మేయర్ పీఠం మాదే : కేటీఆర్
సనత్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లలో విజయం సాధించి మేయర్ పీఠా న్ని కైవసం చేసుకోబోతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామాత్యులు కేటీ రామారావు అన్నారు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు డివిజన్ల టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, ఎన్నికల ఇన్‌చార్జిలు, ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం అమీర్‌పేట్ సితార హోటల్‌లో జరిగింది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్, చిన్నయ్య, జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ సర్వే రిపోర్టు చూసినా టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉందన్నారు.
టికెట్లు రానివారికి పార్టీ తప్పక గుర్తించి న్యాయం చేస్తుందన్నారు. అభ్యర్థుల గెలుపునకు మనస్ఫూర్తిగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి దండె విఠల్, కార్పొరేటర్ అభ్యర్థులు కొలన్ లక్ష్మీబాల్‌రెడ్డి, శేషుకుమారి, ఉప్పల తరుణి, అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్, కురుమ హేమలత, నాయకులు బాల్‌రెడ్డి, సురేష్‌గౌడ్, సంతోష్‌సరాఫ్, ఝాన్సీరాణి, సత్యనారాయణ యాదవ్, అశోక్‌గౌడ్, నరేందర్‌రావు, కరుణాకర్‌రెడ్డి, ఎల్లావుల చక్రధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.