కాంగ్రెస్, టీడీపీలపై మండిపడ్డ టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, టీడీపీలు పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్‌లో పాల్గొనకుండా పారిపోయాయని టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు.
అరవై ఏళ్లపాటు తెలంగాణలో నీటిపారుదల రంగానికి చేసిన అన్యాయాలు, మోసాలు బయటపడి దొరికిపోతామని చర్చలో పాల్గొనకుండా పారిపోయార న్నారు. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని విమర్శిం చారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఇచ్చిన పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ అద్భుతమని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు గైర్హాజరైన ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే సభకు గైర్హాజరు
Published Sat, Apr 2 2016 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement