మిగిలేదెవరో?
►నేటితో నామినేషన్ల ఉపసంహరణకు తెర
►మధ్యాహ్నం 3 గంటలతో ముగియనున్న గడువు
► ఆలోగా బీ ఫారాలిచ్చిన వారే పార్టీల అభ్యర్థులు
► మిగతా వారు ఇండిపెండెంట్లుగా పరిగణన
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ పర్వానికి గురువారం తెరపడనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణలకు గడువు ఉంది. మొత్తం 4,039 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. బరిలో మిగిలే అభ్యర్థులెవరనేది గురువారం తేలనుంది. వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. రెబల్స్ భయం... ఇతర పార్టీల్లోకి దూకవచ్చుననే సందేహం...ప్రలోభాలకు గురవుతారేమోననే అనుమానంతో అధిక శాతం అభ్యర్థులకు బుధవారం రాత్రి వరకు బి-ఫారాలివ్వలేదు. పార్టీల తరఫున బీ ఫారాల దాఖలుకు మరికొన్ని గంటల సమయమే మిగిలింది. అన్ని పార్టీలూ మధ్యాహ్నం ఒంటిగంట తర్వా తే బీ ఫారాలిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే పార్టీల అసలు అభ్యర్థులెవరో తేలుతుంది. మిగి లిన వారిని ఇండిపెండెంట్లుగా పరిగ ణించనున్నట్టు సంబంధిత అధి కారులు తెలిపారు. మరి ఎందరు రెబల్స్ బరిలో ఉంటారో వేచి చూడాలి.
విశ్వ ప్రయత్నాలు
ఇప్పటికే కొన్ని పార్టీలు సామ,దాన, భేద దండోపాయాలతో రెబల్స్‌ను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరికొన్ని పార్టీలు ఏమీ చేయలేక చేతులెత్తేశాయి. అధిక శాతం ఉపసంహరణలు గురువారమే ఉంటాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దీనికి అనుమతించింది. సమాచారం సకాలంలో అందకపోవడంతో ఎక్కువమంది ఉపసంహరించుకోలేకపోయారు. కేవలం 71 మంది మాత్రమే ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం ఉపసంహరణలు 94కు చేరాయి. బుధవారం వరకు నామినేషన్లు సక్రమంగా ఉండి... బరిలో మిగిలిన వారు 2,543 మంది. గడువు ముగిసేలోగా ఈ సంఖ్య దాదాపు సగానికి తగ్గవచ్చని అంచనా. బుధవారం వరకు రంగంలో ఉన్న వారిలో అత్యధికంగా లింగోజిగూడ, బేగంబజార్ వార్డుల్లో 39 మంది వంతున ఉన్నారు. 30 మందికన్నా ఎక్కువ అభ్యర్థులు ఉన్న వార్డుల్లో సూరారం (37), ఆల్విన్ కాలనీ (33), బాలానగర్(33), ఈస్ట్‌ఆనంద్‌బాగ్(32), రామ్‌నగర్(31) ఉన్నాయి.
బుధవారం రాత్రి అధికారిక సమాచారం మేరకు..
మొత్తం నామినేషన్లు : 4,039
సక్రమంగా ఉన్నవి : 2,637
ఉపసంహరణలు : 94
రంగంలో ఉన్నవారు : 2,543