the Congress
-
స్వదేశానికి చేరుకున్న సోనియా
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(70) అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన సోనియా, కుమారుడు రాహుల్‌తో కలిసి గురువారం రాత్రి భారత్‌కు వచ్చారు. ఈ నెల మొదటివారంలో ఆమె రహస్యంగా అమెరికా వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఉండేందుకు రాహుల్ గాంధీ ఈనెల 16వ తేదీన అమెరికా వెళ్లారు. అనారోగ్య కారణాలతోనే ఈ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ ప్రచారం చేయలేకపోయారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే సోనియా కొత్త నిర్ణయాలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆయకట్టు బీడు వెనుక కుట్ర
కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేందుకే.. మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపణ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టును బీడు పెట్టడానికి వెనుక భారీ కుట్ర ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలను అన్ని విధాలుగా అణగదొక్కేందుకు సీఎం చంద్రబాబు స్థాయిలో కుట్ర చేశారన్నారు. హంద్రీనీవా, హెచ్చెల్సీ కలిపి 30 టీఎంసీలొచ్చినా ఆయకట్టుకు నీళ్లు వదలలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. కేవలం కుప్పంకు నీటిని తీసుకుపోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే కృష్ణా డెల్టా కింద రెండో పంటకు నీరివ్వాలని భావిస్తున్నారన్నారు. రెండేళ్లుగా జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. చెరువులకు నీళ్లిస్తున్నామని చెబుతున్నారని, శింగనమల నియోజకవర్గంలో ఏ చెరువులు నింపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికారప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం--ఎంపీ గుత్తా
తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరియైన విధానం కాదన్నారు. రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యూయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తరుుతే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు. -
సీఎస్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ
కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్‌శర్మకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు లేఖ రాశారు. తక్షణమే కాశ్మీర్‌కు ప్రత్యేక టీంను పంపించి యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మూడు రోజుల నుంచి యాత్రికులు ఇబ్బందులు పడుతోన్నారు. -
250 మంది టీఆర్ఎస్లో చేరిక
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే సభకు గైర్హాజరు
కాంగ్రెస్, టీడీపీలపై మండిపడ్డ టీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, టీడీపీలు పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్‌లో పాల్గొనకుండా పారిపోయాయని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. అరవై ఏళ్లపాటు తెలంగాణలో నీటిపారుదల రంగానికి చేసిన అన్యాయాలు, మోసాలు బయటపడి దొరికిపోతామని చర్చలో పాల్గొనకుండా పారిపోయార న్నారు. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని విమర్శిం చారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఇచ్చిన పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ అద్భుతమని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు గైర్హాజరైన ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. -
‘ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 12న ఏపీసీసీ ఆధ్వర్వంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16తేదీల్లో అన్ని జాతీయ పార్టీల నాయకులను కలిసి ప్రత్యేక హోదాతో పాటుగా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరచి అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్లో కంటి తుడుపుగా విడుదల చేసిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వాలంటే తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘హోదా’ విస్మరిస్తే కాంగ్రెస్ గతే
బస్సుయాత్ర ముగింపు సభలో నేతల హెచ్చరిక హామీ నిలబెట్టుకోవాలి తిరుపతి కల్చరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి తప్పదని నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరినాయుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని గతనెల 27న ఆప్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, నాన్ పొలిటికల్ జేఏసీ, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభిం చిన విషయం విదితమే. శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. ఎయిర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బస్సు యాత్ర ముగింపు సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ తెలుగు ప్రజల నోట్లో మట్టికొట్టిపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు 10 ఏళ్లు కావాలన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని అన్నా రు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆప్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, నవ్యాం ధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ఫ్రీ, జిల్లా కన్వీనర్ తేజ్‌ప్రకాష్, శ్రీనివాస్, కోటేశ్వరరావు, నాగేంద్ర, ఆదినారాయణ, కె.రమేష్, బాలాజి, గణేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరని జ్వాల
► గాంధీభవన్‌లో రెబల్స్ ఆందోళన ► ఉత్తమ్ కుమార్‌రెడ్డి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ► గాంధీభవన్‌కు తాళాలు నేతల తీరుపై అభ్యర్థుల నిరసన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించి.. భంగపడిన నేతలు అగ్ర నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారం గాంధీభవన్‌కు ఏకంగా తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీ పీలోనూ నిరసన మంటలు రేగాయి. చిలుకానగర్‌లో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. నాంపల్లి:సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ దగా కోరు పార్టీగా మారిపోయిందని ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు ఆరోపించారు. శుక్రవారం నాంపల్లి గాంధీభవన్‌లో బి- ఫారం అందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్ ...ఉత్తమ్ కుమార్ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌కు వచ్చే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వీరిని నిరోధించేందుకు తొలుత కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు తాళాలు వేయగా..ఆ తరువాత నేతల తీరుకు నిరసనగా రెబల్స్ తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పడిగాపులు కాశారు. విసుగు చెందిన వీరంతా చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా ముక్కూ మొహం తెలియని వారిని పోటీలో నిలిపారని ఆరోపించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్నాను: శోభారాణి గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల మహిళా కార్యకర్తగా పని చేస్తున్నాను. కార్యకర్తలు చిన్న చిన్న పదవులను ఆశిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులను ఇవ్వమన్నా ఇవ్వరు. డివిజన్ స్థాయిలో జరిగే ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇవ్వకుంటే ఎలా? లంగర్‌హౌస్ డివిజన్ పార్టీ టికెట్ అడిగితే కార్వాన్ ఇన్చార్జి రూప్సింగ్ రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఎందుకని అడిగితే ఈ డబ్బులు దానం నాగేందర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బు అడిగితే ఖర్చు చేసుకోగలం కానీ... జేబులు నింపడానికిఎక్కడ తెచ్చి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వనందుకు టికెట్ కేటాయించలేదు. బి-ఫారం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తే నకిలీది ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం? తప్పుడు బి-ఫారం ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై బేగంబజార్ పీఎస్‌లో ఫిర్యాదు చే శాను. మాయ మాటలతో ఉపసంహరింపజేశారు: రేణు కేస్వాని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే భరోసాతో ఘాన్సీ బజార్లో నామినేషన్ వేశాను. ఉపసంహరణ నాటికి బీ ఫారాన్ని ఇతరులకు ఇచ్చేశారు. గాంధీభవన్‌లో ఇదేమని ప్రశ్నిస్తే మాజీ మంత్రి షబ్బీర్ అలీ దూతగా నావద్దకు వచ్చారు. ‘మీరు నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల’ంటూ ప్రాధేయపడ్డారు. ఆ తరువాత పత్తాలేకుండా పోయారు. దగా కోరు పార్టీగా మారింది:పార్వతి శర్మ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీలో కొనసాగుతుండటమే మేం చేసిన పెద్ద తప్పు. ఇతర పార్టీల్లో చేరిన వారు పెద్ద పదవుల్లో ఉన్నారు. సీనియర్ కార్యకర్తలను కాదని ఇతరులకు బి-ఫారమ్ ఎలా ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని అడిగేందుకు గాంధీభవన్‌కు వస్తే పత్తా లేకుండాపోయారు. ఉదయం నుంచీ వేచి ఉన్నాం. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. -
మేయర్ పీఠం మాదే : కేటీఆర్
సనత్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లలో విజయం సాధించి మేయర్ పీఠా న్ని కైవసం చేసుకోబోతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామాత్యులు కేటీ రామారావు అన్నారు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం అమీర్‌పేట్ సితార హోటల్లో జరిగింది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్, చిన్నయ్య, జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ సర్వే రిపోర్టు చూసినా టీఆర్ఎస్కే అనుకూలంగా ఉందన్నారు. టికెట్లు రానివారికి పార్టీ తప్పక గుర్తించి న్యాయం చేస్తుందన్నారు. అభ్యర్థుల గెలుపునకు మనస్ఫూర్తిగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి దండె విఠల్, కార్పొరేటర్ అభ్యర్థులు కొలన్ లక్ష్మీబాల్‌రెడ్డి, శేషుకుమారి, ఉప్పల తరుణి, అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్, కురుమ హేమలత, నాయకులు బాల్‌రెడ్డి, సురేష్‌గౌడ్, సంతోష్సరాఫ్, ఝాన్సీరాణి, సత్యనారాయణ యాదవ్, అశోక్‌గౌడ్, నరేందర్‌రావు, కరుణాకర్‌రెడ్డి, ఎల్లావుల చక్రధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మహానగరంలో పరీక్ష!
హైదరాబాద్ ఎన్నికల్లో జిల్లా నేతల ప్రచారం టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు బాధ్యతలు ఫలితాల ఆధారంగా రాజకీయ భవిష్యత్తు వరంగల్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజారిటీ డివిజన్లలో గెలుపు లక్ష్యంగా రెండు ప్రధాన పార్టీలు మన జిల్లా నేతలకు కీలక బాధ్యతలను అప్పగించాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల జిల్లా నాయకులు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమకు అప్పగించిన డివిజన్లలో తమ పార్టీని గెలిపించుకోవడం ఇప్పుడు జిల్లా నేతలకు పరీక్షగా మారింది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జిల్లా నాయకులు రాజధానిలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు జరిగిన ప్రతీసారి జిల్లా నేతలు.. ఆ ఎన్నికల్లో బాధ్యతలు చేపడుతున్నారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బాధ్యతలు తీసుకున్న టీఆర్ఎస్ నేతలకు గెలు పు అంశం కీలకం కానుంది. టీఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అంతగా పట్టులేని హైదరాబాద్‌లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. తమకు కేటాయించిన డివిజన్లలో పార్టీని గెలిపిస్తే.. త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యం ఉండనుంది. భవిష్యత్ రాజకీయ అవకాశాల విషయంలోనూ గ్రేటర్ హైదరాబాద్‌లో తమ పనితీరు ప్రాతిపదిక అవుతుందని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో తమకు కేటాయించిన డివిజన్లలో పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రచార బాధ్యతల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో కొందరు పూర్తిగా అక్కడే ఉంటుండగా.. మరికొందరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ... జిల్లాలో స్థానిక కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ జిల్లా నేతలు హైదరాబాద్ ఎన్నికల ప్రచార బాధ్యతల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడంలేదు. మరో రెండుమూడు రోజుల్లో ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మల్లాపూర్ డివిజన్ ప్రచార బాధ్యతలను టీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. కడియం శ్రీహరి ఇప్పటి వరకు ఒకేరోజు డివిజన్లో పర్యటించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అ ధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ఈ డివిజన్లో ప్రచా ర బాధ్యతలను చూస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మే యర్ పదవి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ నుంచి హామీ పొందిన నన్నపునేని నరేందర్.. రాజ ధానిలో పార్టీ గెలుపు కోసం పూర్తిగా అక్కడే ఉండి ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 22 తర్వాత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ చర్లపల్లి డివిజన్లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ జగద్గిరిగుట్ట, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాదాపూర్ డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు ఏఎస్‌రావునగర్ డివిజన్లో ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు-వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలు మీర్‌పేట డివిజన్లో, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్-మంగల్హాట్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య-నాచారం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్-చిలుకానగర్, జనగామ ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి-కాప్రా, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్-ముషీరాబాద్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-రామంతాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్-బోలక్పూర్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు-దత్తాత్రేయనగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి-హబ్సిగూడ డివిజన్లలో ప్రచార బాధ్యతలు చేపట్టారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు-నల్లకుంట, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి-అక్బర్‌బాగ్, టీఆర్ఎస్ యూత్ మాజీ అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు- తలాబ్‌చంచలం, టీఆర్ఎస్వీ నేత వాసుదేవరెడ్డి- చావని, మైనారిటీ విభాగం నేత ఎం.డి.నయీముద్దీన్- ఝాన్సీబజార్, ఎం.శోభన్‌బాబు-పురానాపూల్, ఆర్.పరమేశ్వర్- గౌలిపుర డివిజన్లకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత మంగల్‌హాట్‌లో, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి చర్లపల్లి డివిజన్లో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్‌లో ముగ్గురు నలుగురు నేతలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున ప్రచార బాధ్యతలను అప్పగించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్- బహదూర్‌పుర, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి-గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో నలుగురు నేతలతో కలిసి ప్రచార చేస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ పి.బలరాంనాయక్, మాజీ మంత్రి జి.విజయరామారావు- కుత్బుల్లాపూర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య-ఉప్పల్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య-మహేశ్వరం, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి- మలక్‌పేట, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు-కంటోన్మెంట్, హరిరమాదేవి-ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార బాధ్యతలను పీసీసీ అప్పగించింది. -
'బి' టెన్షన్
గంట ముందే బీ ఫారాలు అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి ‘దూకుడు’ను అడ్డుకునేందుకే... అభ్యర్థుల్లో ఆందోళన సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు... ఇతర పార్టీల అభ్యర్థులుగా మారకూడదనే తలంపుతో వివిధ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పాటు అధికార టీఆర్ఎస్లో సైతం ఇదే పరిస్థితి. అభ్యర్థులను ప్రకటించేందుకు తాత్సారం చేసిన పార్టీలు.. బీ ఫారాలు ఇచ్చేందుకూ వెనుకాడుతున్నాయి. అన్ని పార్టీల నుంచీ ఒకరికి మించి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. వీరిలో సొంత పార్టీ బీఫారం అందని వారంతా గోడ దూకి వేరే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారేమోనని అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. దీంతో ఇప్పుడే బీ ఫారాలు ఇచ్చేందుకు సాహసించడం లేదు. నామినేషన్లు వేసిన వారిలో కొందరు స్థానికంగా పట్టున్నవారు కావడం... ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే పరిస్థితి ఉండటంతో అలాంటి వారి విషయమై పార్టీలు ఆందోళనలో ఉన్నాయి. దీంతోచివరి గంటలో మాత్రమే బీ ఫారాలు అందజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప సంహరణకు తుది గడువైన 21వ తేదీ(గురువారం) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు బీఫారాలు సమర్పించాల్సి ఉంది. ఆ వ్యవధి ముగిసేందుకు గంటో... గంటన్నర ముందు మాత్రమే బీ ఫారాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తేనే ‘దూకుడు’కు అడ్డుకట్ట వేయవచ్చనేది వారి యోచన. మంగళవారం నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశమైన టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ నాయకులు తమ అభ్యర్థులకు బుధవారం బీ ఫారాలు ఇస్తామని చెప్పారు. అయితే గడువుకు కొద్దిసేపటి ముందు మాత్రమే ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి రోజు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్దనే అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
మొత్తం 4,069 నామినేషన్లు
ఆదివారం ఒక్కరోజే 2,616 నేడు పరిశీలన సిటీబ్యూరో:జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో తొలి అంకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం పూర్తయింది. చివరి రోజైన ఆదివారం 2,616 నామినేషన్లు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మొత్తంగా 4,069 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. పార్టీల వారీగా టీఆర్ఎస్ నుంచి 888, కాంగ్రెస్ 698, బీజేపీ 456, టీడీపీ 688, సీపీఐ 35, బీఎస్పీ 108, ఎంఐఎం 89, లోక్‌సత్తా తరఫున 49 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేయించుకున్న పార్టీల నుంచి 84, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 939 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. సోమవారం వీటిని స్క్రూటినీ (పరిశీలన) చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీల టిక్కెట్లు రాకపోవడంతో బీ ఫారం సంగతి తర్వాత చూసుకోవచ్చునని భావిస్తూ హడావుడిగా నామినేషన్లు దాఖలు చేసిన వారు గణనీయంగా ఉన్నారు. స్క్రూటినీ అనంతరం ఎన్ని నామినేషన్లు మిగులుతాయో... ఎన్ని తిరస్కరణకు గురవుతాయోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఇవీ వివరాలు.. అత్యధికంగా లింగోజిగూడ వార్డుకు 74 నామినేషన్లు దాఖలయ్యాయి. దాని తర్వాత చిలుకా నగర్లో 69 నామినేషన్లు దాఖలయ్యాయి.50 నుంచి 65 నామినేషన్లు దాఖలైన వార్డులు తొమ్మిది ఉన్నాయి. అవి.. చైతన్యపురి(51), జాంభాగ్(54), గన్‌ఫౌండ్రి (52), రామ్ నగర్ (51), మియాపూర్ (55), బాలానగర్ (53), ఆల్విన్ కాలనీ (52), సూరారం (55), ఈస్ట్ ఆనంద్‌బాగ్(65). ఐదేసి నామినేషన్లు దాఖలైన వార్డులు: రియాసత్‌నగర్, అహ్మద్నగర్పది కంటే తక్కువ (సింగిల్ డిజిట్) నామినేషన్లు దాఖలైన వార్డులు మొత్తం 19.నామినేషన్ల తిరస్కరణకు పరిగణనలోకి తీసుకునే అంశాలు... అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి స్థానిక వార్డులో ఓటరు కాకుంటే. నామినేషన్ పత్రం నిర్ణీత నమూనాలో లేనట్లయితే.నామినేషన్ పత్రంలో నిర్ణీత ప్రదేశంలో అభ్యర్థి/ ప్రతిపాదించే వారి సంతకం లేకపోతే.నిర్ణీత మొత్తం డిపాజిట్‌గా చెల్లించనట్లయితే (ఓసీలు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ. 2, 500). అభ్యర్థి/ ప్రతిపాదించే వ్యక్తిది సరైన సంతకం కాకుంటే. ఎస్సీ/ఎస్టీ/ బీసీలకు రిజర్వయిన వార్డుల్లో వారు కాకుండా... ఇతరులు నామినేషన్ వేస్తే. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు తదితర వివరాలతో అఫిడవిట్ సమర్పించకుంటే. స్క్రూటినీ సందర్భంగా అభ్యర్థులు దగ్గర ఉంచుకోవాల్సిన పత్రాలు.. తాజా ఓటరు జాబితాలో అభ్యర్థి పేరు ఉన్నట్లు అధీకృత ప్రతి.వయసును నిర్ధారించే ఆధారాలుడిపాజిట్ జమ చేసినట్టు తెలిపే రశీదు.నామినేషన్ దాఖలు చేసినట్లు, స్క్రూటినీ వివరాలు తెలియజేస్తూ ఇచ్చిన రశీదు.రిజర్వుడు వార్డుల్లో పోటీ చేస్తున్నవారు - ఎస్సీ/ఎస్టీ/ బీసీలుగా ధ్రువీకరణ పత్రం. -
నేడే విడుదల
ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పోటాపోటీగా ఉన్న చోట్ల మరింత జాప్యం కాంగ్రెస్ జాబితాలో బండ కార్తీక... టీఆర్ఎస్ జాబితాలో బొంతు బస్తీల్లో ఎన్నికల ఊరేగింపులు. ప్రచారం కొత్తపుంతలు. హిమాయత్ నగర్లో ఓ పార్టీ అభ్యర్థి గంగిరెద్దుల వారి డప్పు వాయిస్తూ... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిటీబ్యూరో: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి సుమారు 51 డివిజన్లకు, కాంగ్రెస్ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గురువారం కసరత్తు పూర్తి చేశాయి. ఎంఐఎం అదే బాటలో నడుస్తోంది. టీడీపీ-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించే ందుకు యత్నిస్తోంది. తొలి జాబితాలో నియోజకవర్గాల ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్న నాయకుల కుటుంబ సభ్యులతో పాటు మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దింపే వారి పేర్లను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రాంమోహన్‌ను చర్లపల్లి డివిజన్‌కు... ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ లేదా వెంకటేశ్వర నగర్ డివిజన్లలో ఒకదానికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సుమారు 40 మందితో ఇచ్చే తొలి జాబితాలో ఏకాభిప్రాయం వచ్చిన కుత్బుల్లాపూర్‌లోని ఐదు, ఎల్బీనగర్లో ఎనిమిది డివిజన్లకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థులను గుర్తించిన డివిజన్లలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ జాబితాలో తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బౌద్ధనగర్ నుంచి ఆదం ఉమాదేవి పోటీ చేయనున్నారు. బీజేపీలో భాగ్‌అంబర్‌పేట నుంచి బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి సతీమణి పేరు తొలి జాబితాలో ప్రకటించనున్నారు. ఉత్కంఠ బల్దియా ఎన్నికల్లో పోటీ చేయనున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నారన్న సమాచారంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కె.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నగరంలో ముఖ్యనేతలు, మంత్రులు, ఇన్చార్జులతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపికపై అధినేతకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. టిక్కెట్లు ఆశించి ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరుతున్న ఆశావహుల మధ్య సిగపట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కీలక డివిజన్లకు ముగ్గురు నుంచి ఐదుగురేసి టిక్కెట్లు ఆశిస్తుండడంతోతీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇతర పార్టీల నుంచి జోరుగా టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఆశావ హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపై డివిజన్ స్థాయిలో ఐదు సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అం గబలం, అర్థబలం ఉండి.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన గెలుపు గుర్రాలకే టిక్కెట్లిస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇటీవల ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయక గణం, మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరికికార్పొరేటర్ టిక్కెట్లు ఎరజూపి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పిన విషయం విదితమే. తాజాగా చేరుతున్న వారిని తమతో కలుపుకుని వెళ్లేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులను బలవంతంగా అభ్యర్థులుగా తమపై రుద్దుతున్నారని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్న ఇన్చార్జులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు టిక్కెట్లు ఆశిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా కొందరికి టీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారైనట్లు సోషల్ మీడియా గ్రూపుల్లో సంక్షిప్త సందేశాలు అందుతుండడంతో గందరగోళం మొదలైంది. పార్టీ అధిష్టానం మాత్రం తుది జాబితా ప్రకటించలేదని... సోషల్ మీడియాలో ప్రచారం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేస్తోంది. -
టీఆర్ఎస్కు ఓటేసి మోసపోవద్దు
నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చింది పీజేఆర్ హైకోర్టు మొట్టికాయలేస్తేనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ మల్లు రవి బంజారాహిల్స్: నగరంలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోమారు ప్రజలు టీఆర్ఎస్కు ఓటేసి మోసపోవద్దని మాజీ ఎంపీ, ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులు మల్లు రవి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంగళవారం వెంకటేశ్వరనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్ గ్రౌండ్లో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గారఢీ విద్యలో సీఎం కేసీఆర్ ఆరితేరారని గత ఎన్నికల్లో కూడా తన గారఢీతో ప్రజలను మోసం చేశారని ఈసారి కూడా మోసగించేందుకు సిద్ధమవుతున్నారని వారి ఆటలు సాగనివ్వవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కళ్లబొల్లి మాటలతో మళ్లీ గెలుద్దామని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే హైదరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులని ఈ సారి గతంలో చేసిన పొరపాట్లు చేయరనే నమ్మకం ఉందన్నారు. టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని, తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నాయకత్వం అంటే మంత్రి పదవి వల్ల రాదని ప్రజల కోసం పోరాటం చేసేవారే నాయకులని అలాంటి నాయకులు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పి. జనార్ధన్‌రెడ్డి, దానం నాగేందర్ అని పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రజల హృదయాల్లో నిలబడ్డారని వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారని ప్రజలు పిలిస్తే క్షణాల్లో వెళ్లేవారని గుర్తు చేశారు. పేదల సమస్యలు తమవిగా భావించారని అందుకే ఖైరతాబాద్‌ను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చారని చెప్పారు. ఇప్పుడు ప్రజల మీద ప్రేమతో జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టడం లేదని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో పెడుతున్నారని దుయ్యబట్టారు. బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి. భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నాడు పేదలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. రేషన్‌కార్డులు తొలగించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. పింఛన్లు తీసేసి అర్హులను అడుక్కుతినేలా మార్చారని దుయ్యబట్టారు. ప్రజల బతుకులను దుర్భరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దానం నాగేందర్ తల్లి దశదిన కర్మ పూర్తయ్యేంత వరకు బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో హాజరు కాలేకపోయారు. -
‘దానం పెత్తనం వద్దు
ఏఐసీసీ ముందు పేచీ పెట్టిన రంగారెడ్డి నేతలు సిటీబ్యూరో: ‘ మాపై ఇతర నాయకుల పెత్తనం వద్దే వద్దు. బలవంతంగా దానం నాగేందర్ ఇతర నాయకులను రుద్ది మమ్మల్ని పార్టీకి దూరం చేయొద్దు. స్థానికంగా బలం, పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు న్యాయం చేసే విధంగా వ్యవహరించండి’ అంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏఐసీసీకి నేతలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎంఎల్ఏలు సుధీర్‌రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రసాద్‌కుమార్, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్లతో పాటు ఆయా నియోకవర్గాల నాయకులు బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర కమిటీ, రంగారెడ్డి జిల్లా కమిటీలను వేర్వేరుగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని, తాము హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో పని చేయలేమని వారు తేల్చి చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తల ఆమోదం మేరకు నియోజకవర్గాల బాధ్యులు అభ్యర్థులను సూచిస్తారని రంగారెడ్డి నేతలు చేసిన ప్రతిపాదనకు దిగ్విజయ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోకజవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్రెడ్డి రాంరెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని వారు దిగ్విజయ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయగా, పీసీసీ అధ్యక్షుడితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా!
శ్రేణుల్లో కరువైన సమన్వయం అధికార పార్టీ వ్యతిరేక ఓటు పైనే ఆశలు వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేనా! అన్న ప్రచారం నగరంలో విస్తృతంగా సాగుతోంది. అధికార పార్టీ హామీలు ఇచ్చి అమలులో చేస్తున్న జాప్యంతో వ్యతిరేక ఓట్లు భారీగా పడతాయని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అభ్యర్థి మార్పు, జిల్లాలో ఉన్న గ్రూపులు, స్థానిక నాయకత్వంలో సమన్వయ లోపం పార్టీ అభ్యర్థికి శాపంగా మారనున్నారుు. తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినందున సార్వత్రిక ఎన్నికల్లో తామే గెలుస్తామని, తొలి సీఎంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే పగ్గాలు చేపడతారన్న ఆశ పడ్డ కాంగ్రెస్ నేతలు భంగపడ్డారు. నేతల మధ్య సమన్వయం లేక పలు చోట్ల పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యూ రు. ఇదే పరిస్థితి ఉప ఎన్నికలో పునరావృ తం కావొద్దని మాజీ ఎంపీకే టిక్కెట్ ఇప్పించడంలో మాజీలు విజయం సాధిం చారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియూగాంధీకి బహుమతి ఇవ్వాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగారుు. అ రుుతే మాజీ ఎంపీ కుటుంబం లో జరిగిన విషాదకర ఘటనలతో పోటీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందు కు అప్పటికప్పుడు స్థానికులెవరూ కొత్తవారు ధైర్యం చేయలేకపోయూరు. లోక్‌సభ లో తెలంగా ణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడిన, సోని యూకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పీసీసీ పోటికి దింపిం ది. సర్వే రాక తో పార్టీలో కొన్ని శ్రేణులు అసంతృప్తి వ్య క్తం చేసినా పీసీసీ నేతల బుజ్జగింపులతో ప్రచారానికి సై అన్నారు. ఆర్థికపరమైన విషయూలు స్థానికులకు అప్పగిస్తే తడిసి మోపెడవుతుందని భావించిన సర్వే ని యోజకవర్గ బాధ్యతలను తనకు అనుకూలమైన వారికి అప్పగించినట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారిం ది. నామినేషన్ నాటి నుంచి ఆర్థిక వ్యవహారాలు చూసిన వారు ఇతర ప్రాంతాలకు చెందడంతో వారు జిల్లా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ దగ్గర పడటంతో బూత్‌ల నిర్వహణకు డబ్బులు కేటారుుంచేందుకు కసరత్తు చేశా రు. కానీ వచ్చిన నిధులను బాధ్యతలు నిర్వహించిన నేతలు తీసుకొని పోవడంతో అసలు విషయం బయటపడింది. పోలింగ్ ఖర్చుల సంగతేమిటంటూ పలువురు ప్ర శ్నించడంతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే దాం ట్లో తక్కువ ఇస్తే వ్యతిరేక ఓట్లు రావని స్థానిక నాయకులు వాపోతున్నారు. దీంతో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా వేరుుంచుకోవడంలో కాం గ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నారుు. బూత్‌లవారీగా ఇచ్చే డబ్బులు తగ్గించడంతో ఆయూ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమకు అక్కరలేదని అలకతో వెళ్లినట్లు తెలిసింది. వీరందరిని మళ్లీ పిలిపించి సమన్వయం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నట్లు సమాచారం. -
అమ్మ ఆదేశంతోనే వచ్చా
సిరిసిల్ల రాజయ్య ఘటన దురదృష్టకరం కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ హన్మకొండ అర్బన్: వరంగల్‌లో ఉప ఎన్నికల పోటీ విషయంలో అధినేత్రి సోనియమ్మ స్వయంగా చెబితేనే పోటీలో దిగుతున్నానని వరంగల్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సర్వే సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నామినేషన్ వేసిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేసిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. రాజయ్యకు వస్తాయనుకున్న దానికన్నా మూడింతలు ఎక్కువ మెజార్టీ తనకు వస్తుందన్నారు. తనకు పార్టీలో గ్రూపులు లేవని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళతానన్నారు. తాను గెలిచి ఓరుగల్లును అభివృద్ధిబాటలో నడిపిస్తానన్నారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికో..
అధిష్టానం పరిశీలనలో రవికుమార్, దయూకర్ పేర్లు రేసులో మరికొందరు నేతలు.. ఎవరికివారు ప్రయత్నాలు పార్టీలో చర్చ తర్వాతే నిర్ణయం వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి పోరు మొదలైంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేస్తూ సత్తా ఉన్న నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు ఖరారైన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. మన జిల్లాకు చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వారి పేర్లను అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీపడుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ సీనియర్ నేతలు గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరిలో ఒకరిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడిమల్ల రవికుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. అధినేత కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లోనూ పని చేసిన అనుభవాన్ని పార్టీ గుర్తిస్తుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్లో గతంలో కీలకంగా పనిచేసిన పసునూరి దయాకర్ పేరు కూడా టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. పసునూరి దయాకర్ సైతం గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని దయాకర్ భావిస్తున్నారు. ప్రయత్నాల్లో మరికొందరు... అధికార పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది నేతలు టీఆర్ఎస్ టిక్కెట్‌పై గురిపెట్టారు. స్థానిక నాయకులకే టిక్కెట్ వస్తుందని ముఖ్యనేతలు చెబుతుండడంతో జిల్లాలోని ఎస్సీ వర్గం ముఖ్యనేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్లో పనిచేస్తున్న చింతల యాదగిరి, జోరిక రమేశ్, జన్ను జకార్య, బోడ డిన్న, బొజ్జపల్లి రాజయ్య టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన జన్ను పరంజ్యోతి, రామగల్ల పరమేశ్వర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ రమేశ్ సైతం టీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్‌లతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య భార్య ఫాతిమామేరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ భార్య కవితాకుమారి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 28న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇవీ.. వీరి అనుకూలతలు గుడిమల్ల రవికుమార్ గతంలో పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై నమోదైన ఉద్యమ కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పసునూరి దయాకర్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
చావుడప్పు వినిపించదా..?
ఖమ్మం రైతు భరోసా యాత్రలో సీఎంపై కాంగ్రెస్ నేతల ధ్వజం ఖమ్మం: రైతుల ఇళ్లల్లో చావు డప్పులు మోగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. నీళ్లు, నిధులు వస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని నమ్మబలికి ఓట్లేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక అన్నదాతలను విస్మరించారని మండిపడింది. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో కాంగ్రెస్ నేతలు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు సీతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కూసుమంచి, కోటపాడుల్లో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 నెలల అసమర్థ పాలన కారణంగానే రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ పంటలు పండక, అప్పులు పుట్టక, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వేల కోట్లతో వాటర్‌గ్రిడ్, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెబుతున్న సీఎం.. రైతు రుణాల మాఫీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొత్త రాష్ట్రంలో సంబరాలు చేసుకోవాల్సిన రైతుల ఇళ్లల్లో చావు డప్పులు మోగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఆసరా పథకం అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయకుంటే ఆందోళనలను ఉధృతం చే స్తామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనా మా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాత్రలో కాంగ్రెస్ నేతలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, పొన్నం ప్రభాకర్, ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కి, బలరాంనాయక్ పాల్గొన్నారు. -
జెండా, అజెండా పక్కనపెట్టి..
‘10న బంద్’పై ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ఉమ్మడిగా విజయవంతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జెండా, అజెండా పక్కనబెట్టి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు బంద్‌పై దృష్టి సారించాయి. ఈ మేరకు ఆ పార్టీల నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం శాసనసభ ఆవరణలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నందున ప్రజలు కూడా పూర్తిగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు రుణమాఫీని ఏక మొత్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు జీవితంపై నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రోజుకు పది మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం మినహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం, రైతు సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. అఖిల పక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్య, వ్యాపార, రవాణా సంస్థలకు పిలుపునిచ్చారు. -
ఇఖ్లాక్ కుటుంబానికి రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలోని బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నారన్న అనుమానంతో స్థానికుల చేతిలో హత్యకు గురైన మహమ్మద్ ఇఖ్లాక్ కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. విద్వేష రాజకీయాలు తగవని, ప్రజలను విభజించే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అనంతరం ట్విటర్లో పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి ఇలాంటివాటిని తిప్పికొట్టాలని కోరారు. రాహుల్, ఇఖ్లాక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను కాంగ్రెస్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ మౌనాన్ని వీడి జరిగిన దారుణాన్ని ఖండించాలని డిమాండ్ చేసింది. స్థానికుల దాడిలో ఇఖ్లాక్ చిన్నకుమారుడు దానిష్ తీవ్రంగా గాయపడ్డం తెలిసిందే. ఇఖ్లాక్ కుటుంబానికి ప్రకటించిన రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇఖ్లాక్ హత్యలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇఖ్లాక్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పరామర్శించారు. హిందువులూ బీఫ్ తింటారు:లాలూ పట్నా: ఇఖ్లాక్ హత్య నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా గోమాంసం తింటున్నారని, బీజేపీ, ఆరెస్సెస్‌లు స్వలాభంకోసం దీనికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
చైనా పర్యటనా.. విహారయాత్రా..
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం చైనా పర్యటనకు వెళ్లడం..రోమ్ నగరం తగలబడుతోంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చైనాపర్యటన విహార యాత్రను తలపించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా మునిగి ఉన్న చైనా.. తెలంగాణలో పెట్టుబడులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. చైనాకమిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు.. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, పర్యటనకు అయిన ఖర్చు వివరాలపై ప్రభుత్వం స్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించక పోతే అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. మరో వైపు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని.. ఏడాది కాలంలో 63 వేల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. అందువల్లే.. ప్రపంచ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం కాదని నివేదిక ఇచ్చిందని విమర్శించారు. చైనా, సింగపూర్ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రైతులతో చెలగాటమొద్దు
మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు దాని అనుబంధ పరిశ్రమల పేరుతో రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. భూములు కోల్పోయే రైతులతో స్థానిక పరాసుపేటలోని సువర్ణ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశం జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి ఆదికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మూడు సార్లు మంత్రివర్గ సమావేశంలో బందరు పోర్టు నిర్మాణాన్ని 5,300 ఎకరాల్లో చేపట్టేందుకు నిర్ణయిస్తే దీన్ని వ్యతిరేకించి వెయ్యి ఎకరాలు చాలని అప్పట్లో అసెంబ్లీలో డిమాండ్ చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే 33 వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములను తీసుకునేందుకు రాత్రికిరాత్రే రూ.9 కోట్లు ఖర్చు చేసి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం రెండుమూడు పంటలు పండే సాగు భూముల్లో ఒక్క ఎకరం కూడా తీసుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. భూ సేకరణ ప్రాంతంలోని 100 మంది రైతుల్లో 80 మంది అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభలను నిర్వహించి ప్రజలు అంగీకరిస్తేనే భూమి సేకరించాలని, మార్కెట్ రేటుకు నాలుగు రెట్ల మొత్తాన్ని బాధిత రైతులకు చెల్లించాలని చట్టంలో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలోని ఎకరం మార్కెట్ ధర రూ.30 లక్షలని, 33 వేల ఎకరాలకు ప్రభుత్వం దాదాపు రూ.4 లక్షల కోట్లు చెల్లించాలని, అంత సీను ప్రభుత్వానికి ఉందా అని రైతులను అడిగారు. దీనికి రైతులు లేదు.. లేదు.. అంటూ బదులిచ్చారు. భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీ, మంత్రులు ల్యాండ్ పూలింగ్ చేస్తామంటూ గ్రామాలు తిరగడం వారి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. పిచ్చొడి చేతిలో రాయి ఎలాగో టీడీపీ చేతికి అధికారం ఇస్తే అలాగే ఉందని ఎద్దేవాచేశారు. కోన గ్రామంలో వెళ్లిన సందర్భంలో అక్కడి రైతులు పార్టీలకు అతీతంగా భూములు తీసుకోవద్దని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. శనివారం రాత్రి ఇదే గ్రామానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును గ్రామస్తులను ఊరి పొలిమెర వరకు తరిమితరిమి కొట్టారని, దీన్ని జీర్ణించుకోలేకే తాము ఆ గ్రామం వెళ్లిన సందర్భంగా వారు యువకులను తమ పైకి రెచ్చిగొట్టి ఇసుక వేసేలా చేశారని పేర్కొన్నారు. టీడీపీకి తమను ఎదుర్కొనే శక్తి ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఏ గ్రామానికైనా వచ్చి చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కోన గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులపై ఇసుక వేసిన ఘటనను ఖండిం చారు. పోర్టును 5,300 ఎకరాల్లోనే నిర్మించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, ఎస్.వి.రాజు, మత్తి వెంకటేశ్వరరావు, బుల్లెట్ ధర్మారావు, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పలు గ్రామాల రైతులు తమ ఆవేదనను రఘువీరాకు వివరించారు. -
ఉత్కంఠ...
నేడు బీబీఎంపీ మేయర్ ఎంపిక పోటాపోటీ రిసార్ట్ రాజకీయాలు బెంగళూరు :బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎంపిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలతో పాటు నగర ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు మేయర్ ఎన్నిక విషయమై పోటాపోటీగా బెంగళూరులో రిసార్టు రాజకీయాలు నడుపుతుండగా వారి అనుచరులు పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయమై ఆ రిసార్టుల వద్ద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 24 సీట్లు తక్కువగా వచ్చినా... జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా హస్తం, జేడీఎస్ అధినాయకులు తమ పార్టీ కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు చేజారి పోకుండా ఉండేందుకు వారం రోజులుగా కేరళ, మడికేరిలోని వివిధ రిసార్టుల్లో ఉంచారు. శుక్రవారం మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వివిధ రిసార్టుల్లో ఉన్న జేడీఎస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గురువారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బెంగళూరుకు చేరుకున్నారు. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైవ్‌స్టార్ హోటల్స్ అయిన తాజ్‌వెస్ట్‌ఎండ్, ఛాన్సురిపెవిలియన్లలో ఉండగా జేడీఎస్ కార్పొరేటర్లు ఈగల్టన్ రిసార్ట్‌లో ఉన్నారు. ఇక బీజేపీ కూడా తన కార్పొరేటర్లను నగర శివారులోని గోల్డన్ఫామ్ రిసార్టుకు చేర్చింది. స్వతంత్ర అభ్యర్థుల్లో కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి ఉండగా మరికొంతమందికి జేడీఎస్ నాయకులు తమతో పాటు ఆశ్రయం కల్పించారు. ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు శుక్రవారం నేరుగా మేయర్ ఎన్నిక జరిగే చోటుకు చేరుకోనున్నారు. స్థాయీ సంఘాల్లో సింహభాగం స్వతంత్రులదే... ఈసారి బీబీఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి కాంగ్రెస్ పార్టీకు మద్దతిస్తున్న ఏడుగురికి ఏడు స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులు లభించనున్నాయి. అదే విధంగా పొత్తులో భాగంగా రెండు స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులు దక్కనున్నాయి. ఇక కాంగ్రెస్‌కు ప్రధానమైన ఆర్థిక, పన్నుల, పాలనకు సంబంధించిన మూడు అధ్యక్ష పదవులు తీసుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మేయర్, ఉపమేయర్ ఎంపిక విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ గురువారం పొద్దుపోయేవరకూ నగరానికి చెందిన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులతో మంతనాలు జరిపారు. మేయర్, ఉపమేయర్ అభ్యర్థుల పేర్లను గురువారం రాత్రికి గాని, నేడు ఉదయం కాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నిషేదాజ్ఞలు మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిషేదాజ్ఞలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ వెళ్లడించారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయం చుట్టు ఉన్న 500 మీటర్ల పరిధిలో ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకూ నగరంలో ఎక్కడా కూడా విజయోత్సవరాలీలు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు. -
మనుగడ కోసమే కాంగ్రెస్ నేతల గగ్గోలు: కవిత
-
మనుగడ కోసమే కాంగ్రెస్ నేతల గగ్గోలు: కవిత
‘ప్రాణహిత’ రీడిజైన్‌పై రాద్ధాంతం తగదని వ్యాఖ్య ఇబ్రహీంపట్నం: రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై గగ్గోలు పెడుతోం దని, దీనిపై రాద్ధాంతం అనవసరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న జిల్లా నేతలెవ్వరూ ప్రాణహిత- చేవెళ్లపై నామమాత్రంగానైనా స్పందించలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు డిజైన్‌ను ప్రభుత్వం మార్చబోతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా వ్యవసాయాధారిత పంటలకు బదులు పాడి, చేపల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. -
పార్టీ ఫిరాయింపులపై ముగిసిన వాదనలు
తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్: తమ పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు , అలాగే రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, మదన్ లాల్లు తమ తమ పార్టీల నుంచి ఫిరాయించారని, వాటిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని మొదట విచారించిన సింగిల్ జడ్జి విచారణార్హత లేదంటూ కొట్టేశారు. దాన్ని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ఆయా పార్టీల నేతలు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ ఫిర్యాదులు స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నాయని, కాబట్టి ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. ఇదే విషయాన్ని 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులు ఇచ్చిన 9 నెలలు కావొస్తున్నా స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, 9 నెలలుగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉండటం మంచిదికాదని తాము భావిస్తున్నామంది. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని నిరూపిస్తే తప్పక ఆ మేరకు ఆదేశాలిస్తామని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
మరో ఏడాది సోనియానే
సంస్థాగత ఎన్నికలు సంవత్సరం వాయిదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు 50% పార్టీ పదవులు ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఇక మూడేళ్లే; ప్రతీ మూడేళ్లకు సంస్థాగత ఎన్నికలు క్రీయాశీల సభ్యత్వ పునరుద్ధరణ; సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం ‘సీడబ్ల్యూసీ’ మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న ఊహాగానాలకూ తెరపడింది. సోనియా అధ్యక్షతన 3 గంటలకు పైగా భేటీ అయిన సీడబ్ల్యూసీ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో మాటలే తప్ప చేతలు లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీకి మద్దతిచ్చేవారిని పెంచుకోవాలని, సమాజంలో నూతనంగా ఏర్పడుతున్న వర్గాలకు చేరువ కావాలని నేతలకు పిలుపునిచ్చారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది వాయిదా వేయాలన్న నిర్ణయం నేపథ్యంలో పార్టీ అందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో కొన్ని కీలక సవరణలను తీసుకురావాల్సి ఉన్నందున సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరింత సమయం అవసరమని ఈసీకి వివరించనుంది. 1998 నుంచి పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సోనియా సుదీర్ఘ కాలం ఆ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ డిసెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుండగా, సీడబ్ల్యూసీ తాజా నిర్ణయంతో అది మరో ఏడాది వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు పార్టీలో 50% పదవులు కేటాయించాలన్న కీలక ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఇప్పటివరకు అది 20% మాత్రమే ఉండేది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చనున్నారు. పార్టీ సభ్యత్వ కాల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు సహా అన్ని ఆఫీస్ బేరర్ పదవుల కాలపరిమితి మూడేళ్లే ఉంటుంది. సంస్థాగత ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు కాకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థాగత ఎన్నికల అనంతరం నిర్వహించే పార్టీ ప్లీనరీలో ఈ మార్పులకు ఒక తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదిస్తుంది. అనంతరం వీటిని పార్టీ రాజ్యాంగంలో చేరుస్తారు.కాంగ్రెస్‌లో, దాని యువజన(యూత్ కాంగ్రెస్), విద్యార్థి(ఎన్ఎస్యూఐ), సేవాదళ్, మహిళా కాంగ్రెస్‌లలో కానీ చేరేవారికి ఏక సభ్యత్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.క్రీయాశీల సభ్యత్వ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కనీసం 25 మంది సభ్యులను చేర్పించిన వారికి పార్టీ క్రియాశీల సభ్యత్వం లభిస్తుంది. క్రియాశీల సభ్యులు ఆటోమాటిక్‌గా బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో సభ్యులవుతారు. డీసీసీ, పీసీసీ ప్రతినిధులుగా ఎన్నికవడానికి వారే అర్హులు. పీసీసీ జనరల్ బాడీ కనీసం ఆర్నెల్లలో ఒకసారి, లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు భేటీ కావాలని నిర్ణయించారు. డీసీసీ కనీసం నాలుగు నెలలకు ఒకసారి, సబ్ కాంగ్రెస్ కమిటీలు కనీసం మూడు నెలలకు సమావేశం కావాల్సి ఉంటుంది. వీటి కార్యనిర్వాహక కమిటీలు నెలకు ఒకసారైనా భేటీ కావాలి.ఉల్లి సహా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన ద్రవ్యోల్బణం గురించి వివరించాలని సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కోరారు. జీఎస్టీ కోసం ప్రత్యేక భేటీతో ఫలితం ఉండదు.. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీలోని కళంకిత నేతలైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలపై చర్యలు తీసుకునేంతవరకు అలాంటి యత్నాల వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదని తేల్చిచెప్పింది. అయితే, తాము ప్రతిపాదిస్తున్న సవరణలను బిల్లులో చేరిస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని భేటీ అనంతరం పార్టీ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించకపోవడంపై స్పందిస్తూ.. సోనియా, రాహుల్‌ల మధ్య పని విభజన ద్వారా సమతౌల్యం సాధిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. వారిద్దరి టీమ్ అనుభవం, యువ రక్తం నిండినదిగా ఉంటుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయడమంటే.. రాహుల్‌కు అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించడాన్ని వాయిదా వేసినట్లు కాదని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేలోపు.. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నియామకం ఎప్పుడైనా జరగొచ్చన్నారు. కరువురాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ: సీడబ్ల్యూసీ డిమాండ్ దేశవ్యాప్తంగా రైతులు వర్షాభావ పరిస్థితులు, వరద పరిస్థితులతో అతలాకుతలం అవుతున్నారని, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్రం తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ రాజకీయ తీర్మానం చేసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితి నెలకొన్నందున తక్షణం సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ‘రైతులకు జరిగిన నష్టానికి తగురీతిలో పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. తక్ష ణం పంటలకు నష్టపరిహారం, తాగునీటి పంపిణీ, ప్రత్యేక పనికి ఆహార పథకం, పశువులకు మేత అందించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చే సింది. ప్రభుత్వ పేదల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని తీర్మానించింది. మోదీవి అన్నీ గాలిమాటలే: సోనియా న్యూఢిల్లీ: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని సోనియాగాంధీ మండిపడ్డారు. సీడబ్ల్యూసీ భేటీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాలన్నీ గాలి మాటలేనని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వ పాలనలో మాటలకు, చేతలకు.. మీడియా కార్యక్రమాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన లేదు. హామీల అమల్లో మోదీ సర్కారు అత్యంత దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు. రాహుల్ క్రియాశీల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అలుపెరగని పోరాటం వల్లే భూ సేకరణ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. కార్మిక సంస్కరణలు, ఉపాధి హామీ చట్టం మొదలైన వాటి విషయంలోనూ అదే తీరున పోరాడాలని పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్స్‌పై పోరులో మిగతా విపక్ష పార్టీలు, పౌర సమాజం కూడా కాంగ్రెస్‌తో కలసివచ్చిందన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విషయంలో స్పష్టమైన విధానం అవలంబించకుండా.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ‘ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్‌ను, ఆయన ఆర్థిక విధానాలను ఎద్దేవా చేయడమే పనిగా పెట్టుకున్న మోదీ.. ఇప్పుడు తననుతాను సమర్థించుకోలేని స్థాయిలో మాటలు మారుస్తున్నారు. ఆయన తీరుపై ప్రజల్లో ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్థిక వృద్ధి అధోముఖంలో, ధరలు ఊర్ధ్వ ముఖంలో దూసుకుపోతున్నాయి. మేకిన్ ఇండియా అని, కోటి ఉద్యోగాలని మాటలకు, నినాదాలకే ఈ ప్రభుత్వం పరిమితమైంది. తమ విధానాలను వ్యతిరేకిస్తున్న మీడియాను నోటీసులతో బెదిరిస్తున్నారు. దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ లక్ష్యంగా చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారు. దేశోన్నతికి దోహదపడే కీలక వ్యవస్థల స్వతంత్రతను, సమగ్రతను కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారు’ అని మండిపడ్డారు. గోవింద్ పన్సారే, కల్బుర్గిల హత్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తమను విమర్శించే అభ్యుదయ రచయితలు, ప్రగతిశీల ఆలోచనాపరులను భౌతికంగా నిర్మూలిస్తున్నారని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ నియంత్రణలో, దాని ఆదేశాల మేరకు పనిచేస్తుందనడానికి గత వారం మనకు ఆధారాలు లభించాయి. ఆరెస్సెస్ ఎజెండా ఏంటో మనందరికీ బాగా తెలుసు’ అని అన్నారు. కేంద్ర మంత్రులు సంఘ్ పెద్దలను కలసి, ప్రభుత్వ విధానాలను వివరించడంపై ఇలా స్పందించారు. కాగా, పార్టీలో కృషికి, సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుందన్న విశ్వాసాన్ని కొత్త సభ్యుల్లో కల్పించాలని, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారి సేవలను తగినట్లు ఉపయోగించుకోవడానికి పారదర్శక వ్యవస్థను రూపొందిం చాలని ఆమె సూచించారు. ‘సీడబ్ల్యూసీ ఆమోదించిన సవరణలు అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. అవి అమల్లోకి వచ్చాక భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పార్టీ వ్యవస్థలు బలోపేతమవుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. -
రిసార్ట్ రాజకీయం
76 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు మడికేరికి తరలింపు ఈ నెల 11నబెంగళూరుకు తిరిగిరాక తాయిలాలకు ఆశ పడొద్దని సీఎం హితబోధ బెంగళూరు: మేయర్ ఎన్నిక మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తన కార్పొరేటర్లు చేజారి పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కార్పొరేటర్లను రిసార్టుకు తరలించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 24 సీట్లు తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే 14 సీట్లు వచ్చిన జేడీఎస్‌తో, 7 స్థానాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠంపై కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి ఆపరేషన్ కమల పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10 మందికి కొన్ని కానుకలు కూడా ముట్టజెప్పడానికి సిద్ధపడిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన 76 మంది కార్పొరేటర్లను బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయానికి సోమవారం ఉదయమే పిలిపించుకున్నారు. అందరూ కలసికట్టుగా ఉండాలని బీజేపీ చూపించే కొన్ని కానుకల కోసం రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టకండని హితబోధ చేశారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కార్పొరేటర్లను మూడు ప్రత్యేక బస్సుల్లో మడికేరికి తరలించారు. అక్కడి క్లబ్ మహీంద్ర, తాజ్ రిసార్ట్‌లలో వారు మూడు రోజుల పాటు ఉండి మేయర్ ఎన్నిక జరిగే ఈ నెల 11న బెంగళూరుకు రానున్నారు. ఈ రిసార్టు రాజకీయ ఘట్టానికి ఎమ్మెల్యేలైన ఎస్.టీ సోమశేఖర్, భైరతిభసవరాజ్, మునిరాజ్‌లు నేతృత్వం వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భేషరతుగా మద్దతు రాజకీయ రిసార్ట్ ఘట్టం ప్రారంభం కావడానికి ముందు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. ‘బీబీఎంపీ మేయర్ పదవి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకు భేషరతుగా మద్దతు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీనే మాకు ఉపమేయర్ పదవి ఇవ్వడానికి అంగీకరించింది. ఇక ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే మేయర్ పదవిలో ఉండాలా లేదా అన్న విషయం బీబీఎంపీ పరిధిలోని జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా.’ అని పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో పలువురి చేరిక
కొడకండ్ల : మండలంలోని టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు షర్మిల రెండో విడత పరామర్శ యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు గుగులోత్ రాంజీనాయక్, కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కర్ర అశోక్‌రెడ్డి, కొడకండ్లకు చెందిన మిట్ట అశోక్‌రెడ్డి, ముక్కెర సురేష్, వెంకన్న, నరేష్‌ల ఆధ్వర్యంలో 15 మంది వైఎస్సార్ సీపీలో చేరగా వారికి శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు కాందాటి అచ్చిరెడ్డి, మండల నాయకులు నీలం లక్ష్మయ్య పాల్గొన్నారు. -
ఎంఆర్ఆర్ నిధుల అవినీతిపై విచారించండి
హైకోర్టుకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల నిర్వహణ (ఎంఆర్ఆర్) పేరుతో మరమ్మతు పనులకు రూ. 384 కోట్లను నామినేషన్ల పద్ధతిపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి సంబంధిత ప్రజాహిత వ్యాజ్యాన్ని ఇటీవల హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఆర్ నిధులతో చేపట్టే పనులను టెండర్ల పద్ధతిలో కేటాయించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం విచారించేందుకు పిటిషనర్లు రూ. 50 వేల చొప్పున పూచీకత్తు జమచేయాలని హైకోర్టు ఆగస్టు 10న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. కేసును త్వరితగతిన విచారించాలని హైకోర్టును ఆదేశించింది. -
కుదరని సయోధ్య
మేయర్ ఎంపికపై బెడిసికొడుతున్న వ్యూహం కాంగ్రెస్‌లో రాజుకుంటున్న అసమ్మతి జేడీఎస్‌తో పొత్తుకు సై అంటున్న సిద్ధు గ్రూప్ కూడదంటున్న పరమేశ్వర మద్దతుదారులు బెంగళూరు : మేయర్ ఎంపిక విషయంలో జేడీఎస్‌తో పొత్తు వ్యవహారం కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేస్తోంది. ఆ పార్టీలో మరోసారి సీఎం సిద్ధు గ్రూపు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వర్గం అన్న వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధు అండ్ కో మొగ్గు చూపిస్తుండగా పరమేశ్వర్ వర్గం వ్యతిరేకిస్తోంది. బీబీఎంపీ ఎన్నికల్లో 76 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య బలంతో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పదవిని దక్కించుకోవడం అసాధ్యం. దీంతో ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా ‘సిద్ధరామయ్య అండ్ కో’ 14 వార్డులను గెలుచుకున్న జేడీఎస్‌తో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య తెర వెనక నుంచి మంత్రాంగం నడిపిస్తుండగా బెంగళూరుకు చెందిన బైరతీ బసవరాజు, మునిరత్నా, ఎస్టీ సోమశేఖర్ తెరముందు జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులను లాబీయింగే చేస్తున్నారు. ఈ ముగ్గురూ సీఎం సిద్ధరామయ్యకు అప్తులన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే పరమేశ్వర్‌తో పాటు మూలతహా కాంగ్రెస్ పార్టీకు చెందిన కొందరు నాయకులు జేడీఎస్‌తో పొత్తుకు సమ్మతించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాల్లో పొత్తులు సాధారణమే అయినా గత అనుభవాల దృష్ట్యా జేడీఎస్ స్నేహహస్తం ఇచ్చినట్లే ఇచ్చే తర్వాత ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతుందని పరమేశ్వర్‌తో బాటు మిగిలిన కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చినా అధికారం కోసం రాజకీయ బద్ధశత్రువైన జేడీఎస్‌తో కలవడం రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఇబ్బంది కరంగా మారుతుందనేది వారి వాదన. ఇదే విషయమై పరమేశ్వర్, సిద్ధరామయ్య మధ్య శనివారం పొద్దు పొయిన తర్వాత ఫోన్లో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తనతో సంప్రదించకుండా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఈ విషయమై వారి నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాన్ని కోరుతా, అవసరమైతే క్రమశిక్షణా చర్యలకు వెనకాడబోనని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు. -
మోదీ వైఫల్యంతోనే చర్చలు రద్దు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగానే ఎన్ఎస్ఏ చర్చలు రద్దయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్-పాక్ ఎన్ఎస్ఏ చర్చలు రద్దు నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ విదేశాంగ విధానంలో గందరగోళం, గాబరా, మొండితనం తప్ప మరేం లేదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఎద్దేవాచేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. సరైన అనుభవం, ముందు చూపు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మాటలగారడీలు కట్టిపెట్టి ప్రధాని మోదీ.. దేశ అంతర్గత, సీమాంతర ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని హితవు పలికారు. పరిష్కారం చూపే ప్రతిపాదనలతో భద్రతా అంశాలు, శాంతియుతమైన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే విదేశాంగ విధానాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రయోజనం, ఫలితాలు వచ్చే వీలు లేని నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపడం అనవసరమని కాంగ్రెస్ సూచించింది. కచ్చితమైన ఫలితం ఉంటుందని భావిస్తేనే చర్చలు కొనసాగించాలని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ హురియత్‌ను అడ్డుపెట్టుకుని చర్చలను ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌వైపు మళ్లిస్తోందని భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు వీటిని వినియోగించుకుంటోందని ఆరోపించారు. హురియత్‌కు ప్రాధాన్యత ఇవ్వవద్దన్నారు. పాకిస్థాన్ నిర్ధారించకుండానే చర్చల కోసం తేదీలను ఎలా ప్రకటించారని కేంద్రాన్ని నిలదీశారు. -
ఓట్ల కోసమే బిహార్‌కు ప్యాకేజీ
మోదీ సర్కారుపై రాహుల్‌గాంధీ ధ్వజం అమేథీ: ప్రధాని మోదీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఓట్ల కోసమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇలా జిమ్మిక్కులు చేయడం ఆయనకు అలవాటేనన్నారు. ఈ ప్యాకేజీ హామీ కూడా జవాన్లకు ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’(ఓఆర్ఓపీ) మాదిరే అవుతుందేమోనని పేర్కొన్నారు. ‘బిహార్‌కు ప్యాకేజీ ఇవ్వడానికి, విదేశీ పర్యటనలకు వెళ్లడానికి మోదీకి డబ్బు లు ఉంటాయి. అదే మన జవాన్లకు, మాజీ సైనికులకు ఇవ్వడానికి మాత్రం డబ్బుల్లేవంటారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ముందూ ఆయన యూపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓఆర్ఓపీ అమలు చేస్తామని లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారా?’ అని ప్రశ్నించారు. అమేథీ పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాణిగంజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ ప్యాకేజీ హామీలు ఇవ్వడం సమయం వృథా చేయడమే. ఆయన మాట్లాడతారు. ప్రజలు వింటారు. తర్వాత ఆయన మరో హామీ ఇస్తారు. ఈ ప్రపంచం అంతా భ్రమల్లో బతుకుతుందని బీజేపీ, మోదీ భావిస్తున్నట్టున్నారు. పల్లె జనాలు ఇదంతా అర్థం చేసుకోరని వారు అనుకుంటున్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెచ్చి దేశంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ హామీ ఏమైంది?’ అని దుయ్యబట్టారు. అభివృద్ధిని కొలిచే విధానాలన్నింటినీ మార్చేసి.. తామే దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు- బూటు’ సర్కారుగా విమర్శించిన రాహుల్ మళ్లీ ఆ దాడిని కొనసాగించారు. సామాన్యుల కోసం పనిచేసేందుకు కుర్తా- పైజామా సర్కారు వస్తుందన్నారు. -
జయకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం
బెంగళూరు: ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే కావేరి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని బహుభాష నాటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ ఆరోపించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల ప్రచారం పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆమె స్థానిక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమిళనాడుతోపాటు కర్ణాటక ప్రజల తాగు, సాగునీటికి ప్రధానమైన కావేరి జలాల పంపకానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడంపై జయలిత ముందుకు రావడం లేదన్నారు. పైగా సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిన ఈ సమస్యను రాజకీయ ప్రయోజనాలు ఆశించే కోర్టు వరకూ జయలలిత తీసుకుపోతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ విషయమై చొరవ చూపి సమస్యను సత్వరం పరిష్కరించాలని కుష్బూ కోరారు. -
సమైక్య దళం.. ప్రత్యేక గళం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి, వివిధ విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయ వంతమైంది. అక్కడక్కడా లోక్‌సత్తా, జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకోలు, మండలాల్లోని ప్రధాన కూడళ్లల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. బంద్ కారణంగా ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి. పెట్రోల్ బంక్‌లను సైతం వరకు మూసివేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిన కేంద్ర ప్రభుత్వం, ఈ అంశాన్ని పట్టించుకోని ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూతపడటంతో రూ.వెయ్యి కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. బంద్ కారణంగా జిల్లాలోని సుమారు 140 బస్సులను ఆందోళనకారులు నిలిపివేశారు. దీంతో ఆర్టీసీకి రూ.20 లక్షల మేర ఆదాయ నష్టం వాటిల్లింది. ఏలూరు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను పార్టీ కార్యాలయం నుంచి శవయాత్రగా తీసుకెళ్లి ఫైర్‌స్టేషన్ సెంటర్లో దహనం చేశారు. తెల్లవారుజామున 4.30 గంటలకే వివిధ పార్టీల నాయకులు ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డగించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో అఖిలపఖ నాయకులు మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ప్రజా సం ఘాల కార్యకర్తలు బైక్‌లపై నగరమంతా తిరుగుతూ తెరిచి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలను మూయించారు. ఏలూరులో కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్, మున్నుల జాన్‌గురునాథ్, బండారు కిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఎం నాయకులు మంతెన సీతారాం, బి.బలరాం, ఏఐటీయూసీ నాయకుడు కె.కృష్ణామాచార్యులు, సీఐటీయూ నాయకుడు డీఎన్‌వీడీ ప్రసాద్ నేతృత్వం వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెంలో బంద్ విజయవంతంగా జరిగింది. తణుకు బస్టాండ్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా 20 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఐ.పంగిడిలో డీసీసీ అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా బంద్ నిర్వహించారు. భీమవరంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం బంద్‌ను విజయవంతంగా నిర్వహిం చాయి. నరసాపురంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్టాండ్ నుంచి శివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూయించివేశారు. నిడదవోలులో సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పట్టణమంతా తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. సీపీఎం నాయకులు ఓవర్‌బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొల్లులో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ పాల్గొన్నారు. ఉండి మండలంలో ఆందోళనకారులు బైక్‌ర్యాలీ నిర్వహించి దుకాణాలు, పాఠశాలలను మూయించివేశారు. కాళ్ల మండలంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ వద్ద ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో చేశారు. దేవరపల్లి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. నల్లజర్లలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బంద్ నిర్వహించారు. పలుచోట్ల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. -
హోదాహోరీ
ప్రత్యేక హోదా పోరాటం హోరాహోరీ స్థాయికి చేరింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఎం మద్దతు పలికాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ప్రభుత్వ కార్యాయాలూ వెలవెలబోయాయి. కార్యకలాపాలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. అమలాపురం : బంద్‌కు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి జేఏసీలు, బార్ అసోసియేషన్లు కూడా మద్దతు పలికాయి. బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్లు బోసిపోయాయి. పలు పార్టీల నాయకులు వీధుల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా, పలువురి అరెస్టు జిల్లా కేంద్రం కాకినాడలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఉదయం నుంచి బస్సులు నిలిపివేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కేంద్రమాజీ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీతోపాటు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై బీజేపీ మాట తప్పడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేష్టలుడిగి చూస్తున్నారని, ప్రత్యేకహోదా రావడం బాబుకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని మధు, శివాజీతోపాటు పలువురిని అరెస్టు చేశారు. కాకినాడ టౌన్ స్టేషన్లో రైలురోకో చేసి సర్కారు ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. కాకినాడ లారీ ఓనర్ల అసోసియేషన్ బంద్‌కు మద్దతునిచ్చింది. రాజమండ్రిలోనూ బంద్ జయప్రదమైంది. దేవీచౌక్ సెంటరు నుంచి ఆందోళనకారులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్‌కు మద్దతునిచ్చారు. అమలాపురంలో ధర్నా.. బస్సుల అడ్డగింత అమలాపురంలోనూ బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం, మిత్రపక్షమైన బీజేపీ మినహా మిగిలిన అన్నిరాజకీయ పక్షాలూ ధర్నా నిర్వహించి రాకపోకలు అడ్డుకున్నాయి. సీపీఐ నాయకులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, జేఏసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేశారు. బస్సులు తిప్పేందుకు యత్నించగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, యూత్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణ్‌లాల్, సుంకర సుధ, జేఏసీ నాయకులు బండారు రామ్మోహనరావు, కె.సత్తిబాబు పాల్గొన్నారు. బస్సులను అడ్డుకున్న సమయంలో పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని తరువాత వదిలేశారు. పిఠాపురం మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. మండపేటలో పీసీసీ కార్యదర్శి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఏజెన్సీలో రంపచోడవరంలో మాత్రమే బంద్ ప్రభావం ఉదయం పూట కొంత వరకు కనిపించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోపాటు వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. అయితే మధ్యాహ్నం నుంచి బస్సులు తిరిగాయి. మిగిలిన మండలాల్లో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. రంపచోడవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆర్టీసీకి రూ.30 లక్షల నష్టం రాజమండ్రి సిటీ : బంద్ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీకి మంగళవారం రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీటీఎం ఆర్వీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. 70 శాతం బస్సులు మాత్రమే నడపగలిగామని వివరించారు. -
బంద్ సంపూర్ణం
మూతపడిన విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించిన నగరవాసులు బస్టాండ్ వద్ద కాంగ్రెస్, సీపీఐ నిరసన మధ్యాహ్నం వరకు తిరగని బస్సులు విజయవాడ : ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు ఉద్యమించాయి. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సమర శంఖం పూరించాయి. నగరంలో మంగళవారం ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ సంపూర్ణమైంది. విద్య, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు ఆగిపోయాయి. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. ఉదయం నుంచి కాంగ్రెస్, సీపీఐ, ఆమ్ఆద్మీ పార్టీ నేతలు నగరంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతంరెడ్డి లెనిన్‌సెంటర్‌లో ఆందోళనలో పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించారు. బస్టాండ్ వద్ద ఉద్రిక్తత కాంగ్రెస్, సీపీఐ నేతలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తొలుత బీసెంట్‌రోడ్డుకు ర్యాలీగా చేరుకుని కొద్దిసేపు నినాదాలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి పండిట్ నెహ్రు బస్టాండ్ చేరుకున్నారు. బస్టాండ్ ముఖద్వారం వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్, నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పార్టీ నేతలు దోనేపూడి శంకర్, అక్కినేని వనజ, ముజాఫర్ అహ్మద్ తదితరులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తలు బస్సులకు అడ్డంగా పడుకుని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం నగరమంతా ర్యాలీగా తిరిగి షాపులు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, సినిమా హాల్స్, విద్యాసంస్థలు మూసి వేయించారు. బార్ అసోసియేషన్‌లో దీక్షలు ప్రత్యేక హోదా డిమాండ్‌తో బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు రిలే నిరహారదీక్షలను మంగళవారం నుంచి ప్రారంభించారు. బార్ అధ్యక్షుడు చిత్తరువు శివ వెంకట జగదీశ్వరరావు, బార్ సభ్యులు చలసాని అజయ్ కుమార్, వైఆర్సీ రాజశేఖర్, సుంకర రాజేంద్రప్రసాద్, జగదీశ్వరరావు, వేముల హజరత్తయ్య గుప్తా దీక్ష నిర్వహించారు. రఘువీరారెడ్డి, రామకృష్ణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీకి రూ.70లక్షలు నష్టం బస్‌స్టేషన్ : బంద్ ప్రభావం ఆర్టీసీపై బాగానే పడింది. సుమారు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్ వల్ల మంగళవారం బస్టాండ్ బోసిపోయింది. పలు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాతే బస్సులు తిరిగాయి. అయితే, రాష్ర్టవ్యాప్తంగా బంద్ జరుగుతుందన్న విషయం గుర్తించిన వారు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి కూడా బస్సులు ఖాళీగానే తిరిగాయి. కృష్ణా రీజియన్ పరిధిలో రోజుకు రూ.కోటీ 40లక్షలు ఆదాయం వస్తుందని, బంద్ ప్రభావంతో మంగళవారం రూ.70 లక్షలే వచ్చిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రామారావు ‘సాక్షి’కి తెలిపారు. మూతపడిన కార్పొరేషన్ విజయవాడ సెంట్రల్ : ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం మూతపడింది. ఉదయం 10 గంటలకు కార్యాలయానికి అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు ఆధ్వర్యంలో ఆందోళనకారులు వచ్చి బంద్‌కు సహకరించాల్సిందిగా ఉద్యోగుల్ని కోరారు. అకౌంట్స్ సెక్షన్లో ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు మొరాయించడంతో బంద్ నిర్వా హకులు వాదనకు దిగారు. ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయం మూతపడింది. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
బీజేపీపై చెత్త అస్త్రం...
నగరంలో పేరుకుపోతున్న చెత్తపై విమర్శలు బీబీఎంపీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశం బెంగళూరు: గార్డెన్‌సిటీ నుంచి గార్బేజ్ సిటీగా మారిపోయిన బెంగళూరు నగరాన్ని తిరిగి గార్డెన్ సిటీగా మారుస్తామనే వాగ్దానంతో కాంగ్రెస్ పార్టీ ఈ బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెల్లనుంది. చెత్త సమస్య పరిష్కారంలో బీజేపీ వైఫల్యాన్ని అస్త్రంగా చేసుకొని బీబీఎంపీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. చెత్త సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం వంటి అంశాలతో బీబీఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ బీబీఎంపీలో అధికారంలో ఉన్న సమయంలో నగరంలో చెత్త సమస్య ఏ విధంగా పెరిగిపోయిందో ఓ వైపున ప్రజలకు వివరిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కారానికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక బీబీఎంపీ పాలన విషయంలో బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు బీజేపీ హయాంలో బీబీఎంపీలో చోటుచేసుకున్న కుంభకోణాలను సైతం తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ కుంభకోణాల కారణంగా బీబీఎంపీ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు బీబీఎంపీలో ఎంత వరకు వినియోగమయ్యాయి? అనే అంశాలను సైతం ప్రజల ముందుకు తీసుకొచ్చి తమ ప్రచారాన్ని సాగించేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. ఇక నగర ప్రజలకు రోజు రోజుకు ఇబ్బంది కరంగా తయారవుతున్న ట్రాఫిక్‌జామ్‌కు సరైన పరిష్కారాన్ని కనుగొనేదిశగా ప్రణాళికను రూపొందించడాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చారు. బీబీఎంపీ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధి, నగరంలో మౌళిక వసతుల కల్పన, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు వంటి హామీలను పొందుపరిచారు. ఇక కుంభకోణాలతో నిండిపోయిన బీబీఎంపీని పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శక పాలన అందజేయడంతో పాటు బెంగళూరు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో స్వచ్ఛమైన, సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామనే ప్రధాన హామీతో ఈ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. -
నిరసన జ్వాల
కోటి ఆత్మాహుతిపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నేడు తిరుపతి బంద్‌కు కాంగ్రెస్ పిలుపు తిరుపతి కార్పొరేషన్ : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఒంటికి నిప్పంటిం చుకుని తీవ్రంగా గాయపడిన మునికామ కోటిమరణవార్త తెలియగానే ఆదివారం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. తిరుపతిలో కోటి ఒంటికి నిప్పు అంటించుకున్న ప్రదేశంలో నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని పార్టీలకతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మౌనదీక్షకు దిగారు. ఆయన మృతికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జిల్లా వ్యాప్తంగా మౌనదీక్షలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో ఆదివారం సాయంత్రం నాలుగు కాళ్ల మండపం నుంచి కోటి నిప్పంటించుకున్న ప్రదేశం వ రకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సోమవారం సాయంత్రంలోపు కోటి అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేడు తిరుపతి...రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపు.. సోమవారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సన్నిహితులు, స్నేహితుల నివాళి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో ఆత్మాహుతికి పాల్పడిన బీఎంకే కోటి సన్నిహితులు, స్నేహితులు అతని జ్ఞాపకాలను తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తిరుపతి నగరంలో నిన్నటి వరకు తమను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ పలకరించే స్నేహితుడు కోటి మృతి చెందాడని తెలిసి జీర్ణించుకోలేక పోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శిష్యుడిగా, మబ్బు యువసేన నాయకుడిగా గుర్తింపు పొందిన బెంగళూరు మునికామ కోటి అలి యాస్ బీఎంకే కోటి(41) తక్కువ సమయంలోనే ఉద్యమ నా యకుడిగా ఎదిగారు. మబ్బు చెంగారెడ్డితో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆరు నెలల పాటు దశల వారీగా ఆందోళనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలుగు జాతి సత్తాను చాటి చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు. అది ప్రభుత్వ హత్యే.. కోటి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్నం 4.15 గంటలకు ఆత్యహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర గాయాలపాలైన కోటిని రాత్రి 7.25 గంటలకు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే సమ యం మించిపోవడం, వేలూరు వెళ్లినా వారు కాదనడంతో అక్కడి నుంచి చె న్నై కీళ్లపాక మెడికల్ కళాశాల (కేఎంసీ)కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన హత్యగా భావిస్తున్నామని మం డిపడుతున్నారు. ఈ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించకుండా కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభను రెండు గంటల పాటు కొనసాగించారు. సభలో ప్రసంగాలు పూర్తయిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి వారు పరామర్శించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
కోటి ఆత్మహత్యాయత్నంపై సోనియా ఆందోళన
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ప్రకటన హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ముని కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై సోనియా గాంధీ తనతో ఫోన్లో మాట్లాడారని రఘువీరా తెలిపారు. బాధిత కుటుం బాలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరూ క్షణికావేశాలకు లోనుకావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సోనియా గాంధీ చెప్పినట్లు ఆయన తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అందుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
మోదీ, వెంకయ్య, బాబులపై కేసులు పెడతాం వైఎస్ జగన్ ధర్నా హర్షణీయం కాంగ్రెస్ పోరు సభలో రఘువీరారెడ్డి, చిరంజీవి వెల్లడి 11న రాష్ట్ర బంద్‌కు పిలుపు తిరుపతి మంగళం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో శనివారం పోరు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చెబితే అలా కుదరదు కనీసం పదేళ్లయినా ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకపోవడం శోచనీయమని విమర్శించారు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో కేసులు పెడతామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 11న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేపడుతుండడం హర్షణీయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.బలిదానాలతో కాకుండా పోరాటాలతో ప్రత్యేక హోదా సాధిద్దామని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన మునికోటి అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని చెప్పారు.సభలో కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం
తిరుపతిలో యువకుడి బలిదాన యత్నం తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రత్యేకహోదా జ్వాల రగిలింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ఓ యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. తనువెల్లా అగ్నిజ్వాలల్లో ఆహుతవుతున్నా తెలుగుజాతి వర్ధిల్లాలని,ప్రత్యేకహోదా కల్పించాలని గొంతెత్తి అరిచాడు. పూటకో మాటతో, రోజుకో అబద్ధంతో మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వాధినేతల చెవులకు చేరేలా నినదించాడు. విభజన బిల్లులో ప్రత్యేకహోదా పొందుపరచకుండా కాంగ్రెస్‌పార్టీ మోసం చేస్తే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ , రాష్ర్టంలో తెలుగుదేశంపార్టీ ఉమ్మడిగా మభ్యపెడుతున్నాయని నిప్పులు చెరిగాడు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుని బలిదానయత్నం వార్తలతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో పార్టీలకు అతీతంగా ఉద్యమానికి ఉద్యుక్తులవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగుళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి (41) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది. తెలుగు జాతి విడిపోయింది. విభజనతో రాష్ట్రం అన్నింటా నష్టపోవడం చూస్తే బాధకలుగుతుండేది. ప్రత్యేకహోదాతో కొన్ని కష్టాలైనా తొలుగుతాయని ఆశపడ్డాను. కానీ సాధ్యం కాదని పార్లమెంటులో చెప్పినప్పుడు నుంచి ఒకటే ఆలోచన. కేంద్రం కళ్లు తెరవాలనే ఉద్దేశ్యంతోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాను’’ అంటూ ఆత్మఘోషను దేశానికి వినిపించాడు. తెలుగుజాతి వర్ధిలాలి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినదించాడు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌పార్టీ, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేస్తామని ప్రకటించి మాటమారుస్తున్న బీజేపీ, రోజుకో మాటతో మోసపుచ్చుతున్న టీడీపీ తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాగ్నికి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచాడు. ప్రత్యేకహోదాపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మోసపూరిత వైఖరికి నిరసన తెలిపేందుకు తిరుపతిలో శనివారం కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన ‘పోరుసభ’ ను బీఎంకే కోటి వేదికగా చేసుకున్నాడు. సభ సాగుతుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సభికులు, నేతలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగి శేషాద్రి (33)కి గాయాలయ్యాయి.వీరిద్దరినీ రుయాకు తరలించారు. అత్యవసర విభాగంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, సీఎస్‌ఆర్‌ఎంవోలు డాక్టర్ కయ్యల చంద్రయ్య, డాక్టర్ శ్రీహరి నేతృత్వంలో వైద్య బృందం కోటికి ప్రాథమిక వైద్యసేవలు అందించింది. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. రుయా ఆసుపత్రి వద్ద ధర్నా.. రుయా చికిత్స పొందుతున్న కోటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు,, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరామర్శించారు. కోటికి మెరుగైన వైద్యం అందలేదంటూ, ఆయన ప్రాణాలకు ఏదైనా జరిగితే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీపీఎం నాయకులు కందారపు మురళి నేతృత్వంలో ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త త నెలకొంది. ప్రభుత్వం చేతకానితనంవల్లే కోటి బలిదానానికి సిద్ధమయ్యాడని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం నుంచి వివిధ రూపాల్లో పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని నినదించారు. మొదటినుంచి ఉద్యమకారుడే..: తిరుపతిలో గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కోటి చురుకైన పాత్ర పోషిం చాడు. ఆందోళనలో తన నిరసన గళాన్ని తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.ఆత్మహత్యాయత్నానికి ముందు ఇంట్లో ‘ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంద’ని చెప్పినట్లు కోటి కుటుంబీకులు తెలిపారు. ఘటన జరిగిన తీరు... ►3.30 గంటలకు తిరుపతిలో కాంగ్రెస్ పోరుబాట సభ వద్దకు బీఎంకే కోటి చేరుకున్నాడు. ►4.05గంటలకు సభ ప్రారంభమైంది. ►4.15 గంటలకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బీఎంకే కోటి నినాదాలు. ►4.17 గంటలకు తనతోపాటు బాటిళ్లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ►4.20 గంటలకు ఒంటిపై ఎగిసిపడుతున్న మంటలతో నినాదాలు చేస్తూ సభలో పరుగులు తీశాడు. ►4.23 గంటలకు కోటికి అంటుకున్న మంటలను శేషాద్రి అనే వ్యక్తి తన చొక్కాను విప్పి ఆర్పే ప్రయత్నం చేశాడు. ► 4.28 గంటలకు కోటి, శేషాద్రిలను అత్యవసర చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం. ►7.25 గంటలకు 95 శాతం కాలిన గాయాలతో ఉన్న కోటిని మెరుగైన వైద్య సేవల కోసం వేలూరు సీఎంసీకి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలింపు. ►7.35 గంటలకు 40 శాతం కాలిన గాయాలతో ఉన్న శేషాద్రిని కూడా మరో ప్రత్యేక అంబులెన్స్‌లో వేలూరు సీఎంసీకి తరలించారు. భావోద్వేగాలకు లోను కావద్దు యువతకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత భావోద్వాలకు లోనై ఆత్మాహుతికి పాల్పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి, సమాజానికి యువత చాలా ముఖ్యమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. తిరుపతిలో కోటి అనే యువకుడి ఆత్మాహత్యాయత్న ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది. ఏపీకి అన్ని రాష్ట్రాలతో పోటీపడే స్థాయి వచ్చే వరకూ సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆత్మహత్యలొద్దు.. పోరాడి సాధించుకుందాం: జగన్ హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని, పోరాడి సాధించుకుందామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చే యడం తనకెంతో బాధ కలిగించిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువకుడి ప్రాణాలను రక్షించడానికి తగిన వైద్య సహాయం వెంటనే అందించాలని జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన కోరారు. మాట తప్పిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కూడా ఆయన సూచించారు. -
ఏకాభిప్రాయం వచ్చినట్లే!
భూ బిల్లుపై దిగ్విజయ్ కొనసాగుతున్న తెరచాటు చర్చలు వ్యాపమ్‌లో నా పాత్ర ఏమీ లేదు న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని కొన్ని అంశాలపై సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం వచ్చినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శనివారం లక్నోలో తెలిపారు. బిల్లుపై పలు పార్టీలతో తెరచాటు చర్చలు కొంతమేరకు సత్ఫలితాలిచ్చాయన్నారు. భూసేకరణపై పార్లమెంట్ సంయుక్త కమిటీలో సభ్యుడైన దిగ్విజయ్ ఏ అంశాలపై ఏకాభిప్రాయం వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమైన దిగ్విజయ్.. జీఎస్టీ బిల్లుపై కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ దాన్ని అడ్డుకుందని.. ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటులో ఒకటిన్నరశాతం నష్టం కలుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఆరోపించారు. వ్యాపమ్‌లో నా పాత్రేమీ లేదు.. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కాంలో తన పాత్ర ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను దిగ్విజయ్ కొట్టిపారేశారు. తన హయాంలో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘన కూడా జరగలేదన్నారు. మంత్రిమండలిలో హేతుబద్ధమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకున్న తరువాతే ఆ నియమాలను అనుసరించి నియామకాలు జరిగాయన్నారు. వ్యాపమ్ లో దిగ్విజయ్కీ భాగం ఉంది: బీజేపీ భోపాల్: వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్‌కు కూడా పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. 1993-2003మధ్య దిగ్విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియమాలను గాలికి వదిలేసి వివిధ శాఖల్లో 16 నియామకాలు చేశారని బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ అధ్యక్షుడు నందకుమార్ సింగ్ శనివారం ఆరోపించారు. ఈ వ్యవహారంలో దిగ్విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. 1997 సెప్టెంబర్ 27న దిగ్విజయ్ చేసిన సంతకాలతో కూడిన 16 నియామకాల నోట్‌షీట్లను ఆయన విలేకరులకు చూపించారు. -
యువరాజునే నమ్ముకుంటే ఇక అంతే..!
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మళ్లీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారనగానే కాంగ్రెస్ సీనియర్లు పెదవివిరుస్తున్నారు. మూడు, మూడున్నర నెలల వ్యవధిలోనే యువరాజు మళ్లీ ఇక్కడకు రావడమేమిటా అని వారు నిట్టూరుస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై, అధికారపక్షం వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడి ప్రజల మనసులను గెలుచుకోవాల్సింది పోయి రాహుల్‌గాంధీ వచ్చి ఏదో అద్భుతం చేస్తారనుకుంటే ఎలా అని వాపోతున్నారట. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వెల్లడవుతున్న అసంతృప్తిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకునేందుకు రాష్ట్రనాయకులు వ్యూహాన్ని రచించకుండా రాహుల్‌గాంధీ తన పర్యటనలతో ఏదో మాయచేసేస్తాడని నమ్ముకుంటే ఎట్లా అని తమలో తాము గుసగుసలాడుకుంటున్నారట. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళితే ఏమాత్రం ఓట్లు వచ్చాయి, ఆయా ప్రాంతాల ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేశారో రాష్ట్రముఖ్యనాయకులు గుర్తుచేసుకుంటే మంచిదని సలహాలు కూడా ఇస్తున్నారట. పార్టీని బలోపేతం చేసుకోవడం, కేడర్‌లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపి సొంతబలాన్ని పెంచుకోవడం ద్వారానే రాష్ట్రంలో పార్టీ పునర్వైభవాన్ని సాధించగలదే తప్ప యువరాజ్ మ్యాజిక్‌ను నమ్ముకుంటే ఇక అంతేనని తేల్చేస్తున్నారట... -
జోరు లేని కారు
టీఆర్ఎస్లో వీడని స్తబ్దత కాంగ్రెస్‌లో పెరిగిన హడావుడి కార్యాచరణలో ప్రతిపక్ష పార్టీలు ముంచుకొస్తున్న వరంగల్ ఉప ఎన్నిక వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. బీహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. అక్టోబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని... దీనికి 45 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలూ కార్యాచరణ ముమ్మరం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంది. బీజేపీ, టీడీపీ ఇదే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యి. వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యాచరణ మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టడంలేదు. టీఆర్ఎస్ పార్టీలో 4 నెలలుగా స్తబ్దత నెల కొంది. పార్టీ కార్యక్రమాలు అనేవే జరగడంలేదు. అధికార పార్టీగా టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారనున్న వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల్లో కదలిక కనిపించడంలేదు. టీఆర్ఎస్కు సంబంధించి అన్ని నిర్ణయాలు అధినేత కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా... ఎన్నికల విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు తప్పితే.. మిగిలిన వారు ఈ విషయంపై చర్చ కూడా జరపడంలేదు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్లో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఉపఎన్నిక విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పీసీసీ చీఫ్ వంటి నేతలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాలకు ఓ సారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, డి.శ్రీధర్‌బాబు వంటి నేతలు నియోజకర్గాల బాధ్యతలను తీసుకున్నారు. జిల్లా నేతలు వీరికి అనుబంధంగా పనిచేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడం బాగానే ఉన్నా... పార్టీ ప్రకటించిన ప్రకారం కార్యక్రమాలు జరగడంలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మండల, డివిజన్, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కోసమే నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో ఆచరణకు రావడంలేదు. ఎక్కువ మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడలేదు. రెండు పార్టీలు బరిలో దిగాలని భావిస్తున్నాయి. పైకి కూటమి గా కనిపిస్తున్నా... రెండు పార్టీలు ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ముఖ్యనేతలు జిల్లాకు ఎక్కువగా వస్తున్నారు. టీడీపీ సైతం కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇటీవలే కార్యాచరణ సిద్ధం చేసింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేత షర్మిల పరామర్శ యూత్ర త్వరలో మొదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీ నాయకులు ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీల్లో వరంగల్ లోక్‌సభ ఎన్నిక వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. -
‘హోదా’ కల్పించడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలం
సీపీఐ నేత నారాయణ ధ్వజం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను బలవంతంగా విడదీసిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైయ్యాయని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. పార్లమెంటులో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రత్యేక హోదాపై హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నాయన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి లేఖ అందజేసినట్టు నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే నేరమా?
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నిలదీత లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ దారుణమని మండిపాటు నిరసనగా కాంగ్రెస్ ధర్నా హైదరాబాద్: అవినీతిని ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా మండిపడ్డారు. లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసనగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, నోటికి నల్లబట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్, కుంతియా మాట్లాడుతూ... ఆర్థికనేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న లలిత్‌మోదీకి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మద్దతుగా ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజస్తాన్ సీఎం వసుంధర రాజేకు చెందిన కంపెనీలకు లలిత్‌మోదీ నుంచి నిధులు ఎలా వచ్చాయని నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంతో లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి, ప్రభుత్వమే వరుస హత్యలకు పాల్పడిందని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినమని ఉత్తమ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్లోనూ.... ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ఏపీసీసీ, టీపీసీసీ సంయుక్తంగా దహనం చేశాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు జరిగాయని ఉత్తమ్ చెప్పారు. -
మా పాలిట దేవుడు వైఎస్
కాంగ్రెస్ ధర్నాలో ఓ రైతు ఉద్వేగభరిత ప్రసంగం అచ్చంపేట రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన హయాంలోనే వ్యవసాయాన్ని పండగలా చేశామని ఓ రైతు పేర్కొన్నాడు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ ధర్నాలో పలువురు రైతులు దివంగత నేత వైఎస్‌ను స్మరించుకున్నారు. ఉప్పునుంతల మండల రైతులు సాకలి జంగయ్య అక్కడే ఓ నాయకుడి చేతిలో ఉన్న మైక్‌ను తీసుకుని తన ఆవేదన వ్యక్తపరిచారు. కాంగ్రెస్ నేతలు వైఎస్ పేరును ప్రస్తావించకుండా వారిస్తున్నా.. వినిపించుకోలేదు. రాజశేఖరరెడ్డి రైతుల కోసమే ప్రతి పథకం ప్రవేశపెట్టారని, రైతుల పాలిట ఆయన దేవుడిగా నిలిచిపోయారన్నారు. ప్రస్తుతం కరువు తాండవిస్తున్నా రైతులను, మూగజీవాలను పట్టించుకునే నాథుడేలేడని వాపోయారు. గ్రామాల్లో గుడిసెలు లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వాళ్లకు అన్నం పెట్టడం లేదని, అడగనోళ్లకు మాత్రం అన్నీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అన్నమో రామచంద్రా! అని తల్లడిల్లుతుంటే మద్యాన్ని చౌకగా అందిస్తామంటున్నారని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రతి కార్యకర్త ఈలలు వేస్తూ.. జై వైఎస్ఆర్! అని నినదించారు. -
కదంతొక్కిన కాంగ్రెస్..
నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు.. ధర్నాలు ఇందిరమ్మ బిల్లులు చెల్లించాలని డిమాండ్ సాక్షి నెట్వర్క్: ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ►ఖమ్మం జిల్లాలోని మధిరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధర్నాలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే నిర్మాణాలను కూల్చడం కాదని, కట్టుకున్న నిర్మాణాలను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హరి రమాదేవి, డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ►నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ►మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని నిర్బంధించారు. గద్వాలలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే డీకే అరుణ పాల్గొన్నారు. జచ్చర్లలో పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి ఆందోళన లో పాల్గొన్నారు. ►ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి నాయకత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. చెన్నూరులో జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ►కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు విజయవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, పీసీసీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు. పొన్నంతోపాటు కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బైఠారుుంచడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ►నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. మోర్తాడ్‌లో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నిజామాబాద్‌లో టీపీసీసీ నేత మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ►వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. వరంగల్ నగరంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి హౌసింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్‌లో మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారుు. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆందోళనలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ విధ్వంసక విపక్షం బీజేపీ మండిపాటు
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి 25 మంది తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేయడాన్ని అధికార బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్‌ను విధ్వంసక విపక్ష పార్టీగా అభివర్ణిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం తీర్మానం చేసింది. అభివృద్ధి నిరోధక విధానాలకు పాల్పడుతూ ఆటంకవాదిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించిన సోనియా... ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్ డే అని మండిపడటాన్ని బీజేపీ ఆక్షేపించింది. నిరాధార ఆరోపణలతో సుష్మ, రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల రాజీనామాకు డిమాండ్ చేయడం శోచనీయమని తీర్మానంలో పేర్కొంది. తమ పార్లమెంటరీ పార్టీ ఆ ముగ్గురికి అండగా ఉంటుందని పునరుద్ఘాటించింది. మంగళవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు మంత్రులు హాజరయ్యారు. -
పార్లమెంట్లో సస్పెన్షన్ ప్రకంపనలు
కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఒక్కటైన విపక్షం గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా.. పాల్గొన్న ఎస్పీ, ఆర్జేడీ, ఆప్ ధర్నాలో నల్ల బ్యాడ్జీలతో పాల్గొన్న సోనియా, రాహుల్ సహచర ఎంపీలతో గళం కలిపి నినాదాలు లోక్‌సభలో కాంగ్రెస్ బాయ్‌కాట్, వాకౌట్లతో విపక్షాల సంఘీభావం న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రాంగణం మంగళవారం నినాదాలు, నిరసనలతో హోరెత్తింది. లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను తీవ్రంగా తీసుకున్న విపక్షం ఐక్యంగా అధికార పక్షంపై ఎదురుదాడి ప్రారంభించింది. తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలపై స్పీకర్ వేటు వేయడంపై కాంగ్రెస్ పార్లమెంటు లోపల, వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. సస్పెన్షన్‌కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ‘వి వాంట్ జస్టిస్’, ‘నరేంద్ర మోదీ డౌన్ డౌన్’ ‘నియంతా! సిగ్గు, సిగ్గు’ తదితర నినాదాలతో హోరెత్తించారు. సాధారణంగా ధర్నాల్లో మౌనంగా కూర్చునే సోనియా సైతం.. సహచర ఎంపీల నినాదాలకు గళం కలిపారు. పిడికిలెత్తి నినాదాలు చేస్తూ సహ సభ్యుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశం అనూహ్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసింది. కాంగ్రెస్ ధర్నాలో సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్ పార్టీల ఎంపీలు సైతం పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్‌పై కోల్‌కతా, జమ్ము, శ్రీనగర్, లక్నో సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్‌కు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. కాంగ్రెస్(సస్పెన్షన్‌కు గురికాని సభ్యులు), తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ముస్లింలీగ్, జేడీయూ సభ్యులు లోక్‌సభ కార్యక్రమాలను బహిష్కరించగా, లెఫ్ట్, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు సభ ప్రారంభం అయిన కాసేపటికి వాకౌట్ చేశారు. దాంతో విపక్ష స్థానాలు దాదాపు ఖాళీ అయ్యాయి. మరోవైపు, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణాకు ప్రత్యేక హైకోర్టు కోరుతూ టీఆర్ఎస్ సభ్యులు తమ చొక్కాలకు నినాదాలు రాసిన కాగితాలను పిన్ చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్యలోనే రైల్వే అప్రొప్రియేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ప్రారంభం కాగానే భుజాలకు నల్ల రిబ్బన్లు కట్టుకున్న కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిలో ఒకరు నల్లని వస్త్రాన్ని ఊపుతుండటంపై డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదాల అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. పునరాలోచించండి.. 25 మంది కాంగ్రెస్ ఎంపీలకు విధించిన శిక్షను తగ్గించాలని, సభలో విపక్షం లేని పరిస్థితుల్లో ముఖ్యమైన శాసన సంబంధ కార్యకలాపాలను చేపట్టకూడదని లోక్‌సభలో బీజేడీ సభ్యుడు తథాగత్ సత్పథి స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కోరారు. ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తేందుకు అన్నాడీఎంకే సభ్యుడు వేణుగోపాల్ చేసిన ప్రయత్నాన్ని స్పీకర్ అడ్డుకున్నారు. నీవు నేర్పిన విద్యయే జైట్లీజీ: అయ్యర్ జీఎస్టీ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విమర్శలను కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ తిప్పికొట్టారు. యూపీఏ హయాం నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు సభ ఆమోదం పొందకుండా అడ్డుకుంది జైట్లీ నాయకత్వంలోని బీజేపీనేనని గుర్తు చేశారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తీవ్రంగా వ్యతిరేకించినందువల్లనే బీజేపీ ఆ వైఖరి తీసుకుందని విమర్శించారు. ‘బిల్లులను అడ్డుకోవడం ఎలానో మాకు నేర్పిన జైట్లీనే ఇప్పుడు మేం వాటినే పాటిస్తోంటే విమర్శిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: సోనియా తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో కలసి ఆమె నినాదాలు చేశారు. పార్లమెంటు నుంచి గెంటేసినా, సభలో అడుగుపెట్టనివ్వకపోయినా.. కళంకిత బీజేపీ నేతలు రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆగదని రాహుల్ స్పష్టం చేశారు. ‘వ్యాపమ్ స్కామ్ వేలాది మంది భవిష్యత్తును నాశనం చేసింది. మోదీగేట్‌లో సుష్మ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. రాజస్తాన్ సీఎంకు లలిత్ మోదీతో ఆర్థికపరమైన సంబంధాలున్నాయి. వారిపై చర్యలు తీసుకునే విషయంలో మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రధాని.. దేశ ప్రజల మాట వినేందుకు ఎందుకు ముందుకు రావడంలేదు? బీజేపీ కళంకిత నేతల రాజీనామా మా డిమాండ్ కాదు.. దేశ ప్రజల డిమాండ్’ అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడం సమస్యను పరిష్కరించే మార్గం కాదని మన్మోహన్ అన్నారు. స్పీకర్ నిర్ణయం సరికాదని, ఆమె పునరాలోచించాలని ఎస్పీ అధినేత ములాయం సూచించారు. -
ఓట్ల పండగ
రాష్ట్ర మినీ శాసనసభ ఎన్నికలుగా అభివర్ణించే ృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర విషయాలకు సంబంధించిన కసరత్తులను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర హోం శాఖ ప్రణాళికలు రచిస్తోంది. సాక్షి, బెంగళూరు ఇది కాంగ్రెస్ వ్యూహం చాలా ఏళ్లుగా బెంగళూరు మేయర్ పదవికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందు కోసం ముఖ్యమంత్రితో పాటు బీబీఎంపీ పరి దిలోని మంత్రులే కాకుండా మిగిలిన నాయకులందరూ బెంగళూరులోనే మ కాం వేయనున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క నియోజకవర్గంలోని వార్డుల ను కేటాయించి ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బ్లాక్ స్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారంతో పాటు ‘కానుకల పంపిణి’ వం టి విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రోజుకు రెండు సార్లు నగర పర్యటన చేస్తానని ప్రకటించేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకూ ప్రభుత్వం చేపట్టిన సంక్షమ పథకాలపై విృ్త త ప్రచారం కల్పించనున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక విషయంలోకూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది. గత రెండేళ్లుగా ఆయా వార్డులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్టు కేటాయించకూడదని నిర్ణయించింది. తద్వారా ఆయా వా ర్డుల అభ్యర్థి ఎంపిక సమయంలో అసమ్మతిని చాలా వరకూ నివారించినట్లవుతుందని హస్తం అధినాయకుల ఆ లోచన. ఇలాంటి ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయినా ‘వ్యతిరేకులకు టికెట్టు కేటాయించకపోవడం’ మి గిలిన ప్రాంతాల్లోని కాంగ్రెస్ కార్యకర్త ల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్న భావన పెరిగి అంతిమంగా ఆ ఆ లోచన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపును చేకూరుస్తుందని ఆ పార్టీలోని నాయకులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 5లోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 6తేదీ నాటికి బీ-ఫాంలు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. మాజీ కార్పొరేటర్ భార్యలకు టికెట్టు లేదంటున్న బీజేపీ! ఈసారి మొదటిసారిగా బీబీఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది తాజామాజీ కార్పొరేటర్లు ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో తాము ప్రాతినిథ్యం వహించిన స్థానాల్లో తమ భార్యలను పోటీలో నిలబెట్టి గెలిపించుకుని, తద్వారా తాము అనధికార కార్పొరేటర్లుగా చలామణి కావాలని చాలమంది నాయకులు భావిస్తున్నారు. అయితే భారతీయ జనాతా పార్టీ ఇందుకు చెక్ పెట్టాలని చూస్తోంది. తాజా మాజీ కార్పొరేటర్ల భార్యలకు ఈ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు పాటుపడిన మహిళా కార్యకర్తలను గుర్తించి వారికి టికెట్టు ఇవ్వాలని భావిస్తోంది. దీనివల్ల మహిళా ఓటర్లను ఆకట్టుకుని ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు చేజెక్కించుకోవాలనేది కమలనాథుల ఆలోచన. ఇదిలా ఉండగా బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ సమితిని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సమితిలో కేంద్రమంత్రులు అనంతకుమార్, డీ.వీ సదానందగౌడతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్. అశోక్ భాగస్వాములుగా ఉంటూ, పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ప్రధానంగా తమ భుజస్కంధాలపై వేసుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఉప సమితులకు సంబంధించి ప్రచార విభాగానికి బీ.ఎన్ విజయ్‌కుమార్, ప్రణాళిక రూపకల్పన విభాగానికి ఎస్. సురేష్‌కుమార్, మీడియా విభాగాన్ని అశ్వర్థనారాయణ పర్యవేక్షించనున్నారు. బాండ్ పేపర్‌పై ‘రాజీనామా’ సంతకం చేయించనున్న జేడీఎస్? అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వారు తప్పు చేశారన్న ఆరోపణలు వస్తే అలాంటి కార్పొరేటర్లను వెంటనే తొలగించడానికి వీలుగా జేడీఎస్ పార్టీ వినూత్న పంథాను అనుసరిస్తోంది. సాధారణంగా అభ్యర్థుల ఎంపిక సమయంలో అసమ్మతి చెలరేగి ఆ ప్రభావం అభ్యర్థుల గెలుపుపై చూపుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వీలుగా జేడీఎస్ పార్టీ బహిరంగంగా బీ-ఫాంలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ఈనెల 5న నగరంలోని నేషనల్ హై స్కూల్ మైదానంలో బహిరంగ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫాంలు ఇవ్వనుంది. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవకతవకలకు పాల్పడటం కాని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు మొగ్గుచూపినట్లు ఆరోపణలు వచ్చి ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ ృవీకరిస్తే పదవికి వెంటనే రాజీనామా చేస్తామని అదే సమావేశంలో అందరిముందు ప్రమాణం చేయించడమే కాకుండా బాండు పేపర్‌పై అభ్యర్థులతో సంతకాలు కూడా చేయించనుంది. దీని వల్ల జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అక్రమాలకు ఆస్కారముండదంటూ ప్రచారంలో తెలియజెప్పవచ్చునని ఆ పార్టీ పెద్దల ఆలోచన. అంతేకాక కాలం కలిసొచ్చి మేయర్ ఎంపికకు జేడీఎస్ పార్టీ సహాయాన్ని ఇతర పార్టీ కోరే పక్షంలో ఆ సమయంలో కార్పొరేటర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దళపతులు ఈ నిబంధన విధించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’
డేట్లైన్ హైదరాబాద్ తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? పార్టీకి శిరోభారం అవుతారా? అనే దానిపై కేసీఆర్‌కు తన లెక్కలు తనకున్నాయి. వేలం వెర్రిగా చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. మరి కొందరు సీనియర్ నేతలూ తెలంగాణ భవన్ బాట పట్టనున్నారని వార్త. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభిస్తోంది. ఈ మహదవకాశాన్ని అందుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? ధర్మపురి శ్రీనివాస్ ఒకప్పటి రిజర్వు బ్యాంకు ఉద్యోగి. సీనియర్ కాంగ్రెస్ నేత గడ్డం రాజారామ్ ప్రియ శిష్యుడు. క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించక ముందు నుంచే ఆయన నాకు తెలుసు. 1970 దశకం చివర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన అసమ్మతి వర్గం పని చేస్తుండేది. ఆ వర్గానికి నాయకుడైన మంత్రి రాజారామ్ ఇంట్లోనే అసమ్మతి వర్గ సమావేశాలు జరిగేవి. పొలిటికల్ రిపోర్టర్లంతా సాయంకాలం కాగానే అక్కడికి చేరే వారు. పత్రికలకు బోలెడంత మేత. వెనుకబడిన తరగతుల బల మైన నాయకుడైన రాజారాం ఇంటికి నేనూ అప్పట్లో కొన్నిసార్ల్లు అసమ్మతి రాజకీయాల రిపోర్టింగ్ పనిపై వెళ్తుండేవాడిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా ఉన్న శ్రీనివాస్‌తో నాకు అక్కడే పరిచయం. అదీ పలకరింపు లకే పరిమితం. చెన్నారెడ్డి అదృష్టమనండి, అసమ్మతివర్గీయుల దురదృష్టం అనండి భారీగా వర్షం కురుస్తున్న ఓ రాత్రో లేదా తెల్లారుజామునో గానీ రాజారాం కారు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్టీ రామారావు తెలంగాణలో పెద్ద ఎత్తున వెనుకబడిన తరగతుల మద్ద తును కూడగట్టుకోగలగడానికి ఒక ముఖ్యకారణం రాజారాం ఆకస్మిక మృతే నని అనుకోవాలి. అయనే ఉంటే వెనుకబడిన తరగతుల వారు పెద్దగా తెలుగుదేశం వెంట వెళ్లేవారు కాదని అప్పట్లో రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఫిరాయింపులతోనే ‘పునర్నిర్మాణం’ రాజారాం మరణానంతరం శ్రీనివాస్ కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచె లుగా ఎదిగారు. పంచెలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేయడం చాలా మంది రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. పదవుల కోసం కొం దరు, ‘పనుల’ కోసం ఇంకొందరు, నాలుగురాళ్లు వెనకేసుకుందామని మరి కొందరు, ‘న్యాయం’ జరగడం లేదని ఇంకా కొందరు ‘కండువాలు’ మారు స్తుంటారు. పార్టీ విధానాలో, సిద్ధాంతాలో నచ్చక పార్టీలు మారే వాళ్ళు నేడు మచ్చుకు కూడా కనిపించరు. అయితే శ్రీనివాస్ దాదాపు 30 ఏళ్లు కాం గ్రెస్లోనే కొనసాగి, మొన్ననే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తాను ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే హక్కు శ్రీనివాస్‌కు లేదా? ఉంది. కానీ ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కూడా ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేదు, ఆ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తారు. మరి ఎందుకు పార్టీ మారారు? అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తానూ భాగస్వామిని కావడం కోసమేనని ప్రకటించారు. ఆత్మప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు. శ్రీనివాస్ కాంగ్రెస్‌ను వీడడానికి, టీఆర్ఎస్ ఆయనను చేర్చుకోడానికి నిజంగా ఇదే కారణమా? ఇక్కడే మనం శ్రీనివాస్‌నూ, టీఆర్ఎస్నూ కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒకటి, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏమిటి? రెండు, కాంగ్రెస్‌లో కొనసాగుతూనో లేదా కాంగ్రెస్ రాజ కీయాల పట్ల విసుగు చెంది ఉంటే అన్ని పార్టీలకు దూరంగా ఉంటూనో శ్రీనివాస్ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయే వారా? మూడు, తమ పార్టీలో చేరే వారిని తప్ప ఇంకెవరినీ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకోనివ్వవా? అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే, చివరిదశ పోరాటంలో నిర్వహించిన పాత్ర కారణంగా టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తే, ఆ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మరెవరు భాగస్వాములు కారాదనేటంత హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నాయా? అయినా తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక్క ఐదేళ్ల కాలంలోనో, ఒక్క రాజకీయ పార్టీతోనో, ఒక్క ప్రభుత్వంతోనో అయ్యేంత చిన్న పని అని అధికార పార్టీ, దానిలోకి వలసపోతున్న నాయ కులు భావిస్తున్నారా? మొత్తం తెలంగాణ సమాజం నడుంబిగిస్తేనే అది సాధ్యం. అందుకూ చాలా సమయం పడుతుంది. ‘వడ్డించిన విస్తరి’పైనే కినుకా? శ్రీనివాస్ పార్టీ మారుతూ పదవుల కోసం తాను కాంగ్రెస్‌ను వీడటం లేద న్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్‌లో తాను అన్ని పదవులనూ చేపట్టాననీ చెప్పారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్తూ కూడా వాస్తవాలను అంగీకరించి నందుకు ఆయన్ను అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. అందులో అందరికీ అన్ని వేళలా, అన్ని అవకాశాలూ రావు. ఏ పదవీ రాకపోయినా కాంగ్రెస్‌నే పట్ట్టుకుని ఉండే విధేయులు కోకొల్లలు. శ్రీనివాస్ ఆ కోవకు చెందిన వారు కారు. కాంగ్రెస్‌లో ఆయన జీవితం వడ్డించిన విస్తరి. శాసన సభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా పని చేశారు. రెండుసార్లు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్ల్లు శాసన సభ ఎన్నికల్లో వరుసగా ఓడినా... సోనియా ఆయనకు శాసన మండలిలో స్థానం కల్పించడమే కాదు, కాంగ్రెస్ పక్ష నేతను చేశారు. అరుదైన అలాంటి ఆదరణ ఆయనకు దక్కింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయనకు అధినేత్రి అపాయింట్మెంట్ దొరికే దనేది జగమెరిగిన సత్యం. అటువంటి పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని కష్ట కాలంలో... అదీ అవతల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోతామని తెలిసి కూడా వదిలేసి వెళ్లిన శ్రీనివాస్ వంటి సీనియర్ నేత తరువాతి తరం రాజకీయ నాయకులకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు? కాంగ్రెస్‌కు మహదవకాశం తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలేసి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? లేక తమ పార్టీకి శిరో భారం అవుతారా? అనేది టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తట్టలేదనుకుంటే అది ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసినట్టే అవుతుంది. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. వేలం వెర్రిగా వెళ్లి చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. శ్రీనివాస్ కాంగ్రెస్ వీడే నాటికి ఆయన ఏ పదవిలోనూ లేరు. ఆయన విషయంలో గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాల్సింది అదే. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, ఇంకో పార్టీలో చేరి, మంత్రి పదవి చేపట్టి కూడా నిస్సిగ్గుగా నా రాజీనామా లేఖ జేబులో ఉంది, మా ఇంట్లో అటక మీద దాచి ఉంచాను అని చెప్పుకు తిరుగుతున్న నాయకుల కంటే ఆయన చాలా నయం. ఇంకా కొం దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ భవన్ బాట పట్టను న్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదొక మంచి అవకాశం. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభి స్తోంది. కాంగ్రెస్ ఈ మహదవకాశాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉందా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఏం చేద్దామో చెప్పండి !
కాంగ్రెస్ కురువృద్ధుడు ఎస్‌ఎంకృష్ణకు సోనియా గాంధీ ఫోన్ బెంగళూరు: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం కృష్ణను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా రైతుల బలవన్మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. చెరుకు, మల్బరీ తదితర పంటలకు సరైన మద్దతు ధర కల్పించలేకపోవడం, మార్కెట్ సదుపాయాల విషయంలో విఫలం కావడం, వ్యవసాయ రుణాలను సకాలంలో అందించకపోవడం తదితర కారణాల వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర రాజకీయాల్లో విశేష అనుభవంతోపాటు ఇక్కడ సీఎంగా పనిచేసిన ఎస్.ఎం.కృష్ణ నుంచి సలహాలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఉదయం రెండు సార్లు ఎస్.ఎం.కృష్ణకు ఫోన్‌చేసి మాట్లాడారు. బలవన్మరణాలకు సంబంధించిన కారణాలు, పరిహారం తదితర విషయాలపై ఆరా తీశారు. వ్యవసాయ రంగం విషయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరే సమస్యకు ప్రధాన కారణమని ఎస్.ఎం. కృష్ణ పేర్కొన్నట్లు తెలిసింది. మృతుల కుటుంబాలను పరామర్శించే విషయంలో కూడా సిద్ధరామయ్యతోపాటు ఇతర మంత్రులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం వల్లే విపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు. దీంతో ‘రైతుల బలవన్మరణాల’ విషయమై ప్రభుత్వంతోపాటు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలతో పాటు ఇప్పటి వరకూ చోటుచేసుకున్న విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సోనియాగాంధీ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ఆమె కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణను ఆదేశించారు. -
నాడహళ్లి ఔట్
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తిరుగుబాట బావుటా ఎగురవేసిన విజయపుర జిల్లా దేవరహిప్పర్గీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎ.ఎస్ పాటిల్ నాడహళ్లిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కి సూచన రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర కర్ణాటక అభివృద్ధి విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల నాడహళ్లి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. ఫలితంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
సభలో స్కామ్‌ల రభస
తొలి రోజే రాజ్యసభలో తీవ్ర గందరగోళం లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై చర్చకు విపక్షాల నోటీసు సుష్మా, వసుంధర, శివరాజ్సింగ్ల రాజీనామాల కోసం పట్టు {పధాని మోదీ పారదర్శకత ఏమైంది: కాంగ్రెస్ ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం, ప్రకటనకు సుష్మా సిద్ధం ఏ చర్చ అయినా ఆ నేతల రాజీనామాల తర్వాతేనన్న విపక్షం న్యూఢిల్లీ: ఊహించిన విధంగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో మొదలయ్యాయి. మంగళవారం మొదలైన ఉభయసభల సమావేశాల్లో.. ఇటీవల మరణించిన తాజా, మాజీ ఎంపీలకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ బుధవారానికి వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గందరగోళ పరిస్థితుల్లో ఐదు పర్యాయాలు వాయిదా పడినా పరిస్థితిలో మార్పులేదు. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్లను పదవుల నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ పార్టీతో వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ గొంతు కలిపాయి. ప్రభుత్వం స్పందిస్తూ.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం సహా అన్ని అంశాలపై సభలో చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని, సుష్మా కూడా సభలో ప్రకటన చేస్తారని ప్రభుత్వం పదే పదే పేర్కొంది. కానీ, ఆ ముగ్గురు నేతలూ రాజీనామా చేయాలని ప్రతిపక్షం భీష్మించింది. ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారు? ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమయ్యాక, నివాళులు అర్పించిన వెంటనే.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం అంశాలను కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ లేవనెత్తారు. లలిత్‌గేట్‌లో సుష్మా, రాజే, వ్యాపమ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల పాత్రపై చర్చ జరగాలని ఆనంద్‌శర్మతో పాటు.. సీతారాం ఏచూరి (సీపీఎం), నరేశ్ అగర్వాల్ (ఎస్పీ) 267 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ చర్చ తర్వాతే సభా కార్యకలాపాలు నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి పట్టుపట్టారు. మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్‌మోదీకి ప్రయాణ పత్రాలు అందించాల్సిందిగా.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లో సుష్మాస్వరాజ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు విజ్ఞప్తి చేశారని ఆనంద్‌శర్మ ప్రశ్నించారు.లలిత్‌మోదీకి మద్దతుగా వసుంధరరాజె ప్రమాణపత్రంపై సంతకం చేసిన అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అంది స్తాన మోదీ ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారని ధ్వజమెత్తారు. మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోజాలరన్నారు. విపక్షం పారిపోతోంది: జైట్లీ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడుతూ.. విపక్షం ఇచ్చిన 267 నిబంధన నోటీసు మేరకు లలిత్‌గేట్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తక్షణమే చర్చ మొదలు పెట్టాలన్నారు. సుష్మాస్వరాజ్ కూడా వివరణ ఇస్తారన్నారు. అయినా విపక్షాల నినాదాలు ఆగలేదు. దర్యాప్తుకు చర్చ అనేది ప్రత్యామ్నాయం కాబోదని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో సభ పలుమార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకోవడం తప్పితే, చర్చ జరగాలని కోరుకోవడంలేదని జైట్లీ విమర్శించారు. చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కానీ కాంగ్రెస్ పారిపోతోందన్నారు. లలిత్‌గేట్‌పై చర్చ జరిపించడానికి కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మను పిలిపించాలని సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ను ఆయన కోరారు. చర్చకు అధికార, విపక్షాలు సిద్ధంగా ఉండటంతో నోటీసును అనుమతిస్తున్నట్లు కురియన్ పేర్కొన్నారు. విపక్షాలు పట్టువీడకపోవటంతో ఆయన సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సభ మొదలయ్యాక కూడా పరిస్థితి మారలేదు. ఎవరూ రాజీనామా ఇవ్వబోరని, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌నఖ్వీ పేర్కొన్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని సభాపక్ష నేత ప్రకటించారని, చర్చకు అభ్యంతరం ఏమిటని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఏచూరిని ప్రశ్నించారు. సభలో విపక్షం ఆందోళనలను కొనసాగించడంతో బుధవారానికి వాయిదా వేశారు. గందరగోళం మధ్యనే.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లును సభ నుంచి ఉపసంహరించారు. దీనిపై ప్రభుత్వం గత నెలలో ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. చర్చ కాదు.. రచ్చే వారికిష్టం: వెంకయ్య న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చర్చ జరగడం ఇష్టం లేదని, రచ్చ చేయడమే వారి ఉద్దేశమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటే అది జాతికే నష్టమని పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వందేళ్ల రాజకీయ అనుభవం, యాభై ఏళ్ల పాలనానుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. పార్లమెంటులో వ్యవహరించిన తీరు విచారకరం. ఆ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీకే ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభం కాకముందే.. సమావేశాలు జరగవు.. జరగనివ్వబోమని ఆ పార్టీ ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఎవరైనా చర్చకు పట్టుబట్టి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలి. కానీ సమావేశాలే జరగనివ్వబోమని చెప్పడం విడ్డూరం...’’ అని ధ్వజమెత్తారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో కూడా వారి వైఖరి అలాగే ఉంది. మిగిలిన 28 పార్టీలు చర్చ జరగాలి.. తమకు అవకాశం కావాలి.. అని కోరాయి. దాంతో కాంగ్రెస్ స్వరం మార్చి తమకు సంతృప్తికరమైన సమాధానం కావాలని పేర్కొంది. వాళ్లకు అధికారం తప్ప మరొకటి సంతృప్తినివ్వదు. అందుకే ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా రాజ్యసభలో గందరగోళం సృష్టించి రభసకు కారణమయ్యారు.’’ అని తప్పుపట్టారు. ‘‘లోక్‌సభ సిట్టింగ్ సభ్యుడు చనిపోతే నివాళులు అర్పించి సభను వాయిదా వేయడం సంప్రదాయం. సభ వాయిదా పడుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్, వామపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. నిబంధనలు తెలియవా?’’ అని వెంకయ్య మండిపడ్డారు. ‘‘మా మంత్రివర్గంలో ఎవరిపైనా ఆరోపణలు లేవు. రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలు వస్తే రాష్ట్రాల్లో చర్చించుకోవాలి. అవన్నీ చర్చించడానికి పార్లమెంటు ఎలా వేదిక అవుతుంది?’’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ పట్టుబడుతోంది కదా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘వాళ్లు పట్టుబడుతున్నది బిల్లులో ఉన్న అంశాల గురించి. బిల్లులో అది లేదు...’’ అని వెంకయ్యనాయుడు బదులిచ్చారు. -
పొన్నాల పుష్కర స్నానం
మంగపేట: పీసీసీ మాజీచీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజనాల శ్రీహరి, ఆపార్టీ ముఖ్య నాయకులు గురువారం మంగపేటలో పుష్కర స్నానం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పితృ దేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం నాయకులు మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణ పేరిట స్వామివారికి రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్, బండా ప్రకాష్, ఎర్రబెల్లి వరద రాజేశ్వరావు, రమాకాంత్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, నమిళ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, మాజీ సర్పంచ్ గోను తిరుపతి తదితరులు ఉన్నారు. -
సీబీఐ ఉచ్చు
*అక్రమ మైనింగ్‌లో కాంగ్రెస్ నేతలకు బిగుసుకుంటున్న వైనం *అనిల్‌లాడ్ అరెస్ట్‌తో బళ్లారి జిల్లాలోని గనులు యజమానుల గుండెల్లో దడ బళ్లారి : బీజేపీ నాయకులే బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ అసలు బండారం బయట పడింది. బుధవారం సాయంత్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్‌ను బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో బళ్లారిలో మళ్లీ అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల గుండెల్లో దడ మొదలైంది. ఇప్పటి వరకు బీజేపీకి చెందిన వారినే అక్రమ గనుల తవ్వకాల్లో అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ అధికారులు సమగ్ర తనిఖీలు చేస్తుండటంతో కాంగ్రెస్ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బళ్లారి జిల్లా సండూరులో గనులు తవ్వకాల్లో అనిల్‌లాడ్ రారాజుగా వెలుగొందారు. వీఎస్లాడ్, వీఎస్లాడ్ అండ్ సన్స్‌కు చెందిన గనుల తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. 2010లో ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌కు చెందిన వీఎస్ లాడ్ గనుల కంపెనీ నుంచి కార్వార ఎమ్మెల్యే సతీష్శైల్కు చెందిన మల్లికార్జున షిప్పింగ్ కంపెనీకి అక్రమంగా 1.50 లక్షల టన్నుల ఇనుప ఖనిజం సరఫరా చేశారనే ఆరోపణలు ఉండటంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. 2010 నుంచి ఆయనపై ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ తాను అక్రమ గనుల తవ్వకాలు చేపట్టలేదంటూ బూకాయిస్తూ వచ్చారు. బళ్లారి జిల్లాకు చెందిన అక్రమ గనుల తవ్వకాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రస్తుతం ఉచ్చు బిగుసుకుంటుండటంతో మిగిలిన అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల్లో దఢ మొదలైంది. బళ్లారి జిల్లాలోని హొస్పేట, సండూరు, బళ్లారి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖులకు అక్రమ గనుల తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అక్రమ గనులు తవ్వకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనిల్‌లాడ్ అరెస్ట్‌తో నోరు మూతపడినట్లయింది. బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన గనుల కంపెనీల్లో సీఈసీ ఇచ్చిన సీ క్యాటగెరీ నివేదికలో అనిల్‌లాడ్‌కు చెందిన గనుల కంపెనీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అక్రమ గనుల తవ్వకం కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటోంది. -
కలిసి ఉందాం..
పార్టీ నాయకులకు సీఎం సిద్ధు దిశానిర్దేశం మంత్రులు కృష్ణభైరేగౌడ, ఆంజనేయపై సహచర నాయకుల ఆక్రోశం సీఎల్పీకు గైర్హాజరైన రెబెల్ స్టార్ అంబరీష్ బెంగళూరు : అవిశ్వాస తీర్మానాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఇందుకు శాసనసభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ)లో పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. అంతేకాక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్న విపక్ష జేడీఎస్ పార్టీ పై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో విధానసౌధాలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే సిద్ధరామయ్య మాట్లాడారు. ‘ప్రభుత్వం పడిపోదని తెలిసినా రాజకీయ ప్రయోజనం ఆశించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి జేడీఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్రమాలు జరిగినట్లు ఆ పార్టీ నాయకులు భావిస్తే శాఖవారి చర్చల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అలాకాక అవిశ్వాస తీర్మానానికి ముందుకు పడటం సరికాదు. ఆ పార్టీకు తగిన బుద్ధి చెప్పాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. శాఖ పరంగా గణాంకసహిత జవాబులు చెప్పడానికి మంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలి.’ అని పేర్కొన్నారు ఈ సమయంలో కలుగజేసుకున్న సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కే.బి కోళివాడ మేము మీవెంట ఉంటాం. అవిశ్వాస తీర్మానం తప్పక వీగిపోతుంది. అని భరోసాయిచ్చారు. ఇందుకు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చాలా మంది నాయకులు మద్దతు పలికారు. అయితే సభలో పాల్గొన్న నాయకుల్లో చాలా మంది వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడమే వ్యవసాయశాఖ పనికాదన్నారు. రైతులకు సరైన సమయంలో అవసరమైనంత మేర రుణాలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత ఆ శాఖపై ఉందని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబానైనా మంత్రి కృష్ణైభైరేగౌడ పరమార్శించారా? బలవన్మరణాలు తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అవాక్కయిన అయన మీ సలహాలు, సూచనలు పాటిస్తానంటూ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో శాంతించిన నాయకులు వ్యవసాయ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రులతో సలహాసమితి రూపొందించి పరిహారం అందించే విషయమై రెవెన్యూ డివిజన్ల వారిగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని సూచించారు. ఇందుకు మంత్రి కృష్ణభైరేగౌడ సమ్మతించడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖలో పరుపులు, తలగడ (దిండ్లు) కొనుగోలులో జరిగిన అక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్నట్లు బహిరంగ వాఖ్యలు చేసిన ఆ శాఖ మంత్రి ఆంజనేయ పై కూడా సహచరులు గరం అయ్యారు. ఈ సమయంలో సిద్ధరామయ్యతో సహా కొంతమంది సీనియర్ నాయకులు కలుగజేసుకుని పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చారు. రైతుల ఆత్మహత్యల విషయంతోపాటు లోకాయుక్త పై అవినీతి ఆరోపణలు తదితర విషయాల పై చర్చించేందుకు వచ్చే బుధవారం మరోసారి సీఎల్పీ నిర్వహిస్తానని సిద్ధరామయ్య సమావేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ‘రెబెల్‌స్టార్’ గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్ సీఎల్పీకు గైర్హాజరయ్యారు. -
పార్లమెంట్లో సీఎంల మంటలు!
బీజేపీ ముఖ్యమంత్రులపై ఆరోపణలతో దద్దరిల్లనున్న సమావేశాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు టార్గెట్ 21 నుంచి మొదలుకానున్న వర్షాకాల సమావేశాలు న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఆరోపణలు ఈసారి పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనున్నాయి. వారు గద్దె దిగాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో గొంతెత్తనున్నాయి. జూలై 21నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణం వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, లలిత్‌గేట్ స్కాంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, పీడీఎస్ స్కాంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లపై ఆరోపణలను అస్త్రంగా మలిచి ప్రధాని నరేంద్రమోదీని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీ సీఎంలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్(కాంగ్రెస్) వ్యవహారాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. త్రిపురలో చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సర్కార్(సీపీఎం)ను నిలదీసేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేకపోతున్నారని విమర్శలపాలవుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), అనేక అంశాలపై కేంద్రంతో విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు సంధించనున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతమంది సీఎంలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించలేదు. ఈసారి మాత్రం ముఖ్యమంత్రులపై ఆరోపణలే ప్రధానాస్త్రాలుగా ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతుండడం గమనార్హం. అలాగే లలిత్‌మోదీకి వీసా సాయమందించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, విద్యార్హతల విషయంలో వివాదంలో చిక్కుకున్న మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ప్రధాని భేటీకి కాంగ్రెస్ సీఎంల డుమ్మా! భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు 15న మోదీ తలపెట్టిన సీఎం సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించనున్నారు. భూసేకరణ బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు, ఈ సమావేశాల్లోనైనా బిల్లును గట్టెక్కించే ఉద్దేశంతో భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కాబోనని బెంగాల్ సీఎం మమత ఇప్పటికే వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత తొమ్మిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరైతే దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలలో ఏకంగా 10 మంది ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టినట్టవుతుంది! నేడు సోనియా ఇఫ్తార్ విందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం పలు పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు తమతో కలసి వచ్చే పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ విందు సమావేశంలో సోనియా.. నేతలతో చర్చించనున్నారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), శరద్‌పవార్(ఎన్సీపీ), సీతారాం ఏచూరి(సీపీఎం), దేవెగౌడ(జేడీఎస్), అహ్మద్(ఐయూఎంఎల్), కనిమొళి(డీఎంకే), డి.రాజా(సీపీఐ), సుధీప్ బంధోపాధ్యాయ(తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)కు ఆహ్వానాలు పంపారు. -
టార్గెట్
సిద్ధుపై అధికార పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించే దిశగా ‘అంబి’కి మద్దతిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిద్దు పై నిరసన గళాన్ని వినిపించిన రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు వీరంతా మద్దతునిస్తున్నట్లు సమాచారం. - సాక్షి, బెంగళూరు రాష్ట్రంలో సిద్ధరామయ్యకు పోటీగా నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు గాను అంబరీష్‌ని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ, ప్రభావవంత ఎమ్మెల్యేలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నియోజక వర్గాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గాల్లో తమ ప్రభావం తగ్గిపోవడమే కాకుండా పార్టీలో తమ మనుగడ కొనసాగడం కూడా కష్టమనే భావన చాలా కాలంగా వీరిలో ఉండిపోయింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన నేతగా ఉండడం, ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా వ్యవహరించగల నేత రాష్ట్ర శ్రేణుల్లో లేకపోవడంతో పాటు పార్టీ హైకమాండ్ మద్దతు కూడా సిద్దరామయ్యకు ఉండడంతో వీరంతా ఇన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్పను రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలదృష్ట్యా శామనూరు శివశంకరప్ప వెనక్కు తగ్గడంతో అసంతృప్తి ఎమ్మెల్యేలం తా మళ్లీ సిద్ధరామయ్య నే అనుసరించక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి అంబ రీష్ ఘాటుగా లేఖ రా యడంతో ఈ అసృతప్త ఎమ్మెల్యేలం తా మరోసారి సిద్ధుకు ప్రత్యామ్నాయాన్ని వెతికే పని లో పడిపోయారు. నేరు గా సిద్ధరామయ్యను ఎదిరించలేని అసృతప్త ఎమ్మెల్యేలంతా ఇప్పుడిక అంబ రీష్ ద్వారా తమ అసృతప్తిని వెల్లగక్కేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకే అంబరీష్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలుపుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులృదష్ట్యా అంబరీష్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయంగా ప్రతిబిం బించి, అదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చేరవేయాలని వీరంతా భావిస్తున్నారు. తద్వారా సిద్దరామయ్యను ఇరకాటంలో పడేయడంతో పాటు వీలైతే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సైతం తప్పించాలనేది ఈ అసృతప్త ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది. మిమ్మల్ని వదులుకోబోము..... ఇక అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేరుగా లేఖ రాసి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బెంగళూరు వచ్చేసిన మంత్రి అంబరీష్‌తో సిద్ధరామయ్య ఫోన్లో మాట్లాడారు. ‘మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. బోర్డు సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం ద్వారా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మరోసారి బోర్డు సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డెరైక్టర్ ఎంపికను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను’ అని సీఎం మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. రాజీనామా కాదు... సాక్షి, బెంగళూరు: తన రాజీనామాపై మంత్రి అంబరీష్ నోరు విప్పారు. గురువారం రాత్రి ఏడు గంటలకు జేపీ నగర్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడు తూ... ‘నాకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రూపం లో తెలిపాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాదు. రాజకీయాల్లో ఎవరికైనా తన వాళ్లంటూ కొంత మంది ఉంటారు. అదే విధంగా నాకు కూడా శ్రేయోభిలాషులున్నారు. వారికి సరైన స్థానాలను కల్పించాలన్నదే నా ఆరాటం. ఈ విషయాన్నే నేను లేఖలో వెల్లడించాను.’ అని పేర్కొన్నారు. -
నో డౌట్
కాంగ్రెస్ పార్టీ చివరిముఖ్యమంత్రి సిద్ధరామయ్యయే పరిషత్ విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప బెంగళూరు : ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు సంబంధించి చివరి ముఖ్యమంత్రిగా మారనున్నారని శాసనమండలి విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. సువర్ణ విధానసౌధాలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్రమాలకు కొదువే లేదన్నారు. దేశానికి తలమానికమైన లోకాయుక్త సంస్థ కూడా అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్తను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటైన రాష్ట్ర సాంఘిక సం క్షేమ శాఖలో రూ.వందల కోట్ల విలువ చేసే అక్రమాలు చోటు చేసుకున్నా దర్యాప్తునకు అధికార కాంగ్రెస్ పార్టీ అంగీకరించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక అధికారంలోకి రావడానికి ముందు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని చెప్పిన కాం గ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాల న్నింటినీ ప్రజలు నిషిత దృష్టితో గమనిస్తున్నారని తెలిపారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి
‘వ్యాపమ్’పై హైకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి స్కామ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారణ భోపాల్/న్యూఢిల్లీ: వరుస మరణాలతో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మంగళవారం మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మరో రెండు రోజుల్లో(గురువారం) విచారించనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టును కోరుతున్నా’నన్నారు. అనుమానాస్పద మరణాలపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతుందన్నారు. ఆ వెంటనే, ఈ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపమ్ దర్యాప్తును ఇప్పటికే హైకోర్టు నియమించిన సిట్ పర్యవేక్షిస్తున్నందున సీబీఐ విచారణ అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువురూ సోమవారం స్పష్టం చేయడం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు ఒక్కటే సరిపోదని, ఆ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగితేనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు, ఈ స్కామ్‌పై అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం బయటపడడానికి ప్రధానకారకులైన ఆశిశ్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే దాఖలు చేసిన పిటిషన్లనూ సుప్రీంకోర్టు జూలై 9న విచారించనుంది. ఈ స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లి, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శరీర అంతర్గత భాగాలను పరీక్షల నిమిత్తం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్షయ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ‘సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి’ సీబీఐ ద్వారా విచారణ జరపడం ఒక్కటే సరిపోదని, ఈ స్కామ్‌లో నిజానిజాలు వెల్లడయేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సీఎం శివరాజ్ సింగ్ హైకోర్టును కోరడం.. వాస్తవాలను కప్పిపుచ్చే మరో ప్రయత్నమని పేర్కొంది. అర్థంలేని కారణాలు చూపుతూ నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ సమాచార విభాగం చీఫ్ రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. ఈ స్కామ్‌పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని అరుణ్ జైట్లీ.. తన మద్దతుదారుల ప్రాణాల గురించి భయమేస్తుందని ఉమాభారతి.. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్టీఎఫ్ అధికారులు కూడా తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని ఎస్టీఎఫ్ చీఫ్ చంద్రేశ్ భూషణ్.. వ్యాఖ్యానించిన విషయాన్ని సుర్జెవాలా గుర్తు చేశారు. ‘దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ప్రధాని అస్సలు మాట్లాడరు. టునీసియా, అల్జీరియాల్లో జరిగే ఘటనలపై మాత్రం ట్వీట్లు చేస్తుంటారు’ అని మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్‌లో మాదిరిగా వారం వారం ఈ స్కామ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించాలని సుప్రీంను కోరుతానన్నారు. ‘అవినీతి, నేరం’ ఈ రెండింటి ప్రమాదకర సమ్మేళనం వ్యాపమ్ అని అభివర్ణించిన సీపీఎం.. దీనిపై సుప్రీం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోపాటు, చౌహాన్ రాజీ డిమాండ్‌తో ఈ నెల 16న రాష్ట్రవ్యాప్త బంద్ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. శవరాజకీయాలపైనే ఆసక్తి: బీజేపీ వ్యాపమ్‌పై కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ పార్టీకి శవ రాజకీయాలపైనే ఆసక్తి ఉంటుందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యాపమ్ స్కాంపై ఎలాంటి విచారణ జరపాలన్నది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కూలంకష దర్యాప్తు సాగాలన్నదే బీజేపీ అభిమతమని, దర్యాప్తు తరువాత కాంగ్రెసే దోషిగా తేలుతుందని అన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలనే విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం సీఎం శివరాజ్ సింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అలా చేస్తేనే విపక్ష దాడిని ఎదుర్కోగలమని భావించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ స్కామ్ చిన్న విషయమని, దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దానిపై విమర్శలు రావడంతో, ఆ తరువాత ఆ వ్యాఖ్య లలిత్ మోదీ వ్యవహారానికి సంబంధించి చేశానని వివరణ ఇచ్చారు. అసహజమే కానీ.. అనుమానాస్పదం కాదు: సిట్ చీఫ్ వ్యాపమ్ స్కామ్‌తో సంబంధమున్న వ్యక్తుల వరుస మరణాలపై ఆ స్కామ్‌ను పర్యవేక్షిస్తున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రేశ్ భూషణ్ స్పందించారు. వాటిని అనుమానాస్పద మరణాలుగా భావించలేమన్నారు. అయితే, అవి అసహజ మరణాలేనన్న విషయంలో అనుమానం లేదన్నారు. ఆ మరణాలన్నింటి పైనా దర్యాప్తు జరపాలని స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించానన్నారు. ఈ మరణాలకు, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధం ఉన్నట్లు ఏమైనా అధారాలు లభిస్తే మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ స్కామ్‌పై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సీబీఐ దర్యాప్తు కోరడంపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. ఇదిలా ఉండగా, వ్యామప్ దర్యాప్తులో భాగం పంచుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ శరీర అంతర్గత అవయవ భాగాల శాంపుల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించనున్నారు. -
రాజువయ్యా..!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడియా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాడు ప్రతిపక్ష నేత. 2004 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈసారి, అంటే ఆ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయాలు విరమించుకోవచ్చునని సన్నిహితుల దగ్గర అప్పటికే చాలాసార్లు అన్నారు. కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్రతో ఆయనకు ప్రజల నాడి తెలిసింది. అందుకే పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. లెక్కపెట్టి 175 స్థానాలు గెలుస్తాం అని చెబుతున్నారు. మీడియా మాత్రం మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావ డం ఖాయమని ఘోషిస్తూనే ఉంది. పత్రికలూ, టీవీ చానళ్లూ సర్వేలు చేయిం చాయి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని సర్వేలలో తెలిసినా అధికారంలో ఉన్న తెలుగుదేశం ఆగ్రహానికి వెరచో, అనుగ్రహం కోసమో ఆ ఫలితాలను బయటపెట్టని మీడియా సంస్థలూ ఉన్నాయి. ఒక ఆంగ్ల దినపత్రిక అయితే తెల్లవారితే ఓట్ల లెక్కింపు అనగా కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో తేలిన 175 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని పతాకశీర్షికలో అచ్చేసి అభాసు పాలైంది కూడా. ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడి యా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు. అదేరోజు మళ్లీ ప్రచారానికి వెళ్లిపోయారు. ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ యాజమాన్యం మారింది. ఆ పత్రికను సొంతం చేసుకున్నాయన కాకినాడ శాసనసభ స్థానా నికి కాంగ్రెస్ అభ్యర్థి. పాత యాజమాన్యం కింద పని చేసిన జర్నలిస్ట్‌లకూ నాన్ జర్నలిస్ట్‌లకూ చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఆయనతో మాకు వివాదం నడుస్తున్నది. కొత్త యజమాని మొండి వైఖరితో ఉన్నాడు. కార్మి కులు రోడ్డున పడ్డారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నుంచి కొంత మందిమి కాకినాడ చేరుకున్నాం. ఆరోజు రాజశేఖరరెడ్డి అక్కడ ప్రచారానికి వచ్చారు. ఆయన సమక్షం లోనే తేల్చుకోవాలనుకున్నాం. ఆయన ప్రచార రథం వెళ్లే దారిలోనే ఒక హోట ల్లో దాగి ఉన్నాం. సరిగ్గా వైఎస్ ప్రచార రథం రాగానే ఒక్క ఉదుటున రోడ్డు మీదికి వచ్చి ఆ వాహనానికి అడ్డంగా పడుకుని నినాదాలు మొదలుపెట్టాం. రథం మీద రాజశేఖరరెడ్డి, ఆయన పక్కన పత్రిక కొత్త యజమాని, కాంగ్రెస్ అభ్యర్థి. ప్రచారానికి అడ్డొచ్చామని రాజశేఖరరెడ్డి ఆగ్రహిస్తారేమోనని మాలో కొంతమంది సందేహించారు. ఆయన గురించి తెలిసిన వాళ్లం కాబట్టి మా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, నేనూ మరి కొంతమంది ధీమాగానే రోడ్డు మీద పడుకున్నాం. వైఎస్ ఏదో చెప్పగానే సూరీడు మా దగ్గరకొచ్చి శ్రీనివాస్‌రెడ్డినీ, నన్నూ సార్ పిలుస్తున్నారని చెప్పాడు. మేం రథం దగ్గరికి వెళ్లాం. మీదికి రమ్మన్నారు. ఆయనే మా చేతికి మైకు ఇచ్చి, మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నారు. మేమిద్దరం మాట్లాడాం. కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాం. వాళ్ల రథం మీద నుంచే, వారి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ఆ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడటం నాకైతే ఎప్పటికీ ఊహకు అం దని విషయం. వైఎస్‌లో ఏమీ మార్పులేదు. ఆ అభ్యర్ధి మా మాటలకు ఏదో జవాబు ఇస్తానంటే కూడా అవసరం లేదని మైకు తీసుకుని ఎన్నికలైన వెం టనే సమస్య పరిష్కరించే బాధ్యత తనదని ప్రకటించారు. ఫలితాలు వచ్చా యి. వైఎస్ అన్నట్టే అన్ని స్థానాలూ వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంత తీరికలేని స్థితిలో కూడా కాకినాడలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శాసన సభ్యుడిగా ఎన్నికైన ఆ యజమానిని పిలిపించి కార్మికుల సమస్య పరిష్కరిం చారు. ఇది నేను కాకినాడ వీధుల్లో జర్నలిస్ట్ యూనియన్‌కు ఇచ్చిన హామీ. నెరవేరి తీరాల్సిందేనని ఆనాటి సమాచారశాఖ కమిషనర్ రమణాచారిని పిలిచి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఈ చిన్న విషయం గుర్తుంచుకోనవసరం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకులు చాలా అరుదు. అందుకే ఇదంతా చెప్పడం. ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరరెడ్డి కొన్ని పత్రికల యాజమాన్యా లతో తీవ్రంగా విభేదించారు. ఆ పత్రికలు కూడా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేని విధంగా వెంటబడి కాం గ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం ప్రారంభించాయి. అందుకే ‘ఆ రెం డు పత్రికలూ..’ అంటూ విమర్శిస్తూ ఉండేవారు వైఎస్. కానీ వాటిలో ఉద్యో గాలు చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులను ఏ నాడూ చిన్నచూపు చూడలేదు. అన్ని వర్గాలకు ఇచ్చినట్టే, వైఎస్ మొదటిసారి అధికారంలోకి రాగానే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. మెడిక్లెయిమ్ పాలసీ, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు- ఇట్లా. పత్రికలు ఏం రాస్తున్నాయి, న్యూస్ చానళ్లు ఏం చూపిస్తున్నాయి అనే అంశంతో సంబంధం లేకుండా పాత్రికేయుల సంక్షేమానికి ప్రతిపాదన ఆయ న ముందు పెట్టడం ఆలస్యం, ఆమోదం పొందుతూ ఉండేది. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన రాతలకు కినుక వహించి ఆ పత్రిక కార్యాలయం మీద దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల యూనియన్ పిలుపు మేరకు మేమంతా ఎంఆర్పీఎస్ దాడిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరి పాం. ఆ పత్రిక సంపాదకుడిని పోలీసులు అరెస్టు చెయ్యడానికి వస్తే అడ్డుకు న్నాం. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని నిరసన తెలిపాం. నేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఎంఆర్పీఎస్ ఆందోళన వెనక ప్రభుత్వం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ైచైర్మన్‌గా నాది కేబినెట్ మంత్రి హోదా. ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బంది కలిగించే విష యమే. అప్పటికే ఒకరిద్దరు అధికారులూ, కాంగ్రెస్ నాయకులూ ముఖ్య మంత్రికి నామీద ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదనిపించి ముఖ్యమంత్రిని కలిసి, నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఆయన తన సహజసిద్ధమైన చిరునవ్వుతో ‘ఎందుకు స్వామి?’ అన్నారు. విషయం చెప్పాను. ‘నువ్వు యూనియన్ నాయకుడివి. ఇట్లా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తావని నేను ఎట్లా అనుకుంటాను? వెళ్లి నీపని చేసుకో!’ అని కాగితం తిరిగి నా చేతికిచ్చి కాఫీ ఇచ్చి పంపేశారు. ఆ తరువాత చాలా రోజులకు ఆయన ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్’ కార్యక్రమం రికార్డింగ్ సం దర్భంగా కలిసినప్పుడు అధికారులకు చెప్పారాయన ఈ విషయం. ప్రజా జీవితంలో రాజశేఖరరెడ్డితో కలసి నడిచిన వాళ్లు ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో పంచుకోగలరు. 1978లో మొదటిసారి ఆయన శాసనసభకు ఎన్నికైన నాటి నుంచి మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రెండుసార్లు పీసీసీ అధ్యక్షు డిగా, ప్రతిపక్ష నాయకుడిగా, చివరికి ముఖ్యమంత్రిగా-వరుసగా రెండవ సారి ఎన్నికయ్యే వరకూ రాజకీయాలలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర కన బరచడం నేను జర్నలిస్ట్‌గా చూశాను. రిపోర్టు చేశాను. ఆపదలో ఉన్నవారు ఎవరైనా తన, మన అని చూడకుండా ఆదుకోవడంలో ఆయన ఎన్నడూ వెను కాడలేదు. కాకినాడ అనుభవం, ఆంధ్రజ్యోతి మీద దాడి వ్యవహారం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. జర్నలిస్టు ఉద్యమంలో ఆయనతో ఉన్న ఇటువంటి అనుభవాలు అనేకం ఏకరువు పెట్టొచ్చు. రాజశేఖరరెడ్డి వంటి విలక్షణ వ్యక్తిత్వం గల నాయకులు రాజకీయాలలో చాలా తక్కువ. ఒక దానికి ఒకటి ముడి పెట్టకుండా దేనికి దాన్ని వేర్వేరుగా చూడటం, ఆ పద్ధతిలోనే ఆ సమస్యను పరిష్కరించే యత్నం చేయడం డా॥వైఎస్ నుంచే నేర్చుకోవాలి. (నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి) datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
సోనియా దయతోనే ఎదిగా..
తెలంగాణ ఇచ్చింది సోనియా.. తెచ్చింది కేసీఆర్ 8న టీఆర్ఎస్లో చేరుతా..: డి. శ్రీనివాస్ నిజామాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దయతోనే రాజకీయాల్లో ఇంతెత్తుకు ఎదిగానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడి పార్టీ కోసం సోనియాగాంధీ చేస్తున్న కృషిని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుఖాలే కాదు కష్టాలు కూడా అనేకం అనుభవించామని పేర్కొన్నారు. 2004, 2009లో రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తేవడానికి తనవంతుగా కష్టపడ్డానన్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడారు. మహిళా నాయకురాలిగా ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తనకు అభ్యంతరం కాదని, అయితే పార్టీలో కీలకనేతగా ఉన్న తనకు చెప్పకుండా, ప్రమేయం లేకుండా ఏఐసీసీని తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయంలో తనకు చెప్పినట్లుగా దిగ్విజయ్‌సింగ్ దొంగనాటకమాడి చివరకు తన నిర్ణయంతో అధిష్టానానికి, మీడియాకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డీఎస్ అన్నారు. ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పగలు ఒంటిగంటకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం కేసీఆర్ అయితే, తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. -
టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ న్యూఢిల్లీ: ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆడియో టేపులు నిజ మైతే బాబు తన పదవులకు రాజీ నామా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రధానిని కలిశారు. మోదీ ఈ వ్యవహారంలో బాబును రక్షిస్తారని భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు.. ‘మోదీ ప్రభుత్వం 2002 గుజరాత్ అల్లర్లలోని నింది తులను కాపాడుతున్నట్లయితే.. ఇష్రత్ జహాన్ తదితరుల ఫేక్ ఎన్కౌంటర్లలో నిందితులను రక్షిస్తున్నట్లయితే.. ఇప్పుడు బాబును కూడా అదేరీతిలో గట్టెక్కిస్తారు.’ అని వ్యాఖ్యానించారు. -
కులతత్వంపై మౌనం వద్దు
యువతకు రాహుల్ పిలుపు అంబేడ్కర్ జయంతి వేడుకలను ప్రారంభించిన కాంగ్రెస్ నేత మహూ(మధ్యప్రదేశ్): ‘కులతత్వాన్ని తుద ముట్టించాలన్న బాబాసాహెబ్ కల ఇంకా నెరవేరలేదు. కుల నిర్మూలన జరగాలన్న ఆయన కల ఇంకా నెరవేరలేదు. ఈనాటికీ మన దేశంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ.. సామాజిక వివక్షను అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దళిత మహానాయకుడు బి.ఆర్.అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ పిలుపునిచ్చారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహూలో రాహుల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ‘జై భీమ్’ నినాదంతో మొదలుపెట్టి ప్రసంగించారు. పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిన ఘనత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ నాయకత్రయానిదేనని పేర్కొన్నారు. అయితే.. దేశం ఇంకా కులతత్వం నుంచి విముక్తి పొందలేదని.. ఈ సామాజిక రుగ్మత విషయంలో యువత మౌనంగా ఉండరాదని సూచించారు. ‘‘ఇప్పుడు కూడా కులం, మతం పేరు మీద ప్రజలను వేరుగా చూస్తున్నారు. వారికి సమాన హక్కులు ఇవ్వరాదని కొందరు కోరుకుంటున్నారు. అధికారం కేంద్రీకృతం కావటం కులతత్వాన్ని బలోపేతం చేస్తుంది’ అంటూ బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించకుండా రాహుల్ విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ వంటి వ్యక్తిని ఏ ఒక్క కులానికో, దేశానికో పరిమితం చేయజాలమని.. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి ఆయన ప్రతీక అని రాహుల్ కీర్తించారు. మరి.. భారతరత్న ఇవ్వలేదేం?: బీజేపీ న్యూఢిల్లీ: అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. సమాజాన్ని విభజించే వ్యాఖ్యలని బీజేపీ తప్పుపట్టింది. అంబేడ్కర్‌కు ఇవ్వవలసినంత గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదని.. పైగా ఆయనను అవమానిస్తోందని ఎదురుదాడికి దిగింది. రాహుల్ కుటుంబ సభ్యుల నేతృత్వంలోని ప్రభుత్వాలు సహా 58 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. అంబేడ్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్.. రాహుల్‌ను ప్రశ్నించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు
-
పాంచ్ పటాకా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా కాంగ్రెస్‌కు ఒక స్థానం ఓటమి పాలైన టీడీపీ మొత్తం పోలైన ఓట్లు 118 పోలింగ్‌కు దూరంగా సీపీఐ, సీపీఎం టీడీపీకి పోలైంది 15 ఓట్లు చెల్లని 1 టీడీపీ, 5 బీజేపీ ఓట్లు హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే జరిగింది. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ మాత్రం తన అభ్యర్థి ఓటమితో అభాసుపాలైంది. అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకుగాను సీపీఐ, సీపీఎంకు చెందిన చెరో ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో 118 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లను అభ్యర్థులకు పంచగా ఒక్కో అభ్యర్థి విజయానికి 17 (16.86) ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరమని తేల్చారు. టీఆర్ఎస్ తాను పోటీకి పెట్టిన అభ్యర్థులైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డిల విజయానికి అవసరమైన 85 ఓట్లను (ఒక్కొక్కరికీ 17 ఓట్ల చొప్పున) ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమీకరించుకొని ఐదు స్థానాలనూ గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 18 ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకే పోలయ్యాయి. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఆమెకే అత్యధిక ఓట్లు లభించాయి. దీంతో ఈ ఆరుగురు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. నోటా తెచ్చిన తంటా విజయానికి కావాల్సిన 17 ఓట్లలో టీడీపీ అభ్యర్ధికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే రెండో ప్రాధాన్యత కింద నోటాకు ఓటు వేయడంతో అవి చె ల్లకుండా పోయాయి. దీంతో టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 9 మాత్రమేనని అధికారులు తేల్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నోటాకు ఓటేయడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. ఉదయం నుంచే కోలాహలం సోమవారం ఉదయం నుంచే అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉదయం ఎనిమిది గంటలకే శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏజెంట్లుగా ఉన్న ఐదుగురితో ఆయన భేటీ అయ్యారు. పోలింగ్ 9 గంటలకు మొదలుకాగా, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తొలి ఓటు వేశారు. టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులకు ఓట్లేయాల్సిన వారిని 17 మందిని ఒక గ్రూపు చొప్పున విభజించారు. ఈ గ్రూప్‌కు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, కె.తారక రామారావులు తమ గ్రూపు ఎమ్మెల్యేలతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. ఉదయం 11 గంటలకల్లా పోలింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రేవంత్‌రెడ్డి సహా టీడీపీ ఎమ్మెల్యేలు అంతా కలసి ఒకేసారి ఓటింగ్ వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది సైతం ఒకేసారి మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో వచ్చి ఓట్లేశారు. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు కలసి వెళ్లి ఓట్లేశారు. అందరి కంటే ఆఖరుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ఓటును మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 118 ఓట్ల పోలింగ్ పూర్తయింది. -
హామీలపై సంజాయిషీ ఇవ్వను
టీడీపీ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో రాష్ట్రంలో ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరంలేదని ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు, నేతలు మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎవరైనా రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే.. మీరు ప్రభుత్వం నుం చి పొందిన రుణమాఫీ లబ్ధిని తిరిగి చెల్లించి మాట్లాడమని డిమాండ్ చేయాలన్నారు. శుక్రవారం మహానాడు చివరిరోజు ఆయన కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అంతకుముందు పలు దఫాలుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీలపైన, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపైన తీవ్రంగా ధ్వజమెత్తారు. పలు ఆరోపణలు చేశారు. ఇంకా పలు ఇతర అంశాలను ప్రస్తావించారు. అందులోని ప్రధానాంశాలు ఆయన మాటల్లోనే.. ఆ పార్టీలకు విశ్వసనీయత లేదు.. రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరొకటి అవినీతి పార్టీ. ఈ రెండు పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీ అంటే కాంగ్రెస్‌కు భయం. ఆ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయపార్టీ స్థాయికి కుదించుకుపోయింది. మోదీ కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం ఏడాదికాలంగా ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. కేంద్రసర్కారులో భాగస్వామ్య పార్టీగా వారు చేసిన కార్యక్రమాలను స్వాగతి స్తున్నాం. రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణలకు కొన్ని సమస్యలొచ్చాయి. వాటి పరిష్కారానికి కేంద్రం సహకరించాలి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలి. ఉభయ రాష్ట్రాలమధ్య నెలకొన్న సమస్యలపై జూన్ రెండులోగా పరిష్కరించుకోవాలి. కానిపక్షంలో కేంద్రంతో సంప్రదించి న్యాయం చేసుకుందాం. జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వానికి.. వివిధ కేసుల్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వానికి దక్కాలి. విదేశాలకు తరలిస్తుండగా పట్టుబడ్డ ఎర్రచందనం సెంట్రల్ ఎక్సైజ్‌శాఖ వద్ద ఉంది. అదీ రాష్ట్రానికే చెందాలి. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను రాష్ట్రానికి అప్పగించాలని ప్రత్యేకచట్టం తెస్తాం. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. కొందరు జూన్ రెండు నుంచి ఏపీలో చేపట్టే నవ నిర్మాణ దీక్షను కూడా వక్రీకరిస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు ఈ దీక్ష చేస్తున్నాం. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు దీక్షను ఉపయోగించుకుంటాం. జూన్ 3 నుంచి ఏడోతేదీ వరకూ ప్రభుత్వం గత ఏడాదికాలంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. 8న గతేడాది ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే ప్రగతి నివేదిక ప్రవేశపెడతాం. రాష్ర్ట రాజధానికి సింగపూర్ ప్రభుత్వం సహకరించకుండా ఉండాలని కాంగ్రెస్ వాళ్లు టెలిగ్రామ్‌లు పంపారు. నా కుటుంబంపైనా విమర్శలు చేస్తున్నారు. 30 ఏళ్లక్రితం ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటుచేసి కష్టపడి పైకి తీసుకొచ్చా. బంగారు తెలంగాణ కావాలి. అందుకు 2019లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలుగువారికి న్యాయం చేసేశక్తి, సామర్ధ్యం టీడీపీకే ఉం ది. ఈ వేదిక నుంచి తొమ్మిది అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. అందరూ దానికనుగుణంగా పనిచేయాలి.’ అని అన్నారు. కేసీఆర్... ఖబడ్దార్ ‘టీడీపీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్కువగా అంచనా వేశారు. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఖబడ్దార్. జాగ్రత్త, మీ గుండెల్లో నిద్రపోతా. నాది ఉడుంపట్టు, వదిలేది లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు. పశువులను కొన్నట్టు కొన్నారు. ఒక్కరు పోతే వందమంది నేతలను తయారుచేస్తాం. తెలంగాణలో 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఓయూ భూముల్ని అమ్ముతామంటే ఖబడ్దార్’. అని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఏపీ సీఎం చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ను ఏపీ పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ కన్వీన ర్ కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం మహానాడు ప్రతినిధుల సభలో ప్రకటించారు. పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి చంద్రబాబు పేరును 30 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, మరో 30 మంది బలపరిచారని వెంకట్రావు తెలిపారు. చంద్రబాబుతో పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం మహానాడుకు హాజరైన ప్రతినిధులు చంద్రబాబును బొకేలు, పచ్చ కండువాలు, కిరీటాలతో సత్కరించారు. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు కాకతీయ శిలాతోరణాన్ని చంద్రబాబుకు బహుకరించారు. కేంద్ర క మిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు అభినందిస్తూ ప్రసంగించారు. టీడీపీని జాతీయ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖరరెడ్డి ప్రసంగించారు. పార్టీని తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, మహారాష్ర్టలతో పాటు తెలుగు వారుండే ఇతర రాష్ట్రాలు, టీడీపీని అభిమానించే ఇతర భాషల ప్రజలున్న ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. పార్టీ జెండా, ఎన్నికల గుర్తులో మార్పు ఉండదని చెప్పారు. -
మన్మోహన్ వద్ద మోదీ పాఠాలు
ఆర్థికవృద్ధి ఎలా సాధించాలని అడుగుతున్నారు: రాహుల్ అందరి అభిప్రాయాలు వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ సాకుతో వ్యక్తిత్వాన్ని హత్య చేస్తోంది న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వద్ద అర్థశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నారని, దేశ ఆర్థికవృద్ధి సాధించడం ఎలా అని అడిగి తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వాన్ని హత్య చేయటం ఆర్ఎస్ఎస్ విశ్వాసమని, ఆ ఆలోచనా విధానమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోందని.. రైతుల నుంచి దుస్తుల వరకూ అంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి తెలుసుననే భావన రాజ్యమేలుతోందని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఆర్థికవ్యవస్థ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న (బుధవారం) ఉద యం విమర్శలు చేస్తే.. సాయంత్రం ఆయన నుంచి మోదీ ఆర్థశాస్త్ర పాఠాలు చెప్పించుకున్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటం ఎలా అని అడిగి తెలుసుకున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ సదస్సు ‘దృష్టికోణ్’లో రాహుల్ గురువారం ప్రసంగిస్తూ.. మోదీ సర్కారు పైన, అధికార బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్ఎస్ఎస్ పైన పదునైన విమర్శలు చేశారు. ‘‘గతంలో నాకు అర్థమయ్యేది కాదు. సభలో అటు వైపు నుంచి, ఇటు వైపు నుంచి రకరకాల అభిప్రాయాలు వినపడుతుండేవి. ఇదేంటి క్రమశిక్షణ తగ్గుతుందేమో అనుకునేవాడిని. కానీ అందరి వాణి వినడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని తరువాత నాకు అర్థమైంది. అన్ని వర్గాల అభిప్రాయాలను వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఇమిడిఉంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి, అంతర్గత చర్చకు అవకాశం ఉందని, అంతిమంగా అది ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి దారితీస్తుందని అర్థమైంది. కానీ ఆర్ఎస్ఎస్ను చూడండి. ఆ ఆర్ఎస్ఎస్ శాఖను చూడండి. ఒక గీత గీస్తారు. ఆ గీత దాటితే లాఠీదెబ్బ పడుతుంది. వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు క్రమశిక్షణను వారు సాకుగా చేసుకున్నారు. అదే భావజాలంతో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దే శాన్ని నడిపిస్తున్నాయి’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న అవసరాలు, విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటిన్నంటినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీలో అలా కాదు. విద్య గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. బట్టల గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. రైతుల గురించి అయినా ఒక్కరే మాట్లాడతారు. ఎవరూ మాట్లాడకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్రమోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అమెరికా వెళ్లారు. మంగోలియా, చైనా వెళ్లారు. కానీ రైతులు, కూలీల ఇంటికి మాత్రం వెళ్లలేకపోయారు’’ అని విమర్శించారు. ‘‘ఆర్ఎస్ఎస్ శాఖలో ఎవరూ మాట్లాడకూడదు. అలాగే దేశంలో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు. దేశంలో విద్యారంగాన్ని ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఆర్ఎస్ఎస్ తన ఆలోచనా ప్రక్రియను రుద్దుతున్న విద్యా సంస్థల్లో ఆ సంస్థతో పోరాడాలి’’ అని ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్సీ చేజారుతుందా?
టీఆర్ఎస్ తీరుతో కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పార్టీ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలతో అధిష్టానం గురువారం మధ్యాహ్నం హుటాహుటిన పార్టీ సీనియర్లు గులాంనబీ ఆజాద్, వయలార్ రవిని ఎన్నికల పర్యవేక్షకులుగా హైదరాబాద్‌కు పంపించింది. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితను గెలిపించే బాధ్యతను వీరికి అప్పగించింది. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారిద్దరూ ఓ హోటల్లో పార్టీ ముఖ్యులు, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడా ఆజాద్, వయలార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, దాని ప్రలోభాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండో ప్రాధాన్యత ఓటు, పార్టీ విప్‌ను జారీ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రాస్ ఓటింగ్‌ను అరికట్టడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మిగిలిన ఎమ్మెల్యేలతోనూ శుక్రవారంవిడిగా సమావేశమవ్వాలని నిర్ణయించారు. పార్టీ అనుబంధ సభ్యునిగా ఉన్న దొంతి మాధవ రెడ్డికి వరంగల్ డీసీసీ అధ్యక్షునిగా అవకాశం కల్పించడంతో పాటు ఆయన అనుచరులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
సీబీఐ విచారణకు ఆదేశించండి
లాటరీ, మట్కా దందాలపై సిద్ధరామయ్యను ప్రశ్నించిన హెచ్.డి.కుమారస్వామి ‘మీట్ ది ప్రెస్’లో ప్రభుత్వంపై విమర్శల వర్షం బెంగళూరు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలనను ప్రజలకు అందజేస్తోందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే రాష్ట్రంలో నడుస్తున్న లాటరీ, మట్కా దందాలపై సీబీఐ విచారణకు ఆదేశించగలరా? అని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి ప్రశ్నించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న కుమారస్వామి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. లాటరీ, మట్కా దందాలతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై సీఓడీ విచారణకు ఆదేశించారని, అయితే సీఓడీ స్థానంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా అని కుమారస్వామి సవాల్ విసిరారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే లాటరీ దందాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను అందజేస్తానని అన్నారు. ఇక ఇదే సందర్భంలో లాటరీ, మట్కాలను నియంత్రించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు దళాలను ప్రభుత్వం రద్దు చేయడం అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఉన్నారా లేక ఆయన సలహాదారు కెంపయ్య ఉన్నారా అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో దక్కింది ‘అప్పు భాగ్య’ మాత్రమే.... ఇక సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, అయితే ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు దక్కింది కేవలం ‘అప్పు భాగ్య’ మాత్రమేనని కుమారస్వామి విమర్శించారు. రెండేళ్ల పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాల్సింది ముఖ్యమంత్రో లేక మంత్రులో కాదని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికీ జేడీఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో శక్తి ఉందని కుమారస్వామి తెలిపారు. -
కేసీఆర్ కాళ్లదగ్గర టీఆర్ఎస్ నేతల ఆత్మగౌరవం
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్ నేతలు పదవుల్లో కొనసాగుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొనగాల మహేశ్, బండారు శ్రీకాంత్రావులతో కలిసి గాంధీభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా టీఆర్ఎస్ వారెవరూ కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్రపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేయడాన్ని శ్రీధర్‌బాబు, గండ్ర ఖండించారు. -
మంత్రి విమర్శల ‘బార్’
బార్‌ను ప్రారంభించిన మంత్రి శిందే - తీవ్రంగా విమర్శించిన విపక్షాలు - రాజీనామా చేయాలని పట్టబట్టిన కాంగ్రెస్ - బార్ కాదు..రెస్టారెంట్ ప్రారంభించాన్న మంత్రి ముంబై: అహ్మద్ నగర్లో ఓ బార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి రామ్‌శిందే తీవ్ర విమర్శల పాలయ్యారు. అహ్మద్‌నగర్ - పుణే రహదారిపై సుపా టోల్‌నాకా సమీపంలో బార్ ప్రారంభోత్సం జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్, ఎమ్మెల్యే సుధీర్ తాంబే తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి బార్‌ను ప్రారంభించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమం చట్ట విరుద్ధం కాకపోయినప్పటికీ ఓ మంత్రి బార్‌ను ప్రారంభించడం సరికాదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. మద్యం ప్రకటనలపై నిషేధం ఉందని, మంత్రులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైతే మద్యానికి ప్రకటన ఇవ్వడం లాంటిదే అని ఆయన చెప్పారు. మరోవైపు శిందే మాట్లాడుతూ.. అవసరమైన అన్ని అనుమతులు బార్ పొందిదన్నారు. హోటల్ రాయరీ పార్క్ వద్ద కీర్తీ ఫ్యామిలి రెస్టారెంట్‌ను ప్రారంభించానని, అదేమీ చట్ట విరుద్ధం కాదన్నారు. బీర్ బార్ తాను ప్రారంభించిన రెస్టారెంట్ రాయ్రీ పార్క్ యజమానిదే అని తెలిపారు. బార్ ప్రారంభానికి వెళ్లలేదు: దీపక్ బార్ ప్రారంభించిన మంత్రి రామ్ శిందేపై ప్రతిపక్షాలతోపాటు సొంతపార్టీకి చెందిన నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శిందే ప్రారంభోత్సవానికి వెళ్లకుండా ఉండాల్సిందని రెవిన్యూ శాఖమంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. మరోవైపు రామ్ శిందే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉండగా ఇదే ప్రారంభోత్సవం పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్ ఈ విషయంపై స్పందించారు. తాను బీర్ బార్ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని.. ఫ్యామిలి రెస్టారెంట్ ప్రారంభోత్సవమని వెళ్లానన్నారు. మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా విదర్భలోని చంద్రపూర్ జిల్లాలో మద్యం నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ బీర్ బార్, పర్మిట్ రూమ్‌ను ఇద్దరు సహాయక మంత్రులు ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, విదర్భలో వార్దా, గడ్చిరోలి తర్వాత మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా చంద్రాపూర్. -
కాంగ్రెస్‌లో ఇంటిపోరు
చల్లారని అసమ్మతి భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు రాహుల్ దృష్టికి సమస్య ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదని ఆందోళన బెంగళూరు:అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. కొంతమంది పార్టీనాయకులైతే ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడానికి తామెంతో కష్టపడినా అందుకు తగ్గఫలితం మాత్రం దక్కడంలేదని వాపోతున్నారు. ఈ విషయమై అమీతుమీకి సిద్ధమైన ఆ అసృతప్త నాయకులు ఏకంగా కాంగ్రెస్ యువరాజుకు లేఖరాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ పదవుల పై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు తగిన స్థానం ఇవ్వాల్సిందిగా విన్నవిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పదవుల భర్తీ విషయమై సిద్ధు.... పరమేశ్వర్ ‘ఎవరికీ వారే యమునాతీరే’ అన్న రీతిలో వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నామినేటెడ్ పదవుల పై డీసీసీ అధ్యక్షులతో పాటు వారి అనుచరులు కన్నేసి ఉంచారు. పదవుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని భావించిన వీరంతా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ గోడును వెళ్లబోసుకుంటూ లేఖరాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ లేఖలో... ‘2013లో కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. అందువల్లే దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని విస్మరించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్ వంటి కొంత మంది నాయకులే పదవులను అ నుభవిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులను కూ డా మాకు కట్టబెట్టడం లేదు. ఎన్ని సార్లు వారిని కలిసి విన్నవించినా రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నా రు. వారికి సమయం లేదేమో., మీరే కల్పించుకుని మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడండి. లేదంటే రానున్న బీబీఎంపీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ విజయం పై మేము భరోసా ఇవ్వలేం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు మంత్రి మండలి కూడా పూర్తీ స్థాయిలో భర్తీ కాలేదు. ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల పై కన్నేసిన నాయకులే డీసీసీ అధ్యక్షుల లేఖల ఘటాన్ని తెరవెనక నుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘మంత్రి పదవుల పై కన్నేసిన నాయకులు సిద్ధరామయ్య ‘వాయిదా వ్యవహార శైలి’ పై కినుకు వహించారు. డీసీసీ అధ్యక్షుల ద్వారా హై కమాండ్ పై ఒత్తిడి తీసుకువచ్చి నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనే మంత్రిమండలి విస్తరణకు కూడా అనుమతి పొందవచ్చునని భావిస్తున్నారు. అందువల్లే ఈ లేఖల ఘట్టాన్ని తెరవెనక ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
విపక్షాలదే పై చేయి...
బీబీఎంపీ విభజన బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి సమావేశాల పేరుతో రూ. 3 కోట్లు ప్రజాధనం వృధా బెంగళూరు: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్లదే పై చేయిగా నిలించింది. ప్రత్యేక శాసన సభా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ‘విభజన’ కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక శాసనసభల్లో భాగంగా మూడోరోజైన సోమవారం కూడా శాసనపరిషత్‌లో బీబీఎంపీ విభజన కోసం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) విభజన (సవరణ) బిల్లు-2015’ పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధికార, విపక్షాలు విభజన బిల్లు పై చర్చించాయి. మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘బెంగళూరు నగరాన్ని విభజించడం వల్ల కన్నడిగుల మధ్య ప్రాంతీయ భేదాలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా విభజన ముసాయిదా బిల్లు పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. అందువల్ల బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగించాల్సిందే’ అని పట్టుబట్టారు. ఇందుకు జేడీఎస్ సభ్యులు కూడా తమ మద్దతును తెలిపారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం విభజన బిల్లు అనుమతి కోసం పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలకు ఎన్నిసార్లు సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం 6.15 గంటలకు విభజన బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగిస్తూ మండలి అధ్యక్షుడు శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల ఆగాల్సిందే... శాసనసభలో ఆమోదం పొందిన ఏదేని ముసాయిదా బిల్లు శాసనమండలికి ఆమోదం కోసం వచ్చిన తర్వాత ఆ బిల్లు పై మరింత అధ్యయనం కోసం సెక్షన్ 116ను అనుసరించి సెలెక్ట్ కమిటీకు అప్పగించే అధికారం శాసనమండలి అధ్యక్షుడికి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి అప్పగిస్తూ అధ్యక్షస్థానంలో ఉన్న శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం మండలిలో ఉన్న అధికార విపక్ష సభ్యుల సంఖ్యాబలాన్ని అనుసరించి సెలెక్ట్ కమిటీలోనూ విపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇరుపక్షాల ప్రస్తుత బలాబలాను అనుసరించి బీజేపీ,కాంగ్రెస్ పార్టీకు చెందిన చెరి నలుగురు సభ్యులు, జేడీఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీను సెలెక్ట్ కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీకు రాష్ట్ర న్యాయ,పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి, లేదా ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ మూడు నెలల్లోపు తన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నివేదికను మండలి ముందు తీసుకురాలేకపోతే ముసాయిదా బిల్లు తిరిగి శాసనసభకు వెళ్లి అక్కడ నేరుగా ఆమోదం పొంది అనుమతి కోసం గవర్నర్‌కు వద్దకు వెళ్లనుంది. సెలెక్ట్ కమిటీలో విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువ... మండలిలోని మొత్తం సభ్యులు 75 అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు 28 బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలు 30 జేడీఎస్ ఎమ్మెల్సీలు 12 స్వతంత్రులు 4 చైర్మన్ 1 ప్రభుత్వ మొండిపట్టుకు రూ.3 కోట్లు వృధా అధికార కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ విభజన బిల్లు అమోదం కోసమే మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విద్యుత్, భద్రతా తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క రోజు చట్టసభలు నిర్వహించడానికి రూ.1 కోటి ఖర్చవుతోంది. దీంతో మూడు రోజులకు గాను దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చయినా విభజన బిల్లు చట్టసభల్లో పూర్తిస్థాయిగా ఆమోదం పొందకపోవడంతో దాదాపు రూ.3 కోట్లు ఖర్చయినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. -
ఎన్నో బాధలు పడ్డాం: నాయిని
అబిడ్స్: తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు ఉద్యమకారులను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుమ్మెరాత్‌బజార్‌లో అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఉద్యమం, అమరవీరుల త్యాగఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్ మాట్లాడుతూ... గోషామహల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.