ఆదివారం ఒక్కరోజే 2,616 నేడు పరిశీలన
సిటీబ్యూరో:జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో తొలి అంకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం పూర్తయింది. చివరి రోజైన ఆదివారం 2,616 నామినేషన్లు దాఖలయ్యాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మొత్తంగా 4,069 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. పార్టీల వారీగా టీఆర్‌ఎస్ నుంచి 888, కాంగ్రెస్ 698, బీజేపీ 456, టీడీపీ 688, సీపీఐ 35, బీఎస్‌పీ 108, ఎంఐఎం 89, లోక్‌సత్తా తరఫున 49 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేయించుకున్న పార్టీల నుంచి 84, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 939 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. సోమవారం వీటిని స్క్రూటినీ (పరిశీలన) చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీల టిక్కెట్లు రాకపోవడంతో బీ ఫారం సంగతి తర్వాత చూసుకోవచ్చునని భావిస్తూ హడావుడిగా నామినేషన్లు దాఖలు చేసిన వారు గణనీయంగా ఉన్నారు. స్క్రూటినీ అనంతరం ఎన్ని నామినేషన్లు మిగులుతాయో... ఎన్ని తిరస్కరణకు గురవుతాయోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు.
ఇవీ వివరాలు..
అత్యధికంగా లింగోజిగూడ వార్డుకు 74 నామినేషన్లు దాఖలయ్యాయి. దాని తర్వాత చిలుకా నగర్‌లో 69 నామినేషన్లు దాఖలయ్యాయి.50 నుంచి 65 నామినేషన్లు దాఖలైన వార్డులు తొమ్మిది ఉన్నాయి. అవి.. చైతన్యపురి(51), జాంభాగ్(54), గన్‌ఫౌండ్రి (52), రామ్ నగర్ (51), మియాపూర్ (55), బాలానగర్ (53), ఆల్విన్ కాలనీ (52), సూరారం (55), ఈస్ట్ ఆనంద్‌బాగ్(65). ఐదేసి నామినేషన్లు దాఖలైన వార్డులు: రియాసత్‌నగర్, అహ్మద్‌నగర్పది కంటే తక్కువ (సింగిల్ డిజిట్) నామినేషన్లు దాఖలైన వార్డులు మొత్తం 19.నామినేషన్ల తిరస్కరణకు పరిగణనలోకి
తీసుకునే అంశాలు...
అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి స్థానిక వార్డులో ఓటరు కాకుంటే. నామినేషన్ పత్రం నిర్ణీత నమూనాలో లేనట్లయితే.నామినేషన్ పత్రంలో నిర్ణీత ప్రదేశంలో అభ్యర్థి/ ప్రతిపాదించే వారి సంతకం లేకపోతే.నిర్ణీత మొత్తం డిపాజిట్‌గా చెల్లించనట్లయితే (ఓసీలు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ. 2, 500). అభ్యర్థి/ ప్రతిపాదించే వ్యక్తిది సరైన సంతకం కాకుంటే. ఎస్సీ/ఎస్టీ/ బీసీలకు రిజర్వయిన వార్డుల్లో వారు కాకుండా... ఇతరులు నామినేషన్ వేస్తే. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు తదితర వివరాలతో అఫిడవిట్ సమర్పించకుంటే. స్క్రూటినీ సందర్భంగా అభ్యర్థులు దగ్గర
ఉంచుకోవాల్సిన పత్రాలు..
తాజా ఓటరు జాబితాలో అభ్యర్థి పేరు ఉన్నట్లు అధీకృత ప్రతి.వయసును నిర్ధారించే ఆధారాలుడిపాజిట్ జమ చేసినట్టు తెలిపే రశీదు.నామినేషన్ దాఖలు చేసినట్లు, స్క్రూటినీ వివరాలు తెలియజేస్తూ ఇచ్చిన రశీదు.రిజర్వుడు వార్డుల్లో పోటీ చేస్తున్నవారు - ఎస్సీ/ఎస్టీ/ బీసీలుగా ధ్రువీకరణ పత్రం.
మొత్తం 4,069 నామినేషన్లు
Published Mon, Jan 18 2016 12:54 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement