→ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
→ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
→ పలు డివిజన్లలో బహుముఖ పోటీ
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల రణ రంగంలో పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య తేలింది. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ పక్రియ అనంతరం అభ్యర్థుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులు కూడా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా అన్ని డివిజన్లలోనూ బహుముఖ పోటీ నెలకొంది. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్ల నుంచి మొత్తం 1350 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన అనంతరం 56 నామినేషన్లను తిరస్కరించారు. 1294 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహ రణ గడువు ముగియగా.. 439 మంది అభ్యర్థుల తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 398 మంది అభ్యర్థులు బరిలో తలపడనున్నారు.
తీవ్ర ఉత్కంఠ..
నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఉత్కంఠ, ఉద్వే గం చోటు చేసుకుంది. బీ-ఫాంల విషయంలో అభ్యర్థులు ఉద్వేగానికి లోనయ్యారు. అధికార పార్టీ అభ్యర్థులు బీ- ఫారం కోసం నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పీఏల ద్వారా పార్టీ బీ- ఫాంలు రిటర్నింగ్ అధికారులకు అందే వరకు ఆందోళన కు గురయ్యారు. సూమారు మూడు గంటల పాటు కలవరపడిన అభ్యర్థులు తీరా బీ-ఫాంలు అందజేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మరోవైపు సొంత పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఉపసంహరించుకునే అంశం కూడా వారిని ఆందోళనకు గురిచేసింది. కొంత మంది బేరసారాలు జరిపారు, మరికొందరు నానా రకాలుగా ఆశలు చూపించారు. పార్టీల అధినేతల నుంచి బుజ్జగింపులు జరిగాయి. చివరికి తీవ్ర నిరాశతో చాలామంది బల్దియా పధాన కార్యాలయానికి వచ్చి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈక్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు, ఉపసంహరించుకున్న ఆశావహులకు నడుమ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చర్చల ద్వారా చాలా తక్కు వ మంది మాత్రమే తప్పుకోగా, ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయనే ఆరోపణలున్నాయి. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరి నుంచి తప్పుకోవాలని అధికార నేతలు సంప్రదింపులు జరపడం గమనార్హం.
బరిలో 398 మంది అభ్యర్థులు
Published Sat, Feb 27 2016 1:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement