ఒక్క రోజే 1301 నామినేషన్లు
మొత్తం సంఖ్య 1,402
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు శనివారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం మంచిరోజు కావడంతో 1301 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) సురేంద్ర మోహన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం 1,402 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో బీఎస్‌పీ-24, బీజేపీ-120, సీపీఐ-17, సీపీఎం-15, కాంగ్రెస్-242, ఎంఐఎం-33, టీఆర్‌ఎస్-357, టీడీపీ-257, లోక్‌సత్తా-15, ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన ఇతర పార్టీలు-20, ఇండిపెండెంట్లు-302 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.
21 లోగా బీ ఫారం..
వివిధ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా భీ ఫారాలు అందజేయవ చ్చని జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండేదీ, లేనిదీ రెండు రోజుల్లో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.