Warangal-election
-
డీసీ తండాలో 98 % పోలింగ్
హన్మకొండ అర్బన్ : వరంగల్ ఉప ఎన్నికలో వర్ధన్నపేట నియోజకవర్గం డీసీ తండాలోని 193వ పోలింగ్ కేంద్రంలో 98 శాతం ఓట్లు పోలయ్యూరుు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఈ ఈవీఎంను సీజ్‌చేసి భద్రపరిచారు. 24న కౌంటింగ్ సందర్భంగా కూడా ఈ ఓట్లు లెక్కించలేదు. ఈ కేంద్రంలోని అధికారుల నిర్వాకం వల్ల జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే సమస్యను రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఆ ఓట్లు లెక్కించకుండా వదిలేశారు. అసలేం జరిగింది...? వర్ధన్నేపేట నియోజక వర్గం, అదే మండలంలోని డీసీ తండా 193వ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 678 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక ఇటీవల అధికారులు ఓటర్ల జాబితా సవరణ సంద ర్భంగా గ్రామంలో లేని, మరణించిన వారి ఓట్లు మొత్తం 159 తొలగించారు. వీరిలో 77 పురుషులు, 82 మహిళల ఓట్లు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు అధికారులు బీఎల్వోల ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న అందరికీ పోల్చీటీలు పంపిణీ చేశారు. కాగా, పోలింగ్ రోజున అధికారికంగా ఉన్న జాబితాలోని 678 మందిలో కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, జాబితా నుంచి తొలగించిన 159 మందిలోనూ సుమారు 90 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. తొలగింపుల జాబితాలో ఉన్నవారు ఓటు ఎలా వేశారు..? ఒకవేళ వారు వస్తే పీవో ఎలా ఓటింగ్‌కు అనుమతించారు అనేది తేలాల్సి ఉంది. అరుుతే తొలగింపు జాబితాలో ఉన్న వారి పేర్లను పోలింగ్ సిబ్బంది టిక్ పెట్టి ఓటు వే యించారని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇందుకు బాధ్యులెవరు.. ఉద్దేశపూర్వకంగా చేశారా.. పొరపాటున జరిగిందా అనే కోణంలో అధికారులు పూర్తిస్థారుులో విచారణ చేస్తున్నారు. 678 ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఉంటే రీపోలింగ్... డీసీ తండా ఘటనపై తీసుకోవాల్సిన చర్యల గురించి కౌంటింగ్‌కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోటీ హోరాహోరీగా ఉండి.. మెజార్టీ 678 ఓట్లు లోపు ఉంటే విజేత ఫలితం ప్రకటించకుండా డీసీ తండాలో రీ పోలింగ్ చేపట్టాలని, వాటి లెక్కింపు అనంతరం తుది ఫలితం ప్రకటించాలని సూచించారు. దీంతో అధికారులు సిద్ధమైనప్పటికీ.. గెలుపొందిన అభ్యర్థి మెజార్టీ లక్షల్లో ఉండటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లేదంటే డీసీ తండాలో రీ పోలింగ్ తప్పనిసరి అయ్యేది. పది కేంద్రాల్లో 90శాతానికి పైగా.. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 1778 పోలింగ్ కేంద్రాల్లో కేవలం పదింట్లో మాత్రమే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే, ఆయా కేంద్రాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనివే కావడం విశేషం. అయితే, ఉద్యోగులు, విద్యావంతుల నియోజకవర్గంగా పేరున్న వరంగల్ పశ్చిమలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 30 శాతానికన్నా తక్కువగా పోలింగ్ నమోదైతే.. తండాలు, గ్రామాల్లో మాత్రం 90 శాతానికిపైగా ఓటేశారంటే గ్రామీణుల్లోని చైతన్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. -
మరీ ఇంత దారుణమా?
♦ ఫలితాలతో షాక్ తిన్న కాంగ్రెస్ ♦ గత ఎన్నికల కన్నా ఓట్లు తగ్గిపోవడంపై ఆందోళన ♦ మీడియాకు దూరంగా పార్టీ ముఖ్యులు సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేశాయి. గత సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోవడానికి, పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపడానికి ఈ ఉప ఎన్నిక తోడ్పడుతుందని కాంగ్రెస్ భావించింది. అయితే ఎన్నిక ఫలితాలు ఆ పార్టీ మనోస్థైర్యాన్ని మరింత దెబ్బకొట్టాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్‌కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకిలా జరిగింది?: గత ఎన్నికల్లో వరంగల్‌లో 3.95 లక్షల మెజారిటీతో టీఆర్ఎస్ గెలిస్తే.. ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి 4.59 లక్షల మెజారిటీ వచ్చింది. ఇది కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. టీఆర్ఎస్, సీఎంపై చాలా అంశాల్లో వ్యతిరేకత ఉన్నందున లక్ష, లక్షన్నర మెజారిటీతో ఆ పార్టీ గెలుస్తుందని టీపీసీసీ నేతలు అంచనా వేశారు. కానీ రాష్ట్రంలోనే రికార్డుస్థాయి మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడం, తమ బలం కూడా భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏం చెబుదాం..?: వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికారికంగా మాట్లాడకుండా టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దూకుడును ఎక్కువగా చూపించామా, టీఆర్ఎస్ వేగాన్ని అందుకోలేకపోతున్నామా అని వారు మథనపడుతున్నారు. తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ గెలిస్తే పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ విశ్వాసం కల్పించేలా మాట్లాడే అవకాశం ఉండేదని వారంటున్నారు. రెండు, మూడ్రోజుల తర్వాత టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షించాలని యోచిస్తున్నారు. -
సరికారు మాకెవ్వరూ!
తెరాసలో విజయోత్సాహం ‘గ్రేటర్’ ఎన్నికలకూ ఓరుగల్లు మంత్రం ఒంటరి పోరుకు గులాబీ శ్రే ణులు సన్నద్ధం సిటీబ్యూరో: వరంగల్ ఉప ఎన్నికల ఫలితం నగర తెరాస శ్రేణుల్లో కొత్త జోష్‌ను తెచ్చిపెట్టింది. సరి‘కారు’ మాకెవ్వరూ అంటూ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే ఊపుతో జనవరిలో నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగానే సత్తా చాటేందుకు వీలుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికార టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భేష్ అంటూ వరంగల్ ఓటర్లు తీర్పునిచ్చిన నేపథ్యంలో... కాస్త అటూ ఇటూగా అదే నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లనుంది. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు స్థానాలకే పరిమితమవడం... గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమి పాలవటంతో నగరంలోని పార్టీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డారు. అనంతరం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి రావడంతో మళ్లీ వీరిలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరోవైపు నగరంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేసి... సానుకూల ఫలితాన్ని రాబట్టే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మంత్రులు తలసాని, పద్మారావు, నాయిని, మహమూద్ అలీతో పాటు కేటీఆర్, హరీష్, మహేందర్‌రెడ్డి నగరంలో మరింతగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను పరుగెత్తించే బాధ్యతలు తీసుకోనున్నారు. డివిజన్ల వారీగా పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలను క్షేత్ర స్థాయిలో అంచనా వేయనున్నారు. నగర వాసులపై వరాల వర్షం గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నగర వాసులపై ప్రభుత్వం మరింతగా వరాల వర్షం కురిపించనుంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇప్పటికే 20 లక్షల ఇళ్లకు రెండేసి చెత్త డబ్బాలు పంపిణీ చేయడంతో పాటు... నగర రహదారులను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా నగరంలో 1000 కి.మీ. రహదారులు, 400 కి.మీ. మేర వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. ఇవి కాకుండా మహిళా స్వయం సంఘాలకు రూ.1000 కోట్ల రుణాలు... నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు... మరో 50 ప్రాంతాల్లో రూ.5కే భోజనం... జీఓ 58 కింద సుమారు లక్ష మందికి ఉచిత భూ క్రమబద్ధీకరణ వంటి అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. అదే విధంగా డిసెంబర్ 15 నుంచి నగరానికి గోదావరి జలాల రాకతో పాటు మురికివాడల్లో రూ.100కే మంచినీరు, రూ.100కే విద్యుత్ సరఫరా అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
గ్రేటర్‌లోనూ ‘వరంగల్’ ఫలితాలే: నాయిని
మన్సూరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం అవుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మన్సూరాబాద్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక ప్రతిపక్షాలకు కనువిప్పు అన్నారు. ఇది సీఎం కేసీఆర్ విజయమని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలు ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ధిచెప్పారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని విజయం వైపు నడిపించాయని అన్నారు. గ్రేటర్ ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే పక్క రాష్ర్ట ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఎం.రాంమోహన్‌గౌడ్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్‌యాదవ్, మజీ కౌన్సిలర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, మల్లారపు శాలిని, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గెలుపుపై ఎవరి లెక్కలు వారివి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీల భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థి విజయంపై పూర్తి భరోసా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు సైతం తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంలో విపక్ష పార్టీలన్నీ అధికార టీఆర్ఎస్పై విమర్శల దాడి చే శాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేక ఓటుతో తామే గెలుస్తామన్న అంచనాలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మరోవైపు 17 నెలల పాలన లో తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని గులాబీ శిబిరం భావిస్తోంది. టీఆర్ఎస్ లెక్కలివీ.. వరంగల్ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అయిదు చోట్ల, టీడీపీ రెండు చోట్ల విజయం సాధించాయి. పరకాల టీడీపీ ఎమ్మెల్యే గులాబీ శిబిరంలో చేరడంతో అదనంగా తమకో అసెంబ్లీ సెగ్మెంటు కలిసొచ్చిందన్న లెక్కల్లో టీఆర్ఎస్ ఉంది. మొత్తం పోలైన ఓట్లలో తమ అభ్యర్థికి, విపక్షాల అభ్యర్థికి ఏయే సెగ్మెంట్లో ఎన్నెన్ని ఓట్లు పోల్ అయి ఉంటాయో టీఆర్ఎస్ లెక్కలు గట్టింది. వాటి ఆధారంగా టీఆర్ఎస్ తమ అభ్యర్థి మెజారిటీపై ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ నమ్మకం కోల్పోయిందా? ప్రభుత్వ పని తీరుకు, 17 నెలల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండమని ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ-టీడీపీ కూటమి పోలింగ్ తర్వాత పరోక్షంగా తమ ఓటమిని ఒప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాను ఓడిపోయినా, వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని బీజేపీ అభ్యర్థి డాక్టర్ దేవయ్య చేసిన ప్రకటనపై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఫలితాలు వెలువడక ముందే ఓటమిని అంగీకరించినట్లు అయ్యిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో తాము బలపరిచిన బీజేపీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయన్న అంచనాలో టీడీపీ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఆశలు నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిని అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చిన కాంగ్రెస్... తమ అభ్యర్థి విజయంపై విశ్వాసాన్ని ప్రకటిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత తమకు ఓట్లు గుమ్మరిస్తుందన్నది వీరి ఆశ. స్థానికేతర అభ్యర్థి కావడం, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా స్థానిక నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం, ప్రచారం సమయంలోనే స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జి పార్టీ మారడం వంటి అంశాలు కాంగ్రెస్ ప్రతికూలమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. -
పోలైన ఓట్ల వివరాలివీ..
హన్మకొండ అర్బన్ : వరంగల్ ఉప పోరులో మొత్తం 69.19 శాతం పోలింగ్ నమోదయింది. ఇందులో పురుషుల కంటే మహిళలే 0.31 శాతం ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 15,09,671 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 7, 57, 231 మంది, మహిళలు 7, 52, 293 మంది, ఇతరులు(థర్డ్ జండర్) 157 మంది ఉన్నారు. మొత్తం 10,35,656 ఓట్లు పోలయ్యాయి. నాలుగు నియోజకవర్గాల్లో మహిళలే అధికం.. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ తూర్పు, భూపాలపల్లి సెగ్మెంట్లలో మహిళా ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉంది. జిల్లా మొత్తం 69.19 శాతం పోలింగ్ నమోదు కాగా, పురుషులు 68.45 శాతం, మహిళలు 68.76 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రెండు లక్షల మెజారిటీ ఖాయం
నాయిని నర్సింహారెడ్డి గుర్రంపోడు: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు అసత్య ప్రచారం చేశాయని, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. -
పైకి గాంభీర్యం..
వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ కాంగ్రెస్ నేతలు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఫలితం ఎలా ఉంటుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుడిని అభ్యర్థిగా బరిలో నిలిపినందున దాని ప్రభావం ఏ స్థాయిలో, ఏ మేరకు పడుతుందనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. జాతీయ స్థాయిలోని పార్టీ ముఖ్య నేతలు అందులో ఎస్సీ వర్గానికి చెందిన అగ్రనేతలను, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసిన నేతలను ప్రచార రంగంలోకి దించినా ఫలితం ఎలా ఉండబోతుందా అని టెన్షన్ పడుతున్నారట! గట్టి అభ్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ అనూహ్య పరిస్థితుల్లో వైదొలగడం, జిల్లా పార్టీలో ముఖ్యనేతగా ఉన్న నాయకుడు, పార్టీ డమ్మీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా పార్టీకి రాజీనామా చేయడం, ఇతరత్రా ప్రతికూల పరిస్థితులు అనేకం ఉన్నాయని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. చివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఏ స్థానం దక్కుతుందో, ఎన్ని ఓట్లు వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంతర్గత చర్చల్లో హైరానపడుతున్నారట. -
ఏం ‘బాబయ్యా’ ... కొత్త పంచాయితీ పెడితిరి!
తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి ‘కక్క లేక.. మింగలేక’ అన్న చందంగా తయారైంది. ఉప్పు, నిప్పులా ఉండే నేతలకు సమానా హోదా కలిగిన పదవులు కట్టబెట్టిన పార్టీ అధినేతను తిట్టలేక.. పొగడలేక సతమతమవుతున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇముడుతాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘ఏం.. బాబయ్యా.. కొత్త పంచాయితీ పెడితివి’ అంటూ వాపోతున్నారు. ఇంతకూ విషయం ఏందయ్యా అని ఆరా తీస్తే... ఇదంతా తెలంగాణ టీడీపీలో రాష్ట్రస్థాయి పదవులు తెచ్చిన తంటా అని చెబుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ఇతరత్రా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైందంటున్నారు. అంతా పనిచేస్తే.. ఒక నాయకుడికే పేరొస్తుందని వెనుక దాక్కున్న నేతల్ని అధినేత మందలించాక కానీ ముందుకు వెళ్లలేదు. అయితే వరంగల్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే పేరొచ్చేది ఆ జిల్లాకు చెందిన నేతకే కదా అని వీరు వెనక్కి త గ్గారట. అధ్యక్షుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్.. టీడీఎల్పీ నేత ఇలా.. పదవుల్లో ఉన్న నేతలు ఉమ్మడిగా కాకుండా ఎవరికి ఉనికి కోసం వారు పాకులాడడంతో.. అసలుకే ఎసరు వచ్చేలా ఉందే అన్న ఆందోళన కింది స్థాయి శ్రేణులను భయపెడుతోంది. అందరికీ ముఖ్య పదవులిచ్చి లేనిపోని పంచాయితీ పెట్టారని వాపోతున్న తమ్ముళ్లను సముదాయించే వారే లేకుండా పోయారు!! -
ఓరుగల్లు తీర్పు నేడే
-
కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా!
శ్రేణుల్లో కరువైన సమన్వయం అధికార పార్టీ వ్యతిరేక ఓటు పైనే ఆశలు వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేనా! అన్న ప్రచారం నగరంలో విస్తృతంగా సాగుతోంది. అధికార పార్టీ హామీలు ఇచ్చి అమలులో చేస్తున్న జాప్యంతో వ్యతిరేక ఓట్లు భారీగా పడతాయని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అభ్యర్థి మార్పు, జిల్లాలో ఉన్న గ్రూపులు, స్థానిక నాయకత్వంలో సమన్వయ లోపం పార్టీ అభ్యర్థికి శాపంగా మారనున్నారుు. తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినందున సార్వత్రిక ఎన్నికల్లో తామే గెలుస్తామని, తొలి సీఎంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే పగ్గాలు చేపడతారన్న ఆశ పడ్డ కాంగ్రెస్ నేతలు భంగపడ్డారు. నేతల మధ్య సమన్వయం లేక పలు చోట్ల పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యూ రు. ఇదే పరిస్థితి ఉప ఎన్నికలో పునరావృ తం కావొద్దని మాజీ ఎంపీకే టిక్కెట్ ఇప్పించడంలో మాజీలు విజయం సాధిం చారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియూగాంధీకి బహుమతి ఇవ్వాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగారుు. అ రుుతే మాజీ ఎంపీ కుటుంబం లో జరిగిన విషాదకర ఘటనలతో పోటీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందు కు అప్పటికప్పుడు స్థానికులెవరూ కొత్తవారు ధైర్యం చేయలేకపోయూరు. లోక్‌సభ లో తెలంగా ణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడిన, సోని యూకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పీసీసీ పోటికి దింపిం ది. సర్వే రాక తో పార్టీలో కొన్ని శ్రేణులు అసంతృప్తి వ్య క్తం చేసినా పీసీసీ నేతల బుజ్జగింపులతో ప్రచారానికి సై అన్నారు. ఆర్థికపరమైన విషయూలు స్థానికులకు అప్పగిస్తే తడిసి మోపెడవుతుందని భావించిన సర్వే ని యోజకవర్గ బాధ్యతలను తనకు అనుకూలమైన వారికి అప్పగించినట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారిం ది. నామినేషన్ నాటి నుంచి ఆర్థిక వ్యవహారాలు చూసిన వారు ఇతర ప్రాంతాలకు చెందడంతో వారు జిల్లా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ దగ్గర పడటంతో బూత్‌ల నిర్వహణకు డబ్బులు కేటారుుంచేందుకు కసరత్తు చేశా రు. కానీ వచ్చిన నిధులను బాధ్యతలు నిర్వహించిన నేతలు తీసుకొని పోవడంతో అసలు విషయం బయటపడింది. పోలింగ్ ఖర్చుల సంగతేమిటంటూ పలువురు ప్ర శ్నించడంతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే దాం ట్లో తక్కువ ఇస్తే వ్యతిరేక ఓట్లు రావని స్థానిక నాయకులు వాపోతున్నారు. దీంతో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా వేరుుంచుకోవడంలో కాం గ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నారుు. బూత్‌లవారీగా ఇచ్చే డబ్బులు తగ్గించడంతో ఆయూ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమకు అక్కరలేదని అలకతో వెళ్లినట్లు తెలిసింది. వీరందరిని మళ్లీ పిలిపించి సమన్వయం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నట్లు సమాచారం. -
ఖాకీల అలర్ట్
ఎన్నిక వేళ మావోయిస్టుల అలజడి భద్రతను పెంచిన పోలీసులు భూపాలపల్లిపై ప్రత్యేక దృష్టి హన్మకొండ: వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు, పారామిలిటరీ, ఇతర జిల్లాలకు చెందిన పోలీసులను ఎన్నికల విధుల కోసం రప్పించారు. మొత్తంగా 7,606 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యూరు. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. తెలంగాణలో తొలి ఎన్కౌంటర్ తాడ్వాయి అడవుల్లో జరిగిన రెండు నెలల వ్యవధిలోనే ఉప ఎన్నికలు వచ్చాయి. అంతకుముందే భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలపై మావోయిస్టుల హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. తాజాగా వరంగల్ ఉప ఎన్నికను బహిష్కరించాలంటూ భారత క మ్యూనిస్టు మావోయిస్టు పార్టీ దం డకారణ్యం కార్యదర్శి జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న భూపాలపల్లి నియోజకర్గంలో పోలింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలీసు యంత్రాంగం సైతం ఇక్కడ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. భూపాలపల్లి అటవీ ప్రాం తంలో శుక్రవారం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే ఇద్దరు ఏఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 18మంది సీఐలు, 90 మంది ఎస్సైలతో పాటు రెండు వేల మంది కి పైగా పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురు, శుక్రవారాల్లో గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలో ముమ్మరంగా కూం బింగ్ నిర్వహించాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీసుస్టేషన్లను పోలీస్ కమిషనర సుధీర్‌బాబు సందర్శించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక వరంగల్ రూరల్ పరిధిలో ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల, కురవి, దంతాలపల్లి, మరిపెడ, మొండ్రాయి, పెంబర్తి, చేర్యాలలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇక్కడి తనిఖీల్లో రూ. 77,13, 950 నగదును పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారన్న అనుమానం ఉన్న 2,540 మందిని తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. వరంగల్ రూరల్ పరిధిలో 791 పోలింగ్ కేంద్రా లు ఉండగా వీటిలో 269 అతి సున్నిత, 274 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అతి సున్నిత పోలింగ్ కేం ద్రాలు 70, సున్నితమైనవి 200 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ శాఖా పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఐదు చెక్‌పోస్టుల ద్వారా రూ.1,88,48,847 నగదు సీజ్ చేసి 5035 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. నగదు, మద్యం రవాణాపై 864 కేసులు నమోదు చేశారు. 196 బెల్టుషాపులను మూయించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పటి వరకు 736 మందిని అరెస్టు చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛ గా ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా శక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా, డబ్బు, మద్యం పం పిణీ చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లను, ఇతరులను తీసుకురావడం చేయొద్దని, పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడడం వంటివి చేయొద్దని ఎస్పీ సూచించారు. -
సర్వం సిద్ధం
♦ వరంగల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: భన్వర్‌లాల్ ♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ♦ మొత్తం 10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు ♦ విధుల్లో 8,160 మంది పోలింగ్ సిబ్బంది ♦1,778 పోలింగ్ కేంద్రాల్లో 498 అత్యంత సమస్యాత్మకం సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 5 గంటలకల్లా క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టామన్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలతోపాటు మొత్తం 10 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. నక్సలైట్ల ప్రాబల్యమున్న భూపాలపల్లి నియోజకవర్గంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. 8,160 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారని.. వారు ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలివెళ్లినట్లు చెప్పారు. 632 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలిస్తారన్నారు. 626 పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఇందుకు 476 మంది వీడియోగ్రాఫర్లు, 824 మంది విద్యార్థులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 96.01 శాతం మందికి ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. గత సాధారణ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గంలో 76.15 శాతం పోలింగ్ నమోదైందని.. ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టార్పాలిన్లు, టెంట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా వీటిలో 498 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకమైనవి, 642 సమస్యాత్మకమైనవి, 605 సాధారణ కేంద్రాలు, 33 నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతంలో ఉన్నవిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి నగదు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ కోరారు. టోల్‌ఫ్రీ నంబరు 180042522747కు ఫోన్ చేయాలని, లేదా 8790499899కు ఎస్ఎంఎస్ పంపించాలని సూచించారు. ఇప్పటివరకు తమకందిన ఫిర్యాదుల ఆధారంగా రూ.1.88 కోట్ల నగదు, ఒక మారుతీ కారు, 5,035 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని, అలాంటి ఎస్ఎంఎస్లుంటే 9491089257కు పంపించాలని కోరారు. పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు. -
ఓరుగల్లు తీర్పు నేడే
సాక్షి, హైదరాబాద్, హన్మకొండ అర్బన్: ‘ఓరుగల్లు’ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్.. ఏ పార్టీ భవిష్యత్ ఏమిటో తేల్చేయనుంది. పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రతి పోలింగ్ బూత్‌లో ఉదయం తొలి ఓటు వేసే వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,57,231 పురుషులు, 7,52,293 స్త్రీలు, 147 మంది ఇతరులు ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, వామపక్ష కూటమిపాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. 8,900 మంది పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు వెబ్ కాస్టింగ్ కోసం 800 మంది బీటెక్ విద్యార్థులను ప్రత్యేకంగా నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 819 అత్యంత సమస్యాత్మక, 393 సమస్యాత్మక, 566 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మొత్తంగా 7,606 మంది పోలీసులను రంగంలోకి దింపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కోసం 20 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. నామినేషన్ల నాటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా బృందాలు కోడ్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారుు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ. 1.88 కోట్ల నగదును సీజ్ చేశారు. ఎన్నికల టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 25 ఫిర్యాదులు అందాయి. పోటీలో జిల్లాలో గత పది రోజుల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. సర్వత్రా ఉత్కంఠ! తమ 17 నెలల పనితీరుకు వరంగల్ ఫలితం అద్దం పడుతుందని అధికార పక్షం భరోసాతో ఉంది. తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. దాదాపు రాష్ట్ర మంత్రులంతా పది రోజుల పాటు వరంగల్‌లోనే మకాం వేశారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. రెండు లక్షలపైన మెజారిటీతో విజయం సాధించాలన్న లక్ష్యంతో గులాబీ నాయకత్వం పనిచేసింది. ఇక ఎలాగైనా గెలిచి సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ... ఉప ఎన్నికల్లో గెలుపు అంచునకు వచ్చామన్న ధీమాతో ఉంది. ప్రచారం ముగిసిన వెంటనే... పోలింగ్ నాడు పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంది. హైదరాబాద్ నుంచి సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు గాంధీభవన్‌లో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వరంగల్‌లో గెలిస్తే తమ అభ్యర్థి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం చేయడం ద్వారా బీజేపీ విద్యావంతుల్లో పట్టు సంపాదించే ప్రయత్నం చేసింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన పేదలు, దిగువ మధ్య తరగతి, మైనారిటీల సానుభూతి తమకు ఉపకరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. వైఎస్సార్సీపీ తరఫున ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాలుగు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జగన్ సభలకు పెద్ద ఎత్తున జనాదరణ రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. -
రైతు ఆత్మహత్యలకు కారణమెవరు..
జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు {పభుత్వం పంట రుణాలు మాఫీ చేయలేదు దళితులకు భూ పంపిణీలో కేసీఆర్ విఫలం నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి ఉప ఎన్నికలో బీజేపీకి గుణపాఠం చెప్పాలి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌లో బహిరంగ సభ ముగిసిన జగన్ నాలుగు రోజుల ప్రచారం వరంగల్ : ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆసరా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందరికీ అన్నం పెట్టే రైతుల బలవన్మరణానికి కారణం ఎవరనేది అందరూ ఆలోచించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలోనే 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సెంటర్లో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేయలేదని, లక్ష రూపాయల పంట రుణాలను ఒకేసారి కాకుండా నాలుగు దశలుగా మాఫీ చేయడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో అవి రీ షెడ్యూల్ కాలేదని, దీనివల్ల రైతులు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే మాఫీ మొత్తం వడ్డీకే సరిపోతోందన్నారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని, ఈ పరిస్థితుల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. నిత్యావసరాల ధరలు అందకుండా పోతున్నాయని, కంది పప్పు కిలో ధర రూ.230 ఉందని, టమాటాలు కొనలేని పరిస్థితి ఉందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, అత్యవసర వైద్య సేవల కోసం 108 సేవలను అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 108 సేవల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయలేదని చెప్పారు. జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా... ఎంపీగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికను తీసుకువచ్చారని జగన్మోహన్రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రజల కోసం వస్తే బాగుండేదని, కేసీఆర్ మోజుపడిన వ్యక్తికి పదవి ఇచ్చేందుకు ఈ ఎన్నిక వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ 18 నెలల పాలనలో కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లకు అవసరం ఉంటే దండలు వేస్తారని, అవసరం తీరాక బండలు వేస్తారని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్సార్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, అబద్ధాలు, వెన్నుపోటుతో పాలన సాగిస్తున్న టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పేదల కోసం తపించిన వైఎస్సార్ ఇప్పటికీ అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే వైఎస్సార్సీపీకే ఓటు అడిగే హక్కు ఉందని జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డ్డి, పి.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శులు ఎం.విలియమ్, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నాయకులు శేఖర్‌రెడ్డి, పి.ప్రపుల్లారెడ్డి, సుమిత్‌గుప్తా, మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌కుమార్, ఇ.సునీల్‌కుమార్, జిల్లా నాయకులు ఎం.కళ్యాణ్‌రాజ్, జి.రాజేశ్‌రెడ్డి, చల్లా అమరేందర్‌రెడ్డి, నెమలిపురి రఘు, సంగాల ఇర్మియా, నాగపురి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులు.. విశేష స్పందన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా చేపట్టిన ప్రచారానికి నియోజకవర్గ పరిధిలో మంచి స్పం దన వచ్చింది. జగన్మోహన్రెడ్డి ఈ నెల 16న ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభించి గురువారం ముగిం చారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి జగన్మోహన్రెడ్డి ప్రచారం మొదలైంది. అక్కడి నుంచి జఫర్‌గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా తొర్రూ రులో తొలి రోజు ప్రచారం జరిగింది. తొర్రూరులో జరిగిన ఎన్నిక ప్రచార సభ విజయవంతమైంది. మరుసటి రోజు ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లిలో పర్యటించిన జగన్.. పరకాలలో జరిగిన ప్రచారసభలో పాల్గొనగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇక మూడో రోజు వరంగల్, గీసుగొండ, హన్మకొండలో ప్రచారం చేశారు. గీసుగొండలో జరిగిన ప్రచారానికి భారీగా జనం వచ్చా రు. అదే రోజు సాయంత్రం హన్మకొండలో జరిగిన బహిరసంగసభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చివరిరోజు గురువారం హన్మకొండ, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, రఘునాథపల్లిలో జగన్మోహన్రెడ్డి ప్రచారం సాగింది. స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ప్రచారసభ విజ యవంతమైంది. ప్రచారంలో భాగంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి.. హామీల అమలులో ప్రభుత్వ తీరు ను ఎత్తిచూపగా ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఈ మేర కు హన్మకొండలో నిర్వహించిన సభతో వైఎస్సాఆర్ సీపీకి జిల్లాలో ఉన్న బలం చాటినట్లయింది. -
ఓటమి భయంతోనే కేసీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అవాస్తవాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ నిగ్రహం కోల్పోతే సీఎం కేసీఆర్‌కే నష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి హెచ్చరించా రు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో వణికిపోతూనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అబద్ధాలతో, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి సీఎం స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ‘‘కేంద్ర మంత్రి పదవిని పట్టుకుని నేను వేలాడినట్టుగా, తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కేసీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. నేను మంత్రి పదవిలో లేకుంటే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వచ్చేది కాదు. హైదరాబాద్ నుంచి రూ. 25 వేల కోట్ల రెవెన్యూ తెలంగాణకు అందేది కాదు. ఫిబ్రవరి 18న బిల్లును ఎలా ప్రవేశపెట్టాలో, బిల్లును ఎలా నెగ్గించుకోవాలో స్పీకర్‌తో కలసి నేను చేసిన వ్యూహం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. సీమాంధ్ర మంత్రులు, అప్పటి సీఎం, సీమాంధ్ర నేతలు ఆ బిల్లు నెగ్గకుండా ఎన్నో కుట్రలు చేసినా.. నేను కేంద్రమంత్రిగా ఉంటూ వాటిని తిప్పికొట్టడం వల్లే బిల్లు ఆమోదం పొందింది. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు’’ అని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కుటుంబంతో సహా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కలసిన తర్వాత నన్ను కూడా కలిశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో చేరాలని తాను కేసీఆర్‌ను కోరానని, కేసీఆర్ కూడా అందుకు వ్యతిరేకత చూపలేదని చెప్పారు. 2009లో దీక్షకు దిగిన కేసీఆర్ రెండోరోజే ఎందుకు విరమించారని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీక్షను విరమిస్తూ పళ్ల రసం తాగడంతో కేసీఆర్‌పై మండిపడుతూ విద్యార్థులు, యువకులు ఉద్యమంలోకి దిగారని, దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తుచేశారు. దానికి భయపడే కేసీఆర్ దీక్షను కొనసాగించారన్నారు. కేసీఆర్ దీక్షలోని మర్మమేమిటో తమకు తెలిసినా... ఉద్యమాన్ని, తెలంగాణను పలుచన చేయకూడదనే దానిపై ఇప్పటిదాకా మాట్లాడలేదని జైపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ బండారం బయటపెట్టకపోవడం తమ అసమర్థతో, చేతకానితనమో కాదన్నారు. కేసీఆర్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంటుందని, కానీ కేసీఆర్ స్థాయికి తాము దిగజారబోమని వ్యాఖ్యానించారు. నిగ్రహం కోల్పోయి మాట్లాడితే కేసీఆర్‌కే నష్టమని హెచ్చరించారు. సీఎం పదవి తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా పనిచేయాలని అధిష్టానం నుంచి తనకు సూచనలు అందాయని జైపాల్‌రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణకు చెందిన తనకు సీఎంగా అవకాశమిచ్చి తెలంగాణ ఏర్పాటును ఆపుతారేమోననే ఆందోళనతో ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ రాకుంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు కూడా నష్టం కలుగుతుందనే ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను బయటపెట్టి తన స్థాయిని దిగజార్చుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను అప్పుడూ, ఇప్పుడూ జాతీయవాదినేనని... జాతీయవాదం వేరు, తెలంగాణ వాదం వేరని జైపాల్‌రెడ్డి చెప్పారు. -
ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది..
రాష్ర్ట మంత్రి హరీష్‌రావు వరంగల్‌లో భారీ బైక్ ర్యాలీ ఖిలా వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్కే ఉందని.. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు ఆ హక్కు లేదని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి జంక్షన్ నుంచి ఫోర్ట్‌రోడ్డు, శంభునిపేట జంక్షన్, ఉర్సుగుట్ట కరీమాబాద్ మీదుగా వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్ వరకు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నన్నపనేని నరేందర్‌ను కూర్చోబెట్టుకుని మంత్రి హరీష్‌రావు స్వయంగా వాహనం నడపగా.. మరో వాహనంపై ఎమ్మెల్యే కొండా సురేఖను కూర్చోబెట్టుకుని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వాహనం నడిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 16నెలల పాలనలోనే సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హమీల్లో 98శాతం అమలుచేయగా.. అంతకుముందు రాష్ట్రాన్ని పాలించిన ఏ పార్టీ నేతలు కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తొలి ఓటరుకు జై!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం సాయంత్రం అయిదు గంటలకల్లా ప్రచారపర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులందరూ ప్రచార గడువు ముగిశాక అక్కడ ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రచార గడువు ముగిసేలోపే వారంతా జిల్లా దాటి వెళ్లాలని ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, నియోజకవర్గంలో మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 626 కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, మరో 300 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా టెంట్లు, తాగునీరు, టాయ్లెట్లు ఉంటాయని, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. తొలి ఓటరుకు పుష్పగుచ్ఛం అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొట్టమొదటగా ఓటు వేసేందుకు వచ్చే ఓటరుకు ఎన్నికల కమిషన్ ఘనస్వాగతం పలకనుంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి గౌరవంగా పుష్పగుచ్ఛం అందిస్తారని సీఈవో చెప్పారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గతంలో ఆరు గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని గంట పాటు కుదించిన విషయాన్ని ఓటర్లు గుర్తించాలని కోరారు. 93.46 శాతం ఓటరు స్లిప్పులు వరంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,09,671 మంది ఓటర్లుంటే ఇప్పటివరకు 93.46 శాతం మంది ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. వివిధ కారణాలతో 22,319 మందికి ఓటరు స్లిప్పులు అందలేదన్నారు. ఓటింగ్ రోజున సైతం ఓటరు స్లిప్పులు పొందేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రత్యేక కేంద్రాలుంటాయని, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఈసీ గుర్తించిన పది కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకాలు, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపిస్తే ఓటుకు అనుమతిస్తారని చెప్పారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు చెబుతాం ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు, మద్యం, నగదు, కానుకల పంపిణీ జరిగితే వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ సూచించారు. 180042522747 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లేదా 8790499899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలని కోరారు. ‘ఎంసీసీ’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సమాచారం చేరవేస్తే సరిపోతుందని అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు రూ.1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసి ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్లు పంపితే క్రిమినల్ కేసులు ప్రచార గడువు ముగిశాక ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేయటం కూడా నిషిద్ధమేనని, దీన్ని ఉల్లంఘించి వాటిని పంపించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో హెచ్చరించారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే సంబంధిత సర్వీసు ప్రొవైడర్లపైనా కేసులు పెడతామన్నారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు విధిగా బంద్ పాటించాలన్నారు. మీడియా సంస్థలు ప్రచార ప్రకటనలు చేయవద్దన్నారు. -
'బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే'
-
బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే..: గుత్తా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు లాభం చేయడానికే బీజేపీ వ్యవహరిస్తున్నదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి ఓటువేస్తే మురిగిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. వరంగల్‌లో పోటీ చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు పాలన విషయాల్లో పొగుడుకుంటూనే ఎవరికివారు ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీజేపీ, వైఎస్ఆర్సీపీలు పరోక్షంగా టీఆర్ఎస్కు సహకరిస్తున్నాయని గుత్తా ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలు వరంగల్‌లో పోటీచేస్తున్నాయన్నారు. -
జగన్ నేటి ప్రచార షెడ్యూల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చేపట్టే వరంగల్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మార్పుల ప్రకారం బుధవారం జగన్ జితేందర్‌నగర్, లక్ష్మినగర్, మచిలిబజార్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్, గొర్రెకుంట క్రాస్, ధర్మారం, కోనాయిమాకుల, గీసుకొండ, చింతల్ ఫ్లైఓవర్, మిల్స్‌కాలనీ పీఎస్, శంభునిపేట, ఉర్సు దర్గా, కరీమాబాద్, శివనగర్, హెడ్‌పోస్టాఫీస్‌ల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. అక్కడి నుంచి వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ములుగురోడ్, హన్మకొండ చౌరస్తా మీదుగా సాయంత్రం హన్మకొండకు చేరుకుని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. గురువారం (19న) మాత్రం అంతకుముందు ప్రకటించిన ప్రచార షెడ్యూల్‌కు అనుగుణంగానే హన్మకొండ నుంచి బయలుదేరి న యీంనగర్, కేయూ క్రాస్‌రోడ్, ఖాజీపేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కుర్తి, పెద్దపెండ్యాల, చిన్నపెండ్యాల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్, కోమళ్ల, షాగల్, రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. -
కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట
వరంగల్ ఉప ఎన్నికపై మావోయిస్టు పార్టీ మండిపాటు సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య అహంకారానికి పరాకాష్ట అని సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మండిపడ్డారు. దీన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏడా దిన్నర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు, దళారి భూస్వామ్య వర్గాలకు కొమ్ము కాసిందే తప్ప పేదలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. ఈ మేరకు జగన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు ఎజెండానే తన ఎజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఫ్యూడల్ తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారన్నారు. ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచడానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలపై కనీ సం స్పందించకుండా నీరో చక్రవర్తి మాదిరిగా ఫామ్‌హౌస్‌లో తందనాలు ఆడుతున్నారన్నా రు. తెలంగాణలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, వనరులను తమ వారికి దోచిపెట్టేం దుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారన్నారు. అందుకే మావోయిస్టురహిత ప్రాం తంగా మలిచేందుకు ఆది లాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న ఆదివాసీ గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వేలా ది గ్రేహౌండ్స్ బలగాలను దించి హంతక వేట కొనసాగిస్తున్నారన్నా రు. ములుగు ఏజెన్సీలో 1,500 ఎకరాలను మైనింగ్ మాఫియాకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే శ్రుతి, విద్యాసాగర్‌లను ఎన్కౌంటర్ చేశారన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీఆర్ఎస్ పాలకులు ఏముఖం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీతి తప్పిన దొం గలుగా పేరుపడ్డ తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వంటి వారిని మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తండ్రి అధికారంతో కళ్లు నెత్తికెక్కిన మంత్రి కేటీఆర్‌కూ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మోదీ ప్రభుత్వం తమ హంతక ముఠాలైన ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ వంటి శక్తులతో దళితులు, మైనారిటీలపై దాడులకు తెగబడుతోందని, వారూ మూల్యం చెల్లించక తప్పదన్నారు. -
ఐదు నెలల్లో మరో 60 వేల ఉద్యోగాలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ సిద్దిపేట: నాలుగైదు నెలల్లో మరో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి విడతలో ఇదివరకే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, మొత్తంగా ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బం గారు తెలంగాణ నిర్మాణ ప్రక్రియలో భాగంగా యువతకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. రేపోమాపో 9 వేల కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికే షన్ జారీ కానుందన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, 9 వేల ఉద్యోగాల్లో 3,300 ఉద్యోగాలను మహిళలకు రిజర్వు చేయడం శుభసూచకమన్నారు. అనంతరం యువతీ యువకులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. పోలీస్ శాఖకు చెందిన వారు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను అందించడం దేశచరిత్రలోనే మొదటిదన్నారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం కొండపాకలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు వర్తించేలా ఆలోచిస్తున్నామ న్నారు. ఇంటర్ విద్యను సైతం సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ఉచిత విద్య అందిస్తామన్నారు. బీజేపీ ఓడితే మోదీ పదవి పోదు హసన్‌పర్తి: వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓడిపోరుునా ప్రధాని నరేంద్రమోదీ పదవి పోదని, కాం గ్రెస్ గెలిస్తే సోనియూ ప్రధాని కాదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన హసన్‌పర్తి, బీమారంలో జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. ఎంపీ సీటు గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి బడా నేతలను ప్రచారానికి దిగుమతి చేసిందని, వా రు ప్రచారం చేస్తే ఇక్కడి వారు ఓటేస్తారనుకోవడం భ్రమేనని ఎద్దేవా చేశారు. అమెరికాలో ఉంటున్న డాలర్ బాబుకు ఇక్కడి డీలర్ దయాకర్‌రావు టికెట్ ఇప్పించారన్నారు. కాంగ్రెస్ కూడా హైదరాబాద్ నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకుందన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్యే బాబుమోహన్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి జగన్ ఉప ఎన్నికల ప్రచారం
♦ వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలో 19వ తేదీ వరకు పర్యటన ♦ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న వైఎస్సార్సీపీ అధినేత సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (ఈ నెల 16వ తేదీ) నుంచి వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్‌షోలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఉదయం వేళల్లో ఆయా ప్రాంతాల మీదుగా రోడ్‌షోలను నిర్వహించి, సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగి స్తారు. 16న ఉదయం 8 గంట లకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు. జనగామ మీదుగా పాలకుర్తికి చేరుకుని.. దర్దేపల్లి, కొండాపురం, ఓగులాపూర్, జాఫర్‌గఢ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, డీసీ తండా, రాయపర్తి, మైలారం, వెలికట్ట, నాంజారిమడుగులలో రోడ్‌షోలను నిర్వహిస్తారు. తర్వాత తొర్రూరు బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాయపర్తి, వర్ధన్నపేట, ఇల్లందు, పంతిని, మామునూరు మీదుగా రోడ్‌షోలను నిర్వహించి హన్మకొండకు చేరుకుంటారు. మంగళవారం (17వ తేదీన) హన్మకొండ నుంచి బయలుదేరి ములుగు రోడ్, గూడె ప్పాడ్, ఆత్మకూరు, తిరుమలగిరి, శాయంపేట, మైలా రం, జోగంపల్లి క్రాస్, కొప్పుల, చిన్నకొడెపాక, రేగొండ, ఘనపురం క్రాస్, చెల్పూరు, భూపాలపల్లి, రేగొండ, చెన్నాపూర్ల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. తర్వాత పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. తిరిగి హన్మకొండకు చేరుకుని బస చేస్తారు. బుధవారం (18వ తేదీన) రంగశాయిపేట, గుంటూరుపల్లి, కాపులకనపర్తి, గవిచర్ల, తీగరాజుపల్లి, తిమ్మాపురం, సంగెం, చింతలపల్లి, ఊకల్‌హవేలి, కోనాయిమాకుల, గీసుకొండ, ధర్మారం, గొర్రెకుంటల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. అనంతరం హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ప్రచారం చివరిరోజు గురువారం (19న) నయీంనగర్, కేఈ క్రాస్‌రోడ్, ఖాజీ పేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కుర్తి, పెద్దపెం డ్యాల, చిన్నపెండ్యాల మీదుగా రోడ్‌షోలు నిర్వహిం చి, స్టేషన్‌ఘన్‌పూర్ బహిరంగసభలో మాట్లాడుతారు. అక్కడి నుంచి కోమళ్ల, షాగల్, రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. -
సోనియా, రాహుల్ ప్రచారం లేనట్టే
వరంగల్‌లో ఖర్గే, మీరాకుమార్, పైలట్లతో ప్రచారం... సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రావడం లేదు. లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్, ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు వరంగల్ ప్రచారానికి రానున్నారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాహుల్ రాష్ర్ట పర్యటనను ఖరారు చేసేందుకు టీపీసీసీ యత్నించింది. ఆగస్టులో రాహుల్ పర్యటనకు తేదీలు ఖరారు చేశాక రెండుసార్లు వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయన పర్యటన ఉంటే పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని టీపీసీసీ భావించింది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సోనియాను ప్రచారానికి ఆహ్వానించాలని ముందుగా అనుకున్నారు. అయితే, టీపీసీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక ఉప ఎన్నికకు ఎక్కువ ప్రచారం కల్పించడం వల్ల పార్టీకి భవిష్యత్తులో నష్టం కలుగుతుందని పలువురు సీనియర్లు హెచ్చరించారు. ఉప ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయని, ప్రచారం కోసం పార్టీ అధినేత్రిని పిలవడం మంచిది కాదని వారు సూచించారు. సోనియా, రాహుల్ ప్రచారం తరువాత కూడా పార్టీ అభ్యర్థి ఓడిపోతే నేతలు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే హెచ్చరికల నేపథ్యంలోనే వారిని ఆహ్వానించాలనే యోచనను విరమించుకున్నట్టు తెలిసింది. వరంగల్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి దానికి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ను ఆహ్వానించాలని టీపీసీసీ నిర్ణయించింది. మల్లికార్జున ఖర్గే, యువతలో కొంత ఇమేజీ ఉన్న సచిన్ పైలట్ వంటివారితోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. వీరితో పాటు తెలంగాణ బిల్లు ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించిన జాతీయ నేతలను, సినీ తారల కోసం కూడా టీపీసీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక
టీపీసీసీ వర్కింగ్ {పెసిడెంట్ భట్టి నిజామాబాద్‌లో కాంగ్రెస్ పాదయాత్ర నిజామాబాద్: సీఎం కేసీఆర్ అవినీతికి నిదర్శనమే వరంగల్ ఉప ఎన్నిక అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ రాజయ్యను భర్తరఫ్ చేసి.. శ్రీహరికి ఆ స్థానం కట్టబెట్టడం వల్లే ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ వద్దంటూ నిజామాబాద్ మండలం మోపాల్ నుంచి మంచిప్ప వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంచిప్పలో బహిరంగసభలో భట్టి మాట్లాడారు. ‘‘అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజ య్యను బర్తరఫ్ చేశావు.. మరి నీవు అవినీతికి పాల్పడుతున్నావు నిన్ను ఎవరు బర్తరఫ్ చేయాలి’’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికే పాదయాత్రలు చేస్తున్నామన్నారు. పెద్దమొత్తంలో కమీషన్ల కోసం మొదలెట్టిన రూ.36 వేల కోట్ల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చంపేయాలని చూస్తున్నారని విక్రమార్క ఆరోపిం చారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై విడుదల చేసిన జీవో నంబర్ 28 ప్రకారం వేసిన కమిటీ నివేదికను బట్టబయలు చేయాలని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి డిమాం డ్ చేశారు. సమావేశంలో శాసనమండలి కాం గ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీమం త్రి పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్‌బిన్ హందాన్, యాష్కీ మధుగౌడ్ పాల్గొన్నారు. -
భారీ మెజారిటీతో గెలుస్తాం
టీఆర్ఎస్ ఎంపీ వినోద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు ప్రజలు అధికారం అప్పగించారని, పదేళ్ల కాంగ్రెస్ దు ర్మార్గ పాలన ఇక చాలంటూ ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. కాం గ్రెస్ ఎప్పు డూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే బతుకుతుందన్నారు. ఈసారి వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారని, పాజిటివ్ ఓటుతో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ గెలుస్తారన్నారు. సోమవారం ఆయ న టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఒక సామాన్య కార్యకర్తను పోటీకి పెట్టి పార్లమెంటుకు పంపాలన్న కేసీఆర్ నిర్ణయంపై యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ నేతలు చేవెళ్ల, మెదక్ ప్రాంతాల్లో సొరంగాలు, కాల్వలు తవ్వి రూ.8వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. ఇదే వేరే దేశాల్లో అయితే, అప్పటి ఇరిగేషన్ మంత్రులను ఉరి తీసేవారన్నారు. -
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి
♦ పేద దళితుడికి టిక్కెట్, నిధులు ఇచ్చారు ♦ ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌కు టిక్కెట్, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అంకానికి తెర తీశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేద దళితుడికి టిక్కెట్, ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చిన కేసీఆర్‌కు వరంగల్ ప్రజల తరపున, టీఆర్ఎస్ జిల్లా శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల్లోని పేద అభ్యర్థులు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఒకరికి అవకాశం ఇవ్వగా.. బీజేపీకి అభ్యర్థే దొరకడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, ఎ.సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ పాల్గొన్నారు -
వైఎస్సార్సీపీ సత్తా చాటాలి
ఇంటింటికీ వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హన్మకొండలో పార్టీ జిల్లా విస్తృతస్థారుు సమావేశం పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తచాటాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. హన్మకొండలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్హాల్లో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయం గా పనిచేయూలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారం కోసం మెదక్‌లో ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యూరని, ఇప్పుడు.. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి మరొక దళితునికి పదవి ఇవ్వడానికి వరంగల్ ఉప ఎన్నిక తీసుకువచ్చారని విమర్శించారు. ఇది.. కేసీఆర్ రాజకీయ వికృత చేష్టలకు నిదర్శమని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని, కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో హామీల వర్షం కురిసిస్తూ తెలంగాణ ప్రజలను మో సం చేస్తున్నాడని, ప్రజలు ఇది గమనించాలని పొంగులేటి కోరారు. వైఎస్సార్ పాలన లో అమలైన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల కు వివరించి ఎన్నికలకు ఆయుధాలుగా వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచిం చారు. 4న పార్టీ అభ్యర్థి నామినేషన్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినే వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అభ్యర్థిని గెలిపించుకొని వరంగల్‌లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలందరికీ న్యాయం చేశారని, ఆయన పాలన ఒక చరిత్ర అని అన్నారు. వైఎస్ఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో జీవితాల్లో వెలుగులు నింపుకున్న ప్రజలు వైఎస్ కుటుంబంపై నమ్మకంగా ఉన్నారని, ఇటీవల తెలంగాణ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామార్శ యాత్రలో ప్రజలు సొంత ఇంటి బిడ్డగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. వరంగల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొర, నవాబు పాలన చేస్తూ ప్రజలను అనేక విధాలుగా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త దళితుడిని సీఎం చేస్తానని చెప్పి దళిత డిప్యూటీ సీఎంను తొలగించాడని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు భయం పుట్టుకొస్తున్నదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత అందరికీ ఉన్నదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకుమార్, నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రైతు అధ్యక్షుడు కిష్టారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్య రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, పూజారి సాంబయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రె డ్డి, ముస్తఫా, మతిన్, జిల్లా నాయకులు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, మునిగాల కళ్యాణ్‌రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, అప్పం కిషన్, దుప్పటి ప్రకాష్, సంగాల ఈర్మియా, గౌని సాంబయ్యగౌడ్, రాబర్ట్ విల్సన్, కౌటిల్‌రెడ్డి, దోపతి సుదర్శన్ రెడ్డి, చల్లా అమరేందర్ రెడ్డి, జి.సమ్మయ్య, పి.గాంధీ, బొడ్డు శ్రావన్, అచ్చిరెడ్డి, రజనీకాంత్, రాజేష్ రెడ్డి, ఎన్.దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, సుమిత్ గుప్తా, పవిత్రన్, ప్రతీక్‌రెడ్డి, ముజఫరుద్దీన్ ఖాన్, పి.సంపత్, సంగాల ఈర్మియా తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తి కోసం ఫైటింగ్
పీసీసీ నేతల ముందే బాహాబాహీ జంగా, దుగ్యాల వర్గీయుల కొట్లాట వర ంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలన్న విషయంపై పీసీసీలో సం దిగ్ధత నెలకొంది. ఈ విషయం సోమవారం పీసీసీ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తు న్నా జెడ్పీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మొదలైన విబేధాల కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి అక్కడి నేతలు, కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఏడాదిన్నరగా పాలకుర్తిలో పార్టీ రెండుగా చీలింది. హన్మకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో దుగ్యాల వర్గీయులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయాన్ని సదరు నేతలు దుగ్యాలకు చేరవేయడంతో ఆయన డీసీసీ భవన్‌కు వచ్చారు. దుగ్యాల వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన వర్గీయులు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జం గా రాఘవరెడ్డి వర్గీయులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలను పీసీసీ నేతలు ఇరువురిని వేర్వేరు చాంబర్లలోకి రావాలని కోరారు. వీరితో మాట్లాడుతున్న సమయంలోనే అదే చాంబర్ల ముందు మాటమాట పెరగడంతో అగ్రనేతల సాక్షిగా ఇరువర్గాల కు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పర దూషణలతో పాటు భౌతి క దాడులకు దిగారు. అరుుతే, నేతల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా యూత్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వెళ్లిపోయూరు. ఈవిషయమై ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీసీబీ చైర్మన్ జంగా రా ఘవరెడ్డి అనుచరులు బిల్లా సుధీర్‌రెడ్డి, బేరిపెల్లి విజయకుమార్, జల్లం కుమార్, కోతి ఉప్పలయ్య, కాసరపు ధ ర్మారెడ్డి తదితరులు తనపై దాడి చేశారని కడవెండికి చెందిన కౌడగాని సోమయ్య సో మవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే, జంగా రాఘవరెడ్డి వర్గీయులు కూడా తమపై దుగ్యాల ప్రోద్బలంతో ఆయన అనుచరులు దాడి చేశారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇన్చార్జితోనే భవిష్యత్తు వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని భావించి నందునే ఇద్దరు నేతలు పట్టుపడుతున్నట్లు తెలిసింది. దుగ్యాల శ్రీనివాసరావు పార్టీకి పూర్తిగా దూరం ఉండడంతో పార్టీ శ్రేణులన్నీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి దగ్గరయ్యాయి. పార్టీ కార్యక్ర మాలను విజయవంతం చేస్తుండడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ విషయం దుగ్యాల వర్గీయులకు రుచించకపోవడం తో గలాటా సృష్టించినట్లు వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. కాగా, పాలకుర్తి ఇన్చార్జ్ వ్యవహారంపై మంగళవారం జిల్లా పార్టీ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. -
వరంగల్ బరిలో మాజీ మంత్రి చంద్రశేఖర్?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్ పేరును బీజేపీ పరిశీలిస్తోంది. ఇప్పటిదాకా బీజేపీ అభ్యర్థిత్వం కోసం 14 మంది దరఖాస్తు చేసుకోగా జాబితాను ఐదుగురికి కుదించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, అభ్యర్థి ఎంపిక కమిటీ సభ్యులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమావేశమై ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు), బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, జైపాల్, తటస్తులు డాక్టర్ రాజమౌళి, డాక్టర్ దయాకర్ అభ్యర్థిత్వాలపై చర్చించారు. -
ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు
రైతులు, దళితులపై చిన్నచూపు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే వరంగల్ ఉప ఎన్నికే మనకు ఆయుధం పరకాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టి.జీవన్‌రెడ్డి పరకాల : ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మాటతప్పిన కేసీఆర్‌కు వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జీ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా నియమించిన రాజయ్యను అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కేసీఆర్ పదవి నుంచి తొలగించారని, ఆరు నెలలు గడుస్తున్నా రాజయ్య చేసిన అవినీతిని బయటపెట్టలేదన్నారు. దళితులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటతప్పారని, కేసీఆర్ ఇచ్చే మాఫీ.. వడ్డీలకు సరిపోదన్నారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్.. రైతులకు లాభం చేసే పనులు చేపట్టడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ పథకం పేరు చెప్పడానికి కేసీఆర్‌కు ఇష్టం లేకపోతే కవితమ్మ లేదా బతుకమ్మ పేరు పెట్టి పెండింగ్ బిల్లును అందించాలని జీవన్‌రెడ్డి సూచించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు విస్మరించారని, కేజీ నుంచి పీజీ ఊసేలేకుండా పోయిందన్నారు. విద్యార్థుల త్యాగాల ఫలితంగా చలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సపాయి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే గ్రామజ్యోతి పథకం విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. 1.10లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో చెప్పి.. ఇప్పుడు 15వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుమని చెప్పడం ఏమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నెలకు పది వేల మంది ఉద్యోగాల నుంచి విరమణ పొందుతున్నా భర్తీ మాత్రం కావడం లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పర్మినెంట్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. వరంగల్ ఉప ఎన్నికను కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి ఆయుధంగా వాడుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సాంబారి సమ్మారావు, కట్కూరి దేవేందర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి, మడికొండ సంపత్‌కుమార్, పసుల రమేష్, పంచగిరి జయమ్మ, నాగయ్య, క్రిష్టయ్య, చింతల కుమారస్వామి, ఆముదాలపల్లి మల్లేశ్‌గౌడ్, ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యుడు లేతాకుల సంజీవరెడ్డి, ఎంపీపీ గోపు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో ఎన్నికల గుబులు!
రానున్న ఐదారు నెలల్లో వరంగల్ ఉప ఎన్నిక, మండలి, ‘గ్రేటర్’ పోరు ఇటీవలి ఓటముల నేపథ్యంలో గులాబీ శిబిరంలో ఆందోళన అధికార పార్టీ ఏడాది పాలనకు రెఫరెండమే? ఉనికి చాటుకునేందుకు విపక్ష పార్టీలూ సిద్ధం హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమ కాలంలో ఎన్నికల వ్యూహాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకున్న టీఆర్ఎస్కు ప్రస్తుతం ఆ ఎన్నికలే వణుకు పుట్టిస్తున్నాయి! ఉద్యమం వెనకబడుతోందని భావించినప్పుడల్లా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల పేరిట తిరిగి వేడి రాజేయడాన్ని ఆనవాయితీగా పాటిస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోపాటు టీఆర్ఎస్ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో ఐదు నెలల్లో జరగనున్న ఎన్నికలు అధికార పార్టీకి కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ముఖ్యంగా మండలి పట్టభద్రుల ఎన్నికలతోపాటు ఆయా జిల్లాల్లో జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు చేదు ఫలితాలు రావడం, పార్టీలోని ఆయా వర్గాల్లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటం వంటి పరిణామాలు గులాబీ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ‘మండలి’ సమరం... శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నా దక్షిణ తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెరిగినట్లు టీఆర్ఎస్ భావిస్తోంది. కానీ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం మొదలైంది. ఖమ్మం వంటి జిల్లాల్లో ఈ పోటీ మరింత ఎక్కువ కానుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా ఉంది. దీంతో ‘స్థానిక’ మండలిలో అధికార టీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమంటున్నారు. వరంగల్‌లో హోరాహోరీ! డిప్యూటీ సీఎంగా మంత్రివర్గంలో చేరడం వల్ల కడియం శ్రీహరి ఇటీవల వరంగల్ (ఎస్సీ స్థానం) ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు దృష్టిసారించాయి. కాంగ్రెస్ ఏకంగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఈ ఎన్నిక ను ఆషామాషీగా తీసుకోద్దని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నిక రూపంలో సీఎం కే సీఆర్‌కు, టీఆర్ఎస్కు కఠిన పరీక్ష ఎదురుకానుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.