బోయిన్‌పల్లి, గాజులరామారం, రంగారెడ్డినగర్, వెంకటాపురం, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, రామ్‌గోపాల్‌పేట ఉన్నాయి. -
'కాంగ్రెస్ ను మేమే నడుపుకుంటాం'
హైదరాబాద్: తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోదీ కూడా కలుస్తామని అక్బరుద్దీన్ అనడం మజ్లిస్ అవకాశవాద రాజకీయలకు పరాకాష్ట అన్నారు. ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకుని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని, దీనికి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని హనుమంతరావు పేర్కొన్నారు. -
గ్రేటర్ పోలింగ్ 45.27 శాతం
లెక్క తేల్చిన అధికారులు గత ఎన్నికలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్క తేల్చారు. బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన మంగళవారం సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందకపోవడంతో సాయంత్రం 4.30 గంటల వరకు తమవద్ద ఉన్న సమాచారం మాత్రమే వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాదాపు 45 శాతం పోలింగ్ జరిగినట్లు మీడియా సమావేశంలో వెల్లడించడం తెలిసిందే. దాదాపుగా అంతే పోలింగ్ నమోదైంది. వివిధ వర్గాల ద్వారా, సామాజిక వేదికల ద్వారా, వీఐపీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడంతో ఈసారి కనీసం 50 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదు కాగలదని అంచనా వేశారు. అయితే నగర ప్రజల్లో పోలింగ్‌పై ఇంకా చైతన్యం పెరగాల్సి ఉందని తేలింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 3 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన వార్డు విజయనగర్ కాలనీయే కావడం విశేషం. ఇవీ వివరాలు.. 2002లో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు.. మొత్తం ఓటర్లు : 26,78,009 పోలైన ఓట్లు: 11,58,913 పోలింగ్ శాతం: 43.27 2009లో జీహెచ్ఎంసీ తొలి ఎన్నికల్లో.. మొత్తం ఓట్లు: 56,99,639 పోలైన ఓట్లు: 23,98,105 పోలింగ్ శాతం: 42.07 2016.. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓట్లు: 74,23,980 పోలైన ఓట్లు: 33,60,543 పోలింగ్ శాతం: 45.27 -
‘గ్రేటర్’ గొడవలపై 14 కేసులు
ఉత్తమ్, షబ్బీర్‌లపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు ఎంపీ అసదుద్దీన్ సమక్షంలోనే వారిపై దాడి: డీసీపీ హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పలు ఉదంతాలకు సంబంధించి పోలీసులు 14 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికం మజ్లిస్‌పై నమోదయ్యాయి. పశ్చిమ మండలంలో నాలుగు, తూర్పు మండలంలో మూడు, మధ్య మండలంలో ఒకటి, దక్షిణ మండలంలో ఆరు కేసులతో పాటు ముందస్తు అరెస్టుకు సంబంధించి దక్షిణ మండల పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. వీటి దర్యాప్తు తీరుతెన్నులను నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కార్ల అద్దాలు ధ్వంసం, షబ్బీర్ పై దాడి ఘటనల్లో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించా రు. ఈ ఘటనలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపైనా కేసు నమోదు చేశామని, వీడియో ఫుటేజీలను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఈ కేసులో ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ అబ్దాహు ఖాద్రీ అలియాస్ కషఫ్(21), కాలాపత్తర్‌కు చెందిన షేక్ ఆబేద్(38), డబీర్‌పురాకు చెందిన మహ్మద్ మసీవుద్దీన్ అలియాస్ మసీ (34)లను అరెస్ట్ చేశాం. అసద్ సమక్షంలోనే దాడి జరిగినట్లు ఆధారాలున్నాయి. జంగంమెట్ బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దాడి చేసిన సంఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట కింద కేసు నమోదు చేశాం. రెయిన్‌బజార్, సంతోష్‌నగర్ పోలీస్స్టేషన్లలో కూడా పోలింగ్ కేసులు నమోదయ్యా యి. మజ్లిస్ పార్టీ వెబ్ మీడియా నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దాహు ఖాద్రీ ఇంజనీరింగ్ చేశాడు. షబ్బీర్ అలీపై మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ వద్ద పిడిగుద్దులతో దాడి చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అని తేల్చేందుకు నిందితుల సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాలను పరిశీలించనున్నాం’’ అన్నారు. మరోవైపు మలక్‌పేట మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. అసద్, అక్బర్ ప్రోద్బలంతోనే బలాల తన అనుచరులతో కలసి హత్యాయత్నం చేశారని అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదు ల్లా ఖాన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, అనుచరులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 147,148,149,188,109, 120బి, 307 సెక్షన్ల కింద ఎమ్మెల్యే బలాల, ఆయన గన్‌మెన్ జానీ, అలీ(కాలా డేరా), అక్బర్‌బాగ్ మజ్లిస్ అభ్యర్ధి మినాజుద్దీన్లపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు. అసద్, అక్బర్‌లపై 109, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. -
ఐదో రోజూ ఫాంహౌస్‌లోనే సీఎం
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజులుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఫాంహౌస్‌లో ఉంటూ పంటలను పరిశీలిస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై ఆరా తీశారు. అలాగే నారాయణఖేడ్ ఉప ఎన్నిక స్థితిగతులపై మంత్రి హరీశ్‌రావుతో ఫోన్లో మాట్లాడి సమాచారం సేకరించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధం కాగా, చివరి క్షణంలో విరమించుకున్నట్లు తెలిసింది. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ పంటలను పరిశీలించినట్లు సమాచారం. -
రేపే కౌంటింగ్
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో... స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉంది. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు మొత్తం కౌంటింగ్ పూర్తి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటల్లోగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది. అంతకన్నా ముందే ఇది పూర్తికానుంది. వివిధ వార్డుల్లో పోలైన ఓట్లు ... లెక్కింపు కోసం అందుబాటులో ఉన్న హాళ్లు, టేబుళ్ల సంఖ్యపై ఆధారపడి తొలి, చివరి వార్డుల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అడిషనల్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.వీరిని ఎన్నికల పరిశీ లకులు, రిటర్నింగ్ అధికారులు రాండమ్‌గా నియమిస్తారు. ఉదయం 6 గంటల లోపునే సిబ్బంది రాండమైజేషన్‌ను పూర్తి చేస్తారు. వారు 6 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకుంటారు.ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది.కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు.ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు.ఈ కేంద్రాల్లోని సదుపాయాలను బట్టి కొన్ని వార్డుల తర్వాత మరికొన్ని వార్డుల లెక్కింపు చేపడతారు. మొత్తం మూడు విడతలుగా ఇది పూర్తి కానున్నట్లు సమాచారం. -
బెట్టింగ్ బంగార్రాజులు!
‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పెరిగిన వ్యవహారాలు నగర వ్యాప్తంగా స్పెషల్ టీమ్స్ నిఘా ఆన్లైన్ వ్యవహారాల పైనా దృష్టి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం పూర్తయింది. పందెం రాయుళ్లకు పని పెరిగింది. దీంతో పోలీసులు బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి పోలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పందాలు జోరందుకుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క ఆన్లైన్ బెట్టింగుల పైనా నిఘా ఉంచాలని నిర్ణయించారు. వీటి నిర్వాహకులకు చెక్ చెప్పడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘గ్రేటర్’ పరిధిలోని 150 డివిజన్లకు పోలింగ్ పూర్తయి... అభ్యర్థుల భవిత ఈవీఎంలలోకి చేరింది. దీంతో నాయకులంతా ఎక్కడిక్కడ గెలుపోటముల లెక్కల్లో బిజీ అయిపోయారు. మంగళవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో పందెంరాయుళ్ల పల్స్ మారింది. దీంతో బుకీలు బెట్టింగులకు తెరలేపారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉండటంతో బెట్టింగ్స్ పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ పార్టీల చోటా నేతలతో సహా అనేక మంది రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే సమాచారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అభ్యర్థుల ఖర్చు కంటే ఎక్కువగానే బెట్టింగులు పెడుతున్నట్టు పోలీసులు అంచనా. డివిజన్ నుంచి మెజారిటీ వరకు... ఈసారి బెట్టింగుల్లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల పైనే కాకుండా... వారికి లభించే మెజారిటీ ఎంత? రెండో స్థానంలో ఎవరుంటారు? మొత్తమ్మీద గ్రేటర్లో ఏఏ పార్టీలు ఎలా ఉంటాయి? ఫలానా పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి? అనే అంశాలపైనా జోరుగా పందా లు కడుతున్నారు. మరోపక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పందాలరాయుళ్లతో ఫోన్లో టచ్‌లో ఉంటున్న బుకీలు గ్రేటర్ ఎన్నికలపై ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. వీ టిపై దృష్టి పెట్టిన జంట కమిషనరేట్ల పోలీ సులు నిఘా ముమ్మరం చేశారు. బుకీల ఆట కట్టించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్థా నిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ అధికారులూ వేగులను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లోనే అధికం... శివార్లలోని అత్తాపూర్, శంషాబాద్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు నగరంలోని బేగంబజార్, కాచిగూడ, సికిం ద్రాబాద్, అబిడ్స్, మోతీనగర్, ఎస్సార్ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలు బెట్టింగ్ వ్యవహారాలకు కేంద్రాలుగా ఉన్నాయి. వీటికి తోడు నగరం బయట ఉన్న అనేక గెస్ట్‌హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు బుకీలకు వేదికలుగా మారుతున్నాయని పోలీసుల అనుమానం. పార్టీ, అభ్యర్థి, డివిజన్లను బట్టి ఈ పందాల్లో 1:1 నుంచి 1:10 వరకు ఇచ్చేలా బుకీలు ఆకర్షిస్తున్నారు. ముంబయికి చెందిన కొందరు బుకీలు సైతం రంగంలోకి దిగారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ తరహా కేసుల్లో అరెస్టయి... బెయిల్‌పై విడుదలైన వారిపై డేగకన్ను వేసి ఉంచారు. బెట్టింగ్ పరిభాషలో పందాలు కాసే వారిని పంటర్లని, వీటిని నిర్వహించే వారిని బుకీలని సంబోధిస్తారు. అత్యంత గుట్టుగా వ్యవహారాలు సాగించే ‘కాయ్ రాజా’ల ఆట కట్టించడానికి ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ ముఠా లు, బుకీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరుతున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. ‘100’తో పాటు పోలీసు వెబ్సైట్లలోని నెంబర్లకు ఫోన్ చేసి, అధికారిక వాట్సాప్‌ల్లో పోస్ట్ చేయడం ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను తమకు తెలియజేయవచ్చని కోరుతున్నారు. బెట్టింగ్ దందా చట్ట విరుద్ధమే కాకుండా పరోక్షంగా అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందన్నారు. -
గెలిచేది మేమే!
ఎవరి ధీమా వారిదే అభ్యర్థుల తరఫున భారీగా బెట్టింగులు కౌంటింగ్ సన్నాహాల్లో యంత్రాంగం తొలుత మెహిదీపట్నం, ఆఖరున సుభాష్ నగర్ ఫలితం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాదేనంటూ ప్రధాన రాజకీయ పక్షాలు బుధవారం రోజంతా లెక్కలు వేసే పనిలో పడ్డాయి. వివిధ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలను సమీక్షిస్తూ... ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థుల అనుయాయులు బెట్టింగులకు తెరలేపారు. ఏకపక్షంగా పోలింగ్ జరిగిన ప్రాంతాలు మినహాయిస్తే.. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో వివిధ సీట్లపై భారీగా బెట్టింగులు సాగుతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి 80కి పైగా స్థానాల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే... ఎంఐఎం వ్యూహకర్తలు తాము 45 స్థానాల్లో గెలిచి తీరుతామని తేల్చారు. ఇక బీజేపీ సొంతంగా 28 డివిజన్లలో గెలుస్తామని చెబుతోంది. టీడీపీ నేతలు సైతం అంతే సంఖ్యలో సీట్లు సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తార్నాక, జాంభాగ్, వెంకటేశ్వర కాలనీ, ఏఎస్రావు నగర్, కొత్తపేట, గోషా మహల్, రెడ్‌హిల్స్, భాగ్‌అంబర్‌పేట, వెంగళరావు నగర్, నేరెడ్మెట్, పురానాపూల్, శాలిబండ, ఘాన్సీబజార్ తదితర స్థానాలతో పాటు మొత్తం 25 సీట్లకుపైగా గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేసింది. తొలి ఫలితం మెహిదీపట్నం ఎన్నికల యంత్రాంగం బుధవారం రోజంతా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో తలమునకలైంది. గ్రేటర్‌లోని 26 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రతి డివిజన్‌లోనూ 7 నుంచి 14 టేబుళ్లపై లెక్కించనున్నారు. మొత్తం ఓట్లలోనే అతి చిన్న డివిజన్‌గా గుర్తింపు పొందిన మెహిదీపట్నంలో 10,233 (34.28శాతం) ఓట్లు మాత్రమే పోల్ కావటంతో తొలుత అక్కడి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆపై 13,327 ఓట్లు పోలైన బార్కాస్, 13,797 ఓట్లు పోలైన రెయిన్‌బజార్, 13,078 ఓట్లు పోలైన టోలిచౌకీ డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఓట్లతో పాటు పోలైనవి కూడా అధికంగా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం(29,458 పోలైన ఓట్లు), సుభాష్‌నగర్ (38,963 పోలైన ఓట్లు)తో పాటు 27వేలకు పైగా ఓట్లు పోలైన సనత్‌నగర్, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, బాలాజీనగర్, ఫతేనగర్,గోల్నాక తదితర డివిజన్ల ఫలితాలను ఆలస్యంగా ప్రక టించే అవకాశం ఉంది. మొత్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడు నుంచినాలుగు గంటల్లో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
'ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ'
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) నేత రామరాజు ఖండించారు. ఎంఐఎం ఒక ఉగ్రవాద పార్టీ లాంటిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న పదవుల కోసం మజ్లిస్.. టీఆర్ఎస్ తో జత కడుతోందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా మంగళవారం పాతబస్తీలో పలు చోట్ల మజ్లిస్ నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగారు. అధికార, విపక్ష అభ్యర్థులను భయపెట్టారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. -
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేసి హింసకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేశారని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కౌన్సిల్ నేత షబ్బీర్ అలీని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నెట్టేయడం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. ఎంఐఎం దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
7 లక్షల కొత్త ఓట్లు హాంఫట్!
♦ కలర్ ఎపిక్ కార్డులను అధికారులు పక్కన పడేశారా? ♦ పోలింగ్ శాతం తగ్గటంపై ఈసీ విస్మయం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావటంపై ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన పోలింగ్‌కు సగానికిపైగా ఓటర్లు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార వాణిజ్య సంస్థలకు సెలవిచ్చినా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు నిరాసక్తత కనబరిచారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ఓటరు స్లిప్పుల పంపిణీలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. కొత్తగా నమోదైన 7 లక్షల మంది ఓటర్లలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇందుకు ఈసీ జారీ చేసిన కొత్త ఎపిక్ కార్డులు వారికి అందకపోవటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఎన్నికల కమిషన్ కలర్ ఫొటోలున్న ఎపిక్ కార్డులను జారీ చేసింది. ఆగమేఘాలపై వీటిని ముద్రించే చర్యలు చేపట్టిన ఈసీ... వారం రోజుల కిందటే జీహెచ్ఎంసీకి అప్పగించింది. కానీ ఓటర్లకు వీటిని అందజేయాల్సిన జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతగా పట్టించుకోలేదు. వీటిని జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. దీంతో ఈ ఏడు లక్షల మందిలో అత్యధిక ఓటర్లు ఓటు వేయలేకపోయినట్లు ఈసీ భావిస్తోంది. వీటికి తోడు ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా సరిగా జరగలేదు. ఓటు హక్కుపై చైతన్యం పెంపొందించేందుకు ఈసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఓటరు స్లిప్పుల పంపిణీ సవ్యంగా జరగకపోవటం పోలింగ్ శాతంపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలున్నాయి. -
ఓటెత్తిన సెలబ్రిటీ
ఓటు హక్కు ముఖ్యమైనది.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనది. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విజయనిర్మలతో కలిసి నేను ఓటు వేశాను. ఏ ఎన్నికలు జరిగినా విధిగా ఓటు వేస్తా. ఇది నా బాధ్యతగా భావిస్తాను. మన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేందుకు ఓటేయాలి. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - సినీనటుడు, కృష్ణ ఓటేసేవారికే ప్రశ్నించే హక్కు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నేను భావిస్తా. దీని ద్వారా ప్రశ్నించే హక్కు వస్తుంది. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఓటు వేశాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్‌పై అవగాహన బాగా పెరిగింది. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలన్నదే నా అభిమతం. లేటైనా పర్వాలేదు.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోవద్దు. ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - జూనియర్ ఎన్టీఆర్ ఇది అందరి బాధ్యత.. నాకున్న ఓటు హక్కును వినియోగించుకోవడం నా బాధ్యత. ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశాను. అవగాహన ఉన్నవారు.. చదువుకున్నవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. - సినీనటుడు నరేష్ -
దాడులు.. ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయిన మజ్లిస్ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెడ్‌హిల్స్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా అడ్డగించి.. చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఇదే డివిజన్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రొహిబెల్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మజ్లిస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అలాగే, చావణీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిపైన, అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థిపైన మజ్లిస్ కార్యకర్తలు దాడి కి పాల్పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వరకాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బంజారాహిల్స్‌లోని ఆల్ఫోన్సస్ హైస్కూల్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. బయట తిరిగితే చంపేస్తాం నాంపల్లి: రెడ్‌హిల్స్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అయేషా ఫర్హీన్‌ను మజ్లిస్ పార్టీ కార్యకర్తలు చంపేస్తామని బెదిరించారు. పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు మంగళవారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. ఏసీగార్డ్స్‌లో ఉన్న నిలోఫర్ హెల్త్ స్కూల్ వద్దకు చేరుకున్న ఆమెకు పార్టీ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ తదితరులు తారసపడ్డారు. మజ్లిస్ కార్యకర్తలు అయేషా షర్హీన్ను తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వారిలో షకీల్ అనే కార్యకర్త ‘‘ఎంఐఎం అంటే ఏమిటో తెలుసు కదా...బయట తిరగొద్దని చెప్పినా తిరుగుతున్నావ్.. బతకాలనిలేదా.. కారెక్కి ఇంటికిపో’’ అని కత్తి చూపించి బెదిరించాడు. మజ్లిస్‌కు భయపడి వెళ్లేదిలేదని, చావో రేవో ఇక్కడే తేల్చుకుంటానని అయేషా ఫర్హీన్ తేల్చి చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ గుమిగూడిన వారిని చెదరగొట్టారు. అయితే, అప్పటికే ఆమెను బెదిరించిన షకీల్ తదితరులు వెళ్లిపోగా.. మజ్లిస్ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ మాత్రమే ఉన్నారు. కాగా, బాధితురాలు అయేషా ఫర్హీన్‌కు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ప్రొహిబెల్స్ స్కూల్ వద్ద రాళ్లు రువ్విన మజ్లిస్... ప్రొహిబెల్స్ స్కూల్లో పోలింగ్ ముగుస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి టీఆర్ఎస్ అభ్యర్థి మార్గం సరిత అక్కడికి వెళ్లారు. దీంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సుభాన్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంపై రాళ్లు రువ్వడంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అల్లరిమూకలను తరిమిగొట్టారు. ఈవీఎం బాక్స్‌లను సురక్షితంగా బయటకు తరలించారు. దాడికి పాల్పడ్డ మజ్లిస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడని దాడి జవహర్‌నగర్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడని కౌకూర్‌లో ఓ వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు. జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు కథనం ప్రకారం.. యాప్రాల్ పరిధిలోని కౌకూర్ హరిజన బస్తీకి చెందిన పేరుపల్లి శ్యాంరావు (52) మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నాడనే నెపంతో బైక్‌లపై వచ్చి కొందరు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజుయాదవ్, రాజారెడ్డి, చిట్టి, ఎల్లారెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ ... బంజారాహిల్స్: వెంకటేశ్వరకాలనీ కాంగ్రెస్ అభ్యర్థి బి.భారతిపై దాడి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 9లోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎవరో రిగ్గింగ్‌కు యత్నిస్తున్నారని తెలిసి వెళ్లిన ఆమెను కొందరు దుర్భాషలాడి, కులం పేరుతో దూషించారు. భుజంపై చెయ్యి వేసి నెట్టేశారు. దీంతో ఆమె కిందపడిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీ చార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. కాంగ్రెస్‌కు బాగా ఓట్లు పడుతున్నాయని ఓర్వలేక టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారని, అడ్డుకోబోతే దాడి చేశారని భారతి రోదిస్తూ తెలిపారు. పోలింగ్ బూత్ ముందు బైఠాయించి తనకు న్యాయంచేయాలని నినాదాలుచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె కవిత కూడా పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఆవేశంతో కుర్చీలు ధ్వంసం చేసి.. రోడ్డుపై బైఠాయించారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. దీంతో అరగంటపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, తనను కులం పేరుతో దూషించిన టీఆర్ఎస్ కార్యకర్తలు మజిద్అలీ, జావెద్ అలీ, నిస్సార్అలీ, ఖదీర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని భారతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చావణీలో టీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి... చంచల్‌గూడ: చావణీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ ఖలీమ్‌పై బాగేజారా ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ముర్తుజా అలీ అతని అనుచరులు దాడి చేసినట్లు రెయిన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎంబీటీ అభ్యర్థిపై ఎంఐఎం నాయకుల దాడి మలక్‌పేట: అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్పై ఎంఐఎం నాయకులు మంగళవారం దాడి చేశారు. మలక్‌పేట పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం... మలక్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న అంజదుల్లాఖాన్పై స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా... మలక్‌పేట సీఐ గంగారెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశో ద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. చాదర్‌ఘాట్: గాయపడ్డ అంజదుల్లాఖాన్‌ను పరామర్శించేందుకు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి ఎంబీటీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఎంఐఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అంజదుల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
లెక్క తప్పిందెక్కడ?
♦ గ్రేటర్ హైదరాబాద్‌లో జనాభా-ఓటర్ల గందరగోళం ♦ ఓటర్ల లెక్కలే నిజమైతే.. కోటిని మించే నగర జనాభా ♦ జనాభా లెక్కలే సరైతే.. సుమారు పదిహేను లక్షల ఓటర్లు అధికం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనాభా-ఓటరు లెక్కలు మరోసారి చిక్కుముడిగా మారాయి. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం నమోదైన 74.30 లక్షల ఓటర్లలో 37.7 శాతం మాత్రమే ఓటు వేయడంతో... లోపం ఎక్కడుందన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజకీయాలపై ఆసక్తి లేక జనం పోలింగ్‌లో పాల్గొన లేదా, లేక నగరంలో ఓటర్ల లెక్కల్లోనే తప్పులున్నాయా... అన్న దానిపై ఉన్నతస్థాయి యంత్రాంగం తల పట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా తయారీ విధానం, తీసివేత వివాదం, తాజా పోలింగ్ శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. పొంతనలేని జాబితాలు.. వాస్తవానికి 2011, 2014ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ‘గ్రేటర్’ జనాభాతో పోలిస్తే తాజాగా నమోదైన ఓటర్ల లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకునే విషయంలో చూపిస్తున్న చొరవ.. ఇళ్లు మారినప్పుడో, నగరాన్ని వదిలి వెళ్లినప్పుడో, చనిపోయినప్పుడో ఓటర్ల జాబితాల్లోంచి పేర్లను తొలగించే విషయంలో చూపడం లేదు. దీంతో హైదరాబాద్ ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఆరు నెలల కింద అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ 6.4 లక్షల ఓట్లను తొలగించడంతోపాటు పేర్లు రెండు-మూడు చోట్ల ఉండడం, చనిపోవడం వంటి కారణాలతో మరో తొమ్మిది లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో ఈ తొమ్మిది లక్షల ఓట్లను తొలగించకుండానే ఈసారి తుది జాబితాలు సిద్ధం చేశారు. తొలగించిన ఆరు లక్షల ఓట్లను కూడా చేరిస్తే దాదాపుగా ఓటర్లు-జనాభా సంఖ్య సమానమయ్యేది. ఈ విషయమై సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించగా... ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. అయితే మొత్తం మీద జనాభా-ఓటర్ల సంఖ్యపై పొంతన కుదరాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏ లెక్క వాస్తవం? జనాభా-ఓటరు లెక్కలకు సంబంధించి శాస్త్రీయ అంచనాల మేరకు 100 మంది జనాభా ఉంటే... 67 మంది ఓటర్లు ఉండాలి. మహానగరాల్లో అయితే అది 100ః70 వరకు ఉండొచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2011 జనాభా లెక్కల మేరకు సుమారు 68 లక్షలు, 2014లో చేసిన సామాజిక సర్వే మేరకు 77-78 లక్షలు లెక్కించినా, ప్రస్తుతం నగర జనాభా 80 లక్షలుగా అనుకున్నా... జనాభా-ఓటరు నిష్పత్తి మేరకు సుమారు 56 నుండి 58 లక్షల వరకు ఓటర్లు ఉండాలి. కానీ నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 74.30 లక్షలు. ఒకవేళ ఈ ఓటర్ల లెక్కలే నిజమైతే నగర జనాభా సుమారు కోటీ పది లక్షల వరకు ఉండాలి. అంటే ఏ లెక్క వాస్తవమో ఎవరికీ తెలియదు. లెక్కలన్నీ చిత్రమే.. ‘‘హైదరాబాద్‌లో జనాభా-ఓటరు నిష్పత్తి లెక్కలన్నీ చిత్రమే. నగరంలో ఓటర్ల జాబితాలను సరిదిద్దే పనిలో ఓటర్లతో పాటు జవాబుదారీతనంతో పనిచేసే సంస్థలు పాలుపంచుకునేలా చేయాలి. అప్పుడే ఈ పరిస్థితి చక్కబడుతుంది. ఇక ఈసారి పెద్దగా పోలింగ్ నమోదు కాలేదు. ఈ ఎన్నికలతో తమ సమస్యలేవీ తీరవన్న భావనే ఓటర్లు ఆసక్తి చూపకపోవడానికి కారణం కావచ్చు.’’ - పద్మనాభరెడ్డి,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
ఓటేయని జనసేన అధినేత
సిటీబ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో ఓటు హక్కు ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈసారి ఆయన కేరళలో సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో కాపు ఐక్యగర్జన సభ నేపథ్యంలో ఉద్రిక్తత, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది పూర్తయిన వెంటనే మళ్లీ కేరళ షూటింగ్‌కు వెళ్లిపోవడంతో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. -
పోలింగ్ 37 శాతమే..
సాయంత్రం 4.30 గంటల వరకు నమోదు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగలేదు. 2009 ఎన్నికల తో పోలిస్తే ఈసారి కొంత తగ్గింది. 2009లో 42.92 శాతం పోలింగ్ నమోదు కాగా.. మంగళవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 4.30 గంటల వరకు 37.70 శాతం మాత్రమే నమోదైంది. సర్కిళ్ల నుంచి పూర్తి సమాచారం అందకపోవడంతో బుధవారం తుది ఓటింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు ప్రకటించాయి. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 45 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించినా.. ఆ తర్వాత 37.70 శాతమే అని అధికారులు తెలిపారు. ఆదిలో ప్రశాంతం.. చివర్లో ఘర్షణలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ చివరల్లో ఘర్షణలు చోటుచేసుకున్నారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలకుగాను తొమ్మిది కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయా చోట్ల కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. 15 నిమిషాల్లోనే కొత్త పరికరాలు అందుబాటులోకి తేవడంతో పోలింగ్ సజావుగా సాగింది. ఎనిమిది కేంద్రాల్లో లో బ్యాటరీతో ఈవీఎంలు మొరాయించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు వెబ్సైట్, మొబైల్ యాప్స్ ద్వారా ఓటరుస్లిప్‌లు డౌన్లోడ్ చేసుకోవడంలో కనిపించిన స్పందన పోలింగ్‌లో కనిపించలేదు. పోల్‌స్లిప్‌ల డౌన్లోడ్లు, జీహెచ్ఎంసీ పంపిణీ చేసిన పోల్స్లిప్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి 60 శాతానికి పైగా పోలింగ్ నమోద వుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. వెబ్‌కాస్టింగ్‌తో అంతా సజావుగా.. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎన్నికల సంఘం, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ ఎంసీ కార్యాలయాల నుంచి పర్యవేక్షించారు. దీంతో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పోలింగ్ జరగడమే కాక, అక్కడక్కడ తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల చెలరేగిన ఘర్షణలు పోలింగ్ కేంద్రాల్లోకానీ, కేంద్రాలకు వంద మీటర్ల లోపు కానీ జరిగినవి కావని ఆయన పేర్కొన్నారు. అయినా.. ఆ ఘర్షణలతో ప్రజలు భయభ్రాంతులకు గురైనట్లు ,రిగ్గింగ్ జరిగినట్లు, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులు నివేదిస్తే ఎన్నికల సంఘానికి తెలియజేసి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌లోని ఐదు జోన్లలో సౌత్ జోన్లో ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాతబస్తీ సౌత్‌జోన్ పరిధిలో ఉంది. 5వ తేదీన ఫలితాలు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుందని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల కే తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండవచ్చని తెలిపారు. -
మా గెలుపు ఖరారైంది
♦ జీహెచ్ఎంసీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ♦ హైదరాబాదీలు ఇంకా ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొని ఉంటే బాగుండేది ♦ పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే మెజారిటీ మరింతగా పెరిగేది ♦ ఏడు స్వతంత్ర సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మా గెలుపు ఖరారైంది. ఈ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయి. తమ ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి ఉన్నాయి. అందుకే అధికార దుర్వినియోగం జరిగిందంటూ ఉత్తమ్, కిషన్‌రెడ్డి కొత్త పాట ఎత్తుకున్నారు. స్వతంత్రంగా జరిగిన ఏడు సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయి..’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాదీలు ఇంకా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఉంటే టీఆర్ఎస్ మెజారిటీ మరింతగా పెరిగేదన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింతగా పెరగాల్సిందని, ఓటింగ్‌కు దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని... చివరలో ఎంఐఎం-టీఆర్ఎస్ మధ్య, ఎంఐఎం-కాంగ్రెస్ మధ్య జరిగిన ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా గొడవల్లేవు కాబట్టి, రీపోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయనడానికి రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలపై కూడా కేసులు నమోదు కావడమే ఉదాహరణ అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పట్ల విశ్వాసమే గెలుపు బాట.. ‘‘మా గెలుపు ఖరారైంది. అధికారికంగా 5వ తేదీన వెలువడే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ‘కారు-సారు’ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాం. మా నాయకుడి దీక్షాదక్షత, సమర్థత, ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే మా గెలుపునకు బాటలు వేస్తున్నాయి..’’ అని చెప్పారు. ఇక సీపీఐ నేత నారాయణ అంటే తమకు గౌరవం ఉందని, రాయలసీమ నేత అయి ఉండి కూడా తెలంగాణకు మద్దతుగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ నారాయణ వాస్తవాలు అంచనా వేయకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికల వేడిలో సంఘటనలు జరుగుతాయని, కోపతాపాల ప్రదర్శనలు వద్దని, సంయమనం కోల్పోవద్దని చెప్పారు. టీఆర్ఎస్ అంటే సుముఖంగా లేని వారు కూడా సర్వేలు చేసి, డెబ్బైకి పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తున్నట్లు తేల్చారని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గత 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని చెప్పారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. -
'ప్రస్తుతం స్పందించలేను'
హైదరాబాద్: ఓటు వేయమనే భావన మంచిది కాదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని కోరారు. కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రస్తుతం స్పందిచలేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీడియాను పిలిచి మాట్లాడతానని అన్నారు. -
ఒంట్లో బాలేకపోయినా ఓటు వేశా: జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని జీహెచ్ ఎంసీ ఓటర్లకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు ఒంట్లో నలతగా ఉన్నా వచ్చి ఓటేశానని వెల్లడించారు. అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు వేశారు. అక్కినేని నాగార్జున అమల, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూకట్ పల్లి డివిజన్ లో ఓటు వేశారు. -
కేకే కుమార్తె ఆందోళన
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి మంగళవారం ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని 36, 37 పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తార్నాకా డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు. -
సమరానికి సన్నద్ధం..
గ్రేటర్ సమరానికి అంతా సిద్ధమైంది. నగరంలోని 150 డివిజన్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు సోమవారం పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్లను ఒక్కరోజు ముందుగానే ఎన్నికల అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు, ఇతర సామగ్రిని అందజేశారు. గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. మహిళా సిబ్బంది తమ పిల్లలతో సహా విధులకు రావడంతో ఇబ్బంది పడ్డారు. పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మేయర్ పీఠం మాదే: కేటీఆర్ బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుంది. 80కి పైగా సీట్లు సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు ఒక్క సరైన కారణం చూపడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. నగరంలో కరెంట్ పోకుండా చూశాం. శామీర్‌పేట్, రాచకొండ ప్రాంతాల్లో భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించి రాబోయే రోజుల్లో మహానగరానికి తాగునీటి ఇక్కట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యం. - కేటీఆర్, రాష్ట్రమంత్రి, గ్రేటర్ ఎన్నికల ప్రచార సారధి హైదరాబాద్ హమారా.. గ్రేటర్ పోరులో గెలిచేది మేమే. హైదరాబాద్ హమారా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం. మా పనితీరుపై ప్రజలకు నమ్మకం ఉంది. గత మూడేళ్ల పాటు సమర్థవంతమైన పరిపాలన అందించాం. వచ్చే ఐదేళ్లలో చేపట్టే పనులపై పక్కా కార్యాచరణ రూపొందించాం. అధికారంలోకి వస్తే.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. ఐదేళ్ల వరకు ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్స్ ఫీజులు పెంచబోం. పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా పాలనా పగ్గాలు చేపట్టిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. - అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ పార్టీ అధినేత పరిణతితో ఓటేయండి.. నేడు జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ఓటరు గొప్ప పరిణతితో ఓటెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్‌ను విధ్వంస కేంద్రంగా చూడాలనుకుంటున్న పార్టీలకు, వంత పాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 19 నెలల్లో గాలి మేడలు తప్ప, వాస్తవ పనులేమీ చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం మా కూటమికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. - జి.కిషన్‌రెడ్డి ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాస్వామ్య రక్షణకు ఓటే కీలకం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. నగరంలో ఓటు హక్కు ఉన్న వారంతా విధిగా దాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో కీలకమని గుర్తుంచుకోవాలి. మంగళవారం ఉదయం 8 గంటలకు కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. ఇలాగే ప్రతి ఒక్కరూ తమతమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్ నేను వేశా.. మీరూ వేయండి ఓటు అనేది రాజ్యాంగం మనకు ప్రసాదించిన అమూల్యమైన హక్కు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకు లేని వరం మనకు లభించింది. మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం ఈ హక్కు కల్పిస్తోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలి. అందుకు అవసరమైన, అనువైన వాతావరణాన్ని మేం కల్పిస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నా. మీరూ ఓటు అవకాశాన్ని స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ మీరు సిద్ధమా.. నేను బేగంపేట చిన్మయి స్కూల్లో ఉదయం 7 గంటలకే ఓటేస్తున్నా. మరి మీరూ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రెడీ అవ్వండి. అన్ని వర్గాలవారూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచండి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మీకు కేటాయించిన పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటెయ్యండి. - జనార్దన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా.. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలి. ఓటు కోసం కచ్చితంగా సమయం కేటాయించండి. ఎన్నిక ఏదైనా ఓటు ఒక్కటే. అది అసెంబ్లీనా.. లోక్‌సభనా.. జీహెచ్ఎంసీనా అనేది కాదు. ఓటు హక్కు వినియోగించుకుని తీరాలి. మీరు ఓటు వేయకుంటే ఎవరో ఒకరు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా. మీరూ కదలిరండి ప్రజాస్వామాన్ని కాపాడుదాం. - బ్రహ్మాజీ, సినీనటుడు సెంటిమెంట్ పాలనకు తెరదించండి ఏడాదిన్నర పాలన అంతా సెంటిమెంట్‌పైనే సాగింది. హైదరాబాద్ అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులను తాము చేసినట్టుగా చూపెట్టి, నగర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోంది. తన కుటుంబాన్ని ప్రమోట్ చేసుకునేందుకు కేసీఆర్ ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. విజ్ఞులైన నగర ప్రజలు.. చేతల మనుషులు ఎవరు, మాటల మనుషులు ఎవరన్న అంశాన్ని గమనించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.- ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీపీసీ అధ్యక్షుడు గ్రేటర్లో గట్టి పోటీ.. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి గట్టి పోటీనివ్వడం ఖాయం. ప్రచార కార్యక్రమాన్ని సాధారణ ప్రజలకు చేరాలా చేశాం. పేదలకు ఏ కష్టమొచ్చినా వారి పక్షాన నిలిచి పోరాడేది మేమే. నగర ఓటర్లు రాజకీయ విలువలు పెంపొందించే పార్టీలకే పట్టం కట్టాలని కోరుతున్నా. పన్నెండు నియోజకవర్గాల పరిధిలోని 50-60 సీట్లలో ఇతర పార్టీల గెలుపు, ఓటమిని వన్ హైదరాబాద్ కూటమి నిర్ణయిస్తుంది. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించే బలాన్నివ్వండి.. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరిచి, కేసీఆర్ పాలనలో తప్పులను ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలని నగర ప్రజలను కోరుతున్నా. ఇష్టం వచ్చిన రీతిలో పాలన సాగించాలని భావిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని అదుపులో పెట్టాలంటే హైదరాబాద్ ఓటరు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మాటలు తప్ప, చేతలు చేయని ఈ సర్కారుకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం ఇదే. - ఎ. రేవంత్‌రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు -
ఎక్కడ... ఎందరంటే...!
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. అత్యధికంగా జంగమ్మెట్ వార్డులో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీ చేస్తున్న వార్డుల్లో చావ్ని, నవాబ్ సాహెబ్‌కుంట, సులేమాన్‌నగర్, దత్తాత్రేయ నగర్, గోల్కొండ, నానల్‌నగర్, అహ్మద్‌నగర్, చందానగర్లు ఉన్నాయి. సూరారంలో 21 మంది, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో 18 మంది, రామంతాపూర్‌లో 17 మంది, బాలానగర్‌లో 17 మంది బరిలో ఉన్నారు.15 మంది పోటీ చేస్తున్న వార్డులు: లింగోజిగూడ, సుభాష్‌నగర్, మల్కాజిగిరి.13 మంది పోటీ చేస్తున్న వార్డులు: వెంగళ్రావునగర్, మూసాపేట, నేరేడ్మెట్, రామ్‌నగర్ 11 వార్డుల్లో 12 మంది అభ్యర్థులు, 15 వార్డుల్లో 11 మంది వంతున, 18 వార్డుల్లో పదిమంది చొప్పున రంగంలో ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు: 7,802 పోలింగ్ పార్టీలు: 9,352 (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ ఆపీసర్లు ఉన్నారు. ఓటర్లు 1200 కన్నామించిన పోలింగ్ కేంద్రాల్లో మరో అధికారిని అదనంగా నియమించారు.) అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 1500 మంది మైక్రోఅబ్జర్వర్లు. 3000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు. వాటి ద్వారా పరిస్థితిని ఆన్లైన్లో వీక్షించేలా పోలీస్ కంట్రోల్ రూమ్, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు. ఎన్నికల విధులకు హాజరవుతున్న పొరుగు జిల్లాల ఉపాధ్యాయులకు 3వ తేదీన వేతనంతో కూడిన సెలవు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు. ఎన్నికలు.. లెక్కలు పార్టీ పోటీ చేస్తున్న వార్డులు టీఆర్ఎస్ 150 టీడీపీ 95 కాంగ్రెస్ 149 బీజేపీ 66 ఎంఐఎం 60 బీఎస్పీ 55 సీపీఐ 21 సీపీఎం 22 లోక్‌సత్తా 26 రిజస్టర్డు పార్టీలు 49 ఇండిపెండెంట్లు 640 సంక్షిప్తంగా.. జీహెచ్ఎంసీ విస్తీర్ణం : 625 చ.కి.మీ. మొత్తం ఓటర్లు : 74,23,980 పురుషులు : 39,69, 007 మహిళు : 34,53,910 ఇతరులు : 1163 మొత్తం అభ్యర్థులు: 1333 రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఇలా.. ఎస్టీ జనరల్ : 1 ఎస్టీ మహిళ :1 ఎస్సీ జనరల్ :5 ఎస్సీ మహిళ :5 బీసీ జనరల్ :25 బీసీ మహిళ :25 మహిళ జనరల్ : 44 అన్ రిజర్వుడు (ఓపెన్): 44 -
మేయర్ ఎన్నికలో ఆ ఎంపీలు ఓటేయవచ్చా?
ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై న్యాయ సందేహం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నలుగురు రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం పై సందేహం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసంతో పాటు ఓటు హక్కున్న ఎంపీలు కె.కేశవరావు, చిరంజీవి, జైరామ్మ్రేశ్, మహమ్మద్ అలీఖాన్‌లకు మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించాలా, వద్దా అన్నది తేల్చుకోలేక ఉన్నధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై న్యాయశాఖ కూడా ఎటూ తేల్చలేక.. ఏజీ సలహా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యమున్న 18మంది రాజ్యసభ సభ్యులను విభజన అనంతరం ఏపీ, తెలంగాణలకు డ్రా పద్ధతిలో కేటాయించారు. అందులో తెలంగాణకు కేవీపీ రామచందర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, జి.సుధారాణి, జి.మోహన్‌రావు, వీహెచ్ రాగా... ఏపీకి రేణుకాచౌదరి, సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్, తోట సీతారామలక్ష్మి, కేకే, చిరంజీవి, జైరాంరమేశ్, అలీఖాన్ వచ్చారు. కేకే, చిరంజీవి, జైరాం రమేశ్, అలీఖాన్‌లకు హైదరాబాద్‌లో ఓటుహక్కుంది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుల హోదాపై గందరగోళం తలెత్తింది. ఏజీ సూచనల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. -
ఓటేద్దాం..పదండి..!
సిటీబ్యూరో: ‘స్థానిక సంస్థకు ప్రజాప్రతినిధుల ను ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. సెల విచ్చారు కదా అని బద్ధకించకండి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని వినియోగించండి’ అని చెబుతున్నారు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛంద సంస్థ లూ ఇదే మాట చెబుతున్నాయి. గతంలో పోలింగ్ కేం ద్రం ఎక్కడో తెలియదనే బాధ ఉండేది. ఇప్పుడా దుస్థితి లేదు. వెబ్, మొబైల్ ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. వాటి ద్వారా వివరాలు పొంది.. కాగితం మీద రాసుకొని వెళ్లినా సరిపోతుంది. అదీ కుదరకుంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు వివరాలు తెలిపే సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం? కదలండి. వెబ్సైట్ ద్వారా ఇలా ఓటరు స్లిప్ పొందవచ్చు ఎపిక్ కార్డు లేని పక్షంలో సర్కిల్, వార్డులను సం బంధిత కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్ నెంబరు, పే రు వివరాల్లో ఏ ఆప్షన్‌ను తీసుకున్నా సరిపోతుం ది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది.ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే... ఆ ఆప్షన్‌పై టిక్ చేసి స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని నమోదు చేసినా వాటితో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి.ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆ పేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డు నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబర్, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా సేవ్ చేసుకొని తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు. వివరాలు రాసుకున్నా చాలు. పోలింగ్ కేంద్రంలో చెబితే త్వరితంగా ఓటు వేయవ చ్చు నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈ స దుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి కోరారు. యాప్ ద్వారా ఇలా.. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.సెర్చ్‌లో టీఎస్ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘టీఎస్ ఎలెక్షన్ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరు స్లిప్ వస్తుంది. ఈ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. -
గ్రేట్ ఎన్నిక
మొత్తం డివిజన్లు : 150 పోలింగ్ కేంద్రాలు : 7,802 {పధాన పోలింగ్ కేంద్రాలు : 7,757 అనుబంధ పోలింగ్ కేంద్రాలు : 45 పోలింగ్ లొకేషన్లు : 3,117 ఓటు... వజ్రాయుధం-సకల సమస్యలకు పరిష్కార మార్గం సమష్టిగా కదులుదాం - జన చైతన్యమై నినదిద్దాం అందరం ఓటేసి తీరుదాం... సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. ఇన్నాళ్లూ నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతల భవితవ్యం ఈవీఎంలలోకి చేర బోతోంది. అయిదేళ్ల కాలానికి తమను పాలించేదెవరో ఓటరు దేవుడు నిర్ణయించబోతున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ పక్షాలతో పాటు ఎన్నికల యంత్రాంగానికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదిపితే... పోలింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గ్రేటర్ ఫలితాలు రాజకీయ పక్షాల భవిష్యత్‌ను నిర్దేశించే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకున్నాయి. అభివృద్ధిని కొనసాగించాలంటే తమను బలపరచాలని టీఆర్ఎస్ జనానికి విజ్ఞప్తి చేస్తే... తమ అభ్యర్థులకే మద్దతిచ్చి... కేసీఆర్ పాలనను తిరస్కరించాలంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు పిలుపునిచ్చాయి. అన్నిటికీమించి ఈ ఎన్నికల్లో ఎంపీ కేశవరావు కూతురు విజయలక్ష్మి... మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మాజీ మంత్రులు ఎ.నరేంద్ర సతీమణి, మేచినేని కిషన్‌రావు కుమారుడు శ్రీనివాసరావు, మహేశ్వరం, మల్కాజిగిరి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కనకారెడ్డి, సాయన్నల కోడళ్లు, కూతుళ్లతో పాటు మాజీ మేయర్లు బండ కార్తీకరెడ్డి, మాజిద్‌హుస్సేన్ బరిలో ఉండటంతో సంబంధిత డివిజన్లలో పోటీ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ పెంచేందుకు ప్రత్యేక కసరత్తు నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2002 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 41 శాతం, 2009లో 42 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి 50 శాతాన్ని దాటించే దిశగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఓటరు స్లిప్పులను ఇంటింటికీ పంచడంతో పాటు వెబ్, యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. స్వచ్ఛంద సంస్థలతో ‘లెట్స్ ద ఓట్’ అంటూ ముమ్మరంగా ప్రచారం చేసింది. భారీగా పోలింగ్ నమోదయ్యే కాలనీలు, బస్తీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలకు సిఫారసు చేయాలని భావిస్తోంది. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న కాలనీలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించింది. వెబ్సైట్ ద్వారా ఇలా ఓటరు స్లిప్ పొందవచ్చు ‘డౌన్లోడ్ ఓటర్ స్లిప్’ పై క్లిక్ చేయాలి. డౌన్లోడ్ జీహెచ్ఎంసీ ఓటరు స్లిప్ అని వస్తుంది.సర్కిల్, వార్డు, డోర్ నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు తెలపాల్సిందిగా సూచిస్తుంది. ఎపిక్ నెంబరు (ఓటరు గుర్తింపు కార్డు నెంబరు) నమోదు చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. -
ఎన్నికల్లో టీఆర్ఎస్ అరాచకం
♦ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ధ్వజం ♦ జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఇక్కడే తిష్ట వేశారు ♦ అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసులు, అధికారులు ♦ అడ్డుకోవాలని గవర్నర్‌కు వినతి సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డబ్బులు, మద్యం పంచుతూ టీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇతర పార్టీల నేతలను బెదిరిస్తూ, దాడులు చేస్తూ అధికార పార్టీ అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ నేతల అరాచకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ ఎమ్మెల్యే ప్రభాకర్‌పై, కార్యకర్తలపై దాడికి దిగడమే కాకుండా ఎదురుకేసులు పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల అక్రమాలను పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ధృతరాష్ట్రుల్లాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రచారం గడువు ముగిసినా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను హైదరాబాద్ నుంచి తిరిగి ఎందుకు పంపలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ను టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తోందని, అధికారులు కూడా టీఆర్ఎస్కే వంతపాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌కు వస్తున్న సింగూరు నీటిని సిద్దిపేటకు తరలించిన కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పాతబస్తీలో ఎంఐఎంకు అనుకూలంగా బీజేపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ, భయపెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం కబంధహస్తాల నుంచి హైదరాబాద్‌ను కాపాడాలంటే బీజేపీని గెలిపించడం ఒక్కటే మార్గమన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ, డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను పట్టిస్తే తనపైనే అక్రమకేసులు పెట్టారని, ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆ వీడియోలను రామచందర్‌రావు మీడియాకు ప్రదర్శించారు. గవర్నర్ ఫిర్యాదు ఎన్నికల్లో అధికారపార్టీ చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచందర్‌రావు, ఎన్వీఎస్ ప్రభాకర్, జి.ప్రేమేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు సోమవారం గవర్నర్‌ను కలిశారు. ఇతర జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో తిష్టవేసి, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓటర్ల స్లిప్పులను అందించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేయాలని కోరారు. -
ఓటరు స్లిప్ పొందండిలా..
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఇప్పటికే చాలామంది ఇళ్లకు పోలింగ్ సిబ్బంది వెళ్లి వారి పోలింగ్‌కేంద్రం, ఓటరు క్రమసంఖ్య వివరాలు తెలిపే ఓటరుస్లిప్‌లు అందజేశారు. నాలుగు లక్షలమందికి పైగా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు రెండు లక్షల మంది మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఇవి పొందని వారు పలు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా వెబ్సైట్ నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (్టట్ఛఛి.జౌఠి.జీ)లోకి వెళ్లాలి. అందులో ... ► ‘డౌన్లోడ్ ఓటర్ స్లిప్’పై క్లిక్ చేయాలి. ► డౌన్లోడ్ జీహెచ్ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది. ► సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు తెలపాల్సిందిగా సూచిస్తుంది. ఎపిక్నెంబరు(ఓటరు గుర్తింపుకార్డునెంబరు) నమోదు చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ► ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీచేశాక డోర్ నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది. ► ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని టైప్ చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి. ► ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డునెంబరు, పోలింగ్‌స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ► మొబైల్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ సదుపాయం ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్ఎలక్షన్ కమిషన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలు వస్తాయి. ► నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈసదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. యాప్ ద్వారా ఇలా.. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ► సెర్చ్‌లో టీఎస్ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘ టీఎస్ ఎలెక్షన్ ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టల్ చేసుకోవాలి ► సదరు యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరుస్లిప్ వస్తుంది. ► సదరు వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ► ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇప్పటికే దాదాపు 45 లక్షల మందికి ఓటరుస్లిప్‌లు పంపిణీ చేశారని అధికారులు తెలిపారు. అంకెల్లో ఓటరు స్లిప్పులు వెబ్సైట్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 54,701 ఇప్పటి వరకు వెబ్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 4,63,127 మొబైల్ యాప్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 89,813 ఇప్పటి వరకు మొబైల్ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 2,75,163 -
మద్యం దుకాణాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేశారు. పోలింగ్ రోజు (ఫిబ్రవరి 2)న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆబ్కారీశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో నగరంలోని బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేశారు. అదే విధంగా ఓట్ల కౌంటింగ్ రోజు (ఫిబ్రవరి 5)న కూడా సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2న సినీ కార్మికులకు సెలవు బంజారాహిల్స్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 2న సినీ కార్మికులకు సెలవు ప్రకటించినట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమాఖ్య, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ ఆదివారం తెలిపారు. సమాఖ్య 24 అనుబంధ సంఘాల కార్మికులంతా ఈ ఎన్నికల్లో పాల్గొని తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ రోజు సినిమా షూటింగ్‌లు కూడా బంద్ చేశామని పేర్కొన్నారు. -
పేదలను పట్టించుకునే నేతలు రావాలి
కామన్ మ్యాన్ Voice నగరంలో ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్‌మెంట్‌కు వీరే బాస్‌లు. బతుకులు మాత్రం అంతంతే. పెద్ద భవంతుల కింద ఉన్న చిన్న గదిలో బతుకు బండి లాగించడం ప్రతిచోటా క నిపించే దృశ్యాలు. ఏళ్ల తరబడి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తమ లాంటివారి సంక్షేమం కోసం నేతలు ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదని అవేదన వ్యక్తం చేస్తున్నాడు రాంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ బి.రమేష్. ‘కనీసం మ్మలను అసంఘటిత రంగ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. నిత్యం అపార్ట్మెంట్లో నివసించే వారు భద్రంగా ఉండాలని పనిచేసే మా లాంటివారి బతుకులకు భరోసా కల్పించే ందుకు నేతలు ఆలోచించాలి. కనీస వేతనాలు లేకుండా ఈ పనిచేస్తూ భార్యాబిడ్డలతో బతుకుతున్నాం. మా ఇంట్లో మహిళలు ఇళ్లల్లో పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప మాకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా పోయాయి’ అని పేర్కొన్నాడు. - అంబర్‌పేట -
ఓటు వేయకుంటే హక్కు కోల్పోయినట్టే
పంజగుట్ట: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, లేనిపక్షంలో సమాజంలో ఉండే హక్కును కోల్పోతారని యువ వారధి ఆర్గనైజేషన్ ప్రతినిధి మయూర్ పట్నాల పేర్కొన్నారు. యువ వారధి ఆర్గనైజేషన్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్లో ప్రజాప్రతినిధుల తీరుపై మూడు డివిజన్లలో సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. సర్వే రిపోర్టును ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరించారు. మయూర్ మాట్లాడుతూ.. రామకృష్ణాపురం, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్లలో సుమారు 230 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిశామన్నారు. పోటీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థుల పనితీరుపై వివరాలు సేకరించినట్టు చెప్పారు. అయితే, తమ సర్వేలో కేవలం 18 శాతం మంది మాత్రమే ప్రజాప్రతినిధుల పనితీరు బాగుందని చెప్పారన్నారు. చాలా మంది మధ్యతరగతి వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నాయో తెలియదని, దిగువ మధ్యతరగతి వారు ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తే తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. పోలీస్ పెట్రోలింగ్ ఒక్కటే కాస్త మెరుగ్గా ఉందని పలువురు వెల్లడించినట్టు వివరించారు. ఐదేళ్లు పాలించే స్థానిక ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే విషయంలో జాగ్రత్తగా ఓటు వేయాలని, డబ్బులకు, ఇతర ప్రలోభాలకు లోనైతే సమస్యలు అలానే ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ ప్రతినిధులు మహేష్, నాగార్జున, యువ వారధి ప్రతినిధులు రుక్ మంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు చేసింది ఏమీ లేదు
అభివృద్ధి పేరుతో లాభపడింది ఆయనే.. ‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ సదస్సులో మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: ‘హైదరాబాద్ నగరం ఎవరో ఒక్కరు నిర్మించింది కాదు. విశిష్ట భౌగోళిక స్వరూపం కారణంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు ఈ సిటీకి మంచి మార్కెట్ తీసుకొచ్చారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కానీ ఆయన ఎంతో లాభపడ్డారు. నగర సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. ఆయన నాయకత్వంలో వచ్చే మూడేళ్లలో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’.. అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ‘సెలబ్రేటింగ్ ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఓ హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ ప్రతిజ్ఙ చేయించారు. వివిధ రంగాల నిపుణులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సుస్థిరాభివృద్ధి దిశగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిరాభివృద్ధి దిశగా నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, నగరాన్ని సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అన్ని మతాలు, వర్గాలు సమానమేనని, రంజాన్, క్రిస్మస్ పండుగలను జరిపిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడేది లేదన్నారు. అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులను మూసివేయడం ఖాయమని పేర్కొన్నారు. భవిష్యత్‌ను నిర్ణయించేది రాజకీయాలే.. మన భవిష్యత్‌ను రాజకీయాలే నిర్ణయిస్తాయని, బల్దియా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ పార్టీకి వేస్తే మీ సమస్యల పరిష్కారాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తామని భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల ఎంపికను శాస్త్రీయంగా చేపట్టలేదని, వివిధ భౌగోళిక స్వరూపాలున్న పలు నగరాలను ఒకే గాటన కట్టడం సరికాదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వార్షిక బడ్జెట్ ఆరు వేల కోట్లుంటే.. స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.100 కోట్లు ఇస్తామనడం సబబు కాదని ఆయన అన్నారు. నైబర్‌హుడ్ కమిటీల ఏర్పాటు అపార్ట్మెంట్లు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, మున్సిపల్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో నైబర్‌హుడ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు తాజాగా తాను స్వీకరించిన నేపథ్యంలో నగరంలో అన్ని ప్రాంతాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ప్రైవేటు రంగానికి దీటుగా ప్రభుత్వ రంగంలో మెరుగైన విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. ఇంకా ఏమన్నారంటే.. మెట్రో స్టేషన్లు నగర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా ఎలక్ట్రికల్ ఫీడర్ బస్సులను ఏర్పాటు చేస్తాం. వీటితో కాలుష్యం, వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా తగ్గుతుంది. చిన్న సినిమాల నిర్మాతలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. మల్టీప్లెక్స్ థియేటర్లల్లో చిన్న సినిమాల ప్రదర్శనకు చర్యలు తీసుకుంటాం.పన్నుల భారంతో సతమతమవుతున్న చిన్న ఆస్పత్రుల పరిరక్షణపై ఆస్పత్రి సంఘాలు ముందుకొస్తే వారి డిమాండ్లను పరిష్కరిస్తాం. చిన్నస్థాయి ఆఫ్ సెట్ ప్రింటింగ్ రంగానికి విద్యుత్ -
ఇళ్లలోనూ సోదాలు!
నాకాబందీలు మరింత ముమ్మరం కీలక ప్రాంతాల మ్యాపుల అధ్యయనం ఉన్నతాధికారులతో కమిషనర్ల సమీక్ష ఓటరు స్లిప్పుల పంపిణీపై నిఘా అనుమానితుల కదలికపై డేగ కన్ను సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడం... కీలక ఘట్టమైన పోలింగ్ దగ్గర పడటంతో జంట కమిషనరేట్ల పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించడానికితీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో విసృ్తత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రహదారులు, లాడ్జిలు, పబ్లిక్ ప్రదేశాలకు మా త్రమే పరిమితమైన తనిఖీలను రానున్న రెండు రోజు ల్లో అనుమానాస్పద ఇళ్లకూ విస్తరింపజేయాలని నిర్ణయించారు. దాదాపు 15 రోజులుగా పోలీసులు చేసిన తనిఖీల్లో భారీ మొత్తాలే దొరికాయి. అవి పార్టీలకు సంబంధించిన వని చెప్పడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆది, సోమవారాల్లో నిఘా, తనిఖీలు మరింత విస్తరించాలని నిర్ణయించారు. మంగళవారం పోలింగ్ ఉండటంతో ఈ రెండు రోజులూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు, మద్యం పంపిణీలు జోరుగా సాగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క కొన్ని రాజకీయ పార్టీలు ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులనూ పంపిణీకి సిద్ధం చేస్తున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయాలనూ సీరియస్‌గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జంట కమిషనర్లు పక్కా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా సమాచారం అందినా ఇళ్లలోనూ సోదాలు చేయాలని స్పష్టం చేశారు. వీటి వల్ల సామాన్యులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాపుల అధ్యయనం... మఫ్టీ సిబ్బంది ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలను అక్కడి పరిస్థితుల ఆధారంగా సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక విభాగాలుగా విభజించారు. వీటికి సంబంధించిన మ్యాపులను అధ్యయనం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో సమస్యలు సృష్టించే ఆస్కారం ఉంది? ఎటు నుంచి అల్లరి మూకలు విరుచుకుపడే ప్రమాదం ఉంది? తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మ్యాపుల్లో మార్కింగ్ చేస్తున్నారు. వీటికి అనుగుణంగా ఆ ప్రాంతాల్లో సిబ్బందిని నియమిస్తారు. పోలింగ్ రోజు కొన్ని కీలక ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను రంగంలోకి దింపనున్నారు. మహి ళా పోలీసులనూ ఎక్కువ సంఖ్యలోనే నియమిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువూ చిత్రీకరించేలా వీడి యో, డిజిటల్ కెమెరాలు వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో మఫ్టీ దళాలను రంగంలోకి దింపుతున్నారు. నగర వ్యాప్తంగా ఉండే ఈ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అనుమానాస్పద వ్యక్తులను అనునిత్యం వెంటాడుతూ ఉంటారు. సాధారణంగా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మాత్రమే మఫ్టీల్లో సంచరిస్తుంటారు. ఈసారి మాత్రం వీరితో పాటు ఇతర విభాగాల అధికారులనూ మఫ్టీల్లో మోహరిస్తున్నారు. ‘స్లిప్పర్ల’పై డేగకన్ను... నగర వ్యాప్తంగా నాకాబందీలతో పాటు ప్రత్యేకంగా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఓటరు స్లిప్పులను సరఫరా చేయడం రాజ కీయ పార్టీలకు పరిపాటి. ఈసారి ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ నిరక్షరాస్యులు తదితరులకు స్లిప్పులు పంచడానికి కొందరు సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ ‘స్లిప్పర్ల’ ద్వారా నగదు, మద్యం పంపిణీ చేయిస్తారనే అనుమానాల నేపథ్యంలో వీరి కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్, షాడో పార్టీలను రంగంలోకి దింపారు. -
సర్వం సిద్ధం!
గ్రేటర్ ఎన్నికలకు పక్కా బందోబస్తు భద్రతకు పెద్దపీట సమస్యాత్మక ప్రాంతాలపై {పత్యేక దృష్టి పోలింగ్ విధుల్లో 25 వేల మంది సిబ్బంది చెక్‌పోస్ట్‌లు, స్ట్రైకింగ్-షాడో పార్టీలు కొత్వాల్ మహేందర్‌రెడ్డి వెల్లడి సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలను అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వెల్లడిం చారు. మొత్తం 25 వేల మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. నగర పోలీసులు, ప్రత్యే క విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఇందులో ఉన్నారు. అత్యంత సమస్యాత్మ క ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కమిషనర్ చెప్పా రు. అదనపు కమిషనర్లు స్వాతి లక్రా, అంజనీకుమార్, జితేందర్, వై.నాగిరెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలివీ... పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఘట్టాన్నీ కెమెరాల్లో రికార్డు చేస్తారు. సమస్యాత్మకంగా భావించిన 3,200 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ చేస్తోంది. ఈ కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రో ల్ సెంటర్‌తో అనుసంధానించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ద్వారానూ పర్యవేక్షిస్తారు. {పతి పోలింగ్ బూత్లోనూ కనీసం ఇద్దరు చొప్పున యూనిఫాంలో పోలీసు సిబ్బంది ఉంటారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో నేరచరితుల కట్టడికి, సమస్యాత్మకంగా భావించే వారి కదలికలు కనిపెట్టడానికి ప్రత్యేక షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఘట్టం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు నగరంలో 17 కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.80 లక్షల నగదు స్వాధీ నం చేసుకున్నారు. పోలిం గ్ మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది విధుల్లో ఉంటారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లకు గార్డ్లను ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పికె ట్లు కొనసాగుతాయి. 2-3 పోలింగ్ స్టేషన్లకు ఓ రూట్ గా విభజించారు. రూట్ పార్టీలకు ఎస్ఐ నేతృత్వం వహిస్తారు. 2-3 రూట్లకు కలిపి ఏసీపీ నేతృత్వం లో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. డీసీపీలకు స్పెషల్ పార్టీ లు కేటాయించారు. ఇవి కాకుండా కమిషనర్, డీసీపీ, ఏసీ పీ, ఎస్హెచ్ఓల ఆధీనంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించా రు. వీటికి 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మం గళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమిం చిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా రు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రచారం, గుర్తు లు, బ్యానర్లు ప్రదర్శించడం, సైగలు చేయడం నిషిద్ధం. నాలుగు కేటగిరీలకే అనుమతి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే వారితో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను సైతం అనుమతించరు. సోమవారం రాత్రి నుంచి సిబ్బంది విధుల్లో ఉంటారు. బందోబస్తు ఏర్పాట్లివే... డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు: 14 పోలింగ్ సెంటర్లు: 1397 పోలింగ్ స్టేషన్లు: 4163 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు: 232 సమస్యాత్మక ప్రాంతాలు: 545 మొబైల్ పార్టీలు: 418 ట్రాఫిక్ వింగ్ చెక్‌పోస్టులు: 29 పికెట్స్: అవసరానికి అనుగుణంగా షాడో టీమ్స్: 80 స్ట్రైకింగ్ ఫోర్స్: 12 బృందాలు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్: 12 అందుబాటులో ఉండే మొత్తం సిబ్బంది: 25,624 సివిల్: 16,364 ఆర్మ్డ్ రిజర్వ్: 4860 ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు: 3000 ఎన్సీసీ క్యాడెట్లు: 1400 -
ముగిసిన ఎన్నికల ప్రచారం
ముగిసిన ఎన్నికల ప్రచారం చివరి రోజూ అగ్రనేతల విస్తృత పర్యటనలు మొదలైన ప్రలోభాలు మాణికేశ్వరీ నగర్లో కాంగ్రెస్ -టీఆర్ఎస్ల ఘర్షణ ఎన్నికల రణరంగంలో ప్రచార సంగ్రామం ముగిసింది. ప్రలోభాలకు తెర లేచింది. ఇంతవరకూ అభివృద్ధి... హామీల మంత్రాలు పఠించిన నాయకులు.. ఆదివారం సాయంత్రం నుంచి ఓటర్లను ఆక ట్టుకునేందుకు నజరానాల పంపకాల్లో మునిగారు. సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టానికి తెరపడింది. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో నగరం హోరె త్తింది. వివిధ పార్టీల అగ్రనేతలంతా నగరంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో బల ప్రదర్శనలు చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే వివిధ పార్టీల నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ... బస్తీలు, స్వయం శక్తి మహిళా సంఘాల వారిగా పోల్ మేనేజ్మెంట్లో నిమగ్నమయ్యారు. తార్నాకలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అనుచరులపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట హరి అనుచరులు దాడి చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్తీకరెడ్డి ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్-ఎంఐఎం పార్టీల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇదిలా ఉంటే బహిరంగ ప్రచారం ముగిసినా సోషల్సైట్లు, వాట్సాప్‌గ్రూపుల ద్వారా అభ్యర్థులు తమను బలపర్చాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు. చివరి రోజు అగ్రనేతల హంగామా ప్రచారం చివరి రోజున వివిధ పార్టీల అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. 150 డివిజన్లలో మొత్తం 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో వారి తర ఫున ముఖ్య నేతలు ప్రచార భారాన్ని మీద వేసుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూకట్పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఆదివారం సుడిగాలి పర్యటన చేయగా... బీజేపీ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు నగరంలో సుమారు 8 సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పక్షాన నారా లోకేష్, రేవంత్‌రెడ్డి శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పక్షాన షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, మధుయాష్కి తదితరు లు ప్రచారంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగి యటంతో అన్ని పార్టీలూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఒకరి పంపకాలను మరొకరు అడ్డుకునే దిశగా షాడో టీంలు ఏర్పాటు చేసుకున్నారు. -
ఓటర్లూ ఇవి గమనించండి...
మొబైల్ (సెల్‌ఫోన్) యాప్ ద్వారా లక్షకు పైగా ఓటర్లు తమ ఓటరు స్లిప్‌ను సెల్ఫోన్లో సేవ్ చేసుకున్నారు. ఇక వేరే స్లిప్ అవసరం లేదు.. ఫోన్లోని వివరాలే పోలింగ్ కేంద్రంలో చూపిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ..అది కుదరదు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసు కనుక ఎలాగూ పోలింగ్ కేంద్రం వరకు వెళతారు. అక్కడ త్వరితంగా మీ వివరాల్ని పోలింగ్ అధికారులు గుర్తించాలంటే పోలింగ్స్టేషన్లో ఓటరుజాబితాలో మీ వరుస నెంబరు ఎంతో రాసుకొని వెళ్లి చెప్పినా ఫరవాలేదు. గుర్తుంచుకొని చెప్పినా ఫరవాలేదు. అంతే కానీ.. సెల్ఫోన్లోనే చూపిస్తామనుకుంటే మాత్రం కుదరదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్ తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో ఓటరు స్లిప్ ఉంది కదా అని దానిని మాత్రమే తీసుకువెళ్లినా ఓటు వేసేందుకు అనుమతించరు. ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) తీసుకువెళ్లాలి. అది లేని పక్షంలో దిగువ పేర్కొన్న పత్రాల్లో దేన్నయినా వెంట తీసుకువెళ్లాలి. 1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్టు, 3.డ్రైవింగ్ లెసైన్స్, 4.పాన్ కార్డు, 5. ఉద్యోగుల గుర్తింపుకార్డు(రాష్ట్ర/కేంద్ర/ప్రభుత్వరంగ/స్థానికసంస్థ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ), 6. బ్యాంక్/పోస్టాఫీసు/కిసాన్ పాస్‌బుక్‌లు. 7.పట్టా , రిజిస్టర్డ్ డీడ్స్, 8. రేషన్‌కార్డు, 9. ఎస్సీ/ ఎస్టీ /బీసీ సర్టిఫికెట్లు 10.పెన్షన్పత్రాలు(ఎక్స్‌సర్వీస్‌మెన్ పెన్షన్ బుక్ /పెన్షన్ పేమెంట్ ఆర్డర్ / ఎక్స్ సర్వీస్మన్ల వితంతు / ఆధారపడ్డ వారి సర్టిఫికెట్స్/ వృద్ధాప్య , వితంతు పెన్షన్ ఉత్తర్వులు, 11.స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు 12.ఆయుధ లెసైన్సు, 13. వికలాంగుల సర్టిఫికెట్, 14. ఏటీఎం కార్డులు 15. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు, 16. పార్లమెంటు సభ్యుల గుర్తింపు కార్డు. 17.శాసనసభ, శాసనమండలి సభ్యుల గుర్తింపుకార్డు. 18.ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, 19.కార్మిక మంత్రిత్వ శాఖ స్కీమ్ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కార్డు, 20. నేషనల్ పాపులేషన్ స్కీమ్ ద్వారా ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 21. పట్టాదారు పాసు పుస్తకాలు. ( పైన పేర్కొన్నవాటిపై ఓటరు ఫొటో కలిగి ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్కన్నా ముందు తెరచిన ఖాతాలు / జారీ అయిన కార్డులు అయి ఉండాలి) -
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
♦ 46 వేల మంది సిబ్బంది నియామకం ♦ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి లింగోజిగూడ: ఫిబ్రవరి 2న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 46 వేల మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్బీనగర్ జంట సర్కిళ్ల(3ఎ, 3బి) కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, ఈవీఎం యంత్రాలను ఆయా కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ముందు జాగ్రత్తగా అదనంగా 27 శాతం మిషిన్లను అందుబాటులో ఉంచామన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 50 లక్షల ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారన్నారు. మరో రెండు రోజుల్లో అందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలు అందజేసి వారి తల్లిదండ్రులు ఓటేసే విధంగా కృషి చే స్తున్నామన్నారు. అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక టీమ్‌లు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాయని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేయాలి... ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ కోరారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారుల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జోనల్ అధికారులు, ఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. జోనల్ అధికారులకు వాహనాలు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ సందర్భంగా గంటకు ఒకసారి డేటాను పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఎన్నికల పరిశీలకులు దినకర్‌బాబు, ఒమర్ జలీల్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫాంహౌస్ పాలనను తిరస్కరిస్తారు
ఎవరెన్ని చెప్పినా...మాదే గెలుపు ప్రజలు మా వైపే ఉన్నారు టీఆర్ఎస్ పాలనపై విసిగిపోయారు కేసీఆర్ నిరంకుశ వైఖరి మారాలి టీడీపీ కూటమికి 70-80 స్థానాలు ఖాయం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆర్.కృష్ణయ్య అంటే...బీసీ సంఘాల ఉద్యమ నాయకుడిగా ప్రజలకు సుపరిచితుడు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగ నియామకాల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసే వ్యక్తిగా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు గుర్తుండే నాయకుడు. రెండు దశాబ్దాలకు పైగా అణగారిన వర్గాలు, వెనుబడిన కులాల హక్కుల కోసం సమరశీల ఉద్యమాలు నెరపిన వ్యక్తిగా కృష్ణయ్యకు పేరుంది. యూనివ ర్శిటీ స్థాయి నుంచే పోరాటాలకు కేరాఫ్‌గా పని చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతానన్న చంద్రబాబు నాయుడు నినాదంతో టీడీపీలో చేరిన ఆయన ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల పట్ల భిన్నాభిప్రాయాలున్నప్పటికీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు తథ్యమని పేర్కొంటున్నారు. ఎందరు నేతలు పార్టీలు మారినా...ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆర్.కృష్ణయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. - సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ కూటమి ఎన్ని స్థానాల్లో గెలువబోతోంది? గ్రేటర్లో టీడీపీ-బీజేపీ కూటమి 70-80 స్థానాల్లో గెలుస్తుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. టీఆర్ఎస్ హామీలను ప్రజలు నమ్మరు. జీహెచ్ఎంసీ అటానమస్ బాడీ. ప్రజల నుంచి వసూలయ్యే పన్నులు, ఇతరత్రా వనరుల ద్వారా వచ్చే ఆదాయం కలిపి రూ.8 వేల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ నిధులతో నగరాభివృద్ధితోపాటు, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమే లేదు. ఎంతో మంది నేతలు పార్టీలు మారుతున్నారు. రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయిస్తున్నారు. కానీ ప్రజలు అంత సులువుగా మారరు. వారు మా వైపే ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది. కొందరు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? మా పార్టీలో గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినా.. కొన్ని లోటుపాట్లు జరిగి ఉంటాయి. బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించగలిగాం. ఒక్కో సీటుకు 6-7గురు పోటీ పడినప్పుడు ఇలాంటి ప్రచారం జరగటం సహజమే. కానీ సీట్లు అమ్ముకున్న పరిస్థితులు లేవు. అలాంటివేమీ జరగలేదు. ఏం హామీలిచ్చి ప్రజలను ఓటు అడుగుతున్నారు.. గెలిస్తే ఏం చేస్తారు? కూటమి గెలిస్తే జీహెచ్ఎంసీ నిధులతో నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలన్నీ తీరుస్తాం. ఇక టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయానికి రావటం లేదు. 20 నెలల కాలంలో ఒక్కరినీ కలువలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు. చివరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులనూ కలవడం లేదు. లంచాలిచ్చే కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులను మాత్రమే కలుస్తున్నారు. ఇదేనా పాలన? ప్రజలు కావాలో...కాంట్రాక్టర్లు కావాలో కేసీఆర్ తేల్చుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పినా..ఒక్కటి కట్టలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. రైతులకు రుణ మాఫీ లేదు. దీంతో ఆయా వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. కేసీఆర్ విజయం మాదే అంటున్నారు. అవసరమైతే ఎంఐఎం మిత్ర పక్షంగా ఉంటుందంటున్నారు. దీనిపై మీరేమంటారు? అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఓటుద్వారా కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైనవారు. నాయకులను కొంటున్న టీఆర్ఎస్... ప్రజలను అంతసులువుగా తన వైపు తిప్పుకోలేదు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన విజయం తథ్యమనుకోవడం వారి భ్రమ. ఎంఐఎం కలిసినా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టం. ప్రజలను వంచించటానికి అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై మీ వైఖరి ఏమిటి? రోహిత్ ఆత్మహత్యపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్ర బాబు నాయుడు కూడా స్పందించాల్సిన స్థాయిలో స్పందించ లేదు. కేంద్రంతో ఉన్న సత్ సంబంధాల రీత్యా చంద్రబాబు విషయ పరంగానే స్పందించినట్లు తెలుస్తున్నది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరాం. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది. మీరెన్ని మార్కులు వేస్తారు? దేశంలో మోదీ పరిపాలన బాగా ఉంది. నిజాయితీగా, అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే స్థాయికి దేశాన్ని తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుంగా దేశం బాగు కోసం పని చేస్తున్నారు. ఇలాంటి ప్రధాని దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్‌కు కొత్త ఆలోచనలు ఉన్నాయి. చేయాలనే తపన ఉంది. కానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. పేదలు, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకుంటే కేసీఆర్‌కు మంచిది. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనటం లేదన్న అభిప్రాయాలపై మీ కామెంట్.... ‘ఓటుకు నోటు’ ఆరోపణలతో ఏపీ సీఎం చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే ఇద్దరి సీఎంలపై నా అభిప్రాయం చెబుతాను. ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ విషయంపై స్పష్టత ఉంది. ఇప్పటికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను. -
కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: పరిటాల సునీత
హైదరాబాద్ : టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పరిటాల సునీత శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ లో తాము గెస్ట్లమని వ్యాఖ్యానించిన తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశాయని ఈ సందర్భంగా సునీత నిప్పులు చెరిగారు. -
'లెక్క' లేదు
ఎన్నికల ఖర్చును చూపని అభ్యర్థులు కొందరి సమాచారంలో తేడా అన్ని పార్టీలదీ అదే తీరు సిటీబ్యూరో: ఓ అభ్యర్థి... ఆయన వెనుక బస్తీ నిండా కార్యకర్తలు... వాహనాల బారులు... ఇది అందరికీ కనిపించే వాస్తవం. రెండే వాహనాలు... 20 మందే కార్యకర్తలు...ఇదీ కాగితాల్లోని ‘లెక్క’. వీరికి వెచ్చించే మొత్తంలోనూ ఆ తేడా ‘చూపిస్తున్నారు’. ఇదీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము చేసే ఖర్చుకు సంబంధించి ఏ రోజుకారోజు లెక్కలను రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి. ప్రతి రోజూ కాకపోయినా.. మూడు రోజులకోమారు తమ ఖర్చులను చూపించాలి. ప్రచారంలో భాగంగా చేసే ఖర్చులన్నీ పొందుపరచాలి. అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొనే వారు వినియోగించే వాహనాలు.. వారికి అందజేసే టీలు, టిఫిన్ల నుంచి సమస్త సమాచారం పొందుపరచాలి. బహిరంగ సభల వేదికలు.. టెంట్లు, కుర్చీలకు సైతం లెక్కలు చూపాలి. గతంలో ఎన్నికలు ముగిశాక 45 రోజుల్లోగా ఖర్చులన్నీ చూపే అవకాశం ఉండేది.తాజాగా మూడు రోజులకోమారు ‘లెక్క’ చెప్పాల్సిందిగా నిబంధనలు మార్చారు. అయినప్పటికీ అభ్యర్థులెవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మొత్తం 1,333 మంది. వీరిలో దాదాపు 650 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మిగతా వారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు. అంతో ఇంతో ఇండిపెండెంట్ అభ్యర్థులే లెక్కలు చూపుతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మాత్రం రిటర్నింగ్ అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. ప్రచారానికి, లోపాయికారీ బేరాలకే తమకు సమయం సరిపోవడం లేదని... ఇప్పుడు లెక్కలు ఎలా చెప్పేదని కొందరు అభ్యర్థులు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఖర్చు భారీ... లెక్క స్వల్పం ఇప్పటికే అనేక వార్డుల్లో ఇబ్బడిముబ్బడిగా ఓటర్లకు తాయిలాల ఎర వేశారు. వివిధ వస్తువులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు ముట్టజెబుతున్నారు. ఇంకొందరికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సరఫరా చేస్తున్నారు. మహిళలు, యువకులు.. ఇలా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వారికి చీరలు, గాజులు, ప్లేట్ల నుంచి క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు... గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చే స్తున్నా రు. ఇంకొందరు నేరుగా ఓటర్లకే ఫోన్ చేసి ‘అన్నా.. మీ ఇంట్లో ఐదు ఓట్లున్నాయి.. మూడు ఫుల్‌బాటిళ్లు పంపిస్తానన్నా... జర చూడు’ అంటున్నారు. ఈ బహుమతులు, నజరానాలు ఒక ఎత్తయితే... ప్రచారం చేసే కార్యకర్తలు.. వారి విందులకు చెల్లిస్తున్నవి మరో ఎత్తు. చాలామంది అభ్యర్థులు అడ్డా మీది కూలీలనే ప్రచారాలకు తీసుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 200 మందిని వెంట తీసుకువెళ్తున్నారు. వారికి భోజనంతో పాటు ఒక పూట ప్రచారమైతే రూ.150 నుంచి రూ.200 వరకు... రెండు పూట లైతే రూ.300 నుంచి రూ. 500 వరకు చెల్లిస్తున్నారు. ఇవన్నీ లెక్కల్లో చూపడం లేదు. సాధారణ భోజన ఖర్చు మాత్ర మే చూపించే ఎత్తుగడలు వేస్తున్నారు. అంతేకాదు.. 200 మందితో ప్రచారం చేసినా... లెక్కల్లో 40 నుంచి 50 మందినే చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి నోటీసులు పంపుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 2.08 కోట్లను సర్వెలెన్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. సమాచారం కరువు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఏరోజుకారోజు వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు సెలవిచ్చినప్పటికీ... అమలు కావడం లేదు. సర్కిళ్ల స్థాయిలో లెక్కలను తాము వెల్లడించబోమని.. ప్రధాన కార్యాలయానికే పంపుతామని అక్కడ చెబుతుండగా... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ అధికారిక సమాచారం లేదు. ఈ సమాచారం తమ వద్ద లేదని చెప్పలేక... సర్కిళ్ల నుంచి పంపించలేదని చెప్పుకోలేక సంబంధిత అధికారులు సతమ తమవుతున్నారు. -
పోలీసులు తనిఖీల్లో రూ. 3.50 లక్షలు స్వాధీనం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్వాల్ లయోల కళాశాల వద్ద గురువారం తునిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు
► వడివడిగా ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు ► కౌంటింగ్‌కు ఏర్పాట్లు ► జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. దీని కోసం అధికారులు వడివడిగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పన.. అవసరమైన సిబ్బందిని నియమించడం వంటివి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ పూర్తయ్యాక కౌంటింగ్‌కు అవసరమైన కేంద్రా లు.. టేబుళ్ల ఏర్పాటు.. సిబ్బంది నియామకంలోనూ మునిగారు. ఈవీఎంలలో పొందు పరిచేందుకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. వీటి ప్రింటింగ్ పూర్తయిందని... గురువారం ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ (ఎన్నికలు)తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో అదనపు కమిషనర్ (రె వెన్యూ) శంకరయ్య, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలివీ... 24 కేంద్రాలు.. 893 టేబుళ్లు ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 4న నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం లెక్కింపుమొదలవుతుంది. దీనికి 24 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌కు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 893 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు 3,200 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలె ట్లు పంపిణీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలోనే దాదాపు 6,500 మంది రెగ్యులర్ ఉ ద్యోగులు ఉండగా... పోస్టల్ బ్యాలెట్లకు ఇప్పటి వరకు కేవలం 2,281 మంది మాత్రమేదరఖాస్తుచేసుకున్నారు. 2,677 మంది సర్వీస్ ఓటర్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు ఎదురవకుండా తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ తగలకుండా టెం ట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, విద్యుత్ సౌకర్యాలు సమకూరుస్తున్నా రు. ఈ పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తయ్యాయని... మిగతావి మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నట్లు కమిషనర్ చెప్పారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేస్తుండగా... 20 శాతం అదనంగా మొత్తం 9,352 పోలింగ్ పార్టీలను నియమించారు. (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారు.)పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా డేగకళ్లతో నిఘా పెడుతున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు రెప్పవాల్చని నిఘా కోసం 1,600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చారు. వీరు లేని ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను విని యోగిస్తారు. దీని కోసం 2,500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణనిచ్చా రు. మెక్రో అబ్జర్వర్లలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే 40,60,133 మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు.ఇందులో 33.30 లక్షల మందికి తమ సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా అందజే యగా... వెబ్సైట్ నుంచి 3,38,377 మంది, ప్రత్యేక యాప్ ద్వారా 92,047 మంది పోలింగ్ కేంద్రాల వివరాలను డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ తెలిపారు. మొత్తం ఓటర్లలో 55 శాతం మంది తమ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. ‘సంకల్పం’ పేరిట తప్పకుండా ఓటేయాల్సిందిగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ఉల్లంఘనులపై చర్యలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు 1,81,794 అనధికార కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించామన్నారు. వాహనాల్లో తరలిస్తుండగా ఇంతవరకు రూ.2,08,28,200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రూ.1.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1,059 మంది బైండోవర్ ఇప్పటి వరకు 1,059 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. 2,318 లెసైన్సు కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 511 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. -
రె‘బెల్స్’
► ‘తిరుగుబాటుదారులదే’ హవా ► అధికారిక అభ్యర్థులకు అవస్థలు ► గ్రేటర్ పోరులో అనూహ్య మలుపులు ► ప్రధాన పార్టీల్లో గుబులు సిటీబ్యూరో: గ్రేటర్ పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. అధికారిక అభ్యర్థులను ‘తిరుగుబాటుదారులు’ ముచ్చెమటలు పట్టిస్తూ ముందుకు వెళుతున్నారు. వీరి దూకుడుతో నగరంలో సుమారు 15 డివిజన్లలో పరిస్థితి తారుమారయ్యేలా కనిపిస్తోంది. సొంత పార్టీలు టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో ఆయా పార్టీల జెండాలు, నినాదాలతో వారు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. దీంతో సంబంధిత డివిజన్లలో అధికారిక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో బీఎన్‌రెడ్డి నగర్, అల్వాల్, నల్లకుంట, మచ్చబొల్లారం, సూరారం, మల్కాజిగిరి, ఫతేనగర్, అడ్డగుట్ట, తార్నాక, ఈస్ట్ ఆనంద్‌బాగ్ లతో రెబల్స్ అధికారిక అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా బీఎన్‌రెడ్డి నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్నతో పోలిస్తే రెబల్ అభ్యర్థి మాధవరం నర్సింహారావు భిన్నరీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ మొదటి నుంచీఉద్యమంలో ఉన్న వ్యక్తి కావటంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం మాధవరాన్ని బలపరుస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పోటీ పడుతున్న అల్వాల్ డివిజన్లో తోట సుజాతరెడ్డి సైతం భారీగానే ఓట్లు చీల్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈస్ట్ ఆనంద్‌భాగ్‌లో అధికారిక అభ్యర్థి నర్సింగ్‌రావుకు ఆయన సోదరుని కుమారుడు, మొన్నటి వరకు టీఆర్ఎస్ నేతగా కొనసాగిన ఆకుల రాజేందర్ కుమారుడు ఆకుల శ్రవణ్ బీఎస్పీ అభ్యర్థిగా గట్టి పోటీగా మారారు. మిగి లిన ప్రాంతాల్లోనూ అధికారిక అభ్యర్థులను ఇబ్బంది పెట్టే రీతిలో రెబల్స్వ్యూహరచన చేస్తున్నారు. ‘దేశం’-బీజేపీల్లోనూ.. వారిదే జోరు తెలుగుదేశం-బీజేపీల్లోనూ రెబల్స్ మోత మోగి స్తున్నారు. సూరారంలో అధికారిక అభ్యర్థుల కంటే తిరుగుబాటుఅభ్యర్థుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ రెబల్, మాజీ కార్పోరేటర్ పాల కృష్ణ, బీజేపీ రెబల్ శంకర్‌రెడ్డిలు అధికారిక టీడీపీ అభ్యర్థి విజయావకాశాలకు గండికొట్టే దిశ గా పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఉప్పల్‌లో అధికారిక అభ్యర్థి కంటే తిరుగుబాటు అభ్యర్థి రజిత ప్రచారాన్ని జోరెక్కించారు. -
మార్పు కోసమే వన్ హైదరాబాద్
♦ స్వచ్ఛ, అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం ♦ నిర్దిష్ట ఎజెండాతోనే కూటమి ఏర్పాటు ♦ గ్రేటర్‌లోనూ డబ్బు రాజకీయమే... ♦ గూండాలు, కబ్జాదారులు పోటీలో ఉన్నారు. ♦ ఓటర్లు ఆలోచించి ఓటేయాలి ♦ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ‘మార్పు’ కోసం అంటూ రాజకీయ రంగప్రవేశం చేసిన జయప్రకాష్ నారాయణ జేపీగా అందరికీ సుపరిచితులు. 1996లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆయన సుపరిపాలన కోసం లోక్‌సత్తా ఉద్యమం ప్రారంభించారు. 2006లో లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా విస్తరించారు. ప్రస్తుతం ఆ పార్టీకి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ పరిధిలో అవినీతిని అంతం చేయాలని, ప్రజలకు మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. డబ్బు రాజకీయాలకు ఓటర్లు చెక్‌పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసమే మొదటిసారిగా వామపక్షాలతో కలిసి ‘వన్ హైదరాబాద్’ కూటమిని ఏర్పాటు చేశామంటున్న జేపీతో.... - సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? రాజకీయాలను మార్చటానికి ‘వన్ హైదరాబాద్ కూటమి’ని ఏర్పాటు చేశాం. నిర్ధిష్టమైన ఎజెండాతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇక్కడ గెలుపోటముల అంచనాలకు వెళ్లదలుచుకోలేదు. గెలవాలన్న ఆశతో.. సంప్రదాయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి పోటీలో నిలుస్తున్నాయి. కానీ మేము అలా కాదు. నిజమైన ప్రత్యామ్నాయ విధానాలతో, ఎజెండాతో ప్రతి బస్తీలో జనాభాకు తగ్గట్టుగా అధికారాలు ప్రజల చేతిలో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది. కొన్ని పార్టీల్లో కొందరు నాయకులు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు? రాజకీయం అంటే అధికారం అనుకుంటున్నారు. అధికారం అంటే...దోచుకోవటం, పైరవీలు చేసుకోవటంగా మారింది. ఎన్నికలు ఓటు వేసే వారి గురించి కాదు, పోటీ చేసే వారి కోసమనేలా మారింది వ్యవస్థ. ఎన్నికలు జాక్‌పాట్‌గా, వ్యాపారంగా మారాయి. అందుకే ...కార్పొరేటర్ అభ్యర్థి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలను ప్రజలే అంతం చేయాలి. వామపక్షాలతో కలిసి కూటమిగా లోక్‌సత్తా పోటీ చేయటానికి కారణమేమిటి? ఈ పార్టీల మధ్య భావ సారూప్యత ఉందంటారా? ఇది నిజమైన, నిజాయితీ కలిగిన కూటమి. అధికారం ప్రజల చేతిలో ఉండాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాలను ఆహ్వానిస్తున్నాయి. అభిప్రాయభేదాలు ఏ మాత్రం లేవు. అందువల్లనే సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎజెండా లేదు. నిర్ధిష్టమైన ఎజెండా, జనం సమస్యలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నది మా కూటమే. నగర ప్రజలు గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉందనుకుంటున్నారు? ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఒక్కో డివిజన్లో రూ. 8 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1200 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పైగా టికెట్లు కూడా గూండాలు, భూ కబ్జాదారులకు ఇచ్చారు. అలాంటి వారు ప్రజలకు మంచి పనులు ఏమి చేస్తారు? గెలిచిన తర్వాత దోచుకోవటమే పరమాధిగా పైరవీలు చేసుకుంటారు. వన్ హైదరాబాద్ కూటమి దీనికి పూర్తి భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసం పని చేస్తుంది. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తుంది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు...ఒక్కటేమిటి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంది. సామాన్యుడి చేతిలో అధికారముండాలి. పన్నుకట్టే వాడే ప్రభువు కావాలని కోరుకుంటున్నాం. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు. ఇంకా ఎం చేయబోతున్నారు? హైదరాబాద్ నగరానికి కృష్ణా మూడవ దశ ద్వారా మంచినీరు రావటానికి కృషి చేశాను. దీనిపై అసెంబ్లీలో పోరాడి సాధించాను. కూకట్‌పల్లికి 8 ఎంజీడీల మంచి నీరు మాత్రమే సరఫరా అయ్యేది. ఈ నీటి సరఫరాను రెట్టింపు చేశాను. కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పైప్లైన్ల కోసమే రూ. 700 కోట్లు ఖర్చు చేశాం. మెట్రో రైలు రాక సందర్భంగా అదనంగా ఏడు రహదారులకు ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించగలిగాను. ప్రతి పాఠశాలలో మాత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్లకు భవనాలతో పాటు, ప్రసూతి వసతులు కల్పించాలని కోరాం. నగరాభివృద్ధికి మేం ప్రత్యేకంగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది? మీరెన్ని మార్కులు వేస్తారు? ఇద్దరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు. ఇద్దరికీ మార్కులు ఏమి వేయను. కానీ పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మోదీ ఆర్థిక వ్యవస్థ గట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మంచి నినాదం. ఇది ఊరు,వాడ,పట్టణం, నగర స్థాయికి చేర్చాలి. నల్లగొండలో ఒక అమ్మాయి మరుగుదొడ్డి లేదని ఆత్మహత్య చేసుకోవటం తీవ్రంగా బాధించింది. కేసీఆర్ పూర్తిగా అధికార కేంద్రీకరణతో పనిచేస్తున్నారు. మంత్రులు, అధికారుల భాగస్వామ్యం ఏమీ ఉండడం లేదు. పనులు జనం దగ్గరికి వెళ్లటం లేదు. ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఈ పద్ధతి మారితే మంచిదని నా అభిప్రాయం. మెరుగైన సమాజం కోసం...ఓటేద్దాం ‘గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కుల, మత, వర్గ విభేదాలు మరిచిపోయి మంచితనం, నిజాయితీ కలిగిన అభ్యర్థులకే ఓటు వేయాలి..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో సొసైటీ ఫర్ స్మాల్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్యం కోసం రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్లర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గతంలోకంటే ఈసారి ఓటింగ్ శాతం తప్పనిసరిగా పెరగాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు. మచ్చలేని వ్యక్తులకే ఓటేయాలని లేకుంటే..ఐదేళ్లు నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వినేష్రాజ్, ప్రధానకార్యదర్శి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. - కవాడిగూడ -
వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం
చైతన్యపురి: వాహనాల తనిఖీలలో చైతన్యపురి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం అష్టలక్ష్మీ దేవాలయం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన వాసవికాలనీకి చెందిన వ్యాపారి పాపిశెట్టి వెంకటేశ్వరరావును ఆపి సోదా చేశారు. కారులో రూ.6 లక్షలు నగదు ఉండడంతో డబ్బుకు సంబంధించిన వివరాలను అడిగారు. ఆయన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు, ఐటీ అధికారులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్ఐ కోటయ్య తేలిపారు. -
'లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. బుధవారం ఆమె 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మాట్లాడుతూ... హైదరాబాద్ లో నివసిస్తున్నవారందరూ తమవాళ్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ సమదృష్టితో చూస్తున్నారని, ఎటువంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. 'మన నగరం.. మన పార్టీ' తమ నినాదం అన్నారు. టీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల పార్టీయేనని స్పష్టం చేశారు. లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 'కారు'లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు 'సైకిల్' వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత దీమా వ్యక్తం చేశారు. -
'సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ రాజకీయాలు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి తెర తీసిందని ఆరోపించారు. ఆ ధీమాతోనే ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ సెటిలర్లకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరు మారుస్తామని చెప్పి... అంతలోనే ఓ జోకర్లా మారారని తెలంగాణ ఐటీ, పంచయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీకి కోపం వస్తుందనే... సీఎం కేసీఆర్ హెచ్సీయూకు వెళ్లలేదన్నారు. ఇతర పార్టీ నేతలను తన అధికారంతో టీఆర్ఎస్ లోబర్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని సైతం టీఆర్ఎస్ అడ్డుకుందని విమర్శించారు. ఎంఐఎం, బీజేపీలు మతతత్వ పార్టీలని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీల వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రమాదంలో పడిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఈ మూడు పార్టీలు తమ ద్వేషపూరిత విధానాన్ని తీవ్రతరం చేస్తాయన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు పరస్పరం అవగాహనతో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. -
పాచిక పారదు
సెంటిమెంట్ ♦ గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు మావే... ♦ కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల్లో చూపిస్తాం... ♦ పండగలు, సెలవులతో కేసీఆర్.. విదేశాల్లో మోదీ టైంపాస్ ♦ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కా హైదరాబాదీ. నగరంలోనే పుట్టి పెరిగారు. క్రమశిక్షణ కలిగిన ‘సైనికుడు’. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నగరంలో పూర్తిచేసి.. ఆపై నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. భారత వైమానిక దళంలో పనిచేసి 1992లో రాజకీయాల్లో చేరేందుకు కెప్టెన్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష హోదాలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంపకం.. మొదలుకుని ప్రచార వ్యూహాలన్నింటిలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఉత్తమ్ సెంటిమెంట్ మాటలు చెప్పే పార్టీల ప్రచారానికి మోసపోవద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదంటున్నారు. తమ అభ్యర్థుల విజయానికి విస్తృత స్థాయిలో పాదయాత్రలు, రోడ్డు షోల్లో నిమగ్నమైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ ఇంటర్వ్యూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో తప్పకుండా విజయం సాధించబోతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ఈ మారు పోటీకి పెట్టాం. మాటలు చెప్పే వారిని కాకుండా చేతలు చేసే వారిని పోటీలో నిలిపాం. ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆడంబ రాలు, హడావుడి లేకుండా సెలైంట్‌గా ముందుకు పోవాలని నిర్ణయించాం. ఖచ్చితంగా 150 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించి తీరుతారన్న విశ్వాసం ఉంది. 29,30 తేదీల్లో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్‌లు ప్రచారంలో పాలుపంచుకోబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది.. కొందరు సీట్లు అమ్మారన్న ఆరోపణలు వచ్చాయి కదా.. అదంతా పచ్చి అబద్దం. అన్ని సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ సెలక్ట్ ఆండ్ ఎలక్ట్ పద్ధతిని పాటించాం. ఏ పార్టీ జాబితాలో లేని సామాజిక వర్గాలన్నీంటికి మా జాబితాలో స్థానం కల్పించాం. కొన్ని చోట్ల ఆరోపణలు రాగా..వాటిపై విచారణ జరిపించాం. ఎక్కడా వాస్తవం లేదు. పార్టీలో అందరి నిర్ణయం మేరకు ఎంపిక చేసిన అభ్యర్థులు వారు. పార్టీలో ఉన్న కొందరికి అవకాశం రాకపోవవచ్చు. వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. అసంతృప్తులను ఇళ్లకు వెళ్లి కలుస్తున్నాం. కాంగ్రెస్ నగరానికి ఏమీ చేయలేదని.. అందుకే ఓడించాలంటున్న టీఆర్ఎస్ పిలుపుపై ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్‌కు ఏం చేశాయని ప్రశ్నిస్తే అది వారి అమాయకత్వం తప్ప మరేమీ కాదు. అసలు ఏం చేయలేదో చెప్పమనండి. కేటీఆర్ ఇటీవలే కుత్బుల్లాపూర్ వెళ్లి గోదావరి జలాలను నెత్తిన చిలకరించుకుని తానే అపర భగీరథునిగా ప్రకటించుకున్నారు. అది నిజమేనా..ఒక్క సారి గుండెపై చేయి వేసుకుని చెప్పమనండి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జలాల తరలింపు పనులను 2008లో ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలోనే 99 శాతం పనులు పూర్తయ్యాయి. కృష్ణా 2,3 దశ పనులను ప్రారంభించింది కూడా మేమే. ఇక మెట్రో రైలు, ఔటర్‌రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, పాతబస్తీకి రూ.2000 కోట్ల ప్రాజెక్ట్, మురికివాడల్లో నిరుపేదలకు ఉచితంగా నల్లా కనెక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మౌళిక వసతుల కల్పన లాంటి గొప్ప పనులు చేసింది మా హాయాంలోనే కాదా..? సంప్రదాయానికి భిన్నంగా మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించారు.. ఎందుకు? కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం మేం కొత్త సంప్రదాయానికి తెరలేపాం. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం కూడా భారీగానే ఉంటుంది. అందుకే మేయర్ అభ్యర్థిగా ముందుగానే యువకుడు, విద్యావంతుడైన విక్రంగౌడ్ని ఎంపిక చేసి ప్రకటించాం. మా పార్టీ మాదిరిగానే మిగతా పార్టీలు కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది.. మీరెన్ని మార్కులు వేస్తారు? పందొమ్మిది నెలల కాలంలో వారి చేసిన గొప్ప పనులు ఏమున్నాయి? మార్కులు వేయడానికి.. ఎక్కువ సమయాన్ని మోదీ విదేశాల్లో గడిపితే.. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గిపోయినా తమ కక్కుర్తి కోసం డీజీల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించలేకపోయారు.‘మోదీ అయేతో..అచ్చే దిన్ ఆయేగా’అన్నారు..ఎక్కడ అచ్చేదిన్ వచ్చాయి చెప్పండి. వారి విధానాలతో రైతులు, విద్యార్థులు ‘చచ్చేదిన్’ మాత్రం వచ్చాయి. హైదరాబాద్‌కు రొటీన్‌గా వచ్చిన నిధులు తప్పితే ఒక్క రూపాయి అయినా అదనంగా రాలేదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే..సెంటిమెంట్లతో పాలన కొనసాగిస్తున్నారు. పండగలు, సెలవులు, యాగాలతో కాలం గడిపేశారు. కేసీఆర్ చెప్పేది చేయడు..చేసేది చెప్పడు అని ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఒక్క 350 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి హైదరాబాద్‌లో 3 లక్షల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు. సీమాంధ్రులను భాగోజాగో అని నేడు ఆయన కొడుకుతో క్షమాపణలు చెప్పిస్తున్నారు. ఇక ఎంఐఎం అవకాశవాద పార్టీగా తేలిపోయింది. నగర ప్రజలు తెలివైనవారు..చేతలు చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరో వారే నిర్ణయిస్తారు. అబ్బో.. ఆరోజులే వేరు! ప్రచారం శైలిలో ఎన్నిమార్పులో...అప్పట్లో గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లే మాకు ప్రచారం కల్పించేవి. మైకులు లేవు, వాహనాలు లేవు. నడిచి వెళ్తూ ప్రజలను కలిసే వాళ్లం. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం చేసేవాళ్లం..’ అంటూ తన ఎన్నికల జ్ఞాపకాలను వివరించారు మాజీ ఎంపీ వర్రి తులసీరామ్. గ్రేటర్ ఎన్నికల హంగామా గురించి ఆయన స్పందిస్తూ తాను 1971, 77, 1984 సంవత్సరాల్లో ఎన్నికలను ఎదుర్కొన్నానని, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు నుంచి ఎంపీగా మూడుసార్లు గెలిచానని చెప్పారు. ‘అప్పట్లో ఎక్కడో ఒక ప్రాంతంలో బట్టతో తయారైన బ్యానర్‌ను ఏర్పాటు చేసే వాళ్లం. అదే పెద్ద గొప్పగా భావించేవాళ్లం’ అని తెలిపారు. ఇప్పుడు ఫ్లెక్సీ లు, జెండాలు, బ్యానర్లు, టోపీలు, భారీగా వాహనాలను చూస్తుంటే..ఎన్నికల హంగామా ఇంత అవసరమా అన్పిస్తుంది. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు అప్పుడైనా..ఇప్పుడైనా చైతన్యవంతులే అనిఅన్నారు. - రాజేంద్రనగర్ -
పేరు వెనుక కథ..
నగర వాసులు రోజూ ఎన్నో ఏరియాలుచుట్టేస్తుంటారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నా.. దానికి ఆ పేరెలా వచ్చిందో తెలియదు. తెలుసుకోవాలనిపించినా చరిత్ర తిరగేసే అవకాశం, ఓపిక ఉండదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల ‘పేరు వెనుక కథ’ తెలుసుకుందాం. - సాక్షి, సిటీబ్యూరో ఖైరతాబాద్ రాకుమారి ‘ఖైరియాటున్నిసా’ పేరు మీదుగా ఖైరతాబాద్ వచ్చింది. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1518-80) కుమార్తె. ఖైరియా తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడేది. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితే నయమవుతుందని వైద్యులు సూచించారట. దీంతో కుతుబ్‌షా అల్లుడు, ఇంజినీర్ అయిన హజ్రత్ హుస్సేన్ షా వలిని రాకుమారి కోసం ప్యాలెస్, మసీదు, గార్డెన్, చెరువు నిర్మించమని సూచించాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు ‘హుస్సేన్‌సాగర్’ తవ్వించాడు వలి. రాజకుమారి పేరుమీదుగా కాలక్రమంలో ‘ఖైరతాబాద్’గా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడింది. సుల్తాన్‌బజార్ నిజాం హయాంలో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. 1933 వరకూ ఈ ప్రాంతం బ్రిటిష్ రెసిడెన్సీ పరిధిలో ఉండేది. జూన్ 14, 1933లో దీన్ని నిజాంకు అప్పగించారు. మొదట్లో రెసిడెన్సీ బజారని పిలిచినా.. నిజాం ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్‌గా మార్చారు. అప్పట్లో ఇక్కడ ఎక్కువశాతం మరాఠీలు ఉండేవారు. సోమాజిగూడ ‘సోనాజీ’ అనే పండిట్ పేరు నుంచి సోమాజిగూడ పేరు వచ్చింది. 1853 ప్రాంతంలో సోనాజీ.. నిజాం రెవిన్యూ విభాగంలో పనిచేసేవాడు. ఆయన నివసించిన భవంతి ఆ కాలంలో ఎంతో పేరుపొందింది. ఆయన మరణం తర్వాత ఆ ప్రాంతాన్ని సోనాజీగా పిలిచేశారు. కాలక్రమంలో సోమాజీగా మారింది. బషీర్‌బాగ్.. పాయిగా నవాబు అస్మన్జా బషీరుద్దౌలా బహదూర్. ఈ ప్రాంతంలో కళ్లుచెదిరే ప్యాలెస్, పార్కును కట్టించాడు. ఈ రాజభవనం చరిత్రలో కనుమరుగైనా.. పాయిగా ప్రభువు ‘బషీరుద్దౌలా’ పేరు మాత్రం ‘బషీర్‌బాగ్’గా నిలిచిపోయింది. తార్నాక.. నిజాంల హయాంలో ఈ ప్రాంతం మామిడి తోటలతో ఉండేది. వీటి రక్షణకు ముళ్లకంచె వేసి కాపలా కోసం, పహారా కాసేందుకు నిజాంలు కొందరిని నియమించారు. భద్రతా సిబ్బంది కోసం అవుట్‌హౌస్ సైతం కట్టించారు. ఉర్దూలో ‘తార్’ అంటే ‘వైరు’ అని, ‘నాకా’ అంటే ‘రక్షకభటుడి గది’ అని అర్థం. అలా తార్నాక పేరు స్థిరపడింది. -
మహానగరితో చారిత్రక బంధం అందాల ఇస్తాంబుల్..
సిటీబ్యూరో: చారిత్రక మహానగరం ఎన్నో అద్భుత కట్టడాలకు పెట్టింది పేరు. ఎంతో ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఇస్లామిక్ వాస్తురీతులు దీని సొంతం. సాఫ్ట్వేర్, వ్యాపార, వాణిజ్యానికి పుట్టినిల్లు. ఓపక్క తన వారసత్వాన్ని కాపాడుకుంటూనే విశ్వనగరి వైపు అడుగులు వేస్తోంది. బల్దియా ఎన్నికల వేళ.. అందరి దృష్టి చారిత్రక కట్టడాల పరిరక్షణ మీదకు మళ్లింది. సిటీలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. విశ్వనగరం వైపు అడుగులేయాలని సిటీజన్లు కోరుతున్నారు. ఈ క్రమంలో చరిత్ర, కట్టడాలు, వారసత్వం అంశాల్లో మన గ్రేటర్‌కు టర్కీ దేశంలో ఇస్తాంబుల్ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రెండు నగరాల చారిత్రక బంధంపై ప్రత్యేక కథనం. చారిత్రక బంధం ఇదీ.. టర్కీలోని ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక బంధాలు ఉండడం విశేషం. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్‌షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నీలోఫర్, దుర్రేషహర్లు కూడా టర్కీకి చెందినవారే. అంటే వందల ఏళ్లుగా ఇస్తాంబుల్‌కు, మన హైదరాబాద్‌తో వైవాహిక బంధాలు కూడా ఉన్నాయి. ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే...? ఇస్తాంబుల్‌లో ప్రధానంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడి చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇదే తరహాలో నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం సమయంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సిటీజన్లు కోరుతున్నారు. ఇస్తాంబుల్‌లో అవలంబించిన విధానాలతో ఆయా చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక చారిత్రక మార్కెట్లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. చారిత్రక కట్టడాలలో హోటళ్లు,రెస్టారెంట్లు ఏర్పాటుచేయడంతో వాణిజ్య కార్యకలాపాలు సైతం పెరిగాయి. అంటే ఓ నగరం కీర్తి విదేశీ పర్యాటకుల రాకతో విశ్వవ్యాప్తమవుతుండడంతో చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలను అక్కడి ప్రభుత్వం కాపాడుతోంది. ఇక్కడి ప్రముఖ కట్టడాలివే.. హగియా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్కాపీ ప్యాలెస్, బ్లూమాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ మన హైదరాబాద్ షాన్.. ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌తో అచ్చు గుద్దినట్టు పోలికుండే నగరం హైదరాబాద్. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ భవనం, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కు పైగా చారిత్రక కట్టడాలకు మన నగరం నెలవు. అయితే ఇటీవల రహదారుల విస్తరణ,మెట్రో ప్రాజెక్టు,మాస్టర్‌ప్లాన్ పనుల కారణంగా పలు చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పాతనగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్ కారణంగా సుమారు 69 వరకు ఉన్న అషుర్ఖానాలు, మసీదులు, చిల్లాలకు నష్టం వాటిల్లుతుందన్న అనుమానాలున్నాయి. ఇక డ్రైనేజి నెట్వర్క్ విస్తరణ, రహదారుల విస్తరణ జరిగిన ప్రతిసారీ చారిత్రక కట్టడాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈనేపథ్యంలో నగర మాస్టర్‌ప్లాన్‌లో పాత నగరంలోని చారిత్రక కట్టడాల మనుగడకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి ఉంది. ఇక హైటెక్‌సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవా, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి. చారిత్రక కట్టడాల నగరి.. ఇస్తాంబుల్ నగరంలో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను చారిత్రక వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. వీటి పరిరక్షణకు మాస్టర్‌ప్లాన్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. టర్కీలో అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్యప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి కట్టడాలలో కనిస్తాయి. ఎన్నో అద్భుత కళాఖండాలకు ఈ నగరం ముఖ్య కేంద్రం. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కొలువుదీరింది. ఈ నగరం పాతకొత్తల సంగమంగా కనిపిస్తుంది. ఈ నగరం మధ్య నుంచి ప్రవహించే బోస్పరస్ నది ఒడ్డున రెండు భిన్న సంస్కృతులు అభివృద్ధి చెందాయి. -
తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్న కేటీఆర్
మల్లు భట్టి విక్రమార్క ముషీరాబాద్: ‘తుపాకి రాముడు పది పిట్టలను కొట్టె ను.. నాలుగు సింహాలను వేటాడెను’ అని చెప్పుకున్నట్టు మంత్రి కేటీఆర్ చేయని పనులను చెబుతూ తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్‌మెట్ డివి జన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడిక్‌మెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.సావిత్రిని గెలిపించాలని ఇం టింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేస్తే... నగరాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభత్వం చేపట్టిందన్నారు. కాం గ్రెస్ పార్టీ మెట్రో రైలును ప్రారంభిస్తే... అక్కడికి వెళ్లి కేటీఆర్ ఫొటో లు దిగుతున్నారని... గోదావరి జలాలు నగరానికి తీసుకువస్తే, ఆ జలాలను నెత్తిన చల్లుకుంటూ తామే తీసుకొచ్చినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కాం గ్రెస్ ఇన్చార్జి డాక్టర్ వినయ్, పరిశీలకులు ఆకుల లలిత, రమాదేవి, ఇందిర, కీర్తి, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ నగరం తెలుగుదేశం హయాం లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులకు పట్టం కట్టాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం బన్సీలాల్‌పేట్ టీడీపీ అభ్యర్థి ఎం.శ్రావణి, టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేష్ గౌడ్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాచానెహ్రూ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. హైటెక్ సిటీ, 18 ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్డు అభివృద్ధి...హుసేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే సెటప్‌బాక్స్‌లు, మం చినీటి నల్లా కనెక్షన్లతో పాటు నగరంలోని పేదలకు ఏటా2 లక్షల డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నా రు. టీడీపీ సనత్‌నగర్ ఇన్చార్జి కూన వెంకటేష్ గౌడ్, అభ్యర్థి శ్రావణి, బీజేపీ నాయకులతో కలిసి బన్సీలాల్‌పేట్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవికుమార్, కుమా ర్ యాదవ్, కందికంటి విజయ్, హేమలత, సదానంద్, జహంగీర్, దశరథ్, బీజేపీ నాయకులు ఆనంద్ యాదవ్, హరినాథ్, వై.సురేష్‌కుమార్, ఎ. శ్రీనివాస్, ఎస్.వై.గిరి, పాండు, శ్రీనివాస్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
2,539 ఎకరాల భూ పందేరం
♦ వివిధ సంస్థలకు నామమాత్రపు ధరకు కేటాయింపు ♦ రూ.2 వేల కోట్లతో చంద్రన్న దళితబాట ♦ 23 వేల స్కూళ్లలో ప్రయివేటు ఏజెన్సీలకు పారిశుధ్యపనులు ♦ ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు సంస్థలకు 2,538.96 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు ప్రైవేటు సంస్థలకు నామమాత్రపు ధరకు భూములను కేటాయించాలని నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు విలేకరులకు తెలిపారు.అవి ఇలా ఉన్నాయి. పలు సంస్థలకు భూముల కేటాయింపు ఇలా ► విశాఖ జిల్లా వాకపాడులో నావల్ అల్టర్నేట్ ఆపరేషన్ బేస్ ప్రాజెక్టు (ఎన్ఈఓబీ)కి ఎకరం ఐదు లక్షల చొప్పున 1070.78 ఎకరాలు. ► అనంతపురం జిల్లా ఎన్పీ కోటలో అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నెడ్‌క్యాప్‌కు 25 సంవత్సరాల లీజుకు ఎకరం రెండు లక్షల చొప్పున 873.23 ఎకరాలు . ► కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని గోవిందపల్లెపురం, బొమ్మవారిపల్లెపురంలో ఎకరం మూడు లక్షలు చొప్పున, కర్లకుంటలో రూ. రెండు లక్షల చొప్పున 508.070 ఎకరాలు.. ఏపీఎన్బీసీకి మైనింగ్ తదితరాలకు. ► నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ‘కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్’కు ఎకరం రూ.5 లక్షల చొప్పున 46.81 ఎకరాలు. ► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారంలో డెరైక్టర్, ఎస్వీఎల్ లైఫ్ సెన్సైస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఫార్మాస్యూటికల్, నానో కార్బన్స్ యూనిట్ ఏర్పాటుకు ఎకరం ఆరు లక్షల చొప్పున 17.65 ఎకరాలు. ► చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం పెరిందేశం గ్రామంలో ఆదిత్య స్పిన్నర్స్ లిమిటెడ్ కంపెనీకి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున 5.84 ఎకరాలు. ► విశాఖ రూరల్ మండలం బక్కన్నపాలెంలో శృంగేరి మఠానికి చెందిన దేవాలయ నిర్మాణానికి 3.71 ఎకరాలు.. ఎకరం రూ.30 వేల చొప్పున కేటాయింపు. ► అనంతపురం జిల్లా కదిరి మండలం కుటాగుల్లలో బ్లూమూన్ విద్యా సంస్థ స్కూల్ భవనం నిర్మాణానికి ఎకరం రూ.4.5 లక్షల చొప్పున రెండెకరాలు. ► నెల్లూరు జిల్లా తమ్మిరిపట్నంలో ‘మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’కి ఎకరం రూ.3 లక్షల చొప్పున 7.31 ఎకరాలు, 30 ఏళ్ల లీజుకు. ► విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెంలో కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ భవన నిర్మాణానికి ఎకరం రూ.20 లక్షల చొప్పున రెండెకరాలు. ► విశాఖ రూరల్ మండలంలో సీఐడీ రీజినల్ కార్యాలయం కోసం ఉచితంగా రెండెకరాలు . త్వరలో చంద్రన్న దళితబాట.. కేబినెట్ తీసుకొన్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.... ‘‘డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ఒకే గొడుకు కిందకు తెచ్చి మార్కెటింగ్ అవకాశాలను పెంచాలి. రాష్ట్రంలోని 90 లక్షల మంది పెన్షనర్లు, ఇతర లబ్దిదారుల ఆదాయం పెంపునకు ప్రణాళిక. నిర్ణీత గడువులోపు పూర్తికాని పనులకు తిరిగి టెండర్లు పిలవాలి. అవి చేయడంలో విఫలైమైన కాంట్రాక్టర్ తిరిగి అదే ప్యాకేజీ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని తూర్పుగోదావరి జిల్లాలోని లబ్దిదారులకు ఇచ్చేందుకు రూ.55 కోట్లు మంజూరు. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీలోనూ అంతర్గత, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్ల కేటాయింపు.దీన్ని ‘చంద్రన్న దళితబాట’ పేరుతో ప్రారంభించాలని నిర్ణయం. రిపబ్లిక్‌డే సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీలను విడుదలకు నిర్ణయం. జన్మభూమిని విస్తృత పరిచి డ్వాక్రా సభ్యులకు జాబ్ కార్డులివ్వాలి. శానిటేషన్, జంగిల్ క్లియరెన్స్ పనులు వారికి కేటాయించాలి. 23 వేల స్కూళ్లలో పారిశుధ్య పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి పర్యవేక్షణ బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలి.’’ ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమర్థతను కొనియాడిన మంత్రివర్గం ఆయన సేవలను మున్ముందు వినియోగించుకోవాలని నిర్ణయించింది. మంత్రులపై బాబు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘అచ్చెన్నా.. అన్ని శాఖల గురించి ఫిర్యాదు చేయడం నీకు అలవాటైపోయింది... ముందు నీ శాఖ గురించి నువ్వు చూసుకో’ అని సీఎం చంద్రబాబు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడును హెచ్చరించారు. విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాఖలపై సమీక్ష సందర్భంగా రహదారులు, భవనాల పనితీరు పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాత్రం రోడ్లు సక్రమంగా లేవని అన్నారు. తనతో పాటు మిగిలిన వారు రోడ్లు బాగున్నాయని చెప్తుంటే అచ్చెన్నాయుడు బాగా లేవని చెప్పటంతో... ఈ మేరకు సీఎం అన్న ట్లు తెలిసింది. తనపేరుతో ప్రకటించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పథకాన్ని అభాసుపాల్జేశారంటూ బాబు వాపోయారు. ఆ శాఖమంత్రి పరిటాల సునీత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతుల నుంచి నిరసన వ్యక్తమౌతున్నా పసిగట్టడంలో విఫలమై న మంత్రులు పి. పుల్లారావు, పి. నారాయ ణ, దేవినేని ఉమాలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లో నే నిర్వహించాలని సమావేశం నిర్ణయించిం ది. మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం చేస్తానని చెప్పారు. -
ఓటర్లకు అన్ని వసతులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 7802 పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కనీస మౌలికసదుపాయాల కోసం ప్రత్యేకచర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, టెంట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, టాయ్లెట్లు తదితర సదుపాయాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికి దాదాపు 2వేల పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగతా కేంద్రాల్లోనూ మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. 27న బ్యాలెట్ పేపర్ల తనిఖీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితాతో కూడిన బ్యాలెట్‌పత్రాల ముద్రణ పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఈనెల 27న వాటిని తనిఖీ చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు/ వారు ప్రతిపాదించే ఏజెంట్ల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. ఈనెల 28వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు, నిర్వహణపై కూడా తనిఖీ నిర్వహించాల్సిందిగా సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న 70 వేల మంది ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఇప్పటి వరకు 70 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఈ యాప్‌ద్వారా 69 వేలమంది తమ ఓటరుస్లిప్‌లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా 3.12 లక్షల మంది ఓటరుస్లిప్లో డౌన్లోడ్ చేసుకున్నారని, తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా 40 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారన్నారు. ఎన్నికల సిబ్బంది ఫిబ్రవరి 1నే చేరుకోవాలి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్,కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించామన్నారు. -
హోరా హోరీ..!
తార్నాకలో ఆసక్తికర పోరు ♦ రెండోసారి బరిలో నిలిచిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి ♦ టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీ కూటమిలతో పోటాపోటీ సాక్షి, సిటీబ్యూరో తార్నాక..విద్యావంతులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాదాయవర్గాలు, చిరుద్యోగులు, రోజువారి కూలీలతో సమ్మిళితమైన ప్రాంతం. జీహెచ్ఎంసీ ఎన్నికల వేడితో ఇప్పుడది విస్తృతమైన పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తుతోంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బరిలో ఉండటంతో అందరూ ఈ డివిజన్‌పై దృష్టి సారిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలకుంట సర్వసతి, బీజేపీ అభ్యర్థిగా సూదగాని లక్ష్మీగౌడ్, టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా కోళ్ల భవానీ యాదవ్‌తో పాటు సీపీఐ అభ్యర్థిగా రాపోలు శోభారాణి, బీఎస్పీ అభ్యర్థి సుభద్రలతో పాటు మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ - టీఆర్ఎస్ - బీజేపీ మధ్యే నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డివిజన్లోని ప్రధాన సమస్యలివే... తార్నాకలో పద్నాలుగు వీధులతో పాటు లాలాపేట, మాణికేశ్వరీనగర్, రవీంద్రనగర్, ఓయూ క్యాంపులు, లక్ష్మీనగర్, శ్రీపురికాలనీ, సాయినగర్, అంబేద్కర్‌నగర్, ఇందిరానగర్, శాంతినగర్, ఆర్యనగర్, ఓల్డ్లాలాపేట, విజయడైరీ కాలనీలు అతి ముఖ్యమైనవి. ఇక్కడ పదేళ్లుగా నిలిచిపోయిన తార్నాక -లాలాపేట రోడ్డు విస్తరణ, కాలనీల మధ్య నుండి వెళ్లే ఓపెన్ నాలా, పురాతన మంచినీటి పైపులైన్లు, వినోభానగర్, సత్యనగర్‌లో నిత్యం కలుషితమయ్యే మంచినీరు, అర్హులకు పింఛన్లు రాకపోవటం, ట్రాఫిక్ రద్దీతో తార్నాకా జంక్షన్ మూత అంశాలు ప్రధాన సమస్యలు. ఇక్కడి జనాన్ని వేధిస్తున్న అంశాలు ఇవే. డివిజన్ ముఖచిత్రం మొత్తం ఓట్లు 59,735 పురుషులు 31,123 మహిళలు 28,607 ఇతరులు 5 పోటీలో ఉన్న అభ్యర్థులు బండ కార్తీకరెడ్డి - కాంగ్రెస్ ఆలకుంట సరస్వతి - టీఆర్ఎస్ సూదగాని లక్షీగౌడ్ - బీజేపీ భవానియాదవ్ - టీడీపీ రెబల్ రాపోలు శోభారాణి - సీపీఐ బొల్లం సుభద్ర - బీఎస్పీ బండ కార్తీకరెడ్డి - కాంగ్రెస్ ప్రచార సరళి: అతి పిన్న వయసులోనే నగర మేయర్ పదవి పొందిన కార్తీకరెడ్డి తార్నాక డివిజన్ నుండే రెండవ మారు పోటీ చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఐదేళ్లలో తాను మేయర్‌గా అందరికీ అందుబాటులో ఉన్నానని, రూ.46 కోట్లతో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ఆమె భరోసాతో ఉన్నారు. ఇప్పటికే డివిజన్ మొత్తాన్ని చుట్టేశారు. అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికీ వెళుతున్నారు. మరోసారి బలపర్చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. బలాలు(+): మేయర్‌గా పనిచే సిన సమయంలో వివిధ పథకాలను అమలు చేయటం, డివిజన్లో విస్తృత పరిచయాలుండటం, డివిజన్ పునర్విభజనలో 80 శాతం పాత ప్రాంతాలే ఉండటం, ఆర్థికంగా వనరులు పుష్కలంగా ఉండటం కార్తీకరెడ్డికి అనుకూలాంశాలుగా చెప్పవచ్చు. బలహీనతలు(-): మేయర్‌గా ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయాలు చేయకపోవటం, తార్నాక మెయిన్ రోడ్డు విస్తరణ, ఓపెన్ నాలా అంశాలను పరిష్కరించలేకపోవటం, మాణికేశ్వరినగర్‌కు పూర్తి కొత్త కావటం ఒకింత మైనస్‌గా చెప్పొచ్చు. ఆలకుంట సరస్వతి-టీఆర్ఎస్ ప్రచార సరళి: మాణికేశ్వరినగర్‌కు చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షులు ఆలకుంట హరి సతీమణి సరస్వతి. ఈమె గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంత్రి పద్మారావు సల హాలు సూచనలతో అసంతృప్తులకు సర్ధిచెబుతున్నారు. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని ఆశిస్తున్నారు. బలాలు(+): అధికార పార్టీ అభ్యర్థి కావడంతోపాటు మంత్రి పద్మారావు నియోజకవర్గానికి చెందిన ఏరియా కావటం, రాష్ట్రంలో అధికారం ఉండడం, ఉద్యమ ప్రభావం ఉన్న ఏరియా కావడం, పింఛన్‌దారులు, డుబల్ బెడ్రూం ఇళ్లు కావాల్సిన ఆశావహులు ఎక్కువగా ఉండటం అనుకూలాంశాలుగా చెప్పొచ్చు. బలహీనతలు(-): ఇటీవలి వరకు సీతాఫల్మండి డివిజన్లో ఉన్న ఏరియా వ్యక్తి కావటంతో తార్నాక ఏరియా జనాలకు పెద్దగా పరిచయం లేకపోవటం. ఓటు రాజకీయాలకు పూర్తి కొత్త. సొంతపార్టీలో అసంతృప్తి. సూదగాని లక్ష్మీగౌడ్ - బీజేపీ ప్రచార సరళి: టీడీపీ-బీజేపీ అవగాహనలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. త్వరలో కేంద్రమంత్రులు, కిషన్‌రెడ్డిల ఆధ్వర్యంలో రోడ్డుషోలు నిర్వహించే పనిలో ఉన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆశీస్సులతో సీటు సంపాదించిన లక్ష్మీ ఆయన సలహాలు,సూచనలతో ముందుకు సాగుతున్నారు. బలాలు(+): కేంద్రంలో అధికారంతో పాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుల సంపూర్ణ మద్దతు ఉండటం. వ్యాపారులు, ఉన్నత విద్యావంతులు తమతో కలిసివస్తారన్న విశ్వాసం. స్థానికంగా పరిచయాలు ఉండటం. ఆర్థికంగా బలంగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. బలహీనతలు(-): టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి పోటీలో ఉండటం, టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనకపోవటం, బలమైన ప్రత్యర్థులు ఉండటం, సొంత పార్టీలోనూ ఒకింత అసంతృప్తి ఉండటం మైనస్ అనొచ్చు. -
వేస్ట్ కాదు....మేమే బెస్ట్
♦ మోదీపై రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ఆరోపణలు ♦ కేసీఆర్ మెచ్చుకుంటే.. కేటీఆర్ విమర్శించడమేంటి? ♦ గ్రేటర్ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం ♦ రోహిత్ వేముల వివాదంపై విచారణ ముగిసే వరకు మాట్లాడను ♦ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనలతోనే సరిపెడుతోంది.. ♦ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ.. నగర రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. అంతకంటే ఎక్కువగా ఇటీవలి హెచ్‌సీయూ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన వ్యక్తి. సికింద్రాబాద్ లోక్‌సభ నుండి అత్యధికంగా నాలుగుమార్లు విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకుని ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ -ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీని గొప్ప నాయకుడంటూ కేసీఆర్ ఆకాశానికెత్తితే.. ఆయన కుమారుడు కేటీఆర్ మోదీ వృథా నాయకుడంటూ విమర్శలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెడతామంటున్న దత్తాత్రేయతో...ఇంటర్వ్యూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం ఎవరిది..? ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో కూడిన కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. హైదరాబాద్‌కు వాజ్‌పేయ్ హయాంలో అనేక పథకాలు తెచ్చాం. మూసీ ఆధునీకరణ, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు తదితర పథకాలకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సైతం హైదరాబాద్‌ను అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. అభివృద్ధిని, మోదీ విధానాలను మెచ్చే నగరవాసులంతా గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మళ్లీ రిపీట్ చేయబోతున్నారు.. ప్రధాని నగరాన్ని పట్టించుకోవటం లేదన్న కేటీఆర్ ఆరోపణలపై ఏమంటారు... మొన్నటి కి మొన్న సీఎం కేసీఆర్ మోదీ ఆదర్శవంతమైన(బెస్ట్) ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ మోదీని వృథా(వేస్ట్) నాయకుడంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీ నగరానికి ఏం చేయలేదంటున్నారు. శుద్ధ అబద్దం..స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.100 కోట్లను కేటాయించారు. 58 వేల ఇళ్ల నిర్మాణం కోసం రూ.480 కోట్లను, రామగుండం విద్యుత్ ప్లాంట్ కోసం రూ.9954 కోట్లు, స్మార్ట్ సిటీ పథకం కోసంర రూ.488 కోట్లు కేటాయించారు. మెట్రో రైలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలో ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ కోసం ఉత్తర-దక్షిణ గ్రిడ్ల అనుసంధానం, మల్లేపల్లి ఐటీఐని ఆదర్శవంతమైన కేంద్రంగా మార్చడం, ఆటో కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం, భవననిర్మాణ కార్మికులను ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చిన ఘనత మోదీకే దక్కింది. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు.. ఇంకా ఏం చేయబోతున్నారు? హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెట్టే కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వసేవలను ఉపయోగించుకోవటంలో రాష్ట్రం పూర్తిగా విఫలం అవుతోంది. తెలంగాణలో ప్రధాన రహదారుల విస్తరణ, ఎంఎంటీఎస్ పొడిగింపు, గడువులోగా మెట్రో పనుల పూర్తి, మూసీ ఆధునీకరణ, ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్, హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులు గడువులోగా పూర్తి చేసే దిశగా ముందుకు వెళతాం. టీడీపీ-బీజేపీలు పరస్పరం తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపారు.. ఎందుకిలా? అవును, నిజమే..బీజేపీకి కేటాయించిన 63 సీట్ల కంటే 7 సీట్లలో, టీడీపీకి కేటాయించిన 93 సీట్ల కేంటే 7 సీట్లలో అధికంగా బీ ఫారాలు ఇచ్చారు.. ఇరుపక్షాల కార్యకర్తల ఒత్తిడి ఉండటం వల్లే అలా జరిగింది. అభ్యర్థుల నుంచి మీరు, కిషన్‌రెడ్డి డబ్బులు తీసుకున్నా రన్న మీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఏం చెబుతారు.. దురదృష్టకరం. బీజేపీ అనేది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ కాదు. ఎన్నికల కమిటీయే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయిస్తుంది. రాజాసింగ్ నిరాధార ఆరోపణలు చేశారు. బీజేపీలో డబ్బులకు ప్రాధాన్యం ఇస్తే..అసలు రాజాసింగ్ నేడు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు. రాజాసింగ్ వద్ద ఏం డబ్బులుఉన్నాయని అప్పుడు టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చాం. రోహిత్ వేముల అంశం మీ పార్టీకి ఇబ్బందిగా మారిందా.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు? ఈ అంశంపై ఇప్పుడు నేనేం చెప్పలేను. కోర్టు పరిధిలో ఉంది. ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. కేంద్రంలో మోదీ - రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది..?ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు.. కేంద్రంలో గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను సవరించే విషయంలో మోదీ ముం దున్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబెట్టే క్రమంలో ఎంతో కృషి చేశారు. అవినీతి, దాపరికం లేని పాలనతో ముందుకు వెళుతున్నారు. అనేక ఫలితాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీకి నేనిచ్చే మార్కులు నూటికి నూరుశాతం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనల స్థాయిలోనే ఉంది.. ఫలితాలేవీ ప్రజలకు చేరలేదు.. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో సర్ప్లస్ బడ్జెట్ నుండి మైనస్ బడ్జెట్లోకి రాష్ట్రం వెళ్లింది. వేచి చూడాలి.. ఇప్పుడే ఏం మార్కులు ఇవ్వలేం. -
సోషల్ మీడియా వేదికగా గ్రేటర్ ప్రచారం
-
ప్రచారంలో టీఆర్ఎస్కు చేదు అనుభవం
-
విడిపోయినందునే బాగు పడుతున్నాం..!
మూసాపేట: విభజనతోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నాయని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి కె.తారకరామారావు అన్నారు. ఆది వారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధి లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మూసాపేట చౌరస్తా, బా లాజీనగర్, మోతీనగర్, అల్లాపూర్, కేపీహెచ్‌బీ చివరి బస్టాప్, కూకట్పల్లి, బా లానగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ విభజనతోనే గన్నవరం ఎయిర్‌పోర్టు, అమరావ తి, ఓడరేవులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కలిసి ఉంటే మరో 25 ఏళ్లైనా గన్నవరానికి ఎయిర్‌పోర్టు వచ్చేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణలో కేసీఆర్ ఆంద్రోళ్లను వెళ్లగొడుతారంటూ ప్రచారం చేశారని, అలాం టి ఘటనలు ఎక్కడైనా జరిగాయా అని అడిగారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు తూము శ్రావణ్‌కుమార్, పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయ ణ, పండాలసతీష్‌గౌడ్, కాండూరి నరేం ద్రచారిలను అధిక మెజార్టీతో గెలిపించాలని, డివిజన్, నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
గల్లీల నోట.. గెలుపు పాట
►గ్రేటర్లో ఇవే కీలకం ►ఓటు బ్యాంకులుగా వినియోగం ►మౌలిక సదుపాయాలకు దూరం సిటీబ్యూరో: వాళ్లు ఉన్న ఇళ్లు... కిల్లీ కొట్ల కన్న సిన్నగున్నయీ... గల్లీ సిన్నది...’ అంటూ సాగిపోయే గోరటి ఎంకన్న పాట సంగతి ఎలాగున్నా... ఇప్పుడు ఈ గల్లీలే గ్రేటర్ దశను, దిశను మలుపు తిప్పబోతున్నాయి. కోటికి చేరువైన గ్రేటర్ జనాభాలో ఎంతోమంది ఈ ఇరుకు గల్లీల్లోనే జీవనం సాగిస్తున్నారు. రాజకీయ పార్టీల హామీలకు, వాగ్దానాలకు, మేనిఫెస్టోలకు మధ్య తరగతి, ఆ పై వర్గాల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యేది... ఆకర్షితులయ్యేదీ ఇక్కడి జనాభాయే. ఏ పార్టీ నేత తమ ప్రాంతానికి వచ్చినా సాదరంగా ఆహ్వానించి... ముందు వరుసలో నిలుచొని జెండాలు మోసేదీ... నినాదాలు చే సేదీ ఈ గల్లీలే. అందుకే అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపై పడింది. కాలనీలు, అపార్ట్మెంట్ల కంటే గల్లీలను నమ్ముకుంటేనే కాసిన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయనే ఆశ కావచ్చు. తమ హమీలను నమ్మేసి... ఓట్లేసేదీ గల్లీలే అనే ధీమా కావచ్చు.కానీ మొత్తంగా అటు వామపక్షాల నుంచి ఇటు పాలక పక్షాల వరకు అన్ని పార్టీలూ గల్లీల కే జైకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లీల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.... అమలుకు నోచని హామీలు స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాల సర్వేల ప్రకారం నగరంలో మొత్తం 2,200 మురికివాడలు ఉన్నాయి. వీటిలో 1,492 బస్తీలను ప్రభుత్వం గుర్తించింది. 30 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ఇరుకు గల్లీల్లో, బస్తీల్లో అనేక సమస్యల మధ్య జీవిస్తున్నారు. దినసరి కూలీలుగా, చిరు వ్యాపారులుగా, ఇళ్లలో పనులు చేస్తూ, ఆటోలు, ట్రాలీలు నడుపుతూ బతుకుతున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ర్టం మొదలుకొని ఇప్పటి ప్రత్యేక రాష్ర్టం వరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌ను మురికివాడల రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించినవే. ఏళ్లు గడుస్తున్నాయి... ఎన్నికల పైన ఎన్నికలు వస్తూనేఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులైన గల్లీల బతుకులు మాత్రం మారడం లేదు. కనీస సదుపాయాలు కరువు మురికివాడల ప్రజల ప్రధాన సమస్య పారిశుద్ధ్య లోపం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఎన్ని వచ్చినా గల్లీల్లో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. మంచినీటి కొరత, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదు. వందలకొద్దీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గ దులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయి. నగరంలో ఒకవైపు పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. మరోవైపు పేదల బస్తీల్లోని పాఠశాలలు విచ్ఛిన్నమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల వేళ అనేక హామీలతో మేనిఫెస్టోలను ముద్రించుకొని గల్లీల్లోకి ప్రవేశిస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు బస్తీ వాసుల కనీస సదుపాయాలపై దృష్టి సారించవలసి ఉంది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించవలసి ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యులు, నర్సులు లేరు. మందులు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా లేవు. మొత్తంగా గల్లీల్లో సర్కారీ వైద్యం శిథిలమైపోతోంది. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా జనం ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆస్పత్రులకు వెళ్లవలసి వస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు,తలనొప్పి వంటి చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా అందజేయవలసిన ఐరన్ మాత్ర లూ అందుబాటులో ఉండడం లేదు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిరోధించి, స్కూల్‌కు పంపించే దిశగా కృషి చేయవలసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలూ సక్రమంగా పని చేయడం లేదు. కార్యరూపం దాల్చని హాకర్స్ పాలసీ... నగరంలోని అనేక బస్తీలు ఏళ్ల క్రితమే తమ ఉపాధికి అనుగుణంగా ఏర్పాటయ్యాయి. మార్కెట్లను, ప్రధాన కూడళ్లను ఆశ్రయించుకొని మూసీకి అటూ.. ఇటూ ఇవి ఆవిర్భవించాయి. బస్తీల జనాభాలో ఎక్కువ శాతం వీధి వ్యాపారులే. మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, ఉస్మాన్‌గంజ్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మెహదీపట్నం, తదితర ప్రధాన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వీధి వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు నాలుగు చక్రాల బండ్లతో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులకు ‘స్ట్రీట్ వెండర్స్’గా గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సామాజిక భద్రత కల్పించే దిశగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హాకర్స్ పాలసీని రూపొందించింది. వీధి వ్యాపారుల సంఖ్యపై అప్పట్లో మెప్మా అనే సంస్థ సర్వే చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలను ‘రెడ్, గ్రీన్, అంబర్’ రంగులతో హాకర్స్ జోన్‌గా విభజించారు. రెడ్జోన్లలో హాకర్స్ వ్యాపారం చేయడానికి వీల్లేదు. గ్రీన్ జోన్లో ఎప్పుడైనా అనుమతినిస్తారు. అంబర్ జోన్లలో నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. హాకర్స్ పాలసీ రూపొందించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకూ వారికి లెసైన్సులు ఇవ్వలేదు. దీంతో నిత్యం అభద్రతా భావంతో వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు. మురికివాడలను ఓటు బ్యాంకులుగా పరిగణించే దృష్టితో కాకుండా వారి సమస్యల పరిష్కారం దిశగా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి.