శ్రేణుల్లో కరువైన సమన్వయం
అధికార పార్టీ వ్యతిరేక ఓటు పైనే ఆశలు
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేనా! అన్న ప్రచారం నగరంలో విస్తృతంగా సాగుతోంది. అధికార పార్టీ హామీలు ఇచ్చి అమలులో చేస్తున్న జాప్యంతో వ్యతిరేక ఓట్లు భారీగా పడతాయని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అభ్యర్థి మార్పు, జిల్లాలో ఉన్న గ్రూపులు, స్థానిక నాయకత్వంలో సమన్వయ లోపం పార్టీ అభ్యర్థికి శాపంగా మారనున్నారుు. తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినందున సార్వత్రిక ఎన్నికల్లో తామే గెలుస్తామని, తొలి సీఎంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే పగ్గాలు చేపడతారన్న ఆశ పడ్డ కాంగ్రెస్ నేతలు భంగపడ్డారు. నేతల మధ్య సమన్వయం లేక పలు చోట్ల పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యూ రు. ఇదే పరిస్థితి ఉప ఎన్నికలో పునరావృ తం కావొద్దని మాజీ ఎంపీకే టిక్కెట్ ఇప్పించడంలో మాజీలు విజయం సాధిం చారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియూగాంధీకి బహుమతి ఇవ్వాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగారుు.
అ రుుతే మాజీ ఎంపీ కుటుంబం లో జరిగిన విషాదకర ఘటనలతో పోటీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందు కు అప్పటికప్పుడు స్థానికులెవరూ కొత్తవారు ధైర్యం చేయలేకపోయూరు. లోక్‌సభ లో తెలంగా ణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడిన, సోని యూకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పీసీసీ పోటికి దింపిం ది. సర్వే రాక తో పార్టీలో కొన్ని శ్రేణులు అసంతృప్తి వ్య క్తం చేసినా పీసీసీ నేతల బుజ్జగింపులతో ప్రచారానికి సై అన్నారు. ఆర్థికపరమైన విషయూలు స్థానికులకు అప్పగిస్తే తడిసి మోపెడవుతుందని భావించిన సర్వే ని యోజకవర్గ బాధ్యతలను తనకు అనుకూలమైన వారికి అప్పగించినట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారిం ది. నామినేషన్ నాటి నుంచి ఆర్థిక వ్యవహారాలు చూసిన వారు ఇతర ప్రాంతాలకు చెందడంతో వారు జిల్లా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ దగ్గర పడటంతో బూత్‌ల నిర్వహణకు డబ్బులు కేటారుుంచేందుకు కసరత్తు చేశా రు.
కానీ వచ్చిన నిధులను బాధ్యతలు నిర్వహించిన నేతలు తీసుకొని పోవడంతో అసలు విషయం బయటపడింది. పోలింగ్ ఖర్చుల సంగతేమిటంటూ పలువురు ప్ర శ్నించడంతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే దాం ట్లో తక్కువ ఇస్తే వ్యతిరేక ఓట్లు రావని స్థానిక నాయకులు వాపోతున్నారు. దీంతో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా వేరుుంచుకోవడంలో కాం గ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నారుు. బూత్‌లవారీగా ఇచ్చే డబ్బులు తగ్గించడంతో ఆయూ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమకు అక్కరలేదని అలకతో వెళ్లినట్లు తెలిసింది. వీరందరిని మళ్లీ పిలిపించి సమన్వయం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా!
Published Sat, Nov 21 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM
Advertisement
Advertisement